Friday, November 30, 2018

ఏం వదిలేయాలి?

మనసును ప్రశాంత స్థితిలో ఉంచడానికి మార్గం ఒకటే ఉంది. కోరికల వల నుంచి దాన్ని బయటకు పడవెయ్యాలి. ప్రపంచ మహాసాగరంలో ఊగిసలాడే పడవ వంటిది మానవ శరీరం. కర్మానుభవాలనే గాలులే ఆ నావను నడుపుతుంటాయి.

దేహమనే పడవకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి. ఆ పడవ నడిపే సరంగు నిమిత్తమాత్రుడు. ఈ చిల్లుల పడవను సాక్షిగా నడిపిస్తుంటాడు. ఈ తొమ్మిది రంధ్రాలను చూసుకొంటూ జీవన ప్రయాణం సాగించకపోతే, పడవలోకి నీళ్లు వచ్చేసి, అది మునిగిపోతుంది. అనుభవశాలి అయిన సరంగు పడవను ఆవలి గట్టుకు భద్రంగా చేరుస్తాడు. ఇంద్రియ నిగ్రహంతోటే ఇది సాధ్యం.

పరస్త్రీలను కోరడం మహాపాపం. తెలిసి కూడా కోరికలను వదలకపోతే మనసు పాపపంకిలమైపోతుంది. ఇతరుల్ని తిట్టడం, లేక వారి తిట్లను వినడం రెండూ నిరర్థకమే! నిందించడానికి అలవాటుపడిన నాలుక సాధించుకొనేదేదీ ఉండదు... పోగొట్టుకోవడం తప్ప.

వస్తువుల మీద ఉన్న అభిమానం, దురదృష్టానికి దారి తీస్తుంది. వస్తువును పొంది, తరవాత పోగొట్టుకొంటే అది మహాబాధ కలిగిస్తుంది. వివేకవంతమైన మనసు, తనకేది కావాలో తేల్చుకోగలదు. అశాశ్వతమైన వస్తువులకు అది ఎప్పుడూ దూరంగా ఉంటుంది.

పామునోట సగం శరీరంతో ఇరుక్కొన్న కప్ప, తనను మింగబోతున్న మృత్యువును గ్రహించలేదు. పైగా అది తన ముందున్న కీటకాలను తినాలని తాపత్రయ పడుతుంది. అదే చిత్రం. దీనిని దురాశ కాక మరేమిటని అంటారు?

ఇలాంటి మనసును అదుపులో ఉంచుకోవడం ఎలా? తన ప్రయాణాన్ని ప్రారంభించిన నది, మూలం వదిలి సముద్రం చేరేదాకా, పల్లంవైపుగా సాగుతుంది. వర్షకాలంలో అధికంగా నీరుచేరితే బావిలోని నీరు తీపితనాన్ని కోల్పోతుంది. ఆ బావి నీరే వేసవిలో తియ్యగా మారిపోతుంది.

‘అతిసర్వత్రవర్జయేత్‌’ అన్నారు. అధికం ఎప్పుడూ అనర్థమే! అధికమైన కోరికలతో తామసగుణం పెరిగిపోతుంది. అవి లేకపోతే తామసం నశించి సత్త్వగుణం పెరుగుతుంది. సత్త్వ రజస్తమో గుణాలు మూడూ ప్రకృతి సహజమైనవే!

పవిత్రత, వివేకం, విజ్ఞానం- ఇవన్నీ సత్త్వగుణాలు. ఆందోళన, ఆగ్రహం, అస్తిమతత్వం- ఇవన్నీ రజోగుణాలు. జడత్వం, అజ్ఞానం, భ్రాంతి- ఇవన్నీ తమోగుణాలు.

మనసుకు ఉన్న మొదటి లక్షణం- అన్నీ పొందాలనుకోవడం. పోగొట్టుకోవడానికి అది ఇష్టపడదు. పైగా అవమానకరంగా భావిస్తుంది. వస్తువును పొందే ప్రయత్నం అంతా నిజానికి ఒక యాతన వంటిది. సత్సంగం, సత్సాంగత్యం, సజ్జనమైత్రి... మనసుకు ఎంతో స్తిమితాన్ని ఇస్తాయి.

Thursday, November 29, 2018

సుదర్శన చక్రం విశిష్టత

చక్రం పూర్ణత్వానికి ప్రతీక. ఈ విశ్వమంతా చక్రమండలమయమే. ఏడేడు పద్నాలుగు లోకాలు అన్నీ చక్రాలే. వాయు, వహ్ని, గగన, జలమండలాలన్నీ చక్రాలే! ఒక్కమాటలో చెప్పాలంటే అండపిండ బ్రహ్మాండాలన్నీ చక్రాలే. ఆ చక్రాన్ని ధ్యానించి, అభిషేకార్చనలతో సేవిస్తే శాంతి సౌఖ్యాలు చేకూరతాయని పురాణోక్తి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవరోజు ఉదయం భూదేవీ సమేత  మలయప్పస్వామివారిని సుదర్శన చక్రత్తాళ్వార్‌తో వరాహస్వామివారి ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేయించి, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత శ్రీచక్రత్తాళ్వార్‌ను అంటే సుదర్శన చక్రాన్ని స్వామి పుష్కరిణిలో ముంచి, పవిత్రస్నానం చేయిస్తారు. అదే సమయంలో లక్షలమంది భక్తులు కూడా శ్రద్ధాభక్తులతో శిరఃస్నానం చేస్తారు
ఆ సమయంలో శ్రీవారి దివ్యమూర్తుల శక్తి, శ్రీవారి పంచాయుధాల్లో ప్రముఖమైన శ్రీసుదర్శనాయుధశక్తి పుష్కరిణి జలంలో సూక్ష్మరూపంతో మిళితమై ఉంటాయి. అందుకే ఈ చక్రస్నానం సృష్టిచక్రానికంతటికీ అత్యంత పవిత్రమైంది. దీనికే అవభృథస్నానమని కూడా పేరు. శ్రీవారి దివ్యాయుధాలలో చక్రాయుధ ప్రశస్తి ఎంత మహత్తరమో గుర్తిస్తే- చక్రస్నాన మహత్యం భక్తులకు అంతగా స్వానుభవానికి వస్తుంది.


శ్రీనివాసుని పంచాయుధాలలో మూర్తిమంతంగా, దేవతగా, ఆళ్వార్‌గా, యంత్రరూపంగా, యంత్రాధిష్ఠానదేవతగా, దుష్టశిక్షణలో ప్రముఖాయుధంగా కీర్తింపబడేది  సుదర్శనమొక్కటే! భక్తై సుఖేన దృశ్యత ఇతి... అంటే దీనిని భక్తులు సుఖంగా చూడగలరన్నమాట. శ్రీవారి చక్రాయుధాన్ని కష్టాలు, దుష్టశక్తులు, శత్రువుల బారి నుండి రక్షించే మహాశక్త్యాయుధంగా విశ్వసించి, పూజించడం ఒక ప్రత్యేకత. దేవశిల్పి అయిన విశ్వకర్మ... సూర్యుణ్ణి సానబట్టేటప్పుడు రాలిన తేజస్సును పోగు చేసి, చక్రాకారమైన ఆయుధంగా రూపొందించి, మహావిష్ణువుకు ఆయుధంగా ఇచ్చాడు. ఇది శ్రీహరి సంకల్పించినంతనే వచ్చి, కుడిచేతిని చేరుతుంది. ప్రయోగించగానే ఎంత బలవంతుణ్ణయినా తరిమి, సంహరించి, తిరిగి స్వస్థానానికి వస్తుంది. ఈ చక్రాయుధం వల్ల మృతినొందినవారు విష్ణుదేవుని దివ్యతేజంలో లీనమవుతారు.

 గజేంద్ర సంరక్షణకై శ్రీహరి తన చక్రాయుధాన్నే పంపాడు. భాగవతంలోని అంబరీషుని వృత్తాంతంలో... దుర్వాసునికి బుద్ధి చెప్పి, అంబరీషుని రక్షించేందుకై శ్రీహరి పంపిన చక్రం ఎంత మహత్తర ప్రభావంతో, విజ్ఞతతో ప్రవర్తించిందో గమనిస్తే, అది సాక్షాత్తూ నారాయణ రూపమే అని గోచరిస్తుంది. శివబ్రహ్మాదులైన ఏ దేవతలూ ఆ చక్రాన్ని నివారించలేకపోయారు. అప్పుడు అంబరీషుడు ఆ మునిని రక్షించేందుకు చేసిన చక్రాయుధ స్తోత్రం సుదర్శన సహస్రనామ స్తోత్రంలోని అన్ని నామాల సారాంశాన్నీ పుణికిపుచ్చుకుంది.

దుష్టులకు సుదర్శన చక్రం ఆయుధంలా కనిపిస్తే, భక్తులందరికీ అది స్వామివారి ఆభరణంలా దర్శనమిస్తుంది. సృష్టిక్రమం దోషదూషితం కాకుండా ఈ చక్రం కాపాడుతుందనేది యోగుల విశ్వాసం. శ్రీవారి చక్రం అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి, జ్ఞానకాంతులను ప్రసరింపజేస్తుంది. అందుకే దీన్ని సుదర్శనం అంటారు. ధ్వజారోహణం నాడు గరుత్మంతునితోబాటు చక్రత్తాళ్వార్‌నీ ఆహ్వానిస్తారు. అప్పుడు చక్రగద్యంతో స్వాగతం పలుకుతారు. అనంతరం... ‘అఖిల జగదభివృద్ధిరస్తు’ అని మంగళవాచకం చెప్పి, తాళ లయాత్మకంగా ఆహ్వానించి, సుదర్శన దేవతకు ప్రీతికరంగా...‘చక్రస్య షట్పితా పుత్రతాళం స్వస్తిక నృత్తకమ్ శంకరాభరణ రాగం చక్రవాద్య సమన్వితమ్’ అని పఠిస్తారు.
సుదర్శన చక్రం

ఈశ్వరుడంటే పరమ దయాళుడు !

ఈశ్వరుడంటే పరమ దయాళుడు, కాలికి అందేగా చుటుకున్న పతంజలి నుండి శిరస్సు పై ఉన్న  తదియనాటి చంద్రరేఖ వరకు అన్ని ఆవిన ఏవరినో ఒకరిని ఉద్ధరించటానికి స్వీకరించినవే తప్ప ఆవినంతట ఆవిన దిగంబరుడు, అన్ని ఆవిన్ని పొందాలి తప్ప ఆవిన ఎవరిని పొందాల్సి పనిలేదు, అందుకే ఒక మహా భక్తుడు అంటాడు శంకర మీకు నేను పంచ కట్టాలి అంటే నన్ను శ్రీమహావిష్ణువు నన్న చెయ్యి లేదా సూర్యుడిగా అన్నా చెయ్యి అని (అంటే సూర్యుడి కిరణాలే సూర్యుడికి బహువులు, సహస్ర బహువులు అని అంటాం కదా), అందుకే వేదం లో కూడా అన్ని ఈశ్వర స్వరూపాలు అని చెప్పి ఒక్క శివుడి దెగ్గరకు వచ్చే సరికి సదా శివోం (శివ + ఓం) అని ఈవినే పరబ్రహ్మము అని నిర్ధారించి చెపుతుంది . సదా విష్ణు, సదా బ్రహ్మ అనదు, అంటే అన్నిటా శుభములు చెయ్యువాడు శివుడొక్కడే, ఇంత స్తోత్రం చేసిన వేదం కూడా త్రిపురాసుర సంహారంలో శంకరుడు ఒక రూపాన్ని తీసుకొని వస్తే గుర్రాలుగా ఆవిన్ని వహించలేక చతికిల బడ్డాయి, అప్పుడు నారాయణుడు ఎద్దుగా వచ్చి రదాన్ని పైకి ఎత్తాడు, అందుకే నారాయుణుడంతటి వారు కూడా ఒకసారి మోహినిగా, ఒకసారి నేత్రాలు అర్పించే పరమ భక్తుడిగా, ఇంకొన్ని సందర్భాల్లో మృదంగం వాయించే వాయిద్యకారుడిగా మరిపోతారు.
అంతటి శంకరులు మళ్లి ఎంత దాయాలువు అంటే కాసిన్ని నీళ్లు జల్లి, ఒక బిల్వం వేస్తే చాలు మురిసిపోతాడు, ఎందుకు? ఆవిన అన్ని ప్రాణులకు తండ్రి, మూల స్థానం, ఎన్ని తప్పులు చేసిన వాడైనా సరే వచ్చి తప్పేపోయింది తండ్రి క్షమించు అని త్రికరణ శుద్దిగా అడిగితే వాడిని చంద్రుడిలా తలమీద పెట్టుకుంటాడు, గజాసురుడిని అనుగ్రహించినట్టు గా వంటికి గజ చర్మం ఉత్తరీయం చుట్టుకుంటాడు, అందకాసురుడి గర్వాన్ని త్రిశూలంతో తీసినట్టు తీసి శివగణాల్లో చేర్చుకుంటాడు, కాదు కాదు శ్రీకాలహస్తిశ్వరం లో ఐతే ఏకంగా కొండమీద తిన్నడు, కొండ క్రింద శంకరుడు, శివుడి ప్రేమ ఇంత అంత అని చెప్పలేము అందుకే నాయనార్ల కథలు వింటే రాక్షసులు కూడా పరమ భక్తులైపోతారు.

తెలిసి కూడా తప్పు చేస్తే... 

ధర్మం కాదు అని తెలుస్తున్నప్పటికీ తాత్కాలిక సుఖం కోసం అధర్మాన్ని ఆచరిస్తున్నారు.
అధర్మం ఆచరిస్తున్న చాలామంది చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు గనుక మనం కూడా ఆచరించవచ్చు అనుకుంటారు. ఇది చాలా తప్పు.

అధర్మాచరణ కష్ట ఫలితం వెంటనే చూపించదు. కొంతకాలం తర్వాత వస్తుంది. అది ఎలాంటిది అంటే ఇవాళ ఆవుకి దాణా, కుడితి పెట్టి వెంటనే పాలు పిండుదాం అంటే రావు. ఆహారం జీర్ణమై క్షీరంగా మారిన తర్వాత పొందుతున్నాం. దానికి కొంత సమయం పడుతుంది.

అధర్మాచరణ ఫలితం వచ్చే లోపే వివేకం మేల్కొని, పశ్చాత్తాప పడి, దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తే ఆ అధర్మ ఫలం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.

 వ్యాధిః విత్తవినాశః దుర్భగత్వముద్వేగతా  తృష్ణాలౌల్యమనిర్వృతిః కుశయనం, కుస్త్రీ కుభోజ్యం వ్రజః ఇత్యేతాని పాపమహీరుహస్య ఫలాని’

 – పాపం అనే చెట్టుకు పళ్ళు వ్యాధి, ధనహాని, దురదృష్టము, ఉద్వేగం(అనవసర కోపాలు), మితిమీరిన ఆశ, చపలత్వము, సుఖం లేకపోవడం, సరియైన నిద్ర లేకపోవడం, సరియైన స్త్రీ దొరకకపోవడం(దొరికిన భార్య దుర్మార్గురాలై బాధించడం), సరియైన భోజనం దొరకకపోవడం. కనుక పాపం చెట్టు నాటుకుంటే ఈ పళ్ళు అనుభవించక తప్పదు.

ఫలితాలు అనుభవ దశకు వచ్చిన తర్వాత సవరించుకునే అవకాశం ఉండదు.
శరీరంలో బలము, ఆరోగ్యము ఉన్నప్పుడే సత్కర్మలు ఆచరించగలరు. దుష్కర్మలు చేయకుండా నిగ్రహించుకోగలరు.
పాప ఫలాల అనుభవం పేరే నరకం.

 ధార్మిక బుద్ధి, చిత్త నిర్మలత – ఈ రెండూ ఉన్నట్లయితే దుష్ఫలితాలు అని చెప్పబడుతున్న వాటి నుండి విడువబడి చక్కని జీవితాన్ని పొందగలడు.
కొందరికి మొదటి దశలోనే కనబడతాయి. వెంటనే గత జన్మలోని పాపాలు అని తెలుసుకొని వాటిని నివృత్తి చేసుకోగలం.

పెద్దలను, సత్కర్మలను ఆశ్రయించి, విశేషంగా మంత్రాదులు, భగవదారాధనలు చేస్తూ వీలైనంత మంచి పనులు చేస్తూ ఉన్న ధనాన్ని సత్కర్మలకి, దానాలకి, యోగ్యులైన వారి క్షేమానికి వినియోగించినట్లయితే పాపక్షయం నెమ్మది నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది.
ఈ విషయాలను ముందు నుంచీ గ్రహించినట్లయితే పాపాచరణకు వెనుకాడతాం, ధర్మాచరణకు వెనుదీయం.

సాలిగ్రామాలను చెక్కగల నేర్పరితనం ఈ జీవికి ఉంది!

ఈ కీటకాన్ని ఎవరు గుర్తించలేదు కదా ఫ్రెండ్స్? దీన్ని "వజ్రకీట" (Vajra Keeta) అంటారు.ఇది చూడడానికి ముళ్ళతో భయానకంగా ఉంటుంది కానీ నేపాల్  గండకీ  నదిలో నివసిస్తూ, దాని శరీరంలో ఊరే రసాయనాలతో మరియు ముళ్ళతో, పరమ పవిత్రమైన సాలిగ్రామాలను చెక్కుతుంది! విష్ణుమూర్తికి సంబంధించిన శంఖు, చక్ర, గద,ఇంకా అనేక స్వరూపాలతో సాలిగ్రామాలను  చెక్కగల నేర్పరితనం ఈ జీవికి ఉంది!  కొన్ని సాలిగ్రామాలకి పైన బంగరు వర్ణంలో ఉండే పూత కూడా ఈ వజ్ర కీట వల్ల ఏర్పడినదే


Wednesday, November 28, 2018

అష్టగణేశావతారాలు

1. వక్రతుండావతారం: 'మత్సరా'సురుని సంహరించినది ఈ అవతారం. సింహ వాహనంపై ఉండే గణపతి ఇతడు. జీవుల 'శరీరతత్వం'లోని దివ్యత్వం ఈ గణేశ రూపం. 'దేహబ్రహ్మధారకుడు' అని పురాణం పేర్కొంది.

2. ఏకదంతావతారం: 'మదా'సురిని పరిమార్చిన ఈ గణపతి మూషికవాహనుడు. మనలో 'జీవ' (దేహి) భావంగా వ్యక్తమయ్యే చైతన్యతత్వం ఈ మూర్తి.

 3. మహోదరావతారం: 'మోహాసురు'ని నశింపజేసిన ఈ వినాయకుడు మూషిక వాహనుడు. 'జ్ఞాన'చైతన్యానికి అధిపతి.

 4. గజాననావతారం: సాంఖ్య (పరబ్రహ్మ) తత్వానికి అధిష్ఠానదేవతగా కొలిచే ఈ స్వామి జ్ఞానప్రదాత. 'లోభా'సురుని సంహరించిన ఈ గణపతీ మూషికవాహనుడే.

5. లంబోదరావతారం: 'క్రోధాసురుని మర్దించిన అవతారం. 'శక్తి' బ్రహ్మగా ఈయనను పురాణం కీర్తించింది. 'దేవీతత్వ' స్వరూపం- గణపతి అని పురాణ భావం.

6. వికటావతారం: 'కామా'సురుని సంహరించిన స్వరూపమిది. మయూర వాహనంపై ఉన్న స్వామి ఇతడు. 'సూర్యబ్రహ్మ'గా పూజలందుకుంటున్నాడు.

 7. విఘ్నరాజావతారం: ఆదిశేషుని వాహనంగా స్వీకరించిన గణేశమూర్తి ఇది. 'మమతా'సురుని సంహరించిన ఈ స్వరూపాన్ని 'విష్ణుబ్రహ్మ'గా విష్ణుతత్వంగా చెబుతారు.

8. ధూమ్రవర్ణావతారం: 'అభిమానాసురు'ని సంహరించిన ఈ అవతారం 

Tuesday, November 27, 2018

పంచభూత లింగాలు ఏవి ? అవి ఎక్కడ ఉన్నాయి?

లింగరూపం గా ఉండే శంకరుడు పంచభూతాలకి ప్రతీకగా ఐదు చోట్ల లింగాకారములో ఉన్నాడు . పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

1. పృథ్విలింగం: ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం: ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం: ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడు లోని తిరుచునాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.

4. తేజోలింగం: తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రం పై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

5. వాయులింగం: ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం.

సర్వం శివార్పణమ్

అన్నం గురించి ఓ ఉపాఖ్యానం

అన్నం వండేవారు ఏ మనస్సుతో, ఏ భావంతో వండుతారో, దాని ప్రభావం ఆ అన్నం మీద , దాన్ని తినేవారి మీద కూడా ఉంటుంది. అందుకనే దేవుడికి నైవేద్యం వంట చేసేవారు కనీసం దాని రుచిని ఆఘ్రాణించను కూడా ఆఘ్రానించరు. అలా మనసా, వాచా, కర్మణా కూడా తయారైన నైవెద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల దాన్ని దేవుడు ఆరగించటంవల్లే నైవేద్యానికి అంత రుచి వస్తుంది.

వంట చేసేవారు కోపంగా, విసుగ్గా వంట చేస్తే, ఆ వంటకాలకు సరైన రుచి రాకపోగా, దాన్ని భుజించిన వారి మనస్సు కూడా కోపతాపాలకు నిలయమవుతుంది. అందుకే వంట చేసేటప్పుడు ఆ వంట చేసేవారు మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా వంటచేస్తే, దానికి రుచితోపాటు ఆ వంట తిన్నవారి మనస్సులు సంతోషంగా వుంటాయన్నది పూర్వూకుల విశ్వాసం.

లోకంలో మానవులు దాత, అదాత అని రెండు రకాలుగా వుంటారు. ఇతరులకు అన్నం దానం చేసి తాను తినేవాడు దాత. ఇతరులకు దానం చేయకుండా విషపూరితమైన అన్నాన్ని తినేవాడు అదాత. దాతకు కాలంతరాన అన్నం లభిస్తుంది. అదాతకు కాలాంతరాన అన్నం లభించకపోగా, అగ్ని నశింపచేస్తాడని తైత్తిరీయబ్రాహ్మణం వివరిస్తుంది.

ఇతరులకు అన్నం పెట్టకుండా తానే తింటే, ఆ అన్నం విషంతో సమానం. దాత, అదాత ఇద్దరూ అన్నసంపాదనకు ప్రయత్నిస్తారు. కాని దాత ఇతరులకు దానం చేయడం కోసం అన్నం సంపాదిస్తాడు. అది ఉత్కృష్టమైనది. అదాత తాను తినడంకోసమే సంపాదిస్తాడు. అతను పాపాత్ముడు అని శ్రుతి పేర్కొంటోంది.

అన్నం దేవతే కాకుండా మృత్యురూపమైంది కూడా. మనం తినే అన్నాని బట్టే మనకు రోగాలు, ముసలితనం లభిస్తాయి. అన్నమే సంతానోత్పత్తికి కారణమని కూడా చెపుతుంది ఆయుర్వేదం. కాబట్టి ఇంత మహిమగల అన్నం ఇతరులకు పెట్టకుండా తాను మాత్రమే తినేవాడు ఒక రకంగా విషాన్ని భుజిస్తున్నట్టే.

యజ్ఞయాగాది క్రతువుల్లొ అగ్నికి ఆహుతి చేసే అన్నం 'మేఘం' అవుతుంది. అన్నమే మేఘం. సూర్యుడు తన కిరణాలచే భూమిమీదున్న నీటిని స్వీకరించి ఔషధులను, అన్నాన్ని సృష్టిస్తున్నాడు. ఆ అన్నంతోనే ప్రాణులన్నీ జీవిస్తున్నాయి. శరీరం బలాన్ని సంపాదిస్తుంది. ఆ బలంతోనే తపస్సు చేయగలుగుతున్నారు.

పరిశుద్ధమైన , ఏకాగ్రమైన మనస్సుగలవారికి తపస్సు సత్ఫలితాలనిస్తుంది. ముందు మేధస్సు, తర్వాత శాంతి, జ్ఞానం, విజ్ఞానం, ఆనందం, పరమానందం లభిస్తాయి.

కాబట్టే ఇన్నింటినీ సమకూర్చే అన్నదానం వల్ల సర్వ వస్తువులనూ దానం చేసిన ఫలితం వస్తుంది.

Sunday, November 25, 2018

కార్తవీర్యార్జున స్తోత్రం

ఓం కార్తవీర్యార్జునో నమః రాజ బాహు సహస్రవాన్
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే   

ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయినా, భార్యా భర్తల మధ్య మనశ్శాంతి కరువయినా ఒకేఒక మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి. ఇంతకీ ఏమిటా మంత్రమని ఆలోచిస్తున్నారా? అదే కార్తవీర్యార్జున మంత్రం. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే  పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. అది డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళయినా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెపుతున్నారు మన పండితులు. ఆ మంత్రం ఈ విధంగా ఉంటుంది.

ఓం కార్తవీర్యార్జునో నమః రాజ బాహు సహస్రవాన్
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే

ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకుని రోజూ పూజ చేసేటప్పుడు స్మరిస్తే పోయినవాన్ని తిరిగి మనకు దక్కుతాయి. ఇంతకీ ఈ కార్తవీర్యార్జునుడు ఎవరూ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ. తను చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించ గలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడటంతో అది గ్రహించిన స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు. కాని భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు. చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి వెయ్యి చేతులు కలవాడిగా మారతాడు. అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు. అంతేకాదు తనకి కేవలం శ్రీ హరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు. ఇతను ఎంత బలశాలి అంటే అతి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకుని పోయి తరువాత పులస్త్య మహర్షి అభ్యర్ధన విని అతనిని వదిలేస్తాడు

ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మాహిష్మతిపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి. ఒకసారి కార్తవీర్యుడు వేట కోసమై అడవికి వెళ్తాడు. అక్కడ అలసిపోయి దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన కార్తవీర్యునికి స్వాగతం పలికి జమదగ్ని విశేషమైన విందు పెడతాడు. అంత రుచికరమైన ఆహారపదార్థాలు కామదేనువు సంతతి అయిన గోమాత ద్వారా లభించాయన్న నిజం తెలుసుకుని దానిని తనకి ఇచ్చేయ్యమని అడుగుతాడు, అందుకు జమదగ్ని నిరాకరించటంతో మహర్షి తలను ఖండించి ఆ గోమాతను తీసుకెళ్ళిపోతాడు. ఆశ్రమానికి తిరిగివచ్చిన జమదగ్ని కొడుకు పరాశరుడు విషయం తెలుసుకుని కార్తవీర్యునితో పాటు 21 మంది క్షత్రియులని చంపుతానని శపథం పూనుతాడు. అన్న మాట ప్రకారమే కార్తవీర్యుడిని సంహరిస్తాడు. పరసురాముడు విష్ణుమూర్తి అవతారం కావటంతో కార్తవీర్యుని కోరిక కూడా తీరి మళ్లీ శ్రీహరి చేతిలో సుదర్శునుడిగా మారి, గర్వం విడిచిపెట్టి తన జన్మ సార్ధకం చేసుకుంటాడు

అలా అతి బలపరాక్రముడు అయిన కార్తవీర్యుడు తనకు లేని చేతులని తపస్సు చేసి పొందటమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్లీ అతని కుడి చేతిలోనే సుదర్శన చక్రమై ఆ జన్మాంతం నిలిచి ఉంటాడు

బ్రాహ్మణులలో శాఖలు

బ్రాహ్మణులలో..ద్రావిడ బ్రాహ్మణ శాఖలు, వైదీక బ్రాహ్మణ శాఖలు, నియోగి బ్రాహ్మణ శాఖలు, వైష్ణవ బ్రాహ్మణ శాఖలు, శివార్చక బ్రాహ్మణ శాఖలు ఉన్నాయి..
వాటి గురుంచి విపులంగా తెలుసుకుందాం..

ద్రావిడ బ్రాహ్మణ శాఖలు..

1) ప్రధమ శాఖ ద్రావిడ
2) ద్రావిడ
3) పేరూరు ద్రావిడ
4) పెద్ద ద్రావిడ
5) దిమిలి ద్రావిడ
6) ఆరామ ద్రావిడ
7) పుదూరు ద్రావిడ
8) కోనసీమ ద్రావిడ
9) ద్రావిడ వైష్ణవులు
10) తుమ్మగంటి ద్రావిడ
11) తుమ్మ ద్రావిడ

వైదీక బ్రాహ్మణ శాఖలు..

1) వెలనాటి వైదీక
2) వెలనాట్లు
3) వెలనాటి పూజారులు
4) వెలనాటి అర్చకులు
5)కాసలనాటి వైదీక
6)కాసలనాట్లు
7)ములకినాట్లు
8) ములకినాటి వైదీక
9) తెలగాణ్యులు
10) వేగనాట్లు
11) వేగనాటి వైదీక
12) ప్రధమ శాఖ వైదీక
13) కరణకమ్మ వైదీక

నియోగి బ్రాహ్మణ శాఖలు..

1) ప్రధమ శాఖ నియోగి
2) ఆరువేల నియోగి
3) నందవరీక నియోగి
4)లింగధారి నియోగి
5)ఉంత్కఖ గౌడ నియోగి
6)ఆరాధ్య నియోగి
7) అద్వైత నియోగి
8) నియోగి వైష్ణవులు
9)పాకనాటి నియోగి
10) ప్రాజ్ఞాటి నియోగి
11) పొంగినాడు నియోగి
12) నియోగి ఆది శైవులు
13) యజ్ఞవల్క్య నియోగి
14) ఆరాధ్యులు
15) వేమనారాధ్యులు
16) తెలగాణ్యు నియోగి
17) కరణకమ్మ నియోగి
18) బడగల కరణకమ్మ నియోగి
19) కరణాలు
20) శిష్ట కరణాలు

వైష్ణవ బ్రాహ్మణ శాఖలు..

1) శ్రీవైష్ణవులు
2) నంబులు
3)గోల్కొండ వ్యాపారులు
4)ఆచార్యులు
5)మర్ధ్యులు
6) వ్యాపారులు
7) కరణకమ్మ వ్యాపారులు
8)బడగల కరణకమ్మ
9)మెలిజేటి కరణకమ్మ
10)దారుకులు
11) యజ్ఞవల్క్యులు
12)యజుశ్యాఖీయులు
13) బడగ కన్నడలు
14) నంబూద్రి బ్రాహ్మలు
15) వైఖానసులు
16) మధ్వలు
17) కాణ్వులు
18)కాణ్వేయులు

శివార్చక బ్రాహ్మణ శాఖలు..

1)మహారాష్ట్ర చిత్సవనులు
2) లింగార్చకులు
3) ఆది శైవులు
4) శివార్చకులు
5)వీర శైవులు
6)మోనభార్గవ శైవులు
7)కాశ్యప శైవులు
8) శైవులు
9) ప్రధమ శాఖ శైవులు
10)రుద్ర శైవులు
11) పరమ శైవులు
12) శివ పూజారులు
13) శైవ స్మార్తులు

మొత్తం బ్రాహ్మణ ఉప శాఖలు 75 ఉన్నాయి.. మీ బ్రాహ్మణ మిత్రులందరికీ ఈ పోస్ట్ ను షేర్ చెయ్యండి..

Friday, November 23, 2018

తులసీ ప్రదక్షిణం పాట

పెద్దవాళ్లు ఒకప్పుడు పాడేవారు:

 గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా
 ఒంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మా !వైకుంఠసన్నిధి నాకియ్యవమ్మా
 రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! నిండైన సందలు నాకియ్యవమ్మా
 మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! ముత్తైదువతనం నాకియ్యవమ్మా 
 నాల్గోప్రదక్షిణం నీకిస్తినమ్మా ! నవధాన్య రాసులను నాకియ్యవమ్మా 
 అయిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా !ఆయువై దోతనం నాక్య్యవమ్మా 
 ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! అత్తగల పుత్రుణ్ణి నాకియ్యవమ్మా
 ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! వెన్నుని ఏకాంత సేవియ్యవమ్మా
 ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! యమునిచే బాధలు తప్పించవమ్మా
 తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! తోడుగా కన్యలకు తోడియ్యవమ్మా 
 పదోప్రదక్షిణం నీకిస్తినమ్మా !  పద్మాక్షి నీసేవ నాకియ్యవమ్మా
 ఎవ్వరు పాడినా ఏకాశి మరణం ! పుణ్యస్త్రీలు పాడితే పుత్రసంతానం
 రామతులసీ , లక్ష్మీ తులసీ ! నిత్యం మాయింట కొలువై విలసిల్లవమ్మా ,,

తులసి చెట్టు గురించి సంపూర్ణ వివరణ - ఔషధ ఉపయోగాలు

*  కృష్ణ తులసి  -
కృష్ణ తులసి వాతమును శమింపచేయును  కాసను , క్రిములను , వాంతిని , భూత వికారాలను పోగొట్టును .

 *  రామ తులసి  -
ఈ రకం తులసి కారంగా, కటువుగా ఉండును. తొందరగా జీర్ణం అగును. శరీరంలో కఫాన్ని , వాతాన్ని, రక్తవికారాన్ని , క్రిములను , విషాన్ని పోగొట్టును . సుగంధముగా ఉండును. ముఖ్యంగా నిమ్మవాసన కలిగి ఉండును . శ్వాసకాస , జ్వరాన్ని పోగొట్టును . పార్శ్వపునొప్పిని పోగొట్టును . ఇది వనముల యందు , అడవుల యందు ఎక్కువుగా పెరుగును . ఆకులు చిన్నవిగా ఉండును.

 *  లక్ష్మి తులసి  -
దీని ఆకులు సుగంధభరితంగా ఉండును. దీనిని కొన్నిచోట్ల పలావులో వాడతారు. ఆకులు ఆకుపచ్చగా ఉండును. ఇది 1.8 మీటర్ల వరకు పెరుగును . దీని జన్మస్థానం ఆఫ్రికా .దీని ఆకులను ఉడికించి ఆమవాతం నందలి నొప్పులకు కట్టు కడతారు. ఆకులను వెన్నతో నూరి గజ్జి మొదలగు చర్మవ్యాధులలో పైన లేపనంగా వాడతారు. దీని ఆకుల కషాయం జ్వరం, దగ్గుల యందు బాగుగా పనిచేయును . కంటి కలకల యందు దీని ఆకు నమిలి 1 - 2 చుక్కల రసం కంటిలో వేసిన కంటి కలక మానును .

 *  అడివి తులసి  -
ఈ రకపు తులసి చెట్టు ఆకులు కొంచం మోటుగా ఉండును. కారం కలిగి ఉండును. కఫ వాత సంబంధ సమస్యలు దూరం చేయును . క్రిమిరోగం , జ్వరం, రక్తదోషాలు , ముఖ్యంగా విషాన్ని హరించును .

*  భూ తులసి  -
ఈ రకపు తులసి కారం , వేడిచేయును  . కఫవాతాలను హరించును . దురద, విషము , క్రిమిదోషం, రక్తస్రావం పోగొట్టును . ఇంటిలోని దోమలను, ఈగలను పారదోలును. రుచిని కలిగించును. ఆకలిని ఎక్కువ చేయును . మొక్క సమూల రసం మోతాదు  20 గ్రాముల వరకు తీసుకోవచ్చు . కషాయం 50 గ్రాముల నుంచి 60 గ్రాముల వరకు తీసుకోవచ్చు .

*  కుక్క తులసి  -
దీనిని పవిత్రంగా చూడకపోయినా దీనికి మామూలు తులసిచెట్టుకు ఉండవలసిన గుణములు అన్నియు ఉన్నవి. ఇది సాధారణంగా అడవులలో మరియు పొలములలో రోడ్లకు ఇరుపక్కలా కనిపించును. దీని ఆకులను తేయాకు బదులుగా ఉపయోగించిన "టీ" వలే ఉండును. జ్వరముల యందు చమట వచ్చి చలువలు వచ్చినపుడు అరిచేతులకు , అరికాళ్లకు రుద్దిన మంచి ఫలితం కనిపించును. ఆకును ముద్దగా నూరి పూసిన ఉష్ణం కలుగును. చర్మవ్యాధులకు పైపూతగా ఉపయోగిస్తారు .

*  మరువక తులసి  -
ఈ తులసి కారపు గుణము కలిగి రక్తదోషము , జంతువిషము, దురద, కుష్ఠము, విషమజ్వరము, చర్మరోగములు , శ్వాసకాస , పైత్యం పెరగటం వలన వచ్చే భ్రమ , తాపము , దాహము , హుద్రోగములు వాటిని పోగొట్టును .

*  రుద్రజడ తులసి -
దీని సర్వాంగములు సుగంధభరితముగా ఉండును. రుచికి చేదుగా కారంగా ఉండును. సెగరోగం,  మూత్రకృచ్చం , ఎక్కిళ్లు రోగం , కండ్ల మంటలు , మూత్రబంధనం అనే సమస్యలను దూరం చేయును . మేహశాంతి , వీర్యవృద్ధి , వీర్యస్తంభన చేయును , కర్ణరోగములు , తలనొప్పి,తేలు కాటు , కడుపులో మంట మొదలగువాటిని పోగొట్టును . స్త్రీల గర్భాశయ రోగాలను హరించి సంతానవంతులను చేయును .

తులసి యందు అనేక రకముల ఉన్నను ముఖ్యముగా విష్ణుతులసి , రామతులసి , తెల్ల తులసి అనే రకం , శ్యామతులసి, కృష్ణతులసి , నల్లతులసి అని రెండొవ రకము ఇవి మాత్రమే పూజార్హకముగా ప్రతి ఇంటి యందు ఉన్నవి .

కృష్ణతులసి యందు ఔషధోప గుణములు అధికంగా ఉండును.కావున ప్రత్యేకముగా చేప్తే తప్ప ఔషధముకు తులసి అని చెప్తే  కృష్ణతులసి వాడటం మంచిది . అడివి తులసి మరింత ఘాటుగా ఉండి మంచి విషహరముగా ఉండును. దీనిని ముఖ్యముగా బొల్లి , విషము , గర్భాశయ రోగాల నివారిణిగా ఉపయోగించెదరు.

భూతులసి కి మరొక పేరు వన తులసి ఈ తులసి అగ్నిదీప్తిని ఇచ్చును. వేడిచేయును మూలవ్యాధులను పోగొట్టును . దీని ఆకుకూర కొంచం వేడిచేయును కాని క్రిమిదోషాలను పోగొట్టును . ఈ తులసి ఆకురసం పూసిన పశువుల పేను గజ్జి నివారణ అగును. దీని సమూలం దంచి రసం తీసిన రసము లేపనం చేసిన కుక్కలగజ్జి మటుమాయం అగును.

కృష్ణతులసి హిద్మ, కాసము, శ్రమ , శ్వాసము, పార్శ్వపుశూల , దుర్గంధం వీనిని హరించును . కృష్ణతులసి రసం పూటకు 20ml నుంచి 30ml వరకు , కషాయం 50ml నుంచి 60ml వరకు చూర్ణం 3 గ్రాముల వరకు ఉపయోగించవచ్చు .

తులసి చెట్ల సాంకేతిక నామములు  -

భూ తులసి -  Ocimum gratissimum or ocimum caryophyllatum
మరువక తులసి - Ocimum basiliicum or sweet basil , common basil
కుక్క తులసి - Hoary bacil , ocimum americanum
లక్ష్మి తులసి - Ocimum viride
రామతులసి - Ocimum gratissimum : shrubby basil
కృష్ణ తులసి - Ocimum sanctum sacred basil , holy basil
కర్పూర తులసి - Ocimum kilimandscharicum camphor basil


గమనిక  -
     
       వెంకటేశ్వరరావు  గారు రాసిన "ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అనేక అమూల్యమయిన వైద్యపరమైన ఆయుర్వేద మూలికల ఉపయోగాలు ఇవ్వడం జరిగింది.
         
        ప్రాచీన ఆయుర్వేదానికి సంభందించిన అనేక రహస్య యోగాలు , మా వంశపారంపర్య అనుభవ యోగాలు , మన చుట్టుపక్కల దొరికే మూలికలు మరియు ఇంట్లో ఉన్నటువంటి వంట దినుసులతోనే పెద్దపెద్ద సమస్యలను నయం చేసుకునేవిధంగా అత్యంత సులభ యోగాలు మొక్కల యొక్క రంగుల చిత్రాలతో పాటు వాటి ఉపయోగాలు , చెట్లను బట్టి భూమిలో నీటిజాడను తెలుసుకొనుట, వృక్షాయుర్వేదం , పశువులకు సంబంధించిన అనేక యోగాలు మొదలైన అమూల్యమయిన విషయాలు ఇవ్వడం జరిగింది.

          ఈ గ్రంథం యొక్క విలువ 350 రూపాయలు కావలసిన వారు ఫొన్ నందు సంప్రదించగలరు. ఫోన్ నంబర్ 9885030034 .
          
కాళహస్తి వెంకటేశ్వరరావు - అనువంశిక ఆయుర్వేదం - 9885030034
ఈ గ్రంథం కావలిసినవారు డైరెక్టుగా పైన తెలిపిన నెంబర్ కి ఫోన్ చేయగలరు.

శిరిడీ సాయి బాబా జీవితంలో ముఖ్యఘట్టాలు


1. మొదట 16 సంవత్సరాల బాలుడిగా ప్రకటితమైన సంవత్సరం - 1854(వేప చెట్టు - ప్రస్తుత గురుస్థానం).  షుమారు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి శిరిడీ చేరుకుని దర్శనమిచ్చిన స్థానం ఖండోబా ఆలయం మఱ్ఱి చెట్టు దగ్గర

2. శరీరం విడిచి మూడు రోజుల తర్వాత గదాధరుని (శ్రీ రామకృష్ణ పరమహంస) అవతారకార్యాన్ని స్వీకరించి తిరిగి పునరుజ్జీవితులైన సంవత్సరం - Aug 18,1886

3. మహాసమాధి చెందిన సంవత్సరం - Oct 15,1918 (బూటి వాడా)

శిరిడీలో దర్శనీయ స్థలాలు:

1.గురు స్థానం(వేప చెట్టు)
2.ఖండోబా మందిరం
3.ద్వారకామాయి(మసీదు)
4.చావడి
5.సమాధి మందిరం
6.లెండీ వనం
7.నంద దీపం
8.గణపతి,శని,మహదేవుల ఆలయాలు(సమాధి మందిరానికి ఎడమప్రక్క)
9.కర్ణ కానీఫనాధుని ఆలయం.
10.విఠల్ మందిరం (కర్ణ కానిఫా ఆలయం దగ్గర)
11.అష్టలక్ష్మీ మందిరం ( పంజాబీ హోటల్ ఎదురుగా)
12.తాజింఖాన్ బాబా గారి దర్గా.
13.బడే బాబా గారి దర్గా (చావడి ఎదురుగా)
చోటే బాబా గారి సమాధి (ఖండోబా మందిరంలోని మఱ్ఱి చెట్టు ప్రక్కన), మోటే బాబా గారి సమాధి (Gate no: 4 దగ్గర), తాత్యాకోతే పాటిల్ సమాధి, అయ్యర్ సమాధి, అబ్ధుల్ బాబా సమాధి, నానావళి గారి సమాధి (ఊదీ ప్రసాదం పంచే దగ్గర), అమీదాస్ భవాని మెహతా గారి సమాధి, ముక్తరాం గారి సమాధి(దత్త మందిరం వెనుక).

బాబాగారు బిక్ష గ్రహించిన ఇళ్లు:

1.సఖరామ్ పాటిల్
2.వామనరావ్ గోండ్ఖర్
(వీరిరువురి ఇళ్లు చావడికి దగ్గరలో ఇప్పుడు వెన్నెల హోటల్ ఉన్న దగ్గర ఎదురెదురుగా ఉండేవి)
3.బయ్యాజి అప్పాకోతే పాటిల్
4.బాయిజాబాయి గణపతికోతే పాటిల్
(వీరిరువురి ఇళ్లు వెన్నెల హోటల్ దాటగానే ఎడమచేతివైపు ఉన్న వీధిలోకి ప్రవేశించి 20 అడుగులు వేయగానే తులసి కోట లాంటి దానిపై పాదుకలు ముద్రించి ఉంటాయి - -పక్కపక్క ఇళ్లు)
5.నందరామ్ మార్వాడీ సంఖ్లేచా.
(ద్వారకామాయి దగ్గర)

భక్తులు:

1.మహల్సాపతి.(వీరి సమాధి తాజింఖాన్ బాబాగారి దర్గా దగ్గర ఉంది)
2.చాంద్ పాటిల్
3.తత్యాకోతే పాటిల్
4.మాధవరావ్ దేశ్ పాండే /శ్యామా
5.నానా సాహెబ్ చందోర్కర్.
6.అన్నా సాహెబ్ దబోల్కర్ /హేమాడ్ పంత్
7.దాసగణు మహరాజ్
8.ఉపాసని బాబా
9.లక్ష్మీబాయి షిండే(ద్వారకామాయి ఎదురుసందులో 30 అడుగుల దూరంలో ఎడమచేతి వైపు)
10.అన్నాసాహెభ్ దభోల్కర్
11.భాగోజీ
12.కాకా సాహెబ్ దీక్షిత్ / హరి సీతారాం
13.దాదా సాహెబ్ ఖాపర్డే
14.అబ్ధుల్లా జాన్
15.బూటీ
16.బడే బాబా.

Sunday, November 18, 2018

నిత్య జీవితంలో నిషిద్ధ కర్మలు

 కర్మాచరణలో వర్ణాశ్రమ ధర్మముల ప్రకారము ఎవరికి ఎట్టి కర్మలు విధివిహితములో అవియే సత్కర్మలు. అటుల కానివి నిషిద్ధకర్మలు. అటువంటి నిషిద్ధకర్మలు ఏంటో తెలుసుకోవడం అవసరం. నిత్య జీవితంలో ఎదురయ్యే నిషిద్ధ కర్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తూర్పు దిక్కున సకలదేవతలు ఉంటా.రు. దక్షిణమున పితృదేవతలు ఉంటారు పశ్చిమమున సమస్త ఋషులు ఉందురు. కనుక ఎప్పుడైనా సరే ఉత్తరం వైపునకే తుమ్మటం, ఉమ్మి వేయాలి. ఇక సుర్యాభిముఖంగా మూత్రవిసర్జన, మలవిసర్జన, ఉమ్మటం, పళ్ళు తోవటం చేయరాదు. ఇవి పంచ మహాపాతకాలలోకి వస్తాయి.

స్నానం నగ్నంగా చేయరాదు. ఒక వస్త్రం చుట్టుకుని చేయాలి. దిగంబరంగ స్నానం చేస్తే అది వరుణిడి(జలాది దేవత) పట్ల అపచారం, శరీరం పిశాచగ్రస్తం అవుతుంది. ఈ పాపకర్మకి(దిగంబరంగ స్నానం చేస్తే) ప్రాయశ్చిత్తం ఏంటంటే.. ప్రతి రోజు సువర్ణం(బంగారం) దానం చేయాలి అలా 12 ఏళ్లు చేయాలి.

సూర్య చంద్ర గ్రహణకాలంలో భోజనంచేసేవారు. నిశ్చయతాంబూలాలిచ్చక ఇతరులకు కన్యాదానం చేసేవారు. పార్ధివలింగాన్ని భక్తితో అర్చించనివాడు, విప్రుని భయపెట్టి ధనం అపహరించేవాడు. దేవతర్చనాది సత్కర్మలకు అడ్డుతగిలినవాడు. న్యాయాధీశుని లేదా నగరరక్షకుని దిక్కరించినవాడు. తులసీదళం చేబూనికూడా మాటతప్పినవాడు, దైవప్రతిమ ఎదుటప్రమాణంచేసి తప్పినవాడు.. నరకానికి వెళ్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.

మిత్రులను మోసంచేసినా, చేసిన మేలు మరచినా, తప్పుడు సాక్ష్యాలు సమర్పించినా, దేవబ్రాహ్మణ పరిహాసకులు, దైవజ్ఞుడు, వైద్యుడు అయినవారు తమకు విహితమైన ధర్మాలను ఆచరించక లోహ-రసాది విక్రయాలు చేపట్టి ప్రజలను వంచిస్తే నరకప్రాప్తి.

బ్రాహ్మణ, దేవతార్చన, శంఖద్వని, తులసి, శివారాధన లేని చోట, విష్ణు భక్తులని నిందించిన చోట, సంధ్యావందన విహీనుడు ఉన్నచోట, ఆచార వర్జితుడి ఇంట, వాచాలుడైన వాడి ఇంట, తడికాళ్ళతో, నగ్నంగా నిదురించేవాడి ఇంట, తోడపై దరువువేసే వాడిఇంట, బ్రాహ్మణ ద్వేషి, జీవ హింస చేసేవాడి ఇంట, దయాశున్యుడి ఇంట, విప్రులని నిందించే వాడి ఇంట, లక్ష్మిదేవీ క్షణకాలం కూడా నిలువదని శాస్త్రాలు చెబుతున్నాయి.

రుద్రాక్షధరించి లేదా ఏదైనా పవిత్ర వస్తువుని స్పృశించి అసత్యం చెప్పరాదు. శుభ కార్యాలకి బయలుదేరేటప్పుడు భర్త ముందు భార్య వెనుక నడవాలి. అశుభకార్యాలకి బయలుదేరేటప్పుడు భార్య ముందు భర్త వెనుక నడవాలి.         

నుదురు మీద బొట్టు, ఎడం భుజం మీద వస్త్రం లేకుండా ఇతరులకు బట్టలు పెట్టకూడదు. ఎవరికైతే వస్త్రం ఉండదో వారికీ ఆయుక్షీణం. నురుగు ఉన్న నీరు పూజకి పనికిరాదు, అలానే వెంట్రుక ఉన్న నీరు కూడా. పరస్త్రీలను కామించేవారు, పరద్రవ్యాలని ఆశించేవారు, పరులకు కీడు తలపెట్టాలి అనుకునేవారు మానసిక పాపులు.

పాడ్యమి, షష్టి, అష్టమి, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, రవి సంక్రమణలయందు, వ్రత, శ్రాద్ధ దినముల యందు శరీరమునకు తైలమును పట్టించుకూడదని విష్ణు పురాణం చెబుతోంది.

భోజనం చేసేటపుడు నిషిద్ధ కర్మలు
ఉత్తరాభిముఖంగా కూర్చుని భోజనం చేయరాదు. శ్రాద్ధకర్మ చేసే రోజు మాత్రమే ఉత్తరాభిముఖంగా కూర్చుని భోజనం చేయాలి. బొట్టు లేకుండా భోజనం చేయరాదు. భోజనంలోవెంట్రుక వస్తే ఆ భోజనం త్యజించవలెను. కనీసం నేతితో(ఆవు నెయ్యి శ్రేష్టం) అభికరించిన(శుద్ధి) తరువాత తినాలి.

నిదురించేటపుడు.. ఉత్తరం వైపు తలవుంచి నిద్రపోకూడదు. తడికాళ్ళతోకానీ, నగ్నంగా కానీ నిద్రపోకూడదు.

దేవాలయ దర్శనంలో నిషిద్ధకర్మలు
దేవాలయ ముఖ ద్వారం పాదరక్షలు వేసుకుని దాట కూడదు. దేవాలయం గడపని తొక్కరాదు. ఈ రెండు చేసిన వారికి రాబోవు జన్మలో వికలాంగులుగా జీవించే అవకాశం ఉంది. ఈశ్వరుడికి కాళ్ళుపెట్టరాదు, గుడిలో సాష్టాంగనమస్కారం చేసేటపుడు అన్ని వైపులా గమనించుకుని ఈశ్వరుడి వైపు కాళ్ళు రాకుండా చూసుకుని సాష్టాంగనమస్కారం చేయవలెను. ఒకవేళ అలా కుదరకపోతే నుంచుని నమస్కారం చేస్తే సరి పోతుంది.

పెళ్లి విషయంలో నిషిద్ధకర్మలు

ఇంటిలో ఆరోగ్యంగా ఉన్న పెద్ద కుమారుడుకి పెళ్లి చేయకుండా చిన్నవాళ్ళకి చేయరాదు, అలాచేస్తే పెళ్లికొడుకు, అతని తల్లిదండ్రులు, పెళ్లి జరిపించిన పురోహితుడు అందరూ నరకానికి వెళతారు. ఇది ఆడపిల్లలకి కూడా వర్తిస్తుంది. పెళ్లికాని అన్నగారిని పరివిత్తి అంటారు. పరివిత్తితో కూడిన యజ్ఞాదులు కూడా పాపాలే అవుతాయి. పరివిత్తికి కన్యాదానంచేయడం అపాత్రదానం అవుతుంది.

Saturday, November 17, 2018

లింగాష్టకం యొక్క అర్థం

🔱 బ్రహ్మమురారిసురార్చిత లింగం
🔔బ్రహ్మ ,విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం..!!

 🔱 నిర్మల భాషిత శోభిత లింగం
🔔నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం..!!

🔱 జన్మజ దుఃఖ వినాశక లింగం
🔔జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం..!!

🔱 తత్ ప్రణమామి సదాశివ లింగం
🔔ఓ సదా శివ లింగం నీకు నమస్కారం..!!

🔱 దేవముని ప్రవరార్చిత లింగం
🔔దేవమునులు మహా ఋషులు పూజింప లింగం..!!

 🔱 కామదహన కరుణాకర లింగం
🔔మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం..!!

🔱 రావణ దర్ప వినాశక లింగం
🔔రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం..!!

🔱 తత్ ప్రణమామి సదా శివ లింగం
🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

🔱 సర్వ సుగంధ సులేపిత లింగం
🔔అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ లింగం..!!

🔱 బుద్ధి వివర్ధన కారణ లింగం
🔔మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం ..!!

 🔱 సిద్ధ సురాసుర వందిత లింగం
🔔సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం..!!

🔱 తత్ ప్రణమామి సదా శివ లింగం
🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

🔱 కనక మహామణి భూషిత లింగం
🔔బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ లింగం..!!

🔱 ఫణిపతి వేష్టిత శోభిత లింగం
🔔నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ లింగం..!!

🔱 దక్ష సుయజ్ఞ వినాశక లింగం
🔔దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం..!!

🔱 తత్ ప్రణమామి సదా శివ లింగం
🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

🔱 కుంకుమ చందన లేపిత లింగం
🔔కుంకుమ , గంధము పూయబడ్డ శివ లింగం..!!

🔱 పంకజ హార సుశోభిత లింగం
🔔కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ లింగం..!!

🔱 సంచిత పాప వినాశక లింగం
🔔సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం..!!

🔱 తత్ ప్రణమామి సదా శివ లింగం
🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

🔱 దేవగణార్చిత సేవిత లింగం
🔔దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించ బడ్డ శివ లింగం..!!

🔱 భావై ర్భక్తీ భిరేవచ లింగం
🔔చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింప బడ్డ శివ లింగం..!!

🔱 దినకర కోటి ప్రభాకర లింగం
🔔కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి శివ లింగం..!!

🔱 తత్ ప్రణమామి సదా శివ లింగం
🔔నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!

🔱 అష్ట దలోపరి వేష్టిత లింగం
🔔ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం..!!

🔱 సర్వ సముద్భవ కారణ లింగం
🔔అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం..!!

🔱 అష్ట దరిద్ర వినాశక లింగం
🔔ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు) నాశనం చేసే శివ లింగం..!!

🔱 తత్ ప్రణమామి సదా శివ లింగం
🔔నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!

🔱 సురగురు సురవర పూజిత లింగం
🔔దేవ గురువు (బృహస్పతి), దేవతల చేత పూజింప బడ్డ శివ లింగం..!!

🔱 సురవన పుష్ప సదార్చిత లింగం
🔔దేవతల తోటల్లో పూచే పువ్వులు (పారిజాతాలు) చేత ఎప్పుడూ పూజింప బడే శివ లింగం..!!

🔱 పరమపదం పరమాత్మక లింగం
🔔ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గము

🔱 తత్ ప్రణమామి సదా శివ లింగం
🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

🔱 లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ
🔔ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో , వారికి చాలా పుణ్యం వస్తుంది..!!

🔱 శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే
🔔శివ లోకం లభిస్తుంది ..!!
శివుడి లో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది.

Friday, November 16, 2018

తిధులు..వాటి అధిపతులు గురించి

వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా
శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు.
తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది.
ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.

శుక్లపక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమ వరకు 15, మరల కృష్ణపక్షంలో పాడ్యమినుండి అమావాస్య వరకు 15. మొత్తం 30 తిథులు.
రవి చంద్రుల మధ్య దూరం 0 డిగ్రీ ఉన్నప్పుడు అమావాస్య,
180 డిగ్రీలు దూరమున్నప్పుడు పూర్ణిమ ఏర్పడుతాయి. చంద్రుడు, రవి నుండి ప్రతి 12 డిగ్రీలు నడిచినపుడు తిథులు మారతాయి.

తిధులు అధిపతులు.💐
పుణ్య తిధులు.💐
మనం దేవతలను పలురకాలుగా, మనకు వీలైన రీతిలోపూజిస్తూ ఉంటాము.
ఆ విధంగా చేసే పూజలు నియమనిష్టలతో చేసినట్లైతే తగిన ఫలితం వస్తుంది.
దీనికిసంబందించిన తిధులు,
వాటి ప్రత్యేకత,
ఏ రోజు ఏదేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్య ఫలం కలుగుతుందో అనే వివరణ
మనకు వరాహ పురాణం లో వివరించబడినది.
వరాహ పురాణంలో శ్రీ మహా విష్ణువు స్వయంగా తిధులు వాటి విశేషాల గురించి భూదేవి కి వివరించారు

తిధులు వాటి విశిష్టత.💐

పాడ్యమి :💐
దేవతలలో ముందు పుట్టిన వాడు అగ్ని. కాబట్టి తిధులలో మొదటిదైన పాడ్యమి నాడు అగ్నిని పూజించి, ఉపవాసం ఉండినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.

విదియ :💐
అశ్విని దేవతలను ఆరాధించాలి.
వారు ఆ తిధినాడు పుట్టినందువల్ల, ఏడాదిపాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విదియ వ్రతాన్ని నియమ నిష్టలతో చేస్తే శుభప్రదం.

తదియ :💐
గౌరీ దేవిని పూజించాలి.
గౌరీ కళ్యాణం తదియనాడు జరిగినందువల్ల, గౌరీ దేవికి ఆ తిధి అంటే ఇష్టం.
ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం ఏర్పాటు అయినది.

చవితి:💐
వినాయకుడు పుట్టిన తిధి.
వినాయక చవితి నాడే కాకుండా ప్రతీ చవితినాడు వినాయకుడిని పూజించవచ్చు.

పంచమి:💐
పంచమి నాడు నాగులు జన్మించాయి. అందుకే నాగదేవతలకు పంచమి తిధి / నాగుల చవితి అన్న చాలఇష్టం.
ప్రతీ పంచమినాడు పుట్టలో పాలు పోసి నాగ పూజచేస్తే నాగుల వల్ల భయం ఉండదు.

షష్టి :💐
కుమారస్వామి /సుబ్రహ్మణ్య స్వామి జన్మతిధి.
ఆ రోజునఅర్చన చేసినట్లైతే సుబ్రహమణ్య అనుగ్రహం పొందగలరు.

సప్తమి:💐
సూర్యుని జన్మ తిధి.
రధసప్తమి నాడే కాకుండా ప్రతీ శుద్ధసప్తమి నాడు సూర్యుడిని ఆరాదించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు కలుగుతాయి.

అష్టమి:💐
దుర్గాదేవి అష్టమాతృకలు ఆవిర్భవించిన తిధి.
అష్టమాతృకలను, దుర్గా దేవిని పూజిస్తే శుభం కలుగుతుంది.

నవమి:💐
దుర్గాదేవి కి ప్రీతికరమైనది.
ఆ తిధి నాడు దుర్గను పూజించి ఉపవాసం ఉంటే సంపదలు కలుగుతాయి.

దశమి:💐
దశమి నాడు దిక్కుల సృష్టి జరిగింది.
ఇంద్రాది దేవతలు ఈ దిక్కులకు పాలకులు. దిక్పాలకులను పూజిస్తే పాపాలు తొలగుతాయి.

ఏకాదశి:💐
కుబేరుడు పుట్టిన తిధి.
ఈ తిధిన కుబేర పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది

ద్వాదశి:💐
విష్ణువు కి ఇష్టమైన తిధి.
ఈ తిధి రోజే విష్ణు మూర్తి,వామన రూపంలో జన్మించారు. ద్వాదశి నాడు ఆవునెయ్యి తో వ్రతం చేస్తే పుణ్యం లభిస్తుంది.

త్రయోదశి:💐
ధర్ముడు పుట్టిన తిధి.
ఈ రోజున ఎవరికీ ఇష్టమైన దేవుడిని వారు తలచుకొని పూజిస్తే , ఫలం చేకూరుతుంది.

చతుర్దశి:💐
రుద్రుని తిధి.
ఆనాడు రుద్రార్చన చేసినట్లైతే శుభప్రదం.
కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది.
ఆ తిధిశివుడికి ప్రీతికరం.

అమావాస్య:💐
పితృదేవతలకు ఇష్టమైన తిధి.
దర్భలు, నువ్వులు, నీళ్ళతో పితృదేవతలకు తర్పణమిస్తే వారు సంతోషించి సంతానసౌఖ్యం అనుగ్రహిస్తారు.

పౌర్ణమి:💐
పౌర్ణమికి చంద్రుడు అధిపతి.
పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి కి చంద్రుడిని పూజించినట్లితే ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలుసిద్దిస్తాయి.

అగ్నిః ప్రతిపదః - పాడ్యమికి అగ్ని అధిపతి

బ్రహ్మా ద్వితీయాయాః - విదియకు బ్రహ్మ

పార్వతీ తృతీయాయాః - తదియకు పార్వతి

చతుర్ధాః గణపతిః - గణపతి చవితికి

పంచమ్యాః శేషః - పంచమికి ఆదిశేషుడు

కుమారః షష్ఠ్యా: - కుమారస్వామి షష్ఠికి

సూర్య: సప్తమ్యా: - సూర్యుడు సప్తమికి

శివోష్టమ్యా: - అష్టమికి సదాశివుడు

వసవ : నవమ్యా: - నవమికి అష్టవసుపులు

దిగ్గజా: దశమ్యా: - దిగ్గజములు దశమికి

యమ ఏకాదశ్యా: - ఏకాదశికి యమధర్మరాజు

విష్ణు : ద్వాదశ్యా: - ద్వాదశికి విష్ణువు

మన్మథ: త్రయోదశ్యా; - త్రయోదశికి మన్మధుడు

కలిపురుష: చతుర్దశ్యాః - చతుర్దశికి కలిపురుషుడు

చంద్ర: పౌర్ణమాస్యా: - పున్నమకు చంద్రుడు

అగ్నిష్వాత్తాదిపితర : అమావాశ్యా: - అగ్నిష్వాత్తు మొదలైన పితృ దేవలు అమావాస్యకు

క్రమాదధిపా: - క్రమముగా నధిపతులు,

ఉత్తమ తిధులు:-💐
 11. శుక్ల ఏకాదశి,
12. శుక్ల ద్వాదశి,
13. శుక్ల త్రయోదశి,
14. శుక్ల చతుర్దశి,
15. పూర్ణిమ,
1. కృష్ణ పాడ్యమి,
2. కృష్ణ విదియ,
3. కృష్ణ తదియ,
4. కృష్ణ చవితి,
5. కృష్ణ పంచమి.

మద్యమ తిధులు:- 💐
6. శుక్ల షష్ఠి,
7. శుక్ల సప్తమి,
8. శుక్ల అష్టమి,
9. శుక్ల నవమి,
10. శుక్ల దశమి,
 6. కృష్ణ షష్ఠి
7. కృష్ణ సప్తమి,
8. కృష్ణ అష్టమి,
9. కృష్ణ నవమి,
10. కృష్ణ దశమి.

అధమ తిధులు:-💐
12. శుక్ల ద్వాదశి,
3.శుక్ల తదియ,
4.శుక్ల చవితి
5.శుక్ల పంచమి.
11.కృష్ణ ఏకాదశి,
12.కృష్ణ ద్వాదశి,
13.కృష్ణ త్రయోదశి,
14.కృష్ణ చతుర్ధశి,
15.అమావాస్య.

సంకల్పతిధి;-💐
ఒక రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఏ తిధి ఉన్నదో ఆ తిధినే
ఆ రోజంతా సంకల్పానికి చెప్పాలి.
ఒక రోజు సూర్యోదయానికి ఒక తిధి ఉండి మరుసటి రోజు సూర్యోదయం లోపల ఇంకొక తిధి వస్తే మొదటి తిధి ‘ఉపరి’రెండవ తిధి అని చెప్పాలి.

తిధి సంధి:-💐
పంచమి,షష్ఠి లయొక్కయు,
దశమి,ఏకాదశి ల యొక్కయు 4 ఘడియలు తిధిసంధి అనబడును.
ఈ సంధిన జననమైన యెడల పితృగండం.

గండతిధి:-💐
పూర్ణ తిధులలో చివరి 48 నిమిషాలు,
నంధ తిదులలో మొదటి 48 నిమిషాలు తిధి గండాతాలు అవుతాయి.
శుభకార్యాలు చేయరాదు.

పంచ పర్వతిధులు :💐 అష్టమి,
చతుర్ధశి,
అమావాస్య,
పౌర్ణమి,
సూర్య సంక్రమణం ఉన్న తిధి
పంచపర్వ తిధులు అంటారు.
ఇవి శుభకార్యాలకు పనికిరావు.

పక్ష రంధ్ర తిధులు:-💐
చవితి మొదటి 8 ఘడియలు,
షష్ఠి మొదటి 9 ఘడియలు,
అష్టమి మొదటి 14 ఘడియలు,
నవమి మొదటి 25 ఘడియలు,
ద్వాదశి మొదటి 10 ఘడియలు,
చతుర్ధశి మొదటి 5 ఘడియలు.
ఈ ఘడియలలో వివాహం చేయరాదు.
మిగిలిన ఘడియలు శుభప్రధములు.

పితృకార్యములకు తిధి:-💐
అహఃప్రమాణమును (పగటి ప్రమాణం)ను
ఐదు భాగాలుగా చేస్తే అందులో
మొదటిభాగం ప్రాతఃకాలం,
రెండవ భాగం సంగమ కాలం,
మూడవ భాగం మధ్యాన్నం,
నాల్గవ భాగం అపరాహ్నం,
ఐదోభాగం సాయంకాలం .
ఏ తిధి మద్యాన్నం మించి అపరాహ్నం వరకు వ్యాపించి ఉన్నదో ఆ తిధి పితృకార్యములకు మంచిది.

లోకా సమస్తా సుఖినోభవంతు..!!💐

సూర్యభగవానుడి జన్మ రహస్యం గురించి పురాణాలూ ఏం చెబుతున్నాయి?

🌞 ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మాన వాళికి జవజీవాలను కల్పిస్తున్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలూ మేలు పొందారని పురాణాలూ చెబుతున్నా యి. అయితే సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి,  కిరణాలతో  దేవతలను, పితృదేవతలను, మనుషుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడి లో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతం గా మార్చుకుంటాడు. ఆ అమృతాన్ని సౌమ్యులు, కామ్యులు అయిన దేవతలు, పితృదేవతలు ఆహారంగా గ్రహిస్తారు. మరి సూర్యభగవానుడు ఎవరు? ఆయన జన్మ రహస్యం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

🌞 సూర్యభగవానుడి జన్మ రహస్యం గురించి పురాణాలూ ఏం చెబుతున్నాయి?

🌞 1- బ్రహ్మ పురాణం ప్రకారం, కశ్యప ప్రజాపతి, అదితి దంపతుల ముద్దుల తనయుడు సూర్యుడు. ఆ సమయానికే రాక్షసుల ఆగడాలు పెచ్చుపెరిగాయి. అసురుల ఆట కట్టించగల అపార శక్తిమంతుడిని బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్థించింది. విశ్వమంతా విస్తరించిన తేజస్సునే సంక్షిప్తీకరించి ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసిందా దివ్యకాంతి. పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలూ ఉపవాసాలూ చేస్తున్న అదితిని చూసి కశ్యపుడు ఎగతాళి చేశాడు. బిడ్డని ఆకలితో చంపేస్తావా? అని అరిచేశాడు. ఆ మాటకు తల్లి మనసు గాయపడింది. నిరసనగా తన గర్భాండాన్ని త్యజించింది. ఆమె కడుపులోంచి నేలమీద పడగానే లక్ష అగ్నిగోళాల్లా భగభగా మండిందా అండం. ఆ వేడికి సృష్టి అతలాకుతలమైంది. అదితీకశ్యపుల ప్రార్థన తర్వాత, ఆ అండం పగిలి అందులోంచి అందమైన పసివాడు బయటికొచ్చాడు. ఆ బాలుడే భానుడు! ఆనాడు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి ఆ ముహూర్తానికే ఏడుగుర్రాల రథాన్ని అధిరోహించి, వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించాడని మత్స్యపురాణం చెబుతోంది.

🌞 2- తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడని పిలవబడినాడు. సూర్యుడు ఎరుపు వర్ణము కలవాడు. ఆయన రథము నందు ఒకే చక్రముంటుంది. దీనినే సంవత్సరము అని అంటారు. ఈ రథము నందు పన్నెండు మాసములు, ఆరు ఋతువులు, నాలుగు – నాలుగు మాసముల చొప్పున మూడునాభులు ఉంటాయి. ఇదియే కాలచక్రమని కూడా అంటారు. కాబట్టి సూర్యభగవానుడు పన్నెండు మాసములలో 12పేర్లతో ఆరాధించబడతాడు.

3- విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా గుదిగుచ్చి అగ్నిగోళం లాంటి సూర్యబింబాన్ని అరగదీసి, కరగదీసి తాప తీవ్రతను తగ్గించాడు. ఆ అరుగుదలలో పుట్టిన రేణువుల నుంచీ విష్ణువుకు చక్రాన్నీ, శివుడికి శూలాన్నీ తయారు చేసిచ్చాడని పురాణం.

🌞 4- ఖగోళశాస్త్రం ప్రకారం, సూర్యుడి వయసు నాలుగువందల అరవై కోట్ల సంవత్సరాలు. దాదాపుగా సృష్టి వయసూ కూడా అదే. సూర్యుడు వేలవేల నక్షత్రాల మధ్య ఓ మహానక్షత్రం. హైడ్రోజన్‌, హీలియంలతో నిండిన వాయుగోళం. ఆ గురుత్వాకర్షణశక్తి కారణంగానే, భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభ్రమణం చేస్తున్నాయి. సౌర వ్యవస్థలో తొంభైతొమ్మిదిశాతం దినకరుడి అధీనంలోనే ఉంది. సూర్యుడి వ్యాసం భూమి కంటే వందరెట్లు పెద్దది.

🌞 5- అయితే సూర్యభగవానుని రూపాలను పన్నెండుగా, వారినే ద్వాదశాదిత్యులుగా ఆయా మాసాలలో ఆ రూపాలలో పూజిస్తుంటారు. వాటిలో భాగంగానే కశ్యప్రజాపతి కుమారుడు సూర్యుడని, వారిలో ఇక్ష్వాకుడు రాజయిన కారణంగా ఇక్ష్వాకువంశంలో రాజులందరినీ సూర్యవంశ రాజులు అంటరాని చెబుతారు.

🌞 6- ఇక సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి, కాలగమనానికి కొలబద్ద. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. కాలమే వేదస్వరూపం అంటోంది వేదం. కాలం కంటికి కనబడదు. దైవమూ అంతే. కానీ కాలానికి ప్రమాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు. అందుకే ఆయనను ప్రత్యక్షదైవంలా కొలిచి, ఆది నారాయణుడిగా ఆరాధిస్తాం. భౌతిక, వైజ్ఞానిక, దృష్టితో పరిశీలిస్తే సృష్టి, స్థితి, లయ కారకుడు సూర్యుడు మాత్రమే. ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యమవుతుంది.

🌞 మౌనం మనస్సును, స్నానం దేహాన్ని, ధ్యానం బుద్దిని, ప్రార్థన ఆత్మను, దానం సంపాదనను, ఉపవాసం ఆరోగ్యాన్ని, క్షమాపణ సo బందా లను, మంచితనం నీ పరిసరాలను శుద్ది చెయును.
 సదా దైవ చింతన అలౌకిక ఆనందం, పరమానందం , బ్రహ్మానందం... లను నీ పరం చేయును.

Wednesday, November 14, 2018

సృష్టి రహస్య విశేషాలు

1  సృష్టి  ఎలా  ఏర్పడ్డది
.
2  సృష్టి  కాల చక్రం  ఎలా నడుస్తుంది
.
3  మనిషిలో  ఎన్ని  తత్వాలున్నాయి
.
( సృష్ఠి )  ఆవిర్బావము
.
1  ముందు  (పరాపరము) దీనియందు శివం పుట్టినది
2  శివం యందు  శక్తి
3  శక్తి యందు నాదం
4  నాదం యందు బిందువు
5  బిందువు యందు సదాశివం
6  సదాశివం యందు మహేశ్వరం
7  మహేశ్వరం యందు ఈశ్వరం
8  ఈశ్వరం యందు రుద్రుడు
9  రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11  బ్రహ్మ యందు ఆత్మ
12  ఆత్మ యందు దహరాకాశం
13  దహరాకాశం యందు వాయువు
14  వాయువు యందు అగ్ని
15  ఆగ్ని యందు జలం
16  జలం యందు పృద్వీ.
పృద్వీ యందు ఓషధులు
17  ఓషదుల వలన అన్నం
18  ఈ అన్నము వల్ల నర మృగ  పశు  పక్షి స్థావర జంగమాదులు పుట్టినవి.

.
( సృష్ఠి ) కాల చక్రం
.
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.
ఇప్పటివరకు ఏంతో మంది శివులు  ఏంతోమంది విష్ణువులు  ఏంతోమంది బ్రహ్మలు వచ్చారు ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.
1 కృతయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం
నాలుగు యుగలకు 1 మహయుగం.
71 మహ యుగలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి ఒక కల్పం.
15 సందులకు ఒక ప్రళయం ఒక కల్పం
1000 యుగలకు బ్రహ్మకు పగలు సృష్ఠి . 
1000 యుగాలకు ఒక రాత్రి  ప్రళయం.
2000 యుగాలకు ఒక దినం.
బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. శ్వేతవారహ యుగంలో ఉన్నాం.
5 గురు భాగన కాలంకు 60 సం
1 గురు భాగన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు  3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు  రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం.  2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు
పంచాంగంలో 1 తిధి. 2 వార.  3 నక్షత్రం.  4 కరణం.  5 యోగం.
.
సృష్ఠి యవత్తు త్రిగుణములతోనే ఉంటుంది
.
 దేవతలు   జీవులలో  చేట్లు అన్ని వర్గలలో మూడే గుణములు ఉంటాయి
1  సత్వ గుణం
2  రజో గుణం
3  తమో గుణం
.
( పంచ భూతంలు అవిర్బావాం )
,
1 ఆత్మ యందు ఆకాశం
2 ఆకాశం నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలం
5 జలం నుండి భూమి అవిర్బవించాయి.
.
5  ఙ్ఞానింద్రియంలు
5  పంచ ప్రాణంలు
5  పంచ తన్మాత్రలు
5  ఆంతర ఇంద్రియంలు
5  కర్మఇంద్రియంలు  = 25 తత్వంలు
.
1  ( ఆకాశ పంచికరణంలు )
.
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల      ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల  ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల          ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల          ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల        ( ఆహంకారం ) పుడుతుతున్నాయి

2( వాయువు పంచికరణంలు )
.
వాయువు - వాయువుతో కలవడం వల్ల  ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల       ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల           ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల          ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల        ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.

3 ( అగ్ని పంచికరణములు )
.
అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల     ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల   ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో           ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో         ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో     ( ఘ్రాణం )  పుట్టేను.

4 ( జలం పంచికరణంలు )
.
జలం - ఆకాశంలో కలవడంవల్ల     ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల  ( స్పర్ష )
జలం -  అగ్నిలో కలవడంవల్ల        ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల         ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల      ( గంధం )పుట్టేను.

5 ( భూమి పంచికరణంలు )
.
భూమి - ఆకాశంలో కలవడంవల్ల      ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల  ( పాని )
భూమి -  అగ్నితో కలవడంవల్ల          ( పాదం )
భూమి - జలంతో కలవడంతో          ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల      ( గుదం )  పుట్టేను.
.
( మానవ దేహ తత్వం )  5  ఙ్ఞానింద్రియంలు
.
1  శబ్ద
2  స్పర్ష
3  రూప
4  రస
5  గంధంలు.
.
5  (  పంచ తన్మాత్రలు )
.
1  చెవులు
2  చర్మం
3  కండ్లు
4  నాలుక
5  ముక్కు
.

5  ( పంచ ప్రాణంలు )
,
1  అపాన
2  సామనా
3  ప్రాణ
4  ఉదాన
5  వ్యాన
.
5  (  అంతఃర ఇంద్రియంలు  )  5  (  కర్మఇంద్రియంలు )
,
1  మనస్సు
3  బుద్ది
3  చిత్తం
4  జ్ఞానం
5  ఆహంకారం
.
1  వాక్కు
2  పాని
3  పాదం
4  గుహ్యం
5  గుదం
.
6  (  అరిషడ్వర్గంలు  )
,
1  కామం
3  క్రోదం
3  మోహం
4  లోభం
5  మదం
6  మచ్చార్యం
.
3  (  శరీరంలు  )
,
1  స్థూల  శరీరం
2  సూక్ష్మ  శరీరం
3  కారణ  శరీరం
.
3  (  అవస్తలు  )
,
1  జాగ్రదవస్త
2  స్వప్నవస్త
3  సుషుప్తి అవస్త
.
6  (  షడ్బావ వికారంలు  )
,
1  ఉండుట
2  పుట్టుట
3  పెరుగుట
4  పరినమించుట
5  క్షీణించుట
6  నశించుట
.
6  (  షడ్ముర్ములు  )
,
1  ఆకలి
2  దప్పిక
3  శోకం
4  మోహం
5  జర
6  మరణం

.7  (  కోశములు  )  (  సప్త ధాతువులు  )
,
1  చర్మం
2  రక్తం
3  మాంసం
4  మేదస్సు
5  మజ్జ
6  ఎముకలు
7  శుక్లం
.
3  (  జీవి త్రయంలు  )
,
1  విశ్వుడు
2  తైజుడు
3  ప్రఙ్ఞాడు
.
3  (  కర్మత్రయంలు  )
,
1  ప్రారబ్దం కర్మలు
2  అగామి  కర్మలు
3  సంచిత  కర్మలు
.
5  (  కర్మలు  )
,
1  వచన
2  ఆదాన
3  గమన
4  విస్తర
5  ఆనంద
.
3  (  గుణంలు  )
,
1  సత్వ గుణం
2  రజో గుణం
3  తమో గుణం
.
9  (  చతుష్ఠయములు  )
,
1  సంకల్ప
2  అధ్యాసాయం
3  ఆభిమానం
4  అవధరణ
5  ముదిత
6  కరుణ
7  మైత్రి
8  ఉపేక్ష
9  తితిక్ష
.
10  (  5 పంచభూతంలు పంచికరణ   చేయనివి )
      (  5 పంచభూతంలు  పంచికరణం  చేసినవి  )
.
1  ఆకాశం
2  వాయువు
3  ఆగ్ని
4  జలం
5  భూమి
.
14  మంది  (  అవస్థ దేవతలు  )
,
1  దిక్కు
2  వాయువు
3  సూర్యుడు
4  వరుణుడు
5  అశ్వీని దేవతలు
6  ఆగ్ని
7  ఇంద్రుడు
8  ఉపేంద్రుడు
9  మృత్యువు
10  చంద్రుడు
11  చతర్వకుడు
12  రుద్రుడు
13  క్షేత్రజ్ఞుడు
14  ఈశానుడు
.
10  (  నాడులు  ) 1 (  బ్రహ్మనాడీ  )
,
1  ఇడా నాడి
2  పింగళ
3  సుషుమ్నా
4  గాందారి
5  పమశ్వని
6  పూష
7  అలంబన
8  హస్తి
9  శంఖిని
10  కూహు
11  బ్రహ్మనాడీ
,
10  (  వాయువులు  )
,
1  అపాన
2  సమాన
3  ప్రాణ
4  ఉదాన
5  వ్యానా
.
6  కూర్మ
7  కృకర
8  నాగ
9  దేవదత్త
10  ధనంజమ
.
7  ( షట్ చక్రంలు  )
,
1  మూలాధార
2  స్వాదిస్థాన
3  మణిపూరక
4  అనాహత
5  విశుద్ది
6  ఆఙ్ఞా
7  సహస్రారం
.
(  మనిషి  ప్రమాణంలు  )
,
96  అంగళంలు
8  జానల పోడవు
4  జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62  కీల్లు
37  మురల ప్రేగులు
1  సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4  సేర్లు మాంసం
1  సరేడు పైత్యం
అర్దసేరు శ్లేషం
.
(  మానవ దేహంలో 14 లోకలు  )  పైలోకలు 7
,
1  భూలోకం  -  పాదాల్లో
2  భూవర్లలోకం  -  హృదయంలో
3  సువర్లలోకం  -  నాభీలో
4  మహర్లలోకం  -  మర్మంగంలో
5  జనలోకం  -  కంఠంలో
6  తపోలోకం  -  భృమద్యంలో
7  సత్యలోకం  -  లాలాటంలో
.
అధోలోకలు  7
.
1  ఆతలం  -  అరికాల్లలో
2  వితలం  -  గోర్లలో
3  సుతలం  -  మడమల్లో
4  తలాతలం  -  పిక్కల్లో
5  రసాతలం  -  మొకల్లలో
6  మహతలం  -  తోడల్లో
7  పాతాళం  -  పాయువుల్లో
.
(  మానవ దేహంలో  సప్త సముద్రంలు  )
,
1  లవణ సముద్రం  -  మూత్రం
2  ఇక్షి సముద్రం  -  చేమట
3  సూర సముద్రం  -  ఇంద్రియం
4  సర్పి సముద్రం  -  దోషితం
5  దది సముద్రం  -  శ్లేషం
6  క్షిర సముద్రం  -  జోల్లు
7  శుద్దోక సముద్రం  -  కన్నీరు
.
(  పంచాగ్నులు  )
,
1  కాలగ్ని  -  పాదాల్లో
2  క్షుదాగ్ని  -  నాభీలో
3  శీతాగ్ని  -  హృదయంలో
4  కోపాగ్ని  -  నేత్రంలో
5  ఙ్ఞానాగ్ని  -  ఆత్మలో
.
7  (  మానవ దేహంలో  సప్త  దీపంలు  )
,
1  జంబు ద్వీపం  -  తలలోన
2  ప్లక్ష ద్వీపం  -  అస్తిలోన
3  శాక ద్వీపం  -  శిరస్సుప
4  శాల్మల ధ్వీపం  -  చర్మంన
5  పూష్కార ద్వీపం  -  గోలమందు
6  కూశ ద్వీపం  -  మాంసంలో
7  కౌంచ ద్వీపం  -  వేంట్రుకల్లో
.
10  (  నాధంలు  )
,
1  లాలాది ఘోష  -  నాధం
2  భేరి  -  నాధం
3  చణీ  -  నాధం
4  మృదంగ  -  నాధం
5  ఘాంట  -  నాధం
6  కీలకిణీ  -  నాధం
7  కళ  -  నాధం
8  వేణు  -  నాధం
9  బ్రమణ  -  నాధం
10  ప్రణవ  -  నాధం

యోగా, మెడిటేషన్ చేసే వారికోసం.



యోగా, మెడిటేషన్ చేసే సమయంలో సహజమైన ప్రకృతి లో, గుడిలో ఉన్న అనుభూతిని పోందాలంటే అందుకు అనువైన చక్కని సంగీతం ఉంటే చాలు మీ దృష్టి పక్కకు వెళ్లకుండా చక్కగా మీకు కావలసినంత సేపు యోగా, మెడిటేషన్ చేసుకోవచ్చు.

💐ఉద‌యం 8 లోపు చేసే ఈ 6 అల‌వాట్లు మీ జీవితాన్నే మారుస్తాయ్.!🌞
*ఆనందానికి 6 అంశాలు

1.Silence( నిశ్శ‌బ్దం)....

మ‌న ప్ర‌తి రోజును చాలా నిశ్శ‌బ్దంగా ప్రారంభించాలి…అంటే ప్ర‌శాంత‌త‌తో స్టార్ట్ చేయాలి..లేవ‌డం లేట‌య్యింది…అయ్యే ఎలా…? ఆఫీస్ ప‌ని…ఈ రోజు అత‌డిని క‌లుస్తాన‌ని చెప్పాను…ఎమోయ్…టిఫిన్ అయ్యిందా…..ఇదిగో ఇంత‌లా హైరానా ప‌డొద్దు… ప్ర‌శాంతంగా లేవ‌గానే….కాసింత సేపు మెడిటేష‌న్ చేయండి. లేదా…క‌ళ్ళు మూసుకొని ప్ర‌శాంత‌త‌ను మీ మ‌న‌స్సులోకి ఆహ్వానించండి. ఇక్క‌డే మ‌న రోజు ఎలా గ‌డుస్తుంది? అనేది డిసైడ్ అయిపోతుంది .

2.Affirmations ( నీతో నువ్వు మాట్లాడుకోవ‌డం)

 అంద‌రి గురించి, అన్ని విష‌యాల గురించి అన‌ర్గ‌లంగా మాట్లాడే మ‌నం…మ‌న‌తో మ‌నం ఒక్క‌సారి కూడా మాట్లాడుకోలేక‌పోతున్నాం. అస‌లు మ‌న‌లోని మ‌న‌కు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళ‌ల్లో ఖ‌చ్చితంగా ఈ ల‌క్ష‌ణం ఉంటుంది. ఈ మూడు పాయింట్స్ ప్ర‌తి రోజు మీతో మీరు మాట్లాడుకోండి.
1) నేనేమి కావాల‌నుకుంటున్నా.??
2)దాని కోసం నేను ఎటువంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌??
3) అనుకున్న‌ది సాధించ‌డం కోసం నేను వేటిని వ‌దిలివెయ్యాలి? వేటిని కొత్త‌గా ఆహ్వానించాలి? ఇలా ప్ర‌తి రోజూ మ‌న‌లో మ‌నం మాట్లాడుకుంటూ….మ‌న‌లోని మార్పును మ‌న‌మే లెక్కించాల‌న్న మాట‌.!

3.Visualization ( ఆత్మ సాక్షాత్త్కారం)

 మ‌నలోని భావాలకు మ‌న‌స్సులో దృశ్య‌రూపం ఇవ్వ‌డం. కాన్సియ‌స్ తో క‌ల‌లు క‌న‌డం అన్నమాట‌! ఉద‌యాన్నే మ‌న ల‌క్ష్యం అలా క‌ళ్ళ ముందు క‌న‌బ‌డితే…దానిని చేరుకోవడం కోసం రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌య‌త్నం చేస్తాం.

4.Exercise

ఇది ప్ర‌తి ఒక్క‌రికి తెల్సిన విష‌య‌మే… కండ‌రాలు, న‌రాలు ఉత్తేజిత‌మై కొత్త శ‌క్తిని ప్రేరేపిస్తుంది.


5.Reading

రోజుకు 10 పేజీలు చ‌ద‌వడాన్ని అల‌వాటు చేసుకోవాలి..ఇది మ‌నలోని అంత‌ర్గ‌త శ‌క్తిని ప్రేరేపిస్తుంది. ఫ‌లానా బుక్ చ‌ద‌వాల‌ని లేదు..మీకు తోచిన బుక్ ను చ‌దువుతూ పోండి.

6.Scribing( రాయ‌డం)

 ఉద‌యం లేవ‌గానే…మీకు తోచిన లైన్స్ రాయండి… వీటిని మార్నింగ్ పేజెస్ అంటారు. ఇలా మీరు రోజూ రాస్తూ పోతే…మీ ఆటిట్యూడ్ లో మీకే తెలియ‌ని పాజిటివ్ వేవ్స్ వ‌స్తాయ్.

So….ఈ ప‌నుల‌న్నీ ఉద‌యం 8 లోపే చేయాలి. ఆల్ ది బెస్ట్…మీలోని మిమ్మ‌ల్ని నిద్ర‌లేపండి.

Dimensions

Dimensions అంటేఏమిటి కాస్త వివరించగలరా?

మనం ఏ dimension లో ఉన్నాం,సంక్షిప్త వివరణ.చదివి మరచిపోండి,మనది money meditation కాబట్టి,మొత్తం dimensions 7.

1వdimensions లో ఉన్నవారు భూమి యొక్క చివరి భాగంలో ఉంటారు,

2 వ dimension లో నాగజాతి వారు ఇతర భూమిలో నివసించే పురుగులు మిగతావి,

3 వ dimension లో మనం నివసిస్తున్నాం,అందుకే మనకు ఏ వస్తువైనా మూడు పక్కలు మాత్రమే దృష్టి గొచరమౌతుంది,ఒక చతురస్ర ఆకారాన్ని తీసుకున్నప్పుడు లోపలిపక్కతో సహా అది ఏడు భాగాలను కలిగి ఉంటుంది,మనకు మూడుపక్కలు మిత్రమే కనిపిస్తుంది.ఉదా;డై.లేదా అగ్గిపెట్టే.

4 వ dimension వారు మన పైన ఉంటారు.వీరిని భూత ప్రేత పిశాచాలు అనవచ్చు,వీరు 3 వ dimension లోకి రాగలరు,పైకి వెళ్ళలేరు,

5 వ dimension లో దేవదూతలు నివసిస్తారు వీరు 4వ dimension దాటి కిందకురాలేరు పైకి ఆరవ dimension కి వెళ్ళగలరు మనం రోజూ కనీసం మూడుగంటలు meditation చేస్తే నాలుగవ dimension లోకి వెళితే వీరు మనకు సహాయపడుతారు వీరినే మనం angles కూడా అనవచ్చు,

6వ dimension లో యోగులు ముని పుంగవులు గంధర్వులు అప్సరలు ఉంటారు,వీరు కిందకి రాగలరు 7వ dimension కి వెళ్ళలేరుదీనికై భాగవత కథ ఉదాహరణ. అందుకే ఆధ్యాత్మిక పరిభాషలో ఏడు లోకాలు,ఏడడుగులు,సప్తసముద్రాలు ఏడు జన్మలుగా చెప్పబడింది,

7 వ dimension లో దేవతలు ఉంటారు,అక్కడి కి చేరుకోగలిగితే అదే మోక్షంగా చెప్పబడింది,అక్కడ అందరూ ఒకేరూపంలో దర్శన మివ్వడం జరుగుతుంది ,

Tuesday, November 13, 2018

హిందూ ధర్మమే మంచిది కాకపోతే...???

1)సూర్యుడి నుంచి వెలువడుతున్న ఓంకారమని నాసా ఎందుకు పేర్కొన్నట్టు?

2) మన దేశీయ గోమూత్రం మీద అమెరికా 4 పేటెంట్లను పొంది క్యాన్సర్ ను నివారించే మందును కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తోంది. ఎందుకు!?

3) న్యూజెర్సీ "సిటాన్ హాలు" యూనివర్సిటీలో భగవద్గీత తప్పనిసరిగా చదవాలన్న నియమం ఎందుకుంది?

4) ముస్లిం దేశమైన  ఇండోనేసియా తన దేశ విమానయాన సంస్థకు "గరుడ ఇండోనేషియా ఎయిర్లైన్స్" అని, జాతీయ ఎంబ్లెమ్ కు "గరుడ పంచశిల" అని విష్ణు వాహనమైన గరుత్మంతుని పేర్లేందుకు పెట్టుకుంది?

5) ఇండోనేషియాలో అతిపెద్ద నోటైన ఇరవై వేల రూపయా మీద వినాయకుడి బొమ్మ ఉంటుందేం?

6) అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా తన జేబులో ఎప్పుడూ హనుమంతుడి చిత్రపటాన్ని పెట్టుకొని ఉంటాడెందుకూ?

7) యోగ, ప్రాణాయామాలకు ఈరోజు ప్రపంచంలో అంత గుర్తింపెందుకుంది?

8) వేల సంవత్సరాల క్రితమే భారతీయ యోగులు భూమి గుండ్రంగా ఉందని చెప్పారేం?

9) 'లుప్త', 'హంస' అంటే సంస్కృతంలో కనుమరుగవుతున్న  హంస. విమానం ఆకాశంలో పైపైకి ప్రయాణిస్తున్నకొద్దీ కనుమరుగవుతూ ఉంటుంది. ఈ అర్థం వచ్చేలా జర్మనీ విమానయాన సంస్థకు 'లుఫ్తాన్సా' అని పేరెందుకు పెట్టారు?

10) ఆఫ్ఘసిస్తాన్ లోని పర్వతాలను "హిందూకుష్" పర్వతాలని ఎందుకంటారు?

11) హిందువుల పేర్లతో
హిందీ భాష
హిందూస్తాన్
హింద్ మహాసాగర్ (ఇండియన్ ఓషన్)
అని ఎందుకంటున్నారు?

12) వియత్నాంలో నాలుగు వేల సంవత్సరాల నాటి శ్రీమహావిష్ణు విగ్రహం ఎలా కనిపించింది?

13) అమెరికా శాస్త్రవేత్త డా. హోవార్డ్ స్టెయిన్గెరిల్ పరిశోధన చేసి గాయత్రీ మంత్రం క్షణానికి 10 వేల ధ్వని తరంగాలను వెలువరిస్తుందని తేల్చారు. దీనివల్ల ఈ మంత్రం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మంత్రమని తెలిసింది. ఎందుకు?

14) స్వామి దయానంద సరస్వతి రాసిన "సత్యార్థ ప్రకాశ్" చదివి భగపత్ (యూపీ)లో

Monday, November 12, 2018

విష్వక్సేనుడు ఎవరు?

యస్య ద్విరద వక్త్రాద్యాః
పారిషద్యా పరశ్శతం
విఘ్నం నిఘ్నంతి సతతం
విష్వక్సేనం తమాశ్రయే

ప్రతి పదార్ధము:
యస్య  = ఎవరిని; ద్విరద =రెండు దంతములు గలది = ఏనుగు (దంతి అని కూడా అంటారు); వక్త్రః = ముఖము; ఆద్యః = కలిగియున్న; పారి = తొలగించు; షద్యః  = వెంటనే; పర = మరొక; శతం = నూరు; వంద; విఘ్నం = అడ్డంకి; నిఘ్నంతి = చంపు / తొలగించు; సతతం = ఎల్లప్పుడూ; విష్వక్సేనం = విష్వక్సేనుడు* (విష్ణువు యొక్క సైన్యాధిపతి); తం = వారిని; ఆశ్రయే = శరణు జొచ్చు, ఆశ్రించు.

తాత్పర్యము:
ఎవరైతే గజ ముఖుడైన, (విష్ణు సైన్యాదిపతియైన) విష్వక్సేనుని ఆశ్రయిస్తారో, ఆయన ఎల్లప్పుడూ మరొక వంద అడ్డంకులనైనా తొలగిస్తాడు.

విష్వక్సేనుడు  విష్ణు గణాలకు అధిపతి. విఘ్నేశ్వరుడు శివ గణాలకు అధిపతి. ఇద్దరూ గజ ముఖులే. కాకపొతే విఘ్నేశ్వరుడు ఏక దంతుడు, విష్వక్సేనుడు ద్విదంతుడు. వైష్ణవ ఆలయాలలో విష్వవక్సేనుడిని పూజిస్తారు. రూపు రేఖలలో యితడు వినాయకుని పోలి ఉంటాడు. వైష్ణవ ఆలయాలలో పారాయణం చేసే 'విష్ణు సహస్రనామ స్తోత్రం' లో మొదటి శ్లోకం అయిన "శుక్లాంబరధరం" తరువాత రెండవ శ్లోకంగా "యస్య ద్విరద వక్త్ర్యాద్యః" అనే ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తారు. ఈ శ్లోకం శ్రీమతి యం. ఎస్. సుబ్బలక్ష్మి గారు పాడిన విష్ణు సహస్రనామ స్తోత్రం లో ఉండదు. అయితే "శుక్లాంబరధరం" శ్లోకం గణపతి పైన అయినా కొందరు ఛాందసులు ఇది కూడా విష్ణు శ్లోకమే అని వాదించడం విన్నాను. ఎందుకంటే "శుక్లాంబరధరం విష్ణుం" లో విష్ణుం అని ఉంది కదా అని. కాని ఈ శ్లోకంలో "విష్ణుం' అంటే సర్వ వ్యాపకుడని అర్ధం.

+++++++++++++++++++++++

 విష్వక్సేనుడు

ఎవరైతే గజ ముఖుడైన, (విష్ణు సైన్యాదిపతియైన) విష్వక్సేనుని ఆశ్రయిస్తారో, ఆయన ఎల్లప్పుడూ మరొక వంద అడ్డంకులనైనా తొలగిస్తాడు.

విష్వక్సేనుడు విష్ణు గణాలకు అధిపతి. విఘ్నేశ్వరుడు శివ గణాలకు అధిపతి. ఇద్దరూ గజ ముఖులే. కాకపొతే విఘ్నేశ్వరుడు ఏక దంతుడు, విష్వక్సేనుడు ద్విదంతుడు. వైష్ణవ ఆలయాలలో విష్వవక్సేనుడిని పూజిస్తారు. రూపు రేఖలలో యితడు వినాయకుని పోలి ఉంటాడు.
వైష్ణవ ఆలయాలలో పారాయణం చేసే 'విష్ణు సహస్రనామ స్తోత్రం' లో మొదటి శ్లోకం అయిన "శుక్లాంబరధరం" తరువాత రెండవ శ్లోకంగా "యస్య ద్విరద వక్త్ర్యాద్యః" అనే ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తారు.
నిత్యం శ్రీమన్నారాయణుని సేవలో...

పూర్వం ఒకానొక భక్తుడు తన పుణ్యఫలం వలన వైకుంఠానికి చేరుకుని, ద్వారపాలకులైన జయ, విజయులను చూసి, నిత్యం స్వామి సేవలో ఉంటున్న వారి భాగ్యాన్ని చూసి పొగిడాడు. ద్వారపాలకులు తమ అదృష్టాన్ని ఒప్పుకున్నప్పటికీ, తమపై పెట్టబడిన బాధ్యత రీత్యా ఎప్పుడూ ద్వారం దగ్గరే ఉండిపోవాల్సి వస్తోందని, ఇంత వరకు వైకుంఠంలోకి వెళ్ళింది లేదనీ, అసలు వైకుంఠం లోపల ఎలా ఉంటుందో తమకు తెలియదని, అదే సమయంలో వైకుంఠంలోకి ఇలా వెళ్ళి, అలా వస్తుండే నారదుడు వంటి మునీశ్వరులే తమకంటే చాలా అదృష్టవంతులని అన్నారు.అనంతరం యాదృచ్ఛికంగా నారదుని చూసిన భక్తుడు, ఆయనతో ద్వారపాలకులు చెప్పిన విషయాలను ప్రస్తావించాడు. అతని మాటలతను విని సంతోషపడిన నార దుడు తాను వైంకుఠంలోకి వెళ్ళగలిగినప్పటికీ, ఎటువంటి అడ్డంకులు లేకుండా వైకుం ఠంలో సంచరించగలిగేది విష్వక్సేనుడూనని, అంతటి అదృష్టం తనకు దక్కలేదని చెబు తాడు.

ఆ మరుక్షణమే భక్తుడు, విష్వక్సేనుని ముందుకెళ్ళి ఆయన అదృష్టాన్ని పొగడు తాడు. అది విన్న విష్వక్సేనుడు, తన కంటే గరుత్మంతునిదే అదృష్టమని అనగా, ఆ గరు త్మంతుడు, తనకంటే స్వామి పాదాలను ఒత్తుతూ, తరిస్తోన్న లక్ష్మీదేవిదే అదృష్టమని అంటారు. మరి, ఆ లక్ష్మీదేవేమో, తనకంటే ఆదిశేషుడు గొప్ప అదృష్టవంతుడని చెబు తుంది. స్వామికి ఆదిశేషుడు చేస్తున్నంత సేవను తాను చేయలేకపోతున్నానని అం టుంది. భక్తుడు ఆదిశేషుని ముందు నిలబడి ఆయన అదృష్టాన్ని కీర్తించాడు. అది విన్న ఆదిశేషుడు, ‘మా అందరికంటే నువ్వే అదృష్టవంతుడివి. మేమందరం ఆయన కోసం పరుగులు పెడుతోంటే, ఆ పరంధాముడు మీ వంటి భక్తుల కోసం పరుగులు పెడుతు న్నాడు. అదృష్టమంటే మీదేగా!’ అని అన్నాడు.ఇదిలా వుండగా, ఒకసారి రాక్షసులు పెట్టే బాధలను ఓర్చుకోలేకపోయిన దేవతలు, వైకుంఠానికి వచ్చి, తమను రాక్షసుల బారి నుండి కాపాడవలసిందంటూ శ్రీమన్నారాయ ణుని ప్రార్తించారు.

అప్పుడు విష్ణుమూర్తి చంద్ర అనే వానిని పిలిచి, రాక్షసుల పని పట్ట మని చెప్పాడు. స్వామి ఆనతితో ఆ రాక్షసులను తనిమి తరిమి కొట్టిన చంద్ర యొక్క శౌర్యప్రతాపాలను మెచ్చుకున్న నారాయణుడు, అతనికి సర్వసైన్యాధిపత్యాన్ని ఇచ్చాడు. ఆయనే విష్వక్సేనుడు. శ్రీవైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణు రూపమే విష్వక్సేనుడని అం టారు. ఆయన సర్వమంగళనాయకుడు. విఘ్ననివారకుడు. ఎవరైతే విష్వక్సేనుని ఆరాధి స్తారో, ధ్యానిస్తారో, వారికి ఎలాంటి విఘ్నాలు, ఆపదలు, కష్టాలు కలుగవని వైఖాన సాగమం చెబుతోంది.మేఘశ్యాముడు, సుమణిమకుటధారి అయిన విష్వక్సేనునికి సూత్రవతీ, జయ అనేవారు భార్యలు. విష్వక్సేనుడు సమస్త దేవతాగణానికి అధిపతి. శ్రీమన్నారాయణునికి సేనాపతి. ‘విశ్వ’ అంటే ఈ సకలలోకాలను, ‘సేనుడు’ అంటే నడిపించేవాడని కూడ అర్థం. ఈ సృష్టిలో ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలకు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలనే పధ్నాలుగు భువన ఖండాలకు అధిపతి. శైవాగమం గణపతిని ప్రతిశుభకార్యంలో ముందుగా పూజించి, అగ్రతాంబూలాన్ని సమర్పించినట్లు, శ్రీవైఖానసాగమం,శ్రీ పాంచరాత్ర ఆగమం విష్వక్సే నుని ప్రతి కార్యక్రమంలోను పూజిస్తుంది.

శైవాగమం గణపతిని పసుపు ముద్దగా చేసి పూజిస్తే, శ్రీవైష్ణవాగమాలు విష్వక్సేనుని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినపుడు అది సంకల్పబలం చేతనే విజయవంతం అవుతుంది. బల మైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేము. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరిం చేది రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీకే సూత్రావతీ దేవి. ఎవరైతే సంక ల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించే మాత జయదేవి.వినాయకునికి సిద్ధి, బుద్ధి భార్యలు. అంటే, బుద్ధి కలిగినపుడే కార్యక్రమం తలపెడతాము. సంకల్పం తీసుకుంటాం. ఎవరికైతే, స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికే విజయం సిద్ధిస్తుందని శైవాగమం చెబుతుంది. శ్రీవైష్ణవ ఆగమాలు కూడ చెబుతున్నది అదే.

శ్రీవైఖానస ఆగమోత్తమ ప్రకారంగా నిత్యకైంకర్యాలు నిర్వ హించే తిరుమల ఆలయంలో స్వామికి నిత్యో త్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవ త్సరోత్సవాలలో విష్వక్సేనులవారు ప్రధాన పాత్ర వహిస్తారు.శ్రీవేష్ణవ ఆగమాలు విష్వక్సేనునికి అగ్రపూజ చేస్తాయి. విష్వక్సేనుల వారు నాలుగు భుజాలతో గోచరిస్తూ, శంఖు, చక్ర, గదలను ధరించి నాలుగువేళ్ళను మడిచి, చూపుడు వేలును పైకి చూపిస్తోన్న ముద్రతో దర్శనమిస్తుంటాడు. కొన్ని ప్రతిమలలో గదకు బదులుగా దండాయుధం కనబడుతుంటుంది. ఆ స్వామిని ఆశ్రయిస్తే చాలు, సమస్త దోషాలను హరించి, భక్తులలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు.యస్య ద్విరద వక్త్రాద్యాఃపారిషద్యాః పరశ్శతమ్‌విఘ్నం నిఘ్నంతి సతతంవిష్వక్సేనం తమాశ్రయేఅని ఆ స్వామిని ధ్యానిస్తూ ధన్యులమవుదాము. ఆ స్వామి సేవలో తరించిపోదాము.

Sunday, November 11, 2018

సూర్యభగవానుడి సర్వరోగ నివారణకు స్తోత్రం?


 🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము.

ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః |
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు |1|

ఇప్పుడే ఉదయించి ఉత్తరదిక్కుగా పయనిస్తూన్న సూర్యదేవుడు నా గుండెజబ్బును, కంటిజబ్బును, (కామెర్లు) త్వరగా పోగొట్టుగాక !

నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే |
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ |2|

అరనిముషంలో ఆకాశముపైరెండువేలరెండువందల రెండు యోజనాలు పయనించే పద్మబాంధవా ! నీకు నమోవాకం !

కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ |
ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ|3|

కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేద్రియాలు ఐదు, మనస్సు, జీవుడు, కూడా తానే అయి సకల సృష్టినీ కల్పించే ఆ ద్వాదశ మూర్తి నాకు ఆనందాన్ని, తృప్తిని కలిగించుగాక !

త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః |
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ |4|

సూర్యదేవా! మూడువేదాలు, వషట్కారము, ప్రపంచము, హంస, పరమహంస - నీవే-

శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ |
శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి |5|

శివరూపుడవైన నీవల్ల ఆత్మజ్ఞానమును, విష్ణురూపుడవైన నీవల్ల మోక్షమును, అగ్ని రూపుడవైన నీవల్ల ఐశ్వర్యమును, నీవల్ల ఆరోగ్యమును కోరుచున్నాను. అనుగ్రహించు.!

త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః |
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు |6|

చర్మదోషాలను, కంటిదోషాలను, హృదయదోషాలను, ఇంద్రియాల దోషాలను, సూర్యదేవుడు ఒకవిధమైన కోపరూపమైన అగ్నితో దగ్ధం చేయుగాక !

 తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః |
కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్ |7|

చీకటిని పోగొట్టినట్టు కంటిరోగాలను (రేచీకటి జబ్బును) రోగపటలమును, గాజును పగులగొట్టినట్టు రోగాలమూలమును కాలకర్త అయిన సూర్యభగవానుడు పోగొట్టుగాక !

యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః |
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః |8|

వేయికిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణభాగము చంద్రబింబము నందుండి రాత్రివేళ చీకటినంతనూ మటుమాయంచేసి వెలుగు కలిగిస్తుంది. అలాంటి సూర్యుడు నా ఆపదలను బాపుగాక !


యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం |
దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే |9|

ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటికచీకటిమయం , ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలదీ అవుతుందో ఏ భాస్కరుడు ఆపదల రూపుమాపుతాడో ఆ పద్మభాందవుణ్ణి ప్రార్ధిస్తాను.

వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర (ప్రమేహాంశ్చ) |
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి |10|

వాతరోగం, చర్మరోగం, మహోదరం, అతిమేహం, గ్రహణి, భగంధరం అనే మహారోగాలను సూర్యదేవా ! నీవే పోగొట్టే దివ్యవైద్యుడవు.

ధర్మార్ధ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్ |
బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండ యతుచండాంశుః |11|

ధర్మార్ధ కామమోక్షములను సాధించే కర్మలను చెయ్యనియ్యక మిక్కిలి తాపం కలిగించి ఇంద్రియాలను బంధించే రోగాలను చండకరుడైన సూర్యుడు చెండాడుగాక ! మా ఎడల కరుణ జూపించుగాక !

త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః |
త్వం త్రాతా త్వం హర్తావిపదాం ; అర్క ! ప్రసీద మమ |12|

సూర్యదేవా! నీవే నాతల్లివి, నీవేదిక్కు, నాకు కావలసింది ఇచ్చే దాతవు నీవే.! నీవే ధనం, మంచి చెడ్డలను బోధించే గురువు నీవే. రక్షకుడవు, ఆపదలను పోగొట్టే వాడవు నీవే! నన్ను అనుగ్రహించు.

ఫలశ్రుతి............

ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతితం  |
పఠతాం భాగ్యసమృద్ధిః సమస్త రోగక్షయ స్స్యాత్ ||

ఇలాగ పన్నెండు ఆర్యావృత్తములు ఆకాశం నుంచి సాంబుని ముందు పడినవి. వీటిని శ్రద్ధాభక్తులతో చదివేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది. అన్ని జబ్బులూ అంతరిస్తాయి.

Friday, November 9, 2018

కార్తీక మాసంలో ఉసిరికి అంత ప్రాధాన్యం ఎందుకు!



    కార్తీక మాసం అనగానే దీపారాధన, తులసి పూజ, వనభోజనాలు, కార్తీక స్నానం… వంటి నియమాలెన్నో గుర్తుకువస్తాయి. కానీ మన పెద్దలు ఈ నియమాలన్నింటికీ ఉసిరిని కూడా జోడించారు. ఉసిరి కాయ మీద వత్తిని వెలిగించడం, క్షీరాబ్ది ద్వాదశినాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడం, ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేయడం, వీలైతే ఉసిరి నీడ పడుతున్న నీటిలో స్నానం చేయడం వంటి ఆచరణలు మంచివని సూచించారు. మన ఆరోగ్యానికీ, పర్యావరణానికి మేలు చేసే వృక్షాలను దేవతా మూర్తులుగా భావించి కొలవడం మన ఆచారాలలోని గొప్ప విషయం. అందుకనే అత్యంత విశిష్టమైన తులసితో పాటుగా ఉసిరికి కూడా కార్తీక మాసంలో ప్రాధాన్యత ఇచ్చారు.
సకల వ్యాధులనూ నివారించి దీర్ఘాయువుని ప్రసాదించే అమృతంతో ఉసిరిని పోల్చడం సహేతుకంగానే తోస్తుంది. ఇక ఉసిరికి ఆయుర్వేదంలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు! ఆయుర్వేదంలో ఆరు రుచులన పేర్కొంటారు అవి… మధురం (తీపి), ఆమ్లం (పులుపు), కషాయం (వగరు), లవణం (ఉప్పదనం), కటువు (కారం), తిక్తం (చేదు). ఏ ఆహారపదార్థలోనైనా వీటిలో రెండో, మూడో, నాలుగో రుచులు కనిపిస్తే గొప్ప కానీ ఉసిరిలోని అద్బుతం ఏమిటంటే ఉప్పదనం తప్ప మిగతా అయిదు రుచులూ కనిపిస్తాయి. ముఖ్యంగా ఆమ్ల గుణం కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆమలకము లేదా ఆమ్లా అని పిలుచుకోవడం కద్దు. పైగా ఉసిరిలో తక్కువైన ఆ ఒకే ఒక్క లవణాన్ని కూడా చేర్చి అన్నంలో కలుపుకుని తినడం ద్వారా సంపూర్ణమైన ఆహారాన్ని స్వీకరించేవారు మన పెద్దలు. చలి విజృంభించే కార్తీక మాసాన కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ పరిహరింపబడతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదే! ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మకం. ఉసిరిలోని విటమిన్‌ సి ఈ మాసంలో వచ్చే కఫ సంబంధమైన జబ్బులను నివారిస్తే, అందులోని పీచు, ఆమ్ల గుణాలు జీర్ణ సంబంధ సమస్యలను తీరుస్తాయి.

అందుకే కార్తీక మాసం యావత్తూ ఉసిరికి సంబంధించిన నియమాలు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశినాడు `ధాత్రి సహిత లక్ష్మీనారాయణస్వామినే నమః` అంటూ విష్ణుమూర్తిని కొలుచుకుంటారు (ధాత్రి అంటే ఉసిరి). ఉసిరిని సాక్షాత్తూ విష్ణుస్వరూపంగా కొలుచుకుంటారు హైందవులు. అలాంటి ఉసిరి కాయలు, కొమ్మలు, చెట్టు సమీపంలో ఉండేలా అనేక నియమాలను ఆచరిస్తారు. ఉసిరిని సేవిస్తారు. అప్పటి వరకూ కురిసిన వర్షాలతో బలాన్ని పుంజుకున్న ఉసరి కూడా ఈ సమయంలో చక్కటి కాయలతో, పచ్చటి కాండంతో శక్తిమంతంగా ఉండి సకల ఆరోగ్యాలనూ ప్రసాదించేందుకు సిద్ధంగా ఉంటుంది.

కార్తీకమాసంలో ఉపవాసం చేయాలనుకుంటే ఇలా చేయండి

ముందుగా ఉపవాసం అంటే ఏమిటో తెలుసుకుందాం

ఉప అంటే  సమీపంలో అని,  వాసం అంటే ఉండటం అని అర్ధం . అంటే ఉపవాసం అనే పదానికి దగ్గరగా ఉండటం అని అర్థం. దేనికి దగ్గరగా ఉండటం? ఈ ప్రశ్నకి సమాధానం ఎందుకు ఉపవాసం చేస్తున్నామో తెలిసి ఉంటే తెలుస్తుంది. ఉపవాసం భగవదనుగ్రహం కోసం చేస్తారన్నది జగద్విదితమైన విషయం. కనుక ఉండవలసింది భగవంతుని సమీపంలో. ఇంటిపని వంట పని తగ్గితే సమయమంతా భగవద్ధ్యానంలో గడపటానికి వీలుగా ఉంటుంది. అప్పుడు వంటికి కూడా పని తగ్గుతుంది. బరువైన, అరగటానికి కష్టమైన ఆహారం తీసుకోక పోవటంతో జీర్ణ వ్యవస్థకి వెచ్చించాల్సిన శక్తి కూడా భగవద్ధ్యానానికో, పూజకో  వెచ్చించటానికి వీలవుతుంది. కడుపు నిండా తినగానే కునుకు వస్తుంది చాలమందికి.  ఎందుకంటే శక్తి అంతా జీర్ణాశయం దగ్గరకి వెళ్ళి పోయి ఉంటుంది. మెదడుకి శక్తి సరఫరా తగ్గుతుంది. దానివలన భగవంతుని ధ్యాస కుదరదు. Concentration.
అందుకే  ఉపవాసం అనే కాన్సెప్ట్ ద్వారా దేవునికి దగ్గర అవుతాము. ఇందులో శరీర ఆరోగ్య రహస్యం కూడా ఉంది. లంఖణం పరమ ఔషధం అన్నారు మన పెద్దలు. ఇలా వారానికో మాసానికో ఉపవాసం చేయడం ద్వారా    జీర్ణ వ్యవస్థ రిపేర్ అయ్యి బాగా పనిచేస్తుంది. మన ఋషులు ఆధ్యాత్మికము ద్వారానే   మన శ్రేయస్సు ఏర్పాటు చేసారు. ఇది గగ్రహించక కొంతమంది ఉపవాసం   పేరిట ఏదీ తినకుండా   మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు.

ఉపవాసంలో రకాలు :

 వండని పదార్ధాలతో ఉపవాసం : ఈ ఉపవాసం ఆహారపదార్ధాలకు బదులుగా పండ్లు, పచ్చికూరగాయలు తింటారు.

 పానీయాలతో ఉపవాసం : ఇందులో ఆహారానికి బదులుగా మంచి నీళ్ళు, పండ్ల రసాలు, కూరగాయల రసాలు, హెర్బల్‌ టీ, గోరువెచ్చటి నీరు, నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం చేయడం .

వండిన పదార్ధాలతో ఉపవాసం : ఈ తరహా ఉపవాసంలో ఉడికించిన కూరగాయలు, వండిన పెసరపప్పును, గింజలను తీసుకుంటారు.

 సంపూర్ణ ఉపవాసం : ఈ తరహా ఉపవాసం చేసేవారు మంచి నీళ్ళు కూడా తాగరు. జేష్ఠ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశి ఇలాంటిదే .

ఉపవాసం అలవాటు లేకుండా అప్పుడే కొత్తగా మెదలు పెట్టేవారు తక్కువ సమయం ఉపవాసం చేసి ఆ తరువాత ఎక్కువ రోజులు చేయడానికి ప్రయత్నించాలి. ఏమి తినకుండా , ఒక్కసారి భోజనం చేసి లేదా ఆహార పదార్ధాలను కొన్నింటిని మినహాయించుకుని తినవచ్చు. ఉపవాసం పూర్తయ్యాక ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా తీసుకోకూడదు. ఈ విషయాన్ని మరువరాదు.

ఉపవాస సాఫల్యత అది పూర్తయ్యాక తీసుకునే ఆహారం పైనే ఆధారపడి వుంటుంది. ఉపవాస సమయంలో పొట్టలో ఖాళీయైన స్థానంలో తిరిగి అధికంగా చేర్చినట్లయితే ఉపవాసం వల్ల ప్రయోజనం వుండదు. మితిమీరిన సమయంలో ఉపవాసం చేస్తే జీవక్రియను దెబ్బతీస్తుంది. జీర్ణ శక్తి తగ్గుతుంది. శరీరం బలహీన పడుతుంది. అందువల్ల ఉపవాసం ఎలా, ఎంతకాలం చేయాలనే విషయం తెలుసుకుని ఆచరించాలి.  ఉపవాసంలో తాజాగా తీసిన పండ్లు, కూరగాయల రసాలు మంచివి. శారీరకంగా, మానసికంగా బాధపడే సమయంలో ఉపవాసం ఉండకూడదు. అలాగే మహిళలు రుతుస్రావం, గర్భినీ సమయంలో, శరీరం బలహీనంగా, అలసటచెంది ఉన్న సమయంలో ఉపవాసం చేయడమనేది ఎంత మాత్రము మంచిది కాదు.

ఈ విధమైన ఉపవాసాలు చేయవచ్చు

 ఏక భుక్తం : అంటే ఒక పూట భోజనం చేయడం. ఉదయం భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవడంను ఏక భుక్తం అంటారు.

 నిరాహారం : రెండు పూటలా పాలు పళ్ళు మాత్రమే తీసుకొని వండినవి తినకపోవడం.

 నక్తం : ఇది చాలా విశేషం అయినది. ఉదయం నుండి పాలు పళ్ళు ఫలహారాలు మాత్రమే స్వీకరించి సాయంత్రం నక్షత్రాలు రాగానే భోజనం చేయడం. ఈ కార్తీకమాసంలో ఇది చాలా మంచిది.

 చివరగా ఒక మాట భగవంతుని పైన మనసు లగ్నము చేయకుండా, భగవంతుని సమీపంలో ఏమాత్రమూ గడపకుండా  ఎంత   చేసినా వ్యర్ధమే

Wednesday, November 7, 2018

లక్ష్మీదేవి పూజా విధానం (Laxmi devi puja vidhanam)

👉 పూజకు కావలసిన వస్తు సామగ్రి

    తోరణములకు మామిడి ఆకులు
    దీపములుకు మట్టితోచేసిన ప్రమిదలు
    దీపారధనకు ఆవు నెయ్యి లేదా నువ్వులనునె
    నూలువత్తులు (దీపారధనకొరకు)
    పువ్వులు (తామర పుష్పములు)
    కుంకుమ
    పసుపు
    అగరువత్తులు
    సాంబ్రాణి
    గంధపు లేహ్యము

👉 పంచామృతము కొరకు కావాలసినవి :

    ఆవుపాలు
    ఆవుపెరుగు
    తేనె
    చేరుకుగడరసము లేదా పంచదార
    నెయ్యి.

ముందుగా అమ్మవారి పటము అలంకారం చేసుకొని పెట్టుకొని ఆ పైన 2 తమలపాకుల్లో పసుపు గణపతి ని చేసుకొని సిద్ధంగా ఉండాలి.   పూజ చేసేవారు దంపతులుగా కూర్చుంటే మంచిది. వీలుకాని పక్షంలో ఒక్కరే చేసినా తప్పులేదు. మగవారు పంచ కండువ, స్త్రీలు చీర కట్టుకొని ముఖాన కుంకుమ ధరించి  పూజించాలి. శార్టులు నైటీల పైన పూజ చేయరాదు. స్త్రీలు కాళ్ళకు పసుపురాసుకొని కూర్చోవాలి. 

👉 పసుపు గణపతి పూజ

శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)

శ్లో // ఆగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
👉 (గంటను మ్రోగించవలెను)

✋ ఆచమనం

ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,
👉 (అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ //
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ //
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే //

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే //

👉 (ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

👃🏻 ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవి -- ప్రచోదయాత్
ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

✊ సంకల్పం

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత

వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన శ్రీ విళంబి నామ  సంవత్సరే  దక్షిణాయనే,    శరత్  ఋతౌ , ఆశ్వీయుజ  మాసే, కృష్ణ  పక్షే అమావాస్యాం  తిథౌ, సౌమ్య  వాసరే  శుభ నక్షత్రే  శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ, శ్రీమాన్ (మీ

గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య  ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీ మహా లక్ష్మి దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

👉 (అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

🏺 కలశారాధనం

శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

👉 (కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)

శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

👉 (కలశములోని జలమును పుష్పముతో 🌸 దేవునిపైనా పూజాద్రవ్యములపైన, తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)

  // శుక్లాంబర - - - ఉపాస్మహే !!

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

👉 (అక్షతలు వేయవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి 👣

👉 (నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి 🖐

(👉 నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి

👉 (నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి👕

👉 (అక్షతలు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి⭕

👉 (గంధం చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి❄

👉 (అక్షతలు చల్లవలెను)

👉 పుష్పం  గరిక మారేడు దళములతో పూజించాలి.

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ, నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.

మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

👉 (అగరవత్తుల ధుపం చూపించవలెను.)

దీపం దర్శయామి  🔥

నైవేద్యం 🍋🍊🍌

ఓం భూర్బువస్సువః  ---   ప్రచోదయాత్

సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

👉 (బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

👉 (నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.

👉 (తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)

వక్రతుండ     మహాకాయ కోటి సూర్య సమప్రభ !
నిర్విఘ్నం కురుమేదేవా సర్వ కార్యేషు సర్వదా !!

శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

👉 (అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

👉 తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)

లక్ష్మి  ప్రాణప్రతిష్ఠ మంత్రము

రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః
పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్
బిబ్రాణా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా
దేవీబాలార్కవర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః //

సాంగాం సాయుధాం సపరివారాం శ్రీ మహాలక్ష్మీ పరదేవతాం ఆవాహితాః స్థాపితాః సుప్రితా సుప్రసన్నా వరదాభవతు.

👉 అమ్మవారి పైన అక్షతలు వేయాలి.

🙏 ధ్యానం: 🙏

👉 (పుష్పము 🌹  చేతపట్టుకొని)

పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే
నారాయణ ప్రియేదేవి సుప్రీతా భవసర్వదా
లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాంలోకైక దీపాంకురాం
శ్రీమన్మన్ద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాంత్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్ //
శ్రీలక్ష్మీదేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి
👉 (పుష్పము వేయవలెను).

🙏 నమస్కారమ్ 🙏
(పుష్పము తీసుకొని)

క్షీరదార్ణవ సంభూతే శ్రీప్రదే కమలాలయే /
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే // శ్రీలక్ష్మీ దైవ్యై నమః నమస్కారమ్ సమర్పయామి.
👉 (పుష్పము వేయవలెను.)

🤲 ఆవాహనం:

శ్లో. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షః స్థలాలయే /
ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా //
శ్రీలక్ష్మీ దేవ్యై నమః ఆవాహయామి
👉 (పుష్పము వేయవలెను).

💢 రత్నసింహాసనం:

శ్లో//సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే
రత్న సింహాసనమిధం దేవీ స్థిరతాం సురపూజితే
శ్రీలక్ష్మీదేవ్యై నమః రత్నసింహాసనం సమర్పయామి
👉 (అక్షతలు వేయవలెను.)

👣 పాద్యం: 👣

శ్లో//సువాసితం జలంరమ్యం సర్వతీర్థ సముద్భవం
పాద్యం గృహణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే

శ్రీలక్ష్మీదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి
👉 (నీరు చల్లవలెను.)

👋 అర్ఘ్యం:👋

శ్లో//శుద్దోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దాశ్యామి తే దేవి గృహణ సురపూజితే
శ్రీలక్ష్మీదేవ్యై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి
👉 (నీరు చల్లవలెను.)

✋ ఆచమనం:

శ్లో//సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతాం
గృహణాచమనం దేవిమయాదత్తం శుభ ప్రదే

శ్రీలక్ష్మీదేవ్యై నమః శుద్దాచమనీయం సమర్పయామి
👉 (నీరు చల్లవలెను.)

🍨 మధుపర్కం: 🍨
(పెరుగు,తేనె,నేయి,నీరు,పంచదార వీనిని మధుపర్కం అంటారు.)

శ్లో//మధ్వాజ్యదధిసంయుక్తం శర్కరాజలసంయుతం
మఢఃఉపర్కం గృహాణత్వం దేవి నమోస్తుతే
శ్రీలక్ష్మీదేవ్యై నమః మధుపర్కం సమర్పయామి
(పంచామృత స్నానానికి ముందుగా దీనిని దేవికి నివేదన చేయాలి.పంచామృతాలతో సగం అభిషేకించి మిగిలిన దనిని దేవికి నైవేద్యంలో నివేదన చేసి

స్నానజలంతో కలిపి ప్రసాద తీర్ధంగా తీసుకోవాలి.)

పంచామృతస్నానం, ఫలోదక స్నానం చేయించాలి.

శ్రీలక్ష్మీదేవ్యై నమః పంచామృత స్నానాంతరం శుద్దోదక స్నానం సమర్పయామి.

💦 స్నానం: 💦

శ్లో//గంగాజలం మయానీతం మహాదేవ శిరస్ఠఃఇతం
శుద్దోదక మిదం స్నానం గృహణ సురపూజితే
శ్రీ లక్ష్మీదేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి
👉 (దేవికి నీళ్ళుతో స్నానము చేయాలి/ నీరు చల్లాలి
ఇక్కడ     రుద్రం శ్రీ సూక్తం చెప్పుకోవచ్చు. మీకు రాకపోతే youtube లో Play చేసుకొని అది అయిపోయేంతవరకు అభిషేకం చేస్తూ ఉండండి )

వస్త్రం:🌈

శ్లో//సురార్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహణ సురపూజితే
శ్రీ లక్ష్మీదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి

ఉపవీతం:⚡

శ్లో//తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ వీభూషితం
ఉపవీతం ఇదం దేవి గృహణత్వం శుభప్రదే
శ్రీలక్ష్మీదేవ్యై నమః ఉపవీతం (యజ్ఞోపవీతం) సమర్పయామి.

గంధం:⭕

శ్లో//శ్రీఖంఠం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం
విలేపనం సురశ్రేష్ఠే చందనం ప్రతిగృహ్యతాం
శ్రీలక్ష్మీదేవ్యై నమః గంధం సమర్పయామి
👉 (గంధం చల్లవలెను.)

💫 ఆభరణములు: 👑

శ్లో//కేయూర కంకణ్యైః దివ్యైః హారనూపుర మేఖలా
విభూష్ణాన్యమూల్యాని గృహాణ సురపూజితే
శ్రీలక్ష్మీదేవ్యై నమః ఆభరణార్ధం అక్షతాన్ సమర్పయామి.
👉 (పుష్పములు, అక్షతలు సమర్పించవలెను)

అక్షతాః :

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్
హరిద్రాకుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధి పుత్రికే //
శ్రీలక్ష్మీదేవ్యై నమః అక్షతాన్ స్మర్పయామి
👉 (అక్షితలు వేయవలేను.)

🌷 పుష్పసమర్పణం (పూలమాలలు): 🥀

శ్లో//మల్లికాజాజి కుసుమైశ్చ చంపకా వకుళైస్థథా
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరప్రియే
శ్రీలక్ష్మీదేవ్యై నమః పుష్పాంజలిం సమర్పయామి.

👉 (పుష్పాములు వేయవలెను)


💛  పసుపు:

హరిద్రా చూర్ణమేతద్ది స్వర్ణకాంతి విరాజితం
దీయతే చ మహాదేవి కృపయా పరిగృహ్యతామ్ //
శ్రీలక్ష్మీదేవ్యై నమః హరిచంద్రాచూర్ణం సమర్పయామి.

🔴  కుంకుమ:

శ్రీలక్ష్మీదేవ్యై నమః కుంకుమ కజ్జలాది సుగంద ద్రవ్యాణి సమర్పయామి.

🔔 అథాంగపూజా: 🔔

చంచలాయై నమః పాదౌ పూజయామి 👣
చపలాయైఅ నమః జానునీ పూజయామి 👣
పీతాంబర ధరాయై నమః ఊరూ పూజయామి 👣
కమలవాసిన్యై నమః కటిం పూజయామి 👣
పద్మాలయాయై నమః నాభిం పూజయామి 👣
మదనమాత్రే నమః స్తనౌ పుజయామి 👣
లలితాయై నమః భుజద్వయం పూజయామి 👣
కంబ్కంఠ్యై నమః కంఠం పూజయామి 👣
సుముఖాయై నమః ముఖం పూజయామి 👣
శ్రియై నమః ఓష్ఠౌ పుఅజయామి 👣
సునాసికాయై నమః నాసికం పూజయామి 👃🏻
సునేత్రాయై నమః నేత్రే పూజయామి 👀
రమాయై నమః కర్ణౌ పూజయామి 👂👂
కమలాలయాయై నమః శిరః పూజయామి 😌
ఓం శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. 😌


శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి.

👉 మంచి సువాసనతో కూడిన పువ్వులతో అర్చన చేయాలి.
మల్లెలు, గులాబీలు, సంపెంగలు వంటివి మంచివి

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్దాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై / వాచే నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం పద్మాయై /శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై / లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః
ఓం ఆదిత్యై / దిత్యై నమః
ఓం దీప్తాయై / వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై / కమలాయై నమః
ఓం కాంతాయై / కామాక్ష్యై నమః
ఓం క్రోధసముద్భవాయై నమః
ఓం అనుగ్రహప్రదాయై నమః
ఓం బుద్ద్యై / అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై / అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమలాదరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగందిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యై / శివాయై నమః
ఓం శివకర్యై / సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం దారిద్రనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాగ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం హరిణ్యై నమః
ఓం ధనధాన్యకర్త్యై నమః
ఓం సిద్ద్యై నమః
ఓం స్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై / మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణసమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్యధ్వంసిన్యై / దేవ్యై నమః
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః

❄ ధూపం: ❄

శ్లో//వనస్పత్యుద్భవైర్ధివ్యై ర్నానాగందైః సుసంయుతః
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
శ్రీలక్ష్మీదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి.

🔥 దీపం: 🔥

ఘృతాక్తవర్తి సంయుక్తం అంధరాశి వినాశకం //
దీపం దాస్యామి తే దేవి గృహణ ముదితాభవ //
శ్రీలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి //

🍊🍎 నైవేద్యం: 🍇🍌

శ్లో//అన్నం చతురిధం స్వాదు రసైః సర్పిః సమనిత్వం
షడ్రసోపేతరుచిరం దధిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే //
శ్రీలక్ష్మీదేవ్యై నమః మహానైవేద్యం సమర్పయామి //
నైవేద్యం గృహ్యతాం దేవి భక్తిర్మే హ్యచలాంకురు

👉 (మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)

ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా
ఓం సమనాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అమృతాభిధానమపి - ఉత్తరాపోశనం సమర్పయామి
👐 హస్తౌ పక్షాళయామి - 👣 పాదౌ ప్రక్షాళయామి - శుద్దాచమనీయం సమర్పయామి.

🥛 పానీయం :

ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యతాందేవి శీతలం సుమనోహరమ్ //
శ్రీలక్ష్మీధేవ్యై నమః పానీయం సమర్పయామి //

🍀🍀 తాంబూలం: 🍀🍀

శ్లో//పూగీఫలైశ్చ కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతం
కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీలక్ష్మీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి /

🔥 నీరాజనం: 🔥

శ్లో//నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహేణ సురపూజితే
సంతత శ్రీరస్తు,సమస్తమంగళాని భవంతు,నిత్యశ్రీరస్తు,నిత్యమంగళాని భవంతు.
శ్రీలక్ష్మీ దేవ్యై నమః నీరాజనం సమర్పయామి //

(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)

🥀 మంత్రపుష్పమ్: 🥀

'లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం" ఇత్యాది పఠింపవలెను.

శ్రీలక్ష్మీదేవ్యై నమః సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి.

ప్రదక్షిణ

(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)

శ్లో//యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి
శ్రీలక్ష్మీదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

👉 సాష్టాంగ నమస్కారం: ( స్త్రీలు మోకాళ్ళ పైన మాత్రమే చేయాలి )

నమస్తే లోకజనని నమస్తే విష్ణు వల్లభే
పాహిమాం భక్తవరదే శ్రీలక్ష్మ్యైతే నమో నమః
శ్రీలక్ష్మీదేవ్యై నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి

🙏 ప్రార్ధనం: 🙏

శ్లో// సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి స్వరూపిణి
పూజాం గృహాణ కౌమురి జగన్మాతర్నమోస్తుతే

శ్రీలక్ష్మీదేవ్యై నమః ప్రార్దనాం సమర్పయామి

సర్వోపచారాలు:

☂ చత్రమాచ్చాదయామి, ❄ చామరేణవీచయామి, 🌟 నృత్యందర్శయామి,
🗣 గీతంశ్రాపయామి, ✨ ఆందోళికంనారోహయామి
✨ సమస్తరాజోపచార పూజాం సమర్పయామి. ✨
శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వోపచారాన్ సమర్పయామి


🙌  క్షమా ప్రార్థన: 🙌

(అక్షతలు నీటితో పళ్ళెంలో విడువవలెను)

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశవ్రి
యాత్పూజితం మాయాదేవీ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మిక
శ్రీలక్ష్మీదేవ్యై నమః సుప్రీతా స్సుప్రసన్నో వరదో భవతు సమస్త సన్మంగళాని భవంతుః
శ్రీ దేవి పూజావిధానం సంపూర్ణం

(క్రింది శ్లోకమును చదువుచు అమ్మవారి తీర్థమును తీసుకొనవలెను.)

అకాల మృత్యుహరణమ్ సర్వవ్యాది నివారణం
సర్వపాపక్షయకరం శ్రీదేవి పాదోదకం శుభమ్ //

(దేవి షోడశోపచార పూజ సమాప్తం.)

Monday, November 5, 2018

నరక చతుర్దశి నాడు ఏమి చేయాలి ?

దీపావళి సమయంలో నువ్వుల నూనెతో తలంటి స్నానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చతుర్దశి నాడు - దీపావళి అమావాస్య సమయాలలో నువ్వుల నూనెను లక్ష్మిదేవి ఆవహించి ఉంటుంది అని పెద్దలు చెప్తారు. తలంటికి ఉపయోగించిన నీళ్ళలో ఉత్తరేణి, తమ్మి చెట్ల ఆకులను వేసి వాటి కొమ్మలతో ఆ నీటిని బాగా కలియబెట్టాలి. ఇలా చేసినందు వల్ల మెదడును, నాడులను ఉత్తేజితం చేసే భాస్వరం తయారై, ఆ జల స్నానం వల్ల బుద్ధి చురుకుదనం పెరుగుతుంది. “సీతాలోష్ట సమాయౌక్తః సంకట దళాన్వితః, మారపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః” ఈ శ్లోకం ద్వారా చతుర్దశి అభ్యంగాన్ని చెయ్యాలి.

ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వుల నూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం.

నరక చతుర్దశి నాడు నరక బాధ తప్పించిన 'సమరవర్తికీ (యమధర్మరాజు) ఉత్తరేణి ఆకులను తలపై పెట్టుకుని, పదునాలుగు నామాలతో, తిలలతో కూడిన జలాంజులను మూడేసి చొప్పున విడిచి పెట్టాలి.
1. యమాయ నమః 2. మృత్యువేనమః 3. వైవస్వతాయనమః 4. సర్వభూతక్షయా నమః 5. బధ్ధ్నాయనమః 6. పరమేష్టినే నమః 7. చిత్రాయ నమః 8. ధర్మరాజాయ నమః 9. అంతకాయ నమః 10. కాలాయ నమః 11. ఔదుంబరాయ నమః 12. నీలాయ నమః 13. వృకోదరాయ నమః 14. చిత్రగుప్తాయతే నమః - అంటూ పదునాలుగు నామాలను ఉచ్చరిస్తూ, నామానికి మూడు తిలంజలులు చొప్పున మొత్తం 42 తర్పణాలను యమునికి సమర్పించవలేను. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు.

ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం. ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.

యమ నామములనుచ్చరించుచూ మూడు మూడు దోసీళ్ళ నీళ్ళు తర్పణమివ్వవలెను.
దీపావళి రోజు ఆయుర్వృద్ధి కోసం యమ తర్పణం

“చతుర్దశ్యాం తు యే దీపాన్‌, నరకాయ దదాతి చ |
తేషాం పితృగణా స్సర్వే నరకాత్‌ స్వర్గ మాప్నుయుః ||

శ్లో|| యమాయ ధర్మరాజాయ మృత్యవే చాన్తకాయచ౹
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ౹౹

ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్ఠినే౹
వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః౹౹.

అంటూ చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పెద్దలు చెబుతారు.

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...