Tuesday, June 13, 2017

లలితా సహస్రం

లలితా సహస్రనామస్తోత్రం అని చాలామందికి తెలుసు. కాని దాని అసలు పేరు లలితా రహస్యనామస్తోత్రం. ఎందుకనగా జగన్మాత యొక్క ఈ వెయ్యి నామములకు రహస్యమైన అర్థములు ఉన్నాయి. ఈ నామములు మానవ కల్పితములు కావు,కవి విరచితములు కావు.ఇవి స్వయానా జగన్మాత యొక్క పరివారశక్తులైన వశిన్యాది వాగ్దేవతలచే చెప్పబడినట్టి దివ్య నామములు మరియు మంత్రములు.

లలితా సహస్రనామ పారాయణ మాహాత్మ్యం ఇంతా అంతా కాదు.భక్తితో పారాయణ చేస్తే సద్యోఫలితం ప్రాప్తించటం మనం నిదర్శనంగా చూడవచ్చు. సాక్షాత్తూ జగన్మాత అనుగ్రహం పొందగలిగితే ఇక మానవజన్మకు అంతకు మించిన పరమప్రయోజనం ఉండదు.ఈ సహస్రనామములలో ఎన్నో ఆరాధనావిధానాలు,ఉపాసనాపద్దతులు,యోగ,తంత్ర రహస్యాలు సూక్ష్మంగా ఇమిడి ఉన్నాయి.(ఇంకా ఉంది)

ఏ శక్తి చరాచర ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములను చేస్తూ ఉన్నదో ఆ శక్తియే జగన్మాత అనగా పరాశక్తి. ఈ ప్రక్రియతో సంబందంలేని నిశ్చల మైన స్థితిలో ఉన్న అదే శక్తిని పరమశివుడు అని తంత్రములు పిలిచాయి. కనుక శివుడు శక్తి అభేదములు. రక రకాలయిన మతాలు రక రకాలయిన పేర్లతో పిలుస్తున్నది ఈ శక్తినే గాని వేరొకటి కాదు.

ఆ జగన్మాత యొక్క వెయ్యి దివ్య నామములే లలితా సహస్ర నామములు. 'లలితా' అనే నామమే అత్యంత మనోహరమైనట్టిది.సమస్త చరాచర సృష్టికి ఆధారమైనట్టి శక్తి 'లలిత'.అనగా లలితమైన స్వరూపం కలిగినట్టిది. ఆర్ద్రమైనట్టి తత్వము కలిగినట్టిది.భయంకరమైన శక్తి కాదు.శరత్కాల చంద్రుని వలె లలితమైనట్టి శక్తి. చల్లని చూపులతో తన బిడ్డలను కాపాడుతూ ఉండే ఆధారశక్తి. భగవంతుని తల్లిగా భావించటం భారతీయ మతంలోని విశిష్టత.

ఈ రహస్య నామములలోని రహస్య ప్రక్రియలను తెలుసుకోలేక పోయినా ఆచరించలేక పోయినా, కనీసం సాత్వికమైన భక్తితో పారాయణ చేసి ఆ జగన్మాతను ప్రార్ధిస్తే తప్పక మన గమ్యాన్ని చేరగలం. ఇక ఆ రహస్యములు తెలిసి ఆచరించే వారి పని వేరే చెప్ప వలసిన పని లేదు. ఈ భూమిపైన వారే నడిచే దేవతలని చెప్ప వచ్చు.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...