Friday, October 16, 2020

సేవాపరాధములలో కొన్ని ఇవి


1. చెప్పులతో గుడికి వెళ్ళడం, 

2. ఉత్సవదినాలలో దైవ దర్శనం చేసుకోకపోవడం, 

3. దేవ విగ్రహాలు చూసి నమస్కరించక పోవడం, 

4. అశుచిగా దేవ దర్శనం చేసుకోవడం, 

5. ఒక చేత్తో దేవతలకు, పూజ్యులకు నమస్కరిచడం, 

6. దేవ విగ్రహాలముందు కాళ్ళు చాపి కూర్చోవడం, 

7. దేవ విగ్రహాల ముందు పెడ కాళ్ళ మీద కూర్చోవడం (మఠం వేసుకొని కూర్చోవాలి), 

8. దేవ విగ్రహం ముందు నిద్రించడం, 

9. దేవ విగ్రహం ముందు శృంగారం నెరపడం, 

10. దేవ విగ్రహం ముందు భోజనం చెయ్యడం (ఆ ప్రాంతాన్ని ఎంగిలి మయం చెయ్యడం), 

11. దేవ విగ్రహం దగ్గర బొంకడం, 

12. బాతాఖానీ వెయ్యడం, 

13. కేకలు వెయ్యడం, 

14. గట్టిగా మాట్లాడడం, 

15. జగడమాడడం, 

16. పరులను బాధించడం, 

17. వ్యంగ్యంగా మాట్లాడడం, 

18. నిష్ఠూరాలాడడం, 

19. నిందించడం, 

20. పొగడడం, 

21. దేవ విగ్రహం ముందు ఇతరులకు పాదాభివందనం చెయ్యడం (పరమాత్ముడొక్కడే పూజనీయుడక్కడ), 

22. దేవ విగ్రహం ముందు బూతులు మాట్లాడడం (అసలు ఎక్కడా మాట్లాడకూడదు), 

23. దేవ విగ్రహం ముందు అధోవాయువు వదలడం, 

24. శక్తి ఉండి కూడా దేవుని పూజించక పోవడం, 

25. పూజా ద్రవ్యాలను కాలితో తాకడం, 

26. దేవునికి నైవేద్యం సమర్పించకుండా తినేయడం, 

27. ఏ ఋతువులో వచ్చిన పండును తొలుతగా దేవునికి సమర్పించకుండా తినేయడం, 

28. పండో, కాయో తొలిపంట దేవునికి అర్పించకుండా తినేయడం, 

29. దేవ విగ్రహం ముందు దేవునికి వీపు చూపిస్తూ కూర్చోవడం, 

30. గురుదేవుని పూజించకపోవడం, 

31. తనను తాను పొగుడుకోవడం, 

32. దైవ నింద 

- ఈ ముప్ఫై రెండూ సేవాపరాధాలే. (గీత గోవిందం నుండి సేకరింపబడింది - నేమాని సూర్యనారాయణ)

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...