Monday, July 29, 2019

శివ ప్రదక్షిణ విధి

శ్లో:-ధ్వజాత్ పృష్టం - పృష్టాత్ పృష్టమ్,
పృష్టాత్ పృష్టం - పృష్టాత్ ధ్వజమ్.

భావము:-

శివాలయములో ధ్వజ స్తంభము నుండి ఆలయము వెనుక శివుని పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి నడచు కొనుచు మరల ఆ పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి మరల నడచుకొనుచు పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి ధ్వజ స్తంభము వరకు వెళ్ళ వలెను అని శ్లోక భావము.

వృషంచండంవృషంచైవ సోమసూత్రం పునర్వృషం|
చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వృషం||
శివప్రదక్షిణేచైవ సోమసూత్రం నలంఘయేత్|
లంఘనాత్సోమసూత్రస్య నరకే పతనం ధృవం||

నందీశ్వరుని వద్ద ప్రారంభించి - కుడిచేతి వైపు చండీశ్వరుని చేరి - అక్కడనుండి మళ్లీ వెనుకకు (నందీశ్వరుని మీదుగా) సోమసూత్రం చేరి - మళ్లీ వెనుదిరిగి నందీశ్వరుని- నేరుగా చండీశ్వరుని వద్దకు వెళ్లి - అక్కడ వెనుదిరిగి (నందీశ్వరుని మీదుగా) సోమసూత్రం చేరి - మళ్లీ వెనుదిరిగి (నందీశ్వరుని మీదుగా) చండీశ్వరుని చేరి - వెనుదిరిగి నందీశ్వరుని వద్దకు చేరుకుంటే ఒక "శివ ప్రదక్షిణ" పూర్తి చేసినట్లు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. దాటితే నరకంలో పడి పతనమౌతనమవడం తథ్యం. కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు.

కాశీకంటే పురాతనమైన పుణ్యక్షేత్రం

తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం కంటే పురాతనమైనది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి వెలుతామని ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపడానికి వీలుకుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిదిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన కథనం.

వృద్దాచలాన్ని వృద్ధ కాశి అని కూడా పిలుస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం వృద్ధ కాశి అని పిలువబడే ఈ విరుదాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు. మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఈ దేవతను పూజిస్తారు

కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృధ్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు.

అదే విధంగా పరమశివుడు నటరాజ రూపంలో నాట్యానికి ప్రసిద్ధి ఈయన చిదంబరంలో కాళీతో పోటిపడి నాట్యం చేస్తే ఈ విరుదాలచలం లేదా వృద్దాచలంలో తన సంతోషం కోసం నాట్యం చేశాడని చెబుతారు. అంతే స్వామి సంతోష తరంగాల్లో తేలిపోతూ నాట్యం చేసిన ప్రదేశం ఇదే.

ఆనంద తాండవం

చిదంబరంలో పరమశివుడు కాళీ మాతతో పోటీ పడి నృత్యం చేస్తే ఇక్కడ ఆనంద తాండవం చేశాడని చెబుతారు.
అందువల్ల ఈ క్షేత్రంలో పుట్టినా, గిట్టినా, నివసించినా భగవంతుడిని ప్రార్థించినా మోక్షం లభిస్తుందని చెబుతారు.

శివుడు మొదట ఇక్కడ కొండరూపంలో వెలిశాడని చెబుతారు.
అందువల్లే ఈ క్షేత్రాన్ని మొదట పఝుమలై అని పిలచేవారు.
అటు పై విరదాచలంగా ఖ్యాతి పొందింది.

స్వామివారిని సేవిస్తే

పూర్వం ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యం అష్టకష్టాలు పడేవారు. దీంతో స్థానికంగా ఉండే విభాసిత మహర్షి, స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చెప్పాడు.దీంతో ఆ ఊరిపెద్దలంతా కలిసి స్వామి వారికి దేవాలయం నిర్మించాలని తీర్మానించారు. అయితే ఆ సమయంలో వారి జీవనం ఎలా అన్న అనుమానం మొదలయ్యింది.దీనికి విభాసిత మహర్షి , వృద్దేశ్వర స్వామి వారిపై నమ్మకంతో పనిచేయండి చేసుకొన్నవారికి చేసుకొన్నంతంగా లాభం చేకూరుతుందని చెప్పారు.
దీంతో ప్రజలు అయిష్టంగానే ఆ పనికి పూనుకొన్నారు.
ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేసిన వారికి విభాసిత మహర్షి స్థానికంగా ఉంటున్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకొని పనిచేసిన వారికి ఇచ్చేవాడు.

ఆశ్చర్యం ఆకులు నాణ్యాలుగా

ఎవరు ఎంత పని చేసారో అంతకు సమానంగా ఆ ఆకులు నాణ్యాలుగా మారేవి. అప్పటి నుంచే చేసిన వారికి " చేసినంత, చేసుకున్నవారికి చేసుకొన్నంత " అనే నానుడి మొదలయ్యిందని చెబుతారు.

మణిముత్తా నదిలో వేసిన నాణేలు తిరువారూరు కొలనులో ...

ఒకసారి ఈ క్షేత్రం గుండా సుందరర్ అనే గాయకుడైన శివభక్తుడు ఈ దారి గుండా వెడుతూ ఇక్కడి స్వామివారిని స్తుతించాడు.
దీంతో స్వామి వారు స్వయంగా 12 వేల బంగారు నాణ్యాలను అందజేస్తాడు.తాను తిరువారూర్ వెళ్లాల్సి ఉందని అయితే తోవలో దొంగల భయం ఉందని సుందరార్ భయపడుతాడు.
ఇదే విషయాన్ని శివుడికి చెబుతాడు. దీంతో శివుడు తాను ఈ నాణ్యాలను ఇక్కడే ఉన్న మణిముత్తా నదిలో వేస్తానని నీవు తిరువారూర్ వెళ్లిన తర్వాత అక్కడి కొలనులో తీసుకోవచ్చని చెబుతాడు.ఇందుకు అంగీకరించిన సుందరార్ తిరువారూర్ వెళ్లి అక్కడ కొలనులో నుంచి 12వేల బంగారు నాణ్యాలను తీసుకొన్నాడని కథనం.అదే విధంగా ఆ నాణ్యాల నాణ్యతను సాక్షాత్తు వినాయకుడు పరీక్షించి అటు పై ఆ భక్తాగ్రేసరుడికి ఇచ్చారని చెబుతారు.

5 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత

ఈ ఆలయంలో 5 అంకెకు విశిష్ట స్థానం ఉంది.
ఈ ప్రాంగణంలో పూజలందుకొనే మూర్తులు 5 5.
వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు.
ఇక్కడ స్వామివారికి 5 పేర్లు ఉన్నాయి. అవి విరుధ గిరీశ్వరుడు, పఝమలైనాధార్, విరుద్ధాచలేశ్వర్, ముద్దుకుండ్రీశ్వరుడు, వృధ్ధ గిరీశ్వరుడు.
ఆలయానికి 5 గోపురాలు ఉన్నాయి.
అదే విధంగా 5 ప్రాకారాలు, 5 మండపాలు, 5 నందులు ఉన్నాయి.
వేకువజాము నుంచి రాత్రిదాకా స్వామికి నిర్ణీత సమయంలో 5 సార్లు పూజలు చేస్తారు.
ఇక్కడ 5 రథాలు ఉన్నాయి.
ఇక్కడ స్వామివారు స్వయంభువుడు. ఇక్కడ శివుడిని ప్రార్థించిన వారికి మన:శ్శాంతి కలగడమే కాకుండా అన్ని రకాల శరీర రుగ్మతల నుంచి వెంటనే విముక్తి కలుగుతుందని చెబుతారు.
ఇక్కడ ఉన్న దుర్గాదేవిని పూజిస్తే వివాహం, సంతానం కలగడం వంటి కోరికలు నెరవేరుతాయని చెబుతారు.

పాతాళ వినాయకుడు

శ్రీ కాళహస్తిలో ఉన్నట్లు ఇక్కడ విగ్నేశ్వరుడు భూతలం నుంచి కిందికి ఉన్న ఆలయంలో ఉంటాడు. ఈ ఆలయంలోని స్వామివారిని సందర్శించడానికి 18 మెట్లు దిగి కిందికి వెళ్లాల్సి ఉంటుంది. చనిపోయిన వారి చితా భస్మాన్ని ఇక్కడున్న మణిముత్తా నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్లుగా మారి నది అడుగున చేరుతాయని చెబుతారు.

ఈ విరుదాచలంలోని నదిలో వేసిన నాణాలు తిరువారూరు కోవెల పుష్కరిణిలో తేలుతాయని చెబుతారు. ఈ విషయానికి సంబంధించి ఎన్ని పరిశోధనలు జరిగినా ఫలితం మాత్రం శూన్యం. అరుణాచలంలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు.

వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు :

ఇక్కడ వల్లీ దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు. ఆయన ఆలయంలో పైన చక్రాలు ఉంటాయి. అవి శ్రీ చక్రం, సుబ్రహ్మణ్య చక్రం, అమ్మవారి చక్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువ శివాలయంలో చూస్తాం. అందులో ఇది ఒకటి. అందుకే ఇక్కడ స్వామివారికి విన్నించుకొన్న కోరికలు త్వరగా తీరుతాయని చెబతారు.

సుబ్రహ్మణ్యుడు ప్రతిష్ట చేసిన 28 శివలింగాలు

శైవ సిద్దాంతం ప్రకారం ఇక్కడ 28 ఆగమ శాఖలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ 28 సిద్ధాంతాలకు ప్రతీకగా 28 శివలింగాలను ఇక్కడ ప్రతిష్టించి పూజించాడని నమ్ముతారు.

ఈ సిద్ధాంతాల వల్లే ఈ ఆలయానికి ఆగమ ఆలయమని పేరు. ఈ విశేషం ఉన్న ఆలయం ఇదొక్కటే. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకూ అదే విధంగా సాయంకాలం 3.30 గంటల నుంచి 9 గంటల వరకూ భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది.

ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ

అరుణాచలం అంటే తిరువణ్ణామలైలో చేసినట్లుగానే
ప్రతి పౌర్ణమికీ ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు.
దీని వల్ల వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.

చెన్నై నుంచి 230 కిలోమీటర్ల దూరంలో కడలూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి.ప్రసాద్.వడ్డమాను

శివునికి సోమ‌వార‌మే ఎందుకు..?

శివున్ని పూజించే భ‌క్తులంతా సోమ‌వారం రోజున ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌డం స‌హ‌జం.ఆ రోజునే ఉప‌వాసం ఉంటారు చాలామంది.ఎందుక‌ని..? అంటే…. సోముడు అంటే చంద్రుడు. మనకు ఉన్న వారాల పేర్లన్నీ గ్రహాలను అనుసరించి వచ్చాయి. చంద్రుని వారం సోమవారం.

చంద్రుని ధరించినవాడు శివుడు. చంద్రుడే సోముడు కనుక శివుని చంద్రశేఖరుడు అనీ, సోమశేఖరుడు అని పిలుస్తారు. చంద్రునికి ప్రత్యేకించి ఆలయం లేనందున శివుని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు. సోమ అనే శబ్దాన్ని స+ఉమ అని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం వస్తుంది.

ఉమాసహితుడైనవాడు అంటే పార్వతీపతి ఎవరు? శివుడే కదా..! ఆ విధంగా సోమవారం శివునికి ప్రత్యేక దినంగా రూపాంతరం చెందింది. స్కాందపురాణంలో సోమవార వ్రతమహిమ ఉంది. ఈ రోజున శివుడు ఉమాసహితుడై భక్తులను అనుగ్రహిస్తాడు.

సోముడంటే కుబేరుడు అనే అర్థం కూడా ఉంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్..ఈశ్వరుడు ఐశ్వర్యదాయకుడు. శివుని ఆరాధించిన కుబేరుడు ఐశ్వర్యవంతుడైన రోజు కనుక ఈ రోజును సోమవారం అని పిలుస్తున్నారని పెద్దలు చెప్పారు. స్కాందపురాణం సోమవారవ్రతం వైశిష్ట్యాన్ని చెబుతూ అందుకు ఉదాహరణగా చంద్రాంగదుని కథ చెప్పింది. నలదమయంతుల మనుమడు చంద్రాంగదుడు , అతడు చిత్రకర్మ కుమారై సీమంతినిని వివాహమాడి కొంతకాలం మావగారింట్లోసుఖంగా గడిపాడు. ఓరోజు యమునా నదిలో మిత్రులతో నౌకావిహారం చేస్తూ పెద్దగాలికి నౌక తిరగబడగా నీటిపాలయ్యాడు.

అప్పుడు మైత్రేయి అనే మునిపత్ని సీమంతినికి దైర్యంచెప్పి పరమశివునికి ఇష్టమైన సోమవారవ్రతం చేయమని ప్రోత్సహించింది. అమె వ్రతం ఆరంభించింది. నౌకాప్రమాదంలో నీళ్ళలో పడిన చంద్రాంగదుడు అట్టడుగున ఉండే నాగలోకం చేరాడు.

అక్కడ నాగరాజైన తక్షకుడు చంద్రాంగదుని వినయవిధేయతలకు మెచ్చి, కానుకల్చి, నాగకన్యలతో పాటు ఒక నాగ యువకుని తోడిచ్చి సాగనంపాడు అప్పటికి భూలోకంలో మూడేళ్ళు గడిచిపోయాయి. అతని రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు.

భార్య వ్రతదీక్షలో ఉంది. పరిస్థితిని గమనించిన చంద్రాంగదుడు శత్రువులను జయించి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. పరమశివునికి ప్రీతికరమైన సోమవార వ్రతాన్నికార్తీక సోమవారాలలో చేస్తే సత్ఫలితాన్నిస్తుంది.

ప్రతి నెలలోను వచ్చే బహుళ పక్షంలోని చతుర్ధశిని మాస శివరాత్రి అంటారు .అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తే అందులో గొప్పదైన ఈ శివరాత్రి – అంటే -మాఘ మాస శివరాత్రి ‘ మహా శివరాత్రి (తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందు రోజు – రాత్రి చతుర్ధశి కలిగిన వున్న రోజుని జరుపుకోవాలి) అవుతోంది .’మహా’ అని ఎక్కడ అనిపించినా కొన్ని అలాంటి వాటికంటే గొప్పదని భావం . శివ పార్వతులిరువురికి కలిపి ‘శివులు’ అని పేరు ( శివ శ్చ శివా చ సివౌ ).ఆ ఇద్దరికీ సంభందించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం . అందుకే శివరాత్రి నాడు అయ్యకి – అమ్మకి కుడా వుత్సవం సాగుతుంది .శివ – మంగళకరమైన – రాత్రి ఏదో అది శివరాత్రి అనేది మూడో అర్థం .

ప్రాణికోటి యావత్తు నిద్రపోతూ ఉండే కాలం.. రాత్రి , నిద్ర అనేది పాక్షిక మరణంతో సమానం. ఆ రాత్రి వేల తానూ మేల్కొని రక్షించే శంకరుడు రాత్రి దేవుడు . తన వివాహం కూడా అర్దరాత్రి దాటాకనే మొదలవుతుంది. చలి కాలం వెళ్ళబోతుండగా ‘మహాశివరాత్రి’ పండుగ దినము వస్తుంది. చలి , మంచు భాధకు తాళలేక శరీరంలో పుట్టే చలిని తట్టుకోలేక గొంగల్లని కప్పుకుని వుండగా – పిశాచ , భూత ప్రేతాలకి దుఃఖాన్ని చేకూర్చే వాడైన శంకరుడు, నెలవంకను శిరోభూషనముగా ధరించి భస్మ లేపనం వాసనల మద్య కన్నుల పండువగా జరిగే పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవము కోసం ఎన్ని రాత్రులైనా వేచి చూడాల్సిందే…..

మాస శివరాత్త్రి పర్వదినం నాడు మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష ధరించి, ఈ దీపాలను పడమర దిక్కున వెలిగించి, “ఓం నమఃశివాయ” అని 108 సార్లు ధ్యానించే వారికి కైలాస ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం. అదేవిధంగా.. ఆలయాల్లో పంచామృతముతో శివునికి అభిషేకం చేయిస్తే ఈతిబాధలు, దారిద్య్రాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.

మనోభీష్టాలు నెరవేర్చే మాస శివరాత్రి

పరమ శివుడికి ‘మాసశివరాత్రి’ అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతోంది. ఈ రోజున ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించడం వలన, కోరిక కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి … పూజా మందిరాన్ని అలంకరించి … సదా శివుడికి పూజాభిషేకాలు నిర్వహించాలి. స్వామికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

ఉపవాస దీక్షను స్వీకరించి ‘ప్రదోష కాలం’లో అంటే సాయం సమయంలో శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. అభిషేకం అనంతరం స్వామివారిని బిల్వదళాలతో అర్చించాలి. ప్రదోష కాలంలో శివాలయాన్ని దర్శించి పూజలు జరిపించడం మరీ మంచిది. ప్రదోష కాలంలో కైలాసంలో శివుడు తాండవమాడుతూ ఉంటాడట.

ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆశీనురాలై వుంటుంది. లక్ష్మీదేవి పాటపాడుతూ వుండగా, పరమశివుడి తాండవానికి అనుగుణంగా శ్రీమహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటాడు. దేవేంద్రుడు వేణువు వాయిస్తూ వుండగా, సరస్వతీదేవి వీణను మీటుతూ వుంటుంది. మనోహరమైన ఈ దృశ్యాన్ని సమస్త దేవతలు సంతోషంతో తిలకిస్తూ వుంటారు.

ఈ సమయంలో ఆదిదేవుడి నామాన్ని స్మరించినా … ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించినా మహా పుణ్యమనీ … మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పబడుతోంది. అందువలన మాసశివరాత్రి రోజున ఉపవాస జాగరణలనే నియమాలను పాటిస్తూ, ప్రదోష కాలంలో సదాశివుడిని ఆరాధించాలి. అనుక్షణం ఆయన నామాన్ని స్మరిస్తూ తరించాలి.

దత్త క్షేత్రములు..దత్తావతారం


1శ్రీపాద శ్రీ వల్లభ స్వామి.💐
1.పిఠాపురం.💐
దత్తుని ప్రదమ దత్తావతారం శ్రీపాద శ్రీ వల్లభుడు జన్మించిన ప్రదేశం.
ఆంద్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది..                 

2.కురువపురం.💐
ప్రదమ దత్తావతారులైన శ్రీపాదవల్లబులు తపసు చేసిన స్థలం...
ఇది హైదరాబాదు, కర్నూలు రూటులో దేవరకొండ స్టేషను నుండి బస్ లో వెళ్ళవచ్చు.

3.గోకర్ణము.💐
ప్రదమ దత్తావతారు లైన శ్రీపాద వల్లబులు తపసు చేసిన స్థలం ...
ఇది కర్నాటక రాష్ట్రము హుబ్లి నుండి బస్ లో వెళ్ళవచ్చు.

దత్తావతారం..నృశింహ సరస్వతి.💐
4.కరంజా.💐
రెండవ దత్త అవతారం, నృశింహ సరస్వతి (శ్రీ గురుడు) జన్మస్థలం...
ఇది మహరాష్ట్రఅమరావతి జిల్లాలో ఉన్నది

5.నర్సో బావాడిన.💐
శ్రీ గురుడు 12 సం॥తపసుచేసిన స్థలం,...
ఇది కొల్హా పూర్ మీరజ్ రూటులో ఉన్నది

6.గాణగా పూర్.💐
శ్రీ గురుడు 23 సం॥ నివసించినస్థలం,
ఇది కర్నాటక గుల్బర్గ వద్ద కలదు.
ఇచ్చటశ్రీ గురుని నిజపాదుకలు కలవు,
చూడవలసి స్థలం, బీమా అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం

7.ఔదుంబర్‌.💐
శ్రీ గురుడు చాతుర్మాసం చేసిన .స్థలం.
ఇది కూడ మహరాష్ట్రలో ఉన్నది.                                     

8.మీరజ్.💐
ఇచట శ్రీ గురుడు తపసు చేసిన స్థలం
కొల్హపూరు రూటులో జైసింగ్ పూరు వద్ద నుండి వెళ్ళవచ్చు.

9.శ్రీశైలం..💐
శ్రీ గురుడు అంతర్దానమైన ప్రదేశం.
కృష్ణానదిలో నుండి పడవపై వెళ్ళి చూడవచ్చు.
ఇది ఆంద్రప్రదేశ్ కర్నూలు జిల్లా లో ఉంది.
 
దత్తావతారం..మాణిక్య ప్రభువులు.💐
మాణిక్య నగర్ ..💐
మూడవ దత్తావతారం,
శ్రీమాణిక్య ప్రభువుల వారి సమాది,
ప్రభువుల వారి సంస్ధానం,
కర్నాటక గుల్బర్గా - హైదరాబాదు రూటులో హుమ్నాబాదుకు దగ్గరలో ఉన్నది.
తప్పక చూడవలసిన క్షేత్రము.
 
దత్తావతారం ..అక్కల కోటస్వామి..💐
10.అక్కల్ కోట.💐
నాలుగవ దత్తావతారం,
స్వామిసమర్ద (అక్కల్ కోటస్వామి ) సమాది మందిరం ఇది చెన్నయి - ముంబాయి రూటులో అక్కల్ కోట స్టేషనులో దిగి బస్ లేదా ఆటో పై వెళ్ళవచ్చు.
తప్పక చూడవలసిన దత్త క్షేత్రము.
 
దత్తావతారం ..షిరిడి సాయిబాబా..💐
11.షిరిడి..💐
అయిదవ దత్తావతారం,
సంపూర్ణ దత్త బగవానుని పూర్ణావతారం.
సద్గురు షిరిడి సాయిబాబా సమాది మందిరం .
కోట్లాది భక్తులకు ఆరాద్యుడు సద్గురువు బాబా..
ఈ షిరిడి మహరాష్ట్రలో ఉంది
అన్నీ ప్రాంతాల నుండి నాగర్ సూల్,మన్మాడు సాయినగర్ స్టేషన్ల నుండి మందిరానికి చేరవచ్చు
అందరు తప్పక చూడవలసిన క్షేత్రము.

12.సాకోరి..💐
ఏక ముఖ దత్తుని ఆలయం కలదు.
ఇక్కడ సాయి సేవ చేసుకున్న ఉపాసిని బాబావారి సమాది మందిరం దర్శించవచ్చు.
ఇది షిరిడికి దగ్గరలో ఉన్నది ఆటోలో వెళ్ళి రావచ్చు

13.నాశిక్..💐
ఇచట ఏకముఖ దత్త విగ్రహం ఉంది.
ఇది కూడషిరిడి నుండి వెళ్ళవచ్చు.

ప్రముఖ దత్త క్షేత్రములు.💐
14.గిరి నార్..💐
ఇచ్చటదత్తపాదుకలుకలవు
ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది.
ఇది చాలా మహిమగల 10,000 మెట్లు కలిగిన కొండపై ఉన్నది,
ఈ కొండపై దత్తపాదుకలు దర్శిస్తే దత్త అనుగ్రహం తప్పక లబిస్తుందని భక్తుల నమ్మకం

15.షేగాం..💐
ఇచ్చట మరో దత్త రూపుడు గజానన మహరాజ్ సమాది మందిరం కలదు
ఇది నాగపూర్ పట్టణం నకు దగ్గరలో కలదు
ఇది కూడ చూడదగ్గ క్షేత్రం.

16.ఖేడ్గావ్ ..💐
సమర్దనారాయణమహరాజ్ వారి సమాధి కలదు.
ఇది పూనా వద్ద కలదు.

17.ఖాoడ్వా.💐
శ్రీ దున వాలా దాదా వారి సమాదిమందిరం ఉంది.
ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కలదు.

18.మాణ్ గావ్ ..💐
శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి జన్మస్థలం,
గురు చరిత్రను అందించిన మహనీయుడు. మహారాష్ట్రలోఉంది
ఇది చూడదగ్గ క్షేత్రం.

19.గరుడేశ్వర్ ..💐
శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి సమాది మందిరం కలదు
గుజరాత్ రాష్ట్రంలో బరోడా జిల్లాలో ఉంది
ఇది తప్పక చూడవలసిన క్షేత్రం

20.మౌంటు అబూ..💐
ఇచట దత్త శిఖరము కలదు.
రాజస్తాన్ రాష్ట్రములో కలదు...
సద్గురు సాయి భక్తులు,

పైన తెలుపబడిన దత్త అవతారముల అయిదు క్షేత్రములు అనగా....

1.నుండి 14  వరకు గల క్షేత్రములు దర్శించిన
దత్త సాయి అనుగ్రహం తప్పక ఉండను,
అవకాశము ఉన్నవారు మొత్తము చూడవచ్చను

దిగంబరా దిగంబరా సద్గురు దత్తా దిగంబరా..💐

                      💐శ్రీ మాత్రే నమః💐

Sunday, July 28, 2019

దుర్ముహూర్తం అంటే ఏమిటీ? ఎలా ఏర్పడుతుంది?

 మానవ నిత్య జీవితంలో ఎన్నో సంస్కారాలు చేయాల్సి ఉంటుంది. వాటి నిర్వహణకు శుభ ముహూర్తాలు అవసరమవుతాయి. అయితే శుభ ముహూర్తాలతో పాటు దుర్మూహూర్తాలపై కూడా అవగాహన ఉండాలి. అప్పుడే మనం మంచి ముహూర్తమేంటో అర్థం చేసుకోగలము.

    నక్షత్ర ప్రమాణమును బట్టి విడువ తగిన కాలమును వర్జ్యం అంటారు. దినప్రమాణమును బట్టి, వారమును బట్టి విడువ తగిన కాలమును దుర్మూహుర్తం, రాహూకాలము అంటారు.

     గ్రంథాలలో దుర్మూహుర్తమును మాత్రమే చెప్పారు.

     రాహుకాలంను గూర్చి చెప్పినట్లుగా లేదు. రాహు కాలమును తమిళులు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. మన ప్రాంతమున వర్జ్యము, దుర్మూహూర్తమును పాటిస్తే సరిపోతుంది.

    దుర్ముహూర్తం వారమునకు సంబంధించిన దోషము. ఇది సూర్యోదయము 6 గంటలకయ్యేటప్పుడు దుర్మహూర్తం ఈ విధముగా వచ్చును. దీని ప్రమాణం 48 నిమిషాలు, ఆదివారం సాయంత్రము 4-32కు. సోమవారం మధ్యాహ్నం 12-28 మరల 2-58కు మంగళవారం ఉదయం 8-30కు, మరల రాత్రి 11-50కు, బుధ వారం ఉదయం 11-41కు, గురువారం మధ్యాహ్నం 2-54కు, శుక్రవారం మధ్యాహ్నం 12-28కు శనివారం ఉదయం 2-40కు దుర్మహూర్తం వచ్చుచుండును. ఘడియల్లో ఆది-26, సోమ-16, 22 మంగళ-6 మరల రాత్రి 11-50 బుధవారం-11ఘ, గురువారం-10, శుక్ర-16 శని-4 ఘడియలకు వచ్చును.

🌺పంచకరహితము🌺

     ముహూర్తం ఏర్పరచుకొను నాటికి తిధి, వార, నక్షత్ర లగ్న సంఖ్యలను కలిపిన మొత్తమును 9చేత భాగించగా శేషము 3-5-7-9 ఉన్న ముహూర్తములు రహితమైనవని గ్రహించాలి. 1 మిగిలిన మృత్యు పంచకం అగ్నిపంచకం, 4 రాజపంచకం, 6 చోరపంచకం, 8 రోగపంచకం ఇవి దోషకరమైనవి.

🌺శూన్యమాసము🌺

        శూన్యమాసములో ఎటువంటి శుభకార్యం చేయరాదు. శూన్యమాసం, ఆషాఢం, భాద్రపదము, పుష్యం.. ఇవికాక మీన, చైత్రము, మిధునాషాఢము, కన్యాభాద్రపదము, ధనుఃపుష్యము. ఇవి శూన్యమాసములే సూర్యుడు ఆయా రాసులలో ఉన్నప్పడు శుభకార్యముల గూర్చి తలపెట్టరాదు.

🌺మూఢము లేక మౌఢ్యమి🌺

         రవితో కలసి గురు శుక్రులలో ఎవరైనను చరించు వేళను మూఢమందురు. అస్తంగత్వ దోషము ప్రాప్తించుటతో శుభమీయజాలని కాలమిది. కాబట్టి ఎలాంటి శుభకార్యములైనను ఈ కాలములో జరుపరాదు.

       🌺కర్తరి - ఏయే కార్యములయందు జరిగించరాదు ?🌺

      కర్తరి అనగా సూర్యుడు భరణి 4పాదమున కృత్తిక 4వ పాదములలోను, రోహిణి 1వ పాదమున సంచరించు కాలమును కర్తరి అంటారు. భరణీ 4వపాదము డొల్లకర్తరి అంత చెడ్డదికాదు. మిగతా కాలమంతయు చాలా చెడ్డది. గృహనిర్మాణాది కార్యములు, నుయ్యి త్రవ్వట, దేవతా ప్రతిష్ట మొదలగు ఈ కాలంలో చేయరాదు.

🌺త్రిజ్యేష్ట విచారణ🌺

     తొలుచూలు వరుడు, తొలిచూలు కన్యక జ్యోష్ట మాసం వీటి మూడింటిని త్రిజ్యేష్ట అని అంటారు. వీనిలో ఒక జ్యేష్టం శుభకరం. రెండు జ్యేష్టములు మధ్యమం. మూడు జ్యేష్టములు హానీ. కాని తొలిచూలు వరకు ద్వితీయాది గర్భజాతయగు కన్యను తొలిచూలు కన్య ద్వితీయాది గర్భజాతకుడగు వరుని పెళ్లాడినప్పుడు జ్యేష్టమాసం శుభకరమైందే.

Saturday, July 27, 2019

ప్రపంచంలో సుఖం ఎరుగనివారు ఎవరైనా ఉన్నారా?


ఉన్నారంటున్నాయి శాస్త్రాలు
వారిని "దుఖఃభాగులు" అంటారు
వారి వివరాల్లో కెళితే వారు ఆరు రకాలు-

1. ఈర్ష్యాళువు -
వీళ్లు ఎవరి వృద్ధిని లేక ఎదుగుదలను చూడలేరు
అలాంటివారిని ఈర్ష్యాళువు అంటారు.

2. జుగుప్సావంతుడు-
వీళ్లు దేన్ని చూచినా అసహ్యించుకుంటారు
వారివానికి సుఖం ఎక్కడుంటుంది.

3. నిస్సంతోషి -
వీడొక విచిత్రమైన వాడు వీడికి సంతోషమనేది ఉండదు
దాంతో వీనికి సుఖమెక్కడ

4. క్రోధనుడు-
వీడు ప్రతివిషయానికి చిటపటలాడుతూ ఎప్పుడూ
కోపంతో ఉండే కోపిష్ఠి వీడికి సంతోషమెక్కడ

5. నిత్యశంకితుడు -
అన్నిచోట్లా, అందరినీ శంకించేవాడు వీడు
అంటే ప్రతిదీ అనుమానమే ఇంకేముంది
సుఖం.

6. పరభాగ్యోపజీవి -
ఎప్పుడూ ఇతరుల సొమ్ముపై ఆధారపడి బ్రతికేవాడు
వీడికి ఎప్పూ ఎవరోఒకరు ఇస్తూవుంటేనే లేదంటే
దుఖఃమే ఇది సాధ్యమా కాదుకదా అందుకే వీనికీ
సుఖం సున్నా.

ఈ ఆరుగురురూ ఎప్పుడూ సుఖాన్నీ,
ఆనందాన్ని, లేకుండా బాధతో అసంతృప్తితో
జీవిస్తుంటారు కాబట్టి వీరిని "దుఖఃభాగులు" అంటున్నాయి

శ్రీ శివ కవచం


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

అస్య శ్రీశివకవచ స్తోత్ర మహామంత్రస్య ఋషభ యోగీశ్వర ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ సదాశివరుద్రో దేవతా, హ్రీం శక్తిః, రం కీలకం, శ్రీం హ్రీం క్లీం బీజం, శ్రీసదాశివప్రీత్యర్థే శివకవచస్తోత్రజపే వినియోగః ||


కరన్యాసః ||

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం హ్రీం రాం సర్వశక్తిధామ్నే ఈశానాత్మనే అంగుష్ఠాభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం నం రీం నిత్యతృప్తిశక్తిధామ్నే తత్పురుషాత్మనే తర్జనీభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం మం రూం అనాదిశక్తిధామ్నే అఘోరాత్మనే మధ్యమాభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం శిం రైం స్వతంత్రశక్తిధామ్నే వామదేవాత్మనే అనామికాభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం వాం రౌం అలుప్తశక్తిధామ్నే సద్యోజాతాత్మనే కనిష్ఠికాభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం యం రః అనాదిశక్తిధామ్నే సర్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః ||


హృదయాద్యంగన్యాసః ||

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం హ్రీం రాం సర్వశక్తిధామ్నే ఈశానాత్మనే హృదయాయ నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం నం రీం నిత్యతృప్తిశక్తిధామ్నే తత్పురుషాత్మనే శిరసే స్వాహా |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం మం రూం అనాదిశక్తిధామ్నే అఘోరాత్మనే శిఖాయై వషట్ |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం శిం రైం స్వతంత్రశక్తిధామ్నే వామదేవాత్మనే కవచాయ హుమ్ |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం వాం రౌం అలుప్తశక్తిధామ్నే సద్యోజాతాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం యం రః అనాదిశక్తిధామ్నే సర్వాత్మనే అస్త్రాయ ఫట్ ||


ధ్యానమ్ ||

వజ్రదంష్ట్రం త్రినయనం కాలకంఠమరిందమమ్ |

సహస్రకరమత్యుగ్రం వందే శంభుముమాపతిమ్ ||


రుద్రాక్షకంకణలసత్కరదండయుగ్మః

ఫాలాంతరాలధృతభస్మసితత్రిపుండ్రః |

పంచాక్షరం పరిపఠన్ వరమంత్రరాజం

ధ్యాయన్ సదా పశుపతిం శరణం వ్రజేథాః ||


అతః పరం సర్వపురాణగుహ్యం

నిశ్శేషపాపౌఘహరం పవిత్రమ్ |

జయప్రదం సర్వవిపత్ప్రమోచనం

వక్ష్యామి శైవం కవచం హితాయ తే ||


పంచపూజా ||

లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి |

హం ఆకాశాత్మనే పుష్పైః పూజయామి |

యం వాయ్వాత్మనే ధూపమాఘ్రాపయామి |

రం అగ్న్యాత్మనే దీపం దర్శయామి |

వం అమృతాత్మనే అమృతం మహానైవేద్యం నివేదయామి |

సం సర్వాత్మనే సర్వోపచారపూజాం సమర్పయామి ||


ఋషభ ఉవాచ |

నమస్కృత్య మహాదేవం విశ్వవ్యాపినమీశ్వరమ్ |

వక్ష్యే శివమయం వర్మ సర్వరక్షాకరం నృణామ్ || ౧ ||


శుచౌ దేశే సమాసీనో యథావత్కల్పితాసనః |

జితేంద్రియో జితప్రాణశ్చింతయేచ్ఛివమవ్యమ్ || ౨ ||


హృత్పుండరీకాంతరసన్నివిష్టం

స్వతేజసా వ్యాప్తనభోఽవకాశమ్ |

అతీంద్రియం సూక్ష్మమనంతమాద్యం

ధ్యాయేత్పరానందమయం మహేశమ్ || ౩ ||


ధ్యానావధూతాఖిలకర్మబంధః

చిరం చిదాందనిమగ్నచేతాః |

షడక్షరన్యాససమాహితాత్మా

శైవేన కుర్యాత్కవచేన రక్షామ్ || ౪ ||


మాం పాతు దేవోఽఖిలదేవతాత్మా

సంసారకూపే పతితం గభీరే |

తన్నామ దివ్యం వరమంత్రమూలం

ధునోతు మే సర్వమఘం హృదిస్థమ్ || ౫ ||


సర్వత్ర మాం రక్షతు విశ్వమూర్తిః

జ్యోతిర్మయానందఘనశ్చిదాత్మా |

అణోరణీయానురుశక్తిరేకః

స ఈశ్వరః పాతు భయాదశేషాత్ || ౬ ||


యో భూస్వరూపేణ బిభర్తి విశ్వం

పాయాత్స భూమేర్గిరిశోఽష్టమూర్తిః |

యోఽపాం స్వరూపేణ నృణాం కరోతి

సంజీవనం సోఽవతు మాం జలేభ్యః || ౭ ||


కల్పావసానే భువనాని దగ్ధ్వా

సర్వాణి యో నృత్యతి భూరిలీలః |

స కాలరుద్రోఽవతు మాం దవాగ్నేః

వాత్యాదిభీతేరఖిలాచ్చ తాపాత్ || ౮ ||


ప్రదీప్తవిద్యుత్కనకావభాసో

విద్యావరాభీతికుఠారపాణిః |

చతుర్ముఖస్తత్పురుషస్త్రినేత్రః

ప్రాచ్యాం స్థితో రక్షతు మామజస్రమ్ || ౯ ||


కుఠార ఖేటాంకుశపాశశూల

కపాలమాలాగ్నికణాన్ దధానః |

చతుర్ముఖో నీలరుచిస్త్రినేత్రః

పాయాదఘోరో దిశి దక్షిణస్యామ్ || ౧౦ ||


కుందేందుశంఖస్ఫటికావభాసో

వేదాక్షమాలావరదాభయాంకః |

త్ర్యక్షశ్చతుర్వక్త్ర ఉరుప్రభావః

సద్యోఽధిజాతోఽవతు మాం ప్రతీచ్యామ్ || ౧౧ ||


వరాక్షమాలాభయటంకహస్తః

సరోజకింజల్కసమానవర్ణః |

త్రిలోచనశ్చారుచతుర్ముఖో మాం

పాయాదుదీచ్యాం దిశి వామదేవః || ౧౨ ||


వేదాభయేష్టాంకుశటంకపాశ

కపాలఢక్కాక్షరశూలపాణిః |

సితద్యుతిః పంచముఖోఽవతాన్మాం

ఈశాన ఊర్ధ్వం పరమప్రకాశః || ౧౩ ||


మూర్ధానమవ్యాన్మమ చంద్రమౌళిః

ఫాలం మమావ్యాదథ ఫాలనేత్రః |

నేత్రే మమావ్యాద్భగనేత్రహారీ

నాసాం సదా రక్షతు విశ్వనాథః || ౧౪ ||


పాయాచ్ఛ్రుతీ మే శ్రుతిగీతకీర్తిః

కపోలమవ్యాత్సతతం కపాలీ |

వక్త్రం సదా రక్షతు పంచవక్త్రో

జిహ్వాం సదా రక్షతు వేదజిహ్వః || ౧౫ ||


కంఠం గిరీశోఽవతు నీలకంఠః

పాణిద్వయం పాతు పినాకపాణిః |

దోర్మూలమవ్యాన్మమ ధర్మబాహుః

వక్షఃస్థలం దక్షమఖాంతకోఽవ్యాత్ || ౧౬ ||


మమోదరం పాతు గిరీంద్రధన్వా

మధ్యం మమావ్యాన్మదనాంతకారీ |

హేరంబతాతో మమ పాతు నాభిం

పాయాత్కటిం ధూర్జటిరీశ్వరో మే || ౧౭ ||


(స్మరారిరవ్యాన్మమ గుహ్యదేశం

పృష్ఠం సదా రక్షతు పార్వతీశః )


ఊరుద్వయం పాతు కుబేరమిత్రో

జాను

ద్వయం మే జగదీశ్వరోఽవ్యాత్ |

జంఘాయుగం పుంగవకేతురవ్యాత్

పాదౌ మమావ్యాత్సురవంద్యపాదః || ౧౮ ||


మహేశ్వరః పాతు దినాదియామే

మాం మధ్యయామేఽవతు వామదేవః |

త్రిలోచనః పాతు తృతీయయామే

వృషధ్వజః పాతు దినాంత్యయామే || ౧౯ ||


పాయాన్నిశాదౌ శశిశేఖరో మాం

గంగాధరో రక్షతు మాం నిశీథే |

గౌరీపతిః పాతు నిశావసానే

మృత్యుంజయో రక్షతు సర్వకాలమ్ || ౨౦ ||


అంతఃస్థితం రక్షతు శంకరో మాం

స్థాణుః సదా పాతు బహిఃస్థితం మామ్ |

తదంతరే పాతు పతిః పశూనాం

సదాశివో రక్షతు మాం సమంతాత్ || ౨౧ ||


తిష్ఠంతమవ్యాద్భువనైకనాథః

పాయాద్వ్రజంతం ప్రమథాధినాథః |

వేదాంతవేద్యోఽవతు మాం నిషణ్ణం

మామవ్యయః పాతు శివః శయానమ్ || ౨౨ ||


మార్గేషు మాం రక్షతు నీలకంఠః

శైలాదిదుర్గేషు పురత్రయారిః |

అరణ్యవాసాదిమహాప్రవాసే

పాయాన్మృగవ్యాధ ఉదారశక్తిః || ౨౩ ||


కల్పాంతకాలోగ్ర పటుప్రకోపః

స్ఫుటాట్టహాసోచ్చలితాండకోశః |

ఘోరారిసేనార్ణవదుర్నివార-

మహాభయాద్రక్షతు వీరభద్రః || ౨౪ ||


పత్త్యశ్వమాతంగఘటావరూథ

సహస్రలక్షాయుతకోటిభీషణమ్ |

అక్షౌహిణీనాం శతమాతతాయినాం

ఛింద్యాన్మృడో ఘోరకుఠారధారయా || ౨౫ ||


నిహంతు దస్యూన్ప్రళయానలార్చి-

ర్జ్వలత్త్రిశూలం త్రిపురాంతకస్య |

శార్దూలసింహర్క్షవృకాదిహింస్రాన్

సంత్రాసయత్వీశ ధనుః పినాకః || ౨౬ ||


దుస్స్వప్న దుశ్శకున దుర్గతి దౌర్మనస్య

దుర్భిక్ష దుర్వ్యసన దుస్సహ దుర్యశాంసి |

ఉత్పాతతాపవిషభీతిమసద్గ్రహార్తిం

వ్యాధీంశ్చ నాశయతు మే జగతామధీశః || ౨౭ ||


ఓం నమోభగవతే సదాశివాయ- సకలతత్త్వాత్మకాయ- సర్వమంత్రస్వరూపాయ- సర్వయంత్రాధిష్ఠితాయ- సర్వతంత్ర స్వరూపాయ- సర్వ తత్త్వవిదూరాయ- బ్రహ్మ రుద్రావతారిణే- నీలకంఠాయ- పార్వతీ మనోహర ప్రియాయ- సోమసూర్యాగ్ని లోచనాయ- భస్మోద్ధూళిత విగ్రహాయ- మహామణి మకుటధారణాయ- మాణిక్యభూషణాయ- సృష్టిస్థితిప్రళయకాల రౌద్రావతారాయ- దక్షాధ్వర ధ్వంసకాయ- మహాకాలభేదనాయ- మూలాధారైకనిలయాయ- తత్త్వాతీతాయ- గంగాధరాయ- సర్వదేవాదిదేవాయ- షడాశ్రయాయ- వేదాంత సారాయ- త్రివర్గసాధనాయ- అనంతకోటి బ్రహ్మాండనాయకాయ- అనంత వాసుకి తక్షక కర్కోటక శంఖ కుళిక పద్మ మహాపద్మేత్యష్ట మహానాగ కుల భూషణాయ- ప్రణవస్వరూపాయ- చిదాకాశాయాకాశ దిక్స్వరూపాయ- గ్రహనక్షత్రమాలినే- సకలాయ- కళంక రహితాయ- సకలలోకైకకర్త్రే- సకలలోకభర్త్రే- సకల లోకైకసంహర్త్రే- సకలలోకైకగురవే- సకలలోకైకసాక్షిణే- సకలనిగమగుహ్యాయ- సకలవేదాంతపారగాయ- సకలలోకైక వరప్రదాయ- సకలలోకైక శంకరాయ- సకల దురితార్తిభంజనాయ- సకల జగదభయంకరాయ- శశాంకశేఖరాయ- శాశ్వతనిజావాసాయ- నిరాకారాయ- నిరాభాసాయ- నిరామయాయ- నిర్మలాయ- నిర్లోభాయ- నిర్మదాయ- నిశ్చింతాయ- నిరహంకారాయ- నిరంకుశాయ- నిష్కళంకాయ- నిర్గుణాయ- నిష్కామాయ- నిరుపప్లవాయ- నిరవద్యాయ- నిరంతరాయ- నిష్కారణాయ- నిరాతంకాయ- నిష్ప్రపంచాయ- నిస్సంగాయ- నిర్ద్వంద్వాయ- నిరాధారాయ- నీరాగాయ- నిష్క్రోధాయ- నిర్లాయ- నిర్లోపాయ- నిష్పాపాయ- నిర్భయాయ- నిర్వికల్పాయ- నిర్భేదాయ- నిష్క్రియాయ- నిస్తులాయ- నిస్సంశయాయ- నిరంజనాయ- నిరుపమవిభవాయ- నిత్యశుద్ధబుద్ధముక్తపరిపూర్ణసచ్చిదానందాద్వయాయ- పరమశాంతస్వరూపాయ- పరమశాంతప్రకాశాయ- తేజోరూపాయ- తేజోమయాయ- తేజోఽధిపతయే- జయజయ రుద్ర మహారుద్ర- మహారౌద్ర- భద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంతభైరవ కపాలమాలాధర ఖట్వాంగఖడ్గచర్మపాశాంకుశ డమరు శూల చాప బాణ గదా శక్తి భిండి వాల తోమర ముసల ముద్గర పాశ పరిఘ భుశుండీ శతఘ్నీ చక్రాద్యాయుధ భీషణకర సహస్రముఖ దంష్ట్రాకరాళవదన వికటాట్టహాస విస్ఫరిత బ్రహ్మాండమండల నాగేంద్రకుండల నాగేంద్రహార నాగేంద్రవలయ నాగేంద్రచర్మధర నాగేంద్రనికేతన మృత్యుంజయ త్ర్యంబక త్రిపురాంతక విశ్వరూప విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన విషవిభూషణ విశ్వతోముఖ సర్వతోముఖ మాం రక్ష రక్ష జ్వలజ్వల ప్రజ్వలప్రజ్వల మహామృత్యు భయం శమయ శమయ అపమృత్యుభయం నాశయ నాశయ- రోగభయం ఉత్సాదయోత్సాదయ- విషసర్పభయం శమయ శమయ- చోరాన్మారయ మారయ- మమ శత్రూనుచ్చాటయోచ్చాటయ- త్రిశూలేన విదారయ విదారయ- కుఠారేణ భింధిభింధి ఖడ్గేన ఛింధిఛింధి ఖట్వాంగేన వ్యపోథయ వ్యపోథయ మమ పాపం శోధయ శోధయ- ముసలేన నిష్పేషయ నిష్పేషయ- బాణైస్సంతాడయ సంతాడయ- యక్షరక్షాంసి భీషయ భీషయ అశేషభూతాన్ విద్రావయ విద్రావయ- కూష్మాండ భూతవేతాళ మారీగణ బ్రహ్మరాక్షసగణాన్ సంత్రాసయ సంత్రాసయ మమ అభయం కురుకురు- నరకభయాన్మాముద్ధర ఉద్ధర- విత్రస్తం మామాశ్వాసయాశ్వాసయ- అమృతకటాక్ష వీక్షణేన మాం ఆలోకయ ఆలోకయ- సంజీవయ సంజీవయ- క్షుత్తృడ్భ్యాం మామాప్యాయయాప్యాయయ- దుఃఖాతురం మామానందయానందయ- శివకవచేన మామాచ్ఛాదయాచ్ఛాదయ- హరహర మృత్యుంజయ త్ర్యంబక సదాశివ నమస్తే నమస్తే నమః |


కరన్యాసః ||

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం హ్రీం రాం సర్వశక్తిధామ్నే ఈశానాత్మనే అంగుష్ఠాభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం నం రీం నిత్యతృప్తిశక్తిధామ్నే తత్పురుషాత్మనే తర్జనీభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం మం రూం అనాదిశక్తిధామ్నే అఘోరాత్మనే మధ్యమాభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం శిం రైం స్వతంత్రశక్తిధామ్నే వామదేవాత్మనే అనామికాభ్యాం నమః |

ఓం నమో భగవతే జ

్వలజ్జ్వాలామాలినే

ఓం వాం రౌం అలుప్తశక్తిధామ్నే సద్యోజాతాత్మనే కనిష్ఠికాభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం యం రః అనాదిశక్తిధామ్నే సర్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః ||


హృదయాద్యంగన్యాసః ||

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం హ్రీం రాం సర్వశక్తిధామ్నే ఈశానాత్మనే హృదయాయ నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం నం రీం నిత్యతృప్తిశక్తిధామ్నే తత్పురుషాత్మనే శిరసే స్వాహా |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం మం రూం అనాదిశక్తిధామ్నే అఘోరాత్మనే శిఖాయై వషట్ |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం శిం రైం స్వతంత్రశక్తిధామ్నే వామదేవాత్మనే కవచాయ హుమ్ |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం వాం రౌం అలుప్తశక్తిధామ్నే సద్యోజాతాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే

ఓం యం రః అనాదిశక్తిధామ్నే సర్వాత్మనే అస్త్రాయ ఫట్ ||


భూర్భువస్సువరోమితి దిగ్విమికః ||


ఫలశ్రుతిః ||


ఋషభ ఉవాచ –

ఇత్యేతత్కవచం శైవం వరదం వ్యాహృతం మయా |

సర్వబాధాప్రశమనం రహస్యం సర్వదేహినామ్ || ౧ ||


యః సదా ధారయేన్మర్త్యః శైవం కవచముత్తమమ్ |

న తస్య జాయతే క్వాపి భయం శంభోరనుగ్రహాత్ || ౨ ||


క్షీణాయుః ప్రాప్తమృత్యుర్వా మహారోగహతోఽపి వా |

సద్యః సుఖమవాప్నోతి దీర్ఘమాయుశ్చ విందతి || ౩ ||


సర్వదారిద్ర్యశమనం సౌమాంగల్యవివర్ధనమ్ |

యో ధత్తే కవచం శైవం స దేవైరపి పూజ్యతే || ౪ ||


మహాపాతకసంఘాతైర్ముచ్యతే చోపపాతకైః |

దేహాంతే ముక్తిమాప్నోతి శివవర్మానుభావతః || ౫ ||


త్వమపి శ్రద్ధయా వత్స శైవం కవచముత్తమమ్ |

ధారయస్వ మయా దత్తం సద్యః శ్రేయో హ్యవాప్స్యసి || ౬ ||


సూత ఉవాచ |

ఇత్యుక్త్వా ఋషభో యోగీ తస్మై పార్థివసూనవే |

దదౌ శంఖం మహారావం ఖడ్గం చారినిషూదనమ్ || ౭ ||


పునశ్చ భస్మ సంమంత్ర్య తదంగం పరితోఽస్పృశత్ |

గజానాం షట్సహస్రస్య ద్విగుణస్య బలం దదౌ || ౮ ||


భస్మప్రభావాత్సంప్రాప్త బలైశ్వర్య ధృతిస్మృతిః |

స రాజపుత్రః శుశుభే శరదర్క ఇవ శ్రియా || ౯ ||


తమాహ ప్రాంజలిం భూయః స యోగీ నృపనందనమ్ |

ఏష ఖడ్గో మయా దత్తస్తపోమంత్రానుభావతః || ౧౦ ||


శితధారమిమం ఖడ్గం యస్మై దర్శయసి స్ఫుటమ్ |

స సద్యో మ్రియతే శత్రుః సాక్షాన్మృత్యురపి స్వయమ్ || ౧౧ ||


అస్య శంఖస్య నిర్హ్రాదం యే శృణ్వంతి తవాహితాః |

తే మూర్ఛితాః పతిష్యంతి న్యస్తశస్త్రా విచేతనాః || ౧౨ ||


ఖడ్గశంఖావిమౌ దివ్యౌ పరసైన్యవినాశినౌ |

ఆత్మసైన్యస్వపక్షాణాం శౌర్యతేజోవివర్ధనౌ || ౧౩ ||


ఏతయోశ్చ ప్రభావేన శైవేన కవచేన చ |

ద్విషట్సహస్రనాగానాం బలేన మహతాపి చ || ౧౪ ||


భస్మధారణసామర్థ్యాచ్ఛత్రుసైన్యం విజేష్యసి |

ప్రాప్య సింహాసనం పిత్ర్యం గోప్తాఽసి పృథివీమిమామ్ || ౧౫ ||


ఇతి భద్రాయుషం సమ్యగనుశాస్య సమాతృకమ్ |

తాభ్యాం సంపూజితః సోఽథ యోగీ స్వైరగతిర్యయౌ || ౧౬ ||


*ఇతి శ్రీస్కాందపురాణే బ్రహ్మోత్తరఖండే శ్రీశివకవచ స్తోత్రప్రభావవర్ణనం నామ ద్వాదశోఽధ్యాయః |

తద్దినాలు !

తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు.

పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని కాపాడేది వాళ్ళే. వాయనము ఇస్తాము, కూరలు ఇస్తాము, బియ్యము ఇస్తాము అని అంటే కుదరదు. మీరు వుండే ఇంట్లో పెడితేనే చాలా మంచిది.

దేవతలకు చేసే కార్యము కాని, పితృ దేవతలకు చేసే కార్యము కాని రెండూ మీరు వున్న ఇంట్లోనే చేయాలి, అలా చేస్తే అది మీకు మీ ఇంటికి మంచిది.

కర్మ క్షయం కాని జీవుడు మరణించిన వెంటనే ఎక్కడో ఒక చోట పుడతాడు అన్నది నిజమేనా ?? అలాగయితే మనం చేసే పితృకర్మలు వారికి ఎలా చెందుతాయి ?? జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేక ఇక ఆ జన్మతో బంధం ఉండదు కదా.. మరి పితృదేవతగా ఎలా తర్పణాదులు స్వీకరిస్తాడు? పెళ్ళి/పిల్లలు సరిగా లేకపోతే పితరులకు హాని కలుగుతుంది అంటారు కదా..వ్యక్తిగతంగా చేసిన పాప పుణ్యాల వల్ల కర్మలు ఏర్పడినపుడు ఇలా వంశం చేసిన పాపాల వల్ల ఎలా హాని కలుగుతుంది? పిల్లలు లేకపోతే పున్నామ నరక బాధలు తప్పవా?ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా వివరంగా చెప్పవలసి ఉంది. కానీ ఒక అవగాహన ఏర్పడినా చాలు అనే ఉద్దేశంతో, కొందరు స్నేహితులు అడిగినదానికి ఇక్కడ సమాధానం ఇస్తున్నాను.

పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు. మనందరి (జీవుల) రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ. వసువులు, రుద్రులు, ఆదిత్యులు.. మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు.
కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం. కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము. ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపొలేదు. అది ఆ జీవుని యొక్క సంకల్ప బలం, తనకి గల ప్రారబ్ధ, ఆగామి, సంచితం అనే కర్మలపైన ఆధార పడి ఉంటుంది.
ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో అందుతుంది. ఇలా చేయడానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేసేరు. ఉదాహరణకు..ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంగా మారి మనం పెట్టిన ఆహారం అందుతుంది. వారిని ఉద్దేశించి అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి కలుగజేస్తారు. ఒకవేళ గతించిన వారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మన కోరికలు తీరే విధంగా వస్తుంది. ఉదాహరణకు మనం మనీఆర్డరు చేసిన అడ్రసులో ఎవరూ లేకపొతే మనకే తిరిగి వస్తుంది కదా. కానీ గతించిన వారి స్థితి మనకు తెలియదు కనుక మనం జీవించి ఉన్నంత కాలం పితృకర్మలు చేయవలసినదే.పితృ కార్యమప్పుడు ఒక భోక్తను పితృ స్థానంలో ఇంకొక భోక్తను విష్ణు స్థానంలో కూర్చో పెడతాం .పితృ స్థానంలో కూర్చోపెట్టిన భోక్తకు వాసు రుద్రా ఆదిత్య రూపంలో ఉన్న తండ్రి తథా ముత్తాత మూడు తరాల వారిని ఆవాహన చేస్తాం కదా .అందుకనే భోక్తలను సంతృప్తిగా భోజనం చేయమని తొందర పెట్టకుండా అడిగేది .పూర్వపు రోజులలో భోక్తగా ఉండేవారు ఇప్పుడు నలువురు తినే భోజనం తినేవారు .అరచేతి మన్దమ్ గారెలు బెల్లపు పరవాన్నంలో నెయ్యిపోసుకొని నంచుకు తినేవారు దగ్గరగా పది పన్నెడు గారెలు అవలీలగా తినేవారు భోజనంతో పాటుగా వారు నిజమైన భోక్తలు .ఇప్పుడు అసలు వారు భోజనం చేయటం చాలా తక్కువ షుగర్ అని బీపీ అని .భోక్తగా ఉండాల్సినవారు నియమ నిష్ఠ అంగవైకల్యం లేకుండా ఇంకా చాలా ఉన్నాయ్ .ఈ రోజులలో దొరుకుతున్నారా . ఇంతకుముందు తద్దినం అంటే అపరాహ్నం వచ్చిన తరువాత యింటివారి భోజనం సుమారు నాలుగు గంటల తర్వాతే .ఇప్పుడు తొమ్మిదికి ప్రారంభం పదిన్నరకు పూర్తి కార్యాలయమునకు వెళ్లడం .ఆ ఒక్కరోజు సెలవు పెట్టె వ్యవధి ఉండదు అర్గేంట్ పనులు .అదే వేరే ఏ పనికైనా సెలవులు కావాల్సినన్ని .శ్రద్ద లేని శ్రాద్ధాలు .అదేమంటే పెట్టామా లేదా .ఆప్రాంహం అయితే గానీ పితృదేవతలు రారు .వాళ్ళు రాకుండా తద్దినం ఎవరికోసం .భోక్తల భోజనం కోసమా ఎదో అయిపోయింది అనిఇంచుకోవటానికాజన్మతో బంధం తెంచుకున్న జీవన్ముక్తులకి తప్ప మిగతావారికి గతించిన తరువాత కూడా తన పూర్వీకులతోనూ, తన తరువాతి తరం వారితోనూ సంబంధం ఉంటుంది. మనం పెట్టే ఆహారం స్వీకరిస్తారు.
సంప్రదాయ బద్ధంగా పెళ్ళి జరుగనప్పుదు ఇరువైపుల పితరులు (ముందు తరాలు, తరువాతి తరాలు) అధోగతి చెందుతారన్నది నిజం. వారు వ్యక్తిగతంగా పుణ్య చరిత్రులైనప్పటికీ ఈ బాధ తప్పదు. అందుకే మనవారు పెళ్ళిళ్ళలో సంప్రదాయానికి అంత విలువనిస్తారు. గతించిన వారి పుణ్య సాంద్రత మరీ ఎక్కువగా ఉంటే ఏ మహర్షివలననో ఉత్తమగతులు మళ్ళీ పొందే అవకాశం ఉంది కానీ ఖచ్ఛితంగా చెప్పలేము. అందుకే ఇదివరకు ఎవరైనా సంప్రదాయానికి విరుద్ధంగా పెళ్ళి చేసుకుంటే వారితో తలిదండ్రులు, బంధువులు సంబంధాన్ని త్రెంచుకునేవాళ్ళు. అది అభిమానం లేక కాదు. వారు, వారి పితరులు అధోగతిపాలు కాకూడదని మనసులో బాధపడ్డా అలా చేసే వాళ్ళు.
ఆ పైన పిల్లలు కలిగి, వారు పితృకర్మలు సరిగా చేస్తే పున్నామ నరక బాధలు తప్పుతాయనేది వాస్తవం. అందుకే మనవారు వంశం కొనసాగాలని అనుకునేవారు. కానీ మన ప్రయత్న లోపం లేకుండా సంతానం కలగనప్పుడు అంతగా విచారించనక్కర్లేదు. దానికి ప్రత్యామ్నాయంగా… దేవతల కళ్యాణాలు, మరి కొన్ని వ్రతాలు ఉన్నాయి. వాటిని ఆచరించడం వలన ఇది వరకు జన్మలలో చేసిన ఏ పాపం వలన పిల్లలు లేరో ఆ పాపాలని నాశనం చేసి, వారిని, వారి పితరులను కూడా తరింపజేసుకోవచ్చు. …స్నేహితులకు ధన్యవాదములతోశ్లోకం : "దేవకార్యదపి సదా పితృకార్యం విశిష్యతే "

వేదం విధించిన కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి . నవమాసాలు కడుపులో పెట్టుకొని, రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి , పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణ భారము వహించిన తండ్రికి క్రృతజ్ఞత చూపడము మానవత్వము విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి .

దేవ కార్యాలు కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి. పితృకర్మలు, పితృతర్పణలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలాలనిస్తారు అనగా దేవ కార్యాలను వదిలి వేయాలని చెప్పడం కాదు. పితృకార్యాలు మాని ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా ఫలం లేదు పితృకార్యాలు చేసిన వారికే దేవ కార్యాలు ఫలిస్తాయి. అబీష్టసిద్దికి, వంశ వృద్దికి, సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం.
మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం. అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని పురాణ వచనం.
మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే భాద్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆబ్దీకాలు పెట్టాలి.
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది.
మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రార్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్తను అనాదారణ చేసిన ఎడల పునర్జన్మలో వారి కుండలిలో పితృ దోషము కలుగును. సర్ప హత్యా లేదా ఏదైనా నిరపరాదిని హత్య చేసినా కూడా పితృ దోషము కలుగును.
పితృ దోషమును నివారించుటకు నియమించ బడ్డ పితృ కార్యములు చేయవలెను యది మీకు సంభవము కాని ఎడల పితృ పక్షములో శ్రార్దము చేయవలెను. వైధీకులు రెండూ ను చేయాలి.శ్రాద్ధాచరణ విషయము నందు విశ్వేదేవతలు సాక్షిగా ఉందురు.శ్రీ మహా విష్ణువు శ్రాద్ధమునకు పర్యవేక్షకునిగా వుండును.ప్రధాన దేవతలు పితృదేవతలు ముగ్గురు.తండ్రి,తాత,ముత్తాత ,తండ్రి వసు స్వరూపుడు, తాత రుద్ర స్వరూపుడు, ముత్తాత ఆదిత్య స్వరూపుడు ఈ ముగ్గురూ వసు,రుద్ర,ఆదిత్య లోకముల యందు ఉందురని శాస్త్ర సంప్రదాయము. ఒకొకపుడు ఈ ముగ్గురూ వారి కర్మఫలాను భవానంతరము ఆ లోకములను విడిచి కర్మానుగుణముగ మరో లోకములో ప్రవేశించి ఉండవచ్చును. కానీ వారు ప్రవేశించిన లోకములు వారి స్థితి వసురుద్రాదిత్య లోకముల యందే తెలియబడును. శ్రాద్ధాచరణ విషయములో ఒకానొక స్థితిలో భోక్తలగు బ్రాహ్మణులు లభించనిచో కర్త అరణ్యమునకు వెళ్ళి నాకు బ్రాహ్మణులు లభింపలేదు అందుచేత శ్రాద్ధమును ఆచరించలేక పోవుచున్నాను. అని పెద్దగా ఏడవ వలెను. మరియు శ్రాద్ధాచరణ వాషయంలో ఇట్లుండవలెను. భోక్తలు తమ భోజన కాలములో కర్తవలు తమ కొరకు వండిన భక్ష్యాది పదార్ధములలో అపేక్షిత పదార్ధములను అడిగి భుజించవలెను.ఆయా భక్ష్య పదార్ధములు భుజించవలెనన్న కోరిక  ఉన్ననూ సిగ్గుతో అడగలేక భక్షించలేకపోయినచో ఆ దోషము భోక్తలదే. అయిననూ కర్త పరిశీలిస్తూ అడిగివేయనిచో ఆదోషము కర్తదేయగును.
శ్రాద్ధము జరుగుచుండగా విశ్వేదేవతలు వసురుద్రఆదిత్య లోకములకు వెళ్ళి అచటనున్న పితృదేవతలతో ఇట్లు చెప్పెదరు.
   ఓ పితృదేవతలారా  భూలోకములో మీ పుత్రపౌత్రాదులు మీ కొరకు శ్రాద్ధము ఆచరించుచున్నారు.అని చెప్పెదరు.ఆసమయంలో పితృదేవతలు ఆ లోకములోనే ఉన్నచో భూలోకములో పితృదేవతా స్వరూపముతో భుజించుచున్న బ్రాహ్మణుల భోజన తృప్తిననుసరించి పితృదేవతలు తృప్తి చెందెదరు.ఒకవేళ పితృదేవతలు ఆ లోకములో లేక లోకాన్తరములో ఉన్నచో వారెచట ఉన్నది వసురుద్రాదిత్య లోకములో విచారించి విశ్వేదేవతలు వారేలోకములో ఉండిరో ఆ లోకములో వారికి శ్రాద్ధకర్త సమర్పించిన పిండము మున్నగు ఆహారములను సంక్రమింపజేసెదరు.ప్రస్తుతము పితృదేవతలు ఏ లోకమున ఉండెనో ఆ లోక వాసులు ఏ ఆహారమును తినెదరో అట్టి ఆహారముగా కర్త ఇచ్చిన పిండాది అన్నము మున్నగు పదార్ధములను మార్చి పితృదేవతలకు చెందునట్లు చేసెదరు.అదెట్లనగా పితృదేవతలు పుణ్యవశమున దేవలోకమున ఉన్నచో అప్పుడు భూలోకము లో కర్త ఇచ్చిన పిండాది అన్న విశేషములను దేవతలకు ఆహారమైన అమృత స్వరూపముగా అందించగలరు. రాక్షస లోకములో ఉన్నచో కర్త ఇచ్చిన పిండాది అన్న విశేషములను రాక్షసులకు ఆహారమైన మాంసము,నెత్తురు గా మార్చి భుజింపచేయగలరు. భూలోకములో పశు స్వరూపముగా ఉన్నచో లేత పచ్చగడ్డి మున్నగు పశువులకు యోగ్యమగు ఆహారముగా మార్చి సమర్పించగలరు.

ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటే లాభాలు


1. ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి.

2. ఎవరింట్లో అయితే భీతి, భయం వెంటాడుతుంటాయో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది.
3.ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం ప్రశాంతత లభిస్తుంది.

4. చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, భీతి, రోగ బాధలు ఏమీ దచిచేరవు. ఆరోగ్యవంతులుగా ఉంటారు.

5. వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటే వారికి పిల్లలు కలుగుతారు.

6. విద్యార్థులు, విధ్యార్థినులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి సింధూరాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు.

7. లో బీపీ ఉన్నవారు రక్త మీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్దిస్తుంది.

8. గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది.

9. ఇంట్లో ఆంజనేయస్వామికి గంధాన్ని పూయదలచినవారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి. తరువాత అంతా గంధం పూసుకుంటూ వచ్చి చివరిగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే
తలచిన వన్నీ నెరవేరుతాయి జై శ్రీరాం

Tuesday, July 23, 2019

ఆంజనేయ స్వామి అవతారాలు



పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణం లో వివరణ దొరుకుతుంది. రామ రావణ యుద్దము నందు, రావణుడు మహీరావణుడి సాయం కోరుతాడు, పాతాళానికి అధిపతి మహీరావణుడు. ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల సయనమందిరము ( తోకతో ఏర్పాటు చేసినది) నుండి రామ లక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. అది తెలుసుకొన్న ఆంజనేయుడు శ్రీ రామ లక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్తాడు. పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపలను ఒకేసారి విచ్చిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకొన్న పవనుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు. అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగ, గరుడ, వరాహ, హయగ్రీవ, నరసింహాదులు కలసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్చినం చేసి (ఆర్పి) శ్రీరామ లక్ష్మణులను కాపాడుకొంటాడు.

పంచముఖాలు ఐదు దిక్కులు వాటి వివరాలు ! హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు, హనుమంతుడు భక్తసులభుడు, హనుమంతుడి కరుణాకటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు అని వేదపండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఆంజనేయస్వామి నవ అవతారాలలో దర్శనం ఇస్తాడు. ఆంజనేయస్వామి నవావతరాలు 1.ప్రసన్నాంజనేయస్వామి,
2.వీరాంజనేయస్వామి,
3.వింశతి భుజ ఆంజనేయస్వామి,
4.పంచముఖ ఆంజనేయస్వామి,
5.అష్టాదశ భుజ ఆంజనేయస్వామి,
6.సువర్చల ఆంజనేయస్వామి,
7.చతుర్భుజ ఆంజనేయస్వామి,
8.ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి మరియు
9.వానరాకార ఆంజనేయస్వామి.

ఆంజనేయస్వామి నవావతారాలలో పంచముఖ ఆంజనేయస్వామి శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించాడు. పంచముఖాలు ఐదు దిక్కులను దృష్టిని సారించి ఉండగా ఆ ముఖాలలోని వివరాలు ఈ విధంగా చెప్పబడ్డాయి.

తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు. ఆంజనేయ స్వామి, తూర్పునకు అభిముఖుడై, బాధలు కష్టాలనుండి రక్షించేవాడు

దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.నరసింహ, దక్షిణాభిముఖుడు, దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు.

పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు. గరుడు, పడమటి దిక్కు వైపు ఆసీనుడై, ఆయుర్దాయ కాలాన్ని పెంపొందించేవాడు

ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.వరాహ, ఉత్తరాభిముఖుడు, మంచి జీవితాన్ని ప్రసాదించువాడు

ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.

శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి ఇక.. శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి.

"శ్రీరామజయం" అనే మంత్రాన్ని 108 సార్లు తమలపాకులపై కానీ
పేపర్‌పై కానీ రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

జై శ్రీరామ్
జై హనుమాన్

పురాణాల్లో వ్యక్తుల పేర్లు.. అర్ధాలు



అనసూయ - అసూయ లేనిది
అర్జునుడు - స్వచ్చమైన చాయ కలవాడు
అశ్వత్థామ - గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు.
ఆంజనేయుడు - 'అంజన'కు పుట్టినవాడు.
ఇంద్రజిత్తు - ఇంద్రుని జయించినవాడు (జితమంగా విజయము)
ఊర్వశి - నారాయణుడి ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది.
కర్ణుడు - పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు.
కుంభకర్ణుడు - ఏనుగు యొక్క 'కుంభస్థల' ప్రమాణముగల కర్ణములు (చెవులు) కలవాడు.

కుచేలుడు - చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము).
కుబేరుడు - నికృష్టమైన శరీరము కలవాడు (బేరమనగా శరీరము).
గంగ - గమన శీలము కలది .భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక భాగీరధి అని, జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి నొందినది కనుక జాహ్నవి అని గంగకు పేర్లు కలవు.

గరుత్మంతుడు - విశిష్టమైన రెక్కలు కలవాడు
ఘటోత్కచుడు - కుండవలె గుబురైన జుట్టు కలవాడు (ఘటమనగా కుండ)
జరాసంధుడు - 'జర' అను రాక్షసి చేత శరీర భాగాలు సంధింపబడిన (అతికింపబడిన) వాడు.

తుంబురుడు - తుంబుర (వాద్య విశేషము) కలవాడు
దశరధుడు - దశ (పది) దిశలలో రధ గమనము కలవాడు.
ధృతరాష్ట్రుడు - రాష్ట్రమునంతటినీ అదుపులో ఉంచుకొనువాడు.
త్రిశంకుడు - 1. తండ్రిని ఎదిరించుట 2, పరభార్యను అపహరించుట 3. గోమాంసము తినుట అను మూడు

శంకువులు(పాపాలు) చేసినవాడు.
దమయంతి - 1. 'దమనుడు' అను ముని వరము వలన జన్మించినది. 2. తన అందముచే ఇతరులను దమించునది.(అణచునది).
దుర్వాసుడు - దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము)
దుర్యోధనుడు - (దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు.

దుశ్శాసనుడు - సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు.
ద్రోణుడు - ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు.
ధర్మరాజు - సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును
ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి.
నారదుడు - 1.జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము) 2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు.
ప్రద్యుమ్నుడు - ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు (ధ్యుమ్నము :బలము)

ప్రభావతి - ప్రభ (వెలుగు)కలది.
ప్రహ్లాదుడు - భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు
బలరాముడు - బలముచే జనులను రమింపచేయువా

సప్త ఋషులు


సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు....

కశ్యప అత్రి భరద్వాజ
విశ్వామిత్రోథ గౌతమః!
వశిష్టో జమదగ్నిశ్చ
సప్తైతే ఋషయః స్మృతాః!!

భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.
ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.

1.కశ్యపుడు,
2.అత్రి,
3.భరద్వాజుడు,
4.విశ్వామిత్రుడు,
5.గౌతముడు,
6.జమదగ్ని,
7.వసిష్ఠుడు... వీరు ఏడుగురు పూజ్యనీయులే🙏🙏🙏🙏.

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


 1. కశ్యప మహర్షి:- సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతా త్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

2. అత్రి మహర్షి:-
 సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

3. భరద్వాజ మహర్షి:-
భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


4. విశ్వామిత్ర మహర్షి:-
విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

5. గౌతమ మహర్షి:-
తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

6. వశిష్ఠ మహర్షి:-
ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.
సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

7. జమదగ్ని మహర్షి:-
జమదగ్ని ఋషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశారు.

శివుని_స్వరూపం

" శివుని ధ్యానించే ముందు ,చింతించే ముందు , శివుడి స్వరూపం ఏమిటో  చక్కగా తెలుసుకోవాలి . శివుడి స్వరూపం ఏమిటో తెలియని వారు ,  శివుని సదా ధ్యానించలేరు . నిరంతరం చింతించ లేరు , శివానందములో రమించలేరు.

శివుడి స్వరూపాన్ని పరిపూర్ణంగా గ్రహించినవారే , శివుడంటే ఎవరో చక్కని ధృఢ జ్ఞానాన్ని సొంతం చేసుకుంటారు. పూర్ణ జ్ఞానాన్ని కలిగి వుంటారు . నిజమైన స్య్జానాన్ని సొంతం చేసుకుంటారు.

ఇక శివుడి స్వరూపం.

నామం , రూపం లేని చైతన్య స్వరూపమే శివుని స్వరూపం . గుణములు , లౌకిక లక్షణములు లేని నిరాకార , నిర్గుణ స్వరూపమే శివుని స్వరూపం .
#శివుడు ......
" సచ్చిదానంద స్వరూపుడు -- నిత్య ముక్తుడు
స్వయం జ్యోతి స్వరూపుడు -- సర్వస్వతంత్రుడు
అఖండ స్వరూపుడు. -- అద్వితీయుడు
నిర్వికార స్వరూపుడు. -- పరిపూర్ణుడు
నిత్యస్వరూపుడు. -- అనాద్యంతుడు
సత్య స్వరూపుడు. -- నిరంజనుడు
అమృత స్వరూపుడు. -- నిరుపాధికుడు
ప్రణవ స్వరూపుడు. -- శరీరత్రయ వ్యతిరిక్తుడు
సాక్షీ స్వరూపుడు. --- త్రిగుణాతీతుడు
గ్నానస్వరూపుడు. --- ద్వంద్వాతీతుడు
సదానంద స్వరూపుడు. --- లోకాతీతుడు
బ్రహ్మానంద స్వరూపుడు. --- మాయాతీతుడు
ఆదిస్వరూపుడు. --- మనో తీతుడు
అచల స్వరూపుడు. --- నిస్సంగుడు
ముక్త స్వరూపుడు. -- దేహాతీతుడు
అభయ స్వరూపుడు. --- నిర్విశేషుడు
అక్రియ స్వరూపుడు. --- స్వయం ప్రకాశుడు
అందుకే శివజ్ఞానమృతోపనిషత్ శివుని స్వరూపాన్ని ఈ విధంగా తెలిపినది .

" తద్ బ్రహ్మ తత్ సచ్చిదానంద స్వరూపం
స్వయం జ్యోతి : నిత్యం అనాద్యంతం నిర్వికారం
అమృతం అభయం నిరంజనం నిర్గుణం నిరాకారం నిర్విశేషం అఖండం నిరుపాధికం  ఏక మేవాద్వితీయం  స్వతంత్రం నిత్య ముక్తం పరిపూర్ణం "
సర్వకాల సర్వావస్థల యందు సదా అస్తిత్వమును కలిగివుండే సత్య స్వరూపమే శివుని స్వరూపం . అగ్నిదీపం వలె నిశ్చలంగా ప్రకాశించే జ్ఞాన మహాదీపమే శివుని స్వరూపం . అపారమైన జలముతో నిండిన సాగరం వలె అపరిమిత అనంత ఆనంద సాగరమే శివుని స్వరూపం అందుకే వరాహోపనిషత్ :

"సత్యచిద్ఘన మఖండ మద్వయం సర్వదృశ్యరహితం|
నిరామయం , యత్పదం విమల మద్వయం శివం || "

' సత్యమై , చిత్ ఘనమై , అఖండమై , అద్వయమై , సర్వదృశ్యరహితమై ,నిరామయమై , విమలమై , ఏ పరబ్రహ్మం కలదో ,అట్టి పరబ్రహ్మమే - శివుడని తెలిపినది.

సుబ్రహ్మణ్యస్వామి దగ్గర నెమలితోపాటు కోడిపుంజు కూడా ఉంటాది, ఎందుకు ?

సుబ్రహ్మణ్యస్వామి దగ్గర నెమలితోపాటు కోడిపుంజు కూడా ఉంటాది, ఎందుకు ? చాలామంది అడిగిన ప్రశ్నకు జవాబు.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వాహనం ఏది అంటే నెమలి అని ఠక్కున చెప్పేస్తారు. కానీ ఆయన చిత్రాల్లో ఓ మూలన కోడిపుంజు కూడా కనిపిస్తుంది. మన దగ్గర తక్కువే కానీ... తమిళనాడులో అయితే కార్తికేయుని ఆలయాలలో కోడిపుంజులని పెంచుతుంటారు. ఇంతకీ కార్తికేయునికీ, కోడిపుంజుకీ మధ్య అనుబంధం ఏమిటి? ఈ విషయం తెలియాలంటే ఆయన జన్మవృత్తాంతాన్ని ఓసారి గుర్తుచేసుకోవాల్సిందే!

దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయాడు. ఒక పక్క శివునికి భార్య లేదు, మరో వివాహం చేసుకునే స్థితిలోనూ లేడు. ఇలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలూ భావించాయి. తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసులు ఇదే అదనుగా భావించారు. తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం రాకూడదన్న వరాన్ని పొందారు.

వరాన్ని పొందిన ఆ రాక్షసులు ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఏకంగా స్వర్గం మీదకే దండెత్తి ఇంద్రుని జయించారు. ఇలాంటి పరిస్థితిలో దిక్కు తోచని దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మన్మథుని వేడుకున్నారు. కానీ ఆ ప్రయత్నం చేయబోయిన మన్మథుడు, శివుని కోపానికి గురై భస్మమైపోయాడు. ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయునిగా అవతరించింది.

శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం భరించలేకపోయాడు. ఆయన దానిని గంగానదిలో విడిచిపెట్టాడు. అలా గంగానదిలోని రెల్లు పొదల మధ్య జన్మించిన కార్తికేయుని, ఆరుగురు అక్కచెల్లెళ్లు (కృత్తికలు) పెంచారు. కొన్నాళ్లకి కార్తికేయుడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు. తను అవతరించిన కారణాన్ని తెలుసుకున్న కార్తికేయుడు, తారకాసురుని మీద యుద్ధానికి బయల్దేరాడు.

ఏకాదశ రుద్రులు తోడురాగా, తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి బయల్దేరాడు. తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయునికీ, రాక్షసులకీ మధ్య ఘోర యుద్ధం జరిగిందని చెబుతారు. అక్కడి సముద్రతీరాన శూరపద్ముడూ, తారకాసురుడూ కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం చేశారు.

కార్తికేయుడు మరెవ్వరో కాదు సాక్షాత్తూ ఆ శివుని కుమారుడే అన్న విషయం శూరపద్మునికి తెలిసిపోయింది. కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి. పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షసప్రవృత్తి. దాంతో రొమ్ము విరుచుకుని కార్తికేయుని మీదకు యుద్ధానికి బయల్దేరాడు. కానీ యుద్ధంలో తన సైనికులు, సహచరులంతా ఒకొక్కరే మరణించడం చూసి శూరపద్మునికి భయం పట్టుకుంది.

శూపద్ముడు ఒక మామిడిచెట్టు రూపాన్ని ధరించి కార్తికేయునికి నుంచి దాక్కొనే ప్రయత్నం చేశాడు. కానీ ఆ షణ్ముఖుని కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా! కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడిచెట్టుని రెండుగా చీల్చాడట. దాంతో చెట్టులోని సగభాగం నెమలిగానూ, రెండో సగం కోడిపుంజుగానూ మారిపోయాయి. నెమలిని తన వాహనంగానూ, కొడిపుంజుని తన ధ్వజంగానూ మార్చుకున్నాడు కార్తికేయుడు. అలా ఆయన పక్కకు కోడిపుంజు చేరింది.

ఒడిబియ్యం అంటే ఏమిటి

ఒడి బియ్యం తెలుగు సంస్కృతికే మకుటం

ప్రతి మనిషిలో (అన్ని మతాలవాళ్ళకు కూడ) వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి. ఈనాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈనాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది. (Thecal sac). ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు వుంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో "ఒడ్డియాన పీఠం" వుంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే "ఒడ్డియాణం" వాడుకలో "వడ్యాణం" అంటారు.

ఏడు చక్రాలలో శక్తి (గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో వున్న శక్తికి బియ్యం పోవటమన్నట్టు. ఒడ్డియాణపీఠంలో వుండే రూపంపేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే, ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి.
This is nothing but alerting Mahalakshmi inside the girl.
అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు. ఒడి అంటెనే రక్షణ.

ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్ళకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమబిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే.

సంతోషంతో ఆ మహాలక్ష్మి (ఆడపడుచు), తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిళ్ళ బియ్యం అమ్మవాళ్ళకు ఇచ్చి, దేవుని ప్రార్ధించి, మహాద్వారానికి నూనె రాసి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది. అక్కడ ఆడాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను (ఐశ్వర్యాన్ని) ఊరంతా పంచుతుంది.

 ఒడి బియ్యం :
౼౼౼౼౼౼౼౼౼౼
వలసెల్లిపోయినా గట్టుకూలిపోయినా తల్లిగారి బియ్యం తన్నుకురావల్సిందే ! అయిదేండ్లకోసారి సారె మళ్ళాల్సిందే > పసుపుబువ్వ దావత్ తో తాంబూలాలియ్యాల్సిందే..!

శ్రీ మంతులకైనా నిరుపేదలకైనా ఒడినిండా బియ్యం సంతానానికి ప్రతీక. సౌభాగ్యానికి కొనసాగింపు > భర్త అలిగితే తొడమీదనే బట్టలు పెట్టుకొచ్చుకునే తెగింపు.. ఆడబిడ్డలకందరికి అతిపెద్ద సామాజిక గౌరవం.

ఐదు సేర్లు, ఐదు దోసిళ్ళు ఐదు పిడికిళ్శు, ఐదు చారల బియ్యం, ఐదు తమలపాకులు, ఐదు పోకలు, ఐదు పసుపుకొమ్ములు, ఐదు ఎల్లిగడ్డలు ఐదు కర్జూరాలు, ఐదు దానిమ్మలు‌‌, రూపాయిబిళ్ళలైదు పంచశిలా ఒప్పందంలా పంచభూతాల కలయికలా ఐదుగురు ముత్తైదువలు పసుపు కుంకుమలతో అలంకరణ.

బియ్యం పడిపోతే బతుకే కూలినట్లు విచారం > గోదావరి వంతెన కూలి రాజ్యకిరీటం ముక్కలైనట్లు అవమానం > ఏ కార్యంల బొట్టుపెట్టనియ్యరు మందిల కలువనియ్యరు > పందిరి గుంజ పట్టుకొని పండ్లిగిలియ్యాల్సిందే !

చెరువు నిండితే ఊరుకెంత సంబరమో > బిడ్డకు ఒడి నింపితే తల్లికంత ఆనందం > అన్నా చెల్లెండ్లు అక్కా తమ్ముండ్లు అనురాగాలు అనుబంధాల్ని దుసరితీగ సిబ్బిలా తరతరాలుగా ముడేసే ఒడి బియ్యం తెలుగు సంస్కృతికే మకుటం.

బొట్టు


మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది.

🍁బొట్టులేని ముఖము,
ముగ్గులేని ఇల్లు అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో
వారి యొక్క ముఖము,
ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండూ కూడా స్మశానంతో సమానం.

🌻కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత
 ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు,
దరిద్రదేవత తాండవం చేస్తాయి.

🌸ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే.కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు.

🌹అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు.
వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు.

🌹కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి.
మన ముఖములో ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగెటివ్ఎనర్జీ అంటారు.

🌷🌿నరుడు కంటే చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు, అలాగే ఎదురుగా ఉండేటటువంటివారు
 మన ముఖాన్ని చుస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటికీ మధ్యలో ఉండేటటువంటి స్థానంలో కేంద్రీకృతమవుతుంది.
మన శరీరంలో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో ఉంటాయి.
🌷☘ఎప్పుడైతే అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి.
ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వలన
ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి.
🍁🌾అంటే మెదడుకు సంభందించినటు
వంటి నాడులు మన ముఖములో కనబడుతాయి.
కాబట్టి ఆ మెదడు దెబ్బ తింటుంది.
🍁మెదడు దెబ్బ తినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది.
తద్వారా మనకు తలనొప్పి వస్తుంది.
మనఃశాంతి పోతుంది.
చిరాకు వస్తుంది.
ఏ విషయం పైన సరిగా దృష్టి పెట్టలేము.
కాబట్టి ఎదుటి వారి యొక్క కంటిచూపు నుండే
 మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలంటే మెదడును కాపాడుకోవాలంటే
మనకు ఉన్నటువంటి పాజిటివ్ఎనర్జీని కాపాడుకోవాలంటే ఖచ్చితముగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి.
అంటే బొట్టు పెడితే చాలు.
🌹🙏మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటటువంటి వారి యొక్క చూపు
మన యొక్క నుదుట మీద పడినా కూడా మన సున్నిత మైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది.
🍁🌸తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది.
జ్ఞాపకశక్తి, మేధాశక్తి అన్నీ రకాలయి నటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి.
🌺🌲ఎటువంటి ఒత్తిడికి
లోనూ కావు.
మనల్ని కాపాడుతూ ఉంటాయి.
🌹🥬మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి.
అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి.
సైంటిఫిక్ గా కూడా తప్పనిసరిగా సైన్సు ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది.
అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి.
🌸🌻ఋణ బాధలు ఉన్నటువంటివారు నాగసింధూరాన్ని
 బొట్టుగా ధరించండి.
ఆ బొట్టు పెట్టుకోవడం వలన ఋణబాధలు అన్నీ
కూడా తొలగిపోతాయి.
🌹🌸అదే విధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి.
🌿🌹ఎక్కువగా మనఃశాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆరావళి కుంకుమను బొట్టు పెట్టుకోండి.
పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా సౌభాగ్యవతులే కాకుండా మగవారే కాకుండా వైథవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా కుంకుమను ధరించవచ్చు దానినే గంగసింధూరము అంటారు.
ఆంజనేయస్వామి వారి 🌸☘యొక్క బొట్టు అని కూడా అంటారు.
ఆ బొట్టును వైదవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు.
🌿🍁మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన  ఆచారాలే.
🍁🌿ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే
హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము
🌷🌿దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాము.
ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారుబాటలు.
🌹🌻అందుకని ఆడ,మగ తేడాలేకుండా  చక్కగా అందరు కుంకుమను ధరించండి.
      👏 శుభంభూయాత్

సంస్కృత పదాలు వాటి అర్థం

నివేదనల పేర్లు

1)చూతఫలం=మామిడిపండు
 2)ఖర్జూర= ఖర్జూరం.             
3)నింబ=వేప
4)నారింగ=నారింజ
5)భల్లాతకీ=జీడిపప్పు
6)బదరీ=రేగు
7)అమలక=ఉసిరికాయ
8)శుష్కద్రాక్ష=కిస్మిస్
9)అమృత లేక బీజాపూరం= జామపండు
10)ఇక్షుఖండం=చెఱకుముక్క
11)కదళీఫలం,రంభా ఫలం=అరటిపండు
12)నారికేళం=కొబ్బరికాయ
13)జంభీర= నిమ్మ పండు
14)దాడిమీ=దానిమ్మపండు
15)సీతాఫలం= సీతాఫలం
16)రామఫలం= రామఫలము
17)కపిత్త=వెలగ పండు
18)శ్రీ ఫలం, బిల్వఫలం= మారేడు
19)మాదీ ఫలం=మారేడు పండ్లు
20)జంభూఫలం=నేరేడు
 ప్రసాదములు. 
21)వాతాదం= బాదము పప్పు


1)కుశలాన్నం =పులగం

2)చిత్రాన్నం=పులిహోర

3)క్షీరాన్నం=పరమాన్నం

4)పాయసం=పాయసం

5)శర్కరాన్నం= చక్కెరపొంగలి

6)మరీచ్యన్నమ్= కట్టు లేదా మిరియాలపొంగలి

7)దధ్యోదనం= పెరుగు అన్నము

8)తిలాన్నం=నువ్వులపొడితో చేసిన అన్నం

9)శాకమిశ్రితాన్నం=కిచిడీ

10)గుడాన్నం = బెల్లపు పరమాన్నం

11)సపాదభక్ష్యం= గోధుమనూకతో చేసిన ప్రసాదం

 (గోధుమ నూక చీనీ నెయ్యి సమపాళ్ళలో వేసి చేసింది గాన ఆపేరు)

12)గుడమిశ్రిత ముద్గ సూపమ్= వడపప్పు

13)గుడమిశ్రిత తండులపిష్టం= చలిమిడి

14)మధురపానీయ=పానకం

15)పృథక్=అటుకులు

16)పృథకాపాయస=అటుకుల పాయసం

17)లాజ=పేలాలు

18)భక్ష్యం= పిండివంటలు

19)భోజ్యం= అన్నము మొదలగునవి

20)వ్యంజనం=పచ్చడి

21)అపూపం=అరిసెలు లేదా అప్పములు

22)మాషచక్రం= గారెలు

23)లడ్డుక,= లాడూలు

24)మోదకం= ఉండ్రాళ్ళ

Monday, July 22, 2019

నవగ్రహాల తల్లిదండ్రులు, భార్యల పేర్లు

మన జాతక చక్రంలో నుండి, మన మంచి చెడులు నిర్ణయించు అధికారం #నవగ్రహాలకు మాత్రమే వున్నది. వారి పేర్లు అందరికి తెలుసు. కానీ వారి తల్లిదండ్రులు ఎవరు, భార్యలు పేర్లు ఏమిటి అని. అతి కొద్ది మందికి మాత్రము తెలిసి ఉండ వచ్చు. అందుకే అందరి సౌకర్యార్థము క్రింద తెలుపు బడినది.

 01. రవి[సూర్యుని]
తల్లిదండ్రులు@ అతిది - కశ్యపులు.
భార్యలు@ ఉష,- ఛాయ.

 02. చంద్రుని -
తల్లిదండ్రులు@ అనసూయ - అత్రి మహర్షి
 భార్య@ రోహిణి .

 03. కుజుని-
తల్లిదండ్రులు@ భూమి, భరద్వాజుడు
భార్య@ శక్తిదేవి

 04. బుధుని -
తల్లిదండ్రులు@ తార, చంద్రుడు
భార్య@ జ్ఞానశక్తిదేవి

 05. గురుని
తల్లిదండ్రులు@ తార, అంగీరసుడు
భార్య@ తారాదేవి

 06. శుక్రుని
తల్లిదండ్రులు@ ఉష,భ్రుగు
భార్య@ సుకీర్తి దేవి

 07. శని -
తల్లిదండ్రులు@ ఛాయ, రవి
భార్య@ జ్యేష్టదేవి

 08. రాహువు
తల్లిదండ్రులు@ సింహిక, కశ్యపుడు
భార్య@ కరాళి దేవి

 09 కేతువు -
తల్లిదండ్రులు@ సింహిక, కశ్యపుడు
భార్య@ చిత్ర.

Sunday, July 21, 2019

నాటి పాతాళ లోకమే నేటి అమెరికా

పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరిం చారు.

👉 సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు.

👉 ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా (శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖ రేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉప న్యాసంలో చెప్పారు.)

👉 కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)  (సగర పుత్రులు బూడిద కుప్పలు గా  మారిన ప్రదేశం) మరియు

👉 హార్స్‌ల్యాండ్ (Horse land) (యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమానీ నదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి.

👉 వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తోలి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే దీని పురాతన నామం మహాబలి భూమి, ఇప్పుడది మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందింది.

👉 ఈ మలిపునగరంకు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం.

👉 బలిచక్రవర్తిని శ్రీ మహా విష్ణువు పాతాళానికి అధిపతి గా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగు తోంది.

👉 పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనా లు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా స్వరంగం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము.

👉 రాముడి ఆజ్ఞ మింద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజింతారు. మధ్య అమెరికా, హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని Lost City of the Monkey God‘ గా వ్యవహరిస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారు (Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు 1939 లో వెళ్ళడించారు.)

👉 “సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ" అనగా సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురుల కు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు.

👉 భూమినుండి 50000 యోజనాల  దూరంలో పాతాళం ఉన్నది. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పు కున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది.

👉 అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, Oregon లో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీయంత్రం బయలు పడడం ఇవన్నీ కూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే.

👉  మూల అమెరికాయులు (రెడ్ ఇండియన్లు) విగ్రహారాధన చేస్తారు. ఇప్పటికీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడు తుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార ఛాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారత దేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం The light of India లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు. వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఉన్నది.

👉 వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114BC నుండి మొదలు అవుతుంది. ఇంచు మించు మనం మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరి పోతుంది. వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ వుహ్ అంటారు. వారి పండగలు కూడా మన దశరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారుకూడా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ వున్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియ చెయ్య వలసిన అవసరం ఉన్నది.

ఒకసారి నడిచే దేవుడు కంచి పరమాచార్య వారు మూల అమెరికాయుల మంత్రాలకు మన మంత్రాల కు ఉన్న సంబంధం వివరిస్తారు. ఒకప్పుడు ఈ లోకాలన్నింటిలో ఒకే ధర్మం విలసిల్లేది.

అక్కడివారి వద్ద తాళం కనబడుతోంది. కేవలం హిందూ ధర్మంలో ఆ తాళం, దాని చిక్కుముడి విప్పే తాళంచెవి కూడా ఉన్నాయి అని పరమాచార్యులు అన్నారు.

ఎంత సత్యమో కదా !!!

గురుపూర్ణిమ గురించి చాల మందికి తెలియని విషయాలు....

భారత దేశములో ఆషాడ పూర్ణిమనుండి నాలుగు మాసాలు చాతుర్మాసం పాటిస్తారు . పూర్వకాలములో శిష్యులు , గురువులు కూడా ఈ నాలుగుమాసములు వర్షాకాలము అయినందున , వ్యాధులు ప్రబలే కాలము అయినందున ... ఎలాంటి పర్యటనలు , దేశ సంచారము చేయకుండా ఒకేచోటే తాత్కాలికము గా నివాసము ఏర్పరచుకునేవారు . అప్పుడు శి్ష్యులు గురుగు దగ్గర వి్జ్ఞాన సముపార్జన చేసేవారు . ఈ జ్ఞానసముపార్జన లో మొదటిరోజు ని గురువుని ఆరాధించడానికి ప్రత్యేకించేవారు . ఈ సంప్రదాయమే కాలక్రమేన " గురుపూర్ణిమ " గా మారినది అని చరిత్ర చెబుతోంది .


ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం ??

ఆదిగురువు వేదవ్యాసులవారు.

 వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు . గురువులను , ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.

శ్లోకం  !! వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే : పౌత్రమకల్మషం !
పరాశరాత్మజం వందే
శుకతాతం తపోనిధిం !!

వసిష్ఠమహామునికి మునిమనుమడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరమునికి పుత్రుడు, శుకమర్షికి జనకుడైనట్టియు, నిర్మలుడైనట్టి, తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి
నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, అంటారు నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు.

వ్యాసుని తల్లిదండ్రులు సత్యవతి,పరాశరుడు. వేదాలను నాలుగుభాగాలుగా విభజించి పైలుడనే శిష్యుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమిని అనే శిష్యుడికి సామవేదాన్ని, సుమంతుడనే శిష్యుడికి అధర్వణవేదాన్ని తెలిపి వ్యాప్తిచేయమని ఆదేశించాడు.నేను రచిస్తున్న ఈ మహేతిహాసంలోని విషయమే ప్రపంచంలో ఉన్నది. ఇందులో లేనిది మరెక్కడా కొంచెమైనా లేదు'- ఈ మాటలు అనాలంటే ఆ కవికి ఎంతటి ఆత్మప్రత్యయం ఉండాలి? ఆ ఇతిహాసం ఎంత గొప్పదై ఉండాలి? ఆ విధంగా అని 'నిజమే!' అని నిరూపించుకొన్న కవివృషభుడు వేదవ్యాసుడు. ఆ ఇతిహాసం మహాభారతం. శ్రీమన్నారాయణుని 21 అవతారాల్లో పదిహేడో అవతారం వ్యాసుడని భాగవతం తెలియజెబుతోంది.

ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.

ఈ రోజు ఏమి చేయాలి ??

గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి.

ఈ రోజునే చాతుర్మాస్యవ్రతాన్ని ఆరంభిస్తారు.

 ఆచార్యులవారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలనేది ఋషివచనం. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఒకప్పుడు గురుకులాలుండేవి.వాటిలో చేరిని విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే.

శ్లోకం :

"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"అంటారు. దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు.
"గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నకస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్తకబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.

గురు సందేశము :

వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది.

Saturday, July 13, 2019

కొంతమూరు లో జరిగిన ఉపనిషత్ గణపతి ప్రవచనములో కొన్ని ముఖ్యాంశాలు

శ్రీవిద్య లో శైవ ,వైష్ణవ భేదములు లేవు

గణపతి భక్తులకు ఇహము,పరము రెండూ లభిస్తాయి.
ఇక్షుసాగరం లో గణపతి వుంటారు

గణపతి ని ధ్యానం చేయాల్సిన చోటు భృమధ్య స్థానము.

సమన్వయం అంటే సరి అయిన తత్వం చెప్పటమే.

యోగము సిద్ది౦చడం అంటే షణ్మతాలను ఒకే రకం గా చూడడం.

షణ్మతముల దేవతలూ బ్రహ్మ రూపం గానే భావిస్తూ ఇష్ట దేవత ను మాత్రం ప్రధాన దేవత గానూ మిగిలిన వారిని అంగ దేవతలు గా భావించి ఆరాధించడం ఉత్తమ ఉపాసన అనిపించుకుంటుంది

గణపతి యోగుల దగ్గర  నిరంతరం ఉండే  దేముడు.

గణపతి సహస్రం సంపూర్ణ గణేశ విద్య

తపస్స్వరూపం గణపతి
అనేకం గణమై అన్నిటికీ పతి గణపతి.

ఒకానొక సిద్ధక్షేత్రం లో తప్పస్సు చేసిన భృగువంశ సంజాతుడు గణపతి ని ధ్యానించి సర్వజ్ఞానం పొందారు

లక్ష్మీదేవి తో ఉన్న గణపతి ని ధ్యానం చాలా మంచిది.
అనాధనాధం:౼ఆధారం లేని వారికి ఆధారం గణపతి

శ్రీ వక్రతుండాయ నమః సర్వులు జపించదగినది.

గణపతి ప్రధామావతారం వక్రతుండావతారం

నిధులు ఇచ్చేవాడు,అసురశక్తులను దునుమాడు వాడు,అపారమైన సంపదలు ఇచ్చేవాడు వక్రతుండుడు

వక్రం అంటే బ్రహ్మస్వరూపం.

ఎవరు గురించి చెప్పాలని మనసు పై పై కి వెళ్లి మరిచెప్పలేక కిందకి వస్తుందో అదే వక్రతుండస్వరూపం

మాయ సంపూర్ణంగా తొలగించేవాడు వక్రతుండుడు
వంకరబుద్ధులను తొలగించే ఆచార్య మూర్తి వక్రతుండుడు

సిద్ధలక్ష్మీ సహిత గణపతి ని ఆరాధిస్తే అపమృత్యువు,పాపాలుపోతాయి ,వైదికకర్మలు చేసిన ఫలం పొందుతారు.

16 గణపతులలో సిద్ధిబుద్ధులతో వున్నవాడు లక్ష్మీగణపతి.

ధన్యత అంటే పొందాల్సిన  బ్రహ్మప్రాప్తి అది ఇచ్చేవాడు గణపతి

బ్రహ్మ కే ఆత్మ గా ఎవరు ఉన్నారో ఆ రూపం సర్వ శక్తులు మేళవించుకుని గజ వదనం తో కనపడింది.

పూర్తిప్రకాశ లక్షణము గణపతి స్వరూపం
జాగ్రత్తు,స్వప్న, సుషుప్తి అవస్థలకు అతీతంగా ఉన్నవాడు గణపతి
గణపతి ని ధ్యానించి అటువంటి వానిని వేడుకుంటే వేలకొలది  అశ్వమేధయాగాలు, యజ్ఞాలు చేసినవాడు అయి మోక్ష ప్రాప్తి కలుగును.

శ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతే శ్రీ మహా గణపతే పాహి పాహి మాం|
చింతామణి ద్వీపపతి కి 🙏🙏🙏

సర్వము శ్రీగురుచరణారవిందార్పణమస్తూ

Tuesday, July 9, 2019

శ్రీ పంచమ్యై నమః.

వారాహీ దేవిని పంచమీ అనే నామంతో అర్చిస్తారు. ఆషాఢ నవరాత్రులు శ్రీ వారాహీ దేవి యొక్క నవరాత్రులు. `భజే శ్రీ చక్ర మధ్యస్థాం దక్షిణోత్తర యోస్సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం' అని శ్యామలా వారాహీ సమేత లలితాంబికను ధ్యానించే శ్లోకం. ఇందులో క్రియాశక్తికి ప్రధానంగా గల దేవత శ్రీ వారాహీ దేవి.

ఇవి జగన్నాథ నవరాత్రులు కూడా. వసంత నవరాత్రులు శ్రీ వేంకటేశ్వర స్వామికి, అమ్మవారికి కూడా ఎలా సంబంధించినవో ఇవి అలా జగన్నాథునికి, వారాహీ దేవికి సంబంధించినవి. సుభద్రా దేవి భువనేశ్వరిగా జగన్నాథుడు శ్యామలగా శక్తి ఉపాసకులు భావిస్తారు. అలాగే బలభద్రుడు క్రియా శక్తికి ప్రతీక అయిన వారాహీ దేవిగా కొలుస్తారు. అంతే కాక జగన్నాథస్వామి కాళీ దేవి రూపం కూడా. శ్రీ కృష్ణుడు కూడా కాళీదేవియొక్క రూపమే కదా.."కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో" అని భగవద్గీతలో చెప్పినట్లు. ఇక బలభద్రుడు బలరాముని రూపం. వారాహీదేవికి లాగే బలభద్రునికి కూడా హలము (నాగలి) ఆయుధం. ఈ 9 రోజులు పూరీలో రోజుకో అవతారంతో ఈ మూర్తులను అలంకరిస్తారు. అందులో ఇవాళ (పంచమి) వరాహ అవతారంతో అలంకరిస్తారు. అంతే కాక ఈ రోజున హీరా పంచమి అని ప్రత్యేక ఉత్సవం కూడా చేస్తారు. పూరీలో బలభద్రుని ధ్యానశ్లోకంలో " శాంతం చంద్రాదికాంతం ముసల హల ధరం" అని వారాహి యొక్క ముసలము, హలము రెండిటినీ ధరించిన మూర్తిగా ఇప్పటికీ పూజిస్తారు. శక్తి ఉపాసన ప్రధానంగా ఉన్న తాంత్రిక గ్రంథాలలో విస్తారంగా బలభద్రుని ప్రసక్తి ఉంది.

సాంబ్రాణి

సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చునని వారు చెప్తున్నారు.

ఆదివారం : ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే.. ఆత్మబలం, సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది.


సోమవారం: దేహ, మానసిక ఆరోగ్య వృద్ధి. మానసిక ప్రశాంతత.. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
మంగళవారం: శత్రుభయం, ఈర్ష్య, అసూయ, తొలగిపోతాయి. కంటి దృష్టిలోపాలుండవు. అప్పుల బాధ తొలగిపోతుంది. కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది.

బుధవారం : నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం, పెద్దల, మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి వుంటుంది.
గురువారం: గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి.

శుక్రవారం: లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. శుభకార్యాలు చేకూరుతాయి. అన్నింటా విజయాలుంటాయి.
శనివారం : సోమరితనం తొలగిపోతుంది. ఈతిబాధలుండవు. శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహం పొందవచ్చు.

నరదృష్టి తొలగిపోవాలంటే.. !

వారానికి ఓసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటిదృష్టి దూరమవుతుంది. శారీరక అలసట వుండదు. సోమరితనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టిన రోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటిదృష్టి తొలగిపోతుంది.
అనారోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే.. నిమ్మపండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాకిటికి ఇరువైపులా వుంచితే.. అదీ మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దృష్టి లోపాలుండవు.
అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణీ వేయడం మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంటా, వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి.. ఆదాయం లభిస్తుంది. రుణబాధలుంటే.. వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం మంచిది. కులదైవ పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరి కాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపమెలిగిస్తే మంచి ఫలితాలుంటాయి.
ఈతిబాధలు తొలగిపోతాయి. శుక్లపక్షంలో వచ్చే శని, ఆదివారాల్లో సముద్రతీరానికి వెళ్లి ఆ నీటిలో వాటర్ బాటిల్‌లో తెచ్చుకుని అందులో పసుపు పొడిని కలిపి.. ఇంట్లో, కార్యాలయంలో చల్లినట్లైతే కంటి దృష్టి తొలగిపోతుంది. ఇంకా సముద్రపు నీటిలో స్నానం చేయడం ద్వారా శరీరంలోని ఏడు చక్రాలకు బలం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.💐నరదృష్టి తొలగిపోవాలంటే.. !💐

వారానికి ఓసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటిదృష్టి దూరమవుతుంది. శారీరక అలసట వుండదు. సోమరితనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టిన రోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటిదృష్టి తొలగిపోతుంది.
అనారోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే.. నిమ్మపండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాకిటికి ఇరువైపులా వుంచితే.. అదీ మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దృష్టి లోపాలుండవు.
అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణీ వేయడం మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంటా, వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి.. ఆదాయం లభిస్తుంది. రుణబాధలుంటే.. వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం మంచిది. కులదైవ పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరి కాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపమెలిగిస్తే మంచి ఫలితాలుంటాయి.
ఈతిబాధలు తొలగిపోతాయి. శుక్లపక్షంలో వచ్చే శని, ఆదివారాల్లో సముద్రతీరానికి వెళ్లి ఆ నీటిలో వాటర్ బాటిల్‌లో తెచ్చుకుని అందులో పసుపు పొడిని కలిపి.. ఇంట్లో, కార్యాలయంలో చల్లినట్లైతే కంటి దృష్టి తొలగిపోతుంది. ఇంకా సముద్రపు నీటిలో స్నానం చేయడం ద్వారా శరీరంలోని ఏడు చక్రాలకు బలం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

తొలిఏకాదశి విశిష్టత

ఈ రోజున ఏం చేయాలి. - 12.07.2019 న -
హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే ‘‘శయనైకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’ అని పేరు.

హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే ‘‘శయనైకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’ అని పేరు. పురాణాలను అనుసరించచి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు.. అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని.. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు..

ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉంది.. కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు... పర్వదినాలు ఎక్కువగా వస్తాయి.. వాతావరణంలో మార్పులు  అధికంగా సంభవిస్తాయి కాబట్టి.. ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి.. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు,.

ఏకాదశి తిథి: కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించడంతో శ్రీ మహా విష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి.. అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి..రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందట.. అప్పటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది.. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు.

ఏకాదశి నాడు ఏం చేయాలి: ఏకాదశి నాడు ఉపవాసం ఉంది.. ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి.. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి..

పేలాల పిండి: తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు  పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి.. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలం.. కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈరోజున దేవాలయాల్లోనూ.. ఇళ్ల వద్దా పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.

అసలు మౌఢ్యమి అంటే ఏమిటి?

గురుగ్రహమే కాని,శుక్ర గ్రహమేకాని సూర్యునితో కలసి ఉండే కాలమును మౌఢ్యమి అంటారు.

మౌఢ్య కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు.అందువల్ల మౌఢ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.

శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము.మౌఢ్యమిని "మూఢమి"గా వాడుకభాషలో పిలుస్తారు. ఈమూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు.
  మూఢమి అంటే చీకటి అని అర్ధం. మూడమి అనేది అన్ని గ్రహాలకు ఉన్నగురు,శుక్ర మౌడ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది.

    శుక్రమౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది.సముద్రం ఆటు,పోటులలో మార్పులు వస్తాయి.

   శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. స్త్రీల మీద అత్యథికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి. శుక్రుడు సంసార జీవితానికి -శృంగార జీవితానికి కారకుడు. జాతకములో శుక్రుడు బల హీనముగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు.ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయండి.

💥మౌఢ్యమిలో చేయకూడని కార్యక్రమాము:💥-

      పెళ్ళిచూపులు,వివాహం ,ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, యజ్ఞాలు చేయుట, మంత్రానుష్టానం,విగ్రహా ప్రతిష్టలు, వ్రతాలు, నూతనవధువు ప్రవేశం ,నూతన వాహనము కొనుట,బావులు,బోరింగులు,చెరువులు తవ్వటం,పుట్టువెంట్రుకలకు ,వేదా"విధ్యా"ఆరంభం, చెవులు కుట్టించుట,నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయరాదు.

💥మౌఢ్యమిలో చేయదగిన పనులు💥

 జాతకర్మ
జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతులు,జప,హోమాది శాంతులు ,గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు, సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు గురుమౌఢ్యమి వచ్చినా,శుక్రమౌఢ్యమి వచ్చినా చేయవచ్చును. గర్భిని స్త్రీలు,బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో మూఢాలలో ప్రయాణం చేయాల్సి వస్తే శుభ తిధులలో అశ్వని,రేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.

శ్రీ రామ రక్షా స్తోత్రం


శ్రీరాముని ఎన్నో రకాలుగా స్తుతిస్తాము. ఈ స్తోత్రాలన్నింటిలో రామరక్షా స్తోత్రానికి ఒక ప్రత్యేక స్థానం కలదు. ఈ రామ రక్షా స్తోత్రాన్ని బుధ కౌశిక ముని రచించారు. ఈ స్తోత్రంలో 38 శ్లోకాలు ఉన్నాయి. శ్రీరాముని మనసారా భక్తి యుక్తులతో ధ్యానించి పూజించేవారు, తమకు రక్షణ నివ్వమని కోరుకునే ఈ స్తోత్రం మనస్ఫూర్తిగా నమ్మి పఠించినవారు, ఆ శ్రీరాముని కృపకు పాత్రులవుతారు.

రామరక్షా స్తోత్ర జపం భక్తి శ్రద్ధలతో చేసిన వారికి పాపాలు నశించడమే గాక, శరణాగతి వేడుకొన్న వారికి శ్రీరామ రక్ష ఎల్లవేళలా వెన్నంటి ఉంటుంది. ఈ స్తోత్రం చేసిన వారికి మానసిక ప్రశాంతత, జీవితంలో సుఖశాంతులు మరియు సంతోషము కలుగుననుటలో ఏమాత్రము సందేహము లేదు.

మానవ జీవితంలోని ఎన్నో సమస్యలను అధిగమించడానికి తగు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించే అత్యంత సులువైన భక్తి మార్గం రామరక్షా స్తోత్రం. ఎవరికైతే సమస్యలను అధిగమించాలనే సంకల్పం కలుగుతుందో, వారు నిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో పదకొండు సార్లు ఈ రామరక్షా స్తోత్ర పారాయణ చేయాలి.

నిరుద్యోగులు, శత్రుభయం కలిగినవారు, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారు, కోర్టు వ్యాజ్యాలు నడుస్తున్నవారు, ఏదైనా ఉద్యోగ లేదా వ్యాపార పరమైన సమస్యలలో చిక్కుకుని సతమతమవుతున్నవారు, మానసిక ఒత్తిడులకు గురవుతున్నవారు ఇలా ఒకటేమిటి జీవితంలో ఇబ్బంది పడే ఎటువంటి సమస్యనుండైనా బయటపడాలంటే సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఈ రామరక్షా స్తోత్ర పారాయణ చేసి, రాముని శరణు వేడితే తప్పక బయట పడి జీవితము సాఫల్యత వెంపు నడుచుటకు తగు మార్గము కనపడుతుంది.

అస్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రస్య | బుధకౌశిక ఋషిః | శ్రీసీతారామచంద్రో దేవతా | అనుష్టుప్ ఛందః | సీతా శక్తిః | శ్రీమద్ హనుమాన కీలకమ్ | శ్రీరామచంద్రప్రీత్యర్థే రామరక్షాస్తోత్రజపే వినియోగః ||

ధ్యానమ్-
ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థమ్
పీతం వాసో వసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నమ్ |
వామాంకారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభమ్
నానాలంకారదీప్తం దధతమురుజటామండలం రామచంద్రమ్ ||

స్తోత్రం-
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ |
ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనమ్ || ౧ ||

ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనమ్ |
జానకీలక్ష్మణోపేతం జటామకుటమండితమ్ || ౨ ||

సాసితూణధనుర్బాణపాణిం నక్తంచరాంతకమ్ |
స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతం అజం విభుమ్ || ౩ ||

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ |
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః || ౪ ||

కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియః శ్రుతీ |
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః || ౫ ||

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః |
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః || ౬ ||

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ |
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః || ౭ ||

సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః |
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకులవినాశకృత్ || ౮ ||

జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః |
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఖిలం వపుః || ౯ ||

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ |
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ || ౧౦ ||

పాతాళభూతలవ్యోమచారిణశ్ఛద్మచారిణః |
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః || ౧౧ ||

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ |
నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి || ౧౨ ||

జగజ్జైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితమ్ |
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః || ౧౩ ||

వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ |
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ || ౧౪ ||

ఆదిష్టవాన్యథా స్వప్నే రామరక్షాంమిమాం హరః |
తథా లిఖితవాన్ప్రాతః ప్రభుద్ధో బుధకౌశికః || ౧౫ ||

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ |
అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః || ౧౬ ||

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ |
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ || ౧౭ ||

ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ |
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ || ౧౮ ||

శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ |
రక్షః కులనిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ || ౧౯ ||

ఆత్తసజ్యధనుషావిషుస్పృశావక్షయాశుగనిషంగసంగినౌ |
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ || ౨౦ ||

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా |
గచ్ఛన్మనోరథోస్మాకం రామః పాతు సలక్ష్మణః || ౨౧ ||

రామో దాశరథిః శూరో లక్ష్మణానుచరో బలీ |
కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః || ౨౨ ||

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః |
జానకీవల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః || ౨౩ ||

ఇత్యేతాని జపన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః |
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః || ౨౪ ||

రామం దుర్వాదలశ్యామం పద్మాక్షం పీతవాససమ్ |
స్తువంతి నామభిర్దివ్యైః న తే సంసారిణో నరః || ౨౫ ||

రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్ |
కాకుత్థ్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ |
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిమ్ |
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్ || ౨౬ ||

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః || ౨౭ ||

శ్రీరామ రామ రఘునందన రామ రామ |
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ |
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ |
శ్రీరామ రామ శరణం భవ రామ రామ || ౨౮ ||

శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి |
శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి |
శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి |
శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే || ౨౯ ||

మాతా రామో మత్పితా రామచంద్రః |
స్వామీ రామో మత్సఖా రామచంద్రః |
సర్వస్వం మే రామచంద్రో దయాళుః |
నాన్యం జానే నైవ జానే న జానే || ౩౦ ||

దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ || ౩౧ ||

లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథమ్ |
కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే || ౩౨ ||

మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే || ౩౩ ||

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ |
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలమ్ || ౩౪ ||

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ || ౩౫ ||

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదామ్ |
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ || ౩౬ ||

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే |
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః |
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహమ్ |
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర || ౩౭ ||

శ్రీ రామ రామేతి రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే || ౩౮ ||

Saturday, July 6, 2019

ప్రవర యొక్క అర్ధం.

చతుస్సాగర పర్యంతం
(మానవ పరిభ్రమణానికి నలువైపులా కల మహాసముద్రాల అంచుల వరకూ)...

గో బ్రాహ్మణేభ్య శుభం భవతు(సర్వాబీష్ట ప్రదాయిణి అగు..గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ)....

×××××××. ఋషేయ ప్రవరాన్విత..
(మా వంశమునకూ..మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ..

త్యాగే నైకే అమృతత్త్వ మానశుః......
అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడనై..

×××××× గోత్రః
(మా గోత్రమునకూ..)

ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ.....
(మా శాఖకూ..అందలి శాస్త్ర మర్మంబులకు..)

శ్రీ * శర్మ నామధేయస్య
( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో..వేదాధ్యయనాది వైదిక క్రతువులతో..
1. స్నానము
2. సంధ్య
3. జపము
4. హోమము
5. స్వాధ్యాయము
6. దేవ పూజ
7. ఆతిధ్యము
8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ..త్రివిధాగ్నులు...
1.కామాగ్ని
2.క్రోధాగ్ని
3.క్షుద్రాగ్ని..
అనే త్రివిధాగ్నులను అదుపులో(సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై..పేరుకు ముందు శ్రీ అనబడే..ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన..

శ్రీ * *శర్మా అనబడే సుశ్రోత్రియుడనైన నేను..జన్మప్రధాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు..యావత్ ప్రపంచానికే మార్గదర్శకమైన వేదధర్మము ముందు.. నిరాకార నిర్గుణ అవ్యాజ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు..

అహంభో అభివాదయే..
( కేవలం నేనూ అన్నదిలేక.. సర్వం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ భాగ్యమేయన్న అహంకారభావ రహితుడనై.. నిగర్వినై..త్రికరణ శుద్ధిగా (మనసా,వాచా,కర్మణా) సాష్టాంగ పూర్వక (మానవశరీరంలోని అత్యంత ప్రాధాన్యమైన ఎనిమిది శరీరాంగములనూ శరణాగత హృదయంచే నేలపై వాల్చి సమర్పిస్తున్న)దండ ప్రణామమిదే..అన్న పరిపూర్ణమైన ఆత్మపూర్వక వేదపూర్వక హృదయపూర్వక నమస్కార భావమే.. సశాస్త్రీయమైన ఈ ప్రవరలోని..అర్ధం అంతరార్ధం పరమార్ధం కూడా..
                          స్వస్తి!

కాస్తదయచేసి మీరు చదివి తెలియని వారికి వివరించండి

ఆధునిక ప్రపంచ వైద్యులను విస్మయ పరిచే అంశం భీష్మ నిర్యాణంలో ఉంది. ప్రపంచంలో మొదటి ఆధునిక అంత్యదశసేవాశ్రమం అనే హాస్పీస్ ను 1967లో ఇంగ్లండుకు చెందిన నర్సు ఏర్పాటు చేసిందని అంటున్నారు. దీనికి ముందర క్రీస్తు శకం 11వ శతాబ్దంలో క్రైస్తవంలోని రోమన్ కేథలిక్కు వర్గానికి చెందినవారు ఏర్పాటు చేశారనే వారు కూడా ఉన్నారు. కానీ వీటన్నింటికన్నా ముందర మహాభారతంలో భీష్మనిర్యాణ ఘట్టంలో అంత్యదశసేవల గురించి అద్భుతమైన వివరణ ఉంది.

భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజులు పోరాడి ఒళ్ళు అంతా బాణాలు గుచ్చుకోగా నేలకు ఒరిగాడు. అయితే ఆయన వెంటనే చనిపోలేదు.  58 రోజులు బాణశయ్య మీద బ్రతికారు. ఆ 58 రోజుల్లో భీష్ముడిని పాండవులు చూసుకున్న తీరులో ఆధునికులు కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నింటినో తెలుపుతోంది.

భీష్మ నిర్యాణంపై ఆంధ్రవ్యాసుల వారు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘మనం చాలా తప్పు చేస్తున్నాము. సీనియర్ సిటిజన్ల పేరుతో 60 ఏళ్ళ ముద్రవేసి వారిని  పట్టించుకోవడంలేదు. కానీ విదేశాల్లో వృద్ధుల నుంచీ ఎన్నో రహస్యాలు తెలుసుకుంటున్నారు. జీవితంలో వారు గడించిన అనుభవాలను విదేశీయులు సేకరించి వారివారి రంగాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు. మనం పనికి మాలిన వాళ్ళలాగా మారిపోతున్నాం. ముసలాళ్ళు ఒక బరువు అనుకుంటున్నాము. ఎంతో విలువైన అనుభవసారాన్ని కోల్పోతున్నాము.

ప్రతీ వృద్ధుని దగ్గరా తాను పనిచేసిన రంగంలో విశేషమైన అనుభవజ్ఞానం ఉంటుంది. దాన్ని సేకరించే విభాగం ఒకటి రావాలి. నిజానికి దీనివల్ల వృద్ధులకు కూడా తమను సమాజం నిర్లక్ష్యం చేస్తోంది అనే భావన పోతుంది. మనకు దాని వల్ల వివిధరంగాలకు కావలసిన అనుభవజ్ఞానం వస్తుంది. ఈ విజ్ఞానం ఎన్ని కోట్ల రూపాయల పరిశోధనలు చేసినా దొరకదు. కేవలం వృద్ధుల దగ్గర మాత్రమే ఉంటుంది. దీనికి అద్భుతమైన ఉదాహరణ మహాభారతంలో ఉంది.

18 రోజుల యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం నాశనం అయ్యాక, దుర్యోధనుడు కూడా చనిపోయాక, ధర్మరాజు పట్టాభిషేకం ద్వారా చక్రవర్తి అయ్యాడు. ఈ సమయంలో వ్యాసుడు, కృష్ణుడు అద్భుతమైన సలహా ధర్మరాజుకు ఇస్తాడు. అప్పటికి భీష్ముడు ఇంకా జీవించే ఉన్నాడని ధర్మరాజుకు గుర్తు చేస్తూ అపారమైన జ్ఞాన సంపద ఆ కురువృద్ధుడి దగ్గర ఉందని ఆయన గతిస్తే ఆయనతో పాటే ఆ మహావిజ్ఞానం అంతరిస్తుందని, కనుక వెళ్ళి తాతను సేవించి తెలుసుకోమని వ్యాసుడు, కృష్ణుడు సలహా ఇస్తారు.

వారి సలహా వల్ల భారతంలోనే అతి పెద్ద పర్వం శాంతి పర్వం పుట్టింది. అందులో భీష్ముడు చెప్పిన విషయాలు సకల శాస్త్ర సారాలు. విష్ణుసహస్ర నామం కూడా అందులోదే. కనుక వృద్ధులను సేవించడం వలన సమాజానికి ఎం ప్రయోజనం ఉంటుందో భారతం తెలుపుతోంది‘‘ అని అన్నారు. ఆంధ్రవ్యాసుల వారి మార్గదర్శకత్వంలో    మరింత లోతుగా పరిశోధన చేస్తే అద్భుతమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

1) భీష్ముడు క్రింద పడగానే వేలాది కన్యలు (నర్సుల) వచ్చి ఆప్రదేశాన్ని శుభ్రంచేసి గంధపు పొడి, పేలాలుచల్లి, పూవులతో అలంకరించారు.

2) భీష్ముడి దగ్గరకు ఎవరెవరు వచ్చారో వ్యాసుడు వివరంగా చెప్పాడు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
తూర్యాణి శతసంఖ్యాని తథైవ నటనర్తకాః।
శిల్పినశ్చ తథాఽఽజగ్ముః కురువృద్ధం పితామహం ॥
భీష్ముడి దగ్గరకు సంగీత వాయిద్యాలు వందల సంఖ్యలో తీసుకొని గాయకులు, నటులు, నర్తకులు, శిల్పులు (ఇంజనీరింగు విభాగంవారు) వచ్చారని వ్యాసుడు చెప్పాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశం.

రోగి వేరు అంత్యకాలంలోని వ్యక్తి వేరు. చికిత్స ఉన్నంత కాలమే ఒక వ్యక్తి రోగి అవుతాడు. చికిత్స లేనప్పుడు అతడు పేషంటు కాడు. అతడికి చేయాల్సిన వైద్యం అంత్యకాల సేవ. అది వేరే ఉంటుంది. అదే ఆరోజున భీష్ముడికి చేశారు. అంత్యకాలంలో ఉన్న భీష్ముడికి ఆనందం కలిగించడం కోసం నటులు, నర్తకులు, గాయకులు, సంగీతకారులు వచ్చారు. నేడు కూడా ఆసుపత్రులలో సైతం టివిలు, మ్యూజిక్ సిస్టంలు ఉంచుతున్నారు. ఇక పాలియేటివ్ కేర్ సెంటర్లలో అయితే అంత్యకాలంలో వారు ఆడుకోవడానికి ఆటవస్తువులు కూడా ఉంచుతున్నారు.

ఇక్కడ అతిముఖ్యమైన అంశం ఏమిటంటే భీష్ముడి దగ్గరకు వారంతా వచ్చారు. అంతేకానీ వారు ఎవరు సంగీత వాయిద్యాలను వాయించారని కానీ, నటులు, నాట్యకారులు నాట్యం చేశారని కానీ చెప్పలేదు. దీనికి కారణం భీష్ముడు తాను మానవ భోగాలకు అతీతుడను అయ్యాను అనినందువల్ల.
అయితే వేల సంవత్సరాల క్రితం భారతంలో పాలియేటివ్ కేర్ పురుడుపోసుకుందని చెప్పడానికి ఇది రెండో అతి ముఖ్యమైన శ్లోకం భీష్మపర్వంలో ఉంది.

3) దీని తరువాత అతి ముఖ్యమైంది శాంతిపర్వంలో ఉంది. ‘‘భీష్ముడి మరణశయ్య దగ్గరకు భూమి మీదే కాక ముల్లోకాల్లో ఉన్న మహర్షులు, యతులు, పరమహంసలు, దేవతలు వచ్చారు. వారిలో నారదాది సంగీతవిద్వాంసులు ఉన్నారు. శ్రీకృష్ణుడు చూడడానికి వచ్చి భీష్ముడి బాధలు పోగొట్టగానే  వ్యాస మహర్షితో కూడిన సమస్త రుషి గణాలూ రుగ్, యజుస్, సామగానాలు చేశారు. అన్ని రుతువులకు చెందిన పుష్పాలు ఏక కాలంలో కురిశాయి. దేవతలు, అప్సరసలు వచ్చి సంగీత వాయిద్యాలు మ్రోగించి గానం చేశారు. పవిత్రమైన, ప్రశాంతమైన, స్వచ్ఛమైన చల్లటి గాలి వీచింది. ఆ ప్రాంతంలో ఉన్న సమస్త జంతు పక్షిజాతి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాయి. భీష్మునికి అత్యంత ఆనందదాయకమైన వాతావరణం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడు సూర్యాస్తమయం చూసి రేపు వస్తానని వెళ్ళాడు.‘‘

ఇక్కడ ఇచ్చిన ప్రతి వర్ణన అంత్యదశసేవల్లో చాలా ముఖ్యమైంది.
దీనిలో, రెలిజియస్ హీలింగ్, యోగా, మ్యూజిక్ థెరపీ, పుష్పవైద్యం వంటివి ఉన్నాయి.

తతస్తే వ్యాససహితాః సర్వ ఏవ మహర్షయః।
ఋగ్యజుఃసామసహితైర్వచోభిః కృష్ణమార్చయన్॥
తతః సర్వార్తవం దివ్యం పుష్పవర్షం న భస్తలాత్।
పపాత యత్ర వార్ష్ణేయః సగాంగేయః సపాండవః॥
వాదిత్రాణి చ సర్వాణి జగుశ్చాప్సరసాం గణాః।
న చాహితమనిష్టం చ కించిత్తత్ర వ్యదృశ్యత॥

అన్నిటికీ మించి పేషంటుకు ఉన్న విజిటర్స్ సమయాన్ని మహర్షులు కూడా గౌరవించి అస్తమయం అవుతుండడంతో మరలా రేపు వస్తానని కృష్ణుడు, ధర్మరాజు, భీష్ముడు వద్ద శలవు తీసుకొని  వెళ్ళిపోయారు. ధర్మరాజు, కృష్ణుడు కూడా వెళ్ళిపోయారు.

4) ఇక్కడ అతి ముఖ్యమైన వర్ణన వ్యాసుడు చేస్తాడు. పాండవుల రథాలు వెళ్ళిన తీరు మహానదిని తలపించిందని చెప్పాడు.

తతో రథైః కాంచనచిత్రకూబరై
ర్మహీధరాభైః సమదైశ్చ దంతిభిః।
హయైః సుపర్ణైరివ చాశుగామిభిః
పదాతిభిశ్చాత్తశరాసనాదిభిః॥

యయౌ రథానాం పురతో హి సా చమూ
స్తథైవ పశ్చాదతిమాత్రసారిణీ।
పురశ్చ పశ్చాచ్చ యథా మహానదీ
తమృక్షవంతం గిరిమేత్య నర్మదా॥

ఈ వర్ణన చదవకపోతే తరువాత ధర్మరాజుకు ఉన్న మహత్తరమైన విజ్ఞానం మనకు అర్థం కాదు.

5) మర్నాడు ధర్మరాజు ఉదయాన్నే భీష్ముని దర్శనానికి వెళుతూ అర్జునుడిని పిలుస్తాడు. పిలిచి ఇలా అంటాడు. ‘‘ అర్జునా ఈ రోజు ఏవిధమైన మందీ మార్బలం, సైన్యం లేకుండా నేను సోదరులతో మాత్రమే వెళ్లదలచాను. మన అశ్వగజరథ సైన్య పరివారం వెళ్ళివస్తూ ఉండడం వలన అంపశయ్యమీది భీష్ముడికి ఇబ్బంది కలుగకూడదు. కనుక సైన్యాన్ని, భటులను వద్దని చెప్పు. ఈ రోజు నుంచీ నేను భీష్ముడి దగ్గర ముఖ్యమైన రహస్యాలు తెలుసుకోబోతున్నాను. కనుక అనవసరమైనవారు అక్కడ జమకూడడం నాకు ఇష్టంలేదు‘‘ అన్నాడు.

న సైనికైశ్చ యాతవ్యం యాస్యామో వయమేవ హి।
న చ పీడయితవ్యో మే భీష్మో ధర్మభృతాం వరః

ఇది నేటికీ ఆచరించదగిన ముఖ్య విషయం. ఎవరైనా గొప్ప వ్యక్తి చనిపోవడమో, జబ్బుపడడమో జరిగితే ముందుగా ట్రాఫిక్కు పోలీసుల గుండెలు ఆరిపోతాయి. వచ్చేవారు పలకరించడానికి వస్తున్నారా? లేక తమ హోదాలు వెలగబెట్టుకోవడానికి వస్తున్నారో తెలియని సందర్భాలు కోకొల్లలు. భారీగా వాహనాలు రోడ్ల మీద పార్కుచేసి ట్రాఫిక్కు స్తంభింపచేయడంతో మొదలుపెడితే గన్ మెన్లు హోషు చూపించుకోవడం, బుగ్గకార్ల హడావుడి--- ఇదంతా చూస్తే ఎంత నీచంగా ఉంటుందో ఒక సారి ఎవరికి వారు గమనించుకుంటే మంచిది.

శ్రీకృష్ణుడు కూడా శైబ్య, సుగ్రీవ, వలాహక, మేఘపుష్ప అనే తన రథాశ్వాలను శబ్దం లేకుండా వెళ్ళమని ప్రార్థించాడట. ఆ పశువులైన ఆ గుర్రాలు మహావేగంతో పయనించినా భూమి మీద అతి సుకుమారంగా వెళ్ళాయని వ్యాసుడు చెప్పాడు. నేడు ఆసుత్రుల దగ్గరకు వాహానాలలో వెళ్ళేవాళ్ళు ఆ గుర్రాలను చూసి బుద్ధి తెచ్చుకుంటే మంచిది. ఆసుపత్రి ఏరియా దయచేసి హారన్ మ్రోగించవద్దు  అనే బోర్డు ఎవరూ పట్టించుకోరు. లోపల మరణావస్థలో ఉన్నపేషంట్ల వినికిడి అవయవాలు మహాబాధపెడతాయని ఎప్పటికి బుద్ధి వస్తుందో నేటి వాహన చోదకులకు?

ఆగచ్ఛత్స్వథ కృష్ణోఽపి పాండవేషు మహాత్మసు।
శైనేయసహితో ధీమాన్రథమేవాన్వపద్యత॥
రథస్థాః సంవిదం కృత్వా సుఖాం పృష్ట్వా చ శర్వరీం।
మేఘఘోషై రథవరైః ప్రయయుస్తే నరర్షభాః॥
బలాహకం మేఘపుష్పం శైబ్యం సుగ్రీవమేవచ।
దారుకశ్చోదయామాస వాసుదేవస్య వాజినః॥
తే హయా వాసుదేవస్య దారుకేణ ప్రచోదితాః।
గాం ఖురాగ్రైస్తథా రాజఁల్లిఖంతః ప్రయయుస్తదా॥
తే గ్రసంత ఇవాకాశం వేగవంతో మహాబలాః।
క్షేత్రం ధర్మస్య కృత్స్నస్య కురుక్షేత్రమవాతరన్॥

మహాభారతం నేడు కూడా ఎందుకు అనే ప్రశ్నకు ఈ శ్లోకాలు చాలు. ఎంత నిర్లజ్జగా మనం నేడు బ్రతుకుతున్నామో తెలియడానికి. వేల సంవత్సరాల క్రితం మరణశయ్యమీద వ్యక్తి దగ్గరకు ఎలా వెళ్ళాలో చెప్పిన మరో గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదు. లక్షాపదివేల శ్లోకాల్లో ఏం ఉందో చదువుకుంటే మనిషిగా మనం ఎంత పశుప్రాయంతో జీవిస్తున్నామో తెలుస్తుంది. నేడు దౌర్భాగ్య ప్రభుత్వాల కారణంగా సంస్కృతం అడుగంటి భారతంలో ఏం ఉందో చదివి తెలుసుకోలేక  బ్రతుకుతున్నాము. ఏ అమెరికా, ఇంగ్లండు వారో హాస్పీస్ సేవలు మా దగ్గరే పుట్టాయి అంటే నిజమే కాబోలు అనుకునే జాతి తయారైంది.

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...