Monday, December 17, 2018

నేటి ఆణిముత్యం


విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం
విద్యా భోగకరీ యశః సుఖకరీ విద్యా గురూణాం గురుః ।
విద్యా బంధుజనో విదేశ గమనే విద్యా పరా దేవతా
విద్యా రాజసు పూజ్యతే న హి ధనం విద్యా విహీనః పశుః ॥ 16


తాత్పర్యము:

పురుషునికి విద్య అందము. అదియే అతనిలో దాచబడిన గుప్త ధనము. విద్య వలన సుఖభోగములు, కీర్తి కలుగును. విద్యయే సద్గురువు. పరాయిదేశములందు బందువలే సహాయపడు విద్య రాజపూజితము. విద్యను మించిన ధనము లోకమున వేరు లేదు. ఇట్టి విద్యలేనివాడు పశువుతో సమానము.

No comments:

Post a Comment

భోజన వడ్డన, భోజన విధి

 1.భోజనానికి ముందుగా చతురస్రమండలం చేయాలి. 2.తూర్పు, దక్షిణ, పడమర ముఖంగా కూర్చుని తినాలి.  3..మోదుగ, అరటి, పనస, మేడి ఆకులలో భోజనం ఉత్తమం  4.ఎ...