జాతక రీత్యా రాహుదోషం గోచారరిత్యా రాహచెడుప్రభావం అధికమైయిబ్బందులుకల్గుచున్నప్పుడుమానసికరోగాలు,మెదడు,నరాలుకు సంభదించిఅనారోగ్యబాధలు,మానసికరోగాలుతో ఉన్మాదం కల్గినప్పుడూ రాహుకాలంలో దుర్గా దేవి ని తలచుకొని పూజ చేస్తే తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. ప్రతీరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది. రోజు చేయడం కుదరనివారు, మంగళ / శుక్రవారలలో రాహుకాల సమయంలో పూజ చేయాలి. ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం చాల మంచిది. అలా వీలు కానివారు ఇంట్లోనే శుచిగా దీపారాధన చేసి, శ్రీ దుర్గా స్తోత్రం చదివి మినపగారెలునైవేద్యం పెట్టాలి. రాహుకాల సమయంలో పసుపు రంగులో నైవేద్యం అంటే, ఓ రోజు నిమ్మకాయ పులిహొర మరొక రోజు అటుకుల పులిహొర నైవేద్యం పెట్టి ఎదైన పని మనసులో అనుకొని రాహుకాలపూజ మొదలుపెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ కార్యక్రమం జరుగుతుంది. కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు కూడా వెలిగిస్తారు. ఇది కూడా చాలా మంచిది.
రాహుకాల సమయం :
సోమవారం - ఉ 7:30 -9:00
మంగళవారం - మ 3:00 -4:30
బుధవారం - మ 12.00 - 1:30
గురువారం - మ 1:30 - 3:00
శుక్రవారం - ఉ 10:30 - 12:00
శనివారం - ఉ 9:00 - 10:30
ఆదివారం - సా 4:30 - 6:00
No comments:
Post a Comment