Monday, April 5, 2021

ముక్తినిచ్చే ఏడు ముఖ్య స్థలాలు

 'అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికాపురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః’- ఈ శ్లోకం జగత్‌ ప్రసిద్ధం.... 

దీని అర్థం: అయోధ్యా , మధుర , మాయ ( హరిద్వార్) , కాశీ , కాంచీపురం, అవంతిక (ఉజ్జయిని), ద్వారక ... ఈ ఏడు ముక్తినిచ్చే స్థలాలు ( నగరాలు). ఈ ఏడు ముక్తి క్షేత్రాల గురించి క్లుప్తంగా తెలిసికుందాం.

1) అయోధ్య:-

అయోధ్య అంటే శత్రువులు చొరబడటానికి వీలులేని సురక్షిత స్థానం అని అర్థం. ఇది మానవోత్తముడు, మర్యాదాపురుషోత్తముడూ అయిన శ్రీరాముడి జన్మభూమి. సరయూ నదీతీరంలో వెలసిన ఈ మోక్షధామం దర్శనమాత్రంగా జన్మను చరితార్థం చేస్తుందంటారు.

2) మధుర:-

మాధుర అంటే తీయనైన అని అర్థం. పూర్ణావతార పురుషుడైన శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్రస్థానం.

3)మాయ:-

దీనినే హరిద్వార్‌ అని పిలుస్తారు. విష్ణువు సన్నిధికి చేర్చే ముఖద్వారం ఈ పుణ్యస్థలం. హిమవత్పర్వతాల నుంచి ప్రవహించే గంగానది మొట్టమొదట నేలపై అడుగు మోపే విశిష్ట పుణ్యక్షేత్రం ఈ మాయానగరం.

4)కాశీ:-

భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం పవిత్ర గంగానదీ తీరంలో వెలసిన పరమ శివసన్నిధానం. వరుణ, అసి అనే రెండు నదులు ఇక్కడే గంగా నదిలో సంగమించడం వల్ల ఈ పట్టణానికి వారణాసి అని కూడా పేరు.

5) కాంచీపురం:-

దక్షిణ భారతంలోని పవిత్ర నగరం ఇది. కంచి, కాంచీపురం, కాంజీపురం అనే పేర్లతో అలరారే ఈ పుణ్యధామం శివుడికి, విష్ణువుకు, శక్తికి నెలవు. అద్వైత తత్త్వాన్ని ప్రవచించిన ఆదిశంకరులు స్థాపించిన కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మోక్షం సంప్రాప్తి స్తుందని ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్న విశ్వాసం.

6)అవంతిక:-

భారత భూమిలోని మధ్యప్రదేశంలో విరాజిల్లే ఉజ్జయినీ నగరానికే అవంతిక అనిప్రాచీననామం. శిప్రా నదీతీరంలో వెలుగొందే ఈ పట్టణం మహాకాళనాథు డైన శివుడికి నిలయం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఈ నగరాన్ని గురించి మహాకవి కాళిదాసు ఎంతో అద్భుతంగా వర్ణించాడు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి.

7) ద్వారవతి:-

అంటే ద్వారకానగరం. శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన దివ్యధామం ఇది. కృష్ణుడు నివసించిన ద్వారకానగరం సముద్రంలో కలిసిపోయింది. తీరంలో నూతనంగా నిర్మించిన ఆధునిక ద్వారకానగరం ద్వారకానాథ్‌గా ప్రసిద్ధం. ఇక్కడ ద్వారకాధీశుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి స్వర్గద్వారం ద్వారా ప్రవేశించిన భక్తులు మోక్షద్వారం ద్వారా వెలుపలికి వస్తారు. ఈ కారణంగా ఇది ముక్తిదాయక నగరంగా ప్రసిద్ధి చెందింది.

Saturday, April 3, 2021

రాహు దోషం

జాతక రీత్యా  రాహుదోషం గోచారరిత్యా రాహచెడుప్రభావం అధికమైయిబ్బందులుకల్గుచున్నప్పుడుమానసికరోగాలు,మెదడు,నరాలుకు సంభదించిఅనారోగ్యబాధలు,మానసికరోగాలుతో ఉన్మాదం కల్గినప్పుడూ రాహుకాలంలో దుర్గా దేవి ని తలచుకొని పూజ చేస్తే  తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. ప్రతీరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది. రోజు చేయడం కుదరనివారు, మంగళ / శుక్రవారలలో రాహుకాల సమయంలో పూజ చేయాలి. ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం చాల మంచిది. అలా వీలు కానివారు ఇంట్లోనే శుచిగా  దీపారాధన చేసి, శ్రీ దుర్గా స్తోత్రం చదివి మినపగారెలునైవేద్యం పెట్టాలి. రాహుకాల సమయంలో పసుపు రంగులో నైవేద్యం అంటే, ఓ రోజు నిమ్మకాయ పులిహొర మరొక రోజు అటుకుల పులిహొర నైవేద్యం పెట్టి ఎదైన పని మనసులో అనుకొని రాహుకాలపూజ మొదలుపెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ కార్యక్రమం జరుగుతుంది. కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు కూడా వెలిగిస్తారు. ఇది కూడా చాలా మంచిది. 

రాహుకాల సమయం :

సోమవారం - ఉ 7:30 -9:00

మంగళవారం - మ 3:00 -4:30

బుధవారం - మ 12.00 - 1:30

గురువారం - మ 1:30 - 3:00

శుక్రవారం - ఉ 10:30 - 12:00

శనివారం - ఉ 9:00 - 10:30

ఆదివారం - సా 4:30 - 6:00

Thursday, April 1, 2021

జ‌ప‌మాల ప్రాముఖ్య‌త

జ‌ప‌మాల ప్రాముఖ్య‌త అంద‌రికీ తెలిసిందే. హిందూ ధ‌ర్మంలో పూజ‌ల స‌మ‌యంలో... శ్లోకాలు, మంత్రాలు చ‌దివేట‌ప్పుడు జ‌ప‌మాల‌ను ఉప‌యోగిస్తుంటారు. ఇందులో 108 పూస‌లుంటాయి.

 జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయి ? 

ఇంత‌కూ జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా.. దాని వెన‌క కొన్ని ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. ఒక‌వ్య‌క్తి ఒక‌రోజులో అంటే 24 గంట‌ల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటాడ‌ట‌.

అంటే 12 గంట‌ల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే ఒక మ‌నిషి దేవుడి స్మ‌ర‌ణ‌లో జ‌ప‌మాల చేసేట‌ప్పుడు 10800 సార్లు చేయ‌డం క‌ష్టం కాబ‌ట్టి... చివ‌రి రెండు సున్నాల‌ను తీసేసి 108 ను నిర్ధారించార‌ని చెబుతారు.

108 వెన‌క మ‌రో క‌థ ప్ర‌చారంలో ఉంది. మొత్తం 12 రాశులున్నాయి. ఈరాశుల‌తో తొమ్మిది గ్ర‌హాలున్నాయి. రాశుల సంఖ్య‌ను గ్ర‌హాల‌తో గుణిస్తే వ‌చ్చేది 108. అందుకే జ‌ప‌మాల‌లో 108 పూస‌ల‌ను నిర్థారించార‌ట‌.

ఈ 108 పూస‌లు మొత్తం విశ్వానికి ప్రాతినిధ్యం వ‌హిస్తాయ‌ట‌. జ్యోతిష్య శాస్త్రంలో 27 న‌క్ష‌త్రాలుంటాయ‌ని భావిస్తారు. ఒక్కో న‌క్ష‌త్రానికి 4 పాదాలుంటాయి. అంటే 27 న‌క్ష‌త్రాల‌కు క‌లిపి మొత్తం 108 పాదాల‌వుతాయి.

జ‌ప‌మాల‌లోని ఒక్కో పూస ఒక్కో పాదానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ట‌. అన్నింటికి మించి 108ని అదృష్ట సంఖ్య‌గా భావిస్తారు. హిందూ ధ‌ర్మ శాస్త్ర ప్రకారం 108 సార్లు ఏదైనా స్తోత్రాన్ని చ‌దవాల‌ని చెబుతారు. \

108 సార్లు కొలిస్తే దేవుడి క‌రుణ ఉంటుంద‌ని అంటారు. దానికి అనుగుణంగా 108 పూస‌ల‌ను నిర్ధారించార‌ని ప్ర‌చారంలో ఉంది.

From నారాయణం వెంకటరెడ్డి

Tuesday, March 30, 2021

గురు శుశ్రూష ఎన్ని విధాలు?

గురుసేవ - గురుశుశ్రూష 4 విధాలు.

(1) స్థాన శుశ్రూష :- గురువు ఉన్న ఇంటిని, ఆశ్రమాన్ని, ప్రదేశాన్ని శుభ్రం చేయటం. ఆయన పరిసరాలను శుభ్రం చేయటం. ఆయన వాడుతున్న వస్తువులను శుభ్రం చేయటం - (అదీ తప్పనిసరి కర్తవ్యంగా గాక - తనకు అదృష్టవశాత్తు లభించిన అవకాశంగా భావించి చెయ్యాలి)

(2) అంగ శుశ్రూష :- స్వయంగా ఆయన పాదాలొత్తి సేవచెయ్యటం. ఆయన యొక్క ఆరోగ్య విషయాలను స్వయంగా చూచుకుంటూ తగిన ఏర్పాట్లు చెయ్యటం. ఆయన అవసరాలను కనిపెట్టి ఉండటం.

(3) భావ శుశ్రూష :- ఆయన మనస్సులోని భావాలను తెలుసుకుంటూ అందుకనుగుణంగా నడుచుకోవటం. ఆయన కోరకుండానే ఆయన అవసరాలు తీర్చటం. ఆయనకు ఏ లోటూ కలగకుండా చూచుకోవటం.

(4) ఆత్మశుశ్రూష :- తన మాటలు - చేతలతో గురువును నొప్పించకుండా ఆయన నడిచే మార్గంలోనే నడవటం. ఆధ్యాత్మిక చింతనతో ఆయనతో పోటీ పడటం. తన శరీరం - తన ధనసంపదలు - తన మనస్సు సర్వమూ గురువు కోసమేననే భావన మనసులో దృఢంగా ఉండాలి.

Monday, March 29, 2021

వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా

"మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః "  అంటే అర్ధం తెలుసా

SUN'DAY

MO(O)N'DAY

TUESDAY

WEDNESDAY

THURSDAY

FRIDAY

SATUR(N)DAY

అంటే ఏమిటో తెలుసా....? అసలు ఈ వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా? వీటిని కాపీ కొట్టి, ఇవి మావే అని డబ్బా కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా?

సూర్యహోర

చంద్రహోర

కుజహోర

బుధహోర

గురుహోర

శుక్రహోర

శనిహోర - అంటే

ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగము, ఇవి ఎంతో శాస్త్రీయమైనవి కాబట్టే, బ్రిటిష్ వాళ్లు వీటిని తమ క్యాలెండర్ లో పేర్లు మార్చి, వాటిని వారి విజ్ఞానంగానే ప్రపంచాన్ని నమ్మిస్తున్నారు, 

సరే... ఇప్పుడైనా నిజమేమిటో తెలుసుకుందాం!

ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు - అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి! వారము - అంటే 'సారి' అని అర్ధము.

1వ సారి, 2వ సారి... అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము - అని అంటారు!

కాస్త విపులంగా....

భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు. భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని "ఒక వారం" అని పిలిచారు. ఒకసారి అన్నా - ఒక వారం అన్నా ఒకటే.ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.

మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః

అనగా... 

పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి. 

ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి? 

ఆ గ్రహాల వరసకి, ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా?

ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.

భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది. 

ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.

ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక "అహః" ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి. 

ఆ భాగాలను వారు "హోర" అన్నారు.

"అహః ప్రమాణం" అన్నా, "అహోరాత్ర ప్రమాణం" అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే "హోర" అయింది.

దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారు. 

ఈ హోర పదాన్ని అవర్(HOUR) గా మార్చి పాశ్చాత్యులు 24 అవర్స్(HOURS) అన్నారు.

హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని(పోలిక) పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు.

ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమిమీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. 

ఈ భ్రమణంలో చిత్రమేమిటంటే, ఇవాళ - ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర, సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో... ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్ర హోర ఉంటుంది. 

కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.

మళ్లీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది. కనుక ఆ రోజు - మంగళవారం,

ఆ మరునాడు ఉదయానికి బుధహోర - బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది -గురువారం.

ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర - శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర - అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది.

అయితే... ఈ విధానం వినడం కొత్త అయిన హేతువాద, నాస్తిక, పచ్చ బాబులకు... మొదటి రోజు సూర్యోదయ సమయానికి సూర్యహోర అవుతుందనుకుంటే కదా ఈ లెక్కలన్నీ...ఇలా వచ్చేది! 

అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం. 

వస్తున్నా... అక్కడికే వస్తున్నా...

ఎందుకనుకోవాలంటే - సూర్యుడి(ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్ధం కావడం కోసం మన ఋషులు సూర్యున్ని గ్రహం గా తీసుకున్నారని గమనించాలి) - ఆధిపత్యంలో... సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. 

దీన్నే మరోరకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆగ్రహం పేరే ఆదిత్యుడు. అంటే మొదటివాడు.

అదే మొదటిరోజు. 

అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది.

ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా ఒకటే. 

అక్కడినుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం, హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - ఈ విధంగా వస్తుంది.

అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి.

ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరస వేరుగా, వారాల వరస వేరుగా అయింది. 

ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా, ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా " ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి?" అనే విషయం తెలియదు. 

అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం! 

కాబట్టి హేతువాదులని చెప్పుకునే కుహనా మేధావులారా! అన్యమత సంస్కృతులను మూఢాచారాలని నమ్మే కమ్మే వారాల పేర్లు ఇతరమత గ్రంథాల్లో ఇమడవు కదా! 

మరి ఆ మాక్స్ ముల్లరూ, విలియం జోన్సూ, రిస్లే బాస్టెడూ ఎందుకు వీటిని తీసెయ్యలేకపోయారూ? 

పేర్లు మార్చి, కాపీ కొట్టి ఇవి మావేనని ఎందుకు జబ్బలు చరుచుకుంటున్నారు??? ఎందుకంటే ఇవి బైబిల్ చట్రంలో ఇమడలేదు, తీసెయ్యడానికి కుదరలేద!

అదీ...భారతీయ ఋషుల గొప్పదనం! 

నేటికైనా తెలుసుకోండి.. తెలియకపోయినా పాటించండి! సనాతన ధర్మ సంస్కృతిలో ప్రతీదీ మనిషికి పనికొచ్చే సైన్సే తప్ప వేరే కాదు.

Tuesday, March 9, 2021

నిరంతర జపం

గురువులు వారి శిష్యులకు , భక్తులకు , ఒక్క శ్వాసకూడా వృధా కాకుండా ప్రతీ శ్వాసతో జపం చేయాలని చెబుతారు. ప్రతీ శ్వాసతో మంత్రాన్ని జపించాలి. పనిచేస్తూ , తిరుగుతూ , ప్రయాణం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, ఇలా ప్రతి నిత్యం మంత్రాన్ని జపం చేయాలి.! ఈ విధంగా ఉదయం రాత్రి విరామం లేకుండా చేస్తే , నిద్రలో కూడా జపం కొనసాగుతునే ఉంటుంది. ఇలా ప్రతి నిమిషం మనం మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే అది మనకు ఓ బలమైన రక్షణ కవచం లా పనిచేస్తుంది. ప్రతీ శ్వాసతో జరిపే జపం సహజ ప్రాణాయామానికి దారితీస్తుంది. దాని వల్ల కుండలినీ శక్తి సహజంగానే జాగృతం అవుతుంది. అది సహజ ఆనందానుభూతి ఇస్తుంది. 


ఇలా మనం నిరంతరం ధ్యానావస్థలో ఉండాలంటే :-


👉🏿 మన మీద మనకు విశ్వాసం ఉండాలి.


👉🏿 దీక్ష ఇచ్చిన గురువు మీద విశ్వాసం ఉండాలి.


👉🏿 గురు మంత్రం మీద విశ్వాసం ఉండాలి.


👉🏿 ఆ మంత్రదేవతపై పరిపూర్ణమైన విశ్వాసం, భక్తి, శ్రద్ధలు కలిగి ఉండాలి. 


ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా పంచదశి, షోడశి, లలితా సహస్రనామ, త్రిశతి అన్నీ చేస్తున్నా , నిరంతరం చేస్తూ ఉన్నా, ఎందుకు సరైన ఫలితాలు రావడం లేదు !? అంటే మనం ఒక మంత్రం కూడా పూర్తి స్థాయిలో విశ్వాసం తో ఉచ్చరించడం లెదు !! విశ్వాసం ఫలదాయకం. మనం విశ్వాసం తో మంత్రం ఉచ్చరించాలి. మనం గురువు ఉపదేశం ఇచ్చిన మంత్రాలను యాంత్రికంగా చేస్తున్నాము. అలా చేస్తే , మనకి , టేప్ రికార్డర్ కి పెద్ద తేడా లేదు కదా !! టేప్ రికార్డర్ కి మోక్షం లభించదు. టేప్ రికార్డర్ లాగా మనం మంత్రాలను యాంత్రికంగా జపం చేయకూడదు. 

Friday, March 5, 2021

శనీశ్వరుని, శివుని తగాదా


పూర్వము కృతయుగములో కైలాసము లోని పరమశివుని దర్శించవచ్చిన నారదుడు ... పరమేశ్వరునికి  నవగ్రహాలలో శనిగ్రహ ఆధిక్యతను బహువిధాల చెప్పాడు . నారదుడు చెప్పిన శనిగ్రహం పొగడ్తలు శివునికి నచ్చలేదు . ఆ కారణము గా .. ' శని అంతటి శక్తిమంతుదైతే తన ప్రభావాన్ని తనపై (శివునిపై) చూపి , తనను పీడించి శని శక్తిసామర్ధ్యాలను నిరూపించుకోమను ' అని శివుడు అనగా నారదుడు ఆవిషయము శని తో చెప్పెను.

పరమశివుని మాటలకు శనికి అవేశము , పట్టుదల ప్రేరేపించాయి . తను శివుని ఒక క్షణము పట్టి పీడిస్తానని ... ఆ విషయము తెలియజేయమని నారదునిచే వార్త పంపెను . ఈ విధముగా నారదుడు శివ , శని ల మద్య తగాదా సృష్టించాడు .

నారదుడు తక్షణం శని చెప్పిన మాటలు శివునికి తెలియజేసి శనిప్రభావాన పడకుండా జాగ్రత్తపడమని చెప్పి వెళ్ళిపోయెను . 

" శని తనను ఎలా పీడించగలడో చూస్తాను ' అనుకుంటూ కైలాసము నుంచి మాయమై దండకారణ్యము దారిపట్టాడు శివుడు . ఎవరి ద్రుష్టికీ ఊహకు రాని చోటుకోసం ఆలోచించి అడవిలోని ఒక పెద్ద రావి చెట్టు తొర్ర లో దాగున్నాడు. (ఆ అడవి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి అనే గ్రామం నందు కల ఒక పెద్ద రావిచెట్టు తొర్ర అని, అందులో ఈశ్వరుడు దాక్కున్నాడని, తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి.) మరునాడు ఉదయం ఈశ్వరుడు కళ్లు తెరిచేటప్పటికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరునికి నమస్కరించాడు.

అప్పుడు " ఏ మయింది నీ శపథం " అని ప్రశ్నించాడు ఈశ్వరుడు . ఆయన మాటలకు శని మందహాసం  చేస్తూ " పరమశివుడంతటివాడు దేవతలకు , ఋషులకు , మరి ఎందరికో ఆరాధ్యదైవం , చల్లని ప్రశాంతమైన కైలాసము నుంచి పారిపోయి దండకారణ్యములో పరుగులు పెట్టి దిక్కులేని వాడివలె చెట్టు తొర్రలో దాగుకోవడమంటే ... ఆ క్షణము శని పట్టినట్లు కాదా ! "అని అడిగాడు..శని నెమ్మదిగా వినయం గా..

శని సమయస్పూర్తికి , వినయానికి ఆయన ప్రభావానికి , పట్టుదలకు మెచ్చుకున్నాడు శివుడు . . తనను మెప్పించిన శనికి ఆనాటినుండి ఈశ్వర అనేశబ్దము సార్ధకం కాగలదని మానవులు శని ని శనీశ్వరా అని పూజిస్తే .. శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరము ఇచ్చెను . అలా శనిగ్రహం శనీశ్వరడు అయ్యాడు .

శనీశ్వరుడు మరియు  దశరథ మహారాజు..

తన రాజ్యములో నెలకొన్న కరువు మరియు పేదరికానికి శని భగవానుడే కారణమని గుర్తించి ఆయనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డ ఏకైక వ్యక్తి దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ శనీశ్వరుడు "నేను నా భాద్యతలనుండి తప్పించుకోలేను, కాని నీ ధైర్యానికి ముగ్ధుడనయ్యాను". ఋష్యశృంగ మహర్షి నీకు సాయం చేయగలడు. ఎక్కడైతే ఋష్యశృంగుడు నివశిస్తాడో ఆ దేశములో కరువుకాటకాలు ఉండవు" అని చెప్పెను. శని భగవానుని దీవెనలు అందుకున్న తరువాత దశరథ మహారాజు, ఋష్యశృంగుని తన అల్లునిగా చేసుకొని తన సమస్యను తెలివిగా పరిష్కరించుకున్నాడు. ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ అయోధ్యలో ఉండేవిధంగా, దశరథుడు కుమార్తెగా చెప్పబడే 'శాంత'ను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించారు.

ఓం నమః శివాయ

ఓం శనైశ్చరాయ నమః

జగన్నాథ - రథయాత్ర సంపూర్ణ వివరాలు

 1) పూరి మందిరం పేరు ఏమిటి?( శ్రీ మందిరం ) 2) రథయాత్ర  ప్రారంభమయ్యే తొలితిధి ఏది?( ఆషాడ శుద్ధ విదియ ) 3) పూరీ మందిరాన్ని వదిలి ఈ తొమ్మిది రో...