Wednesday, May 26, 2021

పద్నాలుగు లోకాలు - అవి ఏమిటి?

పురాణాలలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి అని చెప్తారు కదా. అవి ఏమిటి? వాటి పేర్లు, వాటి విశిష్టతలను వివరించగలరా?

నరకాలు, పాతాళ లోకాల గురించి నేను ఒక చోట చదివినది. ఇందులో సాధికారత ఎంత ఉందో తెలియదు. ఈ వ్యాఖ్యానంలో కొంత పిదపకాలపు పోకడ ఉన్నట్లు అనిపిస్తున్నాది!

1. అతలం - అగాధ ప్రాంతానికి చెందినది. భయము, కామము దీని లక్షణాలు.

2. వితలం - నిరసించడం లక్షణంగా కలిగినది. ఇక్కడ సుఖం ఉండదు, విపరీతమైన కోపం ఉంటుంది.

3. సుతలం - బాగా లోతైన అనే అర్థం. అసూయ దీని లక్షణం.

4. తలాతలం - అంధకారం, తామసికం దీని లక్షణం. గందరగోళం, అస్పష్టమైన ఆలోచనలకు, అమితమైన మొండితనానికి ఇది స్థానం.

5. రసాతలం - స్వార్ధపరత్వం, ఆధిపత్య ధోరణి, కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం దీని లక్షణాలు.

6. మహాతలం - అవివేకము దీని లక్షణము. అవివేకం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేవి తెలుసుకోలేక అసత్యమైన వాటి వెంటపడే లక్షణం. నరక లోకం యొక్క తీవ్రత ఇక్కడి నుంచే మొదలవుతుంది.

7. పాతాళం - కాకోలం అనే నల్లని విషం ఉండే ప్రాంతం. పతనమైన, లేదా పాపిష్టి పనులకు మూలం ఇది. దుర్బుద్ధి, దుష్టభావాలకు నిలయం. ఇక్కడుండే జీవులు వినాశనం కోసం వినాశనం చేస్తారు, హింసించటం కోసం హింసిస్తారు, చంపడం కోసం చంపుతారు.

వినాయకుని వాహనమైన ఎలుకకు అనింద్యుడు అనే పేరుందని విన్నాం కదా. దీనికి ఆధారం ఏమిటి? ఏ పురాణంలో 

డైనోసార్లు ఉండేవన్నదిu కాదనలేని సత్యం కదా, మరి హైందవ పురాణాలలో వీటి ప్రస్తావన ఎక్కడైనా ఉందా?

వటపత్రశాయి రూపం పురాణాల ప్రకారం ఎప్పుడు వచ్చింది? దీని అంతరార్థం ఏమిటి?

భూలోకంతో కలిపి భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు

1) భూలోకం - ఇచ్చట స్వేదం(చెమట నుండి ఉద్భవించు పేళ్ళు (పేనులు), నల్లులు మొ॥), ఉద్భిజాలు (గ్రుడ్డు నుండి ఉద్భవించు పక్షులు), జరాయుజాలు (స్త్రీ, పశువుల గర్భం నుండి ఉద్భవించు మానవులు పశువులు) అని నాలుగు విధాలైన జీవరాసులు.

2) భువర్లోకము (భూలోకము పైన) - ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సద్రుప్యాలైన గ్రహరాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర, కింపురుష, విద్యాధరులు కలరు.

3) సువఃలోకము లేక సువర్లోకము లేక స్వర్గలోకము (భువర్లోకము పైన) - ఇక్కడ అధిష్ఠాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్ష-వాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితోపాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగాలను అనుభవింతురు. వీరికి వ్రుద్ధ్యాం, శరీర దుర్గందాధులుండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున, మాత్రు-గర్భ వాసం లేదు.

4) మహర్లోకము (సువర్లోకము పైన) - ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు. ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో, అవిన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు.

5) జనోలోకము (మహర్లోకము పైన) - దీనిని కొందరు సత్యలోకం అని కూడా అంటారు. ఏ స్త్రీ భర్త మరణానంతరం సహగమనం చేస్తారో, ఆమె పవిత్ర శీలప్రభావంతో ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పిటికినీ, జన్మరాహిత్యం కలిగి, సతిపతులిరువు ఈ జనలోకంలో సుఖసాంతులతో వర్ధిల్లుదురు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తుంటారు.

6) తపోలోకము (జనోలోకము పైన) - ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కంధలోకం ఇచ్చటనే కలవు. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో, శాంతియుతంగా, సాంద్రానందంతో కూడి ఉంటుంది. భూలోకంలో ఎవరెవరు, ఏయే దేవతాముర్తులను ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలతో ఇక్కడ తపం ఆచరిస్తున్నారు. ఈ రీతిగా వారు కల్పాంత-కాలం అక్కడనే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి, మరల పవిత్ర తపాలు ఆచరించి, ఎప్పుడు మహాప్రళయంలో సర్వం లయమగునో అప్పుడు వీరు కూడ జన్మరాహిత్యం పొందుదురు.

7) సత్యలోకం (తపోలోకము పైన) - ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు, బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు ఆ పదవిని అనేకానేక కల్పానంతరం ఒక్కక్కరు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మంలో లయమవుతారు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్థభాగం తీరినది. భావిబ్రహ్మ శ్రీ ఆంజనేయస్వామి. ఈ లోకంలో కూడ అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంత విచారకులు, భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు, అసంఖ్యాకులగు మహర్షులు వేదాంతవిచారణలు గావిస్తుంటారు.

భూలోకానికి కింద ఉండేవి అధలోకాలు (7)

1) అతల లోకం - ఇందులో అసురులు నివసిస్తుంటారు. వీరు సూక్ష్మ శరీరులు. భౌతిక సుఖలాలసులు కావున అధిక మద సంపన్నులు.

2) వితల లోకం (అతలలోకం కింద) - ఇక్కడ పార్వతీ-పరమేశ్వరుల వీర్యం ‘ఆఢకం‘ అనే నది సువర్ణ జల ప్రవాహాంతో నిండి ఉండును. అనేక భౌతిక సుఖాలతో పాటు ఈ నదీ ప్రవాహంతో స్వర్ణాభరణాలు చేసుకొని ధరించెదరు.

3) సుతల లోకము (వితల లోకం కింద) - సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు బలి చక్రవర్తి ఇక్కడే ఉన్నాడు. అయన సర్వదా విష్ణుధ్యాన పరాయణుడై, శ్రీమహావిష్ణువు ద్వారపాలకుడై కాపలాకాస్తున్నాడు.

4) తలాతల లోకం (సుతల లోకం కింద) - ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులయిన త్రిపురాసురులు, దానవ శిల్పి అయిన మయుడు, మాయావిద్యలో నేర్పరులైన అసురులు, రాక్షసులు నివసిస్తారు.

5) మహాతలము (తలాతలలోకము కింద) - ఇక్కడ క్రదుపుత్రులైన (వినత క్రదువలు) కాద్రవేయులు(సర్పాలు), సహస్రాది శిరస్సులతో కూడినవారై మహా బలవంతులై కామరూపధారులై తమ పత్నులతో కూడి ఉన్నారు.

6) రసాతలము (మహాతలం కింద) - ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠులు, నివాత కావచులు, కాలకేయాదులు, సురారులైన అనేక రాక్షసులు కలరు.

7) పాతాళము (రసాతలం కింద) - ఇక్కడ నాగలోకాధిపతియైన వాసుకి మొదలు సర్ప సమూహములన్ని కామరూపధారులై సుఖసంతోషాలతో ఉన్నారు. మహా ప్రళయ కాలంలో ఈ చతుర్ధశ భువనాలు పరబ్రహ్మంలో లీనమగును.

Sunday, May 23, 2021

ప్రసాదాలలో పోషక విలువలు

ప్రతి ప్రసాదానికి విశిష్టత ఉంది. ఈ ప్రసాదాల్లో ఉన్న మిశ్రమాలు ఆరోగ్యానికి చేసే మేలు 

అంతా ఇంతా కాదు .


జీర్ణశక్తిని పెంచే ' కట్టె పొంగళి

బియ్యం , పెసరపొప్పు , జీలకర్ర , ఇంగువ , నెయ్యి , అల్లం , శొంఠిపొడి , ఉప్పు , కరివేపాకు , జీడిపప్పుల మిశ్రమంలో తయారయ్యే కట్టెపొంగలి రోగనిరోధకశక్తిని , జీర్ణశక్తిని 

పెంచు తుంది . 

మంచి ఆకలిని కలిగిస్తుంది .


జీర్ణకోశ వ్యాధుల నివారిణి ' పులిహోర

బియ్యం , చింతపండు పులుసు , శనగపప్పు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఎండుమిర్చి ఉప్పు , ఇంగువ , పసుపు , బెల్లం , నూనె , వేరుశన గలు , జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది . 

జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది .! 

                          

*మేధస్సును పెంచే దద్యోధనం*

బియ్యం , పెరుగు , ఇంగువ , కొత్తిమీర , అల్లం , - మిర్చి కొంఠి పొడిల మిశ్ర మంతో తయారు చేసే ఈ - ప్రసాదం మేధస్సును పెంచుతుంది . 

శరీరానికి కి మంచి శక్తిని ఇచ్చి 

ఆరోగ్యాన్ని కల్గిస్తుంది !!      

                     

వార్ధక్యాన్ని నిలువరించే ' కదంబప్రసాదం

బియ్యం , చింతపండు , ఎండుమిర్చి, పోపులు , ఇంగువ , నూనె , ఉప్పు , కందిపప్పు , పసుపు , బెల్లం , నెయ్యి , బెండకాయ , వంకాయ , గుమ్మడికాయ , చిక్కుళ్లు , బీన్స్ , దోసకాయ , క్యారెట్ , టమోటా , చిలకడదుంపల మిశ్రమంలో తయారు చేసే కదంబ ప్రసాదం అత్యంత బలవర్థకం . సప్తధాతువుల పోషణ చేస్తుంది . వార్ధక్యాన్ని నిలువరిస్తుంది . 

అన్ని వయస్సుల వారికి 

మంచి పౌష్టికాహారం!!                       

          

 శ్లేష్మాన్ని తగ్గించే  పూర్ణాలు "పచ్చిశనగపప్పు , బెల్లం , కొబ్బరి చురుము , యాలకుల మిశ్ర మంతో ఈ ప్రసాదం సప్తధాతు వుల పోషణ చేస్తుంది . 

శ్లేష్మాన్ని తగ్గిస్తుంది . 

మంచి బలవర్ధకం .!!


*రోగనిరోధకశక్తిని పెంచే చలిమిడి* 

బియ్యం పిండి , 

బెల్లం , యాలుకలు , నెయ్యి , పచ్చకర్పూరం , జీడిపప్పు , ఎండుకొబ్బరికో రుతో తయారుచేసే చలిమిడి మంచి బలవర్ధకం !!


కొబ్బరి పాల పాయసం

కొబ్బరి పాలు పచ్చ కర్పూరం యాలకుల పొడి బాదంపప్పు కుంకుమపువ్వు పంచదార ఆవు పాలు కలకండ పొడి తో చేసే ఈ ప్రసాదం వెంటనే శక్తినిస్తుంది. మంచి బలవర్ధకం. శ్రేష్మాన్ని హరిస్తుంది.

Wednesday, May 19, 2021

గ్రహాలు వాటి విశిష్టత

రవి: ఈ గ్రహానికి గ్రహరాజు అని పేరు. ఈ గ్రహం మేషంలో ఉచ్ఛ, తులలో నీచ స్థితిలో ఉంటాడు. అధికారానికి, ఆరోగ్యానికి, నేత్ర సంబంధిత వ్యాధులకు కారకుడు రవి. రాజకీయంగా అత్యున్నత పదవులు రావడానికి రవిగ్రహ బలం అవసరం. ఐ.ఎ.ఎస్‌., ఐ.పి.ఎస్‌ వంటి వాటికి ఎంపిక అవ్వాలంటే రవిగ్రహ అనుగ్రహం లేనిదే ఆ కోరిక సాధ్యపడదు. రవి అనుగ్రహం వల్ల గొప్ప డాక్టర్‌ అవుతారు. ఈ రవి జాతకంలో శుభగ్రహ దృష్టి కలిగి ఉంటే అలాంటి డాక్టర్లు ప్రజాసేవ బాగా చేస్తారు. పాపగ్రహ దృష్టి కలిగి ఉంటే డాక్టర్‌గా ప్రజలను ఎన్నిరకాలుగా దోచుకోవాలో అన్నిరకాలుగా దోచుకుంటారు. గణపతి హోమం చేయించండి.

చంద్రుడు: చంద్రుడు మనఃకారకుడు. జలములకు కారకుడు. క్రికెట్, బ్యాడ్మింటన్‌ వంటి క్రీడల్లోను, సంగీత రంగంలో, సినిమా రంగంలో రాణించడానికి చంద్రగ్రహ బలం చాలా అవసరం. చతుష్షష్టి కళాకోవిదుడైన చంద్రుడు ఒక గొప్ప స్థాయికి మనిషి ఎదగడానికి కారకుడు అవుతాడు. చంద్రగ్రహ జాతకుల నవ్వు ఆకర్షణీయంగా ఉంటుంది. మనోబలానికి, మనోధైర్యానికి చంద్రుడు కారకుడు. జల సంబంధమైన వ్యాపారాలు, ఉద్యోగాలు, అదేవిధంగా సినిమాలు తీయడం, వాటికి సంబంధించిన ఫలితాలు చంద్రగ్రహం వల్లనే సంప్రాప్తిస్తాయి. పౌర్ణమి రోజున పండితులను సంప్రదించి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి.

కుజుడు: ధైర్యానికి, పరాక్రమానికి, సైన్యాధ్యక్ష పదవికి, శక్తిమంతమైన మారణాయుధాలతో పోరాటం చేయడానికి, రక్తానికి, భూమి సంబంధమైన సమస్త సంపదలకు కుజుడే కారణం. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో రాణించాలన్నా, కోర్టు వివాదంలో ఉన్న ఆస్తులు మీకు అనుకూలంగా రావాలన్నా కుజగ్రహం చాలాముఖ్యం. ఈ కుజుడు శస్త్ర విద్యకు సంబంధించిన గ్రహం. సర్జన్‌గా రాణించాలంటే కుజుడి అనుగ్రహం తప్పనిసరి. కుజుడు అగ్నిగ్రహం. అంగారక పాశుపతహోమం చేయించండి.

రాహువు: ఛాయాగ్రహం. క్రమశిక్షణకు, కష్టపడి పైకి రావడానికి ప్రయత్నించే మనస్తత్వానికి రాహువే కారకుడు. ఎయిర్‌ఫోర్స్‌లో గానీ, నేవీలో గానీ ఉన్నత పదవులలో రాణించడానికి, యుద్ధరంగంలో వ్యూహప్రతివ్యూహాలు రచించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఎక్కువగా శక్తి పూజలు చేస్తారు. రాజకీయంలో అనూహ్యంగా, ఆకస్మికంగా రాణించడానికి రాహువే కారకుడు. అనూహ్య పతనానికి కూడా రాహువే కారకుడు. రాహుగ్రహం ఇచ్చే శుభయోగాలు అనేకం ఉన్నాయి. డ్రగ్స్‌కి బానిసయ్యే దుర్గుణానికి కూడా రాహువే కారకుడు. రుద్రపాశుపత హోమం చేయించండి.

గురువు: సంపూర్ణ శుభగ్రహం. ఉన్నతమైన ఆర్థికపరిస్థితి, అఖండ విద్యాయోగం, సాంప్రదాయ బద్ధమైన జీవన విధానం, అఖండమైన మేధస్సు, ఉన్నత పదవులు అధిష్టించి గొప్పగా రాణించడం, కుటుంబ శ్రేయస్సు పట్ల అధిక శ్రద్ధ, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు అధినేతలుగా రాణించడం, భగవత్‌ అనుగ్రహం సంప్రాప్తించడం, అన్నదాన సత్రాలు పెట్టించడం, గుళ్ళు కట్టించడం, విద్యాదానం చేయడం, ఇలాంటి లక్షణాల న్నీ గురుగ్రహం వల్లనే సంప్రాప్తిస్తాయి. ముహూర్తబలం అంతా గురుగ్రహం పైనే ఆధారపడి ఉంటుంది. నవగ్రహ పాశుపత హోమం చేయించండి.

శుక్రుడు: కళత్ర కారకో శుక్రః అన్నారు. ఈ శుక్రుడు భార్య స్థానానికి, భర్త స్థానానికి కారకుడు. మంచి సంబంధం కుదరాలన్నా, సంసార జీవితం బాగుండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి. ప్రేమ వివాహాలు ఫలించాలన్నా శుక్రుడే గతి. సురాపాన కారకో శుక్రః. సురాపానం చేసే అలవాటు శుక్రుని వల్ల కలుగుతుంది. అంతరాత్మ ప్రబోధానుసారం వీళ్ళు సురాపానం సేవించడం మానేస్తారు. అత్యంత విలాసవంతమైన జీవితం, సమస్త భోగాలు, రాచమర్యాదలు లభించడం, అందానికి, ఐశ్వర్యానికి మారుపేరుగా నిలబడాలంటే అది ఒక్క శుక్రుడి వల్లనే సాధ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితంలో సుఖపడాలంటే శుక్రుని అనుగ్రహం తప్పని సరి. భగుపాశుపత హోమం చేయించండి.

శని: నీతి, నిజాయితీలకు, న్యాయానికి, ధర్మానికి కారకుడు శని. ఎవరి ప్రోత్సాహం లేకపోయినా, ఎందరు ఎన్ని అవమానాలు సృష్టించినా, పట్టువీడక జీవితాశయాన్ని సాధించడానికి శనే కారకుడు. సమన్యాయం, సమధర్మం పట్ల కట్టుబడి ఉండేవాళ్ళు శనిగ్రహ ప్రభావ మానవులే. అవినీతి, లంచగొండితనం, కుల, మత, వర్గ, ప్రాంతీయ ద్వేషాలు వీటన్నింటికి అతీతంగా ప్రవర్తించే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద శనిగ్రహ ప్రభావం ఉన్నట్టే లెక్క. శని అత్యంత ముఖ్యమైన ఆయుర్దాయానికి కారకుడు. జాతకంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా అవి అనుభవించాలంటే ఆయుర్దాయం కావాలి. దీనర్థం శనిగ్రహం అనుకూలంగా ఉంటేనే సుదీర్ఘ జీవిత ప్రయాణం సాధ్యం. స్త్రీలను వేధించే వారిపట్ల శని చాలా కఠినంగా ప్రవర్తిస్తాడు. అఘోర పాశుపత హోమం చేరుుంచండి.

బుధుడు: అత్యంత తెలివైన గ్రహం. వ్యాపారానికి బుధుడే కారణం. ఏ వ్యాపారం చేసినా డబ్బులు మిగలాలంటే బుధుడి అనుగ్రహం కావాలి. సాహిత్యరంగంలో ప్రపంచ స్థాయి సాధించాలన్నా, వందలాది పుస్తకాలు వ్రాసి ప్రజలలో మహాపండితుడిగా రాణించాలన్నా, జ్ఞానపీఠ్‌ వంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు లభించాలన్నా, ఆయుర్వేద వైద్యుడిగా రాణించాలన్నా, వందల కోట్లు సంపాదించాలన్నా బుధగ్రహ అనుగ్రహం తప్పనిసరి. జాతకంలో బుధుడు బాగుంటే ఇవన్నీ ఇప్పిస్తాడు. జ్యోతిష శాస్త్రంలో అఖండమైన పరిజ్ఞానానికి, అఖండమైన కీర్తిప్రతిష్టలకు బుధగ్రహ అనుగ్రహమే కారణం. సుదర్శన పాశుపతహోమం చేయించండి.

కేతువు: మోక్షానికి, మంత్రసిద్ధికి, భగవత్‌ అనుగ్రహానికి, ఉత్తమమైన అంత్యక్రియలకు, అధమాధమమైన అంత్యక్రియలకు ఛాయాగ్రహమైన కేతువే కారణం. ఈ కేతువు ఏ రంగంలోనైనా జాతకుడిని ఉత్తమ స్థితికి తీసుకు వెళ్తాడు. ఉత్తమస్థితి వచ్చిన తరువాత అహంకారంతో రెచ్చిపోతే పతనం అవడానికి కూడా కేతువే కారణం అవుతాడు. సర్పదోషాలకు కేతువే నియంత్రణ గ్రహం. రాహు కేతువులిద్దరూ సర్పగ్రహాలే. అవధూతలను ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన నియమాలతో పూజాపునస్కారాలు చేయడానికి, పవిత్రమైన పుణ్యక్షేత్రాల సందర్శన, వాటి వల్ల వచ్చే పుణ్యానికీ ఈ గ్రహమే కారణం. పితకర్మలు చేయని వారికి కేతువు వల్ల అరిష్టాలు సంప్రాప్తిస్తారుు. గణపతి హోమం చేయించండి.

ఒడిబియ్యం అంటే ఏమిటి

ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి. ఈనాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈనాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది.  ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు వుంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో "ఒడ్డియాన పీఠం" వుంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే "ఒడ్డియాణం" వాడుకలో "వడ్యాణం" "వడ్డాణం" అంటారు.

ఏడు చక్రాలలో శక్తి (గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో వున్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. ఒడ్డియాణపీఠంలో వుండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే, ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను కూడా మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి. అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు. ఒడి అంటేనే రక్షణ.

ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్ళకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు. మహాలక్ష్మి యొక్క మొదటి లక్షణం రక్షించటం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమ బిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని పుట్టింటివారు  చేసే సంకల్ప పూజ మాత్రమే.

సంతోషంతో ఆ మహాలక్ష్మి (ఆడపడుచు), తన అమ్మ గారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిళ్ళ బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి, దేవుని ప్రార్ధించి, మహాద్వారానికి నూనె రాసి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది. అక్కడ ఆడాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను(ఐశ్వర్యాన్ని) ఊరంతా పంచుతుంది.

ఇది అత్తవారు కూడ చేయవచ్చు.....

అందుకే ఒడిబియ్యం యొక్క విలువ, గౌరవం, సారాంశం తెలుసుకోవాలి. అత్యంత నిష్ఠతో చేయాలి...

కాశీ కి వెళితే...కాయో పండో వదిలేయాలి .. మర్మమేమిటి ?

@ కాశీ కి వెళితే...కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు.... అందులో మర్మమేమిటి ??

అసలు శాస్త్రం లో ఎక్కడ కూడా.. కాశీ కి వెళితే కాయో, పండో వదిలేయాలి అని చెప్పలేదు..

శాస్త్రం చెప్పిన విషయాన్ని.. కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానం తో కొంచం వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు.

కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెప్తున్నది ఏమిటి అంటే... కాశీ వెళ్లి గంగ లో స్నానం చేసి " కాయాపేక్ష మరియు ఫలాపేక్ష" ను గంగలో వదిలి, ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని.

ఇక్కడ కాయాపేక్షా, ఫలాపేక్ష అన్నారు...అంటే...ఈ కాయము పై ( శరీరము పై అపేక్ష ని ) , ఫలాపేక్షా ( కర్మ ఫలము పై అపేక్ష ని) పూర్తిగా వదులుకొని...కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు.

కాలక్రమేణా...అది కాస్తా కాయ, పండు గా మారిపోయింది.

అంతే కానీ...  కాశీ వెళ్లి ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగ లో వదిలేస్తే...మనకు వచ్చు భక్తి కానీ, అందులో నిజమైన పుణ్యం ఎం ఉంటుంది.

కనుక.... శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకొని... ఆ క్షేత్ర దర్శనము, ఆ సంప్రదాయం పాటిస్తే..నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది... అంతే కాని మామిడి పండుని,  వంకాయ ని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు.

కనుక...ఈసారి మీరు కాశీ వెళితే....మనకి శత్రువులు అయిన ఈ శరీరం పై ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలం అపేక్ష ని మాత్రమే వదులుకొని....ఆ విశ్వనాథ దర్శనం చేసి, నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలి అని ప్రార్దించండి

Thursday, May 13, 2021

అక్షయ తృతీయ

అక్షయ తృతీయ అనగా ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి వివరించారు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే వ్రతం, జపం,హోమం, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుందని చెపుతాడు. అక్షయ తృతీయ నాడు చేసేటువంటి దానాలు మంచి ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభించడంతో పాటు సత్ఫలితాలు చేకూరుతాయి.


వైశాఖ శుద్ధ తదియ నాడు.... 

1.పరశురాముని జన్మదినం 

2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం 

3. త్రేతాయుగం మొదలైన దినం 

4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం 

5. వ్యాస మహర్షి "మహా భారతము"ను, వినాయకుని సహాయముతో వ్రాయడం మొదలుపెట్టిన దినం 

6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు "అక్షయ పాత్ర" ఇచ్చిన దినం 

7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం 

8. ఆదిశంకరులు "కనకధారాస్తవం" ను చెప్పిన దినం 

9. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం 

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కు ఎన్ని పేర్లు

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కు ఎన్ని పేర్లు ఉన్నాయో మనం ముందు ముందు చదువుతాం. కానీ ఆ పేర్లు ముందుగా ఇక్కడ రాస్తున్నాను.

అచ్యుతుడు

అనంతుడు

అప్రతిమప్రభావుడు

అరిసూదనుడు

జనార్దనుడు

దేవుడు

దేవదేవుడు

దేవవరుడు

దేవేశుడు

పరమేశ్వరుడు

పురుషోత్తముడు

ప్రభువు

భగవంతుడు

ఆద్యుడు

కమలపత్రాక్షుడు

కృష్ణుడు

కేశవుడు

భూత భావనుడు

భూతేశుడు

మధుసూదనుడు

మహాత్ముడు

మహాబాహువు

మాధవుడు

యాదవుడు

యోగి

యోగీశ్వరుడు

కేశినిషూదనుడు

గోవిందుడు

జగత్పతి

జగన్నివాసుడు

వార్ష్ణేయుడు

వాసుదేవుడు

విశ్వమూర్తి

విశ్వేశ్వరుడు

విష్ణువు

సర్వుడు

సహస్ర బాహువు

హృషీకేశుడు


 భగవద్గీతలో అర్జునుడికి ఈ క్రింది పేర్లు వాడారు. 

అనఘుడు

అనసూయుడు

అర్జునుడు

కపిధ్వజుడు

కిరీటి

పురుషర్షభుడు

కురుప్రవీరుడు

కురునందనుడు

కురుశ్రేష్టుడు

కురుసత్తముడు

కౌంతేయుడు

గుడాకేశుడు 

తాత

దేహభృతాంవరుడు

ధనంజయుడు

పరంతపుడు

పాండవుడు

పార్థుడు

భరతర్షభుడు

భరతశ్రేష్టుడు

భరతసత్తముడు

భారతుడు

మహాబాహువు

సవ్యసాచి


భగవద్గీత చదివినవారికి ఈ పేర్లు అన్నీ తెలిసే ఉంటాయి. ఎవరైనా తెలియని వారు ఉంటారేమో అని ఈ పేర్లు రాయడం జరిగింది.

నేను రాస్తున్నటువంటి భగవద్గీత చదువుతున్న వారికి... ఎవరికి ఎటువంటి సందేహాలు వచ్చినా ప్రశ్నల రూపంలో అడగొచ్చు. శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహంతో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను.

రేపు మరిన్ని విషయాలు తెలుసుకుందాం….

దయచేసి నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీరు లైక్ చేయనట్లయితే విమర్శించండి. ఆ తప్పును సరి దిద్దుకుంటాను.

(From నారాయణం వెంకటరెడ్డి)

Wednesday, May 12, 2021

సమస్యలను తొలగించే పూజలు

కొన్ని రకాల సమస్యలు ఎప్పటికీ పట్టి పీడిస్తుంటాయి. అలంటి సమస్యలు మనం భగవంతుడిని భక్తి శ్రధలతో పూజిస్తే కాని తొలగిపోవు. ఆ సమస్యలు ఏమిటో వాటికీ ఏఏ దేవుడిని ఆరాధించాలో వివరంగా తెలుసుకుందాము...

మానసిక బలం, శరీర దృఢత్వం కోసం రాజరాజేశ్వరిని, శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్ధించాలి.

ఆయురారోగ్యాల కోసం రుద్రుడిని పూజించాలి.

వ్యాధులు, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలి అంటే శ్రీ ధన్వంతరీని పూజించాలి.

విద్యారంగలో రాణించాలి అంటే శ్రీ సరస్వతిని, శారదాంబని కొలవాలి.

గృహం, భూమిని కొనాలంటే శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని, అంగారకుడిని పూజించాలి.

వివాహ అడ్డంకులు తొలగిపోవాలి అంటే శ్రీ కామాక్షి దేవిని, శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి.

మాంగల్య దోషాలు తోలగిపోవాలి అంటే శ్రీ పార్వతిదేవిని పూజించాలి.

శత్రుబాధలు తొలగిపోవాలి అంటే నారసింహుని పూజించటం ఉత్తమం.

వ్యాపారంలో లాభం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లాభం.

సంతాన ప్రాప్తికోసం సంతాన గోపాలుని, సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి

Monday, May 10, 2021

100 మంది కౌరవుల పేర్లు

1. దుర్యోధనుడు. 2. దుశ్సాసనుడు. 3. దుస్సహుడు. 4. దుశ్శలుడు. 5. జలసంధుడు. 6. సముడు. 7. సహుడు. 8. విందుడు. 9. అనువిందుడు. 10. దుర్దర్షుడు. 11. సుబాహుడు. 12. దుష్పప్రదర్శనుడు. 12. దుర్మర్షణుడు. 13. దుర్మఖుడు. 15. దుష్కర్ణుడు. 16. కర్ణుడు. 17. వివింశతుడు. 18. వికర్ణుడు. 19.శలుడు. 20. సత్వుడు. 21. సులోచనుడు. 22. చిత్రుడు. 23. ఉపచిత్రుడు. 24. చిత్రాక్షుడు. 25. చారుచిత్రుడు. 26. శరాసనుడు. 27. ధర్మధుడు. 28. దుర్విగాహుడు. 29. వివిత్సుడు. 30. వికటాననుడు. 31. నోర్ణనాభుడు. 32. నునాభుడు. 33. నందుడు. 34. ఉపనందుడు. 35. చిత్రాణుడు. 36. చిత్రవర్మ. 37. సువర్మ. 38. దుర్విమోచనుడు. 39. అయోబావుడు. 40. మహాబావుడు. 41. చిత్రాంగుడు. 42. చిత్రకుండలుడు. 43. భీమవేగుడు. 44. భీమలుడు. 45. బలాకుడు. 46. బలవర్థనుడు. 47. నోగ్రాయుధుడు. 48. సుషేణుడు. 49. కుండధారుడు. 50. మహోదరుడు. 51. చిత్రాయుధుడు. 52. నిషింగుడు. 53. పాశుడు. 54. బృఎందారకుడు. 55. దృఢవర్మ. 56. దృఢక్షత్రుడు. 57. సోమకీర్తి. 58. అనూదరుడు. 59. దఢసంధుడు. 60. జరాసంధుడు. 61. సదుడు. 62. సువాగుడు. 63. ఉగ్రశ్రవుడు. 64. ఉగ్రసేనుడు. 65. సేనాని. 66. దుష్పరాజుడు. 67. అపరాజితుడు. 68. కుండశాయి. 69. విశాలాక్షుడు. 70. దురాధరుడు. 71. దుర్జయుడు. 72. దృఢహస్థుడు. 73. సుహస్తుడు. 74. వాయువేగుడు. 75. సువర్చుడు. 76. ఆదిత్యకేతుడు. 77. బహ్వాశి. 78. నాగదత్తుడు. 79. అగ్రయాయుడు 80. కవచుడు. 81. క్రధనుడు. 82. కుండినుడు. 83. ధనుర్ధరోగుడు. 84. భీమరధుడు. 85. వీరబాహుడు. 86. వలోలుడు. 87. రుద్రకర్ముడు. 88. దృణరదాశ్రుడు. 89.అదృష్యుడు. 90. కుండభేది. 91. విరావి. 92. ప్రమధుడు. 93. ప్రమాధి. 94. దీర్గరోముడు. 95. దీర్గబాహువు. 96.ఉడోరుడు. 97. కనకద్వజుడు. 98. ఉపాభయుడు. 99. కుండాశి. 100. విరజనుడు. 

101వ బిడ్డగా దుశ్శల అనే ఆడపిల్ల జన్మిస్తుంది.

Sunday, May 9, 2021

వరాహా జయంతి

భగవంతుడు దుష్టశిక్షణకు , శిష్టరక్షణకు అవసరమైనప్పుడు లోకంలో అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అలా అవతరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైన అవతారాలు పది. మత్స్య , కూర్మ , వరాహ , నృసింహ , వామన , పరశురామ , శ్రీరామ , శ్రీకృష్ణ , బుద్ధ , కల్కి అనే పేర్లతో దశావతారాలు ప్రాచీన గ్రంథాల్లో కనబడుతున్నాయి.

దశావతారాల్లో మూడవ దైన వరాహావతారం హిరణ్యాక్షుడి చెర నుంచి భూమిని రక్షించడానికి సంభవించిందని పురాణేతిహాసాలు వివరిస్తున్నాయి. పూర్వం దితి కుమారుడు , హిరణ్యకశిపుడి సోదరుడు అయిన హిరణ్యాక్షుడనే రాక్షసుడు అహంకారంతో చెలరేగిపోయి భూమిని పాతాళానికి తోసివేశాడు. తన అన్నను చంపిన విష్ణువు అంటే ఇతడికి ద్వేషం. ఆ కారణంగా విష్ణువును వధించాలని వైకుంఠానికి వెళ్తూ ఉండగా , దారిలో నారదుడు ఎదురయ్యాడు. విష్ణువు ఇప్పుడు వైకుంఠంలో లేడని , యజ్ఞవరాహ రూపంలో పాతాళంలో ఉన్నాడని నారదుడు హిరణ్యాక్షుడికి చెప్పాడు. అప్పుడు హిరణ్యాక్షుడు విష్ణువును వెదుకుతూ పాతాళానికి వెళ్లాడు. అక్కడ వరాహరూపంలో ఉన్న విష్ణువుతో యుద్ధానికి తలపడ్డాడు. వరాహరూపంలో ఉన్న విష్ణువు తన వాడి అయిన కోరలతో కుమ్ముతూ ఆ దుష్టరాక్షసుణ్ని వధించాడు. అనంతరం పాతాళంలో పడివున్న భూమిని తన పంటికొసపై ఉద్ధరించి , పైకి తెచ్చి కాపాడాడు. భూదేవికి హిరణ్యాక్షుడి పీడ తొలగిపోయింది. దేవతలు సంతోషించారు. భూలోకవాసులు ఆనందించారు. వరాహమూర్తి అనుగ్రహంతో స్వాయంభూ వసువు భూలోకాన్ని ధర్మబద్ధంగా పాలించాడు. జగత్కల్యాణం కోసం మహావిష్ణువు వరాహరూపంలో అవతరించిన ఈ పవిత్ర దినాన ‘వరాహ జయంతి’ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆచారంగా మారింది. ప్రతి ఏటా భాద్రపద మాసంలోని శుక్లపక్ష తృతీయనాడు వరాహక్షేత్రాల్లో వైభవంగా వరాహ జయంతిని నిర్వహించడం , భక్తులు ఒక పర్వదినంగా పూజలు చేయడం పరిపాటి. కొందరు చైత్రబహుళ త్రయోదశినాడు వరాహజయంతిని నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లోని ఆచారాలను, సంప్రదాయాలనూ అనుసరించి ఈ వైవిద్యం ఉంటుంది.

వరాహావతార వైశిష్ట్యాన్ని తెలిపే వరాహ పురాణంలో కలియుగార్చావతారుడైన శ్రీ వేంకటేశ్వరుడికి తిరుమలలో నివాసస్థలం ఇచ్చింది వరాహస్వామేనన్న ప్రశస్తి ఉంది. అందుకే నేటికీ తిరుమలను వరాహక్షేత్రం అని పిలుస్తారు. శ్రీ వేంకటేశ్వరుణ్ని దర్శించుకోవడానికి ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలనే నియమం కూడా ఉంది. స్వామి పుష్కరిణీ తీరంలో వెలసిన వరాహస్వామి ఆలయం తిరుమలకు వెళ్లే యాత్రికులకు ప్రథమ పూజ్యస్థానం.

కోరలతో నేలను తవ్వుకుంటూ వెళ్లే వరాహం మానవుడికి కృషీవలత్వాన్ని బోధిస్తోంది. నేలను తవ్వి , సాగుచేసి , రత్నాల వంటి పంటలు పండించాలని చెబుతోంది. అవసరమైతే పంటికోరలపై భూమిని మోసినట్లు , భారాన్ని మోయాలని ప్రబోధిస్తోంది. ఆపదలో మునిగిపోయినవారిని లోతుల్లోకి వెళ్లి రక్షించాలని మార్గదర్శనం చేస్తోంది. మహిమ గల వరాహస్వామి ఎందరికో ఆరాధ్య దైవమై ఈ భూమండలంలోని అనేక క్షేత్రాలలో కొలువుదీరి ఉన్నాడు. వరాహస్మరణం సకల పాపహరమే కాకుండా , విశ్వకల్యాణకారకం కూడా !

Friday, May 7, 2021

హనుమలో శివుడుని దర్శించిన సీతమ్మతల్లి

  హనుమ రోజూ సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో  .... ఈ రోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను  .... నేనే స్వయంగా  వంటచేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను అంది సీతమ్మ  .... పిలు పిలు .... నీకే అర్థం అవుతుంది అన్నాడు రాముడు నవ్వుతూ  .... అన్నట్టుగానే సీతమ్మ స్వయంగా వంటచేసి  .... హనుమని భోజనానికి పిలిచింది  .... తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ  .... కడుపునిండా తిను నాయనా  .... మొహమాటపడకు  అని చెప్పింది  ..

సరేనమ్మా అని చెప్పి హనుమ తలవంచుకుని భోజనం చేయసాగాడు  .... సీతమ్మ కోసరి కోసరి వడ్డిస్తోంది  .... హనుమ వద్దు అనకుండా .... వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతా తింటున్నాడు  .... కాసేపట్లో సీతమ్మ స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది .... సీతమ్మ కంగారు పడి అంఃతపురవాసుల కోసం వండిన వంట తెప్పించింది  .... అదీ అయిపోయింది  .... తలవంచుకునే  ఆహరం కోసం నిరీక్షీస్తూన్నాడు ....  హనుమ ఆవురావురమంటూ  .... సీతమ్మకి కంగారు పుట్టి .... రోజూ ఏం తింటున్నావు నాయనా  .... అని అడిగింది వినయంగా  ...

రామ నామం తల్లీ  .... వంచిన తలెత్తకుండా జవాబిచ్చాడు  హనుమ  .... సీతమ్మ త్రుళ్లిపడింది  .... నిరంతరం  రామనామం భుజించేవాడు  .... భజించేవాడు  .... శివుడోక్కడే గదా  .... సీతమ్మతల్లి తేరిపార జూసింది  .... అపుడు కనిపించాడు సీతమ్మకి  .... హనుమలో శంకరుడు  .... శంకరుడే హనుమ  .... నిత్యం రామనామం ఆహరంగా స్వీకరించేవాడికి  .... తాను మరే ఆహరం పెట్టగలదు  ....

సీతమ్మ ఓక అన్నపు ముద్దను పట్టుకుని  .... రామార్పణం అని ప్రార్థించి వడ్డించింది  .... ఆ ముద్దని  భక్తితో కళ్లకు అద్దుకోని స్వీకరించి  .... అన్మదాత సుఖీభవా అన్నాడు హనుమ త్రుప్తిగా  .... హనుమలోని పరమేశ్వరుడుకి భక్తితో నమస్కరించింది సీతమ్మతల్లి  ....


Thursday, May 6, 2021

ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము

ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము 

 1. మత్స్యపురాణం 

 2. కూర్మపురాణం 

 3. వామన పురాణం 

 4. వరాహ పురాణం 

 5. గరుడ పురాణం 

 6. వాయు పురాణం 

 7. నారద పురాణం 

 8. స్కాంద పురాణం 

 9. విష్ణుపురాణం 

 10. భాగవత పురాణం 

 11.అగ్నిపురాణం 

 12. బ్రహ్మపురాణం 

 13. పద్మపురాణం 

 14. మార్కండేయ పురాణం 

 15. బ్రహ్మవైవర్త పురాణం 

 16.లింగపురాణం 

 17.బ్రహ్మాండ పురాణం 

 18. భవిష్యపురాణం 


 ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది. 


 మత్స్యపురాణం: 


 మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు. 


 కూర్మపురాణం: 



 కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది. 


 వామన పురాణం: 


 పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి. 


 వరాహపురాణం: 



 వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి. 


 గరుడ పురాణం: 


 గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది. 


 వాయుపురాణం: 


 వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి. 


 అగ్నిపురాణం: 


 అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు. 


 స్కందపురాణం: 


 కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి. 


 లింగపురాణం: 


 లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది. 


 నారద పురాణం: 


 బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. 


 పద్మపురాణం: 


 ఈ పురాణంలో


 మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది. 


 విష్ణుపురాణం: 


 పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది. 


 మార్కండేయ పురాణం: 


 శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి. 


 బ్రహ్మపురాణం: 


 బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు. 


 భాగవత పురాణం: 


 విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు. 


 బ్రహ్మాండ పురాణం: 


 బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది. 


 భవిష్యపురాణం: 


 సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది. 


 బ్రహ్మాపవైపర్తపురాణము : 


 ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి. 

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...