వివరములు మరియు విశేష పరిహారము :
ఈ సంవత్సరము సెప్టెంబర్ 2, 2020 బుధవారం, నుండి మహాలయ పక్ష ప్రారంభం అవుతుంది. భాద్రపదమాస శుద్ధ పూర్ణిమ తదుపరి పితృపక్షం jమొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించబడినవి. పితృ దోషం అంటే అది ఒక శాపం అని గమనించాలి. కుటుంబ సభ్యులలో ఎవరైనా ప్రస్తుత జన్మలోనైనా గత జన్మలోనైన వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం, నష్టం కలిగించి వారిని భాద పెట్టి ఉంటే ఈ శాపం వరిస్తుంది. పిత్రుదోషం ఉన్న ఇంట్లో అని అపశ్రుతులు, ఇబ్బందులు, అనేక సమస్యలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులో లేక తాత, ముత్తాతలో తన కుంటుంబంలో ఎవరినో ఇబ్బంది కలిగించిన ఘోష ప్రభావం ఇందుకు కారణమని గ్రహించాలి.
పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు, శాపాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. సరైన వయస్సులో పెళ్ళిళ్ళు కాకపోవడం, సంతానం కాకపోవడం, వారితో సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు కలగడం మొదలగునవి కలుగుతాయి.
కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలో మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు ఉండటం వంటివి. ప్రతి మనిషీ తన జీవితంలో తప్పక పితృఋణం తీర్చు కోవాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం, వంశీయులు పితృ ఋణం తీర్చక పొతే వారికి ముక్తి లభించదు.
మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చెందిన పితృ దేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి.
ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధకర్మ నిర్వర్తించటం వలన పితరులకు తృప్తి కలుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది. పితరులను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు.
సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనలు ఇవ్వకుండా బాధపడి వెళ్ళిపోతారు, అది మంచిదికాదు. నిజానికి ప్రతి మాసంలోను అమావాస్య పితరుల పుణ్య తిథిగా భావించబడినా, తర్పణవిధి నిర్వర్తించలేక పోయినా, మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షంలో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవరూ శ్రాద్ధ విముఖులు కాకూడదు. శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది.
ఆదర పూర్వకంగా శ్రాద్ధ కర్మతో మరణించిన పెద్దలను (పితృదేవతలు) సంతోషపెడి తే వారు తమ సంతత వారికి ఆయుః, విద్య, ధనం, సంతానం, సమస్తము కలిగి ఉండేటట్లు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధకర్మలో నువ్వులు, బెల్లం కలిపిన అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాల లోనూ, గోదానము, అన్నదానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే 'మఖ' నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలాన్నిస్తుంది. ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటు వంటి ఫలితం లభిస్తుందని మహాభారతం లో భీష్మపితా మహుడు వివరంగా తెలియ జేసాడు,అలాగేవివిధపురాణాలఆధారంగాతెలుసుకోవచ్చు.
పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది,
ద్వితీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది,
తృతీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు,
చతుర్దినాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుం ది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసి గట్టగలరు,
పంచమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన (సంతానాభి లాష) గలవారికి శీఘ్రఫలం లభిస్తుంది.
షష్ఠి నాడు శ్రాద్ధ కర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది.
సప్తమి శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది.
అష్టమి తిథినాడు శ్రాద్ధ కర్మ వాళ్ళ చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ధి ప్రాప్తిస్తాయి.
నవమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది.
దశమి నాడు శ్రాద్ధకర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది.
ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది, కుటుంబం వృద్ది చెందుతుంది.
ద్వాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే కుటుంబము అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధ కర్తకు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మేధా బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది.
త్రయోదశినాడు శ్రాద్ధ కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి.
చతుర్దశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది.
అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య దినమైన చేసి తీరాలి.
ఆర్థిక కారణాల వలననో లేకా తిధి గుర్తుకు లేకపోవడమో మొదలగు కారణాల వలన శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే పితృ పక్షంలో కేవలం గోవులకు శాకంతో అర్పించి సేవ చేయవచ్చునని శాస్త్రము.పేదబ్రాహ్మణులకు, ఆకలిగొని ఉన్నవారికి చేస్తే పుణ్య ఫలితం అధికంగా లభిస్తుంది. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు, అదీ చేయగలిగి, వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి, పితృ దేవతలకునమస్కరించవచ్చు . శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకం లో ఉత్తమ గతులు లభిస్తా యని శాస్త్రాల ద్వారా తెలు స్తోంది.
మహాళయపక్ష విశేషముగా ను, నవగ్రహాదోషనివృత్తికి గాను గోవును, దూడతో సహా దానమునిచ్చుటకునూ, గోగ్రాసము (ప్రతినెలా) ఇ గోగ్రాససేవ, గోదానసేవా సౌకర్యముల వివరములకు :
===================
కామధేను గోశాల, కామధేను సేవా సమితి, ప్రతి గోసేవకు రశీదు పొందవచ్చును. ఇన్కంటాక్స్
వెసులుబాటు గలదు.
Paytm, Googlepay, on-line payment వసతి గలదు.
SBI, Nacharam Br., A/ c. No.33787339464,IFSC:
SBIN0003098
Hyderabad 500075, TS.
No comments:
Post a Comment