Tuesday, June 27, 2017

Excerpt from "Shree Vidya", loni Guru parampara Rahasya Mantra vibhagam.....

1. గురువు ను దూషణ గాని పరిహాసము గాని చేయరాదు.
2. గురువును మన ఆలోచనలకు సరిపడ నడవమని చెప్పరాదు.
3. గురువు వద్దనుండి ధనము ఇచ్చి పుచ్చు కోకూడదు.
4. గురువుకు నచ్చనివారితో సహవాసమును చేయరాదు గురు దూషణ కూడ చెవులతో వినరాదు
5. గురువు చెప్పే మాట చేసే పని విరుధ్ధం గా ఉన్నా కూడా వారు చెప్పిన దాన్ని పాటించడమే
6. గురువు కూడా మనలాగ మనిషి అని తెలుసుకుని వారి తప్పులెంచకూడదు
7. గురువే భగవంతుని రూపముగా భావించాలి కాని సందేహం కూడదు.
8. గురువు వద్ద సమర్పణలో ఏరకమైన లోపము లోభము ఉండకూడదు
9. గురు ఆజ్ఞను లోకమునకు భయపడి ఆచరించకుండా ఉండరాదు
10. అందరి ముందు గురువుకు నమస్కారం చేయడానికి సిగ్గు పడకూడదు.
11. గురువును చాలా కాలము చూడకుండా ఉండకూడదు.
12. గురు పాదుక ఇచ్చారు కదా ఇక గురువెందుకు అని నిర్లక్ష్యం చేయకూడదు
13. గురువు నుండి ప్రత్యేక ఫలితంకోసం మంత్రము అడగకూడదు . నాకు ఆమంత్రం ముందే తెలుసు అనకూడదు.
14. గురువు వద్ద నాకు మంత్రం ఓక  విధంగాను వేరొకరికి వేరే విధంగాను ఎందుకు ఇచ్చారని అడగకూడదు. మంత్రం ఇంత చిన్నగా ఉంది అని అడగకూడదు.
15. గురువుతో వేరే శిష్యులు దగ్గరగా చనువుగా ఉండటం గురువు వారికి చేసే ఉపచారాలు ఉపేక్షణలు చూసి అసూయపడకూడదు .
16. గురువు తో వేరొకరు మాటలాడునది ఏమిటి అని తెలుసుకొనుటకు ప్రయత్నించరాదు.                      
గురువు మార్గదర్శి మాత్రమే. సాధన మనమే చేయాలి.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...