Wednesday, January 2, 2019

శరీరము

శరీర త్రయము : ప్రాణమయ శరీరము (The physio-etheric body)

ప్రాణమయ శరీరము భౌతిక శరీరమును పటిష్ఠపరచి ఒక రూపముగా ఉంచును. మరణ సమయములో ప్రాణమయ శరీరము వదిలి వెళ్ళుట వలన భౌతిక శరీరము నశించిపోవును. ఆధ్యాత్మిక జీవనము వలన ప్రాణమయ శరీరము పటిష్ఠము చెంది రూపమును ఆకర్షణీయముగా ఉంచును. దానికి వ్యతిరేకముగా జీవించినచో ప్రాణమయ శరీరము త్వరగా నశించును.

భావోద్వేగ శరీరము (The emotional body)

కోరికలు, అభీష్టములు, సానుభూతి, అసహ్యము, అహంకారము, ఆశయము, ద్వేషము, మరియు భయము మొదలగునవి భావోద్వేగ శరీరము యొక్క లక్షణములు.ఎవరైతే ఈ భావోద్వేగములతో నడిపించబడునో అతనిని జంతులక్షణములు కలవాడంటారు. ఎప్పుడైతే మన భావోద్వేగములను పవిత్రీకరించుకొని ఉన్నత ఆశయముల వైపు మనస్సును మళ్ళించునో అప్పుడు భావోద్వేగములు చల్లారి తపస్సు వైపునకు దారితీసి ఉద్ధారణ జరుగును.

మనోమయ శరీరము (The mental body)

మనోమయ శరీరము ఆలోచనలతో నిండి, విద్యుత్‍ను అందుకొను దీపము వలె, అవి పైన ఉన్న బుద్ధి నుండి శక్తిని అందుకొనును.ఆలోచనలు ఎడతెగక ఒకదాని తరువాత ఒకటి వచ్చుచునే ఉండును. బాహ్యముతో మన అమరిక వలన మనము ఎటువంటి ఆలోచనలను పొందుతామో నిర్ణయించబడుతుంది. మనము ఏర్పఱచుకొన్న అభిప్రాయములు/సిద్ధాంతములు మనల్ని వాటిలో చాలా కాలము కూరుకుపోయేలా చేస్తాయి. ఎప్పుడైతే మనము పై లోకములతో అనుసంధానము చెందుతామో, ఆత్మ నుండి ప్రేరణ పొందుతాము.

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...