ఈ పరిషేచన ఏమిటి? అన్నం తినే ముందు తినే పళ్ళెం చుట్టూ అలా మంత్రం చదివి నీళ్ళేందుకు చల్లి అలా మెతుకులు నోట్లో వేసుకుంటున్నారు?
(ఇతఃపూర్వం మరొక పోస్ట్ లో కొద్దిగా చెప్పిన విషయం కొంచెం విస్తారంగా వివరణ)
ఇప్పుడే చదివాను ఒక మహానుభావుడు ఇలా కంచం చుట్టూ నీళ్ళు పొయ్యడం వలన చీమలు దోమలు మనం తినే ఆకు మీదకు రావు, కంచం లోకి రావు, కాబట్టి మనకు ఇలా చెయ్యమని చెప్పారు. ఉత్తినే చేస్తే బావుండదని ఒక రెండు మంత్రాలు చెప్పారు అని. అటువంటి మహానుభావుని తలకు నా పాద అభివందనం. తమకు మాత్రమె తర్కం తెలుసు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలన్న తపన వలన ఇటువంటి అద్భుతమైన రత్నాలు అలా జాలువారుతూ ఉంటాయి.
నిజంగా అనుష్టానం చెయ్యని వాడు ఏది చెప్పినా చెప్పు పుచ్చుకు తరమాలి తప్ప వాటిని యే రకంగాను ప్రామాణికంగా తీసుకోకూడదు.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇలా భోజనం ముందు పరిషేచన చెయ్యడం లో ఒక పెద్ద రహస్యం దాగి వుంది.
మనం తినే ప్రతీ మెతుకు మీదా మన రాసి ఉంది అంటారు పెద్దలు. అది నీకు ప్రాప్తం ఉండబట్టే అన్నం తినగలుగుతున్నావు, అరాయించుకోగలుగుతున్నావు. ఒక బ్రాహ్మణుడు సాత్వికాహారం పరిశుద్ధంగా తీసుకుని తనలోని సాత్త్విక శక్తిని ఉద్దీపింపచేసుకోవాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినే మనం మన ప్రాణం నిలబెట్టుకోగలుగుతున్నాము. శక్తిని సంపాదించి పనులు చెయ్యగలుగుతున్నాము. ఇలా మనలోని అన్నం అరగాలన్నా, అన్నం శక్తిగా మారాలన్నా జఠరం సరిగ్గా పని చెయ్యాలి. ఇలా చేస్తున్న ఈ జీర్ణవ్యవస్థ మనకు దేవుడు పెట్టిన భిక్ష. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు.
“”అహం వైశ్వానరో భూత్వాప్రాణినాం దేహమాశ్రితః ! ప్రాణాపానస మాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ !! (5-14)””
అంటే: నేనే ప్రాణాపానసంయుక్తమైన వైశ్వానరుడు అనే అగ్ని రూపములో సర్వప్రాణుల శరీరములయందుండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును.
ఆయన మనలో ఉండి అగ్నిరూపంలో మన ఆహారాన్ని జీర్ణం చేసి మనకు శక్తిని ఇస్తున్నాడు. మనలో దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నవారికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏమి కావాలి.
మడిగా వంట చెయ్యడం కూడా ఒక యజ్ఞం, ఇంటి ఇల్లాలు శుచి శుభ్రత పాటిస్తూ తనను, తన పరిసరాలను శుచిగా ఉంచుతూ ఆ అగ్నిభట్టారకుని సహాయంతో ధర్మంగా సంపాదించిన దినుసులతో, కూరగాయలతో వంట చేస్తుంది. మడిగా ఉంటూ కేవలం భగవదారాధన తన మనస్సంతా నింపుకుని చేసిన వంట ముందుగా ఆ భగవంతునికి నివేదించి వీరు తింటారు. వంట చేసేవారి మానసిక స్థితి ఆ తినే వారి మానసిక స్థితిమీద ప్రభావం చూపుతుంది అని నిన్న మొన్న ఒక గొప్ప university వారు కనుక్కున్నారు. ఇది మనం ఎప్పటినుండో ఆచరిస్తున్న ఒక సదాచారం.
మరి భోజనం చెయ్యడమో? అది కూడా ముమ్మాటికీ యజ్ఞమే. ఇక ఆ భోజనాన్ని భుజించేవాడు కూడా తాను తింటున్న ఆహారాన్ని లోనున్న ఆత్మారాముని సంతృప్తి పరుస్తున్నానని, లోన అగ్ని రూపంలో ఉన్న వైశ్వానరుడికి (జఠరాగ్ని లో హవిస్సు వేసినట్టు నువ్వు నీ భోజనం అందిస్తే ) యజ్ఞం (మనం మామూలుగా యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా ! అదితే అనుమన్యస్వ. అనుమతే అనుమన్యస్వ. సరస్వతే అనుమన్యస్వ. దేవ సవితః ప్రసువ అంటూ చేస్తున్న మనస్సుహోమగుండం చుట్టూ నీటితో పరిషేచన చేసి అగ్నిదేవునికి స్వాహాకారాలతో యజ్ఞం చేసినట్టు) తో పరిషేచన చేసి భోంచేస్తాడు. వాడు తింటున్న ఆహారం కూడా ఒక పూజ, ఒక యోగం. నీలో ఉన్న దేవునికి నువ్వు హవనం చేస్తున్నానని నమ్మి తింటే అది కూడా పూజే. అందుకే కంచం ముందు కూర్చున్నప్పుడు ఇతర విషయాలు మాట్లాడకుండా కేవలం భోజనం మీద మనస్సు లగ్నం చేసి తినమని ఆయుర్వేదం చెబుతుంది. నువ్వు భోజనం ఒక పూజలా చేస్తే నీలో ఉన్న ఆ వైశ్వానరుడు త్రుప్తి చెంది నీకు తగిన శక్తినిచ్చి ఆయుష్షుని అభివృద్ధి చేస్తాడు.
మన తర్వాతి తరాలకు చెప్పవలసిన విషయం చెప్పేవిధంగా చెబితే తప్పక గౌరవించి పాటిస్తారు. ఇది మనందరి కర్తవ్యం.
ఇక్కడ బ్రాహ్మణులకు మాత్రమే అని కొందరు అనుకుంటున్నారు కానీ కాదు...బ్రాహ్మణులకు ఒక విధం గా అలాగే మిగిలిన వాళ్ళకి ఒక విధం గా చెయ్యవచ్చు
మిగతా వారు అందరూ కూడా భగవద్గీతలో రొండు శ్లోకాలు ఉన్నాయి..
పైన పోస్టులు లో "అహం వైశ్వా నరో భుత్వ" ఒకటి...రొండోది "బ్రహ్మర్పణం బ్రాహా హవిహి" అనేవి చెప్పుకోవాలి...మొదటి దాని అర్థం పోస్టులో ఉంది.. రొండోవ దాని అర్థం ఓండేవాడు తినేవాడు ఓండే పాత్రలు అన్ని బ్రహ్మమే అనే ఉద్దేశం..
!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

No comments:
Post a Comment