" శివుని ధ్యానించే ముందు ,చింతించే ముందు , శివుడి స్వరూపం ఏమిటో చక్కగా తెలుసుకోవాలి . శివుడి స్వరూపం ఏమిటో తెలియని వారు , శివుని సదా ధ్యానించలేరు . నిరంతరం చింతించ లేరు , శివానందములో రమించలేరు.
శివుడి స్వరూపాన్ని పరిపూర్ణంగా గ్రహించినవారే , శివుడంటే ఎవరో చక్కని ధృఢ జ్ఞానాన్ని సొంతం చేసుకుంటారు. పూర్ణ జ్ఞానాన్ని కలిగి వుంటారు . నిజమైన స్య్జానాన్ని సొంతం చేసుకుంటారు.
ఇక శివుడి స్వరూపం.
నామం , రూపం లేని చైతన్య స్వరూపమే శివుని స్వరూపం . గుణములు , లౌకిక లక్షణములు లేని నిరాకార , నిర్గుణ స్వరూపమే శివుని స్వరూపం .
#శివుడు ......
" సచ్చిదానంద స్వరూపుడు -- నిత్య ముక్తుడు
స్వయం జ్యోతి స్వరూపుడు -- సర్వస్వతంత్రుడు
అఖండ స్వరూపుడు. -- అద్వితీయుడు
నిర్వికార స్వరూపుడు. -- పరిపూర్ణుడు
నిత్యస్వరూపుడు. -- అనాద్యంతుడు
సత్య స్వరూపుడు. -- నిరంజనుడు
అమృత స్వరూపుడు. -- నిరుపాధికుడు
ప్రణవ స్వరూపుడు. -- శరీరత్రయ వ్యతిరిక్తుడు
సాక్షీ స్వరూపుడు. --- త్రిగుణాతీతుడు
గ్నానస్వరూపుడు. --- ద్వంద్వాతీతుడు
సదానంద స్వరూపుడు. --- లోకాతీతుడు
బ్రహ్మానంద స్వరూపుడు. --- మాయాతీతుడు
ఆదిస్వరూపుడు. --- మనో తీతుడు
అచల స్వరూపుడు. --- నిస్సంగుడు
ముక్త స్వరూపుడు. -- దేహాతీతుడు
అభయ స్వరూపుడు. --- నిర్విశేషుడు
అక్రియ స్వరూపుడు. --- స్వయం ప్రకాశుడు
అందుకే శివజ్ఞానమృతోపనిషత్ శివుని స్వరూపాన్ని ఈ విధంగా తెలిపినది .
" తద్ బ్రహ్మ తత్ సచ్చిదానంద స్వరూపం
స్వయం జ్యోతి : నిత్యం అనాద్యంతం నిర్వికారం
అమృతం అభయం నిరంజనం నిర్గుణం నిరాకారం నిర్విశేషం అఖండం నిరుపాధికం ఏక మేవాద్వితీయం స్వతంత్రం నిత్య ముక్తం పరిపూర్ణం "
సర్వకాల సర్వావస్థల యందు సదా అస్తిత్వమును కలిగివుండే సత్య స్వరూపమే శివుని స్వరూపం . అగ్నిదీపం వలె నిశ్చలంగా ప్రకాశించే జ్ఞాన మహాదీపమే శివుని స్వరూపం . అపారమైన జలముతో నిండిన సాగరం వలె అపరిమిత అనంత ఆనంద సాగరమే శివుని స్వరూపం అందుకే వరాహోపనిషత్ :
"సత్యచిద్ఘన మఖండ మద్వయం సర్వదృశ్యరహితం|
నిరామయం , యత్పదం విమల మద్వయం శివం || "
' సత్యమై , చిత్ ఘనమై , అఖండమై , అద్వయమై , సర్వదృశ్యరహితమై ,నిరామయమై , విమలమై , ఏ పరబ్రహ్మం కలదో ,అట్టి పరబ్రహ్మమే - శివుడని తెలిపినది.

No comments:
Post a Comment