పళని అంటే జ్ఞానఫలం అని అర్ధం. సుబ్రమణ్యస్వామివారి 6 దివ్య పుణ్య క్షేత్రాలలో పళని ఆలయం మూడవది. చుట్టూ పచ్చని చెట్లతో చాల అహ్లాదకరంగా వుంటుంది.ఇక్కడి స్వామివారి పేరు దండాయుధపాణి.
శివగిరి అనే కొండ మీద ఈ ఆలయం వున్నది.పైకి ఎక్కటానికి 659 మెట్లతో దారి వుంది.మెట్లదారిని ఆనుకునే రోడ్డు మార్గం వుంది.మెట్లకింద ప్రధాన ద్వారం ముందు కుడివైపున శ్రీసుబ్రమణ్యేశ్వరస్వామి వారి వాహనం నెమలి కన్పిస్తుంది.దానికి ఎదురుగా ఎడమవైపున విఘ్నేశ్వరుడు కొలువై వున్నాడు
విఘ్నేశ్వరస్వామి వారిని దర్శించుకుని మెట్లమార్గంలో వెళ్ళేవారు ఆలయం పైకి చేరుకుంటారు.
స్వామి వారికి కదంబ పుష్పాలంటే ఇష్టమని కదంబపుష్పాలవనాన్ని పెంచుతున్నారు.
అంతర్వేది (అంతర్, వేదిక) ఈ పేరెవరి వలన అంటే ఎవరు ఇక్కడ యాగం చేయడంవలన ఆ పేరు వచ్చింది?
బ్రహ్మ రుద్రయాగము చేసిన ప్రదేశము (కమలము)
ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి , యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదిక గా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు.
పూజలో అక్షతలు వాసన చూసి వెనక్కు వేసుకోవడంలో అంతరార్థం ఏమిటి?
అక్షతలు అనగా దెబ్బతిననివి, విరగనివి అని అర్థం. ఎటువంటి శతములు(దెబ్బలు) తగలని వాయువు రాకపోకలు నాసిక నుండే జరుగును. వాసన చూచుట లో అక్షతలకు శతములు ఉన్ననూ ఆ వాయువు పరిశుద్ధి చేయును. పరిశుద్ధమైన అక్షతలను వెనుకవైపు వేయునపుడు’ మేరోపృష్ట ఋషి: ‘ అని స్మరించాలి. మన వెనుకవైపు మేరుపర్వతము, ముందువైపు ఉదయాచలం, ఉత్తరమున హిమపర్వతం, దక్షిణమున వింద్యా ఉన్న భావనతో సంకల్పం చేసుకోవాలి. వెనుకవైపు ఉన్న మేరు పర్వతమునకు మన దృష్టి అందదు కావున మన భావనకు ప్రతీకగా అక్షతలను వెనకకు వేసి మేరుపర్వతమును ఆరాధిస్తాము.
కంచి గరుడ సేవ అని ఎందుకంటారు? అసలు ఈ జాతీయం ఎందుకు వచ్చింది?
శ్రీ మహావిష్ణువుకు అనుంగు వాహనం గరుత్మంతుడు. వైనతేయుడు పరాక్రమంలో దిట్ట. ఆకాశంలో గరుడిని చూడటం, అతడి మాట వినడం గొప్ప అదృష్టంగా భావిస్తారు భక్తులు. అందుకనే తిరుమల కోనేటిరాయుని బ్రహ్మోత్సవాల్లో గరుడవాహనంపై చిద్విలాసమూర్తి విహరిస్తుంటే దర్శించుకోవాలని కోట్లాది భక్తులు కోరుకుంటారు. అయితే ‘కంచి గరుడ సేవ’ అన్న జాతీయం ఆసక్తికరంగా ఉంటుంది. 108 దివ్యదేశాల్లో ఒకటైన పవిత్రమైన కంచిలో ఆ వైకుంఠనాథుడు శ్రీ వరదరాజ పెరుమాళ్‌గా భక్తులను అనుగ్రహిస్తుంటాడు. కంచిలో భారీ ఇత్తడి గరుడ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహంపైనే ఉత్సవమూర్తిని ఉంచి గరుడసేవ నిర్వహిస్తారు. దానిపై ఉండే స్వామి విగ్రహానికంటే గరుత్మంతుని వాహనం పెద్దదిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని సిద్ధం చేయడం కోసం ఈ ఇత్తడి గరుడ వాహనాన్ని కూడా శుభ్రం చేస్తారు. దాన్ని శుభ్రం చేసే క్రమంలో అలిసిపోతుంటారు. ‘ స్వామి వారి కోసం గరుడిని శుభ్రం చేస్తారు. ఇంత చేసినా ఈయనేమన్నా వరాలు ఇస్తాడా, అదేదో స్వామి వారికి చేస్తే మనకెంతో పుణ్యం కదా!’ అని వాపోతుంటారట. ఇదంతా కంచి గరుడ సేవరా నాయనా అని అనుకుంటారట. ఎప్పుడైనా మనం చేసిన పనులు వృథా అయినప్పుడు ఈ గరుడ సేవతో పోలుస్తూ ‘ కంచి గరుడ సేవ’ అనే జాతీయాన్ని వాడుతుంటారు.
అంతర్వేదిలో పార్వతీమాత అంశతో నీరాజనాలందుకుంటున్న మాత ఎవరు?
అశ్వరూడాంభిక(గుర్రాలక్క) ఆలయము.....
నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక ఆలయం ప్రధాన దేవాలయమునకు ఒక కిలోమీటరు దూరములో ఉంది. స్థల పురాణ రెండవ కథనం ప్రకారం రక్తావలోచనుడు వరగర్వంతో పాపాలు చేస్తున్నపుడు నరహరిఆతన్ని సంహరించేందుకు వస్తాడు. నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా బీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, పార్వతి అంశతో ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు. రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా ఆ మాయాశక్తి అశ్వరూపంలో తన నాలుకను విశ్వవ్యాపితం చేసి పడిన రక్తబిందువులను పడినట్లుగా పీల్చేస్తూ రక్తవలోచనుని మరణంలో శ్రీమహావిష్ణువుకు సహాయం చేస్తుంది. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గానూ మాయాశక్తి అశ్వరూడాంభిక గానూ వెలిశారు.
సుబ్రహ్మణ్యునికి తామ్రచూడుడు అనే కోడి పుంజును బహుకరించిన వారు ఎవరు?
తల్లి పార్వతీదేవి పిల్లవాడిని చూడగానే పరవశించి పోయి ఎదురు వచ్చి మూర్థన్య స్థానమునందు ముద్దు పెట్టుకుంది.
ఆయన కూడా పరవశించి మూడవవాడికి వినపడకుండా షణ్ముఖుడి కుడి చెవి దగ్గరకు తీసుకుని ఆయుష్మాన్ భావ అని ఆరుమాట్లు అన్నాడు.
ఇప్పుడు జరగవలసిన దేవకార్యం ఒకటి ఉంది. అదే తారకాసుర సంహారము.
సుబ్రహ్మణ్యుడి శక్తి సామాన్యము కాదు. తారకుడిని ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ తమ శక్తులన్నింటినీ కుమారస్వామికి ధారపోశారు.
పార్వతీ పరమేశ్వరులిద్దరూ కలిసి త్రిశూలము, పినాకము, పాశుపతాస్త్రము, గొడ్డలి, శక్తి, శూలములను (శూలము అమ్మవారి శక్తి) ఇచ్చారు.
శంకరుడు దగ్గర కూర్చోబెట్టుకుని శాంభవీ విద్యనూ కూడా కటాక్షించాడు.
బ్రహ్మదేవుడు వేదములను, యజ్ఞోపవీతమును, గాయత్రీ మంత్రమును, కమండలమును, బ్రహ్మాస్త్రమును, శ్రీమహావిష్ణువు వైజయంతీ మాల, కంఠహారము, ఐరావతమును, వజ్రాయుధమును, వరుణుడు ఒక శ్వేత ఛత్రమును, రత్నమాలను, సూర్యుడు మనోవేగము కలిగిన రథమును, కవచమును, యముడు యమ దండమును, చంద్రుడు అమృత కలశమును, అగ్ని మహాశక్తిని, వాయువు వాయవ్యాస్త్రమును, కుబేరుడు గదను, మన్మథుడు కామ శాస్త్రమును ఇచ్చారు. పాలసముద్రము అమూల్యమయిన రత్నములను, రత్నములతో కూడిన ఒక అందెను బహూకరించింది.
అమ్మవైపు తాతగారయిన హిమవంతుడు వచ్చి కట్టుకోమని పట్టుబట్టలు ఇచ్చాడు. గరుత్మంతుడు ‘చిత్రబర్హణుడు’ అనబడే ఒకనెమలిని, అరుణుడు ‘తామ్రచూడుడు’ అనే కోడి పుంజును బహూకరించారు. అదే కుక్కుట ధ్వజము.
పార్వతీదేవి వెనక్కి పిలిచి గొప్ప చిరునవ్వును కానుకగా ఇచ్చిందట.
అందుకే మీకు సుబ్రహ్మణ్య స్వామి స్వరూపములు అన్నిచోట్లా చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాయి.
అంతేకాక ఐశ్వర్యమును, చిరంజీవిత్వమును ఇచ్చింది. లక్ష్మీదేవి సంపదను, కంఠహారమును ఇచ్చింది. సావిత్రీదేవి సకలవిద్యలనుఆయనకు ఇచ్చారు. ఇప్పుడు దేవేంద్రుడితో దేవతలతో కలిసి ఆయన తారకాసుర, సంహారమునకు బయలుదేరాడు.
మనం పూజ చేసేటప్పుడు, అవలింటలు వేస్తే మళ్లీ స్నానం చేసి వచ్చి పూజ పూర్తి చేయాలి. కానీ ఎలా చేస్తే, స్నానం చేసిన ఫలితం ఉంటుంది.?
ఆవలించేటప్పుడు, కుడి చెవి నీ తాకితే, స్నానం చేసిన ఫలితం, ఎందుకు అంటే, గంగా దేవి, జాహ్ను మహర్షి కుడి చేవినుండి వచ్చినది కాబట్టీ....
No comments:
Post a Comment