Monday, December 10, 2018

"మాయ" నుండి సూక్ష్మ భూతములుగా ఉధ్భవించాయి

కేంద్ర బింధువుగా ఉన్న "మాయ" నుండి సూక్ష్మ భూతములుగా ఈ క్రింది అంశములు ఉధ్భవించాయి

     1. వాయువు
     2. అగ్ని
     3. ఆకాశము
     4. జలం
     5. భూమి

ఈ ఐదింటిలో ఒకటైన ఆకాశం నుండి ఈ క్రింది మూడు అంశములు పుట్టుకొచ్చాయి

    1. సాత్వికాంశము
    2  రాజసికాంశము
    3. తామసికాంశము

పై వాటిని ఒక్కొక్కటిగ వివరించు కుందాము

1. సాత్వికాంశము:-
===============

  చెవి
  చర్మము   ఈ ఐదింటిని
  కన్ను        జ్ఞానేంద్రియములు
  నాలుక     అని అంటారు
  ముక్కు

సూక్ష్మ పంచ భూతాల సమిష్టి సాత్వికాంశము నుండి ఏర్పడేవి అంతఃకరణములు అవి

   మనస్సు
   బుద్ది
   అహంకారము
   చిత్తము

2. రాజసికాంశము:-
===============

   నోరు                 ఈ ఐదింటిని
   చేతులు       కర్మేంద్రియములు
   పాదాలు                  అంటారు
   మల విసర్జనేంద్రియం
   జననేంద్రియం

సూక్ష్మ పంచ భూతాల సమిష్టి రాజసికాంశము నుండి ఏర్పడేవి పంచ ప్రాణములు అవి

    ప్రాణము
    అపానము
    సమానము
    ఉదానము
    వ్యానము

3. తామసికాంశము:-
================

   పై పంచ సూక్ష్మ భూతాలు పంచీకరణం చెంది, ఆకాశం, వాయువు,అగ్ని, జలం, భూమి అనే స్థూల పంచ భూతాలు ఏర్పడతాయి

పంచీకరణం అనగా ప్రతి సూక్ష్మ
భూతంలోని సగ భాగంతో మిగతా నాలుగు సూక్ష్మ భూతాలు సమ పాళ్ళలో కలిసి పోవటం.

పంచ స్థూల భూతాల నుండి స్థూల శరీరాలు ఆవిర్భవిస్తాయి, స్థూల శరీరమునే "పిండం" అని అంటారు
సమిష్టి స్థూల శరీరాల కలయిక వలన అండం లేక బ్రహ్మాండం ఏర్పడుతుంది

       ఈ విధంగా విశ్వంలో 24 తత్త్వములు కలవు, అవి

   పంచ భూతములు---------- 5
   కర్మేంద్రియములు------------ 5
   జ్ఞానేంద్రియములు----------- 5
   అంతఃకరణములు----------- 4
   పంచ ప్రాణములు------------ 5

         --- ఓమ్ తత్ సత్

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...