గురువులు వారి శిష్యులకు , భక్తులకు , ఒక్క శ్వాసకూడా వృధా కాకుండా ప్రతీ శ్వాసతో జపం చేయాలని చెబుతారు. ప్రతీ శ్వాసతో మంత్రాన్ని జపించాలి. పనిచేస్తూ , తిరుగుతూ , ప్రయాణం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, ఇలా ప్రతి నిత్యం మంత్రాన్ని జపం చేయాలి.! ఈ విధంగా ఉదయం రాత్రి విరామం లేకుండా చేస్తే , నిద్రలో కూడా జపం కొనసాగుతునే ఉంటుంది. ఇలా ప్రతి నిమిషం మనం మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే అది మనకు ఓ బలమైన రక్షణ కవచం లా పనిచేస్తుంది. ప్రతీ శ్వాసతో జరిపే జపం సహజ ప్రాణాయామానికి దారితీస్తుంది. దాని వల్ల కుండలినీ శక్తి సహజంగానే జాగృతం అవుతుంది. అది సహజ ఆనందానుభూతి ఇస్తుంది.
ఇలా మనం నిరంతరం ధ్యానావస్థలో ఉండాలంటే :-
👉🏿 మన మీద మనకు విశ్వాసం ఉండాలి.
👉🏿 దీక్ష ఇచ్చిన గురువు మీద విశ్వాసం ఉండాలి.
👉🏿 గురు మంత్రం మీద విశ్వాసం ఉండాలి.
👉🏿 ఆ మంత్రదేవతపై పరిపూర్ణమైన విశ్వాసం, భక్తి, శ్రద్ధలు కలిగి ఉండాలి.
ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా పంచదశి, షోడశి, లలితా సహస్రనామ, త్రిశతి అన్నీ చేస్తున్నా , నిరంతరం చేస్తూ ఉన్నా, ఎందుకు సరైన ఫలితాలు రావడం లేదు !? అంటే మనం ఒక మంత్రం కూడా పూర్తి స్థాయిలో విశ్వాసం తో ఉచ్చరించడం లెదు !! విశ్వాసం ఫలదాయకం. మనం విశ్వాసం తో మంత్రం ఉచ్చరించాలి. మనం గురువు ఉపదేశం ఇచ్చిన మంత్రాలను యాంత్రికంగా చేస్తున్నాము. అలా చేస్తే , మనకి , టేప్ రికార్డర్ కి పెద్ద తేడా లేదు కదా !! టేప్ రికార్డర్ కి మోక్షం లభించదు. టేప్ రికార్డర్ లాగా మనం మంత్రాలను యాంత్రికంగా జపం చేయకూడదు.
No comments:
Post a Comment