Sunday, April 21, 2019

గురుసేవ - గురుశుశ్రూష 4 విధాలు

(1) స్థాన శుశ్రూష :- గురువు ఉన్న ఇంటిని, ఆశ్రమాన్ని, ప్రదేశాన్ని శుభ్రం చేయటం. ఆయన పరిసరాలను శుభ్రం చేయటం. ఆయన వాడే వస్తువులను శుభ్రం చేయటం - (అదీ తప్పనిసరి కర్తవ్యంగా గాక - తనకు అదృష్టవశాత్తు లభించిన అవకాశంగా భావించి)

(2) అంగ శుశ్రూష :- స్వయంగా ఆయన పాదాలొత్తి సేవచెయ్యటం. ఆయన యొక్క ఆరోగ్య విషయాలను స్వయంగా చూచుకుంటూ తగిన ఏర్పాట్లు చెయ్యటం. ఆయన అవసరాలను కనిపెట్టి ఉండటం.

(3) భావ శుశ్రూష :- ఆయన మనస్సులోని భావాలను తెలుసుకుంటూ అందుకనుగుణంగా నడుచుకోవటం. ఆయన కోరకుండానే ఆయన అవసరాలు తీర్చటం. ఆయనకు ఏ లోటూ కలగకుండా చూచుకోవటం.

(4) ఆత్మశుశ్రూష :- తన మాటలు - చేతలు గురువును నొప్పించకుండా ఆయన నడిచే మార్గంలోనే నడవటం. ఆధ్యాత్మిక చింతనతో ఆయనతో పోటీ పడటం. తన శరీరం - తన ధనసంపదలు - తన మనస్సు (తను, ధన, మనస్సులు) సర్వమూ గురువు కోసమేననే భావన బుద్ధిలో దృఢంగా ఉండాలి.
ఇలా గురువును సేవిస్తే గురువును ప్రసన్నం చేసుకోవటం, సన్నిహితం కావటం - గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటం జరుగుతుంది. ఈ విధమైన సంబంధం వల్లనే సత్ఫలితాలు కలుగుతాయి. ఆత్మతత్వం అవగతమవుతుంది. అందుకే వేదాంతం గురుశిష్య - సంబంధాన్ని గురించి ఇంతగా నొక్కి చెప్పటం. ఈ రోజుల్లో గురువు ఎక్కడో కూర్చొని ఫోనులో బోధ చేస్తాడు. లేదా TV లో చెబుతుంటే వింటున్నాం కదా! అని శిష్యులు భావిస్తుంటారు. వేదాంత సారాన్ని, గురువు యొక్క అనుభవాన్ని శిష్యుడు తెలుసుకోవాలంటే ఇలాంటి సులభమార్గాలు పనిచెయ్యవు. phone లో ఉపదేశాలు, post ద్వారా ప్రసాదాలు, ఉత్తరాల ద్వారా ఆశీస్సులు, TV తెర ద్వారా గురుబోధలు - ఇవేవీ మనను గమ్యం చేర్చలేవు.

గురువుకు అత్యంత సన్నిహితంగా వెళ్ళి ఆయనను సేవించి - పూజించి - ఆరాధించినప్పుడే సత్యం ఏమిటో అవగతమౌతుంది.

No comments:

Post a Comment

నవగ్రహ స్తోత్రములు (తాత్పర్య సహితము)

🙏 నవగ్రహస్తోత్రం 🙏 ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః!! ꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂ 🕉️ 01. రవి (ఆదిత్య): 🙏 ...