Sunday, December 30, 2018

సూర్యోపనిషత్



🕉 ఓం శ్రీమాత్రే నమః 🕉

అద్వైత చైతన్య జాగృతి

ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: !
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా: !
స్థిరైరఙ్గైస్తుష్టువాగం సస్తనూభి: !
వ్యశేమ దేవహితం యదాయు: !
స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవా: !
స్వస్తి న పూషా విశ్వవేదా: !
స్వస్తినస్తార్ష్క్యో అరిష్టనేమి: !
స్వస్తి నో బృహస్పతిర్దధాతు !!
ఓం శాంతి: శాంతి: శాంతి: !!!


ఓ దేవతలార ! మా చెవులు శుభాన్నే వినుగాక ! యజ్ణకోవిదులైన మేము మా కళ్ళతో శుభాన్నే చూచెదముగాక !  మీ స్తోత్రాలను గానం చేస్తూ మాకు
నియమిత్తమైన ఆయుష్కాలాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో, బలముతో గడిపెదముగాక ! శాస్త్ర ప్రసంశితుడైన ఇండ్రుడు, సర్వజ్ణుడైన సూర్యుడు,
ఆపదలనుండి రక్షించే గరుత్మంతుడు, మా బ్రహ్మవర్చస్సును పాలించే బృహస్పతి, మాకు శాస్త్రాధ్యయనంలో, సత్యానుష్టానంలో అభ్యుధయాన్ని
ఒసగెదరుగాక!



ఓం అథ సూర్యాథర్వాఙ్గిరసం వ్యాఖ్యాస్యామ: !

ఓం! అథర్వణవేదంలోని అంగిరసుల సూర్యోపనిషత్ చెబుతాము.


బ్రహ్మా ఋషి: !
గాయత్రీ ఛన్ద: !
ఆదిత్యో దేవతా !
హంస: సోఁహమగ్ని నారాయణయుక్తం బీజమ్ !
హృల్లేఖా శక్తి: !
వియదాదిసర్గసంయుక్తం కీలకమ్ !
చతుర్విధపురుషార్థ సిద్ధ్యర్థే వినియోగ: !


బ్రహ్మయే ఋషి... ఆదిత్యుడే దేవత... అగ్ని,నారాయణులు బీజం... హృల్లేఖ శక్తి... సృష్టి యావత్తూ కీలకం... చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి ఈ
సాధన!


షట్ స్వరారూఢేన బీజేన షడఙ్గం రక్తామ్బుజ సంస్థితం
సప్తాశ్వరథినం హిరణ్యవర్ణం చతుర్భుజం పద్మద్వయాఁభయవరదహస్తం
కాలచక్రప్రణేతారం శ్రీసూర్యనారాయణ య ఏవం వేద స వై బ్రాహ్మణ: !!


ఆరు స్వరాల బీజం కారణంగా ఆరు అంశాలు కలవాడు. ఎర్ర తామర మీద ఉండేవాడు, ఏడు గుఱ్ఱాల రథం గలవాడు, బంగారు వర్ణం కలవాడు, నాలుగు
భుజాలవాడు, రెండు పద్మాలతో అభయ వరద ముద్రలు కలిగినవాడు, కాలచక్రాన్ని నడిపేవాడు
అయిన శ్రీ సూర్యనారాయణుని తెలిసినవాడే బ్రాహ్మణుడు.


ఓ భూర్భువ సువ: !
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి !
ధి యో యో న: ప్రచోదయాత్ !


ప్రణవరూపమైన నిరాకారమైన "భూ, భువః, సువః" అనే మూడులోకాల రూపమైనడి, సృజన కర్తయొక్క దివ్యమైన ఆరాధనీయమైన ఏ కాంతి ఉన్నదో
దానిని ధ్యానించు తాము. అది మా బుధ్థులను ఉత్తేజపరచు గాక!


సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ !
సూర్యాద్వై ఖల్విమాని భూతాని జాయస్తే !
సూర్యాద్యజ్ఞ: పర్జన్యోఁన్నమాత్మా !


మారిపోయే ప్రపంచంయొక్క మార్పులేని తత్వానికి సూర్యుడే ఆత్మ. సూర్యుడు నుండే ప్రాణులు జనిస్తారు. సూర్యుడు నుండి యజ్ఞము, మేఘము,
అన్నము, పురుషుడు జనిస్తాయి.


నమస్తే ఆదిత్య !
త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి !
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి !
త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి !
త్వమేవ ప్రత్యక్షం రుద్రోఁసి !
త్వమేవ ప్రత్యక్షం ఋగసి !
త్వమేవ ప్రత్యక్షం యజురసి !
త్వమేవ ప్రత్యక్షం సామాసి !
త్వమేవ ప్రత్యక్షమథర్వాసి !
త్వమేవ సర్వం ఛన్దోఁసి !


ఓ ఆదిత్యుడా! నీకు నమస్కారం. నీవే ప్రత్యక్షంగా కర్మ చేసే కర్తవు. నీవే ప్రత్యక్షంగా ఉన్న ఋక్సామ యజురధర్వణ వేదాలవు. అన్ని వేద సూక్తాలు నీవా!


ఆదిత్యాద్వాయుర్జాయతే !
ఆదిత్యాద్భూమిర్జాయతే !
ఆదిత్యాదాపోజాయస్తే !
ఆదిత్యాజ్జ్యోతిర్జాయతే !
ఆదిత్యాద్యోమ దిశో జాయస్తే !
ఆదిత్యాద్దేవాః జాయస్తే !
ఆదిత్యాద్వేదాః జాయస్తే !


ఆదిత్యుడినుండి వాయువు, భూమి, నీరు, అన్నీ పుడతాయి. ఆదిత్యుడినుండి వ్యోమం దిక్కులు పుడతాయి. ఆదిత్యుని వల్లనే దేవతలు పుడతారు.
ఆదిత్యుని వల్లనే వేదాలు పుడతాయి.


ఆదిత్యో వా ఏష ఏతన్మణ్డలం తపతి !
అసావాదిత్యో బ్రహ్మా !


ప్రకాశించే, తపించే ఈ మండలం ఆదిత్యుడే. ఆదిత్యుడు బ్రహ్మము!


ఆదిత్యోంత:కరణ - మనోబుద్ధి - చిత్తాహంకారా: !

ఆదిత్యో వై వ్యానస్సమానోదానోఁపాన: ప్రాణ: !

ఆదిత్యో వై శ్రోత్ర - త్వక్ చశౄరసనధ్రాణా: !

ఆదిత్యో వై వాక్పాణిపాద పాయుపస్థా: !

ఆదిత్యోవై శబ్ద స్పర్శరూప రసగన్ధా: !

ఆదిత్యో వై వచనాదానాగమన విసర్గానన్దా: !

ఆనన్దమయో విజ్ఞానమయో విజ్ఞానఘన ఆదిత్య: !

ఆదిత్యుడే అంతః కారణాలైన మనోబుధ్థిచిత్తాహంకారాలు.

ఆదిత్యుడే వ్యాన, సమాన, ఉదాన, అపాన, ప్రాణాలు.

 ఆదిత్యుడే శ్రోత్రత్వక్ రసనా ఘ్రాణాలు.

ఆదిత్యుడే వాక్కు, పాణి పాదాలు, పాయూవస్థలు.

 ఆదిత్యుడే శబ్ధ, స్పర్శ, రూప, రస, గంథాలు.

ఆదిత్యుడే పలకడం, స్వీకరించడం, రావడం, విసర్జించడం,
ఆనందించడం.

 ఆనందమయుడై, విజ్ఞానమయుడైన, విజ్ఞాన ఘనస్వారూపుడు ఆదిత్యుడే.


నమో మిత్రాయ భానవే మృత్యోర్మా పాహి !
భ్రాజిష్ణవే విశ్వహేతవే నమ: !

మిత్రుడివన నీకు నమస్కారం! ప్రకాశ స్వరూపుడికి నమస్కారం! మృత్యువు నుండి నాన్ను రక్షించు. తేజోవంతునికి, విశ్వహేతువైన వానికి, నమస్కారం!


సూర్యాద్భవన్తి భూతాని సూర్యేణ పాలితాని తు !
సూర్యే లయం ప్రాప్నువన్తి య: సూర్య: సోఁహమేవ చ !


సూర్యుడినుండే ప్రాణులు పుడతాయి. సూర్యుడివల్ల పాలింపబడతాయి. సూర్యునిలో లయించుతాయి . ఎవరు సూర్యుడో అతడే నేను.



చక్షుర్నో దేవ: సవితా చక్షుర్న ఉత పర్వత: !
చక్షు-ర్ధాతా దధాతు న: !

దివ్యమైన సూర్యుడే మా నేత్రం. నేత్రదృష్థి మాకు పరిపూర్ణతను

ఇస్తుంది. ఈశ్వరుడు మాకు దృష్టి ప్రసాదించుకాక.



ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి !
తన్న: సూర్య: ప్రచోదయాత్ !

సహస్రకిరణుడైన ఆదిత్యునికోసం జ్ఞానార్జన చేస్తాము. ధ్యానిస్తాము. అట్టి సూర్యుడు మాకు ఉత్తేజాన్ని ఇచ్చును గాక!



సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్ !
సవితా న: సువతు సర్వతాతిఁ సవితా నో రాసతాం దీర్ఘమాయు: !

వెనుక, ఎదురుగా, పైన, క్రిందా అంతటా సవితృడే. ఆ సవితృడే మాకు అంతటా పూర్ణత్వాన్ని ప్రసవించును గాక! మాకు సవిత్రుడు దీర్ఘాయువును
ప్రసాదించును గాక!



ఓమిత్యేకాక్షరం బ్రహ్మా !
ఘృణిరితి ద్వే అక్షరే !
సూర్య ఇత్యక్షరద్వయమ్ !
ఆదిత్య ఇతి త్రీణ్యక్షరాణి !
ఏతస్వైవ సూర్యస్యాష్టాక్షరో మను: !


'ఓం' అనేది ఏకాక్షర బ్రహ్మము. 'ఘృణి' అనేది రెండు అక్షరాలు. 'ఆదిత్య' అనేది మూడు అక్షరాలు. "ఓం ఘృణిః సూర్యః ఆదిత్యః" అనేవి ఏకమైన సూర్యుని
అష్టాక్షరీ మంత్రం.



యస్సదాహ రహ ర్జపతి
స వై బ్రాహ్మణో భవతి
స వై బ్రాహ్మణో భవతి !

ఈ మంత్రాన్ని ఎవరు సదా దినదినమూ జపిస్తారో అతడే బ్రాహ్మణుడవుతాడు.



సూర్యాభిముఖో జప్త్వా, మహావ్యాధి భయాత్ ప్రముచ్యతే !
అలక్ష్మీర్నశ్యతి !
అభక్ష్య భక్షణాత్ పూతో భవతి !
అగమ్యాగమనాత్ పూతో భవతి !
పతిత సంభాషణాత్ పూతో భవతి !
అసత్ సంభాషనాత్ పూతో భవతి !


సూర్యునికి అభిముఖంగా నిలచి జపించడం వల్ల మహా వ్యాధి భయాన్నుండి విడివడుతాడు. దారిద్ర్యం నశిస్తుంది. తినకూడనిది తిన్న పాపం నుండి,
పతితులతో కలసి సంభాషించిన పాపంఋ నుండి, అసత్య భాషణ పాపం నుండి విముక్తుడై పవిత్రుడౌతాడు.



మధ్యాహ్నే సూర్యాభిముఖ: పఠేత్ !
సద్యోత్పన్నఞ్చ మహాపాతకాత్ ప్రముచ్యతే !


మధ్యాహ్నం సూర్యాభిముఖుడై ఉపనిషత్ ను పఠించాలి. ఉత్పన్నమైన పంచమహా పాతకాలనుండి  వెంటనే విముక్తుడౌతాడు.



సైషా సావిత్రీం విద్యాం న కించిదపి న కస్మైచిత్ప్రశంసయేత్ !
అదే సావిత్రీ విద్య. కొంచం కూడా, దేనికోసమూ ఎవరినీ పొగడడం కాని, నిందించడం కాని చేయరాదు.



య ఏతాం మహాభాగ: ప్రాత: పఠతి, స భాగ్యవాన్ జాయతే పశూన్విన్దతి !
వేదార్థం లభతే !


ఏ అదృష్టవంతుడు ఉదయమే దీనిని పఠిస్తాడో, అతడు భాగ్యవంతుడౌటాడు. పసు సంపద పొందుతాదు. వేదార్థాలను పొందుతాడు.



త్రికాలమేతజ్జప్త్వా, క్రతుశతఫల
మవాప్నోతి !
హస్తాదిత్యే జపతి,
స మహామృత్యుం తరతి స మహామృత్యుం తరతి య ఏవం వేద ! ఇత్యుపనిషత్ !!


దీనిని మూడు కాలాలలోనూ జపించడం వల్ల నూరు యాగాల ఫలాన్ని పొందుతాడు. ఆదిత్యుడు హస్తలో ఉండగా జపించినప్పుడు, అతడు
మహామృత్యువును దాటుతాడు ఇలా ఎవరు తెలుసు కొంటారో! ఇదే ఉపనిషత్తు.

ఓం శాంతి: శాంతి: శాంతిః

Saturday, December 29, 2018

అరిషడ్వర్గాలు! (The Enemies Within Us)


మనిషి దు:ఖానికి ,పతనానికి కూడా కారణమైన దుర్గుణాలు ఏమిటో  చూద్దాం!అవి ముఖ్యంగా ఇవి—

  • కామ —కామం (lust)
  • క్రోధం-కోపం (anger )
  • మోహ-వ్యామోహం(attachment)
  • లోభ-లోభిత్వం,పొగరుబోతుతనం(greedy)
  • మద-గర్వం (pride)
  • మాత్సర్య–అసూయ (jealousy )
  • స్వార్ధ–స్వార్ధం(selfishness)
  • అన్యాయ-అన్యాయం చేయటం (injustice)
  • అమానవత్వ-దయతో మెలగక పోవటం(cruelty)
  • అహంకార–అహంకారం(ego)



వీటిల్లో మరీ ప్రమాదకరమైనవి ఈ క్రింది ఆరు గుణాలు !

వీటినే అరిషడ్వర్గాలని  అంటారు!

1.కామం  – ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండటం!

2. క్రోధము – కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవటం.

3. లోభం  – కోరికతో తాను పొందినది తనకే దక్కాలని, ఇతరులకు చెందగూడదనే భావం కలిగి ఉండటమే లోభం! ఇటువంటి వారు సత్కార్యాలు కూడా చేయరు, ద్రవ్యాన్ని సద్వినియోగపరచరు.

4. మోహం  – తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవటం.

5. మదం  – తాను కోరిన కోరికలన్ని తీరటానికి కారణం తన గొప్పతనమేనని గర్వించుతూ ఇతరులను లెక్కచేయక పోవటం.

6. మాత్సర్యం  – తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని,   దక్కకూడదనే ఈర్ష్య కలిగి యుండటం.

(కామం అంటే కోరుకోవటం !ఇక్కడ కోరుకోవటం అంటే అతిగా కోరికలు కలిగి ఉండటం అని అర్ధం!మోహం అంటే పైన చెప్పాను !అంతేకాక పొందినదాని మీద విపరీతమైన వ్యామోహాన్ని పెంచుకోవటం!)

అరి అంటే శత్రువు, షట్ అంటే ఆరు(6), వర్గాలు అంటే రకాలు, భాగాలు! మనిషి ప్రపంచాన్ని జయించవచ్చు . సామ్రాట్ అని పిలిపించుకోవచ్చు! కానీ, మనలోనే ఉన్న ఈ ఆరింటిని  జయించటం చాలా కష్టం. ఈ ఆరింటిని జయించిన వాడే నిజమైన యోగి !అతనే నిజమైన చక్రవర్తి !అదే అసలైన రాజయోగం!

అసలు ఇవి ఎందుకు కలుగుతాయి?
మనస్సుకు మలినము, విక్షేపము, ఆవరణము అనే దోషాలు మాయవల్ల కలుగుతున్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేవి మలినాలు.
ఇక ఒక్కక్క దాన్ని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం!

కామం –కామం అంటే కోరిక.  మనస్సు ఇంద్రియాలతో కలసి ప్రాపంచిక విషయాలవైపుకు పోతుంది. అచ్చటి విషయాలు, సుఖాలు కావాలనే కోరికను కలిగిస్తుంది. ఒక కోరిక తీరిన పిదప మరో కోరిక కలుగుతూ,  అలా అనంతమైన కోర్కెలతో మనస్సు పరుగులు పెడుతుంది.

క్రోధం–కామక్రోధాలు కలిసే ఉంటాయి. ప్రాపంచిక విషయవాంఛ కలుగగానే ఆ కోరికను తీర్చుకోడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం విఫలమైతే ఆలోచనను క్రోధం మలినం చేస్తుంది. క్రోధంవల్ల, బుద్ధినశిస్తుంది. అప్పుడు చెయ్యరాని పనులను చేస్తాం. అందుచేత కామం నశిస్తేనే గాని క్రోధం నశించదు.

లోభమోహాలు
అవివేకమే మోహం. ఈ శరీరమే నేను అనే భ్రాంతి మోహం! శరీరానికి సంబంధించిన సంపదలు, భార్య, పుత్రులు, మిత్రులు తనవారని అభిమానించడం మోహం. మోహం లేకపోతే కర్మఫలాలు, వాసనలు ఏర్పడవు.

లోభం అనేది తనకు, తనవారికి సంపద, సుఖాలు మొదలైనవి దాచుకొనే స్వభావమే లోభం. మోహం తొలగితేనే లోభమూ నశిస్తుంది.

మదమాత్సర్యములు
ఎదుటివారు తనకన్నా ఎక్కువ సంపదను కలిగి ఉండటంగాని లేదా మరోవిధంగా గాని అధికులైతే మధనపడుతుంటారు. ఇదే మత్సరం అంటే. కొందరిలో మిగిలిన వారికంటే తానే అధికుడను అనే భావముంటుంది. ఇదే మదము అనబడుతుంది. మదమాత్సర్యాలు రెండూ అనవసరమే.

ఈ అరిషడ్వర్గాలు అజ్ఞానం వల్ల కలుగుతున్నాయి.  అజ్ఞానం నశిస్తే ఇవన్నీ నశిస్తాయి. దీనికి ఆత్మసాక్షాత్కారం/ఆత్మజ్ఞానం కలిగివుండటం ఒక్కటే మార్గం. ఆత్మసాక్షాత్కారం/ఆత్మజ్ఞానం కలిగివుండటం అంటే ఏమిటనే ప్రశ్న వెంటనే ఉదయించటం సహజం!వేదాంతులు,స్వామీజీలు దీన్ని జటిలం చేసి చెబుతారు!ఇది చాలా తేలికగా చెప్పొచ్చు!అన్ని జీవరాసులలో ఉండేది ఒకటే ఆత్మ!అందరి ప్రాణం ఒకటే !మనకున్న అవసరాలే ఎదుటివాడికి కూడా కలిగివుంటాయని తెలియటం ఆత్మజ్ఞానం కలగటానికి మొదటి మెట్టు !ఈ మొదటి మెట్టు ఎక్కితే ,తర్వాత మెట్టు -ఎదుటివాడు కూడా నా లాంటి వాడే అని భావన కలుగుతుంది. ఈ మెట్టు కూడా  ఎక్కితే ,అందరూ ఒకటే అనే భావన కలుగుతుంది!ఈ భావన కూడా కలిగిన తర్వాత,అన్ని జీవరాసుల్లోనూ ఒకటే ఆత్మ ఉందనే భావన పొందొచ్చు!ఇదే ఆత్మ జ్ఞానం/ఆత్మ సాక్షాత్కారం!ఇది పొందటానికి గురువులు అక్కరలేదు!అన్ని పరిత్యజించనవసరంలేదు. ఈ సంసారంలోనే  తామరాకు మీద నీటి బొట్టులా ఉండటం నేర్చుకుంటే చాలు!ఇది కూడా కష్టమే కానీ  సాధన ద్వారా సాధ్యపడుతుంది!

వీటిని జయించటానికి ముఖ్యమైన మార్గం –ముందు ఇవి మనలో ఉన్నాయని తెలుసుకోవటం!వీటిని జయించటం చాలా కష్టం ! ఎంత వదులుకున్నామన్నా ,ఇవి మనల్ని అంటిపెట్టుకునే ఉంటాయి! జయించటం అంటే పూర్తిగా కోరికలు లేకుండా ఉండటం కాదు!ఒక  తండ్రిగా మనం ,మన సంతానాన్ని ప్రేమించాలి,భార్యను ప్రేమించాలి ,వారి అవసరాలు తీర్చాలి, అనుసరించే వారికి,తోటివారితో ఆదర్శప్రాయంగా ఉండాలి … ఇలా మనం ఉండవలసిన విధంగా ,పైన చెప్పిన కోరికలను (neither less nor more) అదుపులో ఉంచుకొని ఉండాలి!అంటే,సహజంగా జీవించాలి!ఇలా సహజంగా ఉండటం సహజయోగం!

మనస్సుకు మలినము, విక్షేపము, ఆవరణము అనే దోషాలు మాయవల్ల కలుగుతున్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేవి మలినాలు. వీటినే అంతరంగంలో ఉండే శత్రువులుగా చెప్పడం విన్నాం కూడ. విక్షేపశక్తి అంటే లేనివస్తువును ఉన్నట్లుగా కల్పించడం. మాయయొక్క విక్షేపశక్తి వల్ల అరిషడ్వర్గాలు కలుగుతున్నాయి. ఇవి కారణ శరీరమందలి రజోగుణం యొక్క విక్షేపశక్తి వల్ల కల్గి, మనస్సులోనికి వ్యాప్తిచెంది అనేకమైన కర్మలకు, వాటి ఫలాలకూ కారణమవుతున్నాయి. ఇలా మలినమైన ఆలోచనకు అహంకారం తోడై, నేను చేస్తున్నాను అనే భావం కలిగి బంధానికి కారణమవుతోంది. అందుకే కర్మయోగంలో ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చెయ్యాలని చెప్పబడింది. ఇట్టి కర్మాచరణ వల్ల చిత్తము పరిశుద్ధమై జ్ఞానం కల్గుతుంది. అలా కర్మాచరణ చేస్తుండగా నిర్వికారమైన మనస్సుతో కర్మలు చేసే నైపుణ్యం కల్గుతుంది.


కామము
కామము అంటే కోరిక. ఇదే విషయవాసన. మనస్సు ఇంద్రియాలతో కలసి ప్రాపంచిక విషయాలవేపుకు పోతుంది. అచ్చటి విషయాలు, సుఖాలు కావాలనే కోరికను కలిగిస్తుంది. ఒక కోరిక తీరిన పిదప మరో కోరిక కల్గుతూ అలా అనంతమైన కోర్కెలతో మనస్సు పరుగులు పెడుతుంది. వీటిలో తీరని కోరికలు మరణ సమయానికి మిగిలి ఉండటం వల్ల వాటిని అనుభవించడానికి మరో జన్మను పొందాల్సి వస్తూ , ఇలా జనన మరణ చక్రంలో బంధాన్ని కల్గిస్తున్నాయి. ఈ కోర్కెలు నశించాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మజ్ఞానం వల్ల అనాత్మ వస్తువులయందు ఆసక్తి సన్నగిల్లుతుంది. వైరాగ్యం కలిగి చివరకు తనే బ్రహ్మమనే అనుభవానికి దోహదమవుతుంది. ఆత్మసాక్షాత్కారం కల్గిన జ్ఞానికిజగత్తంతా బ్రహ్మంగానే గోచరించి కామం పూర్తిగా నశిస్తుంది.


క్రోధము
కామక్రోధాలు కలిసే ఉంటాయి. ప్రాపంచిక విషయవాంఛ కలుగగానే ఆ కోరికను తీర్చుకోడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం విఫలమైతే ఆలోచనను క్రోధం మలినం చేస్తుంది. అట్టి క్రోధంవల్ల అవివేకం కల్గి బుధ్ధి నశిస్తుంది. అప్పుడు చెయ్యరాని పనులను చేస్తాం. అందుచేత కామం నశిస్తేనే గాని క్రోధం నశించదు. కామక్రోధాలు రెండూ నశించాలంటే ఆత్మజ్ఞానం కలగాలి.


లోభమోహాలు
మోహం అజ్ఞానలక్షణం. అవివేకమే మోహం. ఈ శరీరమే నేను అనే భ్రాంతి మోహము. శరీరానికి సంబంధించిన సంపదలు, భార్య, పుత్రులు, మిత్రులు తనవారని అభిమానించడం మోహం. అదే దేహవాసన. ఈ మోహం వల్లఫలాపేక్షతో కూడిన కర్మప్రవృత్తి కల్గి బంధానికి కారణమవుతుంది. మోహం లేకపోతే కర్మఫలాలు, వాసనలు ఏర్పడవు. అంచేత జననమరణాలుండవు. సృష్టి కొనసాగుతోంది అంటే డానికి మొహమే కారణం.
లోభము అనేది తనకు తనవారికి సంపద, సుఖాలు మొదలైనవి దాచుకొనే స్వభావమే లోభం. మోహం తొలగితేనే లోభమూ నశిస్తుంది. ఈ రెండూ ఆత్మజ్ఞానం వల్లే నశిస్తాయి.


మదము మాత్సర్యములు
ఎదుటివారు తనకన్నా ఎక్కువ సంపదను కలిగి ఉండటంగాని లేదా మరోవిధంగా గాని అధికులైతే మదనపడుతుంటారు. ఇదే మత్సరం అంటే. కొందరిలో మిగిలిన వారికంటే తానే అధికుడను అనే భావముంటుంది. ఇదే మదము అనబడుతుంది. మదమాత్సర్యాలు రెండూ అనవసరమే.
మానవులంతా ఆత్మస్వరూపులు ఐనపుడు సుఖదుఃఖాలను అనుభవించేది ఒకే ఆత్మచైతన్యం. కర్మఫలాలను బట్టి ఈ వ్యత్యాసాలు కలుగుతాయి. ఆత్మజ్ఞానం వల్లనే ఈ మదమాత్సర్యాలు సన్నగిల్లుతాయి.
ఈ అరిషడ్వర్గాలు అజ్ఞానం వల్ల కల్గుతున్నాయి. ఇవి కారణశరీరం యొక్క రజోగుణ విక్షేపధర్మం వల్ల కల్గుతున్నాయి. కారణశరీరం అజ్ఞానం వల్ల ఏర్పడింది. అజ్ఞానం నశిస్తే ఇవన్నీ నశిస్తాయి. దీనికి ఆత్మసాక్షాత్కారం ఒక్కటే మార్గం. అరిషడ్వర్గాలు నశించాలంటే మనస్సు నశించాలి. మనోనాశనమే మోక్షమని చెప్పబడింది.

అష్టాదశ పురాణాలు

1. మత్స్య పురాణం : మత్స్యావతారమెత్తిన శ్రీ మహావిష్ణువు మనువుకు బోధించిన పురాణం ఇది. యయాతి, సావిత్రి, కార్తికేయ చరిత్రలు ఇందులో ఉన్నాయి. అంతేకాక వారణాసి, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల వివరణ ఇందులో ఉంది.

2. మార్కండేయ పురాణం : ఇది మార్కండేయ ఋషి చెప్పినది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. శివుడు, విష్ణువు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుల మహత్తు గురించి ఇందులో వివరించారు.

3. భాగవత పురాణం : దీన్ని తెలుగులోకి పోతన కవి అనువదించారు కనుక తెలుగు ప్రజలకు ఇది చిరపరిచితమైన పురాణమే. ఇందులో మహావిష్ణు అవతారాల గురించి , శ్రీకృష్ణుని లీలల గురించి వివరించారు. తెలుగులో ఇది మొత్తం 12 స్కంధాల గ్రంధం.

4. భవిష్య పురాణం : ఇది సూర్యభగవానుడు మనువుకు చెప్పిన పురాణం. ఇందులో వర్ణాశ్రమాల ధర్మాల అగురించ్, భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి వివరించారు.

5. బ్రహ్మ పురాణం : ఇది దక్షునికి బ్రహ్మదేవుడు చెప్పిన పురాణం. శ్రీకృష్ణుడు, మార్కండేయుడు, కశ్యపుల జీవన గాథలు ఉన్నాయి.

6., బ్రహ్మాండ పురాణం : బ్రహ్మ మరీచికి చెప్పిన పురాణం ఇది. పరశురాముడి గురించి, రాముడి గురించి, శ్రీకృష్ణుని గురించి ఇందులో వివరించారు. ఇందులో దేవతాస్తోత్ర శ్లోకాలు కూడా ఉన్నాయి.

7. బ్రహ్మవైవర్త పురాణం : ఇది నారద మహర్షికి సావర్ణుడు చెప్పిన పురాణం. సృష్టికి మూలమైన భౌతిక జగత్తు గురించి, పంచమహా శక్తుల గురించి ఇందులో ఉంది.

8. వరాహ పురాణం : ఇది విష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన పురాణం. పార్వతీ పరమేశ్వర చరిత్ర, ధర్మశాస్త్ర శ్లోకాలు, వ్రత విధానాలు ఇందులో ఉన్నాయి.

9.వామన పురాణం : నారదునికి పులస్త్య ఋషి వివరించిన పురాణం ఇది. శివపార్వతుల కళ్యాణం, కార్తికేయగాధ, భూగోళ వర్ణన, రుతువర్ణన ఇందులో ఉన్నాయి. ఆర్యభట్టులాంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని శ్రద్ధగా చదివినట్లు ఆధారాలున్నాయి.

10. వాయు పురాణం : ఇది వాయుదేవుడు ఉపదేశించిన పురాణం. ఇందులో శివమహత్యముతో పాటు భూగోళ వర్ణన, సౌరమండల వ్యవస్థ వర్ణన కూడా ఉండి. మన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని కూడా అధ్యయనం చేశారు.

11. విష్ణు పురాణం : ఇది మైత్రేయునికి పరాశర మహర్షి ఉపదేశించిన పురాణం. విష్ణు, శ్రీకృష్ణ, ధృవ, ప్రహ్లాద, భరతుల గురించి విపులంగా వివరించారు.

12. నారద పురాణం : ఇది నారదుడు నలుగురు బ్రహ్మ మానసపుత్రులకు చెప్పిన పురాణం. ఇందులో వ్రతాల గురించి, వేదాంగాల గురించి కూడా వివరించారు. వివిధ పుణ్యక్షేత్రాల వర్ణన ఇందులో ఉంది.

13. అగ్ని పురాణం : ఇది అగ్నిదేవుడు ప్రవచించిన పురాణం. వైద్యం, వ్యాకరణం, చందస్సు, భూగోళ శాస్త్రం, జ్యోతిష్యం గురించి ఇందులో ఉన్నాయి.

14. స్కంద పురాణం : ఇది స్కందుడు చెప్పిన పురాణం. ఇందులో అనేక వ్రతాల గురించి, శివమాహత్మ్యం గురించి ఇంకా వివిధ పుణ్యక్షేత్రాల గురించి వివరించారు.

15. గరుడ పురాణం : ఇది తన వాహనమైన గరుడునికి (గరుత్మంతునికి) శ్రీమహావిష్ణువు ఉపదేశించిన పురాణం. గరుడుని జన్మవృత్తాంతముతో పాటు స్వర్గలోకం గురించి, నరకలోకం గురించి, విష్ణు ఉపాసన గురించి ఇందులో వివరించారు.

16. లింగ పురాణం : ఇందులో శివుని ఉపదేశాలు, ఇతర వ్రతాలు, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం మొదలైన వాటి గురించి వివరించారు.

17. కూర్మ పురాణం : శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో ఉపదేశించిన పురాణం కనుకే దీనికి ఈ పేరు వచ్చింది. ఇందులో వరాహ అవతారం గురించి, నరసింహావతారం గురించి వివరించారు. భూగోళం గురించి కూడా వివరించారు.

18. పద్మ పురాణం : 18 పురాణాలలోకెల్లా ఇది పెద్దది. ఇందులో బ్రహ్మ చేసిన సృష్టి గురించి, గంగా మహాత్మ్యం గురించి, గాయత్రీ చరితం గురించి, గీత గురించి, పూజా విధానం గురించి వివరంగా వర్ణించారు.

గురువులు ఎంత మంది ?


శ్రీ వరాహ స్తోత్రం..!!






































ఇల్లు కట్టుకోవాలన్నా..స్థలాలు..భూములు..కొనాలన్నా..ఈ స్తోత్రమును రోజూ 9 సార్లు పఠించాలి.

ఋషయ ఊచు |
జితం జితం తేఽజిత యజ్ఞభావనా
త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః |
యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః
తస్మై నమః కారణసూకరాయ తే || ౧ ||

రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం
దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం |
ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమ-
స్స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్ || ౨ ||

స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయో-
రిడోదరే చమసాః కర్ణరంధ్రే |
ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే
యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రమ్ || ౩ ||

దీక్షానుజన్మోపసదః శిరోధరం
త్వం ప్రాయణీయో దయనీయ దంష్ట్రః |
జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః
సభ్యావసథ్యం చితయోఽసవో హి తే || ౪ ||

సోమస్తు రేతః సవనాన్యవస్థితిః
సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః |
సత్రాణి సర్వాణి శరీరసంధి-
స్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః || ౫ ||

నమో నమస్తేఽఖిలయంత్రదేవతా
ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే |
వైరాగ్య భక్త్యాత్మజయాఽనుభావిత
జ్ఞానాయ విద్యాగురవే నమొ నమః || ౬ ||

దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా
విరాజతే భూధర భూస్సభూధరా |
యథా వనాన్నిస్సరతో దతా ధృతా
మతంగజేంద్రస్య స పత్రపద్మినీ || ౭ ||

త్రయీమయం రూపమిదం చ సౌకరం
భూమండలే నాథ తదా ధృతేన తే |
చకాస్తి శృంగోఢఘనేన భూయసా
కులాచలేంద్రస్య యథైవ విభ్రమః || ౮ ||

సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం
లోకాయ పత్నీమసి మాతరం పితా |
విధేమ చాస్యై నమసా సహ త్వయా
యస్యాం స్వతేజోఽగ్నిమివారణావధాః || ౯ ||

కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో
రసాం గతాయా భువ ఉద్విబర్హణం |
న విస్మయోఽసౌ త్వయి విశ్వవిస్మయే
యో మాయయేదం ససృజేఽతి విస్మయమ్ || ౧౦ ||

విధున్వతా వేదమయం నిజం వపు-
ర్జనస్తపః సత్యనివాసినో వయం |
సటాశిఖోద్ధూత శివాంబుబిందుభి-
ర్విమృజ్యమానా భృశమీశ పావితాః || ౧౧ ||

స వై బత భ్రష్టమతిస్తవైష తే
యః కర్మణాం పారమపారకర్మణః |
యద్యోగమాయా గుణ యోగ మోహితం
విశ్వం సమస్తం భగవన్ విధేహి శమ్ || ౧౨ ||

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే శ్రీ వరాహ ప్రాదుర్భావోనామ త్రయోదశోధ్యాయః |

లోకా సమస్తా సుఖినో భవంతు..!!

శ్రీ మాత్రే నమః

జనవరి ఒకటి కంతా తెలుగు వారికందరికీ అందిద్దాం.

అసలీ జనవరి 1 కథ ఏంటి?

నాకు చాలా మంది మిత్రులు జనవరి ఒకటిన "విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ " అని అభిమానంగా, సంతోషంగా చెబుతారు.

అది వారి ప్రేమకు తార్కాణం.

ఇలా విషెస్ చెప్పే వారిది ఏ తప్పూ లేదు.

ఎందుకంటే మనకెవ్వరికీ జనవరి ప్రారంభం న్యూ ఇయర్ కాదని తెలియదు.

ఇక ఎంజాయ్ ఎంజాయ్ అని త్రాగి తిరిగే వాళ్ల కథ నాకు తెలియదు.

ఇక పై ప్రశ్నలకు సమాధానం చూద్దాం.

ఇప్పుడు మనం అనుసరించే క్యాలెండర్‌ గ్రెగేరియన్ క్యాలెండర్.

ఇదంతా తప్పులతడక, లోపాల పుడక.

క్రీశ 1582 లో పోప్ గ్రెగేరియన్ సరిచేసిన క్యాలెండర్ ఇది.

ఈ క్యాలెండర్ ప్రకారం మనం యదార్థ సంవత్సరం కంటే 24.6 సెకన్ల ఎక్కువ సమయాన్ని లెక్కించుకుంటున్నాము.

ఆప్రకారం 3,513. సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది.

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త JOHN VERSHAL. ఈ లోపాన్ని సవరించటానికి ఒక ఉపాయం చెప్పాడు.

అదేంటంటే, క్రీశ 4,000 సంవత్సరంను లీప్ ఇయర్ గా లెక్కించకుండా వదిలేయడం.

ఈ క్యాలెండర్ లోని లోపాలను సరిచేయడం అవసరమని సూచనలు చేస్తూ "నానాజాతిసమితి" ఒక కమిటీ ఏర్పాటుచేసింది.

ఆ కమిటీ 185 రకాల ప్కాన్లను పరిశీలించి, క్రీశ 1926 లో ఒక రిపోర్టు ఇచ్చింది.

ఇప్పటి దాకా అది ఎటూ తేలలేదు లెండి.

ఇంకా ఇలాంటి చిన్నచిన్న చిక్కులు చాలానే ఉన్నాయి.

మంచిది...

ప్రపంచమంతా ఒకప్పుడు నూతన సంవత్సరం ఉగాదినాడు ప్రారంభమయ్యేది.

బైబిల్ లోని ""ఎజ్రా "" పుస్తకం 10:17 వ వచనం సంవత్సరం లోని మొదటి నెల మార్చి - ఏప్రిల్ లో ప్రారంభమౌతుందని సాక్ష్యం పలుకుతోంది.

ఫ్రాన్స్‌ లో క్రీశ 1582 వరకూ, ఇంగ్లాండులో క్రీశ 1752 వరకూ నూతన సంవత్సరం మార్చి 25 న ప్రారంభం అయ్యేదని చరిత్ర చెబుతూంది.

అయితే, కాలగమనంలో ఇది ఎప్పుడు మారిందో తెలియదు కానీ, అది ఏప్రిల్‌ కు మారింది.

అయితే నూతన సంవత్సరం మార్చి లో ఉంచాలా, ఏప్రెల్ లో ఉంచాలా అనేది వారికి కొంత సమస్యగా మారింది.

సంవత్సరం ఆరంభం ఎప్పుడూ ఒకే నెలలో ఒకే తేదీన వస్తే బాగుంటుంది అని వారు ఆలోచించసాగారు.

ఆ సమయం లో క్రీశ 15 శతాబ్ది చివరి కాలంలో ఫ్రాన్స్‌ చక్రవర్తి " చార్లెస్ "అంతవరకూ 11 వ నెలగా ఉన్న జనవరి ని ఒకటవ నెలగా నూతన సంవత్సరం గా ప్రారంభించాడు.

ఈ విధంగా నేటి మన నూతన సంవత్సరం ప్రారంభమైంది.

ఇందుకు ఎలాంటి శాస్త్రీయ, ప్రకృతి పరమైన, ఆధారమూ లేదు.

ముందుగా ఫ్రాన్స్‌, ఇటలీ, పోర్చుగీసు, స్పెయిన్ దీనిని అంగీకరించాయి.

క్రీశ 1699 లో జర్మనీ,

క్రీశ 1752లో ఇంగ్లండు,

క్రీశ 1873 లో జపాన్‌,

క్రీశ 1912 లో చైనా,

క్రీశ 1916 లో బల్గేరియా,

క్రీశ 1918 లో రష్యా లు

ఈ క్యాలెండర్ ను అంగీకరించాయి.

17,18 శతాబ్దంలో తమ ఆధీనంలో ఉన్న అన్ని దేశాలలో బ్రిటిషు వాడు దీన్ని ప్రవేశపెట్టాడు.

కానీ భారతీయ క్యాలెండర్ ఋషులచే తయారుచేయబడింది.

ఆర్యభట్టు, భాస్కరాచార్య వంటి మహాన్ శాస్త్రజ్ఞులచే పరిశోధించబడింది.

కొన్నివేల సంవత్సరాల తర్వాత ఏ సంవత్సరం లో, ఏ నెలలో, ఏ రోజున ఏ గ్రహణం వస్తుందో, వారం వర్జ్యము తో సహా చెప్పగలిగేంతగా శోధించబడింది.

ప్రకృతి కి అనుగుణంగా, వసంత ఋతువు చైత్రశుద్ధ పాఢ్యమి రోజున ఉగాది ప్రారంభ మవుతుంది.

(కొన్నిచోట్ల వసంత ఋతువు మేశరాశి లో సూర్యుడు ప్రవేశించటాన్ని ఉగాదిగా చేస్తారు.)

ప్రపంచమంతా మొదటి నుంచీ అనుసరిస్తున్న ఉగాదిని కాదని,

వాడెవడో ఫ్రాన్స్‌ వాడు ఏ ఆధారమూ లేకుండా ప్రతిపాదించిన నూతన సంవత్సరం ను ఫాలో అవడం కంటే,

ఆత్మాభిమానం కలిగి భారతీయుల మందరమూ మన సాంప్రదాయక ఉగాది నూతన సంవత్సరం ను ఫాలో కావటం ఉత్తమము

మరియు మన కర్తవ్యము.

ఏ లోపాలు లేని మన కాలమానం గొప్పతనాన్ని ప్రచారం చేయటమే మన తక్షణ కర్తవ్యం.

ఈ మెసేజ్ జనవరి 1 లోగా తెలుగు వారికంతా వెళ్లేలా చేస్తే, సగం పని జరిగినట్లే.

పెద్దల ద్వారా విన్నదాన్ని మీకు విన్నవించాను.

Thursday, December 27, 2018

తిరుమల కాలక్రమము

ఇక్కడ లభ్యమైన శాసనాలనుబట్టి 15 వందల ఏళ్ల నాటి నుండి తిరుమల చరిత్ర ఈ విధంగా ఉంది. పల్లవ రాణి సామవై క్రీ.శ.614. ఈ మహారాణి కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దరణ కావింపబడింది. శ్రీవారి అనేక ఆభరణాలు సమర్పిస్తూ, ఉత్సవాలు నిర్వహిస్తూ పరమభక్త శిరోమణిగా తిరుమల చ్రిత్రలో శాశ్వతంగా నిలిచింది.ఈమెకి 'పేరుందేవి'అని మరో పేరువుంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు క్రీ.శ.1429, హరిహరరాయలు క్రీ.శ. 1446 లలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.

సాళువ నరసింహరాయలు క్రీ.శ.1470 లో భార్య ఇద్దరు కుమారుల తన పేర్లతో సంపగి ప్రదక్షిణం నాలుగు మూలలో నాలుగు స్తంభాల మండపాలని నిర్మిచాడు.క్రీ.శ.1473 లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. ఉత్సవాలు జరిపించేవాడు.

శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు, ఉత్సవాలు నిర్వహించాడు. రాయలు 1513 ఫిబ్రవరి 10 న 25 వెండి పళ్లాలను ఇవ్వగా, స్వామివారి పాల ఆరగింపు కొరకు రాయల దేవేరులు రెండు బంగారు గిన్నెలు ఇచ్చారు. 1513 మే 2నరెండవసారి, 1513 జూన్ 13న మూడో సారి తిరుమల సందర్శించి, మూల విరాట్టుకు ఆభరణాలు, ఉత్సవ మూర్తులకు మూడు మణిమయ కిరీటాలు సమర్పించాడు. నిత్య నైవేద్యానికి ఐదు గ్రామాలను కానుకగా ఇచ్చాడు. 1514 జూన్ 6న నాల్గవసారి తిరుమలని దర్శించి,30 వేల వరహాలతో కనకాభిషేకం చేసాడు. నిత్యారాధన కోసం తాళ్ళపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.

1517 జనవరి 2న ఐదవ సారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాడు. 1518 సెప్టంబర్ 9నఆనందనిలయానికి బంగారు పూత చేయించాడు. 1518 లో ఆరవసారి, 1521 ఫిబ్రవరి 17నఏడవసారి తిరుమలకి వచ్చి నవరత్న కుళ్ళాయిని, పీతాంబరాలని సమర్పించాడు.

అచ్యుత రాయలు 1530 లో ఉత్సవాలు నిర్వహించాడు. ఆలయానికి ఎన్నో గ్రామాలు భూములను కానుకగా ఇచ్చాడు. 16 శతాబ్దం చివరలో తిరుమల రాయలు అన్నాఊయల మండపాన్ని విస్తరింపజేసి, ఉత్సవాలు నిర్వహించాడు. 1570లో వెంకటపతి రాయలు చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు.

విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్నాటకకునవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజాంప్రభువులకి కట్టవలసిన పన్నుల కొరకై ఆలయంపై పన్నులు విధించాడు. ఈ ఆదాయానికై మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు, 1740 లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీన పరచుకుని, రక్షించి స్వామివారికి ఎన్నో అమ్మూల్య ఆభరణాలు సమర్పించాడు.

తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయంఈస్టిండియా కంపెనీ వారి వశమైంది. ఈస్టిండియా కంపెనీ మొదట్లో హిందూ దేవాలయాలను, ముస్లిముల మసీదులను కాపాడుతూ వారి ధర్మాలను స్వయంగా పరిపాలించేవారు. దీనికి సంబంధించిన శాసనం ఒకటి క్రీ.శ.1810లో బెంగాలు ప్రాంతంలో వేయించారు. క్రీ.శ.1817లో చేసిన 7వ రెగ్యులేషన్ చట్టంలో కూడా ఇదే పాలసీని కొనసాగించారు. ధర్మాదాయాల సొమ్మును రెవెన్యూతో పాటు జిల్లా కలెక్టర్లు వసూలు చేసి, దేవునికి క్రమంతప్పక ఉ్సతవాలు, అర్చనలు, భోగాలు స్వయంగా పర్యవేక్షించి జరిపేవారు. దేవాలయంపై వచ్చిన సొమ్ములో ఈ కార్యక్రమాలు చేశాకా మిగిలిన సొమ్ము ఈస్టిండియా కంపెనీ వారి ఖజానాలో చేరేది. కలెక్టర్లపై రెవెన్యూబోర్డుకు తనిఖీ అధికారం ఉండేది. తిరుమల దేవాలయాన్ని కూడా ఇదే పద్ధతిలో పరిపాలన చేసేవారు. దేవాలయంలో చేయాల్సిన సేవలు, ఉత్సవాలు, అర్చనలకు ఖర్చుచేయగా కంపెనీకి మిగిలిన ఆదాయం 1830లోనే దాదాపుగా సాలుకు రూ.లక్షకు పైగా ఉండేదంటే తిరుమల వైభవం ఊహించవచ్చు. తిరుమలలో ఏ దానధర్మాలు చేయాలన్నా ప్రభుత్వానికి సొమ్ము ఇచ్చుకోవలసిన స్థితి ఉండేది . క్రైస్తవ మిషనరీలు కంపెనీ ప్రభుత్వం హిందూదేవాలయాలను, ముస్లిముల మసీదులను నిర్వహించడం ప్రోత్సహించడం క్రిందికే వస్తుందని, ఇది సరైన పని కాదని ఇంగ్లాండులో ఆందోళన చేయగా 1833 నుంచి కంపెనీ వారు దేశంలో మతాల పట్ల జోక్యం కలిగించుకోరాదన్న పద్ధతిలో ప్రవర్తించడం ప్రారంభించారు. ఐతే తిరుమల, పూరి వంటి సుప్రసిద్ధ ఆలయాలకు వచ్చే ఆదాయం బాగా ఎక్కువ కావడంతో వాటిని తమ వశంలోనే ఉంచుకున్నది. ఎప్పటిలా కంపెనీ ఉద్యోగులే నిర్వహించేవారు. ఐతే 1841లో ఆంగ్లప్రభుత్వం హిందూ మతసంస్థలలో జోక్యం చెసుకోకూడదని చట్టం చేసినందున ఆ ఆలయ నిర్వహణ మహంతులకు అప్పజెప్పింది. అప్పటి నుంచి 1863 వరకూ దేవాలయాలను సక్రమంగా నిర్వహించే నాథుడులేక, ఉన్న ధర్మకర్తలు అక్రమాలకు పాల్పడుతూండడం మూలంగా బ్రిటీష్ ఇండియాలోని దేవాలయాలు దెబ్బతిన్నాయి. ఈ స్థితిలో 1863లో కొత్త దేవాదాయధర్మాదాయ చట్టం ఈ అరాచక స్థితిని సరిజేసే ప్రయత్నం చేసింది.1843 నుండి -

మహంతు సేవాదాస్ జీ,మహంతు ధర్మ దాస్ జీ,మహంతు భగవాన్ దాస్ జీ,మహా వీరదాస్ జీ,రామకృష్ణ దాస్ జీ,ప్రయాగదాస్ జీ,

ఇలా 90 ఏళ్ల పాటు మహంతుల పాలనసాగింది.

వీరి తరువాత,1933 లోఅప్పటి గవర్నర్ ధర్మ కర్తల మండలిని ఏర్పాటు చేసాడు.

19 వ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం,హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్లు. తెల్లవారుజామునే లేచి సప్తగిరులూ ఎక్కి ఉదయం ఏడు గంటలకు స్వామికి మేలుకొలుపులు పాడేవారు. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. రాళ్లూరప్పలూ నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంటావార్పు కోసం ఆగుతూ... మొత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు రెండురోజులు పట్టేదట. వారు మధ్యలో ఆగేందుకు మూడుచోట్ల దిగుడుబావులూ విశ్రాంతి మండపాలూ ఉండేవి. వాటిని ఠాణాలు అనేవారు. వయసు మళ్లినవారినీ అంగవికలురనూ పిల్లలనూ పైకి తీసుకువెళ్లేందుకు డోలీ కూలీలు ఉండేవారు. కావడి బద్దకు కుర్చీలు అమర్చి నడవలేనివారిని వాటి మీద కూచోబెట్టుకుని వారు పైకి మోసుకెళ్లేవారు. అందుకు పది అణాలు రుసుము వసూలు చేసేవారు. సామాన్యులకు ఆ మాత్రం స్థోమత కూడా ఉండేది కాదు. తిరుమలరాగిచెట్టు (ఇప్పుడు కల్యాణకట్ట ఉన్న ప్రదేశం) దగ్గర డోలీలు నిలుపుకోవడానికి ఒక ప్రత్యేక మండపం ఉండేది. అక్కడిదాకానే ఈ డోలీలను అనుమతించేవారు. ఆ స్టాండును డోలీమండపం బ్లాక్ అనేవారు. (ఇప్పుడా రోడ్డునే డి.ఎం.బి. రోడ్డుగా వ్యవహరిస్తున్నారు.) అక్కణ్నుంచి సన్నిధి వీధి మీదుగా గుడికి చేరుకుని నేరుగా మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించి భక్తులు స్వామి దర్శనం చేసుకొనేవారు. 1870లోప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడినతితిదేబోర్డు రూ.26వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. ఐదుపదుల ఏళ్లనాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున ఏడున్నరకు సుప్రభాత సేవ, రాత్రి పదిన్నరకు ఏకాంతసేవ జరిగేవి. ఇప్పుడు రాత్రి రెండున్నరకు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలోనే మళ్లీ సుప్రభాతంతో మేల్కొలుపులు మొదలుపెడుతున్నారు.

కొండ మీద ఊరు

తిరుమల నిర్వహణ హథీరాంజీ మఠంఆధ్వర్యంలో ఉన్నప్పుడు యాత్రికులకు సౌకర్యాలు ఏర్పరచాలంటే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. తిరుమలలోనే ఉందామంటే విపరీతమైన చలి. దానికి తోడు ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది. జంతువుల భయం సరేసరి. కొండమీద ఒక ఊరు తయారైతే ఈ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చన్న ఆలోచనతో 1910-20 కాలం నాటికి జనావాసాలను ఏర్పరచేందుకు ప్రయత్నించారు. వారికి ఆవాసం కల్పించేందుకు హథీరాంజీ మఠం భూములు లీజుకు ఇచ్చింది. నెమ్మదిగా ఆలయం చుట్టూ నాలుగు వీధులతో ఒక ఊరు తయారైంది. మొదట్లో అక్కడి జనాభా 200 నుంచి 300 మంది మాత్రమే. స్వామిని చూడవచ్చే భక్తులకు ఈ కుటుంబాలే మొదట్లో అన్ని సౌకర్యాలూ కల్పించేవి. క్రమేణా తిరుమలలో ఉండే వారి సంఖ్య 25వేలకు పెరిగింది. 30 ఏళ్ల క్రితం వరకూ కూడా వారంతా రోజూ సరాసరి మహాద్వారం గుండానే గుడిలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తమ పనులు చేసుకొనేవారు. కానీ యాత్రికుల సంఖ్య పెరుగుతుండటంతో తితిదే వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తిరుపతికి తరలించింది.

ఘాట్‌రోడ్డు నిర్మాణం

1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండమీదకు రోడ్డుమార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. 1944ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తయింది. అదేనెల పదోతేదీన మద్రాసు రాష్ట్ర గవర్నర్ ఆర్ధర్‌హోప్ రోడ్డుమార్గాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎద్దులబళ్లు, గుర్రపుబళ్లు తిరిగేవి. దీంతో భక్తుల పని సులువైంది. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల-తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది. ఆ సర్వీసులు తిరుపతిలోని మొదటిసత్రం నుంచి రోజుకు మూడుసార్లు ఉండేవి. తిరుమల నుంచి రాత్రి ఏడు దాటితే బస్సులే ఉండేవి కావు. 1955-56లో రైల్వేస్టేషన్ సమీపాన శ్రీనివాస బస్టాండు ఏర్పడే నాటికి భక్తుల సంఖ్య రోజుకు 500 నుంచి 600 వరకు ఉండేది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో రెండో ఘాట్‌రోడ్డు గురించి ఆలోచించాల్సి వచ్చింది. 1974 నాటికి అదీ పూర్తయింది.

హిందూ ధర్మాన్ని ఎందుకు రక్షించాలి.. ?? అవగాహన కోసం ఈ వ్యాసం..!

చాలా మంది అవగాహన లేని వారు, చదువుకున్న వాళ్ళు అయినా సరే అవగాహన లేక పోవడం వల్ల మతం అంటే అది ఏదో వేరే వింత విషయం లా చూస్తారు.. చాలా మంది యువత కి అసలు మతం ఒక దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, మతం యొక్క ప్రభావం మన జీవితం మీద ఎలా ఉంటుందో తెలిదు..

మన లో ఉన్న ఒక సమస్య ఏంటి అంటే.... సమాజం లో ఒక సమస్య ఉన్నకూడా మన దృష్టికి అది రానంతవరకు సమస్య లేదు అనే అనుకుంటాం.. మన దృష్టికి వస్తే అప్పుడు రియాలైజ్ అయ్యి సమస్య ఉంది అని తెలుసుకుంటాం.. ఇదే పరిస్థితి ఇప్పుడు మన హిందువులది, అవగాహనా లోపం, మనకి తెలియకుండా మన చుట్టూ హిందువులుకు పొంచి ఉన్న ప్రమాదం సాటి హిందువులకు తెలియజేయాలి..

సాధారణంగా చదువుకున్న వాళ్లకి అన్ని మతాలు సమానం, దేవుళ్ళు అందరు ఒకటే..  ఏ మతం ఆచరిస్తే ఏంటి? భిన్నత్వం లో ఏకత్వం, ఏకత్వం లో భిన్నత్వం అనే మాయ లో ఉంటారు.. ఇది ఎంత తప్పో నేను తరువాత వివరిస్తా..

నువ్వు హిందూ అయితే సర్టిఫికెట్స్ లో హిందూ అని
క్రైస్తవుడు అయితే క్రైస్తవడు అని
ముస్లిం అయితే ముస్లిం అని వేయించుకుంటావ్ గా అలాగే...

నీ జీవితం లో హిందువు అయితే హిందువు లాగే బతుకు..

అంతే గాని బొట్టు పెట్టుకోవడానికి సిగ్గు పడుతూ,
నాకు దేవుళ్ళ మీద నమ్మకం లేదని లోపల ఆలోచిస్తూ,
అన్ని దేవుళ్ళు ఒకటే, అన్ని మతాల సారం ఒకటే అని భ్రమ పడుతూ.. ఉండకు..

నీకు దేవుడి మీద నమ్మకమ్ లేకపోతె నాస్తికుడిగా మారు, హిందువు అని సర్టిఫికెట్స్ లో ఉంచుకోకు..

👉 మతం అంటే అర్ధం ఏమిటి?

మతం అంటే మనిషి మతి లో నుండి పుట్టింది అని, ఆ మనిషి రాకముందు ఆ మతం ఉండలేదు.. ఆ మతమ్ అనేది ఒక ప్రాంతానికి పరిమితం, దాని ఆలోచనలు ఒక స్థాయి వరకే ఉంటాయి..

మతం అనేది, మనుషుల కోసం, మనుషుల చేత, మనుషులే ఏర్పరచుకున్న ఒక నియమావళి..

ఉదాహరణకి, యేసు వచ్చాక క్రైస్తవ మతమ్ (2017 సంవత్సరాల క్రితం ) మొహమ్మద్ ప్రవక్త వచ్చాక (1400 సం. క్రితం) ఇస్లాం, బుద్ధుడు వచ్చాక బౌద్ధం ఇలా స్థాపించబడ్డాయి..

కానీ హిందూ మతం (నిజానికి మనది మతం కాదు, ధర్మం) ఒక వ్యక్తి వచ్చి స్థాపించలేదు, ఇది ఎప్పటినుండో ఉంది,

యేసు రాక మందు క్రైస్తవ్యమ్ లేదు, యేసు క్రైస్తవుడు కాదు, మహమ్మద్ ప్రవక్త రాకముందు ఇస్లాం లేదు, అతడు ముస్లిం కాడు

కానీ మనం పూజించే రాముడు, కృష్ణుడు వీళ్ళు హిందువులే, వాళ్ళకంటే ముందు నుండే హిందూ మతం ఉంది.

👉 ఒక దేశము, ప్రాంతం పై మత ప్రభావం ఏంటి??

చాలా మంది యువత కి మతం అనేది మన జీవితంపై ఎలా ప్రభావం చూపుతుందో తెలిదు..

నిజానికి ప్రతి దేశము కూడా ఒక ప్రధాన మతం కలిగి ఉంటాయి, కొన్ని దేశాలు ఏకంగా ఒక మతాన్నే తమ దేశ మతంగా ప్రకటిస్తాయి (ఇస్లాం దేశాలు),  ఆయా దేశాల్లో చట్టాలు ఆయా మతస్తులకు మాత్రమే అనుకూలంగా ఉంటాయ్, తక్కువ శాతం ఉండే వేరే మతస్తులకు అంత స్వేచ్ఛ ఉండదు..

ఏ దేశము లో అయినా ఒక మతం వారు మెజారిటీ అవ్వనంత వరకే, మెజారిటీ అయ్యాక వాళ్ళు అనుకున్నదే చేస్తారు.. అలా ఎలా??

చిన్న ఉదహారణ,

ఒక గది లో 10 మంది ఉన్నారు, 10 మంది లో 9 మంది గది లో ఫ్యాన్ తిరగాలి అని కోరుకుంటున్నారు.. ఒకడు మాత్రమే ఫాన్ వద్దు అని అనుకుంటున్నాడు.. అప్పుడు ఏం జరుగుతుంది ? 9 మంది కోరుకున్నదే జరిగితీరుతుంది.. అలాగే ఒక ప్రాంతం లో ఎవరు మెజారిటీ గా ఉంటె వాళ్ళే ఏది కోరుకుంటే అదే జరుతుంది..

కాశ్మీర్, పాత బస్తీ, పశ్చిమ బెంగాల్, కేరళ ఇవన్నీ కూడా మెల్లగా వేరే మతస్తుల వాళ్ళ చేత అక్రమించ బడి వాళ్ళ సంఖ్య పెంచుకోబడ్డవే.. ఒకసారి ముస్లిమ్ జనాభా పెరిగాక కాశ్మీర్ ఏమి అయ్యిందో వేరే చెప్పాలా??

నిజం చెప్పాలంటే వాళ్ళ దేవుణ్ణి కాకుండా వేరే వాళ్ళని పూజిస్తే అవతలి వాళ్ళ ప్రాణాలు కూడా తీసేస్తారు.. అవునా?? అని సందేహ పడొద్దు.. బైబిల్, ఖురాన్ లో వాళ్ళ దేవుడు నన్ను కాకుండా వేరే వాళ్ళని పూజిస్తే చంపమని స్పష్టంగా చెప్పాడు.. ఇది నిజం, మనకి వేరే మత గ్రంధాలూ మీద అవగాహన లెక ఇవన్నీ తెలీవు..

పైన అందుకే అన్ని మతాలు సమానం కావు, అన్ని మత గ్రంధాల సారం ఒకటే కాదు అని నేను అన్నది

అందుకే చరిత్ర లో క్రూసేడ్లు పేరుతొ మత యుద్ధాలు జరిగాయి.. క్రైస్తవులు ముస్లిం లు కొట్టుకు చచ్చారు..
ఖాలీ సమయం లో గూగుల్ లో క్రూసేడ్స్ అని కొట్టండి..

భారత్ లో హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే శాంతి భద్రత, హిందువులు మైనారిటీ లోకి వెళ్తే ఎలా ఉంటుందో కాశ్మీర్ యే ఉదాహరణ..

👉 మతం మారితే ఏమి అవుతుంది..??

మతం మారడం వల్ల ఆ దేశం మీద ప్రేమ తగ్గుతుంది, ఇది నేను చెప్పిన విషయం కాదు.. భారత రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ అన్న మాట.. మతం మారితే అలా దేశభక్తి ఎలా తగ్గుతుంది అంటే..

ఒక వ్యక్తి ఏ మతం లోకి మారితే ఆ మతం ఎక్కడ పుట్టిందో, ఏ దేశం లో పుట్టిందో ఆ దేశం మీద ప్రేమ తో పాటు ఆ మతం వల్ల ఆ దేశం మీద భక్తి పుడుతుంది..

ఉదా:-
క్రైస్తవులకు ఇజ్రాయిల్ అంటే ఇష్టం, ముస్లిమ్స్ కి మక్కా అంటే ఇష్టం.. కొంత మంది భారతీయ ముస్లిమ్స్ భారత్ తో క్రికెట్ మ్యాచ్ జరిగినపుడు పాకిస్తాన్ ని సపోర్ట్ చేయఁడం మనం చూస్తుంటమ్.. ఇవే ఆ లక్షణాలు

👉 మరి కొన్ని సార్లు ఆ మతం లోని దేవుడు పెట్టిన రూల్స్ వల్ల సమాజనికి, బంధువులకు, మిత్రులక్కు, దూరం అవుతారు.. ఎలా?? అంటే

కొంత మంది క్రైస్తవులు గుడి లో ప్రసాదాలు తినరు, గుడికి రారు.. గుడి లో విగ్రహాలు ను రాళ్లు రప్పలు అంటారు..కూడా, వాళ్ళ మత గ్రంధం అదే చెప్పింది వాళ్లకి మరి..

👉 మరి కొన్ని సార్లు అపురూపమైన దేశ సంస్కృతికి దూరం అవుతారు మతం మారితే... అవునా ఎలా?

మన దేశం లో ఉన్న సంగీతమ్, నాట్యం, పురాతన కట్టడాలు ఇవన్నీ హిందూ మతమ్ తో ముడి పడి ఉన్నాయి, వాటిని నేర్చుకోవడం, వాటిని  రక్షించడం వేరే మతస్తులు చెయ్యలేరు.. ఎందుకంటే

వారి నమ్మకాలూ ప్రకారం విగ్రహలను, విగ్రహాలను పూజించే పురాతన అపురూప కట్టడాలను నాశనం చేయాలి అని వాళ్ళ దేవుడు చెప్పాడు.. (బైబిల్ లో ఉన్నవే నేను చెప్తున్న) మన దేశ చరిత్ర లో ఎన్నో వేల దేవాలయాలు ను నాశనం చేసిన సంఘటనలు ఎన్నో...

మన అతి ప్రేమో, లేదా ప్రతి ఒక్కరినీ గౌరవించే తనమో, అందరు బాగుండాలి సర్వేజన సుఖినో భవంతు అని అనుకునే మన దేశానికి వచ్చిన బహుమతి 1000 సంవత్సరాల బానిసత్వం.. ప్రపంచం లో అగ్రగామిగా ఉండే దేశం అడుక్కు తినే స్థాయి కి చేరిపోయింది.. కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు మన దేశం నుండీ దోపిడీ చేయబడింది.. మన చరిత్ర పుస్తకాల్లో ఇవేవీ ఉండవు..

👉  మతం మారితే కనీసం నీ మాతృ భాష తెలుగు కూడా నేర్చుకోలేవు!!

ఒక వేళ మీరు మిషనరీ స్కూల్ లో చేర్పిస్తే అక్కడ మొదట
తీయించేవి బొట్టు, పువ్వులు, గాజులు, అవును.. తెలుగు నేర్చుకోవాలంటే తెలుగు లో ఉన్న మన గ్రంధాలు, పోతన భాగవతం పద్యాలూ లాంటివి నేర్పించాలి.. కానీ మిషనరీ స్కూల్స్ లో, క్రైస్తవుల ఇంట్లొ పోతన భాగవతం పద్యాలు పాడటం, చదవటం కుదరదు.. ఎందుకంటే వాళ్ళ దేవుడుడికి అసూయా వేరే వాళ్ళని స్తుతిస్తే.. అలా వాళ్ళు చివరికి తెలుగు చదవడం రాక, రాయటం రాక మాతృభాష కి దూరం అయిపోతారు..

హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం అంటే అదేదో దేశ భక్తి, దైవ భక్తి కాదు, మన భవిష్యత్ తరాలకు భారతదేశము లో చోటు ఇవ్వడమే..

ఈ దేశాన్ని తమ వశం చేసుకోవాలని క్రైస్తవం, ముస్లిం ప్రయత్నిస్తున్నాయ్.. ఇటీవల టైమ్స్ నౌ ఛానెల్ వాళ్ళు హిందూ అమ్మాయిలను మతం మారిస్తే లక్షల రూపాయాలు ఆయా యువకులకు ఇస్తున్న
 విడియో లు కూడా విడుదల చేసారు..

👉 ఒక హిందువు వేరే మతం లోకి మారితే హిందువులకే ప్రమాదం!!

అవునా ఎలా??... బైబిల్, ఖురాన్ ల ప్రకారం.. వాళ్ళ దేవుణ్ణి కాకుండా వేరే దేవుణ్ణి పూజిస్తే రాళ్లతో కొట్టి చంపాలి.. ఒకడే దేవుణ్ణి కాకుండా ఎక్కువ మంది దేవుళ్ళని పూజించే వాళ్ళు కనపడితే చంపండి.. (ఖురాన్ 9:5, బైబిల్ ద్వితీయఉపదేశ కాండం 13 : 6,7,8,9)
అలా నోళ్లు వెల్ల బెట్టకండి, పైన ఉన్న వాక్యాలు వాళ్ళ దేవుళ్ళు చెప్పినవే..

ఉరుకోండి సర్.. మీరు మరీనూ.. వాళ్ళు అలా ఎవరినైనా చంపితే పోలీసులు ఉరుకుంటారా?? చట్టం లేదు.. మీరు అతిగా ఆవేశ పడుతున్నారు..

పోలీసులు, గీలుసులు నహీ చెల్తా... మొన్న కాశ్మీర్ లో DSP ని సైతం రాళ్లతో కొట్టి చంపి, నగ్నంగా ఊరేగించారు.. మతోన్మాదులు.. అలా ఉంటారు వాళ్ళు

👉 మతం ఎలా మారుస్తారు ??

ఆరోగ్యం బాలేదా ?? మా మతం లోకి వచ్చేయ్.. మా దేవుణ్ణి నమ్ముకో నీకు నయం అయిపోద్ది..!!

ఒక వేళా నిజంగా ఆ మతం లోని దేవుడు వల్ల జబ్బు నయం అయితే.. రెండో సారి వాళ్ళకి జబ్బు వస్తే హాస్పిటల్ కి వెళ్లకుండా ఉండమని చెప్పాలి.. అప్పుడు రెండో సారి మాత్రం జబ్బు వస్తే హాస్పిటల్ కి పరిగెడతారు..

ఏమి అప్పుడు దేవుడు ఏమి అయ్యాడు ?? అలా అయితే హాస్పిటల్స్ ఎందుకు అన్ని మూసేయ్ మని చెప్పాలి?? జబ్బు కోసమో డబ్బు కోసమో మతం మారడం స్టార్ట్ చేస్తే ప్రపంచకం లో ఉన్న అన్ని మతాలూ లోకి మారిన ఎదో ఒక కొత్త జబ్బు వస్తూనే వుంటాయి...

నీకు ఉద్యోగం లేదా?? అయితే మతం మారిపో.. మా దేవుణ్ణి నమ్ముకో మీ ఉద్యోగం వచ్చేస్తది..!!

పెళ్లి కాలేదా ?? అయితే మతం మారిపో.. మా దేవుణ్ణి నమ్ముకో .!!
పిల్లలు లేరా ?? అయితే మతం మారిపో.. మా దేవుణ్ణి నమ్ముకో..!!
కుటుంబ సమస్యలా ??
ఆర్థిక సమస్యలా ??? మతం మారిపో.. మా దేవుణ్ణి నమ్ముకో..!!
మతం మారిన ప్రతి ఒక్కరు దాదాపు ఇలానే మార్చబడ్డారు..

ఇలా అమాయక ప్రజలనాల్ని మతం మారుస్తూ వాళ్ళ దగ్గర దశమ భాగాలు పేరుతో 10 % సంపాదన ని దోచుకుంటారు..

మన రాష్ట్రం లో 65 % మాత్రమే అక్షరాశ్యత.. అంటే 100 లో 35 మందికి చదవటం, రాయటం రాదు.. వాళ్లకి ఈ విషయాల మీద అవహగాహన తక్కువ.. మిగతా 65 మందిలో ౩౦ మందికి చదవటం, రాయటం మాత్రమే వచ్చు.. ఇలాంటి విషయాలు మీద అవగాహాన తక్కువ.. ఇక మిగిలిన 35 మందిలో చాలా వరకు అన్ని మతాలూ సమానం, అన్ని మతాల సారం ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే అనే మాయ లో బతికేస్తున్నారు.. కాబట్టి చదువులేని నిరక్షరాస్యులకు, చదువు ఉండి కూడా ఏమి తెలియని అమాయకులకు ఈ వ్యాసం ఒక మేలుకొలుపు...

రాహు కేతువులు-ఆత్మవిద్య హేతువులు

🕉 ఓం శ్రీమాత్రే నమః

ఆధునిక విఙ్ఞానం రాహు కేతువులను ఒప్పుకోదు, ఇవి గ్రహాలు కావు, గ్రహణం రోజున రాహువు మింగటం, కేతువు మింగటం ఇలాంటివి హాస్యాస్పదం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.మంచిదే!ఇవి గ్రహాలు అని శాస్త్రం కూడా చెప్పటం లేదు.జ్యోతిషం రవిని, చంద్రుని గ్రహాలుగా చెప్పటం ఏమిటి? రవి నక్షత్రం కదా, చంద్రుడు ఉపగ్రహం కదా అని అడిగే వాళ్లు ఉన్నారు. గ్రహించేది గ్రహం. ఇది ప్లానెట్, ఇది సేటలైట్ అనే విభజన వేరు. మహర్షులు మానవ జీవితం మీద ఏదైతే ప్రభావం చూపుతున్నదో అది గ్రహం అని గుర్తించారు. మనిషి కూడా గ్రహమే! వీడికీ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం ఉన్నాయి.భూమి మీద ఏ పరిమాణంలో నీరు, గట్టి పదార్థాలూ ఉన్నాయో, మానవ శరీరంలో కూడా అదే పరిమాణంలో నీటికి సంబంధించిన పదార్థాలు, గట్టి పదార్థాలూ ఉన్నాయి. నదులు కొండలలోని రాళ్లలోంచి పుడుతున్నాయి. రక్తం బోన్ మేరో నుంచి పుడుతున్నది.ఒక కుమ్మరి వాడు కుండను తయారు చేసేటప్పుడు క్రిందనున్న మట్టి తిరిగి తిరిగి స్పందించి అందులోంచి కుండ పై భాగం అలా తయారవుతూ ఉంటుంది. అలాగే భూమి దక్షిన ధృవం స్పందించి, స్పందించి ఈ ఆకారానికి వచ్చింది. ఉత్తర ధృవం అందుచేత కొద్దిగా చిన్నదిగా ఉంటుంది. భూమి ఎందుకు ఆగదు? ఆగితే ఒక వైపుకు పడిపోతుందా? అంటే ఒరిగిపోకూడదని బొంగరం లా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నదా? నిజమే! స్పందన వలన శక్తి, శక్తి నుంచి తిరిగి స్పందన…ఇదే సృష్టి యావత్తులోనూ ఉన్న రహస్యం.

ఆరు వేదాంగాలలో ఒకటైన జ్యోతిష శాస్త్రం యొక్క మరో పేరు ఆత్మ విద్య. జ్యోతి-స్థూలంగా చెప్పాలంటే లైట్, సూక్ష్మంగా చెప్పాలంటే ఙ్ఞాన జ్యోతి. దీనిని దర్శించే వాడు జ్యోతిష్కుడు! జ్యోతిషం కేవలం భవిష్యవాణి కాదు. కాలక్రమంలో ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందటం వలన జ్యోతిష్కుడు అనగానే కాల్ళూ చేతులూ చూసే వాడు అనుకుంటారు. కాదు. ఇది ఒక వైఙ్ఞానికపరమైన, తాత్వికపరమైన, ఉపాసన పరమైన సంక్లిష్టమైన శాస్త్రం. సృష్టికి సంబంధించిన రహస్యం ఇందులో ఉంటుంది.కాలము, జ్యోతి (వెలుగు) ఈఓ రెండిటి యొక్క ప్రభావం ప్రాణ శక్తి మీదా, మనిషి జీవితం మీదా ఎలా ఉంటుంది అనేది ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది.RKR

చీకటి వెలుగులు జీవితం లోని భాగాలే కావు. సృష్టి ఆద్యంతం వెంట ఉండే విషయాలు. వీటి మధ్య ఎన్నో ప్రక్రియలు, ఎన్నో యుగాలు. ఒకటి లేకుండా మరొక దానిని అధ్యయనం చేయటం కుదరదు. ఆ చీకటి గృహాలె ఈ రాహు కేతువులనబడే అప్రకాశ గ్రహాలు.ఒక గ్రహణం సంభవించినప్పుడు మూడు వరుసలోకి రావటం మనం చూస్తాం. గణిత శాస్త్రం ప్రకారం రెండు వస్తువుల మధ్య అతి తక్కువ దూరం ఒక తిన్ననైన గీత! అంటే ఒక గ్రహణం సంభవించినప్పుడు ఈ మూడు-సూర్యుడు, చంద్రుడు, భూమి అతి తక్కువ దూరం లోకి వస్తాయి.అప్పుడు పరస్పరం శక్తులను ఇచ్చి పుచ్చుకుంటాయి. దీనినే సినర్జీ అంటారు. ఈ సమయంలో వీటి మధ్యనున్న నీడ ఈ ఇచ్చి పుచ్చుకునే ప్రక్రియకు మార్గం అవటం వలన ఒక ఛార్జ్ లా ఆ గ్రహణ సమయంలో పని చేస్తుంది. దీనినే మహర్షులు రాహువు లేదా కేతువు అని చెప్పి దాని తాలూకు స్పందన-మంత్రాన్ని దర్శించి మనలో జరిగే స్పందనకు అనుగుణంగా జపించి యున్నారు. ఈ రోజు భాషలో దీనిని మనం మోడరేషన్ అంటాము! 1980-81 లో జరిగిన సంపూర్ణ సూర్య గ్రహణం సమయం లో రైలు వస్తున్నప్పటికీ చిన్న పిట్టలు పట్టాల మీద నుంచి కదలలేదు!…
గోచారంలో మరి గ్రహణం అని చెప్పిన రోజున ఆ రాశిలో రాహువో కేతువో ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది. అంటే అసలు గ్రహణ నిర్ణయం మహర్షులు అంత సూటిగా ఎలా చెప్పారూ అంటే రాహు కేతువుల స్థానం బట్టి, వాటి సంచారాన్ని బట్టి, సూర్య చంద్రుల సంచారాన్ని బట్టి అని అర్థం!

రాహు, కేతువులు
విఙ్ఞానం మనకి బిగ్ బాంగ్ అని చెబుతుంది. ఈ అంతరిక్షం యావత్తూ ఒక విస్ఫోటనంతో ఏర్పడినదని ఒక అంచనా.మంచిదే! శాస్త్రం ఏమంటోందంటే నవగ్రహ కూటమి ఒక వృత్తాకారంలో జడత్వంతో ఉన్న సమయంలో ప్రకాశం ఒక దిశగా పయనిస్తూ ఈ కూటమిని తాకి ఆ వేగంలో వృత్తానికి అవతల ప్రక్కకు వెళ్లిపోయింది. ఆ తేజస్సుకు ఈ గ్రహాలన్నీ చేతనత్వాన్ని పొందాయి. స్పందిచటం ప్రారంభించాయి. ఆకారంలో పెరగటం మొదలు పెట్టాయి. ఒక నిర్దిష్టమైన వృత్తంలో తిరుగుతున్నాయి. తిరుగుతున్నాయి కాబట్టి వృత్తం ఏర్పడినది. కూటమికి ప్రకాశం ముందు తగిలిన చోట సర్పం ఆకారంలో కనిపించిన నీడను రాహువు అని, వృత్తం అటు వైపు-180 డిగ్రీల లో కనిపించిన అవతలి నీడను శిఖి (కేతువు) అని చెప్పారు. ఈ నీడలు రెండూ అపసవ్యంగా తిరిగాయి. కారణం ఏమిటంటే ఇవి గ్రహాలన్నిటి నీడలు కలబోసుకుని వాటికి భిన్నంగా కదులుతాయి. వీటి మధ్యన ఉన్న గ్రహాలన్నీ ఒక చక్రంలో బంధింపబడ్డాయి-అదే రాశి చక్రం. ‘ రాహువు ‘లోని మొదటి అక్షరం-రా, ‘ శిఖి ‘లోని మొదటి అక్షరం ‘ శి ‘ తీసుకుని రాశి చక్రం అన్నారు!
అంటే రాశి చక్రం అనేది కెవలం మన జన్మ కుండలి కాదు.ఇది సృష్టి యావత్తునూ ప్రదర్శించే 360 డిగ్రీల కుండలి! ఇదే సిమెట్రీ! ఒక వృత్తం ఎంత పెద్దదైనా కావచ్చును. దాని కేంద్రం ఒకటే! అది కూడా వృత్తమే! సృష్టిలోని అతి పెద్దది-అనంతం, అతి చిన్నది కూడా అనంతమే! మరి గణితం కూడా అదే చెబుతుంది. 1/10=10/100=100/1000… ఇలా నేను ఒకటి ప్రక్కన న్యూమరేటర్ లో అనంతమైన సున్నలకు ఒకటి తక్కువగా పెట్టి డినోమినేటర్ లో ఒకటి ప్రక్కన అనంతమైన సున్నాలు పెట్టినా ఆ ఫలం 1/10 మాత్రమే! అదే తమాషా! అటు అనంతం, ఇటు మనం. అది ఇందులో ఉంది-అణువులాగా! రాహు కేతువులు మనకు ఎన్నో విషయాలు చెబుతాయి. ప్రస్తుతం మామూలుగా జ్యోతిష సాస్త్రం జాతకంలో వీరి పరిస్థితిని ఎలా వివరిస్తుందో చూద్దాం. దానికి ముందు ఈ ఇద్దరి గురించీ విపులంగా ఎక్కడ చెప్పారో పరిశీలిద్దాం. బృహత్ జాతకంలో రాహువును తమస్ అని, అగు అని, అసుర అని పేర్కొన్నారు. కేతువును శిఖి అని చెప్పారు. పరాశరుడు, యాఙ్ఞ్యవల్క్యుడు రాహు కేతువులను ఏడు గ్రహాలతో పాటుగా ప్రధానంగా పేర్కొన్నారు. వీరి ఉత్పత్తి, ప్రభావం,ఇలాంటివి మత్స్య పురాణంలో కూడా చెప్పి యున్నారు.రాహువును నల్ల రంగులో, రౌద్రాకారంలో,కత్తి ధరించి సింహారూఢుడై యున్నట్లు వర్ణించారు.కేతువు గద పట్టుకున్నట్లు,గృధ్ర వాహనునిగా వర్ణించారు.
శాస్త్రం రాహువుకు అధిదేవత దుర్గ యని, ప్రత్యధిదేవత నాగదేవతయని, కెతువుకు అధిదేవత చిత్రగుప్తుడని, ప్రత్యధిదేవత బ్రహ్మ యని చెబుతున్నది. రాహు మహర్దశ 18 సంవత్సరాలు, కేతువు మహర్దశ 7 సంవత్సరాలని మనకు తెలిసినదే!
రాశి చక్రంలో రాహు కేతువుల గీత చాలా ప్రధానమైనది. వీరు 18 మాసములు అయిన తరువాత అపసవ్య మార్గంలో రాశులు మారుతారు. గోచారంలో గురు, శని తరువాత ప్రధానంగా గణించ వలసిన గ్రహాలు రాహు కేతువులు. రాహు కేతువులు ఏయే స్థానాలలో ఎటువంటి ఫలితాలనిస్తారనేది పరిశీలిద్దాం. ఒకరి జాతకంలో-రాశి చక్రంలో లగ్నాత్ రాహువు:
మొదటి స్థానం(లగ్నం లో)లో ఉంటే ధైర్యవంతులు,సహాయం చేయు వారు,కానీ కొద్దిగా ముఖం మీద మచ్చలు ఉండు వారు ఉంటారు. రెండులో ఉంటే ఎక్కువగా విందులు చేయు వారు,నల్లని వారుగానూ,వివాహేతర సంబంధాలు కోరు వారు కనిపిస్తూ ఉంటారు. మూడులో ధనవంతులు,మంచి క్రీడాకారులు, సాహసాలు చేయు వారు అవుతారు. నాలుగులో ఉన్నప్పుడు బహు భాషా కోవిదులు, అయిదులో ఉన్నప్పుడు క్రూర స్వభావం గల వారు, గర్భం విషయంలో సమస్యలు ఎదుర్కొనటం, ఆరులో ఉన్నప్పుడు పెద్ద బంధు వర్గం కల వారు,శత్రు రహితులు గానూ,ఏడులో ఉన్నప్పుడు జీవిత భాగస్వామికి ఆరోగ్య భంగం,చక్కెర జబ్బు,మంచి భొజనం కలుగ చేస్తాడు. ఎనిమిదిలో సంకుచితమైన ఆలోచనలు,పోట్లాటలంటే ఇష్ట పడే వ్యక్తిత్వం,తొమ్మిదిలో భయపడే వ్యక్తిత్వం, పదిలో ఉన్నప్పుడు మంచి కళాకారులు,యాత్రికుదు,రచయితలు తయారవుతారు.పదకొండులో ధనవంతులు,సంఘంలో గౌరవం కల వారు,మంచి సంతానం కల వారు,వ్యవసాయదారులు ముందుకు వస్తారు. పన్నెండులో ఉన్నప్పుడు తాత్విక పరులు,కళ్ల జబ్బులు ఉన్నవారు ముందుకు వస్తారు.
కేతువు లగ్నంలో ఉంటే ఎక్కువగా చెమట పూయటం,మంచి ప్రజా సంబంధాలు ఉందటం, రెండులో ఉన్నప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోవటం, శాంత స్వభావం,మూడులో శక్తిమంతులు,పేరు గలవారు, నాలుగులో గొడవలు పెట్టుకునే వారు,అయిదులో పిల్లలకు ఇబ్బందులు కలుగచేయటం,ఆరులో మాటకారితనం,ఏడులో భాగస్వామికి సమస్యలు,ఎనిమిదిలో నిదానం, తొమ్మిదిలో చత్వారం, మంచి జీవిత భాగస్వామి,పదిలో తాత్విక చింతన,పదకొండులో మంచి హాస్యం,ధనం, పన్నెండులో విదేశ యానం ఇలాంటివి కనిపిస్తాయి.
సామాన్యంగా రాహు కేతువులు అప్రకాస గ్రహాలు కాబట్టి ఏ రాశిలో ఉంటాయో, ఆ రాశి యొక్క అధిపతి ఇచ్చు ఫలితాలని ఇస్తాయి.
ఇక్కడ చెప్పిన ఫలితాలు నామ మాత్రానివే. ఒక జాతకంలో అన్ని విషయాలనూ, గ్రహాలనూ పరిశీలించకుండా ఒక నిర్ణయానికి రాకూడదు!
రాహు కేతువులు-ఆరోగ్యం:రాహువు దుర్ఘటనలను, ప్రయాణాలలో సమస్యలను, దుష్ట ప్రయోగాలను శాసిస్తాడు. సరీరంలోని కాళ్ల విషయంలో రాహు కెతువులు చాలా సక్రియంగా ఉంటారు.ఆరోగ్యం విషయంలో వీరిరువురు ఎవరితో కలసినా ఇబందే! ఆ గ్రహం , భావం లేదా రాశి పీడితమైనదని తెలుసుకోవాలి.కేతువు సామాన్యంగా స్త్రీల విషయంలో మాసిక సమస్యలను చంద్రునితో కలసి అంద చేస్తాడు. లగ్నాత్ అయిదులోనూ, ఏడులోనూ ఉంటే శరీరంలో ఏవో లంప్స్, ట్యూమర్లు ఇలాంటివి కనపడ వచ్చును. ఎనిమిదిలో చర్మ వ్యాధులు ఉందవచ్చును. రాహువు విష ప్రయోగాన్నీ, అర్థం కాని అనారోగ్యాన్నీ సృష్టిస్తాడు.కెతువు పుండ్లను శాసిస్తాడు. రాగువు కేతు నక్షత్రంలో (అస్విని, మఖ, మూల) ఉంటే దారుణమైన ఏక్సిడెంట్లను ఇస్తాడు. ఆ దశలో జాగ్రత్త వహించాలి. రాహువు ఆర్ద్ర 3, 4 పాదాలలో ఉంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది. నాల్గవ పాదంలో ఉంటే చెడు అలవాట్లకు లోనవుతారు.అలాగే స్వాతి మొదటి, నాలుగు పాదాలలో రాహువు ఉంటే ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాహువు శతభిషం రెందవ పాదంలో ఉంటే కోపిష్ఠి, మూడవ పాదంలో ఉంటే కాలేయ సమస్యలున్నవారు ఉంటారు.కేతువు అస్విని మూడవ పాదంలో ఉంటే ఆరోగ్యం విషయం లో జాగ్రత్త వహించాలి.అలాగే మఖ 1,2,3 పాదాలలో ఉన్నా అనారోగ్యం,మూల 1,2 లో ఉన్నా జాగ్రత్త వహించాలి. రాహు కేతువులు ఎవరి దశలో ప్రవేశించినా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వారి దశలలో ముఖ్యంగా గుండె విషయంలొనూ, విష జ్వరాల విషయంలొనూ జాగ్రత్త వహించాలి.

లాభాలు
రాహువు మంచి కూడా చెస్తాడు. రాహువు మంచి స్థానంలో ఉండి గురువు చేత 5 లేదా 9 దృష్టి కలిగి యున్నప్పుడు రాజయోగం, సంఘంలో గౌరవం ఇస్తాడు. పన్నెండులో ఉన్నప్పుదు చక్కని తెలివి తేటలిస్తాడు. కేతువు ఆరులో ఉన్నప్పుడు కీర్తి, జ్యోతిష శాస్త్రం, జరిగేది తెలియటం ఇలాంటివి ఇస్తాడు. అలాగే రెండులో ఉన్నప్పుదు మార్కెట్ వలన లాభాలూ, పదకొండులో ఉన్నప్పుడు లాటరీలు ఇస్తాడు. కేతువు తాత్వికమైన గ్రహం. సంప్రదాయ బధ్ధమైన ఉపాసన ఇస్తాడు కేతువు.
కాలసర్ప దోషం:కాలసర్ప దోషం అనేది నిజానికి ఒక యోగం. నూటికి 70 మందికి ఇది ఉంటుంది. దీని వలన భయం ఏమీ లేదు.రాహు కేతువుల ఏక్సిస్ లోపల అటు కానీ ఇతు కానీ ల్గ్నం, చంద్రునితో పాటు అన్ని గ్రహాలూ ఉన్నప్పుడు ఈ గ్రహాలన్నీ నీడలోకి చేరాయి కాబట్టి వాటి శక్తి బయటకు రాదని కాలసర్పదోషం అని నిర్ణయిస్తారు. శ్రీకాళహస్తిలో నివారణ చేయించుకుంటే ఇది యోగంగా మారుతుందని ప్రతీతి.
కొందరు మిత్రులు లగ్నం లెదా చంద్రుడు బయట ఉన్నప్పుడు ఈ దోషం ఉంటుందా అని అడిగారు. వివాహం విషయంలో దీనిని కూడా పరిగణించటం మంచిదని శాస్త్రం చెబుతున్నది. కారణం ఏమిటంటే యోగాలు చంద్రుని బట్టి ఎక్కువ గణన లోకి వస్తాయి కాబట్టీ, మరల గోచారం చంద్రుని నుంచి నిర్ణయిస్తాము కాబట్టీ నివారణ చేయటం అవసరం అవుతుంది.కొన్ని గ్రంథాలలో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఒక్కో స్థానాన్ని గణించి డిగ్రీలు కూడా లెక్క లోకి తీసుకుని ఆ స్థానం ఫలించనప్పుడు రాహు కెతువుల మధ్య వచ్చాయా అనే సంగతి కూడా చూడటం జరుగుతున్నది. అంత అవసరం లేకపోయినా ఇంత చాలు. తమిళ నాడులో ఒక ఆచారం ఉంది. దోషం ఉన్నా, లెకపోయినా వివాహ వయసు వచ్చిన కన్యలందరికీ నివారణ చేయిస్తారు…

శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి లోని ఈశ్వరుడు నవగ్రహ కవచ ధారి! ఆయనకు ఎదురుగా సూర్యుడు ఉంటాడు. శివాలయంలో ఇది అరుదు! శివుడు ఇక్కడ భక్తుల గ్రహ దోషాలన్నీ సూర్య్ని సాక్షిగా హరించి వెస్తాడు! అలాగే ఈ కాలసర్ప దోషాన్ని నివారించి ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మరొక విశేషం కలదు. అమ్మవారు శ్రీ ఙ్ఞాన ప్రసూనాంబ ఎదురుగా ఉన్న ప్రాకారంలో నేల మీద ఒక పద్మం ఉంటుంది. దీని మీద నిలబడి చూరు పైకి చూస్తే రాహువు యంత్రం ఉంటుంది. ఈ యంత్రాన్ని చూస్తూ ఆత్మ ప్రదక్షిణ చేయాలి. అలా చేస్తూ పేరు, నక్షత్రం, గోత్రం మన్సులో చెప్పుకుని అమ్మవారిని రాహువు నుంచి కాపాడమని కోరాలి. చాలు! ఈ జన్మకు మనలను రాహువు బాధించడు.
రాహువు దుర్గా ఉపాసన ఉన్న వారిని బాధించడు. దృష్టి దోషం సామాన్యంగా రాహువు డిపార్ట్మెంట్! దుర్గా సప్తశ్లోకీ, ఖడ్గమాలా స్తోత్రం, చండీ ధ్వజ స్తోత్రం చదువుకునె వారికి రాహువు బాధలు ఉందవు. సుబ్రహ్మణ్య ఉపాసన ఉన్నవారికి, నాగ పూజ ఉన్నవారికీ, ఇంటిలో నాగ పడిగ ౠపు మీద పాలతో అభిషేకం చేయు వారికీ, కేతువు వలన ఇబ్బందులు ఉండవు. దశలో కానీ, గోచారంలో కానీ రాహువు సమస్య ఉన్న వారు 1800 గ్రాములు నల్ల మినుములు శివాలయంలో దానమిచ్చిన మంచి ఫలితాలను పొందగలరు.
రాహువు సంఖ్య 18. ఒకప్పుడు అయ్యప్ప యాత్ర శ్రీకాళహస్తి నుంచి ప్రారంభమయ్యేదని చెబుతారు. అయ్యప్ప గుడి మెట్లు 18.దీక్షలో రాహువు రంగు నలుపు వస్త్రాలు ధరిస్తారు. మహాభారత రణరంగం 18 రోజులు… సంఖ్యా శాస్త్రంలో 18 అంకె-రవి(1), 8(శని) కలసిన సంఖ్య ఇది.అనగా సూర్యోదయం-వెలుగు,పడమర దిక్కు, రిసైక్లింగ్ చేసే శనికి కలిగే సంయోగం ఇది. ఆది, అంతం కలసిన ఏమిటి? యుధ్ధం.
ఇదే వెలుగు నీడల యుధ్ధం.రాశి చక్రంలోని వెలుగు నీడల పర్యంతం మన జీవితం అలా సాగిపోతుంది.రాహువు నీడను-మృత్యువును గుర్తు చేస్తూనే ఉంటాడు. అటు చివర కేతువు ఉపాసన మార్గం ద్వారా మోహాన్ని జయించి అమృత తత్వాన్ని తెచ్చుకో మంటాడు.
రాహు కేతువులు ఇద్దరూ ఒక శరీరమే.పురాణం మనకు చెబుతుంది.ఒకరు తల భాగం, ఒకరు అధో భాగం. ఈ రెండిటినీ అధిగమించే సారమే అమృతం.అదే ‘తమసోమా జ్యోతిర్గమయ!’ అనే ప్రార్థన, వేదం లోని మహావాక్యం. అదే జ్యోతిషం!

ఆది శంకరాచార్యుడు జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంధము సౌందర్యలహరి

ఇది స్తోత్రము (భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము), మంత్రము (గురువు అనుగ్రహం పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము), తంత్రము (నియమంతో శాస్త్రయుక్తంగా సాధన చేస్తే ప్రత్యేక సిద్ధులు లభించే యోగవిధానము), కావ్యము (అక్షర రమ్యతతో కూడిన ఛందో బద్ధమైన, ఇతివృత్తాత్మక రచన) కూడాను. దీనిని ఆనందలహరి మరియు సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి అని చెప్పుదురు. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు గలవు. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్టపరచుచున్నవి. సౌందర్యలహరి అను పేరునందు సౌ, లహ, హ్రీం అను మంత్ర బీజములు ద్యోతకమగుచున్నవి
శంకరాచార్యుని అనేక స్తోత్రాలలో శినస్తోత్రంగా శివానందలహరి, దేవీస్తోత్రంగా "సౌందర్యలహరి" చాలా ప్రసిద్ధాలు. త్రిపుర సుందరి అమ్మవారిని స్తుతించే స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరి అనబడింది. ఈ స్తోత్రం "శిఖరిణీవృత్తం" అనే ఛందస్సులో ఉంది. సౌందర్య లహరిలో నాలుగు ప్రధానమైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యం. ఇది ఒక దివ్య మహిమాన్విత స్తోత్రం ఉపాసకులు దేవిని ఆరాధించడానికి ఉపయోగకరమైన అనేక మంత్రాలు నిక్షిప్తమైన మంత్రమాల. ఈ మంత్రాలకు ఫలసిద్ధులను వ్యాఖ్యాతలు తెలియబరచారు. ఆగమ తంత్రాలను విశదీకరించే, శ్రీవిద్యను వివరించే తంత్ర గ్రంధం. ఇందులో మొదటి 41 శ్లోకాలు శ్రీవిద్యను వివరిస్తాయి. స్తోత్రంలో మొదటి 41 శ్లోకాలు "ఆనంద లహరి" అని, తరువాతవి దేవీ సౌందర్యాన్ని కీర్తించే "సౌందర్య లహరి" అని అంటారు కాని ఈ విభజనను కొందరు వ్యాఖ్యాతలు అంగీకరించరు. భారత దేశంలో సౌందర్య లహరికి ఇంచుమించు 50 వ్యాఖ్యానాలున్నాయని తెలుస్తున్నది. లక్ష్మీధరుడు, భాస్కరరరాయుడు, కామేశ్వర సూరి, అచ్యుతానందుడు మొదలైనవారు ముఖ్య భాష్యకర్తలు. "Serpent Power" ("కుండలినీ శక్తి") అనే పేరు మీద "ఆనందలహరి" అనబడే భాగానికి మాత్రం "ఆర్థర్ ఎవలాన్" అనే ఆంగ్లేయుడు వ్యాఖ్యను వ్రాశాడు. "శ్రీరామ కవి" అనే పండితుడు "డిండిమ భాష్యము" అనే భాష్యాన్ని వ్రాశాడు. శ్రీ నరసింహ స్వామి అనే పండితుడు "గోపాల సుందరీయము" అనే వ్యాఖ్యలో ప్రతి శ్లోకాన్ని శక్తిపరంగాను, విష్ణుపరంగాను కూడా వ్యాఖ్యానించాడు. తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు "శ్రీచక్ర విలసనము" అనే వ్యాఖ్యను వ్రాశాడు.

సౌందర్యలహరి స్తోత్రం శ్లోక, తాత్పర్యం సహితంగా మీ అందిస్తున్నను అందరూ ఆస్వాదించి అమ్మవారి అనుగ్రహనికి పాత్రులు కాగలరు.

పాప ప్రక్షాళనం..

నమ్మకంతో..ఏ పని చేసినా.. పూర్తి ఫలితాన్ని పొందుతాము..!💐

ఒకసారి శివపార్వతులు ఆకాశమార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు.
వారికి గంగానదిలో అనేకమంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం కనిపించింది.
అది చూసి పార్వతి ‘‘నాథా! ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా,
నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా?
అదే నిజమైతే అందరూ పాపాలు చేసి,
వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగాస్నానం చేసి పోగొట్టుకుంటారు కదా’’ అని సందేహం వెలిబుచ్చింది.

శివుడు చిర్నవ్వుతో ‘‘దేవీ! ఇప్పుడు నేను ఒకటి చెబుతాను.
నీవు ఆ విధంగా చేయి.
అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’’
అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు.
ఆ ప్రకారం పార్వతి, పండుముత్తైదువ రూపం ధరించి, గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, ‘‘దయచేసి నా భర్తను కాపాడండి’’
అంటూ కేకలు వేయసాగింది.
ఆ మాటలు విని చాలామంది గంగలో దూకి,
ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు.

అది చూసిన వృద్ధురాలు ‘‘అయ్యా! నా భర్తకొక శాపం ఉంది. పాపాత్ములెవరయినా ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి.
అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి’’ అని హెచ్చరించింది.

ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్లిపోయారు.
ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి,
కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకుని,
తన వీపు మీద ఆయనను మోస్తూ,
ఒడ్డుకు తీసుకు వచ్చాడు.
వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే,
నాయనా! నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగల్యం దక్కించావు.
నీవు పాపరహితుడవా’’ అని అడిగింది.
ఆ వ్యక్తి ‘‘అమ్మా! నేను ఇంతకుముందే
గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను.
అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను’’ అని చెప్పాడు.

పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి, అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వినువీధులలో విహరించసాగారు.
చూశావా దేవీ! విశ్వాసం ఉంటే
గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది’’ అన్నాడు పరమేశ్వరుడు.
అర్థమైందన్నట్లుగా పార్వతి చిరునవ్వుతో తల పంకించింది. 
పని చేస్తుందా లేదా అని అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పని చేయదు.
దృఢవిశ్వాసంతో చేసే పని తప్పక ఫలితాలనిస్తుందన్నది నీతి...ఓం నమః శివాయ...🙏

లోకా సమస్తా సుఖినోభవంతు..!

భగవద్గీత అంటే ఏమిటి?



– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
– రిటైర్‌మెంట్‌ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
– అది కేవలం హిందువులదా?
– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?

కాదు. అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’. సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి

☆భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు’ అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ.

☆సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్‌ కావాలి, కావాలి… అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్‌ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.

☆ సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.

☆ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.

☆ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి. అతని సామర్థ్యం, ఫిట్‌నెస్‌ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్‌ చేసే మేజిక్‌. మైండ్‌ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడమెలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు. ‘నేను’ అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు ‘కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను’ అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతణ్ని విజయం వరిస్తుంది. ‘నాకోసం కాదు’ అనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.

☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది?

-ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
-కర్తవ్యం గురించి చెబుతుంది.
-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
– ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
-సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
-ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
-ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది.
స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
-జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
-పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది.
-ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
-కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
-నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.

అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు. వేరే మతగ్రంథం లా అన్య సాంప్రదాయాలను ఆచరించేవారిని చంపమని భగవద్గీత చెప్పదు. నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.

గీత చదువుకో ....
రాత మార్చుకో ....

Wednesday, December 26, 2018

ఓం నమో భగవతే వాసుదేవాయ !

ఓం నమో భగవతే వాసుదేవాయ ! ఈ మంత్రం ఎందుకు జపించాలి?
ఇప్పటికి సరిగ్గా 1500 సంవత్సరాల క్రితం సంఘటన. (భవిష్యపురాణం)..
ఒక ముసలివాడు ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మేడలో రుద్రాక్ష హారం ధరించాడు. ఈ నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రం చదవడం వలన ఆతరంగాలు కలిపురుషుడు ని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అర కిలోమీటరు దూరం లో పడ్డాడు. కొంతసేపు ఏమి జరిగిందో తెలియక చుస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. చుస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి ఒస్తే ఎగిరేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను.
ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా? విష్ణువా? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ''వేదవ్యాసుడు'' కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి మహానుభావ సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి. అన్నాడు. వ్యాసుడు నవ్వి. ఇది నీరాజ్యం. ఈకలికాలం నీది. నీకు సందేహమా? ఎఇద్దరుని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకి నువ్వు కుశలమే కదా!
కుశలమే! నారాజ్యంలో నేను కాకా నువ్వు పాలించవు. కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణు భక్తుడు. అయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించవా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్దిగా నిత్యం '' ఒమ నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకనుకూడా తాకలేవు. కనుక ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో. లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు. అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి.
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ

మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు

చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత.
కానీ..

‘నేను ఒక్కడినే కదా ఉన్నాను,

నన్ను ఎవరూ గమనించడం లేదు’
అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు.

మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి. అవి నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి.

వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు. ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి.

ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని,

వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు.

దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు.

ఈ మహా పదార్థాలు రహస్య యంత్రాల వంటివి.

అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి.

ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి.

అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు.

ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం.

అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు.

అది మనం చేసే పని మంచిదా? చెడ్డదా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది.

 కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే.

 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం.

కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము. అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం.

నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించలన్న కుతూహలం అవివేకం.

 అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం.

ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు.

 ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు.

త్వమేవాహమ్‌

త్వమేవాహమ్‌

* కన్నతల్లి కడుపులోంచి బయటపడి, తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి, పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే నేను

ఈ *నేను ప్రాణశక్తి అయిన ఊపిరికి మారుపేరు

* ఊపిరి ఉన్నంతదాకా నేను’ అనే భావన కొనసాగుతూనే ఉంటుంది

 * జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో ఈ నేను ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది

ఈ *నేను లోంచే నాది అనే భావన పుడుతుంది!

ఈ *నాది లోంచి నావాళ్ళు, నాభార్య, నాపిల్లలు, నాకుటుంబం, నాఆస్తి, నాప్రతిభ, నాప్రజ్ఞ, నాగొప్ప... అనేవీ పుట్టుకొచ్చి చివరికి ఈ నేను అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి అహం గా ప్రజ్వరిల్లుతుంది
* అహం అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ నేను  నేనే సర్వాంతర్యామిని అని విర్రవీగుతుంది.
*నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది
*పంతాలతో పట్టింపులతో, పగలతో ప్రతీకారాలతో తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది

* బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలదాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన నేను అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.
*వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.
*సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.
* సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన నేను చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.
*కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.
*మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.
*మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.

* నేనే శాసన కర్తను, నేనే ఈ భూమండలానికి అధిపతిని, నేనే జగజ్జేతను... అని మహోన్నతంగా భావించిన నేను లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. రోజు మారుతుంది.

ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన *నేను కథ అలా సమాప్తమవుతుంది.

* అందుకే ఊపిరి ఆగకముందే నేను గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత.

* చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది శ్మశానవైరాగ్యం మాత్రమే.
*అది శాశ్వతం కానే కాదు.
* నేను గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన వైరాగ్యస్థితి సాధ్యమవుతుంది.

* వైరాగ్యం అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం.  తామరాకుమీద నీటి బొట్టులా జీవించగలగడం.

*స్వర్గ నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.

* మనిషికి, ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే నరకం
* అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడమే స్వర్గం
* ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే వేదాంతం.

* నిజాయతీగా, నిస్వార్థంగా, సద్వర్తనతో, సచ్ఛీలతతో భగవత్‌ ధ్యానంతో జీవించమనేదే వేదాంతసారం.

అహం బ్రహ్మాస్మి అంటే
అన్నీనేనే అనే స్థితి నుంచి త్వమేవాహమ్‌ అంటే- నువ్వేనేను అని భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే మానవజన్మకు సార్థకత.

Tuesday, December 25, 2018

మహాభారతం లో కొన్ని ముఖ్య సంఘటనలు జరిగిన తిథులు

యుధ్ధ సమయానికి ఎవరి వయసు ఎంత?

వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలి అని ఎందుకు అంటారో తెలుస్తుంది.
మహాభారతం గురించి ఎంత చదివినా ఎంత విన్నా కొత్త గానే అద్భుతం గానే వుంటుంది. అందుకే ఈ మధ్య తెలుసుకున్ని మహాభారత విశేషాలు మీ కోసం.

నిజామా ? అంటే నేను సేకరించిందే. అలాగే క్రి.పూ. క్రి.శ. అనిఉపయోగించాను కేవలం అర్ధం అవ్వాలని మాత్రమే. సులభం గా టైపు చేయడానికి సంవత్సరాలను సం గాను , నెలలను నె గాను , రోజులను రో గాను చేయడం జరిగింది.
తారీఖు లను రోజులు-నెలలు-సంవత్సరాలు గా dd-mm-yy గా భావించవలెను.

➡ కర్ణుని జననం : మాఘ శుద్ధ పాడ్యమి.
ఇతను ధర్మరాజు కంటే 16 సం పెద్దవాడు.
➡ యుధిష్టరుని జననం :
ప్రజోత్పత్తి నామ సంవత్సర జ్యేష్ఠ నక్షత్ర శుక్ల పంచమి మిట్టమధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం లో Sagittarius (ధనుర్రాశి) లో.
సుమారు క్రీ పూ 15-8-3229.
➡ భీముని జననం :
మఖ నక్షత్ర అంగీరస బహుళ నవమి .
ధర్మరాజు కన్నా 1సం 19రో చిన్నవాడు.
➡🏹🏹 అర్జునుని జననం:
శ్రీముఖి నామ సం ఫాల్గుణ మాస ఉత్తరా నక్షత్ర శుక్ల పౌర్ణమి.
భీమునికన్నా 1సం 4నె 21రో చిన్నవాడు.
➡🗡⚔ నకుల & సహదేవుల జననం :
భవ నామ సం ఫాల్గుణ మాస అశ్విని నక్షత్ర పౌర్ణమి మిట్ట మధ్యాహ్నం.
అర్జునుని కన్నా 1సం 15రో చిన్నవాళ్ళు.
➡ శ్రీ కృష్ణ జననం :
శ్రీముఖ నామ సం రోహిణి నక్షత్ర బహుళ అష్టమి .
అర్ధరాత్రి అనంతరం tarus (వృషభ)లగ్నం.
➡ దుర్యోధనుడి జననం :
భీముని మరుసటి దినం.
హిడింబాసురుడు, బకాసురుడు,కీచకుడు వీరుకూడా ఇదే సమయాలో మఘ & స్వాతి నక్షత్రాల మధ్య జన్మిస్తారు.
అక్కడి నుండి రోజుకొకరు చొప్పున మిగిలిన 99 కౌరవులు వారి చెల్లి #దుశ్శల (సైంధవుని భార్య).
➡ పాండురాజు మరణం:
సర్వ ధారి నామ సం ఉత్తర నక్షత్ర శుక్ల ద్వాదశి.
అప్పటికి ధర్మరాజు వయసు 16సం 6నె 7రో.
➡ పాండవుల హస్తినపుర ప్రవేశం:
సర్వధారి సం చైత్ర మాస బహుళ త్రయోదశి.
పాండురాజు మరణాంతర 16 రో కు.
➡ యుధిష్టరుని పట్టాభిషేకం:
శుభకృత్ నామ సం ఆస్వీయుజ శుక్ల దశమి.
అతని వయసు 31సం 5రో.
అక్కడినుండి 5సం 4నె 20రో హస్తినాపురం లో ఉంటారు.
➡ వారణావ్రత ప్రవేశం :
ప్లవ నామ సం ఫాల్గుణ మాస శుక్ల అష్టమి.
➡ లాక్ష గృహ దహనం:
కీలక ఫల్గుణ 13/14 వ రాత్రి 3 వ ఝాము.
➡ ఘటోత్కచ జననం:
సౌమ్య నామ సం అశ్వినీ శుక్ల విదియ.
పాండవులు ఏక చక్రపురం లో సాధారణ నామ సం చైత్ర శుక్ల విదియ నుండి ఆస్వీయూజ శుక్ల విదియ వరకు అనగా 6నెలలు ఉంటారు.
➡ బకాసుర వధ :
సాధారణ నామ సం శుక్ల దశమి.
పాండవులు ఏకచక్రపురం లో సాధారణ మార్గశిర బహుళ పంచమి వరకు అనగా ఇంకనూ 1నె10రో ఉన్న తర్వాత పాంచాల రాజ్యం కు బయలుదేరుతారు.
➡ ద్రౌపది స్వయంవరం:
సాధారణ నామ సం పుష్య మాస శుక్లపక్ష దశమి.
విరోధి నామ సం పుష్య పౌర్ణమి వరకు 1సం 15రో పాటు పాంచాల రాజ్యం లో వుంటారు.
హస్తినాపురం రాజధాని గా 5సం 6నె పాటు అనగా విరోధి కృత నామ సం మాఘ శుక్ల విదియ నుండి పింగల శ్రావణ శుక్ల విదియ వరకు.
ఈ కాలం లొనే 🏘💒🏯 ఇంద్రప్రస్థం నిర్మాణం జరుగుతుంది.
అప్పటికి ధర్మజుని వయసు 45సం 9నె 27రో.

➡ ధర్మరాజు పట్టాభిషేకం :
పింగళ ఆశ్వీయుజ శుక్ల దశమి.
యధిష్టురుని వయసు 46 సం.
➡ అర్జునుని తీర్థయాత్రలు:
కాలయుక్తి నుండి ప్రమోదూత వరకు.
➡ సుభద్ర తో పరిణయం:
ప్రమోదూత వైశాఖ శుక్ల దశమి.
➡ ఖాండవవన దహనం : 🔥🔥
ప్రమోదూత శ్రావణ శుక్ల విదియ.
మయసభ 1సం 2నె లో నిర్మితమవుతుంది.
➡ మయసభ ప్రవేశం :
ప్రజోత్పత్తి ఆస్వీయుజ శుక్ల దశమి
ధర్మజుని వయసు 60 సం 5 రో.
ఇంద్రప్రస్థం రాజధాని గా సర్వజిత్ ఆస్వీయుజ శుక్ల దశమి వరకు అనగా 16 సం పాలిస్తారు.
➡ జరాసంధ వధ :
సర్వజిత్ కార్తీక శుక్ల విదియ నుండి 14 వ రోజు వరకు పోరాడి సాయంత్రం న.
➡ రాజసూయ యాగం :
సర్వధారి చైత్ర పౌర్ణమి.
యధిష్టురుని వయసు 76సం 6నె 15రో.
➡ మాయాజూదం : 🎲🃏🀄
సర్వధారి శ్రావణ తదియ & సప్తమి నాడు.
ధర్మజుని వయసు 76సం 10నె 2రో.
కనుక మొత్తం 36 సం 6నె 20రో అనగా విరోధి కృతు మాఘ శుక్ల విదియ నుండి సర్వధారి శ్రావణ బహుళ సప్తమి.
➡ అరణ్యవాసం : 🌲🌳🌴
సర్వధారి శ్రావణ బహుళ అష్టమి నాడు ప్రారంభమౌతుంది.
అప్పటికి యధిష్టురుని వయసు 76సం 10నె 18రో.
12సం అరణ్యవాసం శార్వరి శ్రావణ బహుళ సప్తమి తో పూర్తి అవుతుంది.
1సం అజ్ఞాతవాసం ప్లవ శ్రావణ బహుళ సప్తమి తో పూర్తి అవుతుంది.
➡ కీచక వధ :
ప్లవ ఆషాఢ బహుళ అష్టమి.
అతని సోదరురులు మరుసటి దినం మరణిస్తారు.
ఇవన్నీ చాంద్రమానం ప్రకారం సం. వీటిలో
ప్రతి 5 సం కు 2 అధిక మాసాలు మరియు 13 సం లలో 5 అధిక మాసాలు ,12 రోజులు అధికంగా ఉంటాయి.
వీటి లెక్క తిథులలో సహా ధర్మజునికి & భీష్మునికి తెలుసు కాబట్టే ఉత్తర గోగ్రహణం నందు పాండవులు బయటకు తెలుస్తారు.
కానీ దుర్యోధనుడు సూర్యమానం ప్రకారం ఇంకా అజ్ఞాతవాసం పూర్తి అవలేదని భ్రమ పడతాడు.
అందుకే ఉత్తర గోగ్రహణం నందు బయటపడడానికి ముందు రోజే మొత్తం 13 సం కాలం పూర్తి అగుతుంది.
ఇదంతా అర్జునుడు ఉత్తర కుమారునికి వివరిస్తూ తాను గాండీవం ను 30 సం ధరించానని ఇంకనూ 35 సం దరిస్తానని చెప్తాడు.
బహుళ నవమి రోజు అర్జునుడు అజ్ఞాతవాసం నుండి బయటకు వస్తాడు.
అప్పటికి ధర్మజుని వయసు 89సం 10నె 9రో.
పాండవులు ఉపప్లవ్యం లో 1సం 2నె 17రో ఉంటారు. ఈ కాలం లొనే ఉత్తర&అభిమన్యుల వివాహం శుభకృత్ జ్యేష్ఠ మాసం లో జరుగుతుంది.
ఆస్వీయుజ మాసం లో ఏర్పడిన సూర్య చంద్ర గ్రహణాలు 🌝🌚 రాబోయే కాలం లో జరగబోయే వినాశానికి హేతువులు గా చెప్తారు.

➡ శ్రీ కృష్ణ రాయబారం :
కృష్ణుడు శుభకృత్ కార్తీక శుక్ల విదియ రేవతి నక్షత్రం నాడు ప్రారంభమై త్రయోదశి నాడు హస్తినపురం కు చేరతాడు.అక్కడి నుండి బహుళ అష్టమి వరకు శాంతి కాముకం గా రాయబారం నడుపుతాడు.
అష్టమి రోజే విశ్వరూప సందర్శనం జరుగుతుంది. రాయబారం విఫలమైన తర్వాత అదే రోజు పుష్యమి నక్షత్రం నాడు తిరుగు ప్రయాణం అవుతూ కర్ణుడి తో ఈ విధం గా అంటాడు. వారం రోజులలో అనగా జ్యేష్ఠ నక్షత్రం పాడ్యమి నాడు కురుక్షేత్ర సంగ్రామం జరగపోతుంది. సిద్ధంగా ఉండండి అని ఉపప్లవ్యం కు బయలు దేరతాడు.
మార్గశిర శుక్ల విదియ నుండి ద్వాదశి వరకు సైన్యాల మోహరింపు, యుద్ధ సరంజామా , సామర్ధ్య పరీక్షలు నిర్వహించ బడతాయి.
➡ యుద్ధ ప్రారంభం :
శుభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం శుక్ల త్రయోదశి / చతుర్దశి భరణి నక్షత్రం మంగళవారం నాడు ప్రారంభమౌతుంది.
అప్పటికి ధర్మరాజు వయసు 91సం 2నె 9రో .
దీనికి ముందు రోజే అర్జునునికి భగవద్గీత ను బోధిస్తాడు.
మార్గశిర బహుళ సప్తమి నాడు భీష్ముడు అంపశయ్య పై చేరతాడు.
➡ అభిమన్యుని మరణం :
మార్గశిర బహుళ దశమి తన 17 వ ఏట. అప్పటికి అతని వివాహం జరిగి 6నెలలు మాత్రమే. ఉత్తర 6నెలల గర్భిణీ.
సైంధవ మరణం :
మార్గశిర బహుళ ఏకాదశి.
ద్రోణుడు ద్వాదశి నాడు
కర్ణుడు చతుర్దశి నాడు
శల్యుడు శుక్ల పాడ్యమి సాయంత్రం మరణిస్తారు.
➡ దుర్యోధనుడి మరణం :
పుష్య మాస శుక్ల పాడ్యమ
➡ ఉపపాండవుల మరణం :
పుష్య శుక్ల పాడ్యమి నాటి రాత్రి వేళ.
➡ ధర్మరాజు పట్టాభిషేకం :
శుభకృత్ పుష్య పౌర్ణమి.
అప్పటికి ఆయన వయసు 91సం 3నె 10 రో.
పుష్య బహుళ విదియ నుండి అష్టమి వరకు భీష్ముని చే అనేక విషయాలు పాండవుల కు చెప్పబడతాయి.హస్తిన కు వెళ్లిన 15 రోజుల తర్వాత మళ్ళీ మాఘ శుక్ల అష్టమి నాడు మళ్ళీ కలుసుకుంటారు.

భీష్ముడు మార్గశిర సప్తమి నుండి మాఘ ఏకాదశి వరకు 48 రోజులపాటు అంపశయ్య మీద ఉన్నట్లు చెప్తారు.
➡ అశ్వమేధ యాగం :
శుభకృత్ మాఘ శుక్ల ద్వాదశి.
15సం అనంతరం ధృతరాష్ట్రుడు వన వాసానికి కార్తీక మాసంలో వెళతాడు.
3సం తర్వాత పాండవులు పెద్ద వారు మరణించారని తెలుసుకుని వారిని చూడడానికి అడవులకు వెళ్తారు.
ఒక నెల తర్వాత గాంధారి , ధృతరాష్ట్రుడు, కుంతి మొదలగు వారు అడవులలో అగ్నికి ఆహుతి అవుతారు.
యుద్ధానంతరం 36 సం కు ద్వారక లో ముసలం పుట్టి యాదవులు వినాశనం జరుగుతుంది.
➡ ధర్మరాజు పాలన : శుభకృత్ పుష్య పౌర్ణమి నుండి బహుదారణ్య పుష్య పౌర్ణమి వరకు ధర్మరాజు 36సం 2నె 15రో పాటు పరిపాలిస్తాడు.
➡ కలియుగ ప్రారంభం :
ప్రమాధి శుక్ల పాడ్యమి నాడు శ్రీ కృష్ణ నిర్యాణం తో కలియుగం ఆరంభం అవుతుంది.

అది క్రీ పూ,...🔯 20 - 2 - 3102. 2:27:30 AM. 🔯....
7 రోజుల అనంతరం ద్వారక సముద్రం లో మునిగి పోతుంది.
యుధిష్టర శకం ఆయన పట్టాభిషేకం రోజునుండి మొదలవుతుంది.
➡ పాండవుల రాజ్య నిర్గమన
ద్వారక నిమ్మజ్జన అనంతరం 6నె 11రో అనగా ధర్మజుని వయసు 127సం 6రో ఉన్నపుడు 36 సం పరీక్షిత్తు నికి రాజ్యాభిషేకం చేస్తారు.
స్వర్గారోహణ గురించి పూర్తి వివరణ తెలియదు కాని అది 26 సం తర్వాత జరిగింది గా చెప్తారు.
వ్యాసుడు గణపతి కి స్వర్గారోహణ తర్వాతే మహాభారతం చెప్తాడు అని అంటారు.🤔🤔
పరీక్షిత్తు 60 సం రాజ్యపాలన అనంతరం మరణిస్తాడు. 25 సం జనమేజయుడు రాజు అవుతాడు.
మహాభారత రచన అనంతరమే వేద వ్యాసుడు కలియుగం ప్రారంభమైన 60 సం కు భాగవత రచన చేశాడని చెపుతారు.

Dwadasa Raasula variki Laxmi Mula mantraalu


దేశంలో ఉన్న అష్టాద‌శ శ‌క్తి పీఠాలు

18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్క‌లున్నాయి. అయితే 18 ప్ర‌ధాన‌మైన శ‌క్తి పీఠాల‌ను అష్టాద‌శ శ‌క్తి పీఠాలు అంటారు. వాటి వివ‌రాలు మీ కోసం..

హిందువులు పార్వ‌తీ దేవిని ఆరాధించే దేవాల‌యాల‌లో పురాణ గాథ‌ల‌, ఆచారాల ప‌రంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కొన్ని స్థలాల‌ను శ‌క్తిపీఠాలు అంటారు. ఈ శ‌క్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విష‌యంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్క‌లున్నాయి. అయితే 18 ప్ర‌ధాన‌మైన శ‌క్తి పీఠాల‌ను అష్టాద‌శ శ‌క్తి పీఠాలు అంటారు. వాటి వివ‌రాలు మీ కోసం..

1. శాంకరి : శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.

2. కామాక్షి :  కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
3. శృంఖల _ : ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

4. చాముండి :- క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.

5. జోగులాంబ : - ఆలంపూర్, తెలంగాణ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.

6. భ్రమరాంబిక :- శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.

7. మహాలక్ష్మి :  కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

8. ఏకవీరిక : మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.

9. మహాకాళి  ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.

10. పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.

11. గిరిజ- ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా - వైతరిణీ నది తీరాన ఉన్నది.

12. మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.

13. కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.

14. మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.

15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.

16. మంగళ గౌరి- గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.

17. విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.

18. సరస్వతి - జమ్ము, కాశ్మీర్ - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.

(సేకరణ:సొంటేల ధనుంజయ)

Sunday, December 23, 2018

దేవకీ మొదటి ఆరుగురు సంతానం, వారి మరణ రహశ్యం !

భాగవతములో ఆకాశవాణి కంసుని హెచ్చరించి  ఆ ఆరుగురు శిశువుల మరణానికి కారణం ఎందుకు అయింది .?

దీనికి భాగవతములో సమాధానము ఎక్కడా లేదు. వేరే ఏదైనా పురాణాలలో ఎక్కడైనా ఉందా అన్న ప్రశ్నకు సమాధానమే ఈ వివరణ. .

కంసుడు పూర్వజన్మలో కాలనేమి. సీతారాముల ఎడబాటుకి, రామరావణ యుద్ధానికి కారణమైన మారీచుడి కొడుకు పేరు కాలనేమి.
రామ రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంద్రజిత్తు ధాటికి లక్ష్మణుడు మూర్ఛపోతే హనుమంతుడు మూలిక బదులుగా సంజీవని పర్వతాన్నే తీసుకువచ్చి మూర్ఛనుంచి తేర్చాడు. మరోసారి మళ్ళీ యుద్ధంలో లక్ష్మణాదులు మూర్ఛపోతే ద్రోణగిరిపై ఉన్న విశల్యకరణి అనే మూలిక తేవాలని జాంబవంతుడు చెప్తే తాను తెస్తానని హనుమంతుడు సిద్ధ పడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు రావణాసురుడు. రావణాసురుడు కాలనేమి ఇంటికి వెళ్ళి హనుమంతుడు ద్రోణగిరికి బయలుదేరుతున్న విషయం చెప్పి హనుమంతుడిని దారితప్పించి అక్కడ ఉన్న మాయాసరస్సులో స్నానం చేసేలా చేయమని ఆజ్ఞాపిస్తాడు. ప్రభువు ఆజ్ఞ శిరసావహించాడు కాలనేమి.ద్రోణగిరికి మార్గం వెతుకుతూ దప్పికగొన్న హనుమకు జపంచేస్తూ మహర్షిరూపంలో కాలనేమి కనిపించాడు. ద్రోణగిరికి మార్గం చెప్పమని హనుమ అభ్యర్థించాడు. అక్కడ ఉన్న సరస్సులో నీరు త్రాగి, స్నానం చేస్తే దప్పికతీరి, కార్యసాధనకు శక్తి వస్తుందని కాలనేమి తన శిష్యులద్వారా నమ్మించాడు. హనుమ ఆ కొలనులోకి దిగగానే మొసలి రూపంలో ఉంటూ శాపగ్రస్త అయిన ధాన్యమాలిని అనే అప్సరస అతనిని పట్టుకుంది. మహా బలశాలి అయిన హనుమ దానిని చంపి శాపవిమోచనం కలిగించాడు.అందుకు కృతజ్ఞతతో ధాన్యమాలిని కాలనేమి దురాలోచన వివరించి ద్రోణగిరికి దారి చెప్తుంది.

 హనుమంతుడు కాలనేమి ఆశ్రమానికి తిరిగివస్తాడు. సహాయం చేసినందుకు గురుదక్షిణ కోరుకున్న కాలనేమిని యమపురికి పంపిస్తాడు హనుమంతుడు. ఇది కాలనేమి కథ..

వేషాలు మార్చి, మాయచేసే దొంగభక్తులు చేసే పూజాపునస్కారాలను
తెలుసుకోమని పెద్దలు చెబుతుంటారు,

అలాంటి దొంగ జపాలు,తపస్సు లు చెసే వారిని  కాలనేమి తో పోలుస్తారు .

కంసుడు కృష్ణుడి మేనమామ. ఉగ్రసేనుని తొమ్మిది మంది కుమారులలో పెద్దవాడు. కృష్ణుడి చేత చంప బడతాడు.

కంసుడు పూర్వజన్మలో కాలనేమి.

ఈ జన్మలో కాలనేమిని విష్ణువు హతమారుస్తాడు.(శ్రీ కృష్ణుడు).

 దేవకీ పుత్రులలో ఆరుగురు గత జన్మలో కాలనేమి పుత్రులు. వారిని తండ్రే చంపుతాడు అని హిరణ్య కశిపుడు శపిస్తాడు. ఆవిధంగానే మరుసటి జన్మలో దేవకీ గర్భాన మొదట పుట్టిన ఆరుగురిని కంసుడు చంపుతాడు.

కాలనేమి పుత్రుల పేర్లు :– హంస, సువికర్మ, కృత, దమన, రిపుర్మర్దన, క్రోధహంత.

ఈ విధంగా హిరణ్యకశ్యపుని శాపం నిజం కావాలన్నా,కాలనేమి చేతిలో అతని సంతానం హతం కావాలన్నా, దేవకీ వసుదేవులను బంధించడం, వారికి జన్మించిన కాలనేమిపుత్రులను ఆరుగురునీ కంసుని చేతిలో హతంచేయించడం జరగాలన్నా ఆకాశవాణి పలకటం దేవకీ వసుదేవులను సంతానప్రాప్తి పర్యంతం ఖైదులో ఉంచడం తప్పనిసరిదేవకీ వసుదేవులు సంతోషంగా ఉంటూ ఉండగా వారికి మొట్టమొదట కొడుకు పుట్టాడు. పుట్టిన కొడుకును పుట్టినట్లుగా పట్టుకువెళ్ళి కంసునికి ఇచ్చేశాడు. వసుదేవుని చూసి ‘బావా, చూశావా నువ్వు ఎంత మాట తప్పని వాడవో! పిల్లవాడు పుట్టగానే నీవే తీసుకు వచ్చి ఇచ్చావు. నాకు అందుకే నీవంటే అంత గౌరవం. నువ్వు మాట తప్పని వాడవు. కానీ బావా, ఎనిమిదవ వాడు కదా నన్ను చంపేది! మొదటి వాడిని చంపడమెందుకు? తీసుకువెళ్ళిపో’ అన్నాడు. వసుదేవుడు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. రెండవ కొడుకు పుట్టాడు. ఎనిమిదవ గర్భమును కదా ఇమ్మన్నాడు. అందుకని రెండవ పిల్లవానిని తీసుకు వచ్చి యివ్వలేదు. ఇలా ఆరుగురు పిల్లలు పుట్టారు. ఆ ఆరుగురు పిల్లలతోటి అమ్మకి, నాన్నకి మిక్కిలి అనుబంధం ఏర్పడింది.

 ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజున కంసుని దగ్గరికి నారదుడు వచ్చాడు. ఆయన మహాజ్ఞాని. ఎప్పుడు వచ్చినా ఏదో లోకకళ్యాణం చేస్తాడు.

కంసుని దగ్గరకు వచ్చి _‘కంసా! ఎంత వెర్రివాడవయ్యా! _అసలు నీవు ఎవరిని వదిలిపెడుతున్నావో వారెవరూ మనుష్యులు కారు. నువ్వు క్రిందటి జన్మలో ‘కాలనేమి’ అను పేరు గల రాక్షసుడవు. నిన్ను శ్రీమహావిష్ణువు సంహరించారు.

నీ తండ్రి, తల్లి, దేవకీ, వసుదేవుడు, పక్క ఊళ్ళో ఉన్న నందుడు, ఆవులు, దూడలు వీరందరూ దేవతలు. నిన్ను చంపడానికే వచ్చారు’ అని చెప్పి ఆయన హాయిగా నారాయణ సంకీర్తనం చేసుకుంటూ ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయాడు.

ఇపుడు కంసుడికి అనుమానం వచ్చింది. నారదుడు అనవసరంగా అబద్ధం చెప్పడు కదా! వసుదేవుడిని ఆరుగురి పిల్లలను తీసుకురమ్మనమని కబురుచేశాడు. ‘ఎనిమిదవవాడికి వీళ్ళు సహాయ పడితే నా బ్రతుకు ఏమయిపోవాలి? అందుకని ఉన్నవాళ్ళను ఉన్నట్లుగా సంహరించాలి’ అనుకుని పిల్లలను చంపేశాడు.

తరువాత తన తల్లిని, తండ్రిని, దేవకిని, వసుదేవుని అందరినీ కారాగారంలో పెట్టి బకుడు, తృణావర్తుడు, పూతన – ఇలాంటి వారినందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు. తరువాత వస్తున్న గర్భం ఏడవ గర్భం. కాబట్టి జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవులను అత్యంత కట్టుదిట్టమయిన కారాగారంలో పెట్టాడు. రోజూ తానే వెళ్ళి స్వయంగా చూస్తుండేవాడు.

ఇక్కడ మీకు ఒక అనుమానం రావాలి.

వసుదేవుని పిల్లలు పసివారు. నారదుడు మహానుభావుడు. లోకకళ్యాణకారకుడు. ‘నారం దదాతి యితి నారదః’ అని ఆయనిష్కారణంగా జ్ఞానం ఇచ్చేవాడు.

అటువంటి వాడు ఆరుగురు పిల్లలు చచ్చిపోవడానికి ఎందుకు కారకుడు అయ్యాడు? ఇపుడు వచ్చి ఆయన చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి? కంసునితో ఎందుకు అలా చెప్పాడు అని అనుమానం వస్తుంది.

భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు. దీనికి పరిష్కారం దొరకాలంటే దేవీభాగవతం చదవాలి. దేవీ భాగవతంలో ఈ రహస్యమును చెప్పారు.

పూర్వం మరీచి, ఊర్ణాదేవి అని యిద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకు వెళ్ళారు. వాళ్ళు బ్రహ్మగారు కూర్చుని ఉండగా నిష్కారణంగా ఒక నవ్వు నవ్వారు. అపుడు బ్రహ్మగారు ‘మీరు రాక్షసుని కడుపున పుట్టండి’ అని శపించారు. అందువలన వారు ఆరుగురు క్రిందటి జన్మలో ‘కాలనేమి’కి కుమారులుగా జన్మించారు. అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బ్రతికి తదనంతరం హిరణ్యకశిపుని కడుపునా పుట్టారు. అప్పటికి వాళ్ళకి వున్న రజోగుణ తమోగుణ సంస్కారం తగ్గింది. మరల బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు వారికి దీర్ఘాయుర్దాయమును ప్రసాదించారు. ఈవిషయమును వారు తండ్రి అయిన హిరణ్యకశిపునకు చెప్పారు. అపుడు హిరణ్యకశిపునికి కోపం వచ్చింది. ‘నేను యింకా తపస్సు చేసి దీర్ఘాయుర్దాయమును పొందలేదు. మీరు అప్పుడే పొందేశారా?కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాను. మీరు దీర్ఘనిద్రలో ఉండి మరణించండి. అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గతజన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు’ అన్నాడు. వాళ్ళు దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు.

 మరుజన్మలో మరీచి ఊర్ణల కొడుకులు ఇప్పుడు దేవకీదేవి కడుపునా పుట్టారు. వాళ్ళ శాపం ఈజన్మతో ఆఖరయిపోతుంది. వీళ్ళు యిప్పుడు గతజన్మలోని తండ్రి చేతిలో చచ్చిపోవాలి. గతజన్మలో వీరి తండ్రి కాలనేమి. కాలనేమి యిపుడు కంసుడిగా ఉన్నాడు. కాబట్టి వేరు కంసుడి చేతిలో మరణించాలి. వారికి ఆ శాప విమోచనం అయిపోయి వారు మరల బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి.

అందుకని నారదుడు వచ్చి వాళ్ళు శాప విమోచనం పొందేలా చేశాడు. అదీ నారదుని రాకలో గల కారణం.

గరుడ పురాణంలో ఏముంటుంది?

గరుడ పురాణాన్ని వేదవ్యాసుడు రచించాడు. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు? ఆ జీవుడికి ఏయే గతులు కలుగుతాయి... తదితర సందేహాలు కలిగాయట. వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి, గరుడుని సందేహ నివృత్తి చేశాడట. గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది. దీనిలో ప్రధానంగా రెండు భాగాలుంటాయి. ఒకటి... పూర్వఖండం, రెండు... ఉత్తర ఖండం. పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగధర్మాలు, విష్ణువు దశావతారాలు వంటివి ఉన్నాయి. ఉత్తర ఖండంలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది. అందులో మరణానంతరం జీవుడు ఏం చేస్తాడు... వంటి విషయాలుంటాయి. ఇంటిలో ఎవరైనా గతించినప్పుడు పఠించేది ఈ అధ్యాయాన్నే! ద్వితీయాధ్యాయాన్ని ఎవరైనా, ఎప్పుడైనా చదువుకోవచ్చు.

ప్రతిమనిషికి భయం ఉండాలి. అది దైవభీతి కావచ్చు, పాపభీతి కావచ్చు... ఏదైనా. ఆ భయం లేకుంటే మనిషికి, మృగానికి భేదం లేకుండా పోతుంది. అందుకే ఋషులు ఎంతో ముందుచూపుతో పురాణాలను రచించి మానవజాతికి అందించారు. ఈ పురాణాలన్నింటిలోనూ అది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం అని భయపెడుతున్నట్లే ఉంటుంది. దాంతో వాటిని పక్కన పడేస్తాం. వాస్తవానికి మనిషిని సద్వర్తనలోకి నడిపించాలంటే భయం కూడా అవసరమే. అందుకే మన పెద్దలు అంతగా భయపెట్టారు. గరుడ పురాణంలో అన్నీ ఇలాంటి విషయాలే ఉంటాయి. మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.

ఇవిచేయకూడదా..?

కొన్ని విషయాలను పాపాలని గరుడపురాణం చెబుతోంది. అవి... బ్రహ్మహత్య, శిశుహత్య, గో హత్య, స్త్రీ హత్యలతోబాటు గర్భపాతం చేసేవారు, రహస్యంగా పాపపు పని చేసేవారు, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు ధనం హరించేవారు కూడా నరకంలో శిక్షలను అనుభవించక తప్పదంటుంది. అలాగే అప్పు తీర్చనివారు, పర ద్రవ్యాన్ని అపహరించేవారు, విశ్వాస ఘాతకులు, ఇతరులను హత్యచేసే వారు, దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించేవారు, ఋణగ్రస్థులను ఎగతాళి చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయనివారు కూడా పాపులేనట. పుణ్యతీర్థాలను, సజ్జనులను, సత్కర్ములను, గురువులను, దేవతలను నిందించేవారు యమలోకంలో దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుందట.

పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయశాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు, చెడుమాటలు పలికేవారు కూడా దుర్గతుల పాలు కాక తప్పదు. పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి, పరనింద చేసేవారు, అధర్మ మార్గంలో నడిచేవారు ఒకరకానికి చెందిన వారైతే ఇంకా నీచమైన పనులు చేసేవారు మరికొందరున్నారు.

అంటే... తల్లిదండ్రులను, గురువును, ఆచార్యులను అవమానించేవారు, భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు, ఇచ్చినదానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి, బాధపడేవారు వైతరణిని దాటక తప్పదు. దానం చేసేవారిని ఇవ్వవద్దని ఆపేవారు, యజ్ఞవిధ్వంసకులు, హరికథకులకు విఘ్నం కలిగించేవారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమిని ఆక్రమించేవారు, పశువులకి మేత లేకుండా చేసేవారు, పశుహత్య చేసేవారు... యమలోకంలో దక్షిణమార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందేనట.

యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరణిలో తోసి వేస్తారట. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచన చేసి ధనం సంపాదించేవారు, దొంగతనం చేసేవారు, పచ్చని చెట్టను నరికేవారు, ఫలవృక్షాలను పూలతోటలను ధ్వంసం చేసేవారు, తీర్థయాత్రలను చేసేవారికి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మానహరణ చేసేవారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగచెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారని గరుడపురాణం చెప్తుంది.

అంటే గరుడపురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడం వల్ల మనిషి తన  జీవితాన్ని మంచిమార్గంలోకి మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే... బలహీన మనస్కులు దీనిని చదవడం వల్ల చలించి పోతారని, అందువల్ల ఎప్పుడైనా మృతి సంభవించిన సమయంలో  మాత్రమే గరుడపురాణాన్ని చదవాలని పెద్దలు చెప్పారు. కానీ, గరుడపురాణం ఇంటిలో ఉండటం కూడా మంచిది కాదని జరిగే ప్రచారాలలో ఏమాత్రం యథార్థం లేదని పండితులు చెబుతున్నారు.

Friday, December 21, 2018

శ్రీ వరాహ స్తోత్రం..

ఇల్లు కట్టుకోవాలన్నా..స్థలాలు..భూములు..కొనాలన్నా..
ఈ స్తోత్రమును రోజూ 9 సార్లు పఠించాలి.

ఋషయ ఊచు |
జితం జితం తేఽజిత యజ్ఞభావనా
త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః |
యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః
తస్మై నమః కారణసూకరాయ తే || ౧ ||

రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం
దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం |
ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమ-
స్స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్ || ౨ ||

స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయో-
రిడోదరే చమసాః కర్ణరంధ్రే |
ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే
యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రమ్ || ౩ ||

దీక్షానుజన్మోపసదః శిరోధరం
త్వం ప్రాయణీయో దయనీయ దంష్ట్రః |
జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః
సభ్యావసథ్యం చితయోఽసవో హి తే || ౪ ||

సోమస్తు రేతః సవనాన్యవస్థితిః
సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః |
సత్రాణి సర్వాణి శరీరసంధి-
స్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః || ౫ ||

నమో నమస్తేఽఖిలయంత్రదేవతా
ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే |
వైరాగ్య భక్త్యాత్మజయాఽనుభావిత
జ్ఞానాయ విద్యాగురవే నమొ నమః || ౬ ||

దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా
విరాజతే భూధర భూస్సభూధరా |
యథా వనాన్నిస్సరతో దతా ధృతా
మతంగజేంద్రస్య స పత్రపద్మినీ || ౭ ||

త్రయీమయం రూపమిదం చ సౌకరం
భూమండలే నాథ తదా ధృతేన తే |
చకాస్తి శృంగోఢఘనేన భూయసా
కులాచలేంద్రస్య యథైవ విభ్రమః || ౮ ||

సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం
లోకాయ పత్నీమసి మాతరం పితా |
విధేమ చాస్యై నమసా సహ త్వయా
యస్యాం స్వతేజోఽగ్నిమివారణావధాః || ౯ ||

కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో
రసాం గతాయా భువ ఉద్విబర్హణం |
న విస్మయోఽసౌ త్వయి విశ్వవిస్మయే
యో మాయయేదం ససృజేఽతి విస్మయమ్ || ౧౦ ||

విధున్వతా వేదమయం నిజం వపు-
ర్జనస్తపః సత్యనివాసినో వయం |
సటాశిఖోద్ధూత శివాంబుబిందుభి-
ర్విమృజ్యమానా భృశమీశ పావితాః || ౧౧ ||

స వై బత భ్రష్టమతిస్తవైష తే
యః కర్మణాం పారమపారకర్మణః |
యద్యోగమాయా గుణ యోగ మోహితం
విశ్వం సమస్తం భగవన్ విధేహి శమ్ || ౧౨ ||

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే శ్రీ వరాహ ప్రాదుర్భావోనామ త్రయోదశోధ్యాయః |

లోకా సమస్తా సుఖినో భవంతు..!!💐

                          💐శ్రీ మాత్రే నమః💐

Tuesday, December 18, 2018

అనాయాసేన మరణం ...

మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.
అది ఏమిటంటే..!

"అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."

మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.

దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.

"అనాయాసేన మరణం"
*******
నాకు నొప్పి లేక బాధ కానీ లేని
మరణాన్ని ప్రసాదించు.

"వినా ధైన్యేన జీవనం"
*******
నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,
నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.

"దేహాంతే తవ సాన్నిధ్యం"
*******
మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను
నిన్ను దర్శించుకునే విధంగా దీవించు. 

దేహిమే పరమేశ్వరా
*******
ఓ పరమేశ్వర నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.

1)అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.
2)ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.
3) నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా
ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.
ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు  చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాదిస్తాడని మరువకండి.
" లోకా సమస్తా🚩 సుఖినో భవంతు..!! 🌹🌞

'ఉత్తర ద్వార దర్శనం'లో ప్రత్యేకత ఏమిటి..?

అసుర(రాక్షసుల) బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు.

ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీన్నే 'హరివాసరమ'ని, 'హరిదినమ'ని, 'వైకుంఠ దినమ'ని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి 'మూడు కోట్ల ఏకాదశుల'తో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకదశీ వ్రతం" ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకుంటారు. దీంతో స్వామి మురాసురుడి మీదికి దండెత్తి అతన్ని వధించాలని చూస్తాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంటాడు. అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు 'ఏకాదశి' అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు.

వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులు ఈ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ఉదయం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.

ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరో జన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...