Saturday, October 6, 2018

భగవధ్గీత లోని 18 అధ్యాయల ఫలితాలు


1. అర్జున విషాదయోగం:—
    ———————————
ఈ అధ్యాయం చదవడంవలన చదివినవారికి పూర్వజన్మస్మ్రతి కలుగుతుంది.          (పూర్వజన్మపాపాలు తొలగుతాయి)

2. సాంఖ్య యోగం :— 
    —————————
ఈఅధ్యాయం చదవడంవలన ఆత్మస్వరూపం గోచరిస్తుంది.అలౌకిక శక్తి లభిస్తుంది.                (సుఖశాంతులు కలుగుతాయి)

3. కర్మయోగం :—
    ———————
ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆత్మహత్యలవలన చనిపోయి ప్రేతత్వం పొందకుండా జీవులు అక్కడ సంచరిస్తున్నట్లయితే వాటికి ప్రేతత్వం నశిస్తుంది.
(తనవారు చేసిన పాపాలనుకూడా పోగొడుతుంది)

4,5. జ్ఞానయోగం,కర్మ సన్యాసయోగం :                       ————————————-——————
ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు
విన్న చెట్లు,పశువులు,పక్షులకు కూడా పాపం నశించి ఉత్తమగతిని పొందుతాయి.
 నాల్గవ అధ్యాయం వలన భయద్వేషాలు ,ఐదవ అధ్యాయం వలన మహాపాపాలు తొలగిపోతాయి.

6. ఆత్మ సంయమ యోగం:—
    —————————————
ఈ అధ్యాయం చదివినవారికి అన్నదాన,గోదాన,విద్యాదాన......... ఇలా సమస్త దానాల ఫలితం లభించి విష్ణుసాయుజ్యం పొందుతారు.
(జ్ఞానసిద్ధి కలుగుతుంది)

7. జ్ఞాన విజ్ఞానయోగం :—
    ———————————
జన్మరాహిత్యం కావాలనుకునేవారు ఈ అధ్యాయాన్ని చదివితేచాలు.
(ఉత్తమోత్తమైన జన్మ కలుగుతుంది)

8. అక్షర పరబ్రహ్మయోగం :—
    ————————————
ఈ అధ్యాయం చదివినా,విన్నా బ్రహ్మరాక్షసత్వం వదిలిపోయి పాపాలు నశిస్తాయి.
(ముక్తికలుగుతుంది)

9. రాజవిద్యా రాజగుహ్యయోగం:—
   ———————————————
ఈ అధ్యాయం చదివితే ఇతరులదగ్గరనుంచి మనం ఏనాడైన  ఏదైన వస్తువు ఉచితంగా,దొంగతనంగా
తీసుకున్నందువల్ల సంక్రమించిన పాపం/ఋణం నశిస్తుంది.
(యజ్ఞం చేసినఫలం లభిస్తుంది)

10. విభూతి యోగం :—
      —————————
ఈ అధ్యాయం చదవడంవలన ఆశ్రమ ధర్మాలన్నీ  సక్రమంగా నిర్వహిస్తే ఏవిధమైన పుణ్యం వస్తుందో ఆపుణ్యం వస్తుంది.జ్ఞానం వృద్ధి అవుతుంది.
(మహాఐశ్వర్యం లభిస్తుంది)

11. విశ్వరూప సందర్శనయోగం :—
     ———————————————
ఈ అధ్యాయం నిష్ఠగా పఠించడంవలన  భూత,ప్రేతపీడలుతొలగుతాయి.

12. భక్తియోగం :—
     ———————
ఈ అధ్యాయం శ్రద్ధగా పారాయణచేస్తే మన ఇష్టదేవతా సాక్షాత్కారం జరుగుతుంది.జ్ఞానదృష్టి కలుగుతుంది
(ఏకాగ్రత,భగవంతుని ప్రీతి కలుగుతుంది)

13. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం :—
      ————————————
ఈ అధ్యాయం చదవడంవలన చండాలత్వం నశిస్తుంది
(కోరిన ఫలము లభిస్తుంది)

14. గుణత్రయ విభాగయోగం:—
      —————————————
ఈ అధ్యాయం చదివితే వ్యభిచిరదోషం,స్త్రీహత్యాపాతకం తొలగిపోతాయి.
(మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది)

15. పురుషోత్తమ యోగం:—
     ————————————
ఈ అధ్యాయాన్ని బోజనంచేసేముందు పఠించాలి.దీనివల్ల  అహారశుద్ధి కలుగుతుంది.జీర్ణశక్తి పెరుగుతుంది.మోక్షంసిద్ధిస్తుంది.
(మహాతపస్సుచేసిన ఫలం లభిస్తుంది)

16. దైవాసుర సంపద్విభాగయోగం:—
     ————————————————
ఈ అధ్యాయం చదివినచో చదివినవారితోపాటు విన్నవారికిసైతం
బలపరాక్రమాలు సిద్ధిస్తాయి.ప్రతికార్యంలోనూ విజయం లభిస్తుంది.
(రాజాధిరాజులా వెలిగిపోతారు)

17. శ్రద్ధాత్రయ విభాగయోగం :—
      —————————————
తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ అధ్యాయాన్ని పఠిస్తే మంచిది.సత్వరం ఫలితం కనిపిస్తుంది.
(అనేక వ్యాధులు దూరంఅవుతాయి)

18.మోక్ష సన్యాసయోగం :—
     ————————————
నిరుద్యోగులు ఈ అధ్యాయం చదివితే వెంటనే ఉద్యోగం ,ఉపాధి లభిస్తాయి.అంతేకాదు యజ్ఞంచేసిన ఫలితం కూడా ఈ అధ్యాయ పఠనంద్వారా లభిస్తుంది.
(దాన,ధర్మ,యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది )

కృష్ణం వందే జగద్గరుమ్

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...