శ్రీ గురుగీత, అద్వయ తారకో పనిషత్, యోగశిఖోపనిషత్, గోపాలపూర్వతాపిన్యుపనిషత్, వివేకచూడామణి, మొదలైన గ్రంధములు , వాటిలో గురువులకు సంబంధిచిన స్తోత్రములు, శ్లోకములు. గురుపరంపర ఆశీర్వచనము ఈ "శ్రీ గురుసూక్తము".
"శ్రీ గురు సూక్తము"
((((((((((0))))))))))
ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయా క్లిష్టకారిణే||
నమోవేదాంతవేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే||
ఓంనమోబ్రహ్మాదిభ్యో, బ్రహ్మవిద్యాసంప్రదాయకర్తృభ్యో||
వంశఋషిభ్యో మహాద్భ్యో నమో గురుభ్యః||
ఓం నమో ప్రణవార్ధాయ, శుద్ధజ్ఞానైకమూర్తయే||
నిర్మలాయ ప్రశాన్తాయ దక్షిణామూర్తయే నమః||
ఓం హయాస్యాద్య వతారైస్తు జ్ఞానసిద్ధా మునీశ్వరాః||
కృతార్ధతాంగతాస్తాంవై నారాయణ ముపాస్మహే||
ఓం వేదతత్త్వైర్మహావాక్యైర్వసిష్ఠాద్యామహార్షయః||
చతుర్భిశ్చతురాసన్ తంవై పద్మభువం భజే||
ఓం బ్రహ్మర్షిర్బ్రహ్మ విద్వర్యో బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియః||
తపస్వీ తత్త్వవిద్యస్తు తం వసిష్ఠం భజేన్వహం||
ఓంయోగజ్ఞం యోగినావర్యం బ్రహ్మజ్ఞాన విభూషితం||
శ్రీమద్వశిష్ఠ
తనయం శక్తిం వందే మహామునియే||
ఓం ధర్మజ్ఞంధార్మికం ధీరం ధర్మాత్మా నందయానిధిం||
ధర్మశాస్త్ర ప్రవక్తారం పరాశర మునింభజే||
ఓం కృష్ణ ద్వైపాయనం వ్యాసం సర్వలోకహితేరతం||
వేదాబ్జభాస్కరం వందేశమాదినిలయం మునిం||
ఓం పరాశరపౌత్రం శ్రీవ్యాసపుత్రమకల్మషం||
నిత్యవైరాగ్య సంపన్నం జీవన్ముక్తమ్ శుకంభజే||
ఓం మాండూక్య కారికాకర్తా యోభాతి బ్రహ్మవిద్వరః||
శ్రీగౌడపాదాచార్యం తం ప్రణమామి ముహుర్ముహుః||
ఓం యోగీశ్వరం వేదచూడం వేదాంతార్ధనిధిం||
మునిం గోవింద భగవత్పాదాచార్యవర్య ముపాస్మహే ||
ఓం హరలీలా వతారాయ శంకరాయపరౌజసే||
కైవల్యకలనా కల్పతరవే గురవేనమః||
ఓం బ్రాహ్మణే మూర్తిమతే శృతానాం శుద్ధిహేతవే||
నారాయణయతీన్ద్రాయ తస్మై గురవేనమః||
సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం||
అస్మదాచార్య
పర్యంతం వందేగురు పరంపరాం||
ఓం సచ్చిదానంద రూపాయ శివాయపరమాత్మనే||
నమో వేదాంత వేద్యాయ గురవేబుద్ధిసాక్షిణే||
ఓం నిత్యానందైక కందాయ నిర్మలాయచిదాత్మనే||
జ్ఞానోత్తమాయ
గురవే సాక్షిణే బ్రాహ్మణేనమః||
గూఢావిద్యా జగన్మాయా దేహశ్చాజ్ఞాన సంభవః||
విజ్ఞానం యత్ప్రసాదేన గురుశబ్దేనకథ్యతే||
స్వదేశికస్వైవచ నామకీర్తనమ్ భవేదంతస్య శివస్యకీర్తనమ్||
స్వదేశికస్వైవచ నామచింతనం భవేదంతస్య శివస్యచింతనం||
కాశిక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం||
గురుర్విశ్వేశ్వరః సాక్షాత్ తారకం బ్రహ్మనిశ్చయః||
గురుసేవా గయాప్రోక్తా దేహసాక్షా దక్షయోవటః||
తత్పాదం విష్ణుపాదంస్యాత్ తత్ర దత్తమచస్తతం||
స్వాశ్రమంచ స్వజాతించ స్వకీర్తిమ్ పుష్ఠివర్ధనం||
ఏతత్సర్వం పరిత్యజ్య గురురేవ సమాశ్రయేత్||
గురువక్త్రే స్థితావిద్యా గురుభక్త్యాచ లభ్యతే||
త్రైలోక్యేస్ఫుటవక్తారో దేవర్షిపితృమానవాః||
గుకారశ్చగుణాతీతో రూపాతీతోరుకారకః||
గుణరూప విహీనత్వాత్ గురురిత్యభిధేయతే||
గుకారః ప్రధమవర్ణో మాయాదిగుణ భాసకః||
రుకార్యోస్తి పరంబ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం||
సర్వశృతి శిరోరత్న విరాజిత పదాంబుజం||
వేదానార్ధ ప్రవక్తారం తస్మాత్ సంపూజయేత్ గురుమ్||
యస్య స్మరణమాత్రేణ జ్ఞానముత్పద్యతేస్వయం||
సః ఏవ సర్వ సమ్పత్తిః తస్మాత్ సంపూజయేత్ గురుమ్||
సంసారవృక్షమారూఢాః పతన్తినరకార్ణవే||
యస్తానుద్ధరతే సర్వాన్ తస్మై శ్రీగురవేనమః||
ఏకఏవ పరోబంధుర్విషయే సముపస్థితే||
గురుః సకలధర్మాత్మా తస్మై శ్రీగురవేనమః||
భవారణ్య ప్రవిష్టస్య దిఙ్మోహభ్రాంత
చేతసః||
యేన సందర్శిత పంథాః తస్మై శ్రీగురవేనమః||
తాపత్రయాగ్ని
తప్తానాం అశాంత ప్రాణినాం భువి||
గురురేవ పరాగంగా తస్మై శ్రీగురవేనమః||
శివేరుష్టే గురుత్రాతా గురౌరుష్టే నకశ్చినః||
లబ్ద్వాకులగురుం సమ్యక్ గురుమేవ సమాశ్రయేత్||
అత్రినేత్రశివః సాక్షాత్ ద్విబాహుశ్చహరిః||
స్మ్రుతః యో-చతుర్వదనో బ్రహ్మ శ్రీగురుః కధితప్రియే||
నిత్యంబ్రహ్మ నిరాకారం నిర్గుణం బోధయేత్ పరమ్||
భాసయన్ బ్రహ్మభావంచ దీపోదీపాన్తరం యథా||
గురోర్ ధ్యానే నైవనిత్యం దేహీబ్రహ్మమయో
భవేత్||
స్థితశ్చ యత్రకుత్రాపి ముక్తాసౌనాత్రిసంశయః||
జ్ఞానంవైరాగ్యమైశ్వర్యం యశఃశ్రీః సముదాహృతం||
షడ్గుణైశ్వర్య యుక్తోహి భగవాన్ శ్రీగురుః ప్రియే||
గురుః శివో గురుః దేవో గురుర్బన్ధుః శరీరిణామ్||
గురురాత్మా గురుర్జీవో గురోరన్యన్నవిద్యతే||
యతః పరమకైవల్యం గురుమార్గేణ వైభవేత్||
గురుభక్తి రతిః
కార్యాః సర్వదా మోక్షకాంక్షిభిః||
గురుర్దేవో గురుర్ధర్మో గురౌనిష్టా పరంతపః||
గురోః పరతరం
నాస్తి త్రివారం కధయామితే||
నమో నమస్తే గురవే మహాత్మనే విముక్తసఙ్గాయ సదుత్తమాయ||
నిత్యాద్వయానంద రసస్వరూపిణే భూమ్నే సదా--పార దయామ్బుదామ్నే||
శిష్యాణామ్ జ్ఞానదానాయ లీలయాదేహధారిణే||
సదేహోసి విదేహాయ తస్మై శ్రీగురవేనమః||
రాగద్వేషవినుర్ముక్తః కృపయాచ సమన్విత||
సమయానాంచ సర్వేషాం జ్ఞానసార పరిగ్రహీ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ సదాచ్యుతః||
న గురోరధికం కశ్చిత్రిషులోకేషు విద్యతే||
దివ్యజ్ఞానోపదేష్టారం దేశికం పరమేశ్వరం||
పూజయాత్పరయా భక్త్యా తస్యజ్ఞాన ఫలంభవేత్||
గురురేవపరబ్రహ్మ గురురేవపరాగతిః||
గురురేవ పరావిద్యా గురురేవ పరాయణం||
గురురేవ పరాకాష్ఠా గురురేవ పరంధనం||
యస్మాత్తదుపదేష్టా సౌ తస్మాత్గురు తరోగురుః||
గురుభావపరంతీర్థం మన్యతీర్థం నిరర్థకం||
సర్వతీర్థమయందేవి శ్రీగురోశ్చరణామ్బుజం||
సప్తసాగరపర్యంతం తీర్థస్నానఫలంతుయాత్||
గురుపాద పయోబంధోః సహస్రాంశేన తత్ఫలం||
శోషణం పాపపంకస్య దీపనమ్ జ్ఞాన తేజసః||
గురోఃపాదోదకం సమ్యక్ సంసారార్ణవ తారకం||
"అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారకం||
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం గురు పాదోదకం పిబేత్"
"ఇతి సంకలిత 'శ్రీ గురుసూక్తం' సమాప్తం"
"ఓం శాంతిః శాంతిః శాంతిః"
"శ్రీ గురుసూక్తం -- తాత్పర్యం"
ఓం సచ్చిదానందరూపుడు, అక్లిష్టకారి, వేదాంతవేద్యుడు, బుద్ధిసాక్షి, జగద్గురువగు శ్రీకృష్ణునకు నమస్కారము. ప్రణవార్థ స్వరూపుడును, శుద్ధజ్ఞానైకమూర్తియు, నిర్మలుడును, ప్రశాన్తుడును నగు దక్షిణామూర్తికి నమస్కారము. ఎవని హయగీతాద్యవతారములచే మునీశ్వరులు జ్ఞానసిద్ధిని బడసి కృతార్థులైనారో అట్టి శ్రీమన్నారాయణుని మేముపాసించెదము. చతుర్వేదతత్త్వముల చేతను, మహా వాక్యముల చేతను వసిష్ఠాదిమహర్షులు ఎవనివలన విజ్ఞానచాతుర్యము బడసిరో అట్టి పద్మజుడగు బ్రహ్మదేవుని నేను భజించెదను. బ్రహ్మర్షియు, బ్రహ్మ విద్వరుడును, బ్రహ్మణ్యుడును, బ్రహ్మజ్ఞ ప్రియుడును నగు వసిష్ఠమహర్షిని నిరంతరమూ నేను ధ్యానించెదను. యోగజ్ఞుడును, యోగులలో నుత్తముడును బ్రహ్మజ్ఞానవిభూషితుడును, శ్రీవశిష్ఠమునీన్ద్రునికొమరుడునగు శ్రీశక్తి మహామునికి నమస్కారము. ధర్మజ్ఞుడును, ధార్మికబుద్ధి కలవాడును, ధీరుడును, ధర్మాత్ముడును, దయానిధియు, ధర్మశాస్త్రముల లెస్సగా వచించు వాడునునగు పరాశరుని గొల్చెదను. శ్రీకృష్ణద్వైపాయనుడును, సర్వలోకహితమునుకూర్చి ఆనందించువాడును, వేదపద్మములకు సూర్యునివంటివాడు, శమాదులకు నిలయమైనవాడును, మునియునగు శ్రీవ్యాసమహర్షులకు నమస్క రించు చున్నాను. శ్రీపరాశరుని పౌత్రుడును, శ్రీవ్యాసమహర్షిపుత్రుడును, అకలుషుడును, నిత్యవైరాగ్యసంపన్నుడును, జీవన్ముక్తుడు ను నగు శ్రీశుకమహర్షిని భజించెదను. మాండూక్యకారికల రచించినవాడును, బ్రహ్మవిద్వరుడై భాసిల్లు వాడునునగు శ్రీగౌడపాదాచార్యుని మాటిమాటికిని మ్రొక్కెదను.యోగీశ్వరుడును, వేదవిభూషణుడును, వేదాంతార్థ నిలయుడును, మునీన్ద్రుడును, ఉత్తముడునగు శ్రీ గోవిందభగవత్పాదాచార్యుని ధ్యానించు చున్నాము. పరమేశ్వరుని లీలావతారుడును, మహాశక్తి యుతుడును, మోక్షమొసంగుట యందు కల్పవృక్షము వంటివాడునునగు శ్రీ శంకర భగవత్పాదాచార్య గురువులకు నమస్కారము. మూర్తీ భవించిన బ్రహ్మస్వరూపుడును, శాస్త్రములశుద్ధికి కారణ భూతుడును, యతీన్ద్రుడునునగు శ్రీనారాయణ గురువునకు నమస్కారము. శ్రీదక్షిణామూర్తులైన సదాశివునితో ప్రారంభమై, మధ్యమమున శ్రీశంకరాచార్య భగవత్పాదులతో కూడియుండి, మా సద్గురువులవరకు విస్తరించియున్న శ్రీగురు పరంపరకు నమస్కరించు చున్నాము. సచ్చిదానందస్వరూపుడును, శివుడును, పరమాత్మ రూపుడును, వేదాంత వేద్యుడును, బుద్ధిసాక్షియునగు గురుదేవునకు వందనము. నిత్యానందైక స్వరూపుడును, నిర్మలుడును, చిదాత్మ స్వరూపుడును, ఉత్తమజ్ఞానమూర్తియు సాక్షియు, బ్రహ్మ స్వరూపుడును నగు గురువునకు నమస్కారము.
జగత్తు గూఢమైన, అవిద్యాత్మకమైన మాయారూపము మరియు శరీరము అజ్ఞానము నుండి ఉత్పన్నమైనది. దీనికి సంబంధించిన జ్ఞానము ఎవరివలన కలుగునో వారిని 'గురు' అను శబ్దముతో వ్యవహరిస్తారు. గురుదేవుని నామకీర్తనమే అనంతస్వరూపుడైన శివభగవానుని కీర్తనము. గురుదేవుని యొక్క నామచిన్తనమే అనంతస్వరూపుడైన శివభగవానుని యొక్క చింతనము. గురుదేవుని నివాస స్థలమే కాశిక్షేత్రము. గురుదేవుని పాదోదకమే పవిత్రగంగానది. శ్రీగురుదేవుడే విశ్వేశ్వరుడు. మనియు నిశ్చయముగా సాక్షాత్తు తారకబ్రహ్మ గురువే. గురుసేవయే పుణ్యక్షేత్రమైన గయ. గురుదేవుని శరీరమే కోరిన కోరికల నిచ్చే అక్షయవటవృక్షము. గురుపాదము విష్ణుభగవానుని శ్రీచరణము. అందు నిమగ్నమైన మనస్సుకూడా అదేస్థితిని పొందును. బ్రహ్మచర్యగృహస్థాది ఆశ్రమములు, జాతిని, కీర్తిని, పాలన, పోషణ, మొదలగువన్నియు విడచిపెట్టి శ్రీగురుదేవునే ఆశ్రయించ వలయును.
శ్రీగురుదేవుని యందున్న విద్య గురుభక్తి వలననే లభించును. ఈమాట ముల్లోకములయందును దేవతలచే, ఋషులచే, మానవులచే స్పష్టముగా చెప్పబడుచున్నది. 'గు' కారమునకు గుణముల కతీతుడనియు, 'రు' కారమునకు రూపమున కతీతుడనియు, గుణ రూపములు రెండునూ లేనందున 'గురు' వనియు చెప్పబడుచున్నది. గురుశబ్దములో మొదటిదగు 'గు'కారమునకు
మాయాది గుణములతో కూడియున్నదనియు, 'రు'కారమునకు మయాభ్రాంతిని తొలగించే పరబ్రహ్మమనియు భావము.
సర్వశృతిరూపములైన శ్రేష్ఠరత్నములచే విలసిల్లు చరణకమలములు కలవాడును, వేదాంతముల యొక్క అర్థమును చెప్పేవాడు కనుక గురువును పూజింపవలయును. ఎవరిని స్మరించినంత మాత్రముననే తనంతతానుగా జ్ఞానము కలుగుతుందో అతడే సర్వసంపదల స్వరూపము. అందువలన గురుదేవుని బాగుగా పూజింపవలయును. సంసారమనే చెట్టునెక్కి, నరకమనే సముద్రములో పడుచున్నవారినందరినీ ఉద్ధరించునట్టి గురుదేవునకు నమస్కారము. ఏదైనా విషమపరిస్థితి ఎదురై నప్పుడు గురువు ఒక్కరే పరమబంధువై మనలను కాపాడును. సర్వధర్మముల ఆత్మస్వరూపము గురుదేవుడే. అట్టి గురుదేవునికి నమస్కారము. ఇహలోకమనెడి అరణ్యములో ప్రవేశించి దిక్కు తెలియని చిత్తభ్రమ కలిగినస్థితిలో మనకు దారిచూపించునట్టి గురుదేవునకు నమస్కారము. ఈభూమి పై తాపత్రయము అను మూడువిధములైన అగ్నులలో కాలుచూ, శాంతి లేని ప్రాణులకు ఉత్తమగంగ వంటి గురుదేవునకు నమస్కారము. ఒకవేళ శివుడు కోపించినచో గురువు రక్షిస్తాడు. గురువే కోపించిన ఇక ఎవ్వరూ రక్షింపలేరు. కావున మంచి గురువును పొంది చక్కగా ఆగురువునే ఆశ్రయింపుము. మూడుకన్నులు లేని సాక్షాత్తు శివుడు, రెండుచేతులు గల విష్ణువు, నాలుగుముఖములు లేని బ్రహ్మ దేవుడు శ్రీగురుదేవుడే అని తెలియవలెను. గురువు అనబడు వారు సదాబ్రహ్మలు, నిరాకారులు, నిర్గుణులు. వారు పరమును బోధించుదురు. బ్రహ్మభావముతో, ఒకదీపముతో వేరొకదీపము వెలిగించు నట్లుగా శిష్యులలో బ్రహ్మభావమును ప్రకటించుచుందురు.
సదా గురుదేవుని ధ్యానించు జీవుడు బ్రహ్మమయుడు అగుచున్నాడు. అట్టివాడు ఎక్కడ ఉన్ననూ ముక్తుడే అనుటలో సందేహము లేదు. భగవత్స్వరూపుడగు గురుదేవుడు జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, యశము, సంపద, మధురవాణి అను ఆరుగుణములచే కూడి యుండును. శరీరధారులకు గురువే శివుడు. గురువే దేవుడు. గురువే బంధువు. గురువుయందు నిష్ఠతో నుండుటయే పరమ తపస్సు. గురువును మించినదేదియూ లేదు. దీనిని ముమ్మారు చెప్పుచున్నాను. సత్పురుషులలో నుత్తముడును, సర్వదా అంతములేని దయకు సముద్రుడును, సకల బంధములు త్రెంపి అసంగుడు, నిర్లిప్తుడు నైన వాడును, నిత్యుడును, అద్వయుడును, ఆనందరసస్వరూపియునైన వాడును, భూమి పైన పరబ్రహ్మస్వరూపుడైన వాడునునైన మీకు(గురువునకు) నమస్కారము. శిష్యులకు జ్ఞానమొసంగుటకు లీలగా దేహము ధరించిన వాడును, దేహముతో నున్ననూ, విదేహమగు పర బ్రహ్మములో నుండునట్టి గురుదేవునకు నమస్కారము. రాగద్వేషములు లేనివాడుగను, కారణము నుద్దేశించకనే దయాసాగరుండును, సమస్త శాస్త్రములలోని జ్ఞానసారమెరింగిన వాడునునై శ్రీ గురు దేవుడుండును.
గురువే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమును చేరు త్రోవ గురువే. ఆ చేరుటకు కావలిసిన జ్ఞానము గురువే. ఆ చేరుట అనే ప్రక్రియ కూడా గురువే. దానికి కావలసిన సాధనసంపత్తి కూడా గురువే. చిట్ట చివరికి ఏదైనా మిగిలియుంటుం దంటే అది గురువే. ఈ విధముగా ఉపదేశికులైన మీరు గురువులలో కెల్ల సద్గురువులు. గురుభావమే శ్రేష్టమైన పుణ్యక్షేత్రము. ఇతర క్షేత్రములు నిరర్థకములు. శ్రీగురుదేవుని చరణామ్బుజములు సర్వతీర్థమయము. ఏడు సముద్రముల వరకూగల అన్ని పుణ్యతీర్థములందునూ స్నానము చేయుటవలన ఎట్టిఫలము కలుగుచున్నదో, అది గురుపాద జలము లోని ఒక్క బిందువులో వెయ్యవ భాగమునకుసమానము. శ్రీ గురుదేవుల యొక్క పదామృతము పాప పంకిలము తొలగించునది. జ్ఞానతేజమును పెంపొందింపజేయునది మరియు సంసార సాగరమును దాటించునట్టిది.
అజ్ఞానమును పెకలించివేయునదియును, అనేక జన్మల కర్మను నివారించునదియు అగు గురుపాదోదకమును జ్ఞానవైరాగ్యములు సిద్ధించుట కొరకు పానము చేయవలెను.
"శ్రీ గురుసూక్తము" అను సంకలనము సమాప్తము.