కామాన్ని జయించడం అంటే అందరూ అనుకున్నట్లు చాల కష్టమైన పనేమీ కాదు. దీనిని జయించడం చాల చాల సులువైన పని. దానికి మనం చేయవలసిందల్లా దానిని సానుకులపరచడమే అంతే. దాన్ని జయించినట్లే. దానిని సానుకులపరచడం అంటే దానికి శాస్వతతత్వాన్ని తెలియపరచి, శాశ్వతమైన దానిని తెలియజేసి నిత్యమైన దాని కోసం వెతకడం ప్రారంభిస్తే చాలు.
అది అప్పటి నుండి దాని మార్గాన్ని మార్చుకుంటుంది. అంటే ఇక్కడ మనం ఇంత వరకు అజ్ఞానంలో అనిత్యమైన వాటి కోసం ప్రాకులాడుతున్నాము. ఇప్పుడు దాని మార్గాన్ని మరల్చాలి. మరల్చి భగవంతుని మీదకు ద్రుష్టి నిలిపేలా మనం గ్రహించిన జ్ఞానంతో మనకు ఉన్న బుద్ది అనే సాధనంతో మనస్సులో కరిగే కోరికలనన్నిటికి స్వస్తి పలికి శాశ్వతమైన, నిత్యమైన, లక్ష్యమైన ఆ పరమాత్ముని దివ్య దర్శనమే ఏకైక లక్ష్యంగా ఉండేలా గాఢమైన కోరికను మన మనస్సులో స్థిరపరచులోవాలి.
ఆ విధంగా స్థిరపరచుకుంటే మన మనస్సులో నిదానంగా అశాశ్వతమైన వాటి మీద ఉన్న ధ్యాస పోయి శాశ్వతమైన పరమాత్మమీద మాత్రమే కోరిక కలుగుతుంది. దీనితో పాటు మనం కొన్నిటిని ప్రతిదినం అలవారచుకుంటే మనం సంపూర్ణంగా, పరిపూర్ణంగా కామాన్ని జయించినట్లే. అవి మొదట మనం భగవంతుని ముందర కోరికలను కోరడం (అంటే అవికావాలి,ఇవికావాలి అని) కోరుకోకూడదు. జరిగిపొయినవి అన్నియు మన మంచికే, జరగబోతున్నవి కూడా మన మంచికే అని ముందు మన మనస్సును సమాధానపరచాలి.
రోజు చేసే పనిని అది ఏదైనా భగవంతార్పణ బుద్దితో, నిష్కల్మషంగా (అంటే ఎటువంటి కల్మషం లేకుండా), ఫలాపేక్షరహితంగా కర్మలను ఆచరిస్తూ వుంటే అప్పుడు నీ మనస్సు అంతఃకరణ నిదానంగా ఖచ్చితంగా పరిశుద్దమై అదే కోరికలను త్యజిస్తుంది ఎందుకంటే అప్పుడు నీ మనస్సుకు ఒక భావన కలుగుతుంది అది ఏమిటంటే ఇవి అన్నియు అనిత్యమైనవి కదా అనే భావన రోజు రోజుకు నీలో అధికమవుతుంది.
ప్రతి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మంచం దిగకుండా అలాగే కూర్చొని నీ హృదయంలో దివ్య జ్యోతి వుందని మనస్సులో సంపూర్ణంగా భావించుకొని నీ హృదయ స్పందన మీద మాత్రమే ఏకాగ్రతను నిలిపి 10 నిమిషాలు అట్లే కూర్చొని సాధన(ధ్యానం) చేస్తే నీలో సంపూర్ణంగా కోరికలు అన్నీ అవియే సమసిపోతాయి అంతేకాక నీ మనస్సు కూడ చాల హాయిగా, ఆనందంగా వుంటుంది.
అదే విధంగా ప్రతి రోజు రాత్రి నిద్ర పోయే ముందు కూడ మంచం ఎక్కగానే ఒక 10 నిముషాలు కూర్చొని నీ హృదయంలో దివ్య జ్యోతి వుందని మనస్సులో సంపూర్ణంగా భావించుకొని నీ హృదయ స్పందన మీద మాత్రమే ఏకాగ్రతను నిలిపి 10 నిమిషాలు కూర్చొని సాధన(ధ్యానం) చేసి ఆ తరువాత అలానే భావించుకుంటూ నిద్రపోతే చాల ప్రశాంతమైన మరియు చాల సుఖవంతమైన నిద్ర వస్తుంది. దీనినే నిద్రలో నిశ్చింతత అంటారు..
|| ఓం నమః శివాయ ||
హిందూ సనాతన ధర్మమునకు సంభదిత విషయములు తెలుసుకొనుటకు కొరకు టెలిగ్రామ్ ఎప్ వాడే వారు ఈ క్రింది లింక్ ద్వారా మన సమూహం నందు జాయిన్ అవచ్చును.....

No comments:
Post a Comment