Tuesday, July 9, 2019

శ్రీ పంచమ్యై నమః.

వారాహీ దేవిని పంచమీ అనే నామంతో అర్చిస్తారు. ఆషాఢ నవరాత్రులు శ్రీ వారాహీ దేవి యొక్క నవరాత్రులు. `భజే శ్రీ చక్ర మధ్యస్థాం దక్షిణోత్తర యోస్సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం' అని శ్యామలా వారాహీ సమేత లలితాంబికను ధ్యానించే శ్లోకం. ఇందులో క్రియాశక్తికి ప్రధానంగా గల దేవత శ్రీ వారాహీ దేవి.

ఇవి జగన్నాథ నవరాత్రులు కూడా. వసంత నవరాత్రులు శ్రీ వేంకటేశ్వర స్వామికి, అమ్మవారికి కూడా ఎలా సంబంధించినవో ఇవి అలా జగన్నాథునికి, వారాహీ దేవికి సంబంధించినవి. సుభద్రా దేవి భువనేశ్వరిగా జగన్నాథుడు శ్యామలగా శక్తి ఉపాసకులు భావిస్తారు. అలాగే బలభద్రుడు క్రియా శక్తికి ప్రతీక అయిన వారాహీ దేవిగా కొలుస్తారు. అంతే కాక జగన్నాథస్వామి కాళీ దేవి రూపం కూడా. శ్రీ కృష్ణుడు కూడా కాళీదేవియొక్క రూపమే కదా.."కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో" అని భగవద్గీతలో చెప్పినట్లు. ఇక బలభద్రుడు బలరాముని రూపం. వారాహీదేవికి లాగే బలభద్రునికి కూడా హలము (నాగలి) ఆయుధం. ఈ 9 రోజులు పూరీలో రోజుకో అవతారంతో ఈ మూర్తులను అలంకరిస్తారు. అందులో ఇవాళ (పంచమి) వరాహ అవతారంతో అలంకరిస్తారు. అంతే కాక ఈ రోజున హీరా పంచమి అని ప్రత్యేక ఉత్సవం కూడా చేస్తారు. పూరీలో బలభద్రుని ధ్యానశ్లోకంలో " శాంతం చంద్రాదికాంతం ముసల హల ధరం" అని వారాహి యొక్క ముసలము, హలము రెండిటినీ ధరించిన మూర్తిగా ఇప్పటికీ పూజిస్తారు. శక్తి ఉపాసన ప్రధానంగా ఉన్న తాంత్రిక గ్రంథాలలో విస్తారంగా బలభద్రుని ప్రసక్తి ఉంది.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...