Friday, January 29, 2021

గాయత్రి శాప విమోచన మంత్రాలు

గాయత్రి జపం సాధనకు ముందుగా శాప విమోచన మంత్రం జపించి గాయత్రి జప సాధన చేయాలి.. అది నియమం. 

అది తెలియక కొందరు కొన్ని లక్షల్లో జపం చేస్తూ ఉంటారు.. ఆ శాప మంత్రాలు ఇక్కడ ఇస్తాను మీరు అనుభవం గల గాయత్రి ఉపాసకులను కలిసి ఈ శాప విముక్తి విధానం. కూడా గ్రహించి ఆ విధంగా ముందు ఈ శాంతి జపము చేసి తర్వాత గాయత్రి చేయండి ఆ తల్లి మంత్ర శక్తి ఏంటో అనుభవ పూర్వకంగా చూడండి..

1.బ్రహ్మశాప విమోచన మంత్రములు

అస్య శ్రీ బ్రహ్మశాపవిమోచన మంత్రస్య నిగ్రహాను గ్రహకర్తా . ప్రజాపతి ఋషిః | కామదుఘా గాయత్రీ ఛందః | బ్రహ్మశాప విమోచనీయ గాయత్రీశక్తి:ప్రజా సవితాదేవతా | బ్రహ్మ శాపవిమోచనార్దే జపే వినియోగః

మంత్రము : 

సవితుర్భహ్మామేత్యుపాసనా తద్ర్బహ్మ విదో విదుస్తా ప్రయతంతి ధీరాః | సుమనసా వాచాయ మాగ్రతః బ్రహ్మశాసాద్విముక్తాభవ.

2. విశ్వామిత్ర శాప విమోచన మంత్రము

అస్య శ్రీ విశ్వామిత్ర శాపవిమోచన మంత్రస్య నూతన సృష్టికర్తా విశ్వామిత్ర ఋషిః వాగ్గుఘాగాయత్రీఛందః | భుక్తిముక్తి ప్రదావిశ్వామిత్రానుగృహీతా గాయత్రీ శక్తిః | సవితా దేవతా | విశ్వామిత్రశాపవిమోచనార్దే జపే వినియోగః ||

మంత్రము :

తత్వాని చాంగేష్వగ్ని చితోధియాంసః | త్రిగర్భాం యదుద్భవాం దేవాశ్శోచిరే ఎవ్వసృష్టించాం కళ్యాణీం సృష్టికరీం ప్రపత్యయమ్మ ఖాన్నిసృతో వేదగర్భః || ఓం గాయత్రీత్వం విశ్వామిత్ర శాపాద్విముక్తాభవ ||

3.వసిష్ట శాప విమోచన మంత్రము

వసిష్ట శాపవిమోచన మంత్రస్య, వసిష్ఠఋషిః

విశ్వోద్భవా గాయత్రీ ఛందః |

వశిష్టాను గ్రహీతా గాయత్రీశక్తిః | సవితాదేవతా | వసిష్ఠ శాప విమోచనార్దే జపే : వినియోగః 

మంత్రము : 

తత్వానిచాంగేష్యగ్ని చితోధియాంసః, ధ్యాయనివిష్ణోరా యుధానిబిభ్రతే  జనానతో శో పరమంచశశ్వత్ | గాయత్రీ మాపాచ్చుర సుత్త మంచధామ | ఓం గాయత్రి  వసిష్ట  శాపాద్విముక్తాభవ 

'అహ మార్కం మహజ్యోతి రర్కజ్యోతి రహం శివః | 

ఆత్మజ్యోతిహం శుక్తం శుక్ల జ్యోతిర సోహమోం | 

'అహో విష్ణు మహేశేశే దివ్యసిద్దే సరస్వతి |

'అజరే అమరేచైవ దివ్యయోనే నమోస్తుతే ||


ఈ బ్రహ్మశాప, విశ్వామిత్రశాప, వసిష్ఠ శాప మంత్రములను ముందుగా జపము చేసి, శాపనివృత్తమైన పిమ్మట గాయత్రీ మంత్రమును యధాశాస్త్రీయముగా పురశ్చరణము చేసిన యెడల గాయత్రీ మంత్ర యంత్రములు తప్పక సిద్దించును. పూర్వమొకప్పుడు గాయత్రీదేవి మంత్రమునకు బ్రహ్మ, విశ్వామిత్రుడు, వసిష్టుడు శాపము నిచ్చియున్నారు. 

కనుక ఈ శాపవిమోచన మంత్రములను జపము చేయకుండా గాయత్రీ మంత్రమును

"శత లక్షం ప్రజాస్వాపి గాయత్రీ నచసిద్ధ్యతి” 

అను న్యాయాను సారము నూరు లక్షల జపించినను ఫలించదు అను రహస్యమును అందరూ తెలుసుకోవాలి..

Thursday, January 28, 2021

ధ‌ర్మం అంటే ఏమిటి.?

ధర్మం అనే పదానికి చాలా విస్తృతమైన, గంభీరమైన అర్థాలున్నాయి. ధర్మం అనే పదానికి పుణ్యం, న్యాయం, స్వభావం, ఆచారం, వేదోక్త విధి, ఉపనిషత్తు, యజ్ఞం, విల్లు, సత్కర్మ, నీతి మొదలైన అర్థాలు నిఘంటువులో ఉన్నాయి. మరో రకంగా చూస్తే ధరించేది కాబట్టి ధర్మం అవుతుంది. ధర్మమే ప్రజలను ధరిస్తూ ఉంది. ఏది సంఘాన్ని కట్టుబాట్లలో నిలుపుతుందో అదే ధర్మమని పెద్దలు నిశ్చయించారు.

పురుషార్థాలు నాలుగు ఉన్నాయి. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటికి సనాతన ధర్మంలో ఉన్నత స్థానమిచ్చారు. ఇవి వేర్వేరుగా ఉన్నా ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. మొదటిదైన ధర్మంతోనే మిగతా మూడింటిని లగింపు చేసుకోవాలని పెద్దలు అంటారు. ధర్మాలు పాటించటమే కాక అర్థ సంపాదన ధర్మంగా ఉండాలని, కామం ధర్మ బద్ధమైనదే అయి ఉండాలని, ధర్మం గానే మోక్ష సాధ నకు కృషి చేయాలన్నది దీనిలో అంతర్గతంగా ఉన్న మరో అర్థమని వారు చెబు తుంటారు. ధర్మా చరణ అంటేనే అన్ని పనులు ధర్మబద్ధంగా చేయడమని మరి కొందరు చెబుతుంటారు. ఇక పురుషార్థాలలో ధర్మం గురించి మరింత విపులంగా తెలుసుకుందాం.

ధర్మం…

ధర్మం అనే పదానికి చాలా విస్తృ తమైన, గంభీరమైన అర్థాలున్నాయి. ధర్మం అనే పదానికి పుణ్యం, న్యాయం, స్వభావం, ఆచా రం, వేదోక్త విధి, ఉపనిషత్తు, యజ్ఞం, విల్లు, సత్కర్మ, నీతి మొదలైన అర్థాలు నిఘంటువులో ఉన్నాయి. మరో రకంగా చూస్తే ధరించేది కాబట్టి ధర్మం అవుతుంది. ధర్మమే ప్రజలను ధరిస్తూ ఉంది. ఏది సంఘాన్ని కట్టుబాట్లలో నిలుపుతుందో అదే ధర్మమని పెద్దలు నిశ్చయించారు.

వేదం మానవుణ్ని ఏది చేయమని ఆజ్ఞాపిస్తుందో అది ధర్మమని జైమిని మహర్షి మంత్రపూర్వకంగా తెలి పారు. వేదం సమస్త ధర్మాలకు మూలం, ప్రమాణమన్నది మనుస్మృతి. అహింసా పరమో ధర్మ: (ఏ ప్రాణిని హింసించక పోవడమే శ్రేష్ఠమైన ధర్మం. ధర్మ శబ్దం పది లక్షణాలతో కూడుకున్నదని మనుస్మృతికారుడు మరొక చోట విశేష వివ రణ ఇచ్చాడు.

దశ లక్షణాలు…

ధృతి..

ఎల్ల్లప్పుడూ ధైర్యంగా ఉండడం. ధర్మ కార్యాలను ఆచరించేటపుడు కలిగే కష్ట నిష్ఠురాలను సహిస్తూ వెనుకంజ వేయక ఆయా కార్యాలను పూర్తి చేయడం ధృతి అనబడుతుంది.

క్షమ..

ఓర్పు కలిగి ఉండడం. సుఖ దు:ఖాల్లో, లాభనష్టాల్లో మానావ మానాల్లో సహన శీలుడై సమ భావంతో ఉండటం క్షమ అనబడు తుంది.

దమము..

ఇంద్రియ నిగ్రహంతో ఉండటం

అస్తేయం..

దొంగతనం చేయకుండడం. ఇతరుల వస్తువులను వారి అనుమతిలేకుండా తీసుకోకూడదనే భావన.

శౌచము..

పవిత్ర భావాలు, భగవత్ప్రసాద బుద్ధి. దైవేచ్ఛ అనే ప్రపత్తి.

శమము..

మనో నిగ్రహం కలిగి ఉండడం.

ధీ..

ధీ అంటే బుద్ధి. బుద్ధిని మందగింపజేసే పనులు అనగా మాదక ద్రవ్య సేవనం, దుష్ట సాంగత్యం, సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండటం. మంచి బుద్ధి కలిగి ఉండడం.

విద్య..

పరమేశ్వర పర్యంతం పదార్థాల జ్ఞానం కలిగి వాని నుంచి ఉపకారం పొందడం విద్య. ఆత్మనందు ఉన్నట్టు మనస్సులో తలచడం, మనస్సులో తలచినది వాణి (మాట) ద్వారా పలకడం, వాణి మేరకే కర్మలయందు ప్రవర్తించడం విద్య.

సత్యం..

ఉన్నది ఉన్నట్టు చెప్పడం, వినడం, ఆచరించడం, సత్యమనబడుతుంది. సత్యం చెప్పాలిగాని ఇంపుగా చెప్పాలి. సత్యాన్ని అప్రియం అంటే కష్టం కలిగేట్లు చెప్పరాదు. ఇంపుగా ఉంటుంది గదా అని అబద్ధం చెప్పకూడదు. ఇది అనాదిగా వస్తున్న ధర్మం. ఉదాహరణకు అంగవైకల్యం కల వారిని అంగవైకల్యంతో సంబోధించరాదు.

అక్రోధం..

పరులకు కష్టాన్ని, హానిని కలిగించే కోపాన్ని విడిచి , శాంతం సౌమ్యం మొదలైన గుణాలను గ్రహించడం అక్రోధం అవుతుంది. ఈ పది లక్షణాలతో కూడిన పక్షపాతరహిత న్యాయాచరణమనే ధర్మాన్ని బ్రహ్మచారులు, గృహస్థులు, వాన ప్రస్థులు, సన్యాసులు అందరూ సేవించాలి. ఇది ధర్మం అనే పదానికి మనువు చెప్పిన నిర్వచనం. ధర్మాన్ని ఆచరించడం వల్ల అర్థకామాలు లభ్యమవుతాయని వ్యాస మహర్షి వచనం. అర్థాన్ని, కామాన్ని (కోరికలను) ధర్మంతో ముడిపెట్టి ఆచరించేవారికి మోక్ష మార్గం అప్రయత్నంగా లభిస్తుంది.


ధర్మ ఏవ హతో హంతి  ధర్మో రక్షతి రక్షిత:

ధర్మాన్ని నశింపజేసే వ్యక్తిని అది నశింపజేస్తుంది. ధర్మాన్ని రక్షించే వారిని అది రక్షిస్తుంది. అందువల్ల ధర్మాన్ని నాశనం చేయకూడదు. మన చేత ధర్మం చంపబడక మనలనది రక్షించుగాక. ధర్మాన్ని ప్రాణాపాయ స్థితిలో కూడా విడవరాదని మనువు అంటాడు.

మహాభారతంలో ధర్మరాజు ధర్మానికి ప్రతీక. భారతం ధర్మంతోనే ముగుస్తుంది. ధర్మం తెలిసిన వారు ధర్మానికి ఇబ్బంది కలిగించే ధర్మాన్ని ధర్మంగా భావించరు. ధర్మమనేది సర్వులకు హితమైనదై ఉండాలి. సమిష్టి ధర్మానికి, వ్యష్టిధర్మానికి వైరుధ్యం కలిగినప్పుడు వ్యష్టి ధర్మాన్ని త్యాగం చేయాలి. భీష్ముడు వ్యష్టి ధర్మాచర ణం కోసం సమిష్టి ధర్మానికి హాని చేయడం వలన మరణించాల్సి వచ్చిందని కొందరి అభిప్రాయం.

ధర్మాత్ములు…

తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ, ఈ ఐదింటిని పూజించేవారు ధర్మాత్ములు అని శాస్త్రం చెబుతోంది. ధర్మం నిత్యం. సుఖ దు:ఖాలు అనిత్యం. అందువల్ల సుఖేచ్ఛ చేత గాని, భయం చేత గాని, లోభం చేత కాని ప్రాణాపాయ స్థితిలో అయినా సరే ధర్మాన్ని విడువకూడదు. జీవుడు నిత్యుడు. అతడు నివసించే ఈ శరీ రం అనిత్యం. అందువల్ల్ల అనిత్యాలైన వాటి కోసం వ్యర్థ ప్రయత్నాలు చేయక నిత్యుడైన జీవుడు నిత్యమైన ధర్మం కోసం యత్నించడం శ్రేయస్కరమవుతుంది.

నారాయణ ఉపనిషత్తు ప్రకారం – ‘ధర్మమే సర్వ జగత్తుకు ఆధారము’. ‘మనుస్మృతి’ ప్రకారం ధైర్యం, క్షమ, సంయమనం, అస్తేయం, శౌచము, ఇంద్రియ నిగ్రహం, విద్య, సత్యం, క్రోధ రాహిత్యం, సంశయం లేకుండా ఉండుట. ఈ పదింటిని జీవితంలో ధరించుటయే(పాటించుటయే) ధర్మం.

తమ ధర్మాన్ని ఎవ్వరైతే పాటిస్తారో వారు ఇహలోకంలోను, పరలోకంలోనూ సుఖశాంతులతో జీవిస్తారు. మరణించిన తరువాత పరలోకంలో భార్యపుత్రులు, బంధువులు మనకు సహాయపడరు. అక్కడ మనం ఆర్జించిన ధర్మమే మనకు సహాయపడుతుంది. అందువల్ల మనుష్యులందరూ ధర్మ బద్దంగా నడుచుకోవాలి మరియు వారి వారి బాధ్యతలను ధర్మ బద్దంగా నిర్వర్తించాలి.

మనం ఆర్జించిన పదార్థాలన్నీ మన శరీర పరిత్యాగంతో దూరమైపోతాయి. ఒక్క ధర్మం మాత్రమే మన వెంట వస్తుంది. మనలను రక్షిస్తుంది.నిజానికి అదే మానవులందరికీ నిజమైన నేస్తం. అందుకే –

ధర్మో రక్షతి రక్షితః అని అన్నారు – అంటే రక్షింపబడిన ధర్మం మనలను రక్షిస్తుంది. సంపాదించన ధర్మం కారణంగానే వ్యక్తి నరకాన్నుండి తనను తాను రక్షించుకొంటాడు. అధర్మం మనలను నాశనం చేస్తుంది.

ఈ శరీరం నీటి బుడగ వలె క్షణభంగురమైనది. ఎప్పుడు అది అంతరిస్తుందో మన మెరుంగం. అందువల్ల మన కళ్యాణానికి, మన ఆత్మలను ఉద్దరించుకోవడానికి మనం విధిగా ధర్మాన్ని పాటించాలి. ధర్మంగా ఉండాలి.

ధర్మం కంటె శ్రేష్టమైనది వేరే ఏది లేదు. ధర్మాచరణ ద్వార నిర్భలుడు కూడ శక్తివంతులపై విజయం సాదించవచ్చు. అందువల్ల తాత్కాలికమైన కోరికల కోసం, దానం కోసం, లోభం కోసం ధర్మాన్ని పరిత్యజించరాదు. ధర్మం శాశ్వతమైనది. సుఖదుఃఖాలు ఆశాశ్వతమైనవి. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. శాశ్వతమైన జీవాత్మను అశాశ్వతమైన పదార్థాల ఆసక్తివైపు మరల్చడం వాళ్ళ మనకే నష్టం జరుగుతుంది.

ధర్మాచరణ ద్వార అధర్మంపట్ల మనం ఆసక్తిని తగ్గించుకోవచ్చు. కుటుంబంలో సద్బుద్దిని పెంచుకోవచ్చు. కుటుంబ సభ్యులతో సత్యపూరితమైన ప్రవర్తనను నిర్మించుకోవచ్చు. మనమంతా తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ధర్మాచరణ ద్వార వ్యక్తి ‘ఆత్మ జ్ఞానాన్ని’ పొందుతాడు. సచ్చిదానందుడగు ఈశ్వరునిలో లీనమవుతాడు. ఈ సందర్భంగా హరిచ్చంద్రుడు, శిబిచక్రవర్తి, రుక్మాంగద మహారాజు, నల చక్రవర్తి, మేఘనాధుడు, తలాధరుడు, ఏకనాధుడు, మణికుండలుడు, మహర్షి దిధీచి వంటి భక్తులు పేర్కొనదగినవారు.

భగవంతుడు ప్రాణులను ఏ ప్రయోజనం నిమిత్తం సృస్టించాడో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చడమే వాటి ధర్మం. “ధారణాద్ధర్మ”.

సూతుదు శౌనకాది మునులతో, ‘దేన్నీ ఆచరించడం వాళ్ళ భాగవతుని పట్ల నిష్కామ భక్తీ జనిస్తుందో ,దేనివల్ల అంతరాత్మ సదా ఆనందంగా ఉంటుందో అదే మానవుని యొక్క ఉత్తమ ధర్మం’. అని అన్నాడు. 

వ్యక్తులు జీవితంలో అవలంభించదగినది ధర్మం. పాటించ దగ్గది ధర్మం. భారతీయ వాజ్మయంలో ధర్మానికి వ్యాపకమైన అర్ధమున్నది. వర్ణాశ్రమ ధర్మం, క్షేత్ర ధర్మం, భ్రాత ధర్మం, పాతివ్రత్య ధర్మం, రాజధర్మం, ఆపద్దర్మం మొదలగునవి. ఈ ధర్మ సూత్రాల ఆధారంగానే కురుక్షేత్ర యుద్ద సమయంలో శ్రీకృష్ణుడు అర్జునినికి, అర్జునా! నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని తెలిపినాడు. 

‘ధర్మోహి విశ్వస్య జగతః ప్రతిష్టా’ - నిజానికి ధర్మం ఈ జగత్తునకు ఆధారం. ఈ జగత్తు కీర్తి ప్రతిష్టలు కూడ ధర్మం పైనే ఆధారపడి ఉన్నాయి. అధర్మాచరణము వల్ల ప్రాణులకు దుఃఖాలు కలుగుతాయి. ధర్మాచరణం వల్ల సకల సుఖాలు లభిస్తాయి. ధర్మాచార్ణం వాళ్ళ మనకు మేలు కలుగుతుంది. ఇతరులకు కూడ మేలు కలుగుతుంది. స్వధర్మాన్ని ఆచరించడం చాల శ్రేయస్కరము. సత్పురుషులు స్వయంగా ఏ విధంగా నడుచుకుంటారో, ఇతరులును ఏ విధంగా నడుచుకోమని తెలుపుటారో అది ధర్మం. వారు దేనిని ఆచరించరో, దేనిని నిందిస్తారో అది అధర్మం.

అగ్ని ధర్మం కాల్చుట, నీటి ధర్మం శుద్ధి పరచుట, త్రాగిన వారి ప్రాణరక్షణ చేయుట, వాయువు మనకు ప్రాణశక్తి నోసంగుట. అదేవిధంగా మానవులమైన మనకు కూడ కొన్ని ధర్మాలున్నాయి. వాటిని పాటించడం మన కర్తవ్యం. అహింస, సత్యం, అస్తేయం, ప్రేమ ఇవి మానవులందరి సామాన్య ధర్మాలు. స్వార్ధాన్ని, అభిమానాన్ని విడునాడుట. తన కర్తవ్యాన్ని నెరవేర్చుట, లోపల బయట శుచిగా ఉండుట, ఇంద్రియ నిగ్రహం ,దానం చేయుట. మానసిక సంయమనం కలిగి యుండుట ఇవి అన్నియు కూడ ధర్మపు స్వరూపాలు.

మనుషులందరూ సుఖాన్ని కాంక్షిస్తారు. ధర్మాచరణము వల్లనే సుఖం సాధ్యమవుతుంది. అందువల్ల ప్రతివ్యక్తి తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చాలి. అధర్మానికి మొదట విజయం లభిస్తున్నట్లు కనిపించిన చివరకు దానికి పరాజయమే లభిస్తుంది. భూమిలో విత్తిన గింజవలె పాప ఫలితం వెంటనే కనిపించదు. కాని సరియైన సమయం వచ్చినపుడు చేసిన పాపం పాపాత్మున్ని సమూలంగా నాశనం చేస్తుంది.

శ్రీ మద్భాగవతంలో మహారాజైన శుకదేవుడు ధర్మసంస్థాపన చేయడానికి అధర్మాన్ని నాశనం చేయడానికి సర్వ శక్తిమంతుడైన భగవంతుడు అవతారాన్ని ఎత్తుతాడు అని సెలవిచ్చాడు. ఇదే విషయాన్నీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడ ‘పవిత్రాణాయ సాధునాం, వినాశాయ చ దుష్కృతం | ధర్మ సంస్థాపనార్దాయ సంభవామి యుగే యుగే||’ అని అర్జునితో తెలిపినాడు.

నిరాకర స్వరూపమైన ఆ పరమాత్ముణ్ణి నిరంతరం మనం స్మరించడం వలన మనం ధర్మం పట్ల ఆశక్తిని పెంచుకోవచ్చు. భగవంతుని స్వరూపమే ధర్మం. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుణ్ణి మన మనసులో నిరంతరం స్మరిస్తూ మనం మన జీవితాలను సుఖమయం చేసుకోవచ్చు.

అతిరథ మహారథులు..అంటే..ఎవరు.

యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి. 

ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..

  • రథి, 
  • అతిరథి, 
  • మహారథి, 
  • అతి మహారథి, 
  • మహా మహా రథి.


1) రథి..

ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.

సోమదత్తుడు, 

సుదక్షిణ, 

శకుని, 

శిశుపాల, 

ఉత్తర, 

కౌరవుల్లో 96మంది, 

శిఖండి, 

ఉత్తమౌజులు, 

ద్రౌపది కొడుకులు -

వీరంతా..రథులు.


2) అతి రథి (రథికి 12రెట్లు)..

60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

లవకుశులు, 

కృతవర్మ, 

శల్య, 

కృపాచార్య, 

భూరిశ్రవ, 

ద్రుపద, 

యుయుత్సు, 

విరాట, 

అకంపన, 

సాత్యకి, 

దృష్టద్యుమ్న, 

కుంతిభోజ, 

ఘటోత్కచ, 

ప్రహస్త, 

అంగద, 

దుర్యోధన, 

జయద్రథ, 

దుశ్శాసన, 

వికర్ణ, 

విరాట, 

యుధిష్ఠిర, 

నకుల, 

సహదేవ, 

ప్రద్యుమ్నులు 

వీరంతా..అతిరథులు.


3) మహారథి (అతిరథికి 12రెట్లు).

7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

రాముడు, 

కృష్ణుడు, 

అభిమన్యుడు, 

వాలి, 

అంగద, 

అశ్వత్థామ, 

అతికాయ, 

భీమ, 

కర్ణ, 

అర్జున, 

భీష్మ, 

ద్రోణ, 

కుంభకర్ణ, 

సుగ్రీవ, 

జాంబవంత, 

రావణ, 

భగదత్త, 

నరకాసుర, 

లక్ష్మణ, 

బలరామ, 

జరాసంధులు 

వీరంతా..మహారథులు.


4) అతి మహారథి (మహారథికి 12రెట్లు).

86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.

ఇంద్రజిత్తు, 

పరశురాముడు, 

ఆంజనేయుడు, 

వీరభద్రుడు, 

భైరవుడు - 

వీరు..అతి మహారథులు.

రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు, అటు ఇంద్రజిత్తు - ఇటు ఆంజనేయుడు. 

రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే


5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) .

ఏకకాలంలో 207,360,000

(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, 

దుర్గా దేవి, 

గణపతి మరియు 

సుబ్రహ్మణ్య స్వామి, 

వీరంతా..మహామహారథులు.


మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం 

హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ..యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు. 

అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు.

జై దుర్గా మాత..!!


లోకా సమస్తా సుఖినోభవంతు..!

శ్రీచండీభుజంగస్తోత్రం

 1) చండముండరాక్షసభవ్యసంహారిణీం 

    రక్తబీజాసురహంతశ్రీకాళికాం 

    త్రయీనిత్యసన్నుతతేజఃస్వరూపిణీం 

    భజే చండికాంబాం నవశతీరూపిణీం ||

2) మార్తాండశశికోటిప్రభాభాసురాం 

   ఆసురీశక్తిదమనదివ్యప్రభావాం 

   కాలకాలమనఃస్సరోవరవిహారిణీం 

   భజే చండికాంబాం నవశతీరూపిణీం ||

3) భక్తమార్కండేయవందితాంఘ్రియుగళాం 

    భుక్తిముక్తిదాయకసంసారతారిణీం 

    భక్తజనాళీరక్షకరుణాంతరంగిణీం  

    భజే చండికాంబాం నవశతీరూపిణీం ||

4) హరిద్రాకుంకుమచందనాదిచర్చితాం 

   పరమయోగీంద్రనుతశ్రీనవాక్షరీం 

   రత్నకంచుకాధరజపాకుసుమభాసురాం  

   భజే చండికాంబాం నవశతీరూపిణీం ||

5) త్రిభువనైకపాలకలోకేశ్వరేశ్వరీం 

   రమావాణీసేవితశ్రీమనోన్మనీం 

   దంభదర్పనిలయమహిషాసురమర్దినీం 

   భజే చండికాంబాం నవశతీరూపిణీం ||

సర్వం శ్రీ చండీ దివ్యచరణారవిందార్పణమస్తు

Wednesday, January 20, 2021

ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ?

నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశించి , మరణ అనంతరం పుణ్య లోకాలు పొందుతాము ...

-- గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !!

-- శివాష్టకం - శివ అనుగ్రహం !!

-- ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !!

--శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !!

-- అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !!

-- కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !!

-- దుర్గష్టోత్తర శతనామం - భయహరం !!

-- విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!

-- సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !!

-- హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !!

-- విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!

-- శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!

-- భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !!

-- శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !!

-- లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !!

-- కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !!

-- ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !!

-- శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !!

-- లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !!

-- శ్యామాల దండకం - వాక్శుద్ధి !!

-- త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి !!

-- శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి !!

-- శని స్తోత్రం - శని పీడ నివారణ !!

-- మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం !!

-- అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి !!

-- కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం !!

-- కనకధార స్తోత్రం - కనకధారయే !!

-- శ్రీ సూక్తం - ధన లాభం !!

-- సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది !!

-- సుదర్శన మంత్రం - శత్రు నాశనం !!

-- విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం !!

-- రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!

-- దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!

-- భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు !!

-- వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!

-- దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!

-- లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి !!


⭐⭐⭐ పంచరత్నం - 5 శ్లోకాలతో కూడినది !!

⭐⭐⭐ అష్టకం - 8 శ్లోకాలతో కూడినది !!

⭐⭐⭐ నవకం - 9 శ్లోకాలతో కూడినది !!

⭐⭐⭐ స్తోత్రం - బహు శ్లోకాలతో కూడినది !!

⭐⭐⭐ శత నామ స్తోత్రం - 100 నామాలతో స్తోత్రం !!

⭐⭐⭐ సహస్రనామ స్తోత్రం - 1000 నామాలతో స్తోత్రం !!


పంచపునీతాలు

⭐ వాక్ శుద్ధి 

⭐ దేహ శుద్ధి 

⭐ భాండ శుద్ధి 

⭐ కర్మ శుద్ధి 

⭐ మనశ్శుద్ధి 


-- వాక్ శుద్ధి :

వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు .... కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు .... పగ , కసి , ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు .... మంచిగా , నెమ్మదిగా , ఆదరణతో పలకరించాలి .... అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి .... 


-- దేహ శుద్ధి :

మన శరీరం దేవుని ఆలయం వంటిది .... దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , రెండు పూటలా స్నానం చెయ్యాలి .... చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు ....


-- భాండ శుద్ధి :

శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం .... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి .... స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది ....


-- కర్మ శుద్ధి :

అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు .... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు .... తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు ....


-- మనశ్శుద్ధి :

మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి .... మనస్సు చంచలమైనది .... ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది .... దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి .... దీని వల్ల దుఃఖం చేకూరుతుంది .... కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి ...


-- ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది !!

-- ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది !!

-- నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది !!

-- యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది !!

-- సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది !!

-- గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది !!

-- సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది !!

-- పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది !!

-- భక్తి ప్రవేశిస్తే మనిషి మనీషి అవుతాడు !!

Tuesday, January 19, 2021

వారణాసి (కాశీి) గురించి తెలియని కొన్ని విషయాలు

కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం

1.  కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు.

2.  విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం.

3. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం.

4. స్వయంగా శివుడు నివాసముండె నగరం.

5. ప్రళయ కాలంలో మునుగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు.

6. కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది.

7. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.

8. కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....

9. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు.

10. కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.

11. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....

12. డూండీ గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...

13. కాబట్టే కాశీలో కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

14. కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.

15. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

16. అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.

17. మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

18. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది

19. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

శివుని కాశీలోని కొన్ని వింతలు

1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.

3. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు.

5. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?

6. అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు

7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

8. కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు .

9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

10. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

11. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

12. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

13.  ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.

14. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :

1) దశాశ్వమేధ ఘాట్:

బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్:

ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్:

చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్:

సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.

ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్:

పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్:

ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్:

ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్:

ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్:

గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్:

తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.

11) హనుమాన్ ఘాట్:

ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది

ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్:

పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్:

సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్:

ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది.

ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్:

నారదుడు లింగం స్థాపించాడు.

16)చౌతస్సి ఘాట్:

ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు.

ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్ ఘాట్:

ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.

18)అహిల్యా బాయి ఘాట్

ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ

విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.

కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము.

విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.

అక్కడే శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు

కాశీ స్మరణం మోక్షకారకం!


కాశీ విశ్వనాధాష్టకం


గంగాతరంగ రమణీయ జటా కలాపం,

గౌరీ నిరంతర విభూషిత వామ భాగం;

నారాయణ ప్రియ మదంగ మదాప హారం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||1||


వాచామ గోచర మనేక గుణ స్వరూపం,

వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం;

వామేన విగ్రహవరేణ కళత్ర వంతం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||2||


భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం,

వ్యాగ్రాజిలాం భరధరం జటిలం త్రినేత్రం;

పాశాంకుసాభయ వర ప్రద శూల పాణిం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||3||


సితాంసుశోభిత కిరీట విరాజ మానం,

పాలేక్షణానల విశోసిత పంచ భానం;

నాగాధిపారచిత భాసుర కర్ణ పూరం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||4||


పంచానలం దురిత మత్త మతంగ జానాం,

నాగాంతకం దనుజ పుంగవ పన్న గానాం;

దావానలం మరణ శోక జరాట వీణా,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||5||


తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం,

ఆనంద కంద మపిరాజిత మప్రమేయం;

నాగాత్మకం సకల నిష్కలమాత్మ రూపం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||6||


ఆశాం విహాయ పరిహృత్య పరస్యనింత,

ఉపేరతించ సునివార్య మనఃసమాదౌ;

ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రదేశం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||7||


నాగాధి దోష రహిత స్వజనానురాగం,

వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం;

మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||8||


వారాణసీ పురపతేః స్థవనం శివస్య,

వ్యాసోత్త మిష్ఠక మిదం పఠితా మనుష్య;

విద్యాం శ్రియం విపుల సౌక్య మనంత కీర్తిం,

సంప్రాప్య దేహ నిలయే లభతేచ మోక్షం.||9||


విశ్వనాధాష్టక మిదం యః పఠేచిత శివ సన్నిదౌ,

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ .....  జన్మ జన్మలకు నీతోనే ఉండే భాగ్యం ప్రసాదించు స్వామీ... హర హర మహాదేవ

ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు

(కృష్ణార్జునులు కాదు మేము అడిగేది) నరనారాయణులనగా ఎవరు?

నరనారాయణులనగా జీవుడు, దేవుడు. నరుడంటే నశించని వాడు. నారాయణుడంటే నశించని వాళ్ళందరికీ మూలము అయినటువంటి వాడు. అతని నుంచి అందరూ దిగి వచ్చి, అతని లోకే అందరూ వెడుతూ ఉంటారు. తన యందు, తన ప్రవర్తనము నందు అప్రమత్తుడైనటువంటి వాడు నరుడు. వీరిద్దరు ప్రపంచములో ఎలా ప్రవర్తించాలో నిర్వర్తించి చూపించారు.*

*శ్రీరాముడిని మించిన నరుడు లేడు. సంపూర్ణముగా నరుడిగా దిగివచ్చి, నరత్వమంటే ఏమిటో చూపించాడు. మానవునికి నరుడి దగ్గరనుంచి నేర్చుకోవలసిన కళ్యాణ గుణములు ఉన్నాయి. నారాయణుడు చేసేటటువంటి కార్యములన్నీ అతి మానుషీ కార్యములుగా ఉంటాయి. అదే శ్రీకృష్ణుని జీవితములో గోచరిస్తూ ఉంటుంది. అందుకనే శ్రీకృష్ణుడు చెప్పినట్టు చేయమంటారు. రాముడు నడిచినట్లు నడవమని చెపుతారు.

మోక్షమంటే ఏమి?

మోక్షం

ఒక గురువు తన శిష్యులతో అరణ్యమార్గాన వెళ్తుండగా ఒక నదిని దాటవలసి వచ్చింది. అదే సమయంలో నదిని దాట లేక ఒక యవ్వనవతి ఆ శిష్యుల సహాయాన్ని అర్థించింది. అందరూ నిరాకరించినా, ఒక శిష్యుడు మాత్రం ఆమెను ఎత్తుకుని నది దాటించి, కిందకు దించాడు. తర్వాత ఆమె దారిన ఆమె వెళ్లిపోయింది. రాత్రి ఒక అనుకూలమైన చోట విశ్రమించిన తర్వాత శిష్యులంతా ఆ గురువు దగ్గరకు వచ్చి, ‘మనమంతా బ్రహ్మచర్యం పాటిస్తున్నాం కదా, ఆ శిష్యుడు స్త్రీని ఎత్తుకొని నది దాటించాడు..’ అని ఫిర్యాదు చేశారు. దానికి గురువు ‘ఆ శిష్యుడు ఆ స్త్రీని అక్కడే దించి వేశాడు. కానీ, మీరంతా ఇంకా ఆమెను మీ మనసులో మోస్తూనే ఉన్నారు’ అన్నాడు. ‘అష్టావక్ర గీత’లో జనకునితో అష్టావక్రుడు.. ‘ఓ రాజా! దేహం కంటే ఆత్మ వేరని విచారించి తెలుసుకుని, నీ ఆత్మపైనే మనసును ఎల్లవేళలా లగ్నం చేసినట్లయితే నువు సుఖశాంతులను పొందుతావు. ఎంతవరకు నీలోని ‘చిజ్జడగ్రంధి’ నాశనం కాలేదో అంటే పరస్పరా ధ్యాస నాశనం కాలేదో, అంతవరకు బంధమున్నట్లే..’ అన్నాడు. ‘బంధం పెనవేసుకుని ఉండటమే’ మోక్షరాహిత్యం. ‘మోక్ష’మంటే ‘ఈ బంధనాలను అన్నిటినీ వదిలేసుకోవడమే. ‘చిజ్జడగ్రంథి’ శరీరంలోని జీవగ్రంథి కాదు. అదొక మానసిక స్థితి. శరీరం, మనసులవల్ల ‘నేను’, ‘నాది’, ‘నాతో’ అనే కర్తృత్వ భోక్తృత్వాలను అనుభవించడమే ఈ గ్రంథి తత్తం.    

‘మోక్షమనేది స్వర్గంలోనో, లోకాంతరంలోనో ఉండేది కాదు.  ఏదో ఇంటి లోపలగాని, గ్రామంలోగానీ ఉండేదీ కాదు. మనసులోని అజ్ఞానగ్రంథి నాశనమే మోక్షం’. కర్మ నిరంతర ప్రవాహం. అది జరుగకుండా ఆపడం ఎవరివల్లా కాదు. ‘చావు పుట్టుకలతోసహా అనేక విషయాలపై మనకు అధికారం లేనపుడు, మధ్యలోని ఈ జీవితంపై మమకారం ఎందుకు?’ అని ఉపనిషత్తులు, భగవద్గీతాది ధార్మిక సాహిత్యం ప్రశ్నిస్తున్నది. కర్మలను ఆచరిస్తూనే, వాటిపట్ల మానసిక బంధనాలను తుంచి వేసుకోవడమే మోక్షం. అదే అసలు సిసలైన ‘ఆనందమయ స్థితి’. ‘స్వాత్మప్రకాశిక’లో జగద్గురువు ఆదిశంకరులు మోక్షస్థితిని స్పష్టం చేశారు. ‘జ్ఞాని అనేవాడు రాజ్యాన్ని పరిపాలించవచ్చు. బిచ్చమెత్తి జీవించవచ్చు. కలలోని పాపపుణ్యాలు జాగ్రదావస్థలో లేనట్లే, జాగ్రదవస్థలోని పాపపుణ్యాలు నాకు లేవు’ అని అంటారాయన. ‘మేఘాలు ఆకాశంలో వున్నా అవి ఆకాశాన్ని అంటనట్లు, సంసార సుఖదుఃఖాలు నన్ను అంటజాలవు’ అన్నది వారి బోధన. ఆదిశంకరుల ‘వివేక చూడామణి’ ప్రకారం కూడా ‘జీవిత చరమాంకంలో దండ కమండలాలు పట్టుకుని సన్యాసాశ్రమంలో చేరటం మోక్షం కానే కాదు. కష్టించి పనిచేస్తూనే ఫలాధికారాన్ని వదిలి వేయడమే మోక్షం’. 

‘బ్రహ్మభూతస్థితిలో, పరబ్రహ్మతో ఏకీభావ స్థితిలో ఉన్నవాడు దేనికీ శోకింపడు, దేనినీ కాంక్షింపడు. సర్వభూతాలను సమానంగా చూసేవాడు పరాభక్తిని పొందుతాడు’ (భగవద్గీత: మోక్షసన్యాస యోగం). ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలను సాధించడమే మానవ జీవిత లక్ష్యమైనపుడు ధర్మార్థకామాలను భూమిమీదే సాధించి, నాల్గవ దానిని అనంతంలో సాధించాలని అంటే ఎలా? మోక్షమూ భూమిమీదే సాధించాలి. ఈ నాలుగూ నిరంతరంగా సాగే మానవ ధర్మాలు కావాలి. మొత్తంగా ఆత్మతత్త్వాన్ని అర్థం చేసుకోవడమే మానవుడిని ఉత్కృష్టమైన స్థితిలో నిలబెడుతుంది. అదే ‘పరబ్రహ్మ స్థితి’గా చెప్పుకునే ‘బ్రహ్మభూతస్థితి’. దీనినిబట్టి ‘మోక్షం’ అంటే ‘మరణానంతరం పునర్జన్మ లేనటువంటి స్థితి కాదు. జీవించి ఉండగానే కర్మఫలాపేక్ష లేని అత్యున్నతమైన, ఎలాంటి విషయ వాసనలూ లేని, ఆనందభరితమైన మానసిక స్థితి’ అని గ్రహించాలి. ఆ నిశ్చల, నిర్మోహ, నిర్వికార మానసిక ఆనందమే మోక్షం.

గోపికలు తరువాత విష్ణురూపుడైన ఆ కృష్ణ పరమాత్మతో ఎవరూ పొందలేని సాన్నిహిత్యాన్ని  పొందిన వారు ఎవరు?

పరమాత్మ గురించి, ఆయన అనుగ్రహం గురించి అంతగా తపన పడవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించేవారికి భాగవతం అతి సున్నితమైన సమాధానం ఇస్తుంది. ‘దాహార్తి తీర్చుకునేందుకు నీరు, క్షుద్బాధ తీరడానికి ఆహారం, శరీర తాపం తగ్గడానికి చల్లని గాలి... ఇలా సృష్టిలో ప్రతి అంశానికీ ఒక పరిష్కార మార్గం ఉన్నట్లే ఆధ్యాత్మిక (గత జన్మ వాసనా బలంతో సంక్రమించిన), ఆదిభౌతిక (ఈ జన్మలో చేసిన కర్మ ఫలితం), ఆదిదైవిక (దైవ సంబంధమైన) కష్టాలు తొలగిపోవాలంటే ఒక సరళమైన తరుణోపాయం ఉండాలి. ఆ మార్గమే భగవదన్వేషణ, ఆరాధన.

ఇదే తప్ప అన్య మార్గం లేదు.ఆ పరమాత్ముని మనసా..  వాచా , కర్మణా  కొలిచిన వారిని వాటికి ప్రతిగా సదాచార వర్తనులు, మనోనిగ్రహపరులు, పరిశుద్ధాంతరంగులు అయ్యేటట్లు అనుగ్రహిస్తాడు. 

ఆ దైవానుగ్రహం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది..

విష్ణురూపుడైన ఆ పరమాత్మతో ఎవరూ పొందలేని సాన్నిహిత్యాన్ని సాధారణ గోపాలకులు పొందారు కదా..

కల్మషం లేనివారి స్వచ్ఛమైన మనోభావాలు, ప్రేమానురాగాలే భగవానుడి కృపావర్షానికి కారణాలు.

విలు విద్య ప్రావీణ్యంలో సాక్షాత్తు కోదండరాముడే మెచ్చుకొనే స్థాయిలో  గల వారు ఎవరు?

జగదేక ధానుష్కుడైన రాముడికి తొలుత విల్లు పట్టడం నేర్పిన గురువు కైక. విలువిద్యలో ఆమె గొప్ప ప్రవీణురాలు. ఆ మాటను రాముడే చెప్పాడు. రాక్షస వీరుల్లో ఎవరైనా విలువిద్యలో అమోఘ ప్రదర్శన కనబరిస్తే రాముడి మొహంలో మెచ్చుకోలు కనపడేది. వెంటనే కైక ఆయన ఎదలో మెదిలేది. రెండు మూడు సందర్భాల్లో ‘ఇతడు అద్భుతమైన విలుకాడే గాని, నా పినతల్లి చేతిలాఘవం, ఆమెకు తెలిసిన ఒడుపులు కిటుకులు వీని గురువు ఇతడికి నేర్పలేదు’ అని రాముడు అనుకొనేవాడట. అంటే ఆ విద్యలో కైకేయికి గల నైపుణ్యం, ప్రావీణ్యం సాక్షాత్తు కోదండరాముడే మెచ్చుకొనే స్థాయివి. వారిద్దరి మధ్యగల బంధంలో ఇదొక బలమైన ముడి. రాముడికి ఆమె పట్ల అవ్యాజమైన ప్రేమ. అటు కైకేయికీ అంతే. ఆమాటకొస్తే భరతుడి కన్నా రాముడంటేనే ఆమెకు ఎక్కువ ఇష్టం.

పారవశ్యం అంటే పరులకు వశమైపోవడం అనేది సామాన్యార్థం,పారవశ్యం అంటే సరైన అర్థమేమి?

పారవశ్యం అంటే పరులకు వశమైపోవడం అనేది సామాన్యార్థం. పర అనే పదానికి ‘ఇహం కానిది, పైన ఉండేది’ అనేవి సరైన అర్థాలు.

పరమందు(పైను)న్నవాడు కాబట్టి సర్వాత్మకుణ్ని ‘పరమాత్మ’ అంటారు. ఆయనకు వశమైనవాడు పరవశుడు. అతడు పొందే స్థితి పారవశ్యం. ఆ స్థాయికి చేరుకున్నవారు పొందేది అనురాగ ద్వేషాలకు అతీతమైన నిర్వికార స్థితి. లోక కల్యాణమే వారి ధ్యేయం.

భాగవతాన్ని వ్యాసుడు రచించింది, పోతన అనువదించింది- ఆ స్థితికి చేరుకున్నాకే. అందుకే భాగవతాన్ని చదివే/వినేవారికి సైతం క్రమేపీ నిర్వికార స్థితి కలుగుతుంది.

పారవశ్య ప్రాథమిక దశలు ఆత్మానందం, శరణాగతి

"ఖ్యాతి" ఎవరు?

హిందూ పురాణంలో ఖ్యాతి, దక్ష ప్రజాపతి, ప్రసూతి కుమార్తె. పురాణాల ప్రకారం, దక్షుడు భార్య ప్రసూతి నుండి 24 మంది కుమార్తెలు, అతని మరొక భార్య పంచాజని (విరిణి) నుండి 62 మంది ఉన్నారు. దక్షుడు కుమార్తెలలో ఖ్యాతి ఒక ప్రముఖురాలు. ఈమె శివుని భార్య అయిన సతి సోదరి.

Thursday, January 14, 2021

సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని అయిదు కథలు

సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి.

1. పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి , ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ , వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట ! 

2. సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు. శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని , నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది ! తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే , ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.

3. కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి , నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి , నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు. ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడు. అప్పటి నుంచి ఎద్దులు , వ్వవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.

4. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా ! దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు , వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.

5. సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే , హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర , ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. ఇవండీ సంక్రాంతి గురించి ఓ అయిదు కథలు. ఇంకా గొబ్బెమ్మలు దగ్గర నుంచి భోగిపళ్ల వరకు... సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికీ ఓ కథ ఉంది.

Wednesday, January 13, 2021

వరుణ యాగానికీ --- వర్షానికి సంబంధం ఏమిటి..?

యజ్ఞాలు చేసినట్లయితే వర్షాలు కురుస్తాయి అంటాం కదా! అది ఎలాగో  చూద్దాం

మంత్రాలకి చింతకాయలు రాల్తాయా..??అంటూ సందేహించే వారికోసం:- 

మనకి విశ్వంలో వర్షానికి  ముఖ్యంగా రెండు energy systems కారణం గా ఉంటాయి.

శబ్ద తరంగాలు 

ఉష్ణ తరంగాలు 

మంత్రాల ద్వారా శబ్ద తరంగాన్ని , అగ్ని ద్వారా ఉష్ణ తరంగాన్ని ప్రేరేపిస్తున్నాం.. 

యఙ్ఞాలలో సమిధలు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమలు, సోమ (ఒక రకం మొక్క).. యివి వాడతారు.. వాటి ప్రాముఖ్యత యిపుడు చూద్దాం.

ఆవు నెయ్యి అగ్ని లో వేసినపుడు ఒక లీటరు నెయ్యి కి ఒక టన్ (ton) ఆక్సిజన్ వస్తుంది. 

ఆవు పాలు 100 డిగ్రీలకు ఆహుతి అయ్యాక ethelene oxide వస్తుంది.. యిది సూక్ష్మ క్రిములను చంపేస్తుంది.

హాస్పిటల్స్ లో ICU లో sterilization కి ఈ gas వాడతారు. కొత్త ఇంటిలో పాలు పొంగించడానికి ఇది ఒక కారణం.. 

ఆవు పాలు, నెయ్యి కలసినపుడు propelene oxide వస్తుంది. కృత్రిమ వర్షానికి ఈ వాయువే కారణం.

సోమ అనే మొక్క scientific name ASCLEPIUS ACIDA.. ఈ మొక్క downstream water quality అంటే భూమి లో వున్న నీటి శాతాన్ని, నాణ్యతను పెంచుతుంది. 

ఈ మొక్క ని యజ్ఞంలో వాడటం వల్ల cloud seeding అంటే వర్షపాతం ను పెరిగేలా చేసి cloud condensing మేఘాలను సంక్షేపనం చేసి వర్షం వచ్చేలా చేస్తుంది. యిది ఆస్తమా వంటి వ్యాధులను తగ్గిస్తుంది. 

ఆవు పిడకలు తెలిసినదే కదా radiation absorber.. 

గంధం, నెయ్యి... యివన్ని యజ్ఞంలో కలిసి hydro carbons ని oxidise చేసి formic acid, acetic acid అనే క్రిమినాశిని వాయువులు ఏర్పడతాయి. 

ఇది మన యఙ్ఞానికి ఉన్న ప్రాముఖ్యత..

నందీశ్వరునికి ఎందుకంత ప్రత్యేకత!

శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు. 

నంది.. పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత వచ్చిందా? కాదంటోంది ఆయన చరిత్ర! 

పూర్వం శిలాదుడనే రుషి ఉండేవాడు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా… పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకు సంతానభాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు. ఏళ్లూ ఊళ్లూ గడిచిపోయాయి, ఎండా,వానా వచ్చిపోయాయి… కానీ శిలాదుని తపస్సు ఆగలేదు. ఆతని ఒంటినిండా చెదలు పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు. ఎట్టకేలకు శిలాదుని ఎదుట ప్రత్యక్షం అయ్యాడు పరమశివుడు. 'నాకు అయోనిజుడయిన ఒక కుమారుడిని కలుగచేయి' అని కోరుకున్నాడు శిలాదుడు. అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు 'తథాస్తు' అంటూ వరాన్ని అనుగ్రహించాడు.

శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా, ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి ' నంది ' అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట! బాలుని జననంలాగానే... అతని మేథ కూడా అసాధారణంగా ఉండేది. పసివాడకుండానే సకలవేదాలన్నీ ఔపోసన పట్టేశాడు. ఇలా ఉండగా ఓనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతను తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు. వెళ్తూ వెళ్తూ 'దీర్ఘాయుష్మాన్ భవ' అని అశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు!

నంది వంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాథేయపడిన తరువాత నంది ఆయుష్షు త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు. భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు. కానీ నంది మాత్రం తొణకలేదు, బెణకలేదు. 

'శివుని అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి, 

దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు' అంటూ... 

శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకి మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు. శివయ్యని చూసిన నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్షు గురించో, ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా 'అచిరకాలం 

నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ' అని శివుని వేడుకున్నాడు నంది. అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా! అందుకే నందిని వృషభరూపంలో తన వాహనంగా ఉండిపొమ్మంటూ అనుగ్రహించాడు

ఆనాటి నుంచీ శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకుని ఉంటూ, ఆయన ప్రమథగణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ, తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామిభక్తి, దీక్ష కనిపిస్తూ ఉంటాయి. 

 ఉదా ॥ క్షీరసాగరమథనంలో హాలాహలం అనే విషం వెలువడినప్పుడు, దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠునిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకి ఒలికిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్నీ ఆరగించేశాడు. మహామహాదేవతలే హాలాహలానికి భయపడి పారిపోతుండగా, నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిల్చున్నాడు.

నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే, ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్యభక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు. తమిళనాట ఆయనను అష్టసిద్ధులు కలిగినవానిగా, జ్ఞానిగా, ప్రథమగురువులో ఒకనిగా భావిస్తారు. శైవమత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవన్నగుడి , మైసూర్ వంటి ప్రదేశాలలో నందికి ప్రత్యేకించిన ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగునాట కూడా లేపాక్షి (అనంతపురం), మహానంది (కర్నూలు) వంటి క్షేత్రాల్లో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తుంది. శివుడు ఉన్నంతకాలమూ, ఆయన భక్తుడైన బసవన్నకి కూడా ఏ లోటూ ఉండదు! 

Tuesday, January 12, 2021

ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలితం వస్తుంది

శ్రీ రామ అని జపిస్తే జయం లభిస్తుంది.


 కేశవా అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయం అవుతాయి.


 దామోదరున్ని జపిస్తే బంధముల నుంచి విముక్తి లబిస్తుంది.


 నారాయణా అని స్మరిస్తే సకల సర్వ గ్రహాల దోషాలు సమసిపోతాయి.


 మాధవా అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి.


 ఆచ్యుతా అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది.


 నరసింహా అని స్మరిస్తే మీ శత్రువుల పై మీదే విజయం అవుతుంది, అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుచి విముక్తి కలుగుతుంది.


 గోవిందా అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది. 


 శ్రీ లక్ష్మినారాయణు లను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కలకలాడుతుంది.


 సర్వేశ్వరా అని స్మరిస్తే మనం చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది, విజయం కలుగుతుంది.


 జగన్నాథా అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది.


 కృష్ణ కృష్ణా అని స్మరిస్తే కష్టాలు తొలుగుతాయి.


 శివ శివా అని అని స్మరిస్తే సకలమూ దరిచేరుతాయి.

శ్రీరాముని తదుపరి వంశక్రమము


ముత్తైదువుగా ఉండాలంటే ఏమి చేయాలి ?

ముత్తైదువుగా ఉండాలంటే ఏమి చేయాలని ఒకప్పుడు శివుడిని పార్వతి అడిగింది.

ఐదు చోట్ల కుంకుమ ధరిస్తే వైధవ్యం రాదు.

1.పాపిట్లో

2. కనుబొమల మధ్యన అనగా భృమధ్య భాగంలో

3. ముచ్చెలి గుంటలో అనగా కంఠం కింద భాగంలో

4. వక్షస్థలం మీద

5. నాభిలో..

వివాహమైన స్త్రీ ఇలా చేస్తే ముత్తైదువుగా ఉంటుందని శివుడు పార్వతికి చెప్పాడు. ఇది మంత్రశాస్త్ర నియమం..

Monday, January 11, 2021

ప్రస్తుత ప్రపంచ పటంలో పాతాలలోకాలు ...7 అవి ..

 ప్రస్తుత ప్రపంచ పటంలో పాతాలలోకాలు ...7 అవి..

అతల...వితల.... సుతల.... తలాతల... మహాతల... రసాతల... పాతాల లోకాలు

అతలలోకం----యూరప్

వితలలోకం----ఆసియా 

సుతలలోకం----ఆస్ట్రేలియా

తలాతలలోకం---అంటార్కిటికా

మహాతలలోకం---నార్త్ అమెరికా

రసాతలలోకం----ఆఫ్రికా

పాతాలలోకం---సౌత్ అమెరికా


అంటే పాతాల లోకం మనదేశం నుండి దూరం 15000 కిలోమీటర్లు అన్నమాట.


పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం.


దానికి కారణం, భూగోళంలో భారతదేశానికి సరిగ్గా  అవతల వైపున అమెరికా ఖండం ఉంది.


భారతదేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారని అనేకుల అభిప్రాయం. ఇందుకు శ్రీ రామాయణం నుంచి కొన్ని విశేషాలు చూద్దాం. 


సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి #పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అవతారమైన #కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు. ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున #కపిలారణ్యం గా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాడు #కాలిఫోర్నియగా పిలువబడుతోందని నడిచేదేవుడుగా పిలువబడిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉపన్యాసంలో చెప్పారు. 


కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)  (సగర పుత్రులు బూడిద కుప్పలు గా  మారిన ప్రదేశం) మరియు హార్స్‌ల్యాండ్ (Horseland) ( యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన #గంగోత్రి హిమానీనదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి. 


#వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే అని, దానికి పురాతన నామం #మహాబలిభూమి అని, ఇప్పుడది #మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందిందని కొందరు పండితులు చెప్తారు. 


ఈ మలిపునగర్ కు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం. ఇక్కడే అలుమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఈనాటి హిందువులు నిర్మించుకున్నారు.


అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన ప్రదేశం ఇండోనేషియాలోని #బాలీ అనే వాదన కూడా ఉంది. బాలీకు అడుగు భాగాన, భూమికి అవతలివైపు దక్షిణ #అమెరికా ఖండం ఉంది. (చిత్రంలో చూడవచ్చు) అక్కడి నుంచే వామన మూర్తి బలిచక్రవర్తిని త్రొక్కిన కారణంగా ఆ ప్రదేశం పేరు బాలిగా రూపాంతరం చెందిందని అక్కడి హిందువులు చెప్తారు. ఎలా చూసినా బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు #అమెరికా అంత #సంపదతో తులతూగుతోంది. పాతాళంలో అధికంగా కనిపించేది విలాసవంతమైన జీవనం. అందుకే అక్కడ #ఆధ్యాత్మికత కంటే #భౌతికతకే (materialism) ప్రాధాన్యం లభించింది.


ఇంకో ఆశక్తికరమైన విషయం రామ-రావణ యుద్ధ సమయంలో రావణుడికి సోదర వరుస అయిన మహిరావణుడు, రామలక్ష్మణులను అపహరించి, సొరంగ మార్గం ద్వారా పాతాళానికి తీసుకునివెళతాడు.


ఇంతకముందు చెప్పుకున్నట్లే పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా సొరంగ్రం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము.


మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకువెళ్ళిన సొరంగం మధ్యప్రదేశ్‌లో ఛింద్వారా జిల్లా పాతాల్‌కోట్ లోయలో ఉందని అక్కడి స్థానికులు చెప్తారు. ప్రాంతం ఏదైనా ప్రస్తుతానికి మనకది అప్రస్తుతం. అదే సొరంగం ద్వారా హనుమంతుడు పాతాళానికి వెళ్ళినప్పుడు, అక్కడ తన స్వేదం ద్వారా పుట్టిన, తన పుత్రుడైన #మకరధ్వజుని కలవడం, వారిద్దరి మధ్య యుద్ధం జరగడం, మకరధ్వజుడు ఒడిపోవడం, ఆ తర్వాత #ఆంజనేయస్వామి వారు #పంచముఖ ఆంజనేయునిగా అవతారం స్వీకరించి, మహిరావణుడిని సంహరించి, రామలక్ష్మణులను కాపాడుతారు. 


రాముడి ఆజ్ఞ మీద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజిస్తారు. మధ్య అమెరికా, #హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని ‘Lost City of the Monkey God‘ గా పిలుస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారని Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు వెళ్ళడించారు. అది అతను 1939 లో కనుగొన్నాడు. దాని గురించి ఆయన పూర్తి వివరాలు వెళ్ళడించే లోపే మరణించారు.


హిందువులకు మెక్సికన్లకు సంబంధం వున్నదా? అమెరికా అంటే పాతాళమా?


“సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ:” – అనగా #సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు. దేవతలకు మన మానం ప్రకారం వారి పగలు ఆరు నెలలు, రాత్రి ఆరు నెలలు. వారి ఒక దినం మన ఒక సంవత్సరం. అలాగే మానవులకు పగలయినప్పుడు పాతాళంలో అది రాత్రి. (ఇప్పుడు మనకు పగలయితే వారికి రాత్రి అవుతుంది, సరిగ్గా 12 గంటలు ఆ పైనే మనకు వారికి సమయ వ్యత్యాసం) రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు సగరుని చరిత్ర చెబుతూ సాగర కుమారులు 60వేల మంది కూడా ఎలా భూమిని వెదుకుతూ వెళ్ళారో, భూమిని తొలుచుకుంటూ ఎలా పాతాళానికి వెళ్ళారో సవిస్తారంగా వివరిస్తారు. వారు అలా పాతాళంలో కపిల ముని ధ్యానభంగం చెయ్యడం, ఆయన ఆగ్రహం చవి చూసి భస్మమై పోవడం, వారి భస్మాల పైన భూమి నుండి గంగను అవతరింప చేసి పారించి పాతాళంలో వారి భస్మరాశులపై ప్రవహింప చేసి వారిని తరింపచేస్తాడు భగీరధుడు. మన భూమినుండి 50000 యోజనాల  దూరంలో పాతాళం వున్నట్టు చెబుతారు. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పుకున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. 


మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది. #అహిరావణుని వృత్తాన్తంలో కూడా హనుమంతుడు పాతాళానికి ప్రయాణించి అక్కడ అతడిని మట్టు పెట్టి రామలక్ష్మణులను విడిపించినట్టు ఐతీహ్యం. అలాగ మరెన్నో కధలు భూ-పాతాళ రాకపోకల గురించి వున్నాయి. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, ఉన్నాయి.

హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ సమూహంలో సభ్యులుగా చేరటానికి, మరిన్ని హైందవ సంస్కృతీ సాంప్రదాయాలు, హిందూ ధర్మం యొక్క సమాచారం, రోజువారి పంచాంగం - రాశి ఫలాలు తెలుసుకోవడానికి మరియు మరింత భక్తి సమాచారం పొందటానికి 9908949429 నెంబరుకు వాట్సాప్ లో 'ఓం' అని సందేశం పంపండి, వివరాలకు 9000905270 నెంబరుకు కాల్ చేయండి. 

Friday, January 8, 2021

ఉత్తమ గురువు లక్షణాలు

ఎవరినైనా మనం గురువుగా భావించి... గురువు అనే పదముతో సంబోధించాలంటే... ఆయనలో మూడు లక్షణాలు ఉండాలి. 

1. సర్వజ్ఞత - ఆయనకు సర్వము తెలిసి వుండాలి. ఆయనకు తెలియనిది ఈ సృష్టిలో లేదు.

2. సర్వ వ్యాపకత - ఆయన అణువు మొదలుకొని బ్రహ్మాఁడమంతా వ్యాపించగలిగివుఁడాలి. తాను లేని చోటు లేదు కనుక భగవంతుని విశ్వవ్యాపకతా లక్షణము ఆయనకు వర్తించాలి

3. సర్వ సమర్ధత - తాను శిష్యుడిని రక్షించటం కోసము ఏదయినా చేయగల సమర్ధత కలిగియుండాలి. అవసరమయితే బ్రహ్మాండ నియమాలను సహితం మార్చగలిగేంతగా.

ఇటువంటి వారిని మనము పరమ గురువులని భావించాలి. భగవంతుని పట్ల భక్తి భావము శాస్త్ర ప్రమాణము ఆయనలో కనపడాలి. అటువంటివారిని పరిశీలించి,పరీక్షించి మరీ ఆశ్రయించాలేతప్ప. కేవలం భావావేశముతో గురువు…గురువు అని అతని వెంట పడకూడదు. శిష్యవిత్తాపహారులైన గురువులు ఈ కలియుగంలో కావలసినంతమంది దొరుకుతారు. శిష్యచిత్తాపహారులు అరుదుగా వుంటారని మహాత్ముల మాట.

ఒక గురువును ఎన్నుకున్న తరువాత.. మరల వారిని విడిచి పెట్టటం జరిగితే పతనమే తప్ప మరల ఏసద్గురువు వారిని అంగీకరించడు. వానికి సద్గతిలేదు. మరి కలియుగంలో గురువును ఆశ్రయించే అవకాశము లేదా? గురువును ఎలా ఎన్నుకోవాలి? మనము తరించే అవకాశములేదా? గురువు ఆవశ్యకత ఆధ్యాత్మిక మార్గములో ఎంత అవసరమో మహాత్ములయిన షిరిడి సాయినాధులు, రాఘవేంద్రులు లాంటి మహాపురుషుల జీవిత గాధలు చదివితే మనకు అర్ధమవుతుంది.

గురువును మనం గుర్తించలేనప్పుడు ఒక సులభమయిన ఉపాయము వున్నది. గురుచరిత్ర పారాయణము చేస్తు వుంటే మనలోని దుర్గుణాలు నశించి, మన మనోభావాలు శుద్ధి పడి గురు సేవకు అర్హతకలిగి అప్పుడు గురువే మనలను వెతుక్కుంటూ వస్తాడు. భగవంతుని అలా అనన్యంగా సేవిస్తూవున్నా గురువు అలాగే పరిగెత్తుకొస్తాడు. లేగదూడ దగ్గరకు గోమాత పరిగెత్తుకొచ్చినట్లు అని రామకృష్ణ పరమహంస చెబుతారు. కనుక మనం ఎవరిని పడితే వారిని గురువు గురువు అని పిలవకుండా మీ నిజమైన గురువుకు ఒక్కరికే ఆ పిలుపును పరిమితం చేసుకొని పవిత్రభావనతో సేవించాలి. అప్పుడే గురువు అన్న పిలుపునకు సార్ధకత చేకూరుతుంది. 

Wednesday, January 6, 2021

వత్తులు - ప్రాముఖ్యత

1 ) #ఒక_వత్తి : సామాన్య శుభం


2 ) #రెండు_వత్తులు : కుటుంబ సౌఖ్యం


3 ) #మూడు_వత్తులు : పుత్ర సుఖం


4 ) #ఐదు_వత్తులు : ధనం, సౌఖ్యం, ఆరోగ్యం, ఆయుర్ధాయం , అభివృద్ధి.. దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్ఠము..


 #దీపారాధన_విధానం :-


1 ) #నెయ్యి : నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగును .


 2 ) #నువ్వుల_నూనె : నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు , పీడలు తొలగును .


3 ) #ఆముదం : ఆముదముతో దీపారాధన చేసిన దేదీప్య మానమగు జీవితం , బంధుమిత్రుల శుభం, దాంపత్య సుఖం వృద్ధి యగును..


4 ) #వేరుశెనగ_నూనె : వేరుశెనగ నూనెతో దీపారాధన చేసిన నిత్య ఋణములు, దుఖం, చోర భయం, పీడలు మొదలగునవి జరుగును .


5 ) నెయ్యి , ఆముదం , వేప నూనె , కొబ్బరి నూనె , ఇప్ప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన వారికి దేవీ అనుగ్రహం కలుగును . 


6 ) వేప నూనె, నెయ్యి , ఇప్ప నూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం.., ఇలవేల్పులకు సంతృప్తి కలుగును .


7 ) ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేసిన సర్వ శుభములు, శాంతి కలుగును .


#దీపాలయొక్కదిక్కుల_ఫలితములు 


1 ) #తూర్పు : కష్టములు తొలగును , గ్రహ దోషములు పోవును..


2 ) #పశ్చిమ : అప్పుల బాధలు , గ్రహ దోషములు , శని దోషములు తొలగును..


3 ) #దక్షిణం : ఈ దిక్కున దీపము వెలిగించరాదు.. కుటుంబమునకు కష్టము కలుగును.


 4 ) #ఉత్తరం : ధనాభివృద్ధి, కుటుంబము లో శుభ కార్యములు జరుగును .


దీపవత్తులయొక్క_ఫలితములు 


1) #పత్తి:- పత్తితో దీపము వెలిగించినదో ఆయుషు పెరుగును .


 2) #అరటినార :-ఆరటి నారతో దీపము వెలిగించినచో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును .


 3) #జిల్లేడి_నార:- జిల్లేడినారతో దీపము వెలిగించినచో భూత, ప్రేత, పిశాచాల బాధలు ఉండవు.


4) #తామర_నార :-పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును.. ధనవoతులు అగుదురు . 


5) #నూతనపసుపువస్త్రము :- అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుదురు..


6) #నూతనఎరుపువస్త్రము :- పెళ్ళిళ్ళు అగును , గొడ్రాలికి సంతానము కల్గును.


7) #నూతనతెల్లవస్త్రము :- పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగును..


 సాయంత్ర సమయము లందు శ్రీ మహాలక్ష్మి కి దీపారాధన చేసి పసుపు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం , సౌభాగ్యం కల్గును .

Tuesday, January 5, 2021

మనకెవరికీ తెలియని గొప్ప విషయాలు...

 మహాభారతంలో చాలామందికి తెలియని ఒక విచిత్రఘట్టం ఉంది. అది వ్యాసప్రసాదితమై ఈ విధంగా ఉంది.కురుక్షేత్రంలో జరిగిన భీకరసంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం 18 రోజుల్లో నాశనం అయింది. కలుగులోని ఎలుకలా దాక్కున్న దుర్యోధనుడిని బయటకు లాగి చంపేశారు. అనంతరం మృతులకు పూర్వక్రియలు, ఔర్థ్వక్రియలు చేయడానికి అంతా గంగా నది చెంతకు చేరుకున్నారు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరితో ధృతరాష్ట్రుడు కూడా వచ్చాడు. వచ్చిన వారి ఏడుపులతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా తయారైంది. 


 అప్పుడు అది చూసిన వ్యాసుడు వారికి ఒక వరం ఇచ్చాడు. చనిపోయిన వారిలో ఎవరిని చూడాలనుకుంటే వారిని చూసే వరం అక్కడకు వచ్చిన వారికి ఇచ్చాడు. దాంతో అంతా తాము చూడాలనుకుంటున్న వారిని స్మరించారు. వారు కోరుకున్న వారంతా అక్కడకు ప్రత్యక్షం అయ్యారు. సంతోషంగా తమ ఇష్టులతో వారు గడిపిన కాసేపు అయిన తరువాత చనిపోయిన వారు వెళిపోయే సమయం వచ్చింది. అప్పుడు వ్యాసుడు ''చనిపోయిన వారితో ఎవరైనా వెళ్ళదిలస్తే వారు కూడా వెళ్ళవచ్చు'' అని మరో వరం ఇచ్చాడు. కొంతమంది తమ ప్రియాతి ప్రియమైన వారి ప్రేతాత్మతో కలసి వెళిపోయారు. 


 ఇది చాలా అరుదైన వరం. చనిపోయిన వారిని చూడవచ్చా? అంటే చర్మచక్షువులతో చూడలేము. కేవలం జ్ఞానచక్షువులు, వ్యాసాది మహర్షులిచ్చే దివ్యచక్షువులతో చూడగలము అని ఈ ఘట్టం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే నేడు పితృయజ్ఞాలను అవహేళన చేసే వారు ఎక్కువయ్యారు. వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు.దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు. కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి. 

 చాలా మందికి కొన్ని మంచి సందేహాలు కూడా వచ్చాయి. చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు. 


 వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు. 


 బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు. 


 మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు. దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు. 


 మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి. ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే. ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. 


 తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం. 


 నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి. కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది. యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది. అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. 


 పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది. సపిండికరణం తరువాత తన ముం దున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది. 


 దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు. 


 వీటిలో మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు. 


 దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి. 


 మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు). 


 నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి. 


 ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి. 


 ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి.ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది. 


 ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి. 


 తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి. 


 పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది. 


 ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది. ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి. 


 నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు. వీటిలో 10 పిండాల గురించి మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి. ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది. 


 కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు. ఏది వదిలితే అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు. 


 మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి. కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది. 


 ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు. 


 ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి. ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి. ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు. 


 పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. 


 నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి. అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి. 


 ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి. వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి. 


 వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు. 


 మాఘపౌర్ణమి చాలా మంచిది. దాన్ని మాఘపౌర్ణమి, మహామాఘి అని అంటారు. ఆ రోజున పితరలకు ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు,సంపదలు కలుగుతాయి. ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం.ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి,స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు. 


 ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు. 


 మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం. 


 దివ్యాత్మస్వరూపులారా! 


 ఇప్పటి వరకూ స్వధానామసాధన, స్వధాస్తోత్రపఠనం చేసిన సాధకులకు ఇదిసాధనలో రెండో సోపానం. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు చెప్పగా వ్యాసభగవానుడు ప్రసాదించిన దివ్యమైన పితృస్తోత్రం అందిస్తున్నాము.దీన్ని చదువుకున్న వారి సర్వపాపాలూ పితృదేవతైన తండ్రి తొలగిస్తాడు. ఇది మూడు కాలాలలో లేదా రెండు కాలాలలో లేదా కనీసం రోజుకు ఒక సారి అయినా చదువుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయి. సకల కష్టాలూ తొలగిపోతాయి.సర్వకార్యాలలో జయం సిద్ధిస్తుంది.సకల దేవతలూ సంతోషించి సకల కోరికలూ తీరుస్తారు.

Monday, January 4, 2021

ఆవుపాల శ్రేష్ఠత

1. కొంచెము పలుచగా ఉంటాయి.

2. త్వరగా అరుగుతాయి.

3. చిన్న పిల్లలకు మంచిది, తల్లిపాలతో సమానము

4. మనిషిలో చలాకీని పెంచుతుంది.

5. ఉదార సంబంధమైన జబ్బులు తగ్గుతాయి . ప్రేగులలో క్రిములు నశిస్తాయి .

6. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

7. చదువుకునే పిల్లలకు తెలివిని పెంచి వారిని నిష్ణాతులను చేస్తాయి.

8. మనస్సును, బుద్ధిని చైతన్య వంతం చేస్తాయి.

9. సాత్విక గుణమును పెంచుతాయి.

10. సాధువులు ఋషులు మునులు ఆవుపాలనే సేవిస్తారు.

11. యజ్ఞమునకు, హోమమునకు ఆవుపాలను వాడుతారు.

12. దేవాలయములలో పూజకు, అభిషేకానికి ఆవుపాలు వాడతారు.

13. కార్తీక పురాణములో- ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే పాపములు పోయి పుణ్యం లభిస్తుందని చెప్పారు.

14. గోవు దేవతా స్వరూపము. కైలాసం దగ్గరలోని గోలోకము నుండి వచ్చినది. ఆవుపాలు, ఆవు నెయ్యితో మనకు దేవతాశక్తి వస్తుంది.

15. ఆవుపాలలో – బంగారము ఉన్నది. ఆవు మూపురములో స్వర్ణనాడి సూర్య కిరణాలతో ఉత్తేజితమై బంగారు (చరక సంహిత) తత్వంగల ఒక పచ్చని పదార్ధాన్ని ఒదులుతుంది. అందువల్ల ఆవుపాలు పచ్చగా ఉంటాయి, ఆవుపాలలో మనకు అత్యంత మేలు చేసే బంగారపు తత్వం ఇమిడి ఉన్నది.

16. తెల్లఆవుపాలు వాతాన్ని, నల్ల (కపిల) ఆవుపాలు పిత్తాన్ని, ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.

17. ఆవుపాలు సర్వరోగ నివారణి. ఆవు పాలు వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతాయి.

18. ఘృతేన వర్దేతే బుద్ధిః క్షీరేణాయుష్య వర్ధనం, ఆవు నెయ్యి బుద్ధి బలమును పెంచును. ఆవుపాలు ఆయుష్షును పెంచును, ఆవుపాలు గంగానదితో సమానమని కాశీఖండములో చెప్పారు. ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉన్నది.

19. చందోగ్య ఉపనిషత్ (6-6-3) మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న, వగైరాలులోని స్థూల భాగం శరీరంలోని ఎముకలుగా మారుతుంది.


మధ్యభాగం మజ్జ (మూలుగ)గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవుతుంది. ఆరోగ్యమైన ఎముకలు, మజ్జ (మూలుగ) మంచి సాత్విక, శ్రావ్యమైన హక్కు కోసం ఆవు నేయ్యి, వెన్న తప్పక తినవలెను.

20.భారతీయ గోవులకు మూపురము వుండును. ఈ మూపురములోని వెన్ను పూసకు సూర్యశక్తిని గ్రహించగల శక్తి ఉన్నది, అందువలన ఈ ఆవుపాలు, నెయ్యి, వెన్నలకు పైన చెప్పిన ప్రత్యేక గుణములున్నవి.


పాశ్యాత్య గోవులైన జర్సీ, హె.యఫ్ వంటి గోవులకు మూపురము ఉండదు. యివి సూర్యశక్తిని గ్రహించలేవు. అందువలన వీటి పాలు మంచివి కావు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు మూపురము ఉన్న ఆవుపై ఆధారపడి ఉంది. ఈ ఆవుపాలు చలాకిని, తెలివిని, జ్ఞాపకశక్తిని, సత్వగుణమును, బుద్ధిబలమును, ఒజస్సును పెంచును, ఓజస్సు మనిషి యొక్క తెలివికి, ఆకర్షణశక్తి, వ్యాధి నిరోధక శక్తిని ప్రధాన కారణము, నెయ్యి – ఆరోగ్యమైన మంచి ఎముకలను మంచి రక్తమును ఉత్పత్తి చేయు మూలుగను, మంచి హక్కును, మేధాశక్తిని, కాంతిని, బుద్దిబలమును పెంచుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తంలో చెడు కొలెస్టిరాల్ అయిన యల్.డి.యల్ cholesterol ను పెరగనివ్వదు.


ఆవు నెయ్యి వలన ఉత్పత్తి అయిన మూలుగ నుండి మంచి రక్తము ఉత్పత్తి అయి, వ్యాధికారక క్రిములను (Aids ను కలుగచేయు Virus క్రిములతో సహా) చంపి వేసి, ఆరోగ్యమును కలుగజేయును. స్త్రీలలో ఎముకలు బలహీనమై Osteoporosis, Arthritis అనే వ్యాధి రాకుండా ఉండటానికి , వచ్చిన వ్యాధిని తగ్గించుటకు, గర్భిణి స్త్రీలు మంచి calcium పొందడానికి – Calcium మాటల కన్నా ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టమైనది. స్త్రీ గర్భములోని బిడ్డకు ఎముక పుష్టికి, మేధాశక్తికి పునాది వేస్తుంది.


ఈ జన్మలో నిత్యమూ తీసుకొనే ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి యొక్క సూక్ష్మ అంశతో ఏర్పడే ‘మనస్సు, బుద్ధి’ రాబోవు జన్మలో వారికి మంచి మేధాశక్తి, బుద్ధిబలము ప్రసాదిస్తుంది. మన ఋషులు తపశ్శక్తితో చెప్పిన సూక్ష్మ విషయములు Scientists కొంతవరకే నిర్ధారించగలరు. ప్రాణము, మనస్సు, బుద్ధి, ఆత్మ చైతన్యము గురించిన వివరములు Science ఇంకనూ కనుగొనలేదు. వాటి గురించిన వివరములు తెలుసుకో గలిగినప్పుడే Scientists పై విషయములు చెప్పగలుగుతారు. ఆరోగ్యము మేధాశక్తితో కూడిన ప్రజలు మన దేశ భవిష్యత్తుకు మూలము కదా .

Sunday, January 3, 2021

ప్రపంచానికి భారతీయులుగా మనం అందించిన కాల గణన

మనకు ఉగాది మాత్రమే కొత్త సంవ త్సరం. జనవరి 1 ఎందుకు కాదు? అని తెలుసుకోవటానికి చదవండి.

హైందవపురాణాల ప్రకారం విశ్వమంతాగోళాకారంగాఉంది_.

విశ్వమంతా గోళాకారంలో ఉన్నపు డు 360 డిగ్రీలకంటే మించిన కోణం ఉండే సావకాశం లేదని గుర్తించిన మన భారతీయ బుుషులు 12విభా గాలు చేశారు. ఒక్కో విభాగానికి 30 డిగ్రీలు (కోణం) కలిగినపుడు,దీనిని ఒక రాశి అన్నారు. ఆ రాశుల పేర్లు కూడా మన నుండి కాపీ కొట్టినట్టు గానే వుంటాయి.

1. మేషం. 

2. వృషభం .

3. మిథునం. 

4. కర్కాటకం. 

5. సింహం. 

6.  కన్య .

7. తుల. 

8.  వృశ్చికం. 

9. ధనుస్సు. 

10. మకరం. 

11. కుంభం. 

12. మీనం .

ప్రతి రాసి 30 డిగ్రీలు (కోణం) x 12 = 360 డిగ్రీలు

1. మనం ఉన్న స్థలంనుండి (భూగో ళం)  గ్రహాలను పరిశీలిస్తే ఏ కోణం లో కనబడుతుందో, దానిని బట్టి(ఆ కోణంలో) ఆ రాశిలో ఫలానా గ్రహం సంచరిస్తోందని గుర్తిస్తూ, గ్రహగతు లను గణిస్తున్నారు. వీటిని బట్టేనెల లు ఏర్పడుతున్నాయి.

2. ఇలా సూర్యుడు 360 డిగ్రీలు (కో ణాలు) (అంటే 12 రాశులలో)సంచ రించగా ఒక సంవత్సరం పూర్తిఅవు తుంది. 

🌞 సూర్యగతిని బట్టి : సంవత్స రాలు.

🌙 చంద్రగతిని బట్టి : రోజులు. 

వీటిని సమన్వయ పరుస్తూకా లా న్ని కొలుస్తారు.

3. సంచరించేటపుడు, ఒకరాశి నిదాటడానికిగ్రహాలకుపట్టేకాలం 


1.--> సూర్యుడు : 30 రోజులు. 

2. --> చంద్రుడు  : 2 1/2 రోజులు. 

3. -->  కుజుడు   :411/2న్నర రోజు లు.                                                       

4.-->  బుధుడు  : ఒక నెల. 

5.-->  గురువు    :ఒకసంవత్సరం. 

6.-->  శుక్రుడు    : ఒక నెల. 

7. --> శనిగ్రహం  :  రెండున్నరసంవ త్సరములు. 

8.  -->  రాహువు     : ఒకటిన్నరసం వత్సరములు

 9.--> కేతువు          : ఒకటిన్నర సంవత్సరములు.                             

సూర్యుడు తానున్న రాశి నుండి, పై రాశిలోకి మారే కాలాన్ని సంక్ర మణము అంటారు.

4. గ్రహ సంచారాల వల్ల మారే స్థితు లనుబట్టి, మనుష్య జీవనంలో కలి గే ఫలితాలను ప్రభావితం చేసేందు కు ఆ నాటి, ఆ నెల, సంవత్సరపుస్థి తిలో మేలు, కీడు చేయగలిగినగ్రహా లనూ, కాలాలనూ గుర్తించారు. గ్రహముమనకుకనబడితేఉదయిం చినదనీ, కనబడకపోతే అస్తమించి నదనీ అంటారు.

5. మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు.  దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే,ఆ వ్యక్తిజీవితం లో ముఖ్యమైన భాగం పూర్తి అయి నట్లు లెక్క. (ఈ తరువాతఆధ్యాత్మి క జీవితమే తరువాయి. అని గుర్తు. దీనికోసమే షష్టి పూర్తిఉత్సవంచేసి, పిల్లలకు బాధ్యతలు ఆప్పగించి, వాస న ప్రస్థులవుతారు) వాడుక వానప్రస్థము అని గుర్తించాలి.

6. కాబట్టి, పుట్టి నప్పటి నుండి 60 సంవత్సరాలను లెక్కించేందుకై, ప్రతి సంవత్సరాన్ని ఒక నామంతో వ్యవహారం చేయడం భారతీయుల విశేషత.

7. అబ్దం అనగాసంవత్సరమే!. సంవత్సర గణనంలో మరో ము ఖ్య మైన కొలబద్ద యుగాలు. ఒక ముఖ్యమైన ఘటన,లేదాపుణ్య పురుషుడి జన్మను బట్టి, ఆయాశకాలను గణిస్తారు. ప్రస్తుతం కలియుగ ప్రారంభాన్ని బట్టి కలియుగాబ్దాలు, శాలివాహన చక్రవర్తి కాలాన్ని బట్టి శాలివాహన శకం, శంకరాచార్యశకం ఇలా రకరకాలుగా గణనంలోకవ్యవ హారంలో ఉన్నది.

ఇదే విధానాన్ని మన దగ్గర చాకచ క్యంగా తస్కరించికొత్తగాపేర్లుమార్చి చెబుతుంటారు.            

అయితే అందులో పరిపూర్ణత్వము వుండదు. వారి తెలివి భూమి బల్ల పరుపు అన్న చందాన వుంటుంది అనేది వాస్తవం. 

ఈ ప్రపంచ మానవాళికి మనం పెట్టి న భిక్ష ఈ ఙ్ఞానం. అయితే వారి గుడ్డి లెక్కల ప్రకారం జనవరి 1 కొత్త సంవత్సరం.అనటం సరియైనదికాదు.దానికి శాస్త్రీయమైన ప్రమాణము లేదు.అది కేవలము క్యాలండర్సంవత్సరం మాత్రమే! అని గుర్తిచటం ఇక్కడ అవుసరముకను క ప్రాచ్యాచ్యపువారి ప్రభావము భా రినపడి మన తోటి భారతీయులు కొట్టుకుపోకుండా చూసుకొనవలసిన బాధ్యత మనందరిపైన వున్నది.

శరీరం లయం

 ప్రతి మనిషికి

1. స్థూలశరీరం లయం

2. సూక్ష్మ శరీరం లయం

3. కారణ శరీర లయం

4. మహా కారణ శరీరం

స్థూల శరీరము కర్మజమగుట వలన కర్మము క్షీణించెనేని స్థూల దేహము క్షీణించును.  స్థూల శరీరము ఎలా పుట్టింది​? ఎందుకు పుట్టింది​? అది జడం కదా. పంచభూతాలు ఎందుకు పంచీకరణ అయి స్థూల శరీరంగా మారింది? అన్నము వలన శుక్లశోణితాల వలన  పిండం ఎందుకు వచ్చింది? పిండం వచ్చి, బిడ్డ పుట్టి పెరిగి చచ్చేదాకా అనేక సుఖదుఖాలు పొందుతున్నాడు కదా! ఈ స్థూల దేహం దానికే ఉపయోగిస్తోందా. దీనిని ఎవరు తెచ్చుకున్నారు​? కర్మ చేయడానికి ఈ పనిముట్టు కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కూడా ఈ పనిముట్టు. ఈ పనిముట్టు అవసరం ఎవరికి వుంది? ఏ సూక్ష్మ శరీరం అయితే మంచి చెడు కర్మలు చేసిందో ఆ చేసిన పనే మళ్ళీ చేయడానికి ఈ పనిముట్టు కావలసి వచ్చింది. ఇంకొక జన్మ, ఆ జన్మలో కూడా తృప్తిపడకుండా వున్నది. శరీరాన్ని విడిచి వుండలేకుండా వున్నది. ఏదో చేయాలని చేయలేకుండా వున్నది. ఇప్పుడు చేద్దాం అనేటటువంటి సంస్కారము​, వాసన ఏదైతే ఆ సూక్ష్మ శరీరంమీద ముద్రించబడిందో ఆ సూక్ష్మ శరీరమే తను ఇవన్నీ చేయడానికి ఫలితాలు పొందటానికి​, మరల ఈ పనిముట్టును తెచ్చుకుంది. అంటే స్థూల శరీరం రావడానికి కారణం సూక్ష్మ శరీరం అన్నమాట. సూక్ష్మ శరీరం అలా వుండటానికి కారణం కారణ శరీరం, వాసనలు. వాసనా క్షయం అయితే లింగదేహం భంగమవుతుంది. కారణ శరీరం వున్నంత వరకు వాసనలు వున్నంత వరకు లింగ శరీరం సూక్ష్మ శరీరంగా వున్నంత వరకు సూక్ష్మ శరీరం స్థూల శరీరమును పనిముట్టుగా తెచ్చుకుంటుంది. స్థూల శరీరము కర్మజ మగుట వలన కర్మము క్షీణించెనేని స్థూల శరీరము కూడా క్షీణించును. వాసనా క్షయం అయితే స్థూల శరీరం వుండదు.

సూక్ష్మ దేహము సహజమగుట వలన కత్తుల చేత నరకబడక జలముచేత నానక అగ్నిచేత దహింపబడక వాయువు చేత శోషింపబడక, ఉంటూనే ఉంటుంది. ఏమిటీ అత్మకున్న లక్షణాలు సూక్ష్మ శరీరానికి కూడా వున్నాయి​? సూక్ష్మ శరీరం కూడా కత్తుల చేత నరకబడదు. నీళ్ళలో నానదు. అగ్నిచేత కాలదు. వాయువుచేత శోషింపబడదు.       వృత్తి ప్రళయము, నిత్య ప్రళయము, దేహ ప్రళయము, మను ప్రళయము, బ్రహ ప్రళయము, విష్ణు ప్రళయము, రుద్ర ప్రళయము, మహేశ్వర ప్రళయము, సదాశివ ప్రళయము, విరాట్‌ పురుష ప్రళయము ఇవన్నీ దశ విధ ప్రళయాలు. దశవిధ ప్రళయాలయందు కూడా ఈ సూక్ష్మ శరీరము చెడక వుంటుంది. ఇది విదేహ ముక్తి పర్యంతము వుంటుంది. జీవన్ముక్తుడికి కూడా సూక్ష్మ శరీరం వుంటుంది. విదేహ ముక్తుడికి స్థూల శరీరం పడిపోతుంది. లింగ శరీరము భంగమవుతుంది. అంతవరకూ ఈ సూక్ష్మ శరీరం ఉంటూనే వుంటుంది.

ముక్తి కోరువారు ముందుగా సూక్ష్మ శరీరమును చెరపగోరక కారణ శరీరమును చెరపవలెను. మోక్షం కావాలంటే సూక్ష్మ శరీరమును చెడగొట్టడంవల్ల అది పోదు. ఒక రాక్షసుడు చంపితే వాడినుంచి చిందిన ప్రతి బొట్టు ఒక రాక్షసుడు అయింది. అలాగే సూక్ష్మ శరీరాన్ని ముక్కలు చేస్తే కొన్ని వేల ముక్కలు అవుతుంది. వేల ముక్కలు వేల స్థూల శరీరాలను తెచ్చుకుంటుంది. అందుకే ఒక తండ్రికి పదిమంది కుమారులు కూడా, తండ్రే కుమారుడయ్యాడు. దాని అంతరార్ధం అది. ఆ రాక్షసుడు ప్రతి చుక్క కూడా రాక్షసుడయ్యాడు. ఒక కారణ శరీరం పది విభాగాలు అయినప్పుడు​, తండ్రి యొక్క కర్మ కొడుక్కి పంచబడ్డప్పుడు తండ్రీ కొడుకూ ఒక్కడే. తండ్రి తన శరీరము ద్వారా అనుభవించాల్సినది తృప్తి చెందక తన శుక్లముతో పాటుగ తన సంచిత కర్మలో కొంత భాగాన్ని కూడా కుమారులకు పంచుతాడు. వారు తయారవుతారు. తండ్రి తన భార్య గర్భములో శుక్ల రూపంలో ప్రవేశించి​, ఆ తండ్రే ఆ భార్యకు కొడుకు అయ్యాడు. కాబట్టి తండ్రి తనయొక్క భార్యనుండి తానే కొడుకై వచ్చాడు. శుక్లరూపంలోనే కాకుండా సంస్కార రూపంలో వచ్చాడు. నలుగురు కొడుకుల రూపంలో వచ్చినా కూడా నలుగురు బిడ్డలూ కూడా ఆ తండ్రే. ఆ రకంగా సూక్ష్మ శరీరం కూడా ఎన్నైనా విభాగాలు కావచ్చు, కారణ శరీరం కూడా కొన్ని వాసనల కుప్పని ఎన్నైనా విభాగాలు చేయవచ్చు. అయితే ఎప్పుడూ అలా వుండదు. దీనికి కూడా ఒక అవకాశముగా గుర్తు పెట్టుకోండి.

జనాభా పెరగడానికి కారణము ఒక్కొక్క కారణ శరీరము అనేక కారణ శరీరాలుగా విభాగమవ్వడమే. ఎందుకంటే మనం ముందు ఎవరమూ లేము. మహాకారణం నుండి కొన్ని కారణాలు విడిపోయాక​, ప్రతి ఒక్క కారణ శరీరానికి సూక్ష్మ, స్థూల శరీరాలు వచ్చి చేరితే మనము ఉన్నాము. జన్మముందా​? కర్మముందా​? అంటే ఈ విధముగా కర్మేముందు అవుతుంది.

పునర్జన్మలలో తిరిగేవారికైతే మరణానంతరము సూక్ష్మ శరీరము తన అధిష్ఠాన దేవతయైన పితృ దేవతలలోనికి లయమవుతుది. ఇంద్రియాలన్నీ వాటి అధిష్ఠాన దేవతలలో లయమవుతాయి. కారణ శరీరం అవ్యక్తంగా ఉంటుంది. పునర్జన్మలో​, స్థూల శరీరం పంచభూతాల పదార్థముగా తయారవుతుంది. గోళకాలు ఏర్పడగానే ఇంద్రియాలు​, వాటివాటి అధిష్ఠాన దేవతలనుండి వచ్చి ఆ గోళకాలలో చేరి ఉంటాయి. పితృ లోకమునుండి ప్రేతాత్మ అనబడేటటువంటి సూక్ష్మ శరీరం స్థూలంలోకి వచ్చి చేరుతుంది. కారణము సమయానుకూలముగా కార్యరూపములోకి వచ్చి అనుభవాలను కలుగచేస్తుంది.

ముక్తి కోరువారు సూక్ష్మ శరీరమును భంగపరచాలని చూడక, ముందుగా కారణము శరీరమును సున్నా చేసే ప్రయత్నము చేయవలెను. ఈ రెండు శరీరాలు కూడా మొదట ఎక్కడనుండి ఉనికిలోకి వచ్చాయో, మళ్ళీ అక్కడికే వెళ్ళి లయం కావాలి. అప్పుడే ముక్తి.

ముక్తి కోరేవారిలో సూక్ష్మ కారణ శరీరము ఏకకాలమందు వాటియొక్క అధిష్ఠానములందు లయమవుతాయి. ఈ సూక్ష్మ కారణ శరీరాల అధిష్ఠానం ఎవరండి? ఎవరు వారు? పంచ అధిదేవతలు. సదాశివ ఈశ్వర బ్రహ్మ విష్ణు రుద్ర ప్రత్యగాత్మ ప్రకాశరూపముగా వున్న పంచబ్రహ్మలే పంచకర్తలు. ఈ సూక్ష్మ కారణ శరీరాలకే కాకుండా స్థూల శరీరము పంచీకరణము ద్వారా ఏర్పడటానికి కూడా శుక్లశోణితాలలో వున్నటువంటి జీన్స్‌ కూడా ఈ పంచ అధిదేవతలే. అధిదేవతలే అక్కడ జీన్స్‌ రూపంలో స్థూల శరీరోత్పత్తికి అక్కడికక్కడే కారణ భూతంగా వున్నారు. వాళ్ళు ఎక్కడో ఏదో లోకంలో వుండి సృష్టి చెయ్యడం లేదు. ఎక్కడ సృష్టి జరుగుతుందో అక్కడే ఆ  ప్రజాపతి బ్రహ్మ వున్నాడు.  సూక్ష్మ కారణ శరీరము ఏకకాలమున వాటి అధిష్ఠాన దేవతలయందు లయింపచేయవలెను. పంచబ్రహ్మలయందు లయింపచేయాలి. అంటే అష్టప్రకృతులు లయంలో ఎక్కడిదాకా చెప్పాం. అవ్యక్తం దాకా చెప్పాం. అవ్యక్తంలో ఎవరున్నారు​? ఆ పంచబ్రహ్మలు వున్నారు. కనుక అష్ట ప్రకృతి లయము ద్వారా ఇంద్రియ లయము చేసుకొని అవ్యక్తములో వున్న పంచబ్రహ్మలలోకి సఛ్ఛిష్యునియొక్క సూక్ష్మ కారణ శరీరములు అక్కడ లయపరచుకోవాలి. అదే విదేహ ముక్తి. లేనిచో అన్యోన్యాశ్రయముగా సూక్ష్మము వుంటేనేమో కారణ ముంటుంది. కారణము వుండటంవల్ల సూక్ష్మము వుంటుంది. ఇద్దరూ కలిసే వుంటారు.

ఈ కారణ శరీరము భ్రాంతిజమగుట వలన అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము చేత భ్రాంతి నశింపజేసెనేని భ్రాంతి వలన కలిగిన కారణ శరీరము నశించును. మొదట్లో మనకు ఎక్కడ భ్రాంతి ప్రారంభిస్తుందో అక్కడే సూక్ష్మ శరీర నిర్మాణం జరిగిపోయింది. ఒకే జన్మ ఒకే మరణం. వాడు ఎన్ని లక్షల జన్మలైనా ఎత్తనీ - పశుపక్ష్యాదులు​, క్రిమికీటకాదులు​, మానవ పునర్జన్మలు ఎన్నైనా పొందనీ సూక్ష్మ శరీరము కంటిన్యూ అవుతోంది. స్థూల శరీరాలే మారుతున్నాయి. స్థూల ఉపాధులు మారుతున్నాయి. సూక్ష్మ శరీరము సూక్ష్మ ఉపాధి అలాగే కొనసాగుతుంది. ఎప్పుడైతే విదేహ ముక్తుడయ్యాడో​, ఎప్పుడైతే వాసనా క్షయం అయిందో, ఎప్పుడైతే కారణ శరీరం సున్నా అయిందో, అప్పుడే లింగ శరీరం భంగమయింది. ఇది ఆ సూక్ష్మ శరీరం యొక్క మరణం. ఒకే జన్మ ఒకే మరణం అంటే ఎప్పుడు భ్రాంతి మొదలయిందో అది జన్మ. ఎప్పుడు భ్రాంతి రహితమయిందో అది మరణం.

భ్రాంతి విడిచినప్పుడు​, సర్వము మిథ్య అని తోచును. భ్రాంతిలోనే అన్నీ వున్నాయి అని తోచును. భ్రాంతి పోతే ఏదీ లేదు, నువ్వూ లేవు.  నిజంగా నీవు కూడా లేవు. భ్రాంతి పోగానే అన్నీ పోయినాయి. లేనివే లేకుండా పోయినాయి. ముందుగా వున్నవాటికి లేవనే భావంతో మిథ్యగా చూశావు. తరువాత భ్రాంతి రహితం కాగానే మిథ్యగా చూడటం కూడా పోయి, అసలు అవి తోచుటయే లేవు. ఈ ఉపాధి కాని, నీవు కాని, నీ చుట్టూ వున్న దృశ్యమాన ప్రపంచం గాని ఏమీ తోచుట లేదు. ప్రపంచము, జీవోపాధులు మొదలే లేవు. వాటి వాసన లేదు, వాటి వృత్తీ లేదు, వాటి ఎరుకే లేదు. ఒకప్పుడు చూసి ఇప్పుడు చూడకపోతే వాటి జ్ఞాపకం వుంటుంది. అవి ఉన్నాయనే ఎరుక లేకుంటే, ఎలా జ్ఞాపకం ఉంటుంది? అందువలన వాసనలను, జ్ఞాపకాలను​, గుర్తులను​, వాటన్నింటికీ మూలమై ఎరుకను, ఎరిగే ఎరుకను లేకుండా చేసుకుంటే భ్రాంతి వదిలింది. అట్టితరి కర్మ వాసనలుండవు. మరియు జ్ఞానాజ్ఞానములుండవు. లింగ శరీరము భంగమై, ప్రకృతియందు లయమవుతుంది. అంటే విలయమవుతుంది. మాయ వలన వచ్చింది, కనుక, తిరిగి మాయలోనే విలీనమవుతుంది. కారణ మహాకారణాలు అవ్యక్తము లేక మూల ప్రకృతిలో లయం

Friday, January 1, 2021

శాంతాకారం - శ్లోకంలోని అద్భుత భావన

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధా(కా)రం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం!

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం!!


ఇందులో సృష్టిక్రమం..

సృష్టిని పాలించే ఈశ్వర స్వరూపం..

ఒక చక్కని క్రమపద్ధతిలో నిబద్ధించారు.


#శాంతాకారం

సృష్టికి పూర్వం ఈ జగమంతా శాంత స్థితిలో ఉన్నది.

శాంతం, శమనం – అంటే అన్నీ లయించిన స్థితి.

అనేకంగా ఉన్న వృక్షం, బీజంలో లీనమయినట్లుగా, సర్వ జగతి, పరమాత్మయందే లీనమై ఉన్న స్థితి – శాంతి.

ఏ వికారమూ లేని పరిపూర్ణత్వాన్ని కూడా, ఈ శబ్దం తెలియజేస్తోంది.

శాంతమే తన స్వరూపంగా కలిగిన పరమాత్మ.


#భుజగ శయనం

భుజగశయనుడు..అనంత కాలతత్త్వమే అనంతుడు – ఆదిశేషువు – భుజగము.

ఈ కాలానికి ఆవల కాలాన్ని అధిష్ఠించిన ఈశ్వరుడే భుజగశయనుడు.

కాలానికి లొంగి ఉన్నవి లోకాలు.

కాలాతీతుడు, కాలం ద్వారా జగతిని శాసించే భగవానుడు కాలభుజగశయనుడు.


#పద్మనాభం

సృష్టికి తగిన కాలాన్ని అధిష్ఠించిన నారాయణుని సంకల్పం మేరకు, సృష్టి బీజాల సమాహార రూపమైన పద్మం, ఆయన నాభీ కమలం నుండి ఆవిర్భవించింది.

సృష్టిగా విచ్చుకుంటున్న బీజ స్వరూపమే పద్మం.

దానికి నాభి (కేంద్రం) విష్ణువే.

అందుకే ఆయన ‘పద్మనాభుడు’.


#సురేశం

విశ్వపు తొలిరూపమైన ఆ పద్మమందు,

విష్ణు శక్తియే సృష్టికర్తగా, బ్రహ్మగా వ్యక్తమయింది.

నలువైపులా దృష్టిని ప్రసరించి తన నుండి జగన్నియామక శక్తులైన వివిధ దేవతలను వ్యక్తీకరించాడు బ్రహ్మ.

జగతికి మేలు(సు)కలిగించే వారే సురలు

(సు- అంటే మేలు, ‘రాతి’ అంటే కలిగించు వాడు. సుం-రాతి – మేలును కలిగించువారు సురలు).

ఈ దేవతా శక్తులతో విశ్వమంతా నిర్మితమయింది. నిజానికి దేవతా శక్తులు స్వతంత్రులు కాదు.

ఆ శక్తులన్నీ ఆదిమూలమైన వాసుదేవుని కిరణాలే.

అందుకే ఆ సురలందరికీ తానే నియామకుడై ‘సురేశు’డయ్యాడు.


#విశ్వాధారం

కనిపిస్తున్న విశ్వాన్ని నియమించే సూక్ష్మ శక్తులు ‘సురలు’. వారితో పాటు విశ్వానికి సైతం ఆధారమై ఉన్న చైతన్యం ఆ వాసుదేవుడు.

సమస్తమునకు ఆధారమై ఉన్నందున అతడే ‘విశ్వాధారుడు’.

కనిపించే జగమంతా ఆయన చైతన్యంతో నిండి ఉన్నందున ఆతడే ‘విశ్వాకారుడు’ కూడా.

నదిలో అలలన్నిటికీ జలమే ‘ఆధారం’.

అలల ‘ఆకారం’  అంతా జలమే.

జలం అలలకు ఆధారమై, ఆకారమై ఉన్నట్లే..

విశ్వాధారుడై విశ్వాకారుడై పరమాత్మయే ఉన్నాడు.


#గగన సదృశం

ఇది ఎలా సంభవం?

ఆకాశంలో వ్యక్తమయ్యే సమస్తము నందూ, ఆకాశమే ఉన్నది.

సమస్తమూ ఆకాశము నందే ఉన్నది.

అదేవిధంగా ఆకాశంతో సహా,

సమస్త విశ్వమూ ఎవరియందు,

ఎవరిచే వ్యాప్తమై ఉందో,

అతడే పరమాత్మ.

అందుకే ఆయన ‘గగనసదృశుడు’(గగనం వంటివాడు).

ఇదే భావాన్ని ‘ఆకాశాత్ సర్వగతః సుసూక్ష్మః’ అంటూ ఉపనిషత్తు ప్రకటిస్తోంది.

ఇది నిరాకారుడైన పరమేశ్వరుని తెలియజేస్తోంది.


#మేఘవర్ణం

నిరాకారుడై సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మయే..

తన లీలా శక్తితో భక్తులను అనుగ్రహించడానికై దివ్యమంగళ విగ్రహుడై సాకారుడయ్యాడు.

ఆ సాకారం ‘మేఘవర్ణం’ (మబ్బువన్నె)గా ఉన్నది.


#శుభాంగం

మేఘం నీటితో నిండి తాపాన్నీ, దాహాన్నీ పోగొడుతుంది. అదేవిధంగా కరుణారసంతో నిండిన విష్ణు మేఘం, సంసార తాపత్రయాల్ని పోగొట్టి, జ్ఞానదాహాన్ని తీర్చుతున్నది.

అందుకే అది నీలమేఘశ్యామం.

ఆ శ్యామల వర్ణ దేహంలో ప్రత్యంగమూ శుభమే. ప్రాపంచిక దేహాలు ప్రకృతి దోషాలతో కూడి ఉంటాయి కనుక అవి అశుభ రూపాలే.

కానీ స్వామి దాల్చిన విగ్రహంలో అవయవాలు శుభ స్వరూపాలు.

తలచే వారికి శుభాలు కలిగించే స్వభావంతో దివ్యమంగళ స్వరూపంగా భాసిస్తున్నాడు భగవానుడు.

అందుకే ఆయన రూపం ‘శుభాంగం’.


#లక్ష్మీ_కాంతం

ప్రపంచాన్ని పోషించే ఐశ్వర్యాలన్నీ ఆయనను ఆశ్రయించుకున్నాయి.

ఐశ్వర్యాల అధిదేవత లక్ష్మి ఆయననే చేరి,

ఆయన సంకల్పానుగుణంగా ప్రవర్తిస్తున్నది.

అందుకే ఆ శుభ స్వరూపం ‘లక్ష్మీకాంతం’.


#కమల_నయనం

ఐశ్వర్య దేవతకు ప్రీతికరం.

కమలముల వలె విచ్చుకున్న సూర్యచంద్ర కాంతులతో జగతిని గమనిస్తున్న కరుణామయ దృష్టి కల భగవానుడు ‘కమలనయనుడు’.


#యోగిహృద్యానగమ్యం

ఇటువంటి విష్ణుతత్త్వం, స్వరూపం అందరూ అందుకోలేరు.

యోగులు మాత్రమే ఏకాగ్రమైన దృష్టితో ధ్యానం ద్వారా తమ హృదయాలలో దర్శించగలుగుతున్నారు.

ఆ కారణం చేతనే అతడు ‘యోగిహృత్ ధ్యానగమ్యుడు’.


#వందే విష్ణుం  భవ భయహరం

విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడు కనుక ‘విష్ణువు’.

ఈ తత్త్వాన్ని గ్రహించి, శుభాంగాన్ని ధ్యానించే వానికి ఈ సంసారంలో భయాలు తొలగి, అవిద్య నశిస్తున్నది. అందుకే ఆ స్వామి ‘భవభయహరుడు’.


#సర్వలోకైకనాథమ్

సర్వలోకములకు ప్రధానమైన నాథుడు అతడే ‘సర్వలోకైకనాథమ్’.


14నామాలతో ‘విశ్వానికీ – విష్ణువునకు’ ఉన్న అభిన్న సంబంధాన్ని, ఈ శ్లోకం స్పష్టపరుస్తోంది.


ఒకే శ్లోకంలో, విశ్వానికి పూర్వ స్థితి నుండి సృష్టి స్థితులను కూడా నిర్వహిస్తున్న భగవత్తత్త్వాన్ని స్పష్టపరచడం, ఆర్ష దృష్టి వైభవం.


ఇంత స్పష్టంగా పరమేశ్వరుని గొప్పతనాన్ని,

ఆయనలోని సాకార నిరాకార తత్వాలను తెలియజేస్తూ యోగపూర్వక ధ్యానం ద్వారా,

మన హృదయాలలోనే ఆయనను దర్శించగలమనే, సాధనా రహస్యాన్ని కూడా, ఈ శ్లోకం అందిస్తోంది.


అర్థస్ఫూర్తితో దీనిని పఠిస్తే,

దీనిలో పరిపూర్ణ పరమేశ్వర తత్త్వాన్ని,

సులభంగా అందుకోగలం.


ఇలా విశ్లేషిస్తే – ధ్యానశ్లోకాలలో విశ్వ నిర్వాహక విశ్వేశ్వర విజ్ఞానాన్ని మరింతగా తెలుసుకోవచ్చు.


---బ్రహ్మశ్రీ, సామవేదం షణ్ముఖ శర్మ గారు

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...