మనిషి దు:ఖానికి ,పతనానికి కూడా కారణమైన దుర్గుణాలు ఏమిటో చూద్దాం!అవి ముఖ్యంగా ఇవి—
- కామ —కామం (lust)
- క్రోధం-కోపం (anger )
- మోహ-వ్యామోహం(attachment)
- లోభ-లోభిత్వం,పొగరుబోతుతనం(greedy)
- మద-గర్వం (pride)
- మాత్సర్య–అసూయ (jealousy )
- స్వార్ధ–స్వార్ధం(selfishness)
- అన్యాయ-అన్యాయం చేయటం (injustice)
- అమానవత్వ-దయతో మెలగక పోవటం(cruelty)
- అహంకార–అహంకారం(ego)
వీటిల్లో మరీ ప్రమాదకరమైనవి ఈ క్రింది ఆరు గుణాలు !
వీటినే అరిషడ్వర్గాలని అంటారు!
1.కామం – ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండటం!
2. క్రోధము – కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవటం.
3. లోభం – కోరికతో తాను పొందినది తనకే దక్కాలని, ఇతరులకు చెందగూడదనే భావం కలిగి ఉండటమే లోభం! ఇటువంటి వారు సత్కార్యాలు కూడా చేయరు, ద్రవ్యాన్ని సద్వినియోగపరచరు.
4. మోహం – తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవటం.
5. మదం – తాను కోరిన కోరికలన్ని తీరటానికి కారణం తన గొప్పతనమేనని గర్వించుతూ ఇతరులను లెక్కచేయక పోవటం.
6. మాత్సర్యం – తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని, దక్కకూడదనే ఈర్ష్య కలిగి యుండటం.
(కామం అంటే కోరుకోవటం !ఇక్కడ కోరుకోవటం అంటే అతిగా కోరికలు కలిగి ఉండటం అని అర్ధం!మోహం అంటే పైన చెప్పాను !అంతేకాక పొందినదాని మీద విపరీతమైన వ్యామోహాన్ని పెంచుకోవటం!)
అరి అంటే శత్రువు, షట్ అంటే ఆరు(6), వర్గాలు అంటే రకాలు, భాగాలు! మనిషి ప్రపంచాన్ని జయించవచ్చు . సామ్రాట్ అని పిలిపించుకోవచ్చు! కానీ, మనలోనే ఉన్న ఈ ఆరింటిని జయించటం చాలా కష్టం. ఈ ఆరింటిని జయించిన వాడే నిజమైన యోగి !అతనే నిజమైన చక్రవర్తి !అదే అసలైన రాజయోగం!
అసలు ఇవి ఎందుకు కలుగుతాయి?
మనస్సుకు మలినము, విక్షేపము, ఆవరణము అనే దోషాలు మాయవల్ల కలుగుతున్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేవి మలినాలు.
ఇక ఒక్కక్క దాన్ని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం!
కామం –కామం అంటే కోరిక. మనస్సు ఇంద్రియాలతో కలసి ప్రాపంచిక విషయాలవైపుకు పోతుంది. అచ్చటి విషయాలు, సుఖాలు కావాలనే కోరికను కలిగిస్తుంది. ఒక కోరిక తీరిన పిదప మరో కోరిక కలుగుతూ, అలా అనంతమైన కోర్కెలతో మనస్సు పరుగులు పెడుతుంది.
క్రోధం–కామక్రోధాలు కలిసే ఉంటాయి. ప్రాపంచిక విషయవాంఛ కలుగగానే ఆ కోరికను తీర్చుకోడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం విఫలమైతే ఆలోచనను క్రోధం మలినం చేస్తుంది. క్రోధంవల్ల, బుద్ధినశిస్తుంది. అప్పుడు చెయ్యరాని పనులను చేస్తాం. అందుచేత కామం నశిస్తేనే గాని క్రోధం నశించదు.
లోభమోహాలు
అవివేకమే మోహం. ఈ శరీరమే నేను అనే భ్రాంతి మోహం! శరీరానికి సంబంధించిన సంపదలు, భార్య, పుత్రులు, మిత్రులు తనవారని అభిమానించడం మోహం. మోహం లేకపోతే కర్మఫలాలు, వాసనలు ఏర్పడవు.
లోభం అనేది తనకు, తనవారికి సంపద, సుఖాలు మొదలైనవి దాచుకొనే స్వభావమే లోభం. మోహం తొలగితేనే లోభమూ నశిస్తుంది.
మదమాత్సర్యములు
ఎదుటివారు తనకన్నా ఎక్కువ సంపదను కలిగి ఉండటంగాని లేదా మరోవిధంగా గాని అధికులైతే మధనపడుతుంటారు. ఇదే మత్సరం అంటే. కొందరిలో మిగిలిన వారికంటే తానే అధికుడను అనే భావముంటుంది. ఇదే మదము అనబడుతుంది. మదమాత్సర్యాలు రెండూ అనవసరమే.
ఈ అరిషడ్వర్గాలు అజ్ఞానం వల్ల కలుగుతున్నాయి. అజ్ఞానం నశిస్తే ఇవన్నీ నశిస్తాయి. దీనికి ఆత్మసాక్షాత్కారం/ఆత్మజ్ఞానం కలిగివుండటం ఒక్కటే మార్గం. ఆత్మసాక్షాత్కారం/ఆత్మజ్ఞానం కలిగివుండటం అంటే ఏమిటనే ప్రశ్న వెంటనే ఉదయించటం సహజం!వేదాంతులు,స్వామీజీలు దీన్ని జటిలం చేసి చెబుతారు!ఇది చాలా తేలికగా చెప్పొచ్చు!అన్ని జీవరాసులలో ఉండేది ఒకటే ఆత్మ!అందరి ప్రాణం ఒకటే !మనకున్న అవసరాలే ఎదుటివాడికి కూడా కలిగివుంటాయని తెలియటం ఆత్మజ్ఞానం కలగటానికి మొదటి మెట్టు !ఈ మొదటి మెట్టు ఎక్కితే ,తర్వాత మెట్టు -ఎదుటివాడు కూడా నా లాంటి వాడే అని భావన కలుగుతుంది. ఈ మెట్టు కూడా ఎక్కితే ,అందరూ ఒకటే అనే భావన కలుగుతుంది!ఈ భావన కూడా కలిగిన తర్వాత,అన్ని జీవరాసుల్లోనూ ఒకటే ఆత్మ ఉందనే భావన పొందొచ్చు!ఇదే ఆత్మ జ్ఞానం/ఆత్మ సాక్షాత్కారం!ఇది పొందటానికి గురువులు అక్కరలేదు!అన్ని పరిత్యజించనవసరంలేదు. ఈ సంసారంలోనే తామరాకు మీద నీటి బొట్టులా ఉండటం నేర్చుకుంటే చాలు!ఇది కూడా కష్టమే కానీ సాధన ద్వారా సాధ్యపడుతుంది!
వీటిని జయించటానికి ముఖ్యమైన మార్గం –ముందు ఇవి మనలో ఉన్నాయని తెలుసుకోవటం!వీటిని జయించటం చాలా కష్టం ! ఎంత వదులుకున్నామన్నా ,ఇవి మనల్ని అంటిపెట్టుకునే ఉంటాయి! జయించటం అంటే పూర్తిగా కోరికలు లేకుండా ఉండటం కాదు!ఒక తండ్రిగా మనం ,మన సంతానాన్ని ప్రేమించాలి,భార్యను ప్రేమించాలి ,వారి అవసరాలు తీర్చాలి, అనుసరించే వారికి,తోటివారితో ఆదర్శప్రాయంగా ఉండాలి … ఇలా మనం ఉండవలసిన విధంగా ,పైన చెప్పిన కోరికలను (neither less nor more) అదుపులో ఉంచుకొని ఉండాలి!అంటే,సహజంగా జీవించాలి!ఇలా సహజంగా ఉండటం సహజయోగం!
మనస్సుకు మలినము, విక్షేపము, ఆవరణము అనే దోషాలు మాయవల్ల కలుగుతున్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేవి మలినాలు. వీటినే అంతరంగంలో ఉండే శత్రువులుగా చెప్పడం విన్నాం కూడ. విక్షేపశక్తి అంటే లేనివస్తువును ఉన్నట్లుగా కల్పించడం. మాయయొక్క విక్షేపశక్తి వల్ల అరిషడ్వర్గాలు కలుగుతున్నాయి. ఇవి కారణ శరీరమందలి రజోగుణం యొక్క విక్షేపశక్తి వల్ల కల్గి, మనస్సులోనికి వ్యాప్తిచెంది అనేకమైన కర్మలకు, వాటి ఫలాలకూ కారణమవుతున్నాయి. ఇలా మలినమైన ఆలోచనకు అహంకారం తోడై, నేను చేస్తున్నాను అనే భావం కలిగి బంధానికి కారణమవుతోంది. అందుకే కర్మయోగంలో ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చెయ్యాలని చెప్పబడింది. ఇట్టి కర్మాచరణ వల్ల చిత్తము పరిశుద్ధమై జ్ఞానం కల్గుతుంది. అలా కర్మాచరణ చేస్తుండగా నిర్వికారమైన మనస్సుతో కర్మలు చేసే నైపుణ్యం కల్గుతుంది.
కామము
కామము అంటే కోరిక. ఇదే విషయవాసన. మనస్సు ఇంద్రియాలతో కలసి ప్రాపంచిక విషయాలవేపుకు పోతుంది. అచ్చటి విషయాలు, సుఖాలు కావాలనే కోరికను కలిగిస్తుంది. ఒక కోరిక తీరిన పిదప మరో కోరిక కల్గుతూ అలా అనంతమైన కోర్కెలతో మనస్సు పరుగులు పెడుతుంది. వీటిలో తీరని కోరికలు మరణ సమయానికి మిగిలి ఉండటం వల్ల వాటిని అనుభవించడానికి మరో జన్మను పొందాల్సి వస్తూ , ఇలా జనన మరణ చక్రంలో బంధాన్ని కల్గిస్తున్నాయి. ఈ కోర్కెలు నశించాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మజ్ఞానం వల్ల అనాత్మ వస్తువులయందు ఆసక్తి సన్నగిల్లుతుంది. వైరాగ్యం కలిగి చివరకు తనే బ్రహ్మమనే అనుభవానికి దోహదమవుతుంది. ఆత్మసాక్షాత్కారం కల్గిన జ్ఞానికిజగత్తంతా బ్రహ్మంగానే గోచరించి కామం పూర్తిగా నశిస్తుంది.
క్రోధము
కామక్రోధాలు కలిసే ఉంటాయి. ప్రాపంచిక విషయవాంఛ కలుగగానే ఆ కోరికను తీర్చుకోడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం విఫలమైతే ఆలోచనను క్రోధం మలినం చేస్తుంది. అట్టి క్రోధంవల్ల అవివేకం కల్గి బుధ్ధి నశిస్తుంది. అప్పుడు చెయ్యరాని పనులను చేస్తాం. అందుచేత కామం నశిస్తేనే గాని క్రోధం నశించదు. కామక్రోధాలు రెండూ నశించాలంటే ఆత్మజ్ఞానం కలగాలి.
లోభమోహాలు
మోహం అజ్ఞానలక్షణం. అవివేకమే మోహం. ఈ శరీరమే నేను అనే భ్రాంతి మోహము. శరీరానికి సంబంధించిన సంపదలు, భార్య, పుత్రులు, మిత్రులు తనవారని అభిమానించడం మోహం. అదే దేహవాసన. ఈ మోహం వల్లఫలాపేక్షతో కూడిన కర్మప్రవృత్తి కల్గి బంధానికి కారణమవుతుంది. మోహం లేకపోతే కర్మఫలాలు, వాసనలు ఏర్పడవు. అంచేత జననమరణాలుండవు. సృష్టి కొనసాగుతోంది అంటే డానికి మొహమే కారణం.
లోభము అనేది తనకు తనవారికి సంపద, సుఖాలు మొదలైనవి దాచుకొనే స్వభావమే లోభం. మోహం తొలగితేనే లోభమూ నశిస్తుంది. ఈ రెండూ ఆత్మజ్ఞానం వల్లే నశిస్తాయి.
మదము మాత్సర్యములు
ఎదుటివారు తనకన్నా ఎక్కువ సంపదను కలిగి ఉండటంగాని లేదా మరోవిధంగా గాని అధికులైతే మదనపడుతుంటారు. ఇదే మత్సరం అంటే. కొందరిలో మిగిలిన వారికంటే తానే అధికుడను అనే భావముంటుంది. ఇదే మదము అనబడుతుంది. మదమాత్సర్యాలు రెండూ అనవసరమే.
మానవులంతా ఆత్మస్వరూపులు ఐనపుడు సుఖదుఃఖాలను అనుభవించేది ఒకే ఆత్మచైతన్యం. కర్మఫలాలను బట్టి ఈ వ్యత్యాసాలు కలుగుతాయి. ఆత్మజ్ఞానం వల్లనే ఈ మదమాత్సర్యాలు సన్నగిల్లుతాయి.
ఈ అరిషడ్వర్గాలు అజ్ఞానం వల్ల కల్గుతున్నాయి. ఇవి కారణశరీరం యొక్క రజోగుణ విక్షేపధర్మం వల్ల కల్గుతున్నాయి. కారణశరీరం అజ్ఞానం వల్ల ఏర్పడింది. అజ్ఞానం నశిస్తే ఇవన్నీ నశిస్తాయి. దీనికి ఆత్మసాక్షాత్కారం ఒక్కటే మార్గం. అరిషడ్వర్గాలు నశించాలంటే మనస్సు నశించాలి. మనోనాశనమే మోక్షమని చెప్పబడింది.
No comments:
Post a Comment