Thursday, October 4, 2018

దేవి నవరాత్రి ప్రాముఖ్యత

వసంతకాలం మరియు శరదృతువుల మొదలు, వాతావరణపరంగా, సౌరప్రభావపరంగా చాలా ముఖ్యమైన సంధి కాలం. దేవీ మాతను పూజించడానికి ఈ రెండు కాలాలూ చాలా పవిత్రమైన అవకాశాలుగా భావిస్తారు. పండుగ యొక్క తేదీలను, చంద్ర పంచాంగం ప్రకారం నిర్ణయిస్తారు.

హిందూ మతంలో విశ్వాసకులు ఒక సర్వశక్తిమంతమైన దేవత/దేవుడిని నమ్ముతారు, కానీ, పూజించే విషయానికి సంబంధించినంత వరకూ, ఆమె/అతడిని అనేక రకాలుగా వ్యక్తీకరించబడిన రూపంలో పూజించవచ్చు, ఈ అనేక రూపాలు దేశమంతా ప్రబలంగా వ్యాపించి ఉన్నాయి. నవరాత్రి దుర్గా దేవి ఉత్సవానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, దుర్గాదేవి, శక్తి ఆకృతిలో వ్యక్తీకరించబడిన దేవత (శక్తి లేదా బలము). దసహరా అంటే 'పది రోజులు', ఇది వాడుక భాషలో దసరా అవుతుంది. నవరాత్రి పండుగ లేదా 'తొమ్మిది రాత్రుల పండుగ, చివరి దినాన, అంటే విజయదశమి రోజున పరాకాష్ఠకు చేరుకుని 'పది రోజుల పండుగ' అవుతుంది. ఈ పదిదినాలలోనూ, మహిషాసురమర్ధిని అయిన దుర్గా మాత యొక్క అనేక రూపాలను ఆరాధనతో, భక్తితో పూజిస్తారు.

నవరాత్రి యొక్క సంప్రదాయాలు సవరించు

తమిళ్నాడు కోయంబతూర్ లో భజన

వెస్ట్ బెంగాల్ లో భక్తులు నవ రాత్రి మరియు దుర్గ పూజ సంబరాల్లో దీపాలు వెలిగిస్తారు
నవరాత్రిని సంవత్సరంలో 5 సార్లు జరుపుకుంటారు. వాటిని వసంత నవరాత్రి, ఆషాఢ నవరాత్రి, శారదా నవరాత్రి మరియు పౌష్య/మాఘ నవరాత్రి అంటారు. వీటిలో, పురతషి మాసంలో వచ్చే శారదా నవరాత్రి మరియు వసంత కాలంలో వచ్చే వసంత నవరాత్రి చాలా ముఖ్యమైనవి.

1. వసంత నవరాత్రి : వసంత నవరాత్రులు అని కూడా గుర్తించబడే బసంత నవరాత్రి, వసంత ఋతువులో (మార్చి-ఏప్రిల్) తొమ్మిది రూపాల శక్తి మాతని (దేవీ మాత) ఆరాధించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండుగ. దానిని చైత్ర నవరాత్రులని కూడా గుర్తిస్తారు. ఈ తొమ్మిది రోజుల పండుగను రామ నవరాత్రులని కూడా అంటారు.

2. గుప్త నవరాత్రి : ఆషాఢ లేదా గాయత్రి లేదా శాకంబరి నవరాత్రులుగా గుర్తించే గుప్త నవరాత్రులను ఆషాఢ మాసంలో (జూన్-జులై), తొమ్మిది రూపాల శక్తి మాతను (దేవిమాత) పూజించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండుగగా గుర్తిస్తారు. ఆషాఢ శుక్లపక్షాన (చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే కాలం) గుప్త నవరాత్రులను జరుపుకుంటారు.

3. శరన్నవరాత్రులు : అన్ని నవరాత్రులలో ఇది అతి ముఖ్యమైనది. దీనిని టూకీగా, మహా నవరాత్రి (గొప్ప నవరాత్రి) అని అంటారు, ఈ ఉత్సవాన్ని అశ్విన మాసంలో జరుపుకుంటారు. శరద్ నవరాత్రులుగా కూడా గుర్తించబడిన ఈ నవరాత్రులను, శరద్ ఋతువులో (శీతాకాలం మొదట్లో అంటే, సెప్టెంబరు-అక్టోబరు) జరుపుకుంటారు.

4. పౌష్య నవరాత్రి : పౌష్య నవరాత్రి అనేది తొమ్మిది రూపాల శక్తి మాతను (దేవీ మాత) పూజించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజులు, దీనిని పుష్య మాసంలో (డిసెంబరు-జనవరి) వచ్చే పౌష్య నవరాత్రి అంటారు. పౌష్య శుక్ల పక్షంలో (చంద్రుడు పూర్ణ బింబాన్ని సంతరించుకునే కాలంలో), పౌష్య నవరాత్రులు జరుపుకుంటారు.

5. మాఘ నవరాత్రి : గుప్త నవరాత్రిగా కూడా గుర్తించబడే మాఘ నవరాత్రిని, మాఘమాసంలో (జనవరి-ఫిబ్రవరి) తొమ్మిది రూపాలలో శక్తిని మాతను (దేవీ మాత) తొమ్మిది రాత్రులు ఆరాధించే పండుగగా గుర్తిస్తారు. మాఘ నవరాత్రిని మాఘ శుక్ల పక్షాన (చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే సమయంలో) జరుపుకుంటారు.

వసంత నవరాత్రి
శరద్ నవరాత్రి
చంద్రమాసమయిన అశ్వయుజ/అశ్విన మాసం యొక్క ప్రకాశవంతమయిన సగంలోని మొదటి రోజున మొదలయి, చివరి రోజున అంతమవుతుంది.

ధౌమ్య వాచనుడి ప్రకారం, 'నవరాత్రి పండుగ అశ్విన మాసంలోని ప్రకాశవంతమయిన పక్షంలో ప్రతిపాదం అను క్రమంలో, నవమి పూర్తయ్యేదాకా జరుపుకుంటారు'.

దేవీ రూపాలు

"దుర్గ యొక్క తొమ్మిది రూపాలు " బెనారెస్, ఉత్తర్ ప్రదేశ్ లో ప్రదర్శన
నవరాత్రులలో తొమ్మిది రూపాలలో శక్తిని ఆరాధిస్తారు. స్థలసంప్రదాయాన్ని బట్టి దేవతల రూపాలు మారుతూ ఉంటాయి.

దుర్గ, దుర్గమమైన దేవత
భద్రకాళి
అంబ లేదా జగదంబ, విశ్వానికి మాత
అన్నపూర్ణ, సమృధ్ధిగా ధాన్యాన్ని (అన్నం) ప్రసాదించే తల్లి (పూర్ణ: వైయక్తికంగా ఉపయోగిస్తారు)
సర్వమంగళ, అందరికీ (సర్వ) మంచి (మంగళ) చేకూర్చే తల్లి
భైరవి
చంద్రిక లేదా చండి
లలిత
భవాని
మూకాంబిక

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...