Wednesday, October 14, 2020

మంచి మాట

1. పూజ మధ్యలో మాట్లాడితే,  ఎవరితో మాట్లాడతామో వాళ్ళకి మన పూజ ఫలితం వెళ్తుంది అని శాస్త్ర వాక్కు. 

2. జపం చేసేటప్పుడు జపమాల మిస్టేక్ గా కూడా కింద పడకూడదు.. 

3. అగ్ని ఎక్కడ ఉన్న అది పవిత్రమైన భగవంతుడి శక్తి దాన్ని నోటితో ఊదడం, పవిత్రమైనవి అందులో వేయడం దోషం. 

4. మన శరీరం లో ఒక్కో అంగానికి ఒక్కో దేవత ఉంటారు. అవయవాల్ని తిట్టుకోవడం,  కొట్టుకోవడం దోషం. అలాగే పంచభూతాల్లో వేటిని కూడా తిట్టడం కానీ కోపంగా తన్నడం కానీ దాటడం కానీ చేయకూడదు. 

5. అరుణాచలం పుణ్యక్షేత్రం లో గిరి ప్రదక్షిణం రోడ్ కి ఎడమవైపు నుండే నడవాలి. కుడి వైపు ఎప్పుడూ దేవతలు ప్రదక్షిణ చేస్తారు. 

6. జున్ను పాలు తినరాదు. ఆవు ఈనిన 11 days లోపు ఆవు దగ్గరి పాలు తీసకోకూడదు. 

7. పడుకునేప్పుడు దైవ నామస్మరణ చేస్తూ  పడుకుని లేచేప్పుడు అదే నామం చెప్తిలో లేస్తే పడుకున్న సేపు కూడా దైవనామ స్మరణ ఫలితం వస్తుంది. 

8. వినాయకుడికి తులసి,  సూర్యనారాయణ స్వామి కి మారేడు వేయకూడదు. 

ఏకాదశి,  అమావాస్య, పౌర్ణమి, ద్వాదశి తులసి ని తుంచరాదు.  పూజకి,  దేవుడి పూజకి వేర్వేరుగా తులసి ని పెంచుకోవాలి. 

9. మన చుట్టూ ఎన్నో సూక్ష్మ శరీరాలుంటాయ్ అవి అన్నం లోని సారాన్ని తీసుకోవడానికి ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాయి.  అందుకే దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినడం ,  అన్నం ప్లేట్ లో పెట్టాక చాలా సేపటికి తినడం,  ప్లేట్ పెట్టి గట్టిగా అన్నం పెట్టాను రమ్మని పిలవడం,  మూతలు పెట్టకుండా ఉంచడం,  ఎండిపోయినవి తినడం నిషిద్ధం. అయితే ఏమౌతుంది అవి కూడా జీవులే కదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.  అయితే అవి అన్నం లోని సారమంతా తీసుకున్నాక మనము తింటే శక్తి రాదు,  మనసు పై ప్రభావం పడి పాపపు ఆలోచనలో లేక,  మానసిక ఒత్తిడి కో దారి తీయొచ్చు.  అందుకే ఎప్పుడూ అన్నం భగవత్ నైవేద్యం చేసి కాకి కి పెట్టి తినడం వల్ల వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి.  

10. తడి కాళ్లతో పడుకోకూడదు.  అన్నం తినే ముందు తిన్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి.


పంచభూతముల సమ్మిళితమే మన శరీరం !

1.ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం శబ్దము.

2.వాయువుకు ఉన్న గుణాలు  రెండు… శబ్దము, స్పర్శ.

3.అగ్నికి ఉన్న గుణాలు మూడు శబ్దము, స్పర్శ, రూపము.

4.జలముకు ఉన్న గుణాలు నాలుగు… శబ్ద, స్పర్శ, రూప, రసము (రుచి). 

5.భూమికి ఉన్న గుణాలు ఐదు… శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము (వాసన)లు.

ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు మన శరీరానికి ఉన్నాయి ! కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.

జలము… "గంధము" అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం కానీ బంధించలేము.

అగ్ని "రస, గంధము" లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమేగానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.

వాయువు " రస, గంధ, రూపము"లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.

ఆకాశము " రస, గంధ, రూప, స్పర్శ" లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.

శబ్దం కేవలం ఒకే ఒక గుణమున్న  ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు… ఏ గుణము లేని ఆ 🙏 నిర్గుణ పరబ్రహ్మ  🙏 ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు ?

అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే.. పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు‘ నిర్గుణుడ ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘ అహం బ్రహ్మాస్మి ’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే.

  -[ఋషుల ఉవాచ ]-

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...