Tuesday, October 9, 2018

తెలంగాణ బతుకమ్మ


🍃తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ  మొదలు కానుంది. ఒక మనిషికి, పకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదియ్యని సంబంధం ఉంటుంది.

🍂ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి సేదతీరేవాడు…. కానీ ఈ బిజీ జీవితాలలో మనుషులతోనే కలువలేకపోతున్న మనిషి ఇక పకృతితో ఎలా కలుస్తాడు. బతుకమ్మ పండగకి మాత్రం కచ్చితంగా తొమ్మిది రోజులు మాత్రం ప్రతి మనిషి పకృతితో మమేకమై పోతారు అదే బతుకమ్మ పండుగ యొక్క గొప్పతనం.

ఈ బతుకమ్మ పండుగ వెనుక చాల కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నది:

🌱ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం ‘బతుకమ్మా’ అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదలు కారాదనీ, కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు.

🌿ఈ పండుగను తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాలతో బతుకమ్మను కొలుచుకోవడం ఆనవాయితీ.

🏵తొమ్మిది రూపాల బతుకమ్మల పేర్లు:

1. ఎంగిలిపూల బతుకమ్మ
2. అటుకుల బతుకమ్మ
3. ముద్దపప్పు బతుకమ్మ
4. నాన బియ్యం బతుకమ్మ
5. అట్ల బతుకమ్మ
6.అలిగిన బతుకమ్మ
7. వేపకాయల బతుకమ్మ
8. వెన్నముద్దల బతుకమ్మ
9. సద్దుల బతుకమ్మ (చివరిరోజు)

🌸ఎంగిలి పువ్వుల బతుకమ్మ :

🌱బతుకమ్మ నవరాత్రులలో మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. అలా ఎందుకంటారు అంటే బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొచ్చి వాటి వాడిపోకుండా నీళ్లలో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. ఈ రోజునాడు తెలాంగాణ పల్లెల్లో వాయనంగా తమలపాకులు, తులసి ఆకులు, ఇచ్చుకుంటారు.

🌻అటుకుల బతుకమ్మ

🌿రెండవ రోజునాడు ఉదయానే అడవికి వెళ్లి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలు తీసుకువస్తారు. ఈ పూలను రెండు ఎత్తులలో గౌరమ్మను పేర్చి,  ఆడవారు అందరూ కలసి ఆడుకొని సాయంత్రం చెరువులలో వేస్తారు.
రెండవ రోజు అటుకులు వాయనంగా పెడుతారు.

🌸ముద్దపప్పు బతుకమ్మ :

🍃మూడవ రోజు బతుకమ్మను మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో అలంకరించి తామర పాత్రలలో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. శిఖరం పై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం గుడి దగ్గరో లేక నాలుగు బాటలు కాడ అందరూ కలసి ఆడవారు ఆడుకొని చెరువులో వేసి వస్తారు.
మూడవ రోజు వాయనంగా సత్తుపిండి,పేసర్లు, చక్కర, బెల్లం కలిపి పెడుతారు.

🥀నానబియ్యం బతుకమ్మ:

🍀నాలుగవ రోజు నానబియ్యం ఫలహారంగా పెడుతారు. ఈ రోజు తంగేడు, గునుగు పూలతో నాలుగంతరాలు బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను పెడతారు.వాయనంగా నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కానీ చెక్కరతో కానీ కలిపి ముద్దలు చేసి పెడతారు.

🌼అట్ల బతుకమ్మ :

🌱ఈ ఐదవ రోజు తంగేడు, గునుగు,చామంతి,మందార, గుమ్మడి పూలను అయిదంతరాలుగా పేర్చి బతుకమ్మను ఆడుతారు.
ఈ రోజు వాయనంగా పిండితో చేసిన అట్లను పెడుతారు.

🌺అలిగిన బతుకమ్మ:

🌿ఈ రోజు ఎలాంటి పూలతో బతుకమ్మను అలంకరించారు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్దా తగలడంతో అపచారం జరిగిందని ఆరవ రోజు బతుకమ్మను ఆడరు.

🌸వేపకాయల బతుకమ్మ :

🍃ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతారాలు పేర్చి ఆడుకొని చెరువులో వేస్తారు.
ఈ రోజు వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు లేదా పప్పు బెల్లం నైవేద్యంగా పెడతారు.

🌻వెన్న ముద్దలా బతుకమ్మ:

🍂ఎనిమిదవ రోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆట,పాటల మధ్య చెరువులో వేస్తారు.
ఈ రోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు.

🏵సద్దుల బతుకమ్మ:

🍁ఇదే చివరి పండుగా రోజు. ఈ రోజు ఎన్ని పూలు దొరికే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఈ రోజు ఆడవారు చాలా ఉత్సాహంగా ఆడుతారు, పాడుతారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా గౌరమ్మను కూడా తయారు చేసి చాలా జాగ్రత్తగా ఎత్తుకొని  బతుకమ్మను వేసిన తరవాత గౌరమ్మను పూజించి ఆడవారు వారి చెంపలకు రాసుకుంటారు.

🌱చివరి రోజు కాబట్టి చాలా చీకటి పడే వరకు ఆడుకుంటారు ఆడవారు. పెద్ద బతుకమ్మ రోజు ఎక్కడ ఉన్న వారి సొంత ఊరికి చేరుకొని ఆడపిల్లలు అందరూ కలసి ఆనందంతో బతుకమ్మను ఆడుకొని చెరువులో వదులుతారు.

⭕సర్వేజనా సుఖినోభావంతు

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...