Monday, October 26, 2020

ఆది గురువు దక్షిణామూర్తి




భారతీయ సంస్కృతి ప్రపంచదేశాలకు అనుసరణీయం. మార్గదర్శనం చేస్తోందంటే ఈ సంస్కృతి వికాసానికి మూలం గురువే అన్న సత్యం బోధిస్తుంది. వ్యక్తి షోడశ సంస్కారాలు పరిపూర్ణం కావడానికి దోహదపడే వాడు గురువు.


అజ్ఞానతిమిరాన్ని పోకార్చి జ్ఞాన జ్యోతులు వెలిగించే గురువును ప్రత్యక్ష దైవంగా మన భారతీయ సంస్కృతి సాహిత్యాలు అభివర్ణించాయి.

''ఆలయం కరుణాలయం'' అని ఆది గురువు దక్షిణామూర్తి శంకరులను కీర్తించింది మన సంస్కృతి. గురు సేవ మహాభాగ్యంగా భావించి తరించిన ఎందరో సత్పుర్షులు ఈ వేద భూమిని మరింత పవిత్రం చేశారు.


వ్యక్తి క్రమ శిక్షణాత్మక జీవితాన్ని జన్మ ఉన్నంత వరకు ఒక మంచి సంస్కారంగా తెలియజేసిన మన సంస్కృతిలో గురువుకు ఉన్నత స్థానం ఈయ బడింది. మానవ సమాజం ఉన్నంత ఉత్తమ సంస్కారాలతో ఆదర్శవంతమైన జీవితం గడిపిన పురుషార్థాలను సుసంపన్నం చేసే ప్రక్రియలో గురుస్థానం ప్రముఖమైనది. వ్యక్తి పుట్టుకతో సంస్కార వంతుడు కావడానికి తొలి గురువు తల్లి.


ఆమె శిక్షణలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వ్యక్తి విద్యాసంస్కారం అలవరచు కోవడానికి గురువును ఆశ్రయిస్తాడు. గురువు ద్వారా లభించిన జ్ఞానాన్ని పదు గురికి పంచుతూ ఒక నాటి శిష్యుడు గురు స్థానానికి చేరుకుంటాడు. ఈ సందర్భంలో గురువు ఇచ్చే జ్ఞానాన్ని విశ్లేషిస్తూ ఒకచైనా సామెతను మనం స్మరించుకోవాలి. ఆ సామెత ఇలా వుంది.


''జ్ఞానం లేని జీవితం పండని పొలం రెండూ వ్యర్థమే''.

పై భావం ఏ దేశానిదైనా, ఏ భాషదైనా అంత రార్థం ఒక్కటే. గురు ముఖత: నేర్చిన జ్ఞానమే మనిషి జీవితాన్ని ఆదర్శ వంతం చేస్తుంది. అందుకే హయగ్రీవుని స్తుతిలో జ్ఞాన ఆనందాలకు హేతువుగా తెలియజేయడం జరిగింది. మన భారతీయ సంస్కృతి ఆది గురువుగా దక్షిణా మూర్తిని అభివర్ణించింది. ఆ శ్లోకం ఇలా వుంది...


గురవే సర్వలోకానాం

భిషజే భవ రోణినాం

నిధయే సర్వ విద్యానాం

దక్షిణా మూర్తయేనమ:


అన్న దక్షిణామూర్తి శ్లోకం దక్షిణామూర్తిని మేధ దక్షిణా మూర్తి గానూ, ఆదిగురువు గాను తెలియ జేస్తోంది. గురువు విశ్వానికి, జ్ఞానానికి వుండే సంబంధాన్ని విశదపరుస్తాడు. గురువంటే గమించే జ్ఞానం. అంథకారాన్ని తొలగించే జ్ఞానం. అచేతనం నుండి చేతనానికి తీసుకపోయే మార్గదర్శి. గురువు జ్ఞానాన్ని నిష్కామకర్మ రూపంగా శిష్యులకు అందిస్తాడు.


''పూర్వ దత్తేషు యా విద్యా'' అన్న విధంగా పూర్వ జన్మలో చేసిన పుణ్యం వల్లనే గొప్ప విద్య శిష్యునికి అలవడటానికి పుణ్యమూర్తి గురువే ఆధారం అవుతాడు. అందుకే గురుస్తుతిలో...


గురుమూర్తించి దాకాశం సచ్చిదానంద విగ్రహం

నిర్వి కల్పం నిరాబాధం దత్తమానంద మాశ్రయే

గురుస్తుతితో ధన్యులమౌదాం.


ఓం శ్రీ త్రిమూర్తి స్వరూప గురవేనమ:

ఓం నమో దక్షిణామూర్తియే నమః

ఓం మౌనవ్యాఖ్యా 


ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం

వర్శిష్ఠాంతేవస దృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |

ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం

స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||


వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం

సకలమునిజనానాం ఙ్ఞానదాతారమారాత్ |

త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం

జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ||


|| ఓం నమః శివాయ ||

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...