Wednesday, May 19, 2021

కాశీ కి వెళితే...కాయో పండో వదిలేయాలి .. మర్మమేమిటి ?

@ కాశీ కి వెళితే...కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు.... అందులో మర్మమేమిటి ??

అసలు శాస్త్రం లో ఎక్కడ కూడా.. కాశీ కి వెళితే కాయో, పండో వదిలేయాలి అని చెప్పలేదు..

శాస్త్రం చెప్పిన విషయాన్ని.. కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానం తో కొంచం వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు.

కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెప్తున్నది ఏమిటి అంటే... కాశీ వెళ్లి గంగ లో స్నానం చేసి " కాయాపేక్ష మరియు ఫలాపేక్ష" ను గంగలో వదిలి, ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని.

ఇక్కడ కాయాపేక్షా, ఫలాపేక్ష అన్నారు...అంటే...ఈ కాయము పై ( శరీరము పై అపేక్ష ని ) , ఫలాపేక్షా ( కర్మ ఫలము పై అపేక్ష ని) పూర్తిగా వదులుకొని...కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు.

కాలక్రమేణా...అది కాస్తా కాయ, పండు గా మారిపోయింది.

అంతే కానీ...  కాశీ వెళ్లి ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగ లో వదిలేస్తే...మనకు వచ్చు భక్తి కానీ, అందులో నిజమైన పుణ్యం ఎం ఉంటుంది.

కనుక.... శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకొని... ఆ క్షేత్ర దర్శనము, ఆ సంప్రదాయం పాటిస్తే..నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది... అంతే కాని మామిడి పండుని,  వంకాయ ని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు.

కనుక...ఈసారి మీరు కాశీ వెళితే....మనకి శత్రువులు అయిన ఈ శరీరం పై ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలం అపేక్ష ని మాత్రమే వదులుకొని....ఆ విశ్వనాథ దర్శనం చేసి, నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలి అని ప్రార్దించండి

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...