Wednesday, January 2, 2019

మంత్రోచ్ఛారణతో రోగనిరోధక శక్తి పెరుగుతుందా ?

పురాతన శాస్త్రాలైన వేదాలను ఆయుర్వేదంతో సమానంగా పోలుస్తారు. ఎందుకంటే కొన్ని వేద మంత్రాలను ఉచ్చరించటం వలన శరీరంలో కొన్ని రకాల శక్తులు ఉత్పన్నం అవుతాయి. అలాగే ధ్యానం చేసినప్పుడు కూడా శరీరానికి నూతన ఉత్తేజం రావటం మనం గమనిస్తూ ఉంటాం.

వేద మంత్రాలను ఉచ్చరించటం వలన ఆధ్యాత్మిక భావన కలగటమే కాకుండా శరీర కీలక అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా అందం, ఆరోగ్యం పెరగటమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మంత్రాలను ఉచ్చరించటం వలన స్వరపేటిక,నాలుక, పెదవులు, స్వర తంత్రుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి ముఖ్యమైన అవయవాలపై ఒత్తిడిని కలిగిస్తాయి.

ఈ ఒత్తిడి హైపోథాలమస్ గ్రంథి మీద పనిచేయటం వలన రోగ నిరోధకతతోపాటు అనుకూలమైన హార్మోన్లు విడుదల అయ్యి శరీరం అంతా ఉద్దీపన కలగటం వలన అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది.

మంత్రాలను ఉచ్చరించటం వలన శరీరంలోని చక్రాలు ఉత్తేజితమై అవయవాలు వాటి విధులు సక్రమంగా నిర్వహిస్తాయి. ఆ తర్వాత శరీరం తన విధులను సక్రమంగా నిర్వహించటం వలన శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ బాగా సరఫరా అయ్యి రక్తం ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. దాంతో గుండె పనితీరు బాగుంటుంది.

గృహప్రవేశం ఎందుకు చేసుకోవాలి?

భారత దేశంలో రెండు రకాల గృహప్రవేశాలు జరుపుకుంటారు. మొదటి గృహప్రవేశం, క్రొత్త పెళ్ళికూతురు పుట్టింటి నుండి అత్తవారింటికి వచ్చినప్పుడు ఘనంగా జరుపుకునేవారు. ఈ రోజుల్లో కొందరు పెళ్ళికి ముందే కలసి జీవిస్తున్నారు. లేకపోతే, అదో పెద్ద కార్యక్రమమే. ఈ ఆచారాన్ని ఇంత పవిత్రంగా ఎందుకు భావిస్తామంటే, మీ ఇంట్లోకి అడుగు పెట్టే స్త్రీ మీ భవిష్యత్తునీ, మీ సంతానాన్నీ, వారి జీవనశైలిని నిర్ణయిస్తుంది. అందుకే మరి ఆమె మీ ఇంట్లోకి ఎంతో ప్రేమతో అడుగు పెట్టడం, తనను తాను ఇంటికీ, కుటుంబానికి సమర్పించుకోవటం ముఖ్యం. ఆమె అన్య ఆలోచనలతో, ఉద్దేశ్యాలతో అడుగిడితే అనేక రకాలుగా హాని కలగవచ్చు. ఇలా కాలు మోపితే గర్భవతి అయినప్పుడు, దోష పూరిత జీవికి ప్రాణం పోసి, అటువంటి సంతానానికే జన్మనిస్తుంది. అలాంటి సంతానం, మిమ్ము జీవితాంతం బాధపెడుతూనే ఉంటుంది. అందుకే మన పూర్వీకులు ఇలా జరగకుండా ఉండేందుకు కొత్త పెళ్లి కూతురిని ఎంతో సాదరంగా, గౌరవ మర్యాదలతో, శుభలగ్నంలో ఇంట్లోకి ప్రవేశ పెట్టేవారు.

నిజానికి ఇది ఎంతో ఆచార వ్యవహారాలతో కూడిన శుభకార్యం. కానీ ఇప్పుడు అవన్నీ మాయమై పోయాయి. పెళ్లి కాకమునుపే స్త్రీ తనకు కాబోయే భర్త ఇంట్లోకి ప్రవేశిస్తోంది. అందువల్ల ఈ రోజుల్లో ఆమె ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తోంది అన్నది ఒక పెద్ద విషయం కావటం లేదు. అసలు ఈ రోజుల్లో వివాహమంటే స్త్రీ పురుషుల మధ్య ఒక ప్రేమ వ్యవహారం మాత్రమే అయిపోయింది. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. ఒక జంట మధ్య ఉండే అపురూపమైన అనుబంధమే వారి భావిజీవితాన్నీ, సంతానాన్నీ నిర్ధారిస్తుంది. అందుకే మరి క్రొత్త పెళ్ళికూతురు యొక్క గృహప్రవేశం సవ్యంగా జరగడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారు. గృహప్రవేశంలో ఇది మొదటి రకం.

ఇక రెండవది, ఏదైనా ఒక కొత్త నిర్మాణం జరిపినప్పుడు దాన్ని నివాసయోగ్యం చేసే ప్రక్రియే గృహప్రవేశం. మన కొత్త ఇల్లు ఎంతో బాగుండాలని కోరుకోవడం సహజం. ఇంటి ప్లానూ, కట్టుబడి, రంగులు వేయడం, అన్నీ ముఖ్యమే. అంతకన్నా ఆ స్థలంలో ఎటువంటి శక్తి ప్రభవిల్లుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒక విధంగా చూస్తే గృహప్రవేశం ఒక చిన్న ప్రతిష్ట లాంటిదే. ఇలా గృహప్రవేశం చేయకుండా ఎవరూ ఇంట్లో చేరేవారు కాదు. ఇవన్నీ కూడా ఇంట్లో జీవశక్తిని పెంపొందించి, అందులో నివసించేవారి పురోభివృద్ధికోసమే.

ప్రజలు తమకు తెలిసిన రీతిలో ఈ ప్రాణ ప్రతిష్ట చేసి, ఆ తరవాతే ఆ ఇంట్లో నివాసానికి చేరేవారు. పూర్వం, రాజులు ఉదార స్వభావులూ, ప్రజాహితం కోరుకునేవారు ఐతే ఊరు మొత్తానికీ ప్రాణప్రతిష్ఠ చేసేవారు. అలా రాజ్యమంతటా ప్రాణ ప్రతిష్ట చేసిన స్థలాలు కనిపిస్తాయి. ఎందుకంటే అందరూ అటువంటి చోట్ల నివసించడం మంచిదని వారికి తెలుసు. ప్రజలు వీధుల్లో నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఎలా ఉన్నా ఈ జీవభరిత స్థలంలోనే వారి జీవనం ఉండేది. ఎందుకంటే అద్భుతమైన శక్తివంతులూ, మేధావులూ, సమర్ధులూ తయారవ్వాలంటే ఇటువంటి స్థలాలు ఎంతో అవసరం. ఇలా కానీ పక్షంలో తమ వ్యక్తిగత సామర్ధ్యాన్ని బట్టి ఎక్కడో ఒకరో, ఇద్దరో ఏదో సాధించగలరేమో గానీ, ఒక అద్భుతమైన తరాన్నే సృష్టించలేము.

అంటే అనాది నుండి మన సంస్కృతిలో ప్రాణ ప్రతిష్ట చేయని స్థలాలు మనుషులకు నివాసయోగ్యం కాదనుకునే వారు. మనం మొక్కను భూమిలో నాటితే అది సారవంతమైన మట్టి ఐతేనే పూలూ, పండ్లూ వస్తాయి. భూమి నిస్సారమైనదీ, తగినంత సారవంతం చేయబడనిదీ అయితే, పూలూ, పళ్ళూ రావు. వచ్చినా చాల తక్కువే, అది ఎప్పుడూ అంత ఫలవంతం కాదు. అందుకే ఈ జీవన విధానాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. దీనివలనే మన సంస్కృతి అపార జ్ఞానాన్నీ, ఆత్మ సాక్షాత్కారం పొందిన మహానీయులనూ ఇచ్చింది. ఇలాంటి అనేక విషయాలపై శ్రద్ధ తీసుకున్నారు కాబట్టే ప్రతి తరంలోను ఇలాగే ఉండేది. ప్రపంచంలో మరే సంస్కృతిలోనూ ఏ ఒక్క తరం వారూ అంత మహోన్నత శిఖరాలను చేరుకోలేదు.

దురదృష్టవశాత్తూ గత 800 సంవత్సరాలుగా ఈ విషయం పూర్తిగా దెబ్బతిన్నది. పూర్వం దాదాపు ప్రతీ కుటుంబానికీ ఇంట్లో చేరక ముందు గృప్రవేశం చేసుకునే అదృష్టముండేది. ప్రతి ఇంటిలో నియమిత కాలంలో ఇంటి ఉన్నతి కోసం అవసరమైన సంస్కార కర్మలు చేసేవారు. ఈ కావలసిన సంస్కార కర్మలు కనీసం ఏడాదికి ఒకసారన్నా ఇంటి ఉన్నతి కోసం చేసేవారు. మనిషి పూర్తి సామర్ధ్య వికాసానికి సరైన వాతావరణం కల్పించడం అవసరమని తెలుసు కోవడం వల్లే ఇలా చేసేవారు.

పూర్తి సామర్ధ్యమంటే ఈ కాలం వారికి ఎంత డబ్బు సంపాదించగలరు అనే. దురదృష్ట వశాత్తూ ఆధునిక యుగంలో సాఫల్యం అంటే చాల వికృతంగా, మోటుగా తయారయింది. నువ్వు సామాజికంగా ఎంత ఎదుగ గలవు? ఎంత సంపాదించగలవు? ఇదే విజయానికి నిర్వచనం.

పూర్వకాలంలో విజయమంటే ఇదికాదు. అది చాల సర్వతోముఖమైనది. ఎవరైనా కొంత ఎరుక ఉన్నవారు, తన గురించి, తను ఉన్న ప్రపంచం గురించి తెలిసిన వారినే సమర్ధవంతులు అనేవారు. సామాజికంగా గౌరవింపబడినవారూ, ఆర్ధికంగా వృద్ధిచెందిన వారూ, సంఘంలో, కుటుంబంలో, స్నేహితుల దగ్గర, ప్రేమ చూరగొన్నవారినే సమర్ధవంతులు అనేవారు, మరి సమాజం కూడా అలానే చూసేది. ఎంత సంపాదించినా, ప్రజల ఆదరాభిమానాలు లేకపోతే, ఆ జీవితం నిరర్ధకమనేవారు. క్రిందటి తరం వరకూ, “ఎంత సంపాదిస్తే ఏమిటి? నీవు ఇతరుల ప్రేమాభిమానాలు పొందావా? నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ప్రేమిస్తున్నారా?” అని అంటుండేవారు. అదే అన్నిటి కన్నా ముఖ్య మైనది. కాని గత 30, 40 ఏళ్ళలో దీనిని చాలవరకూ పెకలించి వేశాము.

గృహప్రవేశమంటే ’మీరు’ అనే ఈ మొక్క బాగా పెరిగి, పండ్లూ, పూలూ ఇచ్చేందుకు అవసరమైన సారవంతమైన నేలను సమకూర్చుకోవటం లాంటిది. దురదృష్టవశాత్తూ వీటిని నిర్వహించేవారు అసలు వీటిని ఎందుకు చేస్తున్నారో గ్రహించి, దాని ప్రకారం వీటిని నిర్వహించే బదులు, ఏదో మొక్కుబడిగా నిర్వహించేసి ఈ గృహప్రవేశమనే ప్రక్రియనే పాడుచేస్తున్నారు. అందుకే ప్రజలు ఇటువంటి పద్ధతులను వదిలేస్తున్నారు. ఈ కాలంలో క్రొత్త ఇంట్లోకి చేరటమంటే ఒక విందు ఇవ్వటం, అందులో అందరూ మితిమీరి తినటం, త్రాగటం. దీనివల్ల మీరు పురోభివృద్ధి చెందటం లేదు. మీ పురోభివృద్ధి ఇంకా కష్టతరమవుతోంది.

ఎంత విద్య ఉన్నా, డబ్బు ఉన్నా సుఖం చేకూరదు. అది మీరు ఈ ప్రపంచంలో గమనించవచ్చు. సంపన్న సమాజాలు బాగా ఏమి బ్రతకటం లేదు. ఎందుకంటే వారు అసలు విషయాలను సరి చేసుకోవడం లేదు. మీరు బాగా ఉండటానికి మీ చుట్టూ వాతావరణం బాగుచేసుకోవడం ముఖ్యం.

స్వర్గారోహిణి

#స్వర్గారోహిణి (స్వర్గానికి రోడ్డు అనబడే పర్వతం)
     పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి.
భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చు అనడానికి ఏకైక మార్గం ఇదే.

#మన :
బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరం లో వుండే చిన్న గ్రామం. భారతదేశ ఆఖరి గ్రామం ఇదే. ఇక్కడి నుండే ఒకవైపు టిబెట్ ప్రారంభ అవుతుంది.

ఈ గ్రామ చివరన సరస్వతి నది మనకు కన్పించే ప్రాంతం ఉంటుంది. ఇక్కడి నుండి కొంత దూరం ప్రవహించాక అలకనంద నది లో కలిసి అంతర్వాహిని గా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతి మాత ఆలయం కుడా ఉంటుంది.

ఈ సరస్వతి నది పక్కన  #భీమపుల్ అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది.

పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు అంటారు.

ఈ రాతిమీద భీముని వేలిముద్రలు వున్నట్లు గా పెద్ద పెద్ద అచ్చులు కుడా వుంటాయి.

ఈ వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం ప్రారంభం అవుతుంది.

మన నుండి చట్మోలి 8km

మార్గ మాధ్యమం లో #భృగుమహర్షి_ఆశ్రమం కన్పిస్తుంది.

తరవాత #మాతమూర్తి ఆలయం కన్పిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్నతల్లి గా కుడా చెప్తారు.
ఈ ప్రాంతం 14000 అడుగుల ఎత్తులో ఉంటుంది.

తర్వాత కుబేర్ మకుట్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతం గా తీసుకున్నట్లు చెప్తారు.

ఇక్కడి నుండి 5km ప్రయాణం చేసాక
 #వసుధార_జలపాతం వస్తుంది.
ఇక్కడే అష్ట వసువులు ( భీష్ముడు ఆఖరివాడు) దాదాపు 1000 సం తపస్సు చేసినట్లు చెప్తారు.
ఈ జలపాతం దాదాపు 120మీ ఎత్తునుండి పడుతుంది.
ఇక్కడ గాలులు బలం గా వీస్తుండడం చేత ధార చాల పలుచగా నీటి తుంపర లవలె పడుతుంది.
అందుకే పాపులపై ఈ జలధార పడదు అని చెప్తారు.

చట్మోలి:

తర్వాత చట్మోలి ( 12000 అ ఎత్తులో ) అనే అందమైన పచ్చని బయళ్ళు వుండే ప్రాంతానికి చేరుకుంటాం.
పర్వతారోహకులకు ఇది ఒక విడిది ప్రదేశం.

ఇక్కడే సతోపంత్ మరియు భగీరధ్ కర్క్ అనే రెండు నదులు ( హిమానీనదాలు ) కలిసి #అలకనంద గా ఏర్పడతాయి.
అక్కడి నుండి ముందుకు వెళితే ధనో హిమానీనదం లు చేరుకుంటాం.

చట్మోలి నుండి లక్ష్మి వన్ 1km (12600 అ ఎత్తు లో )

తర్వాత లక్ష్మి వన్ ప్రాంతం కు చేరుకుంటారు. ఇది ఒక అందమైన రకరకాల పూలు వుండే ప్రాంతం.
 ఏంతో ఆహ్లాదం గా ఉంటుంది.

ఇక్కడే లక్ష్మి & విష్ణువు కొంతకాలం తపస్సు చేసినట్లు చెప్తారు.
ఇక్కడే ద్రౌపది దేవి తనువు చాలించింది అని చెప్తారు.

ఇక్కడి నుండి 2km ప్రయానించాక బంధర్ అనే ప్రాంతం కు చేరుకుంటాం.
ఇక్కడే ధర్మరాజు దాహార్తి తీర్చడానికి అర్జునుడు బాణ ప్రయోగం చేసాడని చెప్తారు.

బంధర్ నుండి సహస్రధార 4km ( 14000 అఎత్తులో)

సహస్ర ధార నుండి చక్ర తీర్ధం 5km (15000 అ ఎత్తులో)

ఇది విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కింద పెట్టడం వలన ఏర్పడిన సరస్సు గా చెప్తారు.
ఇక్కడే అర్జునుడు తనువు చాలించాడని చెప్తారు.

చక్రతీర్ధం నుండి సతోపంత్ 5km

ఈ సతోపంత్ అనేది త్రిభుజా కృతి లో వుండే సరస్సు.
ఇది 5 పర్వతాల మధ్య వుండే సుందరమైన స్వచ్చమైన నీరు ఉండే సరస్సు.
ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని గంధర్వులు పక్షుల రూపం లో వారిని సేవిస్తారని చెప్తారు.
ఏకాదశి రోజున ఇక్కడ పక్షుల సమూహం ను చూడవచ్చట.
ఇక్కడే భీముడు తనువు చాలించాడని చెప్తారు.

సతోపంత్ నుండి స్వర్గారోహిణి 8km

ఈ మార్గం బహు కష్టం గాను ప్రయాణానికి దుస్సాహసం గాను చెప్తారు.
మార్గం లో చంద్రకుండ్ & సూర్యకుండ్ అనే సరస్సులు ఉంటాయట.
ఇక్కడినుండే ధర్మరాజు మాత్రమే కుక్క తోడూ రాగా స్వర్గానికి ప్రయాణించాడు అంటారు.

నిజానికి స్వర్గారోహిణి అనేది 6 పర్వతాల సమూహం గా చెప్తారు. ఇందులో స్వర్గారోహిణి 1 అనేది ముఖ్యమైంది.
ఇది ఉత్తరాఖండ్ రాష్టం లోని ఉత్తరకాశి జిల్లా లో కల ఘర్వాల్ హిమాలయ ప్రాంతానికి చెందినది.
దీనికి పడమర వైపు గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది.

ఈ స్వర్గారోహిణి పర్వతాగ్రం ( 20512 అ ఎత్తులో , 6252 m ) మబ్బులలో ఉంటుందని అది 3 మెట్లు వలే ఉంటుంది అని అవి ఎక్కి పైకివేలితే మబ్బులలో మరో 4 మెట్లు ఉంటాయని అవి కూడా ఎక్కి పైకివెళితే స్వర్గ ముఖ ద్వారానికి చేరుకుంటామని చెప్తారు.

భోజనంలో రకాలు - హిందూ ధర్మచక్రం

మనం తినే భోజనంలో కూడా మన గుణాలను అనుసరించి మూడు రకాలు ఉన్నాయని భగవద్గీతలో చెప్పబడింది. అవేమిటో చూద్దాం.

సత్వగుణ ప్రధానుల భోజనం

ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః |
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః ||

ఆయుష్షును, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని పెంపొందింపచేసేది, రసవంతమైనది, చక్కగా మెరిసేది, చూడగానే కంటికి, ముక్కుకు, హృదయానికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించే భోజనం సత్వగుణ ప్రధానులైన వారికి ఎంతో ఇష్టమైనది. ముఖ్యంగా ఏ పూటకు ఆ పూట చక్కగా వండుకొని భగవంతునికి నివేదించి తీసుకునే ఆహారం సాత్వికమైనది.

రజోగుణ ప్రధానుల భోజనం

కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష రూక్ష విదాహినః |
ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాః ||

ఇక చేదుగా, పుల్లగా ఉండేవి, అతిగా వేడి చేసేవి, ఎండినట్లు ఉండేవి (ఫ్రైడ్ రైస్ లాంటివి), ఎక్కువగా వేయించినవి, ఎక్కువగా దాహాన్ని కలిగించేవి (మసాలాలు) అయిన ఆహారాలు రజోగుణ ప్రధానులు ఇష్టంగా తింటారు. అయితే ఇవి తినేటప్పుడు ఇష్టంగా ఉన్నా ఆ తరువాత దుఃఖాన్ని, శోకాన్ని, రోగాన్ని కలిగిస్తాయి. ఇంతకుముందు మనం రాజసిక సుఖంలో గారెల గురించి చెప్పుకున్నాం కదా.

తమోగుణ ప్రధానుల భోజనం

యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం ||

ఇక పోతే మనం ఇదివరలో చెప్పుకున్నట్లు తమోగుణ ప్రధానులైనవారు తాము ఏమి చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తమకే తెలియకుండా ఉంటారు. అందువలన వారికి సారహీనమైనవి, శక్తి అంతా పోయినవి, బూజు పట్టినవి, ఎంగిలివి, అసలు తినకూడనివి అయిన పదార్థాలు కూడా ఎంతో ఇష్టంగా ఉంటాయి. ఈ రోజులలో ఓపిక, తీరిక లేని జీవితాలతో మనం ఒకరోజు వండుకుని, ఫ్రిజ్ లో పెట్టుకుని, పది రోజులపాటు తినేవన్నీ ఇలాంటివే.

ఈ విధంగా మనలో ఉన్న గుణాలు మనం తినే ఆహారంయొక్క స్వభావాన్ని ఎలా నిర్ణయిస్తున్నాయో అలాగే మనం తినే ఆహారం కూడా మనలో ఆయా గుణాలను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది నిరూపించటానికి పెద్దలు ఒక సంఘటనను ఉదహరిస్తారు.

ఒకనాడు ఒక సన్యాసిని ఒక ఇల్లాలు తన ఇంట భోజనానికి ఆహ్వానించింది. అయితే భోజనం చేస్తున్న సమయంలో ఆ సన్యాసికి తనకు మంచినీళ్ళు పెట్టిన వెండి చెంబును తస్కరించాలనే కోరిక కలిగింది. అయన మహాత్ముడు కనుక వెంటనే గ్రహించి ఆ ఇల్లాలిని అడిగాడు "తల్లీ! ఈ మీ ఐశ్వర్యం అంతా ఎలా సంపాదించారు? నిజం చెప్పు" అని. ఇక చేసేది లేక ఆ ఇల్లాలు తాము ఆ సంపదనంతా అన్యాయంగానే సంపాదించామని ఒప్పుకుంది. "నీ ఇంట భోజనం చేయటం వల్ల సర్వసంగ పరిత్యాగినైన నాకు కూడా ఈవేళ చోరబుద్ధి కలిగింది. దయచేసి మీ ప్రవర్తన మార్చుకోండి. అలాగే ఇంకెప్పుడూ నన్ను మాత్రం భోజనానికి పిలువకండి" అని చెప్పి ఆ సన్యాసి అక్కడనుండి నిష్క్రమించాడు.

మరి మీరేమి తింటారో ఎలా తింటారు మీ ఇష్టం

పూజించే విధానాలు - 16 to 64

భగవంతుణ్ణి  పూజించే విధానాలలో  మనకు  16 ఉపచారాలు మాత్రమే తెలుసు  మరింత సమగ్రంగా తెలుసుకుందాం.

ఉపచారాలు
సంక్షేపం విస్తారం అని షోడశోపచారాలు అనేక విధాలుగా ఉన్నాయి. ఐదు, పది, పదహారు, పదునెనిమిది, ముప్ఫైఆరు, అరవైనాలుగు. అవి ఇక్కడ ఇవ్వబడుతున్నాయి.

పంచోపచారాలు- 1. గంధం 2. పుష్పం 3. ధూపం 4. దీపం 5. నైవేద్యం

దశోపచారాలు-  1. పాద్యం 2. అర్ఘ్యం 3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. గంధం 7. పుష్పం 8. ధూపం 9. దీపం 10. నైవేద్యం

షోడశోపచారాలు- 1. పాద్యం 2. అర్ఘ్యం  3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. ఆభూషణం 7. గంధం 8. పుష్పం 9. ధూపం 10. దీపం 11. నైవేద్యం 12. ఆచమనం 13. తాంబూలం 14. స్తవపాఠం 15. తర్పణం 16. నమస్కారం

అష్టాదశోపచారాలు- 1. ఆసనం 2. స్వాగతం 3. పాద్యం 4. అర్ఘ్యం  5. ఆచమనీయం 6. స్నానీయం 7. వస్త్రం 8. యజ్ఞోపవీతం 9. భూషణం 10. గంధం 11. పుష్పం 12. ధూపం 13. దీపం 14. నైవేద్యం 15. దర్పణం 16. మాల్యం 17. అనులేపనం 18. నమస్కారం

ముప్ఫైఆరు ఉపచారాలు- 1. ఆసనం 2. అభ్యంజనం 3. ఉద్వర్తనం 4. నిరుక్షణం 5. సమ్మార్జనం 6. సర్పిఃస్నపనం 7. ఆవాహనం 8. పాద్యం 9. అర్ఘ్యం  10. ఆచమనం 11. స్నానం 12. మధుపర్కం 13. పునరాచమనం 14. యజ్ఞోపవీతం, వస్త్రం 15. అలంకారం 16. గంధం 17. పుష్పం 18. ధూపం 19. దీపం 20. నైవేద్యం 21. నైవేద్యం 22. పుష్పమాల 23. అనులేపనం 24. శయ్యా 25. చామరం 26. వ్యంజనం 27. ఆదర్శం 28. నమస్కారం 29. గాయనం 30. వాదనం 31. నర్తనం 32. స్తుతిగానం 33. హవనం 34. ప్రదక్షిణం 35. దంతకాష్ఠం 36. విసర్జనం

చతుష్షష్టి ఉపచారాలతో అంటే (64) ఉపచారాలు- 1. ద్యానం 2. ఆవాహనం 3. ప్రభోధనం 4. మణి మందిరం 5. రత్న మండపం 6. దంత ధావనం 7. సిబికాం 8. రత్న సింహాసనం 9. వితానం 10. పాద్యం 11. అర్ఘ్యం  12 ఆచమనీయం 13 మధుపర్కం 14. అభ్యంగనమ్‌ 15. ఉద్వర్తనం 16. పంచామృతం 17. ఫలోదకం 18. శుద్దోదకం 19. సమ్మార్జనమ్‌ 20. వస్త్రం 21 పాదుకా 22 ఆభరణం 23 కిరీటం 24 కుండలం 25 కవచం 26 యజ్ఞోపవీతం 27 శ్రీ గంధం 28 అక్షతం 29 హరిద్రాచూర్నమ్‌ 30 కుంకుమ 31 పరిమళ ద్రవ్యం 32 సింధూరం 33. పుష్పాణి 34. దూర్వాదళం 35. ధూపం 36. దీపం 37. కుంభ నీరాజనం 38. నైవేద్యం 39. హస్త ప్రక్షాళనం 40 కరో ద్వర్థనమ్‌ 41. పానీయం 42ఫలసమర్పణ 43.తాంబూలం 44.దక్షిణ 45 ఛత్రం 46 చామరం 47. దర్పణం 48. మంగళ నీరాజనం 49. మంత్రపుష్పం 50. ప్రదక్షిణం 51 నమస్కారం 52. తురంగవాహనమ్‌ 53. మదగజం 54. రధం 55. సైన్యం 56. దుర్గం 57. మూషిక వాహనం 58 ఆయుధం 59. వ్యజవీజనం (వింజామర) 60. నృత్యం 61. వాద్యాని 62. గీతశ్రవణం 63. అబినయం 64. క్షమా ప్రార్ధన

ఈ 64 ఉపచారాలు ప్రధానమైనవిగా శాస్త్రాలలో చెప్పబడ్డాయి.

ప్రాణశక్తి – జీవశక్తి – ఆత్మశక్తి

అవగాహన
శక్తికి మనిషిలో క్రియాపూర్వక స్పష్టత ఉంది

ప్రకృతి జీవులు అన్నిటిలోనూ శక్తి సూక్ష్మత వున్నప్పటికీ మనిషిలో దానికి క్రియాపూర్వక స్పష్టత వుంది. అదే - మనిషిలోని ప్రాణశక్తి మొదలు ఆత్మ శక్తి వరకే! క్రియా ఫలిత ఉనికిగా జ్ఞాతమవుతోంది.

మనోశక్తే కీలకమైనది

శరీర బలంతోపాటు మనిషిలో ప్రాణశక్తి మనోశక్తి జీవశక్తి ఆత్మశక్తి (కుండలిని) నిక్షిప్తత వుంది. క్రియాత్మక విధానంలో అత్యంత ప్రాధాన్యతను కలిగియున్నది మనోశక్తి. జీవిత ఉనికికి మనిషి ప్రత్యేకతకు క్రియాఫలిత స్పష్టతతో మనోశక్తే కీలకమైనది.

ఆత్మశక్తే మూలం

నీటి అలలు, అలల నీరు వీటిలో నీరే మొదటిది. వాయువు అందుకు కారణం మాత్రమే! అలాగే 'జీవం', 'జీవ పదార్థం' - 'జీవి', ఈ క్రమంలో జీవం, మొదటిది, పంచభూతాల ప్రకృతి అందుకు హేతువు, అలాగే ఆత్మశక్తి - జీవశక్తి - ప్రాణశక్తి క్రమంలో ఈ మూడిటికీ ఆకార ఉనికి లేకపోయినప్పటికి ఆత్మశక్తే, మిగతా వాటికి మూలం. అలాగే, మూడిటి క్రియా సమన్వయతే శరీరం, బ్రతికి వుండడానికి కారణం.

కనుక జ్ఞానేంద్రియాల బాహ్య ప్రేరణ స్పందనకు బ్రెయిన్‌లోని న్యూరాన్ల ప్రతిస్పందనే ఇంద్రియ మనసుగ అవగాహనకు ప్రయత్నించవచ్చును. ఈ (బ్రెయిన్‌లోని న్యూరాన్ల) ప్రతిస్పందనకు శరీరవ్యాప్త స్పర్శనాడుల క్రియాత్మక చలనమే జీవశక్తి. అలాగే పంచభూత ప్రకృతి నిర్మిత శరీరానికి పోషణ బలం ప్రాణశక్తి వాటి ద్వారానే లభిస్తున్నాయి.

మనిషితో సహా అన్ని జీవులకు గాలి, నీరు, ఆహారం ద్వారానే ప్రాణశక్తి, జీవశక్తి, లభ్యమవుతున్నాయి

ప్రధానంగ శరీరానికి వుద్దేశింపబడిన యోగా దాని భిన్నతను అలా వుంచితే దరిమిలా ప్రాణశక్తి ప్రతిపాదిత ప్రాణాయామం శక్తి పూరకమే! అయితే శరీరానికి ప్రాణశక్తి బాహ్యమైనదా లేక అంతర్గతమా అనే విషయ విశ్లేషణ కూడ అవసరమే! ఈ సందర్భంగా శరీరం బలం మనోశక్తి మధ్యగల భేదం తెలియాలి.

 What is spiritual power?

పంచభూత నిర్మితం శరీరమైనప్పుడు దాని ప్రాణశక్తి బలం వాటి ద్వారానే లభిస్తుంది. మనిషితో సహా అన్ని జీవులకు గాలి, నీరు, ఆహారం ద్వారానే ప్రాణశక్తి, జీవశక్తి, లభ్యమవుతున్నాయి. ఇంతకు మినహా ప్రాణశక్తి లభ్యతకు మనిషి చేయవలసినది వేరుగ ఏమీ లేదు.

జీవశక్తి ప్రాణశక్తిగా శరీర జీవక్రియ ద్వారా రసాయన చర్య కారణంగా మారుతోంది - ఆత్మ ద్వారా లభ్యమైయ్యే శక్తి ఏమిటి?

శరీరంలో ప్రాణశక్తితో పాటు అవసరమైన మరికొన్ని శక్తులు వున్నాయా? గాలి, నీరు, ఆహారం - వీటి ద్వారా లభించే, జీవశక్తి, ప్రాణశక్తిగా, పరివర్తన చెందడం అనేది శరీర జీవక్రియ ద్వారా దానికదే జరుగుతున్న, రసాయన చర్య. దానిలో మనిషి మనసు ప్రత్యేకంగా చేస్తున్నది ఏమీలేదు.

జీవశక్తిని కలిగియున్న ఆహారం, నీరు, గాలి శరీరానికి అందని పరిస్థితిలో శరీరం వాటిని తనలోకి తీసుకోలేని సమయాలలో జీవశక్తితోపాటు ప్రాణశక్తికీ క్షీణత కలగడం అనుభవమే! కనుక శరీర ఉనికికి, అవసరమైన జీవ, ప్రాణశక్తి, శరీర నిర్మాణానికి, కారణమైన పంచభూతాల ద్వారానే లభించడం జరుగుతోంది. 'స్వీకరణ - విసర్జన', క్రియద్వారానే జీవశక్తి ప్రాణశక్తి శరీరానికి లభిస్తున్నప్పుడు అదనంగా శరీరంలో వుందనుకునే 'ఆత్మ', ద్వారా కూడా మరేదో శక్తి లభ్యమవుతూ వుండాలి మరి! అదేదో తెలియడానికి ఆత్మ సంబంధమైన సమాచార జ్ఞానం అవసరం.

ఆత్మశక్తి - జీవశక్తి - ప్రాణశక్తిగా ప్రవేశం - ప్రాణశక్తి - జీవశక్తి - ఆత్మశక్తిగా శరీరం నుండి నిష్క్రమణ

బీజం/విత్తనంలోని జీవశక్తి అనుకూల పరిస్థితులలో మొలకగ, మొక్కగ, దరిమిలా వృక్షంగా విస్తరించినట్లే, 'అండం - పిండం'లోని జీవశక్తి జీవిగ, జీవజాతిగ వృద్ధిచెందినట్లే, మనిషిలోని విశ్వశక్తి(పరమాత్మ)పరమ సూక్ష్మత(జీవాత్మ)తగిన ఆధ్యాత్మిక సాధన ద్వారా అంతరాత్మగ వ్యాప్తమవుతుంది. ఆత్మశక్తి ప్రభావితమైన బ్రెయిన్ దాని తయారీ మనసు ఇంద్రియ సాధారణ స్థితికి ప్రత్యేకత లభిస్తుంది. ప్రస్థాన ధ్యాన ధ్యేయం - అదే! సీడ్‌లోని జీవశక్తి బాహ్యత నుండి వచ్చినది కాదు; దానిలోనిదే అది! అలాగే జీవి జీవశక్తి - ప్రాణశక్తి అండం - పిండంలోనిదే! వేరుగ బయటనుండి పిండంలో ప్రవేశించేవి కాదు. కనుక ఆత్మశక్తి - జీవశక్తి - ప్రాణశక్తి, జీవసృష్టి పరిణామ జన్మ సంబంధమైనదే! జీవితకాల పూర్తితో తిరోగమన క్రమంలో ప్రాణశక్తి - జీవశక్తి, పునః ఆత్మశక్తిగ; శక్తి స్థూలత, సూక్ష్మతగ; పునః పంచభూత ప్రకృతిలో చేరిపోవడంతో ఆకార దృశ్యత (శరీరం దాని జీవితం) సమాప్తమవుతుంది.

గర్భ స్థితినుండి ఆరంభమైన జీవశక్తి పంచభూత పోషణతో ప్రాణశక్తిగ శరీర రక్షణను సాగిస్తోంది. అందుకు అవాంతరం యేర్పడితే ఆ మేరకు ప్రాణశక్తి తగ్గిపోతూ క్రమంగా శరీరం శవంగా తన ఉనికిని కోల్పోతుంది.

ఆ స్థితి ఏ వయసులోనైనా ఏ కారణంగానైనా జరగవచ్చు. అలా అది ప్రకృతి సహజతే! ప్రమాద కారణాలు అనేకం.

ఆత్మ శక్తి - జీవాత్మ ఎక్కడ నుండి?

మనిషితో సహా జీవి మనుగడకు బాహ్య అంతరంగ జీవ ప్రాణశక్తికి పంచభూతాలే ఆధారం. మరి శరీరంలోని ఆత్మశక్తి ఎక్కడిది? ఆత్మ పంచభూత సంబంధమైనది కాదు గదా!

అయితే, పంచభూత నిర్మిత, ప్రకృతి జీవశక్తి - కేవలం, జీవపదార్థ సంబంధమైనదే! జీవశక్తికి, ప్రాణశక్తికి భిన్నమైన, ఆత్మశక్తి, పదార్థ సృష్టికి కారణమైన, విశ్వశక్తి,(పరమాత్మ) పరమ సూక్ష్మతే! ప్రకృతి జీవపదార్థం, సృష్టిపదార్థ, పరిణామ ఫలితమే కనుక, ఎంబాడీడ్, సృష్టి పదార్థ, విశ్వశక్తి (ద సుప్రీం సోల్) పరమసూక్ష్మత - ప్రకృతి, జీవం జీవులలో కూడ నిక్షిప్తమే! అదే జీవాత్మ. 'జీవస్థానికత' కారణంగ జీవాత్మగ వ్యవహరింపబడుతోంది.

బ్రెయిన్ న్యూరాన్లకు సంబంధించి 'వైటాలిటీ (ఫోర్స్)' - జీవకణాలకు 'ఇమ్యూన్‌'గా జీవశక్తి విభజన

శిరసు - శరీర భాగమైనప్పటికి ఫంక్షనల్ ప్రాధాన్యతతో దానికి వేరుగ ప్రత్యేకత వుంది. శరీర వ్యాప్తంగ కోట్లాది జీవకణాల కూర్పు వాటి నాడీమండల అనుసంధానం అదేతీరుగ బ్రెయిన్‌లోని న్యూరాన్లు - వాటి ప్రత్యేక అమరిక దేనికదే వాటి స్వరూప స్వభావాలు వేరుగ వుంటాయి. అలాగే వాటి జీవన నిర్వహణకు కావలసిన జీవశక్తిలో కూడ భేదం వుంది.

బ్రెయిన్ న్యూరాన్లకు సంబంధించి ప్రధానంగ 'వైటాలిటీ' అలాగే జీవకణాలకు 'ఇమ్యూన్‌'గ జీవశక్తి విభజన వుంది. శరీర జీవకార్య నిర్వహణగ భౌతిక శాస్త్ర దృక్పథంతో వైటాలిటిని 'ఫోర్స్'గ అలాగే ఇమ్యూనోను 'రెసిస్ట్'గ భావిస్తే ఆ రెండిటి మధ్య యేర్పడే క్రియాపూర్వక 'తటస్థ'తే బయోలాజికల్ లైఫ్ బ్యాలెన్స్; శరీర సజీవ జీవిత ఉనికికి ఆధారం.

కనుక వైటాలిటీ - ఇమ్యూనో (ఫోర్స్ - రెసిస్ట్) ఫంక్షనల్ క్వాలిటీ స్టేటస్‌ను అనుసరిస్తూ మానసిక, శారీరక 'ప్రత్యేకత - సాధారణత' ఆధారపడి వుంటాయి. వాటి సహజత తరతమ భేదాల హెచ్చుతగ్గులు కూడ ముఖ్యమైనవే! ఆ సహజ వృద్ధితో వాటి క్రియాత్మక మార్పుకు, అవకాశం వుంది. అందుకే వివిధ రీతులుగ భౌతిక ఆధ్యాత్మిక సాధన విధానాలు తద్వారా మానసిక స్థితి ఉన్నతికి శరీర ఆరోగ్య బ్యాలెన్స్‌‌కు అవకాశం వుంది. దానిలో భాగమే భౌతిక, మత, ఆధ్యాత్మిక నియమాలు, ఆచారాలు. వీటిలో మత మూఢతకు, మూర్ఖత్వానికి తావులేదు మరి! అలాగే వేదాంత నిష్క్రియా వైరాగ్యానికి, అసలే అవకాశం లేదు.

జీవక్రియలో ఫ్రీ-విల్ పాత్ర - భౌతికానికి (ప్రాణ శక్తి, జీవ శక్తి) అతీతంగా జీవక్రియ సాధ్యమా?

సహజ రీతిలో దానంతట అదే (స్వయం జీవక్రియా నిర్వహణ - ఆటో‌నెర్వ్‌సిస్టమ్) జరిగే జీవక్రియా విధానంలో మనిషి (ఫ్రీ-విల్) ఏదైన అవకాశం వుందా? అనేది ప్రశ్న. భౌతిక ప్రభావిత జీవ క్రియను తద్వారా, జీవిత విధానాన్ని మార్పు చేసే మరేదైన సాధన పద్ధతి వుందా? అనేది మరో ప్రశ్న. ప్రాణశక్తి - జీవశక్తితోపాటు ఆత్మశక్తి కూడ శరీరంలోనే వుంది. కనుక ఆత్మశక్తితో భౌతికానికి, భిన్నమైన రీతిలో జీవక్రియా స్వాధీనతకు గల అవకాశాన్ని అన్వేషించాలి.

జీవ శక్తి - ప్రాణశక్తి - ఆత్మశక్తి & ఆధ్యాత్మిక స్ఫూర్తి

శరీరంలో ప్రాణశక్తి - జీవశక్తి అలాగే ఆత్మశక్తి క్రమంలో పంచభూత సంబంధ నీరు - ఆహార స్వీకరణ ద్వారా శరీరానికి ప్రకృతి సహజ జీవశక్తి లభిస్తోంది. శ్వాస ప్రాణవాయువుతో జీవశక్తి ప్రాణశక్తిగ మార్పుచెంది, శరీర సజీవతకు కారణమవుతున్నట్లే 'కుండలిని' స్వయంచలన క్రియగా ఆత్మ స్పర్శగ (స్పిరిచ్యువల్ కాన్ష‌స్‌నెస్) ఆత్మశక్తి అంతరాత్మ స్థాయితోపాటు బ్రెయిన్‌కు ఆధ్యాత్మిక ప్రేరణకు కారణమవుతోంది. ఇందుకు ముఖ్యంగా రాజయోగ ధ్యానయోగ సమన్వయత అవసరం.

జీవక్రియకు అవాంతరంతో అనారోగ్యం

శరీర బాహ్యాంతర అవయవాలలో కర్మేంద్రియాలను మినహాయిస్తే, మిగతావన్నీ స్వయం జీవచలనాన్ని కలిగినవే! పంచభూత రూపంలో వాటికి కావలసిన 'ఇంధన' సరఫరా చేయడమె మనిషి జీవి ఏదైనా చేయవలసిన చేయగలిగిన పని. ఏ కారణంగానైనా ఏ అవయవానికైనా జీవక్రియా అవాంతరం యేర్పడితే అలా దానికి 'రెస్ట్' లభిస్తే ఆ మేరకు శరీరానికి ఆనారోగ్యమే! ఔషధ వైద్య ప్రయోగంతో దానికి మామూలు పరిస్థితి యేర్పడేవరకు జీవిత క్రమానికి ఇబ్బందే! అదే 'లాంగ్ లీవ్' అయితే శాశ్వత శలవుతో జీవిత సమాప్తే!

స్పిరిట్ - మనిషి మూఢ నమ్మకమా

శరీరంలో, ప్రాణశక్తి, జీవశక్తి, ఆత్మశక్తి, మనసు, స్పిరిట్, వీటితోపాటు, సెల్ఫ్ (Self) అనే అంతరాత్మ సంబంధ ఇంత్యూసివ్ ఇన్సిపిరేషన్, యివన్నీ భాగాలే బయోలాజికల్ ఫంక్షనల్ ఎనర్జీ అంతర్భాగమే. స్మృతి ప్రభావిత సెల్ఫ్ (నా - నేను, అనే భావం) స్పిరిట్ (ప్రేతాత్మ)గ, స్థూల శరీర మరణానంతరం కూడ, పంచభూత ప్రకృతిలో తన, తత్కాలిక ఉనికిని కలిగి వుండే అవకాశం వుంది. అయితే మానవులందరికీ యిది సర్వసాధారణంగ వర్తించేది కాదు. మనిషి మూఢ నమ్మకం దీనిని వికృతం చేస్తోంది.

స్థూల శరీర మరణంతో మిగిలేది సూక్ష్మ శరీరంకాదు. ప్రకృతిలోకి తిరిగి చేరిపోయే జీవశక్తి సూక్ష్మత; అది జీవపదార్థ, శాశ్వత, శక్తి - పదార్ధ, పరివర్తన, పరిణామ ఈ జీవ శక్తి.పంచభూతాల జీవశక్తే, ప్రకృతి; దాని క్రియారూప చలనమే ప్రాణశక్తి.ఆత్మశక్తి, జీవశక్తిగ; జీవశక్తి, ప్రాణశక్తిగ, పరిణామ క్రమమె జీవి పుట్టుక, (తిరోగమనంలో), ప్రాణశక్తి, జీవశక్తిగ, దరిమిలా ఆత్మశక్తిగ పునఃప్రకృతి ప్రవేశమే జీవిత సమాప్తి.

శరీరము

శరీర త్రయము : ప్రాణమయ శరీరము (The physio-etheric body)

ప్రాణమయ శరీరము భౌతిక శరీరమును పటిష్ఠపరచి ఒక రూపముగా ఉంచును. మరణ సమయములో ప్రాణమయ శరీరము వదిలి వెళ్ళుట వలన భౌతిక శరీరము నశించిపోవును. ఆధ్యాత్మిక జీవనము వలన ప్రాణమయ శరీరము పటిష్ఠము చెంది రూపమును ఆకర్షణీయముగా ఉంచును. దానికి వ్యతిరేకముగా జీవించినచో ప్రాణమయ శరీరము త్వరగా నశించును.

భావోద్వేగ శరీరము (The emotional body)

కోరికలు, అభీష్టములు, సానుభూతి, అసహ్యము, అహంకారము, ఆశయము, ద్వేషము, మరియు భయము మొదలగునవి భావోద్వేగ శరీరము యొక్క లక్షణములు.ఎవరైతే ఈ భావోద్వేగములతో నడిపించబడునో అతనిని జంతులక్షణములు కలవాడంటారు. ఎప్పుడైతే మన భావోద్వేగములను పవిత్రీకరించుకొని ఉన్నత ఆశయముల వైపు మనస్సును మళ్ళించునో అప్పుడు భావోద్వేగములు చల్లారి తపస్సు వైపునకు దారితీసి ఉద్ధారణ జరుగును.

మనోమయ శరీరము (The mental body)

మనోమయ శరీరము ఆలోచనలతో నిండి, విద్యుత్‍ను అందుకొను దీపము వలె, అవి పైన ఉన్న బుద్ధి నుండి శక్తిని అందుకొనును.ఆలోచనలు ఎడతెగక ఒకదాని తరువాత ఒకటి వచ్చుచునే ఉండును. బాహ్యముతో మన అమరిక వలన మనము ఎటువంటి ఆలోచనలను పొందుతామో నిర్ణయించబడుతుంది. మనము ఏర్పఱచుకొన్న అభిప్రాయములు/సిద్ధాంతములు మనల్ని వాటిలో చాలా కాలము కూరుకుపోయేలా చేస్తాయి. ఎప్పుడైతే మనము పై లోకములతో అనుసంధానము చెందుతామో, ఆత్మ నుండి ప్రేరణ పొందుతాము.

ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి

 ఇప్పుడు ఎవరు వైదికులు ఎవరు నియోగులు ఎవరు ద్రావిళ్ళు ఎవరిది ఏ ప్రాంతం సంపూర్ణంగా తెలుసుకోండి ఈనాడు ఆనాటి వైదీకులు అనేవాళ్ళు ఉన్నారా ఈనాడు అం...