Tuesday, June 13, 2017

మనిషికి ఈ దేహం నూరేళ్ళు అద్దెకు తీసుకున్న గది లాంటిది ...కీర్తి కాయం !

====^====^====^====^====^====
ప్రతి   ప్రాణి  పుట్టుకతోనే  శరీరం కలిగి ఉంటుంది
అది దైవ దత్తం  అణువుకన్నా  చిన్నదిగా మొదలయ్యే
మనిషి శరీరం అడుగులుగా  ఎదుగుతుంది
ఈ. క్రమంలో  ఎన్నో  అనుభవాలు  నీటి అలల్లా
మనిషిని  ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
చల్లటి చిరుగాలుల్ని  మోసుకొచ్చి  మనసును
ఆహ్లాదపరచే  కెరటాలు  . కొన్ని  ఉన్నపళంగా
ముంచెత్తాలని  ప్రయత్నించే  సమస్యల సుడిగాలులు
మరికొన్ని  సుఖదుఃఖాలన్నింటినీ ఆస్వాదించాల్సింది
అనుభవించాల్సింది  __ చిలక లాంటి  ఆత్మ. కాదు
పంజరం  లాంటి  దేహం  ......

లోతుగా  ఆలోచిస్తే  ఈ. దేహం  పర హితం
కోసమే  ఉంది   రవ్వంతైనా స్వార్థానికి తావులేదు
పక్షులు  జంతువులు  వృక్షాలు  సైతం  ఇతర ప్రాణులకు
ఏదో ఒక. రూపంలో  ఉపయోగపడుతున్నాయి
ప్రయోజనకరంగా  రూపాంతరం చెందుతున్నాయి
మనిషికి  ఈ దేహం  నూరేళ్ళు అద్దెకు తెచ్చుకున్న
గది లాంటిది   అనేకులు  ఈ. వాస్తవాన్ని  గుర్తించ
లేకపోతున్నారు  ఈ. శరీరమే  శాశ్వతమని భావిస్తూ
స్వార్థ. జలధిలో  మునకలేస్తున్నారు

పాప పుణ్యాల ఫలితం తెలిసిన. యోగులు
పండితులు  యథార్థాన్ని  గ్రహించి  ఉత్తమ
కార్యచరణ. సాగిస్తున్నారు  అనిత్యమైన. ఈ
దేహంతోనే  నిత్యం  నిర్మలం అయిన యశః
శరీరాన్ని  ధరించినవారే  ఆదర్శనీయులు

బిడ్డను  భూమి పైకి  తేవడానికి  అమ్మ. ఎంత
ప్రసవ వేదననైనా  భరిస్తుంది  , అలాగే  ప్రతీ వ్యక్తి
కీర్తి శరీరం  పొందడంలో కలిగే   కష్ట నష్టాల్ని
చిరునవ్వుతో  ఎదుర్కోవాలి  చిన్నతనం  నుంచి
అలవరచుకొనే  నైతిక. విలువలే  మనిషిని
సన్మార్గంలో  నడిపిస్తాయి   ....
శివా  నీ దయ తండ్రి  ...  

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...