అవగాహన
శక్తికి మనిషిలో క్రియాపూర్వక స్పష్టత ఉంది
ప్రకృతి జీవులు అన్నిటిలోనూ శక్తి సూక్ష్మత వున్నప్పటికీ మనిషిలో దానికి క్రియాపూర్వక స్పష్టత వుంది. అదే - మనిషిలోని ప్రాణశక్తి మొదలు ఆత్మ శక్తి వరకే! క్రియా ఫలిత ఉనికిగా జ్ఞాతమవుతోంది.
మనోశక్తే కీలకమైనది
శరీర బలంతోపాటు మనిషిలో ప్రాణశక్తి మనోశక్తి జీవశక్తి ఆత్మశక్తి (కుండలిని) నిక్షిప్తత వుంది. క్రియాత్మక విధానంలో అత్యంత ప్రాధాన్యతను కలిగియున్నది మనోశక్తి. జీవిత ఉనికికి మనిషి ప్రత్యేకతకు క్రియాఫలిత స్పష్టతతో మనోశక్తే కీలకమైనది.
ఆత్మశక్తే మూలం
నీటి అలలు, అలల నీరు వీటిలో నీరే మొదటిది. వాయువు అందుకు కారణం మాత్రమే! అలాగే 'జీవం', 'జీవ పదార్థం' - 'జీవి', ఈ క్రమంలో జీవం, మొదటిది, పంచభూతాల ప్రకృతి అందుకు హేతువు, అలాగే ఆత్మశక్తి - జీవశక్తి - ప్రాణశక్తి క్రమంలో ఈ మూడిటికీ ఆకార ఉనికి లేకపోయినప్పటికి ఆత్మశక్తే, మిగతా వాటికి మూలం. అలాగే, మూడిటి క్రియా సమన్వయతే శరీరం, బ్రతికి వుండడానికి కారణం.
కనుక జ్ఞానేంద్రియాల బాహ్య ప్రేరణ స్పందనకు బ్రెయిన్‌లోని న్యూరాన్ల ప్రతిస్పందనే ఇంద్రియ మనసుగ అవగాహనకు ప్రయత్నించవచ్చును. ఈ (బ్రెయిన్‌లోని న్యూరాన్ల) ప్రతిస్పందనకు శరీరవ్యాప్త స్పర్శనాడుల క్రియాత్మక చలనమే జీవశక్తి. అలాగే పంచభూత ప్రకృతి నిర్మిత శరీరానికి పోషణ బలం ప్రాణశక్తి వాటి ద్వారానే లభిస్తున్నాయి.
మనిషితో సహా అన్ని జీవులకు గాలి, నీరు, ఆహారం ద్వారానే ప్రాణశక్తి, జీవశక్తి, లభ్యమవుతున్నాయి
ప్రధానంగ శరీరానికి వుద్దేశింపబడిన యోగా దాని భిన్నతను అలా వుంచితే దరిమిలా ప్రాణశక్తి ప్రతిపాదిత ప్రాణాయామం శక్తి పూరకమే! అయితే శరీరానికి ప్రాణశక్తి బాహ్యమైనదా లేక అంతర్గతమా అనే విషయ విశ్లేషణ కూడ అవసరమే! ఈ సందర్భంగా శరీరం బలం మనోశక్తి మధ్యగల భేదం తెలియాలి.
What is spiritual power?
పంచభూత నిర్మితం శరీరమైనప్పుడు దాని ప్రాణశక్తి బలం వాటి ద్వారానే లభిస్తుంది. మనిషితో సహా అన్ని జీవులకు గాలి, నీరు, ఆహారం ద్వారానే ప్రాణశక్తి, జీవశక్తి, లభ్యమవుతున్నాయి. ఇంతకు మినహా ప్రాణశక్తి లభ్యతకు మనిషి చేయవలసినది వేరుగ ఏమీ లేదు.
జీవశక్తి ప్రాణశక్తిగా శరీర జీవక్రియ ద్వారా రసాయన చర్య కారణంగా మారుతోంది - ఆత్మ ద్వారా లభ్యమైయ్యే శక్తి ఏమిటి?
శరీరంలో ప్రాణశక్తితో పాటు అవసరమైన మరికొన్ని శక్తులు వున్నాయా? గాలి, నీరు, ఆహారం - వీటి ద్వారా లభించే, జీవశక్తి, ప్రాణశక్తిగా, పరివర్తన చెందడం అనేది శరీర జీవక్రియ ద్వారా దానికదే జరుగుతున్న, రసాయన చర్య. దానిలో మనిషి మనసు ప్రత్యేకంగా చేస్తున్నది ఏమీలేదు.
జీవశక్తిని కలిగియున్న ఆహారం, నీరు, గాలి శరీరానికి అందని పరిస్థితిలో శరీరం వాటిని తనలోకి తీసుకోలేని సమయాలలో జీవశక్తితోపాటు ప్రాణశక్తికీ క్షీణత కలగడం అనుభవమే! కనుక శరీర ఉనికికి, అవసరమైన జీవ, ప్రాణశక్తి, శరీర నిర్మాణానికి, కారణమైన పంచభూతాల ద్వారానే లభించడం జరుగుతోంది. 'స్వీకరణ - విసర్జన', క్రియద్వారానే జీవశక్తి ప్రాణశక్తి శరీరానికి లభిస్తున్నప్పుడు అదనంగా శరీరంలో వుందనుకునే 'ఆత్మ', ద్వారా కూడా మరేదో శక్తి లభ్యమవుతూ వుండాలి మరి! అదేదో తెలియడానికి ఆత్మ సంబంధమైన సమాచార జ్ఞానం అవసరం.
ఆత్మశక్తి - జీవశక్తి - ప్రాణశక్తిగా ప్రవేశం - ప్రాణశక్తి - జీవశక్తి - ఆత్మశక్తిగా శరీరం నుండి నిష్క్రమణ
బీజం/విత్తనంలోని జీవశక్తి అనుకూల పరిస్థితులలో మొలకగ, మొక్కగ, దరిమిలా వృక్షంగా విస్తరించినట్లే, 'అండం - పిండం'లోని జీవశక్తి జీవిగ, జీవజాతిగ వృద్ధిచెందినట్లే, మనిషిలోని విశ్వశక్తి(పరమాత్మ)పరమ సూక్ష్మత(జీవాత్మ)తగిన ఆధ్యాత్మిక సాధన ద్వారా అంతరాత్మగ వ్యాప్తమవుతుంది. ఆత్మశక్తి ప్రభావితమైన బ్రెయిన్ దాని తయారీ మనసు ఇంద్రియ సాధారణ స్థితికి ప్రత్యేకత లభిస్తుంది. ప్రస్థాన ధ్యాన ధ్యేయం - అదే! సీడ్‌లోని జీవశక్తి బాహ్యత నుండి వచ్చినది కాదు; దానిలోనిదే అది! అలాగే జీవి జీవశక్తి - ప్రాణశక్తి అండం - పిండంలోనిదే! వేరుగ బయటనుండి పిండంలో ప్రవేశించేవి కాదు. కనుక ఆత్మశక్తి - జీవశక్తి - ప్రాణశక్తి, జీవసృష్టి పరిణామ జన్మ సంబంధమైనదే! జీవితకాల పూర్తితో తిరోగమన క్రమంలో ప్రాణశక్తి - జీవశక్తి, పునః ఆత్మశక్తిగ; శక్తి స్థూలత, సూక్ష్మతగ; పునః పంచభూత ప్రకృతిలో చేరిపోవడంతో ఆకార దృశ్యత (శరీరం దాని జీవితం) సమాప్తమవుతుంది.
గర్భ స్థితినుండి ఆరంభమైన జీవశక్తి పంచభూత పోషణతో ప్రాణశక్తిగ శరీర రక్షణను సాగిస్తోంది. అందుకు అవాంతరం యేర్పడితే ఆ మేరకు ప్రాణశక్తి తగ్గిపోతూ క్రమంగా శరీరం శవంగా తన ఉనికిని కోల్పోతుంది.
ఆ స్థితి ఏ వయసులోనైనా ఏ కారణంగానైనా జరగవచ్చు. అలా అది ప్రకృతి సహజతే! ప్రమాద కారణాలు అనేకం.
ఆత్మ శక్తి - జీవాత్మ ఎక్కడ నుండి?
మనిషితో సహా జీవి మనుగడకు బాహ్య అంతరంగ జీవ ప్రాణశక్తికి పంచభూతాలే ఆధారం. మరి శరీరంలోని ఆత్మశక్తి ఎక్కడిది? ఆత్మ పంచభూత సంబంధమైనది కాదు గదా!
అయితే, పంచభూత నిర్మిత, ప్రకృతి జీవశక్తి - కేవలం, జీవపదార్థ సంబంధమైనదే! జీవశక్తికి, ప్రాణశక్తికి భిన్నమైన, ఆత్మశక్తి, పదార్థ సృష్టికి కారణమైన, విశ్వశక్తి,(పరమాత్మ) పరమ సూక్ష్మతే! ప్రకృతి జీవపదార్థం, సృష్టిపదార్థ, పరిణామ ఫలితమే కనుక, ఎంబాడీడ్, సృష్టి పదార్థ, విశ్వశక్తి (ద సుప్రీం సోల్) పరమసూక్ష్మత - ప్రకృతి, జీవం జీవులలో కూడ నిక్షిప్తమే! అదే జీవాత్మ. 'జీవస్థానికత' కారణంగ జీవాత్మగ వ్యవహరింపబడుతోంది.
బ్రెయిన్ న్యూరాన్లకు సంబంధించి 'వైటాలిటీ (ఫోర్స్)' - జీవకణాలకు 'ఇమ్యూన్'గా జీవశక్తి విభజన
శిరసు - శరీర భాగమైనప్పటికి ఫంక్షనల్ ప్రాధాన్యతతో దానికి వేరుగ ప్రత్యేకత వుంది. శరీర వ్యాప్తంగ కోట్లాది జీవకణాల కూర్పు వాటి నాడీమండల అనుసంధానం అదేతీరుగ బ్రెయిన్‌లోని న్యూరాన్లు - వాటి ప్రత్యేక అమరిక దేనికదే వాటి స్వరూప స్వభావాలు వేరుగ వుంటాయి. అలాగే వాటి జీవన నిర్వహణకు కావలసిన జీవశక్తిలో కూడ భేదం వుంది.
బ్రెయిన్ న్యూరాన్లకు సంబంధించి ప్రధానంగ 'వైటాలిటీ' అలాగే జీవకణాలకు 'ఇమ్యూన్'గ జీవశక్తి విభజన వుంది. శరీర జీవకార్య నిర్వహణగ భౌతిక శాస్త్ర దృక్పథంతో వైటాలిటిని 'ఫోర్స్'గ అలాగే ఇమ్యూనోను 'రెసిస్ట్'గ భావిస్తే ఆ రెండిటి మధ్య యేర్పడే క్రియాపూర్వక 'తటస్థ'తే బయోలాజికల్ లైఫ్ బ్యాలెన్స్; శరీర సజీవ జీవిత ఉనికికి ఆధారం.
కనుక వైటాలిటీ - ఇమ్యూనో (ఫోర్స్ - రెసిస్ట్) ఫంక్షనల్ క్వాలిటీ స్టేటస్‌ను అనుసరిస్తూ మానసిక, శారీరక 'ప్రత్యేకత - సాధారణత' ఆధారపడి వుంటాయి. వాటి సహజత తరతమ భేదాల హెచ్చుతగ్గులు కూడ ముఖ్యమైనవే! ఆ సహజ వృద్ధితో వాటి క్రియాత్మక మార్పుకు, అవకాశం వుంది. అందుకే వివిధ రీతులుగ భౌతిక ఆధ్యాత్మిక సాధన విధానాలు తద్వారా మానసిక స్థితి ఉన్నతికి శరీర ఆరోగ్య బ్యాలెన్స్‌కు అవకాశం వుంది. దానిలో భాగమే భౌతిక, మత, ఆధ్యాత్మిక నియమాలు, ఆచారాలు. వీటిలో మత మూఢతకు, మూర్ఖత్వానికి తావులేదు మరి! అలాగే వేదాంత నిష్క్రియా వైరాగ్యానికి, అసలే అవకాశం లేదు.
జీవక్రియలో ఫ్రీ-విల్ పాత్ర - భౌతికానికి (ప్రాణ శక్తి, జీవ శక్తి) అతీతంగా జీవక్రియ సాధ్యమా?
సహజ రీతిలో దానంతట అదే (స్వయం జీవక్రియా నిర్వహణ - ఆటోనెర్వ్‌సిస్టమ్) జరిగే జీవక్రియా విధానంలో మనిషి (ఫ్రీ-విల్) ఏదైన అవకాశం వుందా? అనేది ప్రశ్న. భౌతిక ప్రభావిత జీవ క్రియను తద్వారా, జీవిత విధానాన్ని మార్పు చేసే మరేదైన సాధన పద్ధతి వుందా? అనేది మరో ప్రశ్న. ప్రాణశక్తి - జీవశక్తితోపాటు ఆత్మశక్తి కూడ శరీరంలోనే వుంది. కనుక ఆత్మశక్తితో భౌతికానికి, భిన్నమైన రీతిలో జీవక్రియా స్వాధీనతకు గల అవకాశాన్ని అన్వేషించాలి.
జీవ శక్తి - ప్రాణశక్తి - ఆత్మశక్తి & ఆధ్యాత్మిక స్ఫూర్తి
శరీరంలో ప్రాణశక్తి - జీవశక్తి అలాగే ఆత్మశక్తి క్రమంలో పంచభూత సంబంధ నీరు - ఆహార స్వీకరణ ద్వారా శరీరానికి ప్రకృతి సహజ జీవశక్తి లభిస్తోంది. శ్వాస ప్రాణవాయువుతో జీవశక్తి ప్రాణశక్తిగ మార్పుచెంది, శరీర సజీవతకు కారణమవుతున్నట్లే 'కుండలిని' స్వయంచలన క్రియగా ఆత్మ స్పర్శగ (స్పిరిచ్యువల్ కాన్షస్‌నెస్) ఆత్మశక్తి అంతరాత్మ స్థాయితోపాటు బ్రెయిన్‌కు ఆధ్యాత్మిక ప్రేరణకు కారణమవుతోంది. ఇందుకు ముఖ్యంగా రాజయోగ ధ్యానయోగ సమన్వయత అవసరం.
జీవక్రియకు అవాంతరంతో అనారోగ్యం
శరీర బాహ్యాంతర అవయవాలలో కర్మేంద్రియాలను మినహాయిస్తే, మిగతావన్నీ స్వయం జీవచలనాన్ని కలిగినవే! పంచభూత రూపంలో వాటికి కావలసిన 'ఇంధన' సరఫరా చేయడమె మనిషి జీవి ఏదైనా చేయవలసిన చేయగలిగిన పని. ఏ కారణంగానైనా ఏ అవయవానికైనా జీవక్రియా అవాంతరం యేర్పడితే అలా దానికి 'రెస్ట్' లభిస్తే ఆ మేరకు శరీరానికి ఆనారోగ్యమే! ఔషధ వైద్య ప్రయోగంతో దానికి మామూలు పరిస్థితి యేర్పడేవరకు జీవిత క్రమానికి ఇబ్బందే! అదే 'లాంగ్ లీవ్' అయితే శాశ్వత శలవుతో జీవిత సమాప్తే!
స్పిరిట్ - మనిషి మూఢ నమ్మకమా
శరీరంలో, ప్రాణశక్తి, జీవశక్తి, ఆత్మశక్తి, మనసు, స్పిరిట్, వీటితోపాటు, సెల్ఫ్ (Self) అనే అంతరాత్మ సంబంధ ఇంత్యూసివ్ ఇన్సిపిరేషన్, యివన్నీ భాగాలే బయోలాజికల్ ఫంక్షనల్ ఎనర్జీ అంతర్భాగమే. స్మృతి ప్రభావిత సెల్ఫ్ (నా - నేను, అనే భావం) స్పిరిట్ (ప్రేతాత్మ)గ, స్థూల శరీర మరణానంతరం కూడ, పంచభూత ప్రకృతిలో తన, తత్కాలిక ఉనికిని కలిగి వుండే అవకాశం వుంది. అయితే మానవులందరికీ యిది సర్వసాధారణంగ వర్తించేది కాదు. మనిషి మూఢ నమ్మకం దీనిని వికృతం చేస్తోంది.
స్థూల శరీర మరణంతో మిగిలేది సూక్ష్మ శరీరంకాదు. ప్రకృతిలోకి తిరిగి చేరిపోయే జీవశక్తి సూక్ష్మత; అది జీవపదార్థ, శాశ్వత, శక్తి - పదార్ధ, పరివర్తన, పరిణామ ఈ జీవ శక్తి.పంచభూతాల జీవశక్తే, ప్రకృతి; దాని క్రియారూప చలనమే ప్రాణశక్తి.ఆత్మశక్తి, జీవశక్తిగ; జీవశక్తి, ప్రాణశక్తిగ, పరిణామ క్రమమె జీవి పుట్టుక, (తిరోగమనంలో), ప్రాణశక్తి, జీవశక్తిగ, దరిమిలా ఆత్మశక్తిగ పునఃప్రకృతి ప్రవేశమే జీవిత సమాప్తి.

No comments:
Post a Comment