Saturday, October 12, 2019

వారణాసి పీఠస్థాన వివరములు: (వివిధ భైరవ రూపాలు)...


ఇక్కడ ఇవ్వబడ్డ వివరాలు అన్ని కాశీ లోని శివలింగం రూపాల్లో ఉన్న భైరవులు ఇవి చాలా వరకు భూగర్భంలో కలసి పోయింది , కొన్ని మటుకే ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయి ..మొత్తం వారణాసిలో 10,000 పైన శివలింగాలు భూగర్భంలో ఉన్నాయి వాటికి రక్షణగా ఈ బైరావులు ఉంటారు, కాలక్రమంలో కొన్ని దాడుల వలన చాలా ఆలయాలు భూమట్టంలో కలిసిపోయాయి అందువల్ల ఈ శివలింగ రూపంలోనే భైరవ రూపాలు నామాలు చాలా మందికి తెలియదు, అలాగే  విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే కాస్మిక్ ఎనర్జీ శక్తి కేంద్రాలు ఒక్క కాశిలోనే 51 ప్రాంతాలు ఉన్నాయి వాటికి గుర్తుగా వినాయక పురాతన ఆలయాలు అక్కడ ఉన్నాయి..

కాశీ క్షేత్రం మహా మహిమాన్వితమైన నది ,ఇది శతకోటి యొగినులుతో పరివేష్టితమై యుండును.ఈ స్థానం మండాలాకార రూపముగా మాతృకా స్వరూపముగా విరాజిల్లుతుంది.కోటానుకోట్ల స్వయంభూలింగములు సాధకులకు అభీష్టములు నెరవెర్చుతుంది.. ఎక్కడ జపం చేసే త్వరగా మంత్రం సిద్ధిస్తుంది, కాశీలో మరణించిన వారు శివుని రూపంలోనే కైలాసం చేరుకుంటారు అంటారు..అటువంటి కాశీ క్షేత్రంలో ఏ దిశలో ఏ రూపంలో భైరవుడు లింగ రూపంలో ఉంటారో ఇక్కడ వివరాలు తెలుసుకుందాము. బైరవుడి అనుగ్రహము ఆజ్ఞ లేకుండా కాశీలో అడుగు పెట్టలేరు... ఈ నామాలు చదివి భైరవుడికి నమస్కరించు కున్నా ఎన్నో భయాలు తొలగిపోతాయి ఆ స్వామిని తలుచుకున్నాను అంత అనుగ్రహం దక్కుతుంది.

  పూర్వదిశయందు దశలింగములు ముఖ్యమైనవి కలవు.వాటిపేర్లు 1.జటిల  2.కాల  3.ఉన్మత్త  4.క్రోధరాజ  5.సదాశివ  6.దధీచినాధ  7.సువాశీ  8.ప్రమధేశ్వర  9.యఙనాధేశ్వర  10.అయితేశ్వర వల్లభ.

  ఆగేయదిశలో 10 లింగములున్నవి. 1.వజ్రధర  2.మహాకాల  3.కపిలేశ్వర  4.పంచానన  5.యోగినాధ  6.ఘఘిరేశ  7.పినాకదృక్  8.పశుపాల  9.క్షేమద  10.బ్రహ్మనాధ.

  దక్షిణదిశలో 10 లింగములున్నవి. 1.వీరేశ్వర  2.శూలేశ్వర  3.సిద్దేశ్వర  4.శ్రీ పార్వతీశ్వర  5.గణనాదీశ్వర  6.శంభు  7.ప్రచండ  8.దక్షయఙహా  9.కామరాజేశ్వర  10.కామకలేశ.

   పశ్చిమ దిశలో 10 లింగములున్నవి. 1.ఆరుణేశ్వర  2.యోగేంద్రేశ్వర  3.ఈశాన  4.అసురాంతకేశ్వర  5.త్రిశూలేశ్వర  6.వరుణేశ్వర  7.కాళేశ్వర  8.కామదాయకేశ్వర 9.కాలఙిరుద్రేశ్వర  10.భద్రేశ.

  వాయువ్యదిశలో 10 లింగములున్నవి. 1.మహారుద్ర  2.వాతనాధ  3.రుద్రాత్మ  4.రౌద్రరూపక  5.రూపనాధ  6.హనుమాన్  7.సూర్యేశ  8.వసుదేశ్వర  9.వాసుకీవల్లభ  10.సత్యపతి.

  ఉత్తరదిశలో 11 లింగములున్నవి.  1.ఉత్తరాస్య  2.కుబేరేశ్వర  3.ఈశ్వర  4.పంచాధార  5.పరమేశ  6.పరహంస  7.ప్రభాకర  8.ఆనంతేశ  9.కామరక్ష  10.రత్నేశ్వర  11.ఉమాపతి.

  ఈశాన్యదిశయందు 11 లింగములున్నవి. 1.ఈశ  2.వైశ్వానరేశ్వర  3.ఈశాన  4.మాయేశ  5.బటుకేశ  6.రామేశ్వర  7.కాలంతకేశ  8.విస్వామిత్రేశ్వర  9.మహాకామపురీశ్వర  10.సర్వరూపప్రకాశక  11.కామాఖ్యేశ్వర.

   మండలములో క్రిందభాగమందు 13 లింగములున్నవి. 1.మృత్యుంజయ  2.మోక్ష  3.శివేశ  4.భైరవేశ  5.భూతనాధ  6.భూతకర్తా  7.క్షేత్రపాల  8.పరాపర  9.మృత్యుఘోషేశ్వర  10.కాలదమన  11.కౌశలేశ్వర  12.మునినాధ  13.వర్ణమాలి.

  ఈ భైరవరూప రుద్రమూర్తులు 10వేలలింగములకు ప్రతినిధులుగా ఉన్నవి.పంచతత్వములతో సాధకులను రక్షించిచూ అభీష్టసిద్దినిచ్చుచున్నవి.

   ఊర్ధ్వస్థానమున 13 లింగములున్నవి. 1.బ్రహ్మేశ  2.బ్రహ్మకులేశ  3.బ్రహ్మలింగ  4.విధీస్వర  5.బ్రహ్మాండభేదక  6.ఆత్మరామ  7.వక్రేశ్వర  8.బలీశ  9.భార్గవేశ  10.సదానందేశ్వర  11.హర  12.కృష్ణేశ్వర  13.రామనాధ.

   కాశీనాధుడు అర్చించిన 12 మహావిద్యలు కలవు. 1.త్రిపురసుందరి  2.త్రిపుర భైరవి  3.భువనేశీ  4.అన్నపూర్ణ  5.మాతంగి  6.వింధ్యవాసిని  7.చినమస్తా  8.బగళాముఖి  9.త్రికూటా  10.పంచమి  11.కాళీ  12.తార.

  ఇవి తంత్రోక్త పూజావిధానములో అర్చించిన సాధకుల అభీష్టములు నెరవేర్చ గలవు.

శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...