విఘ్నేశ్వరునికి..
బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి.
శ్రీ వేంకటేశ్వరస్వామికి..
వడపప్పు, పానకము, నైవేద్యం పెట్టాలి. తులసిమాల మెడలో ధరింపవలెను.
ఆంజనేయస్వామికి..
అప్పములు నైవేద్యం, తమలపాకులతోనూ గంగసింధూరంతోనూ పూజించాలి.
లలితాదేవికి..
క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము.
సత్యనారాయణస్వామికి..
ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపి ప్రసాదము నైవేద్యం.
దుర్గాదేవికి..
మినపగారెలు, అల్లం ముక్కలు, నైవేద్యం.
సంతోషీమాతకు..
పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు.
శ్రీ షిర్డీ సాయిబాబాకు..
పాలు, గోధుమరొట్టెలు నైవేద్యం
శ్రీకృష్ణునకు..
అటుకులతోకూడిన తీపిపదార్ధాలు, వెన్న నైవేద్యం. తులసి దళములతో పూజించడం ఉత్తమం
శివునకు..
కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా, మారేడు దళములు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.
సూర్యుడుకు..
మొక్కపెసలు, క్షీరాన్నము నైవేద్యం.
లక్ష్మీదేవికి..
క్షీరాన్నము, తీపిపండ్లు, నైవేద్యం, తామరపూవులతో పూజించాలి.
No comments:
Post a Comment