Tuesday, August 25, 2020

కాశి లో చప్పన్ గణేశలు (కాశీ క్షేత్రం లో విరాజిల్లుతున్న 56 వినాయక దేవాలయాలు)

గణేశుడు కాశీ క్షేత్రాన్ని, విశ్వనాధ మందిరాన్ని అష్టదిక్కులా, సప్తవలయ రక్షణ వ్యవస్ధ ద్వారా రక్షిస్తూ ఉంటాడు. ఈ సప్త వలయ రక్షణలో ముఖ్యమైన ఎనిమిది వినాయక అవతారములు కలవు. ఒక్కొక్క వలయము, వాటి లోని వినాయక దేవాలయములు ఇక్కడ ప్రస్తావించ బడినవి.

ఒకటవ వలయము...

1. శ్రీ అర్క వినాయకుడు, 

2. శ్రీ దుర్గా వినాయకుడు,

3. శ్రీ భీమచండ వినాయకుడు,

4. శ్రీ డేహ్లివినాయకుడు, 

5. శ్రీ ఉద్దండ వినాయకుడు,

6. శ్రీ పాశపాణి వినాయకుడు, 

7. శ్రీ ఖర్వ వినాయకుడు,

8. శ్రీ శిద్ద వినాయకుడు.

ఈ అష్ట వినాయకులు కాశీ క్షేత్ర వెలుపలి పరిక్రమములో ఉండి భక్తులకి సిద్ధిని ప్రసాదిస్తూ, కాశీని కాపాడుతూ ఉంటారు. 

రెండవ వలయము...

రెండవ వలయములో కూడా అష్టవినాయకులు కాశీపుర వాసుల సమస్త విఘ్నాలను తొలగిస్తూ రక్షణ కల్పిస్తారు...

09. శ్రీ లంబోదర వినాయక,

10. శ్రీ కూట దంత వినాయకుడు

11. శ్రీ శాల కంటక వినాయకుడు

12. శ్రీ కూష్మాండ వినాయకుడు

13. శ్రీ ముండ వినాయకుడు

14. శ్రీ వికట దంత వినాయకుడు

15. శ్రీ రాజ పుత్రా వినాయకుడు

16. శ్రీ ప్రణవ వినాయకుడు

మూడవ వలయము...

ఇక మూడవ వలయము లోని అష్ట వినాయకులు కాశీ క్షేత్రాన్ని అంతటినీ అత్యంత శ్రద్ధతో పరిరక్షిస్తూ ఉంటారు...

17. శ్రీ వక్రతుండ వినాయకుడు

18. శ్రీ ఏక దంత వినాయకుడు

19. శ్రీ త్రిముఖ వినాయకుడు

20. శ్రీ పంచాశ్వ వినాయకుడు

21. శ్రీ హేరంబ వినాయకుడు

22. శ్రీ విఘ్న రాజ వినాయకుడు

23. శ్రీ వరద వినాయకుడు

24. మోదకప్రియ వినాయకుడు

నాల్గవ వలయము...

25. శ్రీ అభయప్రద వినాయకుడు

26. శ్రీ సింహ తుండ వినాయకుడు

27. శ్రీ కూడితాక్ష వినాయకుడు

28. శ్రీ క్షిప్ర ప్రసాద వినాయకుడు

29. శ్రీ చింతామణి వినాయకుడు

30. శ్రీ దంత హస్త వినాయకుడు

31. శ్రీ పిఛిoడల వినాయకుడు

32. శ్రీ ఉద్దండ ముండ వినాయకుడు

ఐదవ వలయము...

33. శ్రీ స్ధూల దంత వినాయకుడు

34. శ్రీ కాళీ ప్రియ వినాయకుడు

35. శ్రీ చాతుర్దంత వినాయకుడు

36. శ్రీ ద్విదంత వినాయకుడు

37. శ్రీ జ్యేష్ట వినాయకుడు

38. శ్రీ గజ వినాయకుడు

39. శ్రీ కాళ వినాయకుడు

40. శ్రీ నాగేశ్ వినాయకుడు

ఆరవ వలయము...

ఈ వలయము లోని వినాయకుల నామ స్మరణ మాత్రముచే భక్తుడు ముక్తిని పొందును...

41. శ్రీ మణికర్ణి వినాయకుడు

42. శ్రీ ఆశ వినాయకుడు

43. శ్రీ సృష్టి వినాయకుడు

44. శ్రీ యక్ష వినాయకుడు

45. శ్రీ గజ కర్ణ వినాయకుడు

46. శ్రీ చిత్రఘంట వినాయకుడు

47. శ్రీ స్ధూల జంఘ / మిత్ర వినాయకుడు

48. శ్రీ మంగళ వినాయకుడు

ఏడవ వలయము...

ఈ వలయము లోని ఐదు వినాయకులు ప్రసిద్ధులు...

49. శ్రీ మొద వినాయకుడు

50. శ్రీ ప్రమోద వినాయకుడు

51. శ్రీ సుముఖ వినాయకుడు

52. శ్రీ దుర్ముఖ వినాయకుడు

53. శ్రీ గణనాధ వినాయకుడు

ఇక...

54. శ్రీ జ్ఞాన వినాయకుడు,

55. శ్రీ ద్వార వినాయకుడు.. కాశీపురి ముఖ్య ద్వారం పై ఉన్నారు.

56. శ్రీ అవిముక్త వినాయకుడు.. ఈ అవిముక్త క్షేత్రములోని భక్తుల అన్ని కష్టాలనూ దూరం చేసి, భాధల నుండి విముక్తము చేస్తాడు...

|| ఓం నమః శివాయ ||

హిందూ సనాతన ధర్మమునకు సంభదిత విషయములు తెలుసుకొనుటకు కొరకు టెలిగ్రామ్ యాప్ వాడే వారు ఈ క్రింది లింక్ ద్వారా మన సమూహం నందు జాయిన్ అవచ్చును.....

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...