ధర్మం అనే పదానికి చాలా విస్తృతమైన, గంభీరమైన అర్థాలున్నాయి. ధర్మం అనే పదానికి పుణ్యం, న్యాయం, స్వభావం, ఆచారం, వేదోక్త విధి, ఉపనిషత్తు, యజ్ఞం, విల్లు, సత్కర్మ, నీతి మొదలైన అర్థాలు నిఘంటువులో ఉన్నాయి. మరో రకంగా చూస్తే ధరించేది కాబట్టి ధర్మం అవుతుంది. ధర్మమే ప్రజలను ధరిస్తూ ఉంది. ఏది సంఘాన్ని కట్టుబాట్లలో నిలుపుతుందో అదే ధర్మమని పెద్దలు నిశ్చయించారు.
పురుషార్థాలు నాలుగు ఉన్నాయి. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటికి సనాతన ధర్మంలో ఉన్నత స్థానమిచ్చారు. ఇవి వేర్వేరుగా ఉన్నా ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. మొదటిదైన ధర్మంతోనే మిగతా మూడింటిని లగింపు చేసుకోవాలని పెద్దలు అంటారు. ధర్మాలు పాటించటమే కాక అర్థ సంపాదన ధర్మంగా ఉండాలని, కామం ధర్మ బద్ధమైనదే అయి ఉండాలని, ధర్మం గానే మోక్ష సాధ నకు కృషి చేయాలన్నది దీనిలో అంతర్గతంగా ఉన్న మరో అర్థమని వారు చెబు తుంటారు. ధర్మా చరణ అంటేనే అన్ని పనులు ధర్మబద్ధంగా చేయడమని మరి కొందరు చెబుతుంటారు. ఇక పురుషార్థాలలో ధర్మం గురించి మరింత విపులంగా తెలుసుకుందాం.
ధర్మం…
ధర్మం అనే పదానికి చాలా విస్తృ తమైన, గంభీరమైన అర్థాలున్నాయి. ధర్మం అనే పదానికి పుణ్యం, న్యాయం, స్వభావం, ఆచా రం, వేదోక్త విధి, ఉపనిషత్తు, యజ్ఞం, విల్లు, సత్కర్మ, నీతి మొదలైన అర్థాలు నిఘంటువులో ఉన్నాయి. మరో రకంగా చూస్తే ధరించేది కాబట్టి ధర్మం అవుతుంది. ధర్మమే ప్రజలను ధరిస్తూ ఉంది. ఏది సంఘాన్ని కట్టుబాట్లలో నిలుపుతుందో అదే ధర్మమని పెద్దలు నిశ్చయించారు.
వేదం మానవుణ్ని ఏది చేయమని ఆజ్ఞాపిస్తుందో అది ధర్మమని జైమిని మహర్షి మంత్రపూర్వకంగా తెలి పారు. వేదం సమస్త ధర్మాలకు మూలం, ప్రమాణమన్నది మనుస్మృతి. అహింసా పరమో ధర్మ: (ఏ ప్రాణిని హింసించక పోవడమే శ్రేష్ఠమైన ధర్మం. ధర్మ శబ్దం పది లక్షణాలతో కూడుకున్నదని మనుస్మృతికారుడు మరొక చోట విశేష వివ రణ ఇచ్చాడు.
దశ లక్షణాలు…
ధృతి..
ఎల్ల్లప్పుడూ ధైర్యంగా ఉండడం. ధర్మ కార్యాలను ఆచరించేటపుడు కలిగే కష్ట నిష్ఠురాలను సహిస్తూ వెనుకంజ వేయక ఆయా కార్యాలను పూర్తి చేయడం ధృతి అనబడుతుంది.
క్షమ..
ఓర్పు కలిగి ఉండడం. సుఖ దు:ఖాల్లో, లాభనష్టాల్లో మానావ మానాల్లో సహన శీలుడై సమ భావంతో ఉండటం క్షమ అనబడు తుంది.
దమము..
ఇంద్రియ నిగ్రహంతో ఉండటం
అస్తేయం..
దొంగతనం చేయకుండడం. ఇతరుల వస్తువులను వారి అనుమతిలేకుండా తీసుకోకూడదనే భావన.
శౌచము..
పవిత్ర భావాలు, భగవత్ప్రసాద బుద్ధి. దైవేచ్ఛ అనే ప్రపత్తి.
శమము..
మనో నిగ్రహం కలిగి ఉండడం.
ధీ..
ధీ అంటే బుద్ధి. బుద్ధిని మందగింపజేసే పనులు అనగా మాదక ద్రవ్య సేవనం, దుష్ట సాంగత్యం, సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండటం. మంచి బుద్ధి కలిగి ఉండడం.
విద్య..
పరమేశ్వర పర్యంతం పదార్థాల జ్ఞానం కలిగి వాని నుంచి ఉపకారం పొందడం విద్య. ఆత్మనందు ఉన్నట్టు మనస్సులో తలచడం, మనస్సులో తలచినది వాణి (మాట) ద్వారా పలకడం, వాణి మేరకే కర్మలయందు ప్రవర్తించడం విద్య.
సత్యం..
ఉన్నది ఉన్నట్టు చెప్పడం, వినడం, ఆచరించడం, సత్యమనబడుతుంది. సత్యం చెప్పాలిగాని ఇంపుగా చెప్పాలి. సత్యాన్ని అప్రియం అంటే కష్టం కలిగేట్లు చెప్పరాదు. ఇంపుగా ఉంటుంది గదా అని అబద్ధం చెప్పకూడదు. ఇది అనాదిగా వస్తున్న ధర్మం. ఉదాహరణకు అంగవైకల్యం కల వారిని అంగవైకల్యంతో సంబోధించరాదు.
అక్రోధం..
పరులకు కష్టాన్ని, హానిని కలిగించే కోపాన్ని విడిచి , శాంతం సౌమ్యం మొదలైన గుణాలను గ్రహించడం అక్రోధం అవుతుంది. ఈ పది లక్షణాలతో కూడిన పక్షపాతరహిత న్యాయాచరణమనే ధర్మాన్ని బ్రహ్మచారులు, గృహస్థులు, వాన ప్రస్థులు, సన్యాసులు అందరూ సేవించాలి. ఇది ధర్మం అనే పదానికి మనువు చెప్పిన నిర్వచనం. ధర్మాన్ని ఆచరించడం వల్ల అర్థకామాలు లభ్యమవుతాయని వ్యాస మహర్షి వచనం. అర్థాన్ని, కామాన్ని (కోరికలను) ధర్మంతో ముడిపెట్టి ఆచరించేవారికి మోక్ష మార్గం అప్రయత్నంగా లభిస్తుంది.
ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత:
ధర్మాన్ని నశింపజేసే వ్యక్తిని అది నశింపజేస్తుంది. ధర్మాన్ని రక్షించే వారిని అది రక్షిస్తుంది. అందువల్ల ధర్మాన్ని నాశనం చేయకూడదు. మన చేత ధర్మం చంపబడక మనలనది రక్షించుగాక. ధర్మాన్ని ప్రాణాపాయ స్థితిలో కూడా విడవరాదని మనువు అంటాడు.
మహాభారతంలో ధర్మరాజు ధర్మానికి ప్రతీక. భారతం ధర్మంతోనే ముగుస్తుంది. ధర్మం తెలిసిన వారు ధర్మానికి ఇబ్బంది కలిగించే ధర్మాన్ని ధర్మంగా భావించరు. ధర్మమనేది సర్వులకు హితమైనదై ఉండాలి. సమిష్టి ధర్మానికి, వ్యష్టిధర్మానికి వైరుధ్యం కలిగినప్పుడు వ్యష్టి ధర్మాన్ని త్యాగం చేయాలి. భీష్ముడు వ్యష్టి ధర్మాచర ణం కోసం సమిష్టి ధర్మానికి హాని చేయడం వలన మరణించాల్సి వచ్చిందని కొందరి అభిప్రాయం.
ధర్మాత్ములు…
తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ, ఈ ఐదింటిని పూజించేవారు ధర్మాత్ములు అని శాస్త్రం చెబుతోంది. ధర్మం నిత్యం. సుఖ దు:ఖాలు అనిత్యం. అందువల్ల సుఖేచ్ఛ చేత గాని, భయం చేత గాని, లోభం చేత కాని ప్రాణాపాయ స్థితిలో అయినా సరే ధర్మాన్ని విడువకూడదు. జీవుడు నిత్యుడు. అతడు నివసించే ఈ శరీ రం అనిత్యం. అందువల్ల్ల అనిత్యాలైన వాటి కోసం వ్యర్థ ప్రయత్నాలు చేయక నిత్యుడైన జీవుడు నిత్యమైన ధర్మం కోసం యత్నించడం శ్రేయస్కరమవుతుంది.
నారాయణ ఉపనిషత్తు ప్రకారం – ‘ధర్మమే సర్వ జగత్తుకు ఆధారము’. ‘మనుస్మృతి’ ప్రకారం ధైర్యం, క్షమ, సంయమనం, అస్తేయం, శౌచము, ఇంద్రియ నిగ్రహం, విద్య, సత్యం, క్రోధ రాహిత్యం, సంశయం లేకుండా ఉండుట. ఈ పదింటిని జీవితంలో ధరించుటయే(పాటించుటయే) ధర్మం.
తమ ధర్మాన్ని ఎవ్వరైతే పాటిస్తారో వారు ఇహలోకంలోను, పరలోకంలోనూ సుఖశాంతులతో జీవిస్తారు. మరణించిన తరువాత పరలోకంలో భార్యపుత్రులు, బంధువులు మనకు సహాయపడరు. అక్కడ మనం ఆర్జించిన ధర్మమే మనకు సహాయపడుతుంది. అందువల్ల మనుష్యులందరూ ధర్మ బద్దంగా నడుచుకోవాలి మరియు వారి వారి బాధ్యతలను ధర్మ బద్దంగా నిర్వర్తించాలి.
మనం ఆర్జించిన పదార్థాలన్నీ మన శరీర పరిత్యాగంతో దూరమైపోతాయి. ఒక్క ధర్మం మాత్రమే మన వెంట వస్తుంది. మనలను రక్షిస్తుంది.నిజానికి అదే మానవులందరికీ నిజమైన నేస్తం. అందుకే –
ధర్మో రక్షతి రక్షితః అని అన్నారు – అంటే రక్షింపబడిన ధర్మం మనలను రక్షిస్తుంది. సంపాదించన ధర్మం కారణంగానే వ్యక్తి నరకాన్నుండి తనను తాను రక్షించుకొంటాడు. అధర్మం మనలను నాశనం చేస్తుంది.
ఈ శరీరం నీటి బుడగ వలె క్షణభంగురమైనది. ఎప్పుడు అది అంతరిస్తుందో మన మెరుంగం. అందువల్ల మన కళ్యాణానికి, మన ఆత్మలను ఉద్దరించుకోవడానికి మనం విధిగా ధర్మాన్ని పాటించాలి. ధర్మంగా ఉండాలి.
ధర్మం కంటె శ్రేష్టమైనది వేరే ఏది లేదు. ధర్మాచరణ ద్వార నిర్భలుడు కూడ శక్తివంతులపై విజయం సాదించవచ్చు. అందువల్ల తాత్కాలికమైన కోరికల కోసం, దానం కోసం, లోభం కోసం ధర్మాన్ని పరిత్యజించరాదు. ధర్మం శాశ్వతమైనది. సుఖదుఃఖాలు ఆశాశ్వతమైనవి. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. శాశ్వతమైన జీవాత్మను అశాశ్వతమైన పదార్థాల ఆసక్తివైపు మరల్చడం వాళ్ళ మనకే నష్టం జరుగుతుంది.
ధర్మాచరణ ద్వార అధర్మంపట్ల మనం ఆసక్తిని తగ్గించుకోవచ్చు. కుటుంబంలో సద్బుద్దిని పెంచుకోవచ్చు. కుటుంబ సభ్యులతో సత్యపూరితమైన ప్రవర్తనను నిర్మించుకోవచ్చు. మనమంతా తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ధర్మాచరణ ద్వార వ్యక్తి ‘ఆత్మ జ్ఞానాన్ని’ పొందుతాడు. సచ్చిదానందుడగు ఈశ్వరునిలో లీనమవుతాడు. ఈ సందర్భంగా హరిచ్చంద్రుడు, శిబిచక్రవర్తి, రుక్మాంగద మహారాజు, నల చక్రవర్తి, మేఘనాధుడు, తలాధరుడు, ఏకనాధుడు, మణికుండలుడు, మహర్షి దిధీచి వంటి భక్తులు పేర్కొనదగినవారు.
భగవంతుడు ప్రాణులను ఏ ప్రయోజనం నిమిత్తం సృస్టించాడో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చడమే వాటి ధర్మం. “ధారణాద్ధర్మ”.
సూతుదు శౌనకాది మునులతో, ‘దేన్నీ ఆచరించడం వాళ్ళ భాగవతుని పట్ల నిష్కామ భక్తీ జనిస్తుందో ,దేనివల్ల అంతరాత్మ సదా ఆనందంగా ఉంటుందో అదే మానవుని యొక్క ఉత్తమ ధర్మం’. అని అన్నాడు.
వ్యక్తులు జీవితంలో అవలంభించదగినది ధర్మం. పాటించ దగ్గది ధర్మం. భారతీయ వాజ్మయంలో ధర్మానికి వ్యాపకమైన అర్ధమున్నది. వర్ణాశ్రమ ధర్మం, క్షేత్ర ధర్మం, భ్రాత ధర్మం, పాతివ్రత్య ధర్మం, రాజధర్మం, ఆపద్దర్మం మొదలగునవి. ఈ ధర్మ సూత్రాల ఆధారంగానే కురుక్షేత్ర యుద్ద సమయంలో శ్రీకృష్ణుడు అర్జునినికి, అర్జునా! నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని తెలిపినాడు.
‘ధర్మోహి విశ్వస్య జగతః ప్రతిష్టా’ - నిజానికి ధర్మం ఈ జగత్తునకు ఆధారం. ఈ జగత్తు కీర్తి ప్రతిష్టలు కూడ ధర్మం పైనే ఆధారపడి ఉన్నాయి. అధర్మాచరణము వల్ల ప్రాణులకు దుఃఖాలు కలుగుతాయి. ధర్మాచరణం వల్ల సకల సుఖాలు లభిస్తాయి. ధర్మాచార్ణం వాళ్ళ మనకు మేలు కలుగుతుంది. ఇతరులకు కూడ మేలు కలుగుతుంది. స్వధర్మాన్ని ఆచరించడం చాల శ్రేయస్కరము. సత్పురుషులు స్వయంగా ఏ విధంగా నడుచుకుంటారో, ఇతరులును ఏ విధంగా నడుచుకోమని తెలుపుటారో అది ధర్మం. వారు దేనిని ఆచరించరో, దేనిని నిందిస్తారో అది అధర్మం.
అగ్ని ధర్మం కాల్చుట, నీటి ధర్మం శుద్ధి పరచుట, త్రాగిన వారి ప్రాణరక్షణ చేయుట, వాయువు మనకు ప్రాణశక్తి నోసంగుట. అదేవిధంగా మానవులమైన మనకు కూడ కొన్ని ధర్మాలున్నాయి. వాటిని పాటించడం మన కర్తవ్యం. అహింస, సత్యం, అస్తేయం, ప్రేమ ఇవి మానవులందరి సామాన్య ధర్మాలు. స్వార్ధాన్ని, అభిమానాన్ని విడునాడుట. తన కర్తవ్యాన్ని నెరవేర్చుట, లోపల బయట శుచిగా ఉండుట, ఇంద్రియ నిగ్రహం ,దానం చేయుట. మానసిక సంయమనం కలిగి యుండుట ఇవి అన్నియు కూడ ధర్మపు స్వరూపాలు.
మనుషులందరూ సుఖాన్ని కాంక్షిస్తారు. ధర్మాచరణము వల్లనే సుఖం సాధ్యమవుతుంది. అందువల్ల ప్రతివ్యక్తి తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చాలి. అధర్మానికి మొదట విజయం లభిస్తున్నట్లు కనిపించిన చివరకు దానికి పరాజయమే లభిస్తుంది. భూమిలో విత్తిన గింజవలె పాప ఫలితం వెంటనే కనిపించదు. కాని సరియైన సమయం వచ్చినపుడు చేసిన పాపం పాపాత్మున్ని సమూలంగా నాశనం చేస్తుంది.
శ్రీ మద్భాగవతంలో మహారాజైన శుకదేవుడు ధర్మసంస్థాపన చేయడానికి అధర్మాన్ని నాశనం చేయడానికి సర్వ శక్తిమంతుడైన భగవంతుడు అవతారాన్ని ఎత్తుతాడు అని సెలవిచ్చాడు. ఇదే విషయాన్నీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడ ‘పవిత్రాణాయ సాధునాం, వినాశాయ చ దుష్కృతం | ధర్మ సంస్థాపనార్దాయ సంభవామి యుగే యుగే||’ అని అర్జునితో తెలిపినాడు.
నిరాకర స్వరూపమైన ఆ పరమాత్ముణ్ణి నిరంతరం మనం స్మరించడం వలన మనం ధర్మం పట్ల ఆశక్తిని పెంచుకోవచ్చు. భగవంతుని స్వరూపమే ధర్మం. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుణ్ణి మన మనసులో నిరంతరం స్మరిస్తూ మనం మన జీవితాలను సుఖమయం చేసుకోవచ్చు.
No comments:
Post a Comment