Friday, December 14, 2018

అష్టాంగ నమస్కారమే సాష్టాంగ నమస్కారము.

#మాతృమూర్తులు #తప్పక #చదవండి. #తెలుసుకోండి , #ఇతరులకు #తెలియచెప్పండి.

నమస్కారం అన్న పదం సంస్కృతం నుంచి వచ్చింది. సంస్కృతానికి చెందిన నమః అనే
పదం నుంచి నమస్కారం అన్న పదం ఏర్పడిననది. సంస్కృతంలో నమఃఅంటే విధేయత ప్రకటించామని అర్ధం.మనషు లందరిలోనూ దైవత్వము ఉంటుందని హిందువులు నమ్ముతారు.
దీనినే ఆత్మ అంటారు.

నమస్కారం పెట్టడం అంటే ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ ఎదుటి వ్యక్తిలోని ఆత్మను
గుర్తించి దానికి విధేయత ప్రకటించడం. ఇది అధ్యాత్మిక పరమైన వివరణ. శాస్త్రీయంగా చూస్తే నమస్కారం చేసేటప్పుడురెండు చేతుల వేలి కోసలు ఒకదానికొకటితాకుతాయి. మనం చేతి వేళ్ల కొనలకుకళ్ళు, చెవి, మెదడులతో సంబంధం ఉంటుంది.

నమస్కారం చేసేటప్పుడు వేలి కొనలు పరస్పరం ఒత్తుకోవడం వలన కళ్ళు, చెవి, మెదడు
కేంద్రాలు ఉత్తేజమవుతాయి. దానితోకళ్ళకు ఎదురుగా ఉన్న వ్యక్తిని మెదడు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడం.వాళ్ళ మాటల్ని చెవి గుర్తుంచుకోవడంజరుగుతుంది.అంటే మనం ఎవరికైనా చేతులు జోడించి నమస్కారం పెడితే వాళ్ళు మనకుఎక్కువ కాలం గుర్తుండిపోతారని అర్థం.

నమస్కారం అనేది మన సంస్కృతి,సంప్రదాయాలకు అనాదిగా ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఒక గౌరవసూచకం.తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేయాలి.మంచి నమస్కారం ఎలా ఉండాలంటే , మనసునిండా గౌరవాన్ని నింపుకుని, వినయం, విధేయత ఉట్టిపడేలా అవతలివారి హృదయాన్ని తాకాలి. అందుకే నమస్కారానిది హృదయం భాష.

సత్ప్రవర్తన అలవడాలంటే చెడును విస్మరించాలి. వినయ పూర్వకంగా "నమస్కారం లేదా నమస్తే" అని అనాలి. చూడగానే మనమేమిటో ఎదుటి వారికి తెలియదు.వినయాన్ని చాటుకోవాలంటే నమస్కారాన్ని అవతలి వారి హృదయాన్ని సుతారంగా తాకేలా గౌరవంగా చేయాలి.

శివునకు, విష్ణువుకు నమస్కరించేటపుడు తలనుంచి 12 అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి. శివకేశవుల్లో ఏ భేదం లేదని చాటడానికి ఇది గుర్తు. హరి హరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు. గురువునకు నమస్కారం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి.

తండ్రికి, ఇతర పెద్దలకు నోరుకు ఎదురుగా చేతులు జోడించాలి.
తల్లికి నమస్కరించేటపుడు చాతికి ఎదురుగా చేతులు జోడించి నమస్కరించాలి.
యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి.నమస్కారంలోని అంతర్గతం.భారతీయ హిందూసంస్కృతిలో నమస్కారం ఒక విశిష్ట ప్రక్ధియ. ఒకరి కొకరు ఎదురైతే

రెండు చేతులు జోడించి హృదయ స్థానం దగ్గర ఉంచి నమస్కారం చెప్పడం హిందువు అలవాటు.మామూలుగా చూస్తే నమస్కారం చేయడం అంటే ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం.

సాష్టాంగ నమస్కారం పురుషులు మాత్రమే చేయాలి. స్త్రీలు చేయకూడదు.పురుషులు తమ ఎనిమిది అంగాలను అంటే వక్షస్థలం, నుదురు, చేతులు, కాళ్లు, కళ్లు భూమిపై ఆనించి నమస్కరించడం.స్త్రీలను సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదని మన పెద్దలు చెప్పారంటే స్త్రీ ఉదరం నేలకు తగులుతుంది.ఆ స్థానంలో గర్భ కోశం ఉంటుంది.ఇలా చేయడం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది.అందుకే ఇతిహాసాల్లో, ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్లపై ఉండి నమస్కరించాలని చెప్పారు.

సాష్టాంగ నమస్కారము అంటే ఎనిమిది అంగాలతో నమస్కారము అని అర్ధం.ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామో^ ష్టాంగ ఈరితః

అష్టాంగాలు :- అంటే "ఉరసా" అంటే తొడలు, "శిరసా" అంటే తల, "దృష్ట్యా" అనగా కళ్ళు, "మనసా" అనగా హృదయం, "వచసా" అనగా నోరు, "పద్భ్యాం" అనగా పాదములు, "కరాభ్యాం" అనగా చేతులు, "కర్నాభ్యాం" అంటే చెవులు. ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.

మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటారు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి.

ఇలా చేయడం వల్ల మనం చేసినటువంటి పాపాలను దేవుడు క్షమింస్తాడని విశ్వసిస్తారు.

ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజస్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక చేయాలి.

1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.

2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు
తాకాలి.

3) దృష్టితో - నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.

4) మనస్సుతో నమస్కారం - అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.

5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం - నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి.

అంటే ఓం నమో నారాయణాయ లేదా ఓం నమశ్శివాయ అనో
అంటూ నమస్కారం చేయాలి.

6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

8.జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

నమస్కారం అన్నది సత్యగునమైనది .
అవకాశం ఉన్నంత వరకు ఎదుటి వ్యక్తికి
మంచి మనస్సుతో
చేతులు జోడించి నమస్కంరించడం
మంచిది. నమస్కారం ఒక మంచి సంస్కారం దీనిని మనం అందరం పాటిదాం.
ఎదుట వారికి నమస్కరించటంతో మన విలువ పెరుగుతుంది.
ఈ సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ మన పిల్లలకు నేర్పిద్దాం.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...