Monday, December 20, 2021

ప్రశ్నలు - సమాధానాలు

ఆండాళ్ అని ఎవరికి పేరు?

=గోదాదేవి.


తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?

= సుప్రభాతం బదులుగా.


 ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?

=భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే మంచిరోజు.


గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?

=శ్రీ విష్ణు చిత్తులు.


ఆళ్వారులు ఎంతమంది?

=12మంది.


 గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?

=భూదేవి.


గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?

=తమిళ భాష.


తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?

=నాలాయిర్ దివ్యప్రబంధము.


 శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?

=108.


 గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?

=శ్రీవిల్లిపుత్తూరు.


 దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?

=దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.


 శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?

=196 అడుగులు.


 ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?

=మూడవ పాశురం.


 శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?

=తిరుసాదము.


 శ్రీవిష్ణుచిత్తులు వారు తానకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?

=కోదై (గోదా)


పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?

=గరుడాంశము.


తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?

=శ్రీవ్రతము.


మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?

=పరమాత్మ చేతిలోని శంఖమువలే.


 శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?

=మన్మధుని


తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?

=సింహం పిల్లవలె.


తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?

=ధృడమైన కోరిక, పట్టుదల.


కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?

=మొదటి పాశురం.


 శ్రీకృష్ణుడు యశోదగర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?

=దేవకీపుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)


ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?

=రెండవ పాశురం.


 తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?

=వామన అవతారం.


 ఆళ్వార్లకు మరో పేరేమిటి?

=వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.


నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?

=మూడు.


మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?

=పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.


శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమటి?

=ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).


‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్న నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?

=యమునా నది.


మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?

=దానగుణం.


లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?

=వర్షానికి.


పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?

=పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.


 విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?

=ఐదవ పాశురం.


విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

=నమ్మళ్వారు.


తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

=బుద్ధివ్రతం.


 గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?

=పిళ్ళాయ్ (పిల్లా).


తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?

=ఆళ్వార్లతో.


గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?

=పూదత్తాళ్వారు.


తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?

=శ్రీపెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.


కీచుకీచుమని అరిచే ఏ పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?

=భరద్వాజ (చాతక) పక్షులు.


తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?

=కులశేఖరాళ్వార్.


 సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?

=విష్ణుపోతము


(విష్ణువనే ఓడ)


 పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?

=ఆయన దాసులే గొప్ప.


ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?

=ఎన్ని జన్మలకైనా అని అర్థము.


ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?

=అయోధ్య.


వజ్గం అంటే ఏమిటి?

=ఓడ.


 ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?

=అమృత కలశం.


ముప్ఫయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?

=తిజ్గళ్ తిరుముగత్తు- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.


గోపికల దివ్యాభరణములేవి?

=కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.


శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?

=అణి పుదువై- ఈ జగత్తుకే మణివంటిది.


శ్రీవిష్ణుచిత్తుల వారు


తమ మెడలో ఏ మాల ధరి


ంచెను?

=పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.


గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?

= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).

 

తిరుప్పావై ఎటువంటి మాల?

=ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.


శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?

= గోదాదేవి.


శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?

=గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.


భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

=తొండరపడిప్పొడి

యాళ్వార్....స్వస్తి...


ఆండాళ్ తిరువడిగలే శరణం ...

Tuesday, December 14, 2021

కాశి ఆలయ చరిత్ర


  • కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం. 
  • కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.
  • క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం
  • క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన
  • క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం
  • క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన  గుజరాతి వర్తకులు
  • క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి
  • క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్
  • క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం
  • క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు
  • శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి
  • క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు
  • క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం
  • క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం
  • క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు
  • క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్
  • కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం
  • ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు
  • కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం
  • 184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన. 
  • 12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.
  • కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.
  • మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.
  • కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.
  • విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.
  • ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.
  • ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.
  • 2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి యుగపురుషుడు హిందువులందరికీ ఆరాధ్య మైనవాడు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.

Friday, November 26, 2021

తిథి అంటే ఏమిటి > అధిష్టాన దేవతలెవరు .

తిథి అంటే వేద సమయగణితము ప్రకారము చంద్రమాసములో ఒక రోజును తిథి అంటారు. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావాస్య , అదే సూర్యచంద్రులు ఒకరకొకరు సమానదూరములో వుంటే పౌర్ణమి అవుతుంది, శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు..  తిథులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు. రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది.  

(1) చాంద్రమాసంలో మొదటి తిథి పాడ్యమి.పాడ్యానికి అధిదేవత అగ్ని.

(2) విధియ > బ్రహ్మ

(3) తదియ > గౌరి

(4) చవితి > వినాయకుడు

(5) పంచమి > నాగరాజు

(6) షష్టి > షణ్ముఖుడు

(7) సప్తమి > సూర్యుడు

(8) అష్టమి > రుద్రుడు

(9) నవమి > దుర్గ

(10) దశమి > ఆదిశేషుడు

(11) ఏకాదశి > యమధర్మరాజు

(12) ద్వాదశి > విష్ణు

(13) త్రయోదసి > కాముడు లేదా శివుడు

(14) చతుర్థశి >  కాళికామాత

(15) పౌర్ణమి > చంద్రుడు

(16) అమావాస్య > లక్ష్మి

ఏదెైనా కార్యం తలపెట్టినపుడు ఆ తిథికి సంబంధించిన అధిష్టానదేవుడిని పూజించాలి. పూజకు వీలుకాకపోతే మనసులో స్మరించాలి.

Wednesday, November 24, 2021

ఆగమం

భగవంతుని చేరుకునేందుకు గల మార్గాలను నిర్దేశించినవి ఆగమాలు. భగవంతుడిని ఎలా అర్చించాలి, ఎలా ప్రతిష్ఠించాలి, ఏడాదిలో జరిగే నిత్యం, నైమిత్తికం, కామ్యం అనే ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, కంకణబట్టర్‌ ఎలాంటి అధ్యయనం చేయాలి, ఉత్సవాలు నిర్వహించే యజమానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాలను ఆగమాలు తెలియజేస్తున్నాయి.

వైష్ణవ ఆగమము లలో రెండు రకాలు ఉన్నాయి.

వైఖానశ మునికి విష్ణువు నుండి వచ్చినది 'వైఖానశ ఆగమము'.

గరుత్మంతునికి అయిదు రాత్రులు విష్ణువు వుపదేశించినదే 'పాంచరాత్ర ఆగమము'.

వైఖానస ఆగమం:

శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను, వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంసను నమ్మకుండా, కేవలం పూజాపునస్కారాల పైనే వైఖానసం నడుస్తుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమైన వైఖానస భగవత్ శాస్త్రమే తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం.

పాంచరాత్ర ఆగమం:

పాంచ అంటే ఐదు, రాత్ర అంటే రోజులు అని అర్థం. భగవంతుడు ఐదు రోజుల పాటు నాగరాజు అయిన అనంతుడు, గరుత్మంతుడు, విష్వక్సేనమూర్తి, చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు అనే ఐదుగురికి ఉపదేశించినవి కావున దీనికి పాంచరాత్రం అనే పేరు వచ్చింది. ఇది మనుషుల అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. లోకంలో ప్రతి జీవి పునరావృత్తి రహిత శ్రీవైకుంఠానికి చేరి శాశ్వతమైన ఆనందం పొందేందుకు పాంచరాత్రం దోహదపడుతుంది. ఈ ఆగమంలో భగవంతుని సేవించేందుకు దివ్యము, ఆర్ఘ్యము, దైవము తదితర 108 పూజా విధానాలున్నాయి. శ్రీ పాద్మ సంహిత, శ్రీ ప్రశ్న సంహిత మొదలైన శాస్త్రాల్లో సూచించిన ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్య, నైమిత్తిక, కామ్యోత్సవాలను జరుపుతున్నారు.

పూజలు

నేడు అత్యధిక దేవాలయాలలో పాంచరాత్ర ఆగమానుసారమే పూజలు నిర్వహించబడుతున్నాయి. కానీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో మాత్రం వైఖానశ ఆగమానుసారం పూజలు నిర్వహించబడుతున్నాయి. మిగతా వైఖానశ ఆగమాలను అనుసరించే దేవాలయాలను పాంచరాత్ర ఆగమ విధానం లోనికి మార్చిన రామానుజాచార్యులవారు తిరుమలలో మాత్రం ఆ సాహసం చేయలేక వైఖానశ ఆగమం లోనే పూజలు చేయాలని కట్టడి చేసారు.

ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము

  1. మత్స్యపురాణం

 2. కూర్మపురాణం

 3. వామన పురాణం

 4. వరాహ పురాణం

 5. గరుడ పురాణం

 6. వాయు పురాణం

 7. నారద పురాణం

 8. స్కాంద పురాణం

 9. విష్ణుపురాణం

 10. భాగవత పురాణం

 11.అగ్నిపురాణం

 12. బ్రహ్మపురాణం

 13. పద్మపురాణం

 14. మార్కండేయ పురాణం

 15. బ్రహ్మవైవర్త పురాణం

 16.లింగపురాణం

 17.బ్రహ్మాండ పురాణం 

 18. భవిష్యపురాణం


ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.

మత్స్యపురాణం 

మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.

కూర్మపురాణం 

కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.

వామన పురాణం 

పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, ఋతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.

వరాహపురాణం 

వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.

గరుడ పురాణం 

గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.

వాయుపురాణం 

వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.

అగ్నిపురాణం 

అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.

స్కందపురాణం

కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.

లింగపురాణం 

లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.

నారద పురాణం 

బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.

పద్మపురాణం 

ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.

విష్ణుపురాణం 

పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.

మార్కండేయ పురాణం 

శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.

బ్రహ్మపురాణం 

బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.

భాగవత పురాణం 

విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.

బ్రహ్మాండ పురాణం 

బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.

భవిష్యపురాణం 

సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.

బ్రహ్మావైపర్తపురాణము

ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, *రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి

Friday, November 19, 2021

Mango leaves

 Mango leaves continue to release oxygen for a couple of days at least, after cutting them. That's why they are used in all festivals and functions to keep the air fresh, specifically when there are many people there.

Reason why our Sanatana Dharma encourages us to tie Mango leaves to our doors....  In this video, a mango leaf is cut in a laboratory and kept under a microscope... The bubbles coming out of leaf is oxygen... Our rishis knew this millennia back and made it a part of our culture.



Thursday, November 18, 2021

బ్రహ్మముహూర్తం

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత *బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, *98-48 నిమిషాల మధ్యకాలం ఇది.

నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ

బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి..?

ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది అని చెబుతారు. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది... 

Tuesday, November 2, 2021

నిత్య పూజ ఎవరు చేయాలి

సాధారణంగా నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేస్తాడు. ఎవరు చేయాలి అంటే యజమాని నిత్యపూజ చేయాలి. 

సంకల్పంలోనే ఉంది ‘ధర్మపత్నీ సమేతస్య’ అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. 

పురుషుడు ప్రతిరోజూ పూజ చేస్తాడు. నైమిత్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా ప్రక్కన కూర్చుంటుంది. 'వినాయక వ్రతం' లాంటిది చేసినప్పుడు. 

వస్త్రధారణా నియమం అన్నప్పుడు - ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ వేసుకుంటుంది, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం. కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం. 

ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది – 

‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ – 

గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదు; అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు; అంటే ఉత్తరీయం ఒక్కటే  ఉండాలి పురుషుడికి. చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండ కూడదు పూజ చేసేటప్పుడు.

దేవాలయంలోనైనా అంతే. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు. నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడు వీడికి, వీడు వాడికి కనపడాలి. ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి. 

ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. 

కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది. అమంగళకరుడు. యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. 

అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. 

ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనుకోండి నీయందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు స్వాగతం చెప్పడానికి ఇంటి బయటికి వచ్చిన ఇంటి యజమాని ఎడమభుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. 

నేను ఎవరి ఇంటికైనా వెళ్ళాను అనుకోండి, ఆయన ఎడమ భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురు వచ్చి స్వాగతం పలికాడు అనుకోండి ఆయన అభ్యున్నతి కొరకు మంచిమాటలు చెప్పవచ్చు. ఆయన అలా రాలేదు అనుకోండి నాపని చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నాకు అయన పెద్దరికం అనడానికి గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి. 

మీరు గమనించండి కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వు భగవంతుడితో సమన్వయము అవుతున్నావు ఆయన చేయి చాపాలి, కాళ్ళు చాపాలి, ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై అయి ఉండాలి. ఉత్తరీయం వేసుకుని ఉండాలి. 

అనుత్తరీయశ్చ, నగ్నశ్చ – వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. ‘అవస్త్రఏవచ’ – మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్నమాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి పూజకు పనికిరాను. గోచీపోసి కట్టే కూర్చోవాలి. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు. దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు. 

అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు. అవతలి వాడు పదికాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు.  అందుకే పీటలమీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజు ఉంటే బయట కుట్టించు.  పీటల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో...  ఆయుఃకారకం నువ్వు ఇచ్చేది. నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి. 

ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు. ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మనవాళ్ళు పంచెల చాపు పెడతారు. పరమ మంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్ట గోచీ పోసుకుని కట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు. శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పూజ దగ్గరికి వెళితే లాల్చీ, బనియను కూడా పనికిరావు. తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచీ పోసి పంచె కట్టుకుని కూర్చుని పూజ చేయాలి.  గోచీ ఎంత బాగా పోయాలి. అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు.

ఒక అంచు తీసి నీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు కచ్ఛ ఉన్నట్లే. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్ర ధారణయందు అటువంటి నియమము ఉన్నది. పూజయందు ఎప్పుడూ గోచీపోసి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పురుషుడు పూజ చేయవలసి ఉంటుంది.

Thursday, October 28, 2021

ఎంగిలి దోషం

మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో ఒకటి ఎంగిలి దోషం అంటకుండా జాగ్రత్త పడటం.  ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి.  ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు. 

ఎంగిలి చాలా ప్రమాదకరం  

ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది.  ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి తరువాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే. 

ఇంతెందుకు! స్వయంగా సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది, అంటే స్వంత ఎంగిలి కూడా మనకు పనికి రాదు అని అర్థం. 

పెద్దలు, పూజ్యులు, గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు.  నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు.  అది కనీసం మర్యాద.  పొరపాటున కూడా పెద్దలు, గురువుల మీద మాటల సమయంలో ఉమ్ము పడకూడదు. 

పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు.  

ఉపనయనంలో హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి.  అందులో ఇంతకముందు నేను ఎంగిలి తినడం వలన ఏదైనా పాపం వచ్చివుంటే అది శమించుగాక అని ప్రాయాశ్చిత్తం చేయిస్తారు.  ఇక ముందు తినను అని అగ్నిదేవునకు వటువుతో చెప్పిస్తారు. 

ఐదువేళ్ళతో నోటిలో నమలడానికి సరిపోయేటంత ఆహారం మాత్రమే స్వీకరించాలి. నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకుని, అది నమలలేక, తిరిగి కంచంలో పెట్టడం దోషమని శాస్త్రం చెప్తుంది. 

పూర్వం మన ఇళ్ళలో ఎవరి కంచాలు, చెంబులు వారికే ఉండేవి.  అతిథులు వచ్చినప్పుడు, వారికి వేరే పాత్రలలో ఇచ్చేవారు.  ఒక 50 ఏళ్ళ క్రితం వరకు పేదవారి ఇళ్ళలో కూడా వెండి కంచాలు, చెంబులు ఉండేవి.  

వెండి అనేది చాలాశాతం క్రిములను తన ఉపరితలం మీద నిలువనీయదు.  అది వాటిని నశింపజేస్తుంది.  ఇంకొన్ని ఇళ్ళలో అయితే వెండి కంచంలో బంగారు పువ్వు వేసి ఉండేది. అప్పుడా కంచానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు.  

ఇప్పుడు కూడా వెండి క్రిమిసంహారకమని శాస్త్రవేత్తలు ఋజువు చేస్తున్నారు.  

వంట వండే సమయంలో సైతం మనవాళ్ళు మడి కట్టుకుని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం.  మాట్లాడితే పొరపాటున నోటి తుంపరలు వండే ఆహారంలో పడి అవి ఎంగిలి అవుతాయని భయం. 

కొందరు ఈనాటికి నిత్యపూజకు మడి నీళ్ళు పడితే చాలామంది వరలక్ష్మీ వ్రతం, వినాయకచవితి మొదలైన పర్వదినాలప్పుడు, పితృకర్మలు చేసే రోజుల్లో మడి కట్టుకుని నీళ్ళు పడతారు.  ఆ దైవకార్యం పూర్తయ్యేవరకు ఆ నీటిని వేరే పనులకు వాడరు, అశుభ్రంగా ముట్టుకోరు. 

ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవు, కుక్క, కాకి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తారు.  ఆహారం (అది ఏదైనా సరే) పడేయకూడదు.  అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు.  ఎంతకావాలో అంతే వడ్డించుకుని తినాలి.  ఆహారం వృధ చేస్తే వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారు. 

ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో  నోటిద్వారా తుంపరలు వ్యాపించకుండా జాగ్రత్త వహించమని ఈ ఎంగిలిదోషాన్ని నిర్వచిస్తున్నారు. 

ఎంగిలి దోషం అంటని మూడు పదార్థాలు ఈ లోకంలో ఉన్నాయి.

1. చిలక కొరికిన పండు

2. తేనెటీగ నోటిద్వారా తయారైన తేనె.

3. దూడ తాగిన తర్వాత పిండినటువంటి ఆవుపాలు. వీటిని చక్కగా దేవుని అభిషేకానికి వాడవచ్చు, మనమూ సేవించవచ్చు.

వేద సంస్కృతి వల్ల మనకు లభించిన పూర్వ ఆచారాలను మన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధి కోసం పాటిద్దాం.

Sunday, October 24, 2021

విష్ణు సహస్ర నామ మహిమ

 పూర్వం పూరీ నగరం లో జగన్నాధపురం లో ఒక మహాపండితుడు భార్య తో సహా ఒక పూరి గుడిసె లో నివాసముండెడివాడు . ఇతను శ్రీ మహావిష్ణువు నకు పరమ భక్తుడు . పూట గడవని దారిద్ర్యస్థితి అతనిది , ప్రతి నిత్యమూ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ చేసి ఈతడు ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటన కు వెళ్లేవాడు , ఆ వచ్చినదానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు .భార్య మాత్రం పరమ గయ్యాళి , దైవం పట్ల నమ్మకం లేనిది , ఎటువంటి నియమాలనూ పాటించనిది . ఇంటి లో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననూ ఈతడు హరి నామ స్మరణ ను విడువలేదు . ప్రతినిత్యమూ చేయుచున్న విధముగా ఆరోజు కూడా విష్ణుసహస్ర పారాయణము చేయుచుండగా భార్య వచ్చి భర్త తో " ఏమిటి చేస్తున్నావు ? " అని గద్దించి అడిగింది .దానికి ఆ భర్త "విష్ణుసహస్ర నామాలను స్తోత్రం చేస్తున్నాన"న్నాడు . అందుకు ఆ భార్య " ప్రతీ రోజూ స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ! ఏమిచ్చేడు ఆ శ్రీ మహావిష్ణువు ? అడుక్కోవడానికి భిక్షాపాత్ర తప్ప " అంది . అక్కడితో ఆగక " ఏదీ ! నువ్వు చదువుతున్నదేమిటో చెప్పు " అన్నది . అందుకు ఆ భర్త " వెయ్యి నామాలే ! ఏమిటి చెప్పేది ? నీకేమిటి అర్ధమౌతుంది ? ఎప్పుడూ పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణుసహస్ర నామాలేమి అర్ధమౌతాయి ? " అన్నాడు . ఆ భార్య మాట్లాడుతూ " వెయ్యి నామాలక్కరలేదు , మొట్టమొదటిది చెప్పు చాలు " అన్నది . అందుకు ఆ భర్త " విశ్వం విష్ణుః " అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య " ఆపు అక్కడ ! దీనర్ధమేమిటో చెప్పు " అన్నది .అందుకు ఆ భర్త " విశ్వమే విష్ణువు , ఈ ప్రపంచమంతా విష్ణుమయమే " అని వివరించగా " ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు , అందులో నువ్వూ , నేనూ ఉన్నామా ? ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ , పూరిగుడిసె లో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతీ రోజూ నువ్వు ఆ శ్రీమహావిష్ణువు ని గానంచేస్తున్నావే ? అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా ? కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్ధంలేదయ్యా ! " అంది . భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు " నా భార్య మాటలు కూడా నిజమేనేమో ? విశ్వమంతా విష్ణువే ఐతే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి ? కనుక " ఈ మంత్రంలో విశ్వం" అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బొగ్గు ముక్క తో ఆ " విశ్వం" అనే పదాన్ని కనబడకుండా మసి పూసి ( తాటాకు ప్రతి ఉండేది ట ఈ భక్తుడి ఇంట్లో ) ఎప్పటిలాగే యాచన కై బయలుదేరి వెళ్లిపోయేడుట .


ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది . ప్రతినిత్యమూ పాల సముద్రంలో శ్రీమహావిష్ణువు ను శ్రీమహాలక్ష్మి సేవిస్తున్నట్లుగనే ఆరోజు కూడా స్వామి ని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందిట ! అందుకు శ్రీమహావిష్ణువు " ఏమిటి దేవీ ? ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ? " అని అడిగితే అమ్మవారు " నాధా ! మిమ్ములను నల్లని వాడని , నీలమేఘశ్యాముడని అందరూ స్తుతించడం విన్నాను కానీ అంతమాత్రంచేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా " అని పరిహాసమాడగా శ్రీమహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్లరంగు కనబడిందిట . వెంటనే శ్రీమహావిష్ణువు జరిగినదంతా దివ్యదృష్టి తో గమనించాడుట . లక్ష్మీదేవి " ఏమిటి స్వామీ ఆలోచిస్తున్నారు ? మీ ముఖము పై ఆ నల్లరంగు కు గల కారణమేటో తెలిసినదా ?" యని అడుగగా స్వామి " దేవీ ! ఇది నా పరమ భక్తుడు చేసిన పని " యని పలికాడుట . లక్ష్మీదేవి " అదేమిటి స్వామీ ! పరమభక్తుడంటున్నారు ? అతడెందుకిలా చేస్తాడ" ని యడుగగా స్వామి తన భక్తుని జీవితదీన స్థితి ని వివరించగా లక్ష్మీదేవి " అంతటి పరమ భక్తుని దీనస్థితి కి కారణమేమి ? మీరాతనిని ఉద్ధరింపలేరా ? స్వామీ ! " అని యడుగగా " దేవీ ! గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే ఐనప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి యెరుగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైననూ దరిద్రమనుభవించుట తప్పలేదు . అయిననూ నీవు కోరితివి కనుక నేటితో ఈతనికి కష్టములు తొలగించెదన" ని పలికి మానవ రూప ధారియై ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలి పోయాడు . ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషము లోనున్న శ్రీమహావిష్ణువు ఆ ఇల్లాలి తో " అమ్మా ! నీ భర్త వద్ద నేను అప్పు గా తీసుకున్న సొమ్ము ను తిరిగి తీర్చుటకు వచ్చితిని , సొమ్మును తీసికొనవలసినద"ని చెప్పగా ఆ ఇల్లాలు " నీవెవరవో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము , నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు , ఎవరనుకుని మాఇంటికి వచ్చేరో , వెళ్లిపొ "మ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి " లేదమ్మా ! నేను పొరబాటు పడలేదు , అసత్యమసలే కాదు , నీ భర్త వద్ద అప్పు గా తీసుకున్న సొమ్ము ఇదిగో ! నువ్వు స్వీకరించు , నీ భర్త కు నేను తరువాత వివరిస్తాన" ని ఆమెకు అశేష ధన , కనక , వస్తు వాహనాలు , మణిమాణిక్యాలు , సేవక జనం, తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలూ కానుకలు గా ఇచ్చి వెళ్లిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు " ఓయీ ! నీ ముఖం మీద కప్పియున్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు ! నా భర్త కు చెప్పాలికదా ! నువ్వు ఎలా ఉంటావో ? " అని పలుకగా స్వామి " అమ్మా ! నా ముఖాన్ని నీకు చూపలేను , నా ముఖం మీద ఎవరో నల్లరంగు పూసేరమ్మా ! నేనెవరో నీ భర్తకు తెలుసులే !" అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్లి కొంతదూరం పోయాక అంతర్ధానమైనాడు . ఇంతలో ఊరిలో యాచన కు వెళ్లిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరిగుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది , అనేకమంది సేవకులూ , ఉద్యానవనాలతో కళకళలాడిపోతోంది ఆ భవనం. ఇంతలో ఈతని భార్య లోపలినుండి వచ్చి " లోపలికి రమ్మని భర్త ని ఆహ్వానించగా , ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు , "అసలు ఆ సంపద ని ఎందుకు స్వీకరించావు ? మనము ఎవరికో అప్పివ్వడమేమిటి ? అది తిరిగి వారు తీర్చడమేమిటి ? మన దీన స్థితి నీకు తెలియనిదా ? "అంటూ భార్య పై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటివెంట విన్న తరువాత తన కళ్లను , చెవులను తానే నమ్మలేకపోయాడు . అయితే ఆ వచ్చినవాడు ఎలా వున్నాడు ? అతడి ముఖము ఎలాగ ఉన్నది ? అని భార్యని ప్రశ్నించగా " నేను అతడి ముఖాన్ని చూడ లేదు , అతడి ముఖం పై ఎవరో నల్లని రంగు పులిమారుట , ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు , అయినా అతడు వెళుతూ వెళుతూ నాగురించి నీ భర్త కు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్లిపోయాడ"న్నది . అది వినిన భక్తుడు హతాశుడై భార్యతో " వచ్చినవాడు మరెవరో కాదు , మారువేషంలో వచ్చిన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే ! ప్రతి నిత్యమూ నేను విష్ణువు ను స్తుతిస్తున్నా ఆ స్వామి ని నేను దర్శించలేకపోయాను , ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శనభాగ్యం కలిగింది" అని పలికి ఇంటి లోపలికి వెళ్లి ఉదయము విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి " విశ్వం " అనే నామంపై పులిమిన నల్లరంగు ను తొలగించాడు . తరువాత భార్య తో " నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడ " నగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోవగా సముద్రము ఒడ్డు కు చేరుకున్నాడు . అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వదిక్కుగా చేతులు జోడించి శ్రీమహావిష్ణువు నుద్దేశించి స్తోత్రగానంచేశాడు . అప్పుడు అశరీరవాణి " భక్తా ! పూర్వ జన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మ లో నీకు భగవద్దర్శనము కలుగదు , మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు " అని పలికినది . విష్ణుసహస్త్రనామ నిత్యపారాయణ వలన కలుగు ఫలితమిదియని అందరూ గ్రహించండి , ప్రతి నిత్యమూ పఠించండి , అవసరార్ధులకు సహాయం చెయ్యండి........

ఓం నమో నారాయణాయ

దీపావళి లక్ష్మీ పూజా విధానం , వ్రత నియమాలు

విష్ణువు శక్తికి , మాయకు కారణం లక్ష్మీ పక్కనుండటమే అంటారు. భూదేవి కూడా ఆమె మరో అంశమని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మీగా చెప్పబడింది. ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు.


త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు దేవేరి , భృగుమహర్షి కుమార్తె అయిన లక్ష్మీ దుర్వాసుని శాపంతో క్షీరసాగర మథనంలో ఉద్భవించింది. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టాల నుంచి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుందని నమ్ముతారు. ఋగ్వేద కాలంలో అదితి , రాకా , పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అధర్వణ వేదం ‘సినీవాలి’ అనే దేవతను ‘విష్ణుపత్ని’గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు.


లక్ష్మీ దేవి గురించి వివిధ గాధలు పురాణాలలోను , ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని , ఆమె నిత్యానపాయిని ఎన్నడూ విడివడనిది అని అర్థం. లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు.


పురాణాలు , ఇతిహాసాలలో లక్ష్మీ దేవి గురించి వివిధ రకాలుగా పేర్కొన్నారు. సృష్టి ఆరంభం నుంచే  శ్రీమహావిష్ణువునకు లక్ష్మీదేవి తోడుగానే ఉందని , 'నిత్యానపాయిని' లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని కొందరు అంటారు. సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని జగన్మాత ప్రసాదించిందని దేవీ భాగవతంలో పేర్కొన్నారు. 


లక్ష్మీదేవి ఓసారి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించింది. అనంతరం విష్ణువుతో వివాహం చేశాడు. కాబట్టి లక్ష్మీదేవిని 'భార్గవి' అని కూడా అంటారు.


దీపం జ్యోతి పరబ్రహ్మమ్ , దీపం సర్వతమోహరమ్ , దీపేన సాధ్యతే సర్వమ్ , సంధ్యా దీపం నమామ్యహమ్.. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. వరాహస్వామికి , భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. లోకకంటకుడైన నరకుడు విష్ణువు చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా భూదేవి వరం పొందుతుంది. 


దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద , శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి. దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. దీపం వెలిగించి ఈ కింది మంత్రంతో పూజ ప్రారంభించాలి.


 

ప్రాణ ప్రతిష్ఠ 


‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే


బెల్లం ముక్కను నివేదన చేస్తూ    

ఓం ప్రాణాయస్వాహా , 

ఓం అపానాయస్వాహా , ఓం వ్యానాయ స్వాహా

ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా , మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.


అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ మిహనోధేహి భోగం

జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానస్వస్తి

అమృతమాపః ప్రాణానేన యధాస్థాన ముపహ్యయతే

రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః


పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్

బిబ్రాణా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా

దేవీబాలార్కవర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః

పై మంత్రాన్ని చదువుతూ ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి.


 కలశ స్థాపన 


వేదిక మధ్యలో ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. బంగారం , వెండి , రాగి పాత్రను కలశంగా పెట్టి అందులో మూడు భాగాలు నీటిని పోయాలి. కలశంలో మామిడి ఆకులను వేయాలి. వేదిక మీద పోసిన ధాన్యంలో తామర పువ్వును గీసి లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్లెంలో కొన్ని నాణేలను ఉంచాలి. తరువాత కలశాన్ని కుంకుమతో అలకరించి ఈ కింది మంత్రాన్ని చదువుకోవాలి.


‘గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః

కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య’


లక్ష్మీదేవి ఆధాంగ పూజ 


చంచలాయై నమః

పాదౌ పూజయామి

చపలాయై నమః

జానునీ పూజయామి


పీతాంబర ధరాయై నమః ఊరూ పూజయామి

కమలవాసిన్యై నమః

కటిం పూజయామి

పద్మాలయాయై నమః నాభిం పూజయామి

మదనమాత్రే నమః

స్తనౌ పుజయామి


లలితాయై నమః -భుజద్వయం పూజయామి

కంబ్కంఠ్యై నమః- కంఠం పూజయామి

సుముఖాయై నమః- ముఖం పూజయామి

శ్రియై నమః ఓష్ఠౌ పుఅజయామి


సునాసికాయై నమః నాసికం పూజయామి

సునేత్రాయై నమః ణెత్రే పూజయామి

రమాయై నమః కర్ణౌ పూజయామి

కమలాలయాయై నమః శిరః పూజయామి


ఓం శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి



ఈ కింది మంత్రాన్ని పఠిస్తూ దీపం వెలిగించాలి


ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం

సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ

ఘృతాక్తవర్తి సంయుక్తం అంధరాశి వినాశకం

దీపం దాస్యామి తే దేవి గృహణ ముదితాభవ


శ్రీలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి.


లక్ష్మీ దేవికి తిలకాధారణ చేసి , విగ్రహం ముందు పూలు , కుంకుమ , పసుపు , గంధం , నైవేద్యం , పండ్లు , కొబ్బరి , మొదలైనవి సమర్పణలు ఉంచాలి. అలాగే బంగారు , వెండి ఆభరణాలు , ముత్యాలు , నాణేలను కూడా సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్దోదక స్నానం చేయాలి. ఆభరణం, ముత్యాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. విగ్రహాన్ని వస్త్రంతో తుడిచి కలశంలో పెట్టాలి. వైవియస్ఆర్



లక్ష్మీదేవి అష్టోత్తరం.. పూలు , అంక్షితలతో పూజ 


ఓం ప్రకృత్యై నమః

ఓం వికృత్యై నమః

ఓం విద్యాయై నమః


ఓం సర్వభూతహితప్రదాయై నమః

ఓం శ్రద్దాయై నమః

ఓం విభూత్యై నమః

ఓం సురభ్యై నమః


ఓం పరమాత్మికాయై నమః

ఓం పద్మాలయాయై నమః

ఓం పద్మాశన్యే నమః

ఓం స్వాహాయై నమః


ఓం స్వధాయై నమః

ఓం సుధాయై నమః

ఓం ధన్యాయై నమః

ఓం హిరణ్మయై నమః


ఓం నిత్యపుష్టాయై నమః

ఓం విభావర్యై నమః

ఓం ఆదిత్యై నమ:

ఓం దిత్యై నమః


ఓం దీప్తాయై నమః

ఓం వసుధాయై నమః

ఓం వసుధారిణ్యై నమ:

ఓం కమలాయై నమః


ఓం కాంతాయై నమః

ఓంకామాక్ష్యై నమః

ఓం క్రోధసముద్భవాయై నమః

ఓం అనుగ్రహప్రదాయై నమః


ఓం బుద్ద్యై నమః

ఓం అనఘాయై నమః

ఓం హరివల్లభాయై నమః

ఓం అశోకాయై నమః


ఓం అమృతాయై నమః

ఓం దీప్తాయై నమః

ఓం లోకశోకవినాశిన్యై నమః

ఓం ధర్మనిలయాయై నమః


ఓం కరుణాయై నమః

ఓం లోకమాత్రే నమః

ఓం పద్మప్రియాయై నమః

ఓం పద్మహస్తాయై నమః


ఓం పద్మాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః

ఓం పద్మోద్భవాయై నమః

ఓం పద్మముఖ్యై నమః


ఓం పద్మనాభప్రియాయై నమః

ఓం రమాయై నమః

ఓం పద్మమలాదరాయై నమః

ఓం దేవ్యై నమః


ఓం పద్మిన్యై నమః

ఓం పద్మగంధిన్యై నమః

ఓం పుణ్యగంధిన్యే నమః

ఓం సుప్రసన్నయై నమః


ఓం ప్రసాదాభిముఖ్యై నమః

ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్రాయై నమః


ఓం చంద్రసహోదర్యై నమః

ఓం చతుర్భుజాయై నమః

ఓం చంద్రరూపాయై నమః

ఓం ఇందిరాయై నమః


ఓం ఇందుశీతలాయై నమః

ఓం ఆహ్లాదజనన్యై నమః

ఓం పుష్ట్యై నమః

ఓం శివాయై నమః


ఓం శివకర్యై నమః

ఓం సత్యై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వజనన్యై నమః


ఓం పుష్ట్యై నమః

ఓం దారిద్రనాశిన్యై నమః

ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః

ఓం శాంతాయై నమః


ఓం శుక్లమాల్యాంబరాయై నమః

ఓం శ్రియై నమః

ఓం భాస్కర్యై నమః

ఓం బిల్వనిలయాయై నమః


ఓం వరారోహాయై నమః

ఓం యశస్విన్యై నమః

ఓం వసుంధరాయై నమః

ఓం ఉదారాగ్యై నమః


ఓం హేమమాలిన్యై నమః

ఓం హరిణ్యై నమః

ఓం ధనధాన్యకర్త్యై నమః

ఓం సిద్ద్యై నమః


ఓం స్రైణసౌమ్యాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం నృపవేశ్మగతానందాయై నమః

ఓం వరలక్ష్మ్యై నమః


ఓం వసుప్రదాయై నమః

ఓం శుభాయై నమః

ఓం హిరణ్యప్రాకారాయై నమః

ఓం సముద్రతనయాయై నమః


ఓం జయాయై/మంగళాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః

ఓం విష్ణుపత్న్యై నమః


ఓం ప్రసన్నాక్ష్యై నమః

ఓం నారాయణ సమాశ్రితాయై నమః

ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః

ఓం దేవ్యై నమః


ఓం సర్వోపద్రవవారిణ్యై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః


ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః

ఓం భువనేశ్వర్యై నమః


అష్టోత్తరం పూర్తయిన తర్వాత కింది మంత్రాన్ని జపిస్తూ కుడివైపునకు మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి.


యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే

పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ


త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల

అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి

శ్రీలక్ష్మీదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.


సాష్టాంగ నమస్కారం 


నమస్తే లోకజనని నమస్తే విష్ణు వల్లభే

పాహిమాం భక్తవరదే శ్రీలక్ష్మ్యైతే నమో నమః

శ్రీలక్ష్మీదేవ్యై నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి


సంధ్యాసమయంలో ఆవు నెయ్యితో దీపాలను ఇంటిముందర వరస క్రమంలో వెలిగించాలి.

Saturday, October 23, 2021

ఎలాంటి భోజనాన్ని చేయాలి? ఎలాంటి భోజనం చేయరాదు ? నియమాలు ఏమిటి ?

• కాకులు ముట్టుకున్నదీ, కుక్కా, ఆవూ వాసన చూసిన భోజనాన్ని తినకూడదు. 

• పాలతో భోజనం చేశాక, పెరుగుతో భోజనం చేయకూడదు. 

• కాళ్ళు చాపుకుని, జోళ్ళు వేసుకుని భోజనము చేయరాదు. 

• భోజనముచేయడానికి ఎడమచేయి ఉపయోగించరాదు. నిలవ వున్న అన్నాన్ని భుజింపకూడదు. చల్లారిన అన్నాన్ని వేడిచేసి తినకూడదు. 

• 10-15 పదార్థాలతో భోజనం కన్నా కూర, పప్పు, పచ్చడి, మజ్జిగతో తీసుకునే ఆహారమే అమృతము. నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి ఎంతో శ్రేష్ఠము.

• నిలువ పచ్చళ్ళు వయసులో 2 రోజులకోసారి, మధ్య వయసులో వారానికి 2 సార్లూ, నలభై దాటిన తర్వాత 15 రోజులకొకసారి, యాభై దాటాక నెలకొకసారి తీసుకోవటం ఆరోగ్యకరం. 

• గ్రహణం రోజున అనగా సుర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహణానికి  తొమ్మిది గంటల ముందుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. 

• దూడను కన్న తర్వాత పశువు నుంచి పదిరోజుల వరకూ పాలు సేవించరాదు.

• తడి పాదాలతో భోజనమూ, పొడి పాదాలతో నిద్ర అనారోగ్యాన్ని కలుగ చేస్తాయి. రాత్రి పడుకొనే ముందు కాళ్ళు కడుక్కుని నిద్రకు ఉపక్రమిస్తే సుఖ నిద్ర పడుతుంది. 

• అలాగే పడుకునేటప్పుడు తప్పనిసరిగా పక్కనే అందుబాటలో మంచినీరు ఉంచుకొనండి. 

• అలాగే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం నిద్ర మధ్యలో శరీర ధర్మం నిర్వర్తించాల్సివస్తే అలా మగతగా నడుస్తూ వెళ్ళకండి.

• ఎక్కువ ప్రమాదాలు జరిగేది ఆ సమయంలోనే. ఓ క్షణం పూర్తిగా ఇహలోకంలోకి వచ్హి ఆపై శరీరధర్మం తీర్చండి. 

• ఆచమనం చేసిన తర్వాత తీసుకొవాలి. అన్నమునకు నమస్కరించాలి. అహారపదార్ధాలను చూసి చిరాకు పడరాదు. వండిన వార్ని అభినందించాలి.

• అప్పుడే  బలాన్నీ, సామర్ధ్యాన్ని ఇస్తుంది. లేనిచో వికటిస్తుంది. 

• భోజనం మధ్యలో లేవటమూ, మాట్లాడటమూ  తగదు. ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టరాదు. భార్యకు సహితము పెట్టరాదు. పదార్ధాలు బాగున్నాయని అతిగా తింటే ఆయుష్షు తగ్గుతుంది. భోజనానంతరము కూడా ఆచమనం చేయాలి.

• ఆచమన విధి తెలియనప్పుడు భగవంతుడ్ని స్మరించి ఆపై భుజించాలి. విస్తరిలో ఏమీ మిగల్చరాదు. అవసరమైనంతే వడ్డించుకోవాలి. లేదా వడ్డించమని చెప్పాలి. ఇష్టం లేని పదార్ధాలను ముందుగానే వద్దనాలి. 

•  రోజుకు రెండుసార్లు భోజనం చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం శెలవిస్తొంది. రెండుసార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకొకపోతే  ఉపవాస ఫలం కూడా వస్తుంది.

•  భోజనం చేసేటప్పుడు  తూర్పు వైపుకి తిరిగి చేయాలి.

•  తూర్పు వైపుకి తిరిగి చేయటం వల్ల ఆయుర్ధాయం, అలాగే దక్షిణానికి తిరిగి భోజనం చేస్తే కీర్తి, ఉత్తరం వైపు తిరిగి భొజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి

Thursday, October 7, 2021

తెలుగు సంవత్సరాల పేర్లు... వాటి అర్థాలు

 1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక.

2. విభవ - వైభవంగా ఉండేది.

3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.

4. ప్రమోదూత.... ఆనందం..  ప్రమోద భరితంగా ఉండేది ప్రమోదూత.

5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.

6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.

7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.

8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.

9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.

10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.

11. ఈశ్వర... పరమేశ్వరుడు.

12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.

13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.

14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.

15. వృష ... చర్మం.

16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.

17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం

18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.

19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.

20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.

21. సర్వజిత్తు.... సర్వాన్ని జయించినది.

22. సర్వధారి -...సర్వాన్ని ధరించేది.

23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.

24. వికృతి... వికృతమైనటువంటిది.

25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.

26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.

27. విజయ... విశేషమైన జయం కలిగినది.

28. జయ.... జయాన్ని కలిగించేది. 

29. మన్మథ... మనస్సును మధించేది.

30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.

31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.

32. విలంబి... సాగదీయడం.

33. వికారి.... వికారం కలిగినది.

34. శార్వరి... రాత్రి.

35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.

36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.

37. శోభకృత్... శోభను కలిగించేది.

38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.

39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.

40. పరాభవ ... అవమానం.

41. ప్లవంగ... కోతి, కప్ప.

42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.

43. సౌమ్య... మృదుత్వం.

44. సాధారణ... సామాన్యం.

45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.

46. పరీధావి... భయకారకం.

47. ప్రమాదీచ... ప్రమాద కారకం.

48. ఆనంద... ఆనందమయం.

49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.

50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.

51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.

52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.

53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.

54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.

55. దుర్మతి... దుష్ట బుద్ధి.

56. దుందుభి ... వరుణుడు.

57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.

58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.

59. క్రోదన... కోప స్వభావం కలది.

60. అక్షయ... నశించనిది..

Tuesday, October 5, 2021

MAHALAYA / PITRU PAKSHA FAQs

*Q1. Should Mahalaya tarpana be done 15 days or 16 days if doing daily?*

*Ans 1*  Both are accepted in Shastras. You can do 15 or 16 days, it is as per your family practice.  If you are going to start or don’t know in your family what was followed, then choose 16 days. In Mahalaya the count 16 carries more importance and 16 continous daily tarpana should be done without gap in between irrespective or any shoonya thithi or athithi coming in between. You need to keep a track of the count and not give a gap till 16 is done. 

*Q2. If I cannot do tarpana on all days continuously what should I do ?*

*Ans 2*. Do Shraddham on 1 day followed by tarpana. Doing shraddham on single day in Mahalaya is called Sakrun Mahalaya shraddham. "Sakrut" means once in Samskrit.

*Q3. If I am doing Sakrun Mahalaya shraddha and tarpana, are there any special days to do it?*

*Ans 3*. The day when Bharani Nakshtra falls, Vyateepata yogam falls, Ashtami thithi which called Madhyashtami and trayodashi are important days. Doing shraddham and tarpana on these days is equal to doing shraddham / tarpana in Gaya. 

*Q4. Can I instead of doing tarpana on all 15 or 16 days, can I select a few 2-3 important days and do tarpana only on those days ?*

*Ans 4.* There are only two types of tarpana options recommended in Mahalaya. It is either Sakrun Mahalaya shraddham by inviting brahmins at home followed by tarpana that day post shraddham just on this one day, or all 15 or 16 days continous tarpana with any one day shraddham also by calling brahmins to your house. You cannot do only tarpana on selected few days as per your wish.

*Q5. Is it compulsory to do Sakrun Mahalaya Shraddham on either father’s or mother’s death thithi?* 

*Ans 5.* Though Sakrun Mahalaya Shraddham on one day atleast, is compulsory during these 15 days which can be also death thithi of your either of your parents, but it is not compulsory to choose the parents death thithi. You can choose the auspicious kalams mentioned in Ans 3 for higher merits.

*Q6. If I finish Sakrun Mahalaya shraddham and tarpana on any one day then do I need to perform mahalaya tarpana again on Amavasya ?*

*Ans.6* Once you have done Sakrun Mahalaya shraddham and tarpana on one day then on Amavasya you need not do Mahalaya tarpana again. You need to only do Amavasya tarpana alone. But those doing tarpana each day for all 15 or 16 days you need to do Mahalaya tarpana as well in Amavasya. The order of performance is first finish Amavasaya tarpana then Mahalaya tarpana. 

*Q7. Are there any rules to be followed for Sakrun Mahalaya shraddha date decision?*

*Ans.7*  If you are going to perform Sakrun Mahalaya (single day) then you should not select a thithi between prathamai and Chaturthi, unless is coinciding with either of your parents death date or the auspicious days mentioned in Ans.3.  You should also not select Chaturdashi.

*Q8. Why I cannot select Chaturdashi ?*

*Ans.8*  Chaturdashi is only reserved for people who have died unnatural death like weapons, accident, suicide, poison etc.


*Q9. If my father or mother have died on let us say Panchami or shasti or any other thithi but they have died unnaturaly as described above in Ans.8 then when should I do mahalayam shraddham for them?*


*Ans.9*  You need to perform Mahalaya shraddham only on Chaturdashi for them and not on their death thithi mentioned in question. Chaturdashi is reserved for only such unnatural deaths and we need to do that day only irrespective of your parent death thithi.


*Q10. If I am doing this Chaturdashi unnatural death related Mahalaya shraddham is there something I need to keep in mind?*


*Ans.10*  Yes this shraddham will be done in Ekodishta vidhanam. It means this mahalayam will be only to the person deceased due to unnatural death and other ancestors above him / her and karunika pitrus will not come in it. For eg: his / her father, grandfather, mother etc. For the other dead ancestors described in the example above you should do mahalayam on any separate day.


*Q11. If I am doing tarpana for 15 or 16 days then is there any thithis to avoid ?*


*Ans11* All these special rules or avoiding certain days etc are applicable only for selecting the date of Hiranya shraddha inviting brahmins at home doing Hiranya shraddha and tarpana. For those doing only tarpana on all days will continue doing so for 15 or 16 days for the entire mahalaya. These rules are applicable only for Sakrun Mahalaya shraddham date.


*Q12. If I am doing Hiranya  shraddham how many brahmins should be invited during mahalayam?*


*Ans.13*  6 Brahmins in most ideal case.


These are

1. Vishwe Deva (This is the devata who brings the pitru along with them to earth)


2. Father’s side  (3 generations)


3. Mother’s side (3 generations)


4. Mother’s father & mother’s side (3+3 generations)


5. Karunika Pitrus (close relatives)


6. Maha Vishnu (Protector of Shraddha)


Currently most places only 5 people come as Mahavishnu is made optional and instead a Vishnu padam / Shaligramam is kept or koorcham is kept due to non-availability of brahmins during this period.


*Q13. Who are these Karunika pitrus ?*


*Ans.13*  These are deceased relatives of your father and mother side, like mama, father / mother’s brothers/sisters etc etc.   Mahalaya is the special time when you can do tarpana for them and satisfy them too and obtain their blessings.


*Q14. If my father is alive and mother is not alive then does mahalaya apply to me ?*


*Ans.14*  No. Only your father has performance rights.


*Q15. If my mother is alive and father is not alive then what should it do ?*


*Ans.15*  Within the 1st year of death of father Mahalaya or amavasya tarpana does not start. Only after completion of 1 full year of death, Mahalaya or amavasya tarpana will start and you can do it post 1st year. 


*Q16. If I miss performing Mahalaya Shraddham / tarpana due to some unavoidable reasons in these 15 days what should I do ?*


*Ans16*. Shastras give an alternative period for doing Mahalaya Shraddham for people who due to unavoidable reasons miss the shraddham and tarpana. This is the next Krishna paksham in the following month, that is Aipasi month in Tamil, Ashvina or Tula month as per lunar and solar calendar respectively. 


16 key questions answered on Mahalayam for public awareness and correct understanding of this great ritual. At *Veda Ghosham* we actively train people on such important Vedic Dharma and Nityakarma as prescribed by our ancient Rishis in Sutras, with minute details of do’s and don’ts during our daily Nitya *karma-anushtanas with indepth meaning and tattva.*

Courtesy: dharmashastram

పితృతర్పణం

 Stotra Nidhi

ముఖ్యగమనిక: తండ్రి బ్రతికి ఉంటే పితృతర్పణము చేయరాదు.


కావలసిన సామాన్లు –

* దర్భలు

* నల్లనువ్వులు

* తడిపిన తెల్ల బియ్యం

* చెంబులో మంచినీరు (అర్ఘ్య పాత్ర)

* పంచపాత్ర (ఆచమన పాత్ర, ఉద్ధరిణి, అరివేణం)

* తర్పణం విడవడానికి పళ్ళెం

* చిటికెడు గంధం

* కూర్చోవడానికి ఆసనం


యజ్ఞోపవీతం ధరించు విధానములు

* సవ్యం – మామూలుగా ఎడమ భుజం మీదుగా కుడి నడుముకు వచ్చేది.

* నివీతీ – దండలాగా మెడలో నుండి పొట్ట మీదకు వేసుకునేది.

* ప్రాచీనావీతీ – కుడి భుజం మీదుగా ఎడమ నడుముకు వచ్చేది.


———-


శివాయ గురవే నమః |


శుచిః –

(తలమీద నీళ్ళను జల్లుకోండి)

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా

యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||

పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష ||


ప్రార్థనా –

(నమస్కారం చేస్తూ ఇవి చదవండి)

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ |

నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః |


ఆచమ్య –

(ఆచమనం చేయండి)

ఓం కేశవాయ స్వాహా |

ఓం నారాయణాయ స్వాహా |

ఓం మాధవాయ స్వాహా |

ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః |

ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః |

ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః |

ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః |

ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః |

ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః |

ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః |

ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః |

ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః |

ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః |

ఓం శ్రీ కృష్ణాయ నమః |


పవిత్రం –

ఓం పవిత్రవన్తః పరివాజమాసతే పితైషాం ప్రత్నో అభి రక్షతి వ్రతమ్ |

మహస్సముద్రం వరుణస్తిరో దధే ధీరా ఇచ్ఛేకుర్ధరుణేష్వారభమ్ ||



పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే ప్రభుర్గాత్రాణి పర్యేషి విశ్వతః |

అతప్తతనూర్న తదామో అశ్నుతే శృతాస ఇద్వహన్తస్తత్సమాశత ||

పవిత్రం ధృత్వా ||

(పవిత్రం ధరించండి)


భూతోచ్ఛాటనం –

ఉత్తిష్ఠన్తు భూతపిశాచాః ఏతే భూమిభారకాః |

ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||

(అక్షతలు మీ వెనక్కు వేయండి)


ప్రాణాయామం –

ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః |

ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |

తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |

ధియో యో నః ప్రచోదయాత్ |

ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |

(మూడు సార్లు అనులోమ-విలోమ ప్రాణాయామం చేయండి)


సంకల్పం –

(అక్షతలు చేతిలో పట్టుకోండి)

శ్రీ గోవింద గోవింద గోవింద | శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య _ ప్రదేశే _, _ నద్యోః మధ్యే పుణ్యప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ __ నామ సంవత్సరే _ అయనే _ ఋతౌ _ మాసే _ పక్షే _ తిథౌ _ వాసరే శ్రీవిష్ణు నక్షత్రే శ్రీవిష్ణు యోగే శ్రీవిష్ణు కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథౌ || ప్రాచీనావీతీ || అస్మత్ పితౄనుద్దిశ్య అస్మత్ పితౄణాం పుణ్యలోకావాప్త్యర్థం పితృ తర్పణం కరిష్యే || సవ్యం ||


(నీరు తీసుకుని అక్షింతలు అరివేణం లో విడవండి)


నమస్కారం –

(నమస్కారం చేయండి)

ఈశానః పితృరూపేణ మహాదేవో మహేశ్వరః |

ప్రీయతాం భగవానీశః పరమాత్మా సదాశివః || ౧

దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ |

నమస్స్వాహాయై స్వధాయై నిత్యమేవ నమో నమః || ౨

మన్త్రమధ్యే క్రియామధ్యే విష్ణోస్స్మరణ పూర్వకం |

యత్కించిత్క్రియతే కర్మ తత్కోటి గుణితం భవేత్ || ౩

విష్ణుర్విష్ణుర్విష్ణుః ||


(దక్షిణం వైపు తిరగి కూర్చోండి)


అర్ఘ్యపాత్ర –

అర్ఘ్యపాత్రయోః అమీగంధాః |

(అర్ఘ్యపాత్రలో గంధం వేయండి)


పుష్పార్థా ఇమే అక్షతాః |

(అర్ఘ్యపాత్రలో అక్షతలు వేయండి)


అమీ కుశాః |

(అర్ఘ్యపాత్రలో ఒక దర్భ వేయండి)


|| సవ్యం || నమస్కృత్య |

ఓం ఆయంతు నః పితరస్సోమ్యాసోగ్నిష్వాత్తాః పథిభిర్దేవ యానైః |

అస్మిన్ యజ్ఞే స్వధయా మదం త్వధి బృవంతు తే అవంత్వ స్మాన్ ||

ఇదం పితృభ్యో నమో అస్త్వద్య యే పూర్వాసో య ఉపరాస ఈయుః |

యే పార్థివే రజస్యా నిషత్తా యే వా నూనం సువృజనాసు విక్షు ||

పితృదేవతాభ్యో నమః |


ఓం ఆగచ్ఛంతు మే పితర ఇమం గృహ్ణంతు జలాంజలిమ్ |

(పళ్ళెంలో ఒక దర్భ పెట్టండి)


|| ప్రాచీనావీతీ ||

సకలోపచారార్థే తిలాన్ సమర్పయామి |

(నల్లనువ్వులు పళ్ళెంలోని దర్భ మీద వేయండి)


పిత్రాది తర్పణం |

(కుడి బొటన వేలికి నల్లనువ్వులు అద్దుకుని పితృతీర్థముగా మూడేసిసార్లు నీరు విడవండి.

* బ్రాహ్మణులకు – శర్మాణం, క్షత్రియులకు – వర్మాణం, వైశ్యులకు – గుప్తం )

(** గతించిన వారికి మాత్రమే చేయండి. సజీవులకు చేయవద్దు.)


|| ప్రాచీనావీతీ ||

[తండ్రిగారు]

అస్మత్ పితరం _(గోత్రం)_ గోత్రం _(మనిషి పేరు)_ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[తండ్రియొక్క తండ్రిగారు]

అస్మత్ పితామహం _ గోత్రం _ శర్మాణం* రుద్రరూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[తండ్రియొక్క తండ్రిగారి తండ్రిగారు]

అస్మత్ ప్రపితామహం _ గోత్రం _ శర్మాణం* ఆదిత్యరూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |


[తల్లిగారు]

అస్మత్ మాతరం _ గోత్రాం _ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[తండ్రియొక్క తల్లిగారు]

అస్మత్ పితామహీం _ గోత్రాం _ దాం రుద్రరూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[తండ్రియొక్క తండ్రిగారి తల్లిగారు]

అస్మత్ ప్రపితామహీం _ గోత్రాం _ దాం ఆదిత్యరూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |


[తండ్రియొక్క మారు భార్య (సవతితల్లి)]

(* సవతితల్లి ఉండి గతించినట్లైతేనే ఇది చేయండి)

అస్మత్ సాపత్నీమాతరం _ గోత్రాం _ దాం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |


[తల్లియొక్క తండ్రిగారు]

అస్మత్ మాతామహం _ గోత్రం _ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[తల్లియొక్క తండ్రిగారి తండ్రిగారు]

అస్మత్ మాతుః పితామహం _ గోత్రం _ శర్మాణం* రుద్రరూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[తల్లియొక్క తండ్రిగారి తండ్రిగారికి తండ్రిగారు]

అస్మత్ మాతుః ప్రపితామహం _ గోత్రం _ శర్మాణం* ఆదిత్యరూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |


[తల్లియొక్క తల్లిగారు]

అస్మత్ మాతామహీం _ గోత్రాం _ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[తల్లియొక్క తల్లిగారి అత్తగారు (తల్లిగారి నాయనమ్మ)]

అస్మత్ మాతుః పితామహీం _ గోత్రాం _ దాం రుద్రరూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[తల్లియొక్క తల్లిగారి అత్తగారి అత్తగారు (తల్లిగారి తాతమ్మ)]

అస్మత్ మాతుః ప్రపితామహీం _ గోత్రాం _ దాం ఆదిత్యరూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |


(** ఈ క్రింది తర్పణలు వివాహం జరిగినవాళ్ళు మాత్రమే గతించినవారికి మాత్రమే ఇవ్వవలెను. సజీవులకు ఇవ్వరాదు.)


[భార్య]

అస్మత్ ఆత్మపత్నీం _ గోత్రాం _ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[కుమారుడు]

అస్మత్ సుతం _ గోత్రం _ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[సోదరుడు]

అస్మత్ భ్రాతరం _ గోత్రం _ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[పెదతండ్రి(జ్యేష్ఠ)/పినతండ్రి(కనిష్ఠ)]

అస్మత్ జ్యేష్ఠ/కనిష్ఠ పితృవ్యం _ గోత్రం _ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[మేనమామ]

అస్మత్ మాతులం _ గోత్రం _ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[కూతురు]

అస్మత్ దుహితరం _ గోత్రాం _ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[తోబుట్టువు]

అస్మత్ భగినీం _ గోత్రాం _ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[కూతురి కోడుకు (మనుమడు)]

అస్మత్ దౌహిత్రం _ గోత్రం _ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[మేనల్లుడు]

అస్మత్ భగినేయకం _ గోత్రం _ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[మేనత్త]

అస్మత్ పితృష్వసారం _ గోత్రాం _ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[పెదతల్లి(జ్యేష్ఠ)/పినతల్లి(కనిష్ఠ)]

అస్మత్ జ్యేష్ఠ/కనిష్ఠ మాతృష్వసారం _ గోత్రాం _ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[అల్లుడు]

అస్మత్ జామాతరం _ గోత్రం _ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[తోబుట్టువు భర్త]

అస్మత్ భావుకం _ గోత్రం _ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[కోడలు]

అస్మత్ స్నుషాం _ గోత్రం _ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[భార్యయొక్క తండ్రిగారు]

అస్మత్ శ్వశురం _ గోత్రం _ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[భార్యయొక్క తల్లిగారు]

అస్మత్ శ్వశ్రూం _ గోత్రాం _ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[బావమరుదులు]

అస్మత్ స్యాలకం _ గోత్రం _ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |


[ఆచార్యుడు]

అస్మత్ స్వామినం/ఆచార్యం _ గోత్రం _ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[బ్రహ్మోపదేశం చేసిన గురువుగారు]

అస్మత్ గురుం _ గోత్రం _ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[తర్పణ కోరినవారు]

అస్మత్ రిక్థినం _ గోత్రం _ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |


పితృదేవతాభ్యో నమః |

సుప్రీతో భవతు |


కుశోదకం –

|| ప్రాచీనావీతీ ||

ఏషాన్నమాతా న పితా న బన్ధుః నాన్య గోత్రిణః |

తే సర్వే తృప్తిమాయాన్తు మయోత్సృష్టైః కుశోదకైః ||

తృప్యత తృప్యత తృప్యత తృప్యత తృప్యత |

(కొన్ని నువ్వులు, పళ్ళెం లోని దర్భ చేతిలోకి తీసుకుని చెంబులోని నీరు పితృతీర్థంగా పళ్ళెంలో విడవండి. దర్భ కూడా విడిచిపెట్టి చేతికి నువ్వులు లేకుండా శుభ్రం చేసుకోండి).


నిష్పీడనోదకం –

|| నివీతీ ||

యేకే చాస్మత్కులేజాతాః అపుత్రాః గోత్రిణో మృతాః |

తే గృహ్ణన్తు మయా దత్తం వస్త్రనిష్పీడనోదకమ్ |

(జంధ్యము దండలావేసుకొని బ్రహ్మముడులమీద నీరుపోసి తడిపి పిండి కళ్ళకు అద్దుకోండి)


సమర్పణం –

|| సవ్యం ||

కాయేన వాచా మనసైన్ద్రియైర్వా

బుద్ధ్యాత్మనా వా ప్రకృతేస్స్వభావాత్ |

కరోమి యద్యత్సకలం పరస్మై

నారాయణాయేతి సమర్పయామి ||


నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |

జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||


పవిత్రం విసృజ్య |


ఓం శాంతిః శాంతిః శాంతిః |


ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు |

Monday, October 4, 2021

తర్పణము ఎన్నిరకాలు ?

ఎన్ని రకముల తర్పణాలు ఉన్నాయో తెలుసుకుందామా....

"తృప్తినిచ్చే అర్పణం తర్పణం ".....అంటారు.

1. తర్పణం అంటే ఏమిటి ?

పితృదేవతలకు తృప్తినిచ్చి, వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేయడమే తర్పణం. విధి విధానాలను బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణం పలురకాలు.

2. తర్పణము ఎన్నిరకాలు ?

తర్పణము రెండు విధములుగా చేయ వచ్చును అవి సకామ లేక నిష్కామములు. సకామ తర్పణములో కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణము చేస్తారు. నిష్కామ తర్పణము జలముతో చేయబడుతుంది. ఋగ్వేదులు, యజుర్వేదులు, సామ, అధర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు.

ప్రధానంగా తర్పణాలు నాలుగు రకాలు.

1-గరుడ తర్పణం : -

ఎవరైనా పరమపదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు.

2-బ్రహ్మ యజ్ఞ తర్పణం : -

నిత్యానుష్టానం లో భాగంగా విడిచే తర్పణాలు ఇవి.

3-పర్హెణి తర్పణం : -

యేటా చేసే పితృకర్మల తరువాతిరోజు ఇచ్చే తర్పణాలు.

4-సాధారణ తర్పణం : -

అమావాస్య రోజున, పుణ్యనదీ స్నానాలలో, పుష్కరాలలో, సంక్రమణ, గ్రహణ సమయాలలో విడిచే తర్పణాలు.

మన ఋషులు ఇటువంటి తర్పణాలను 96 పేర్కొన్నారు.

5. తర్పణాలు ఎందుకు వదులుతాము ?

తర్పణము చేయడము వలన దేవతలు శీఘ్రముగా సంతుష్టులౌతారు. లేదా వారిని సంతృప్తి పరచే విధిని తర్పణము అని అందురు. దేవతలను ప్రసన్నము చేసుకోనబడుటకు, వారిని ప్రీతీ చేయుట కొరకు ఈ తర్పణము వదల బడుతుంది.


4. ఏ తర్పణానికి ఎటువంటి ఫలితం ఉంటుంది ?

1. తేనె ద్వార తర్పణము చేయడము వలన అన్ని కోరికలు నెర వేరుతాయి, అన్ని పాతకములు నాశనము అవుతాయి.


2. కర్పూర జలముతో తర్పణము చేస్తే, రాజు వశ మౌతాడు .


3. పసుపు కలిపిన జలముతో తర్పణము చేస్తే, సామాన్య వ్యక్తి వశమౌతాడు.


4. ఆవు నేతితో తర్పణము చేస్తే, …….సుఖము


5. కొబ్బరి నీళ్ళతో తర్పణము చేస్తే, ……. సర్వ సిద్ధి


6. మిరియాలు కలిపిన జలముతో తర్పణము చేస్తే …….. శత్రు నాశనము


5. తర్పణం ఎలా వదలాలి ?

కల్పోక్త ప్రకారముగా సాధకుడు, స్నాన, పూజా, హోమ సమయము లందు ప్రతి రోజు దేవతల ప్రీతి కొరకు తర్పణము గావించవలయును. దేవతలకు వారి నామ మంత్రములు ఉచ్చరించుచు, దేవ తీర్ధము ద్వారా తర్పణము చేయ వలెను. వారి నామములకు “స్వాహా” చేర్చి తర్పణము లీయవలెను.

(అగ్ని పురాణము, బ్రహ్మ పురాణము, మంత్ర మహోదధి నుంచి సేకరించ బడినది)

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?

మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

పితృదేవతలకు.... ఆకలా...?

అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః

యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః

అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.

మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి , తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి , శుక్ల కణముగా రూపొంది , స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి , శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.

మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే...

పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..

తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?

అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ , ఆత్మహత్యల ద్వారాకానీ , ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు , వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో , పిండప్రదానం ఇచ్చే అర్హత , అధికారం ఉంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి , తద్దినం , పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?

సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.

క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.

భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి సత్కరించి పంపాలి.

చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.

ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.

గాయత్రి మంత్రం

పూర్వజన్మ సుకృతం…గాయత్రి మంత్రం పఠనము..

చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు.

కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల  ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి ‘హమ్మయ్య  ఈ రోజుకి చదివేసాను!’  అనుకుంటారు.

నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.

గాయత్రీ మంత్రము అంటే…

ఓం  భూర్భువస్సువః  తత్ సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్

ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రాన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. 

అది ఎలాగంటే…

ఓం

భూర్భువస్సువః

తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్

ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.

ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.

గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.

1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు.  ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.

 2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది.                         ఆ రధానికి   గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.

3. పురాణ కధనం ప్రకారం 24గురు ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. అశోకుని ధర్మచక్రం లో వున్న 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.

4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే.

5. 24 కేశవ నామాలు

6. 24 తత్వాలు : ఐదు జ్ఞానేన్ద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు,                                    5 మహాద్భూతాలు, బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు.

7. ఛందస్సులలో  ఒకానొక  గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు :   “బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”

8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.

9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది.     కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు.

10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.

11. మన వెన్నుబాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage ) వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.

*”న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతా: పర దైవతం” అన్నారు పెద్దలు . * 

*24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు. సకల దేవతా స్వరూపం గాయత్రీ. రామాయణ సారం గాయత్రీ . కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ .. సకల కోర్కెలు ఈడేర్చే మహా మంత్రం గాయత్రీ .. 24 బీజాక్షర సంపుటి గాయత్రీ.. *

గాయత్రీ మంత్రం అత్యంత శక్తివంతమైన , మహిమాన్వితమైనది, సద్బుద్ధిని ఇస్తుంది. బుద్ది మనకు సంపదలను ప్రసాదిస్తుంది. ఆపదలను దూరం చేస్తుంది. గొప్ప పేరు ప్రతిష్టలను ఇస్తుంది. మనలోని చెడు శక్తులను పోగొట్టి తేజస్సును ఇస్తుంది. సంస్కారాన్ని ఇస్తుంది దాని ద్వారా ఉన్నతమైన ఆలోచనలతో ఇతరులను తరింపజేస్తుంది. గాయత్రీ కామధేనువు. ఎవరైతే గాయత్రీదేవి మంత్రాన్ని శ్రద్ధగా జపం చేస్తూ ఉంటారో ఆ సాధకునికి కామధేనువు తన వద్ద ఉన్నట్లే..

అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి

Thursday, September 23, 2021

ఉపవాసం!

ఉపవాసం అనగా ఏమి తినకుండా కేవలం మంచినీరు తాగి ఉండటమే ఉపవాసం. 

దీర్ఘ ఉపవాసం చేయువారు రసాహారము తీసికొనవలెను. కొందరు దేవునికి ఒకపొద్దు ఉంటున్నాం అని ఆ తరువాత అరడజను అరటిపళ్ళు, 10 ఇడ్లిలు, అరకిలో ఉప్మా లాగించేస్తారు. అన్నం మాత్రం తినరు. బహుశా వారి దృష్టిలో ఇదో రకం ఉపవాసం కావొచ్చు. కాని అలా చేయడం ఉపవాసం అనిపించుకోదు.

ఉపవాసం చేయడం వలన ముఖ్య ఉపయోగం: శరీరంలోని మాలిన్యాలను బహిష్కరింపచేసి వ్యాధి నిర్మూలనం అవుతుంది. పొట్ట, కన్ను, వ్రణములు, జ్వరములు, జలుబు మొదలగు వ్యాదులను కనీసం 5 రోజులపాటు ఉపవాసం చేసి వ్యాధి తగ్గించుకోవచ్చు. 

ఏ వ్యాధిలోనైనా ఉపవాసం చేయుట వలన వ్యాధి తొందరగా తగ్గించుకోవచ్చు. లేనిచో ఒకపూట ఉపవాసం ఉండి తరువాత ఆ వ్యాధికి సంబంధించిన పథ్యకరమైన ఆహారం తీసుకోవచ్చు.

ఉపవాసంలో 4రకాలు ఉన్నాయి:

           1 - నిర్జలోపవాసం.

           2 - జలోపవాసం.

           3 - రసోపవాసం.

           4 - ఫలోపవాసం.


1. నిర్జలోపవాసం:

మంచినీరు కూడా ముట్టకుండా చేయు ఉపవాసమును ‘నిర్జలోపవాసం’ అంటారు. ఈ ఉపవాసం ముఖ్యంగా శరీరంలో నీరు ఎక్కువ చేరినప్పుడు అనగా శరీరం వాచినప్పుడు రెండు లేదా మూడు దినములు ఈ ఉపవాసం చేయవలెను.  మూడురోజులకు మించి ఈ ఉపవాసం చేయరాదు.

2. జలోపవాసం:

కేవలం మంచినీరు మాత్రమే తాగి చేయు ఉపవాసమును ‘జలోపవాసం’ అందురు. దీనిని మూడురోజుల నుంచి ఏడు రోజుల వరకు మాత్రమే చేయవలెను. అంతకు మించి చేయరాదు. శరీరంలో మాలిన్యాలు అధికంగా చేరి ఏ రసాహారమును కూడా జీర్ణం చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం మంచినీరు తాగించి ఉపవాసం చేయించవలెను. అనగా సుమారు రెండులీటర్లు మంచినీరు త్రాగించవలెను.

3. రసోపవాసం:

ఈ రసోపవాసమును సాధారణంగా ప్రకృతిచికిత్సాలయాల్లో రసోపవాసం చేయిస్తారు. కేవలం పండ్లరసాలతో చేయు ఉపవాసమును ‘రసోపవాసం’ అంటారు. ఈ ఉపవాసం వారం రోజులు మొదలుకుని నెలరోజులు వరకు కూడా చేయవచ్చు. రసోపవాసంలో ముఖ్యంగా నిమ్మరసం, పలుచని నారింజరసం, బత్తాయిరసం, కమలారసం, తేనెనీరు, కొబ్బరినీరు, బార్లినీరు మొదలగునవి రోజుకు మూడుసార్లు నుండి అయిదుసార్లు లోపలికి తీసుకోవచ్చు.

 4. ఫలోపవాసం:

ఉపవాసం చేయలేనివారు ఫలోపవాసం చేయవచ్చు. కేవలం రసము నిండిన ఫలములు మాత్రమే ఆహారంగా తీసికొనవలెను. అరటిపండు తీసుకోకూడదు. ఎక్కువ బత్తాయి, నారింజ, కమలా, ద్రాక్షా, అనాస, దానిమ్మ, మామిడి, పుచ్ఛ మొదలగు పండ్లు తినవచ్చు .

ఈ ఉపవాసం రోగిని అనుసరించి పది నుంచి నలుబది రోజుల వరకు అనుసరించవచ్చు.

ఉపవాసం చేయుట వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు*

జీర్ణక్రియకు మంచి విశ్రాంతి లభించి అజీర్ణం తొలగిపోయి ఆకలివృద్ధి అగును.*

మలాశయంలో మురికి బహిష్కరింపబడి అజీర్ణం తొలగించబడి క్రిములను, బాక్టీరీయా నాశనం చేయబడును.*

మూత్రపిండాలలోని విషపదార్ధాలు, రాళ్లు బహిష్కరింపబడును.*

ఊపిరితిత్తులలోని నంజు, నీరు బహిష్కరించబడి ఆయాసం నివారించబడును. శ్వాసక్రియ చక్కగా జరుగును.*

గుండెచుట్టు, లోపల చేరిన కొవ్వు, నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును. గుండెజబ్బులలో రసోపవాసం మంచిది.*

లివర్ మరియు స్ప్లీన్ ఆహారం జీర్ణం అగుటకు ఇవి చక్కగా పనిచేయాలి. ఈ ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలోని మాలిన్యం తొలగించబడి జీర్ణక్రియ వృద్ది అగును.*

శరీరంలో రక్తప్రసారం చురుకుగా ఉండును. ఉపవాసం చేయుట వలన రక్తదోషములు నివారించబడును. తిమ్మిర్లు, మంటలు , నొప్పులు కూడా తగ్గును.*

కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు, నీరు, మాంసము వంటి మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును.*

నాడీమండలం శుభ్రపరచబడును.*

జ్ఞానేంద్రియాలలో మాలిన్యాలు అన్ని పోవును.* 

చర్మం కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కటిరంగు వచ్చును.*

మనస్సు ప్రశాంతంగా ఉండి కోపం వంటివి మన అదుపులో ఉండగలవు.*

ఉపవాసం చేయకూడని వారు:*

చాలా బలహీనంగా ఉన్నవారు, గుండెజబ్బులు కలవారు, బాలురకు, వృద్దులకు గర్భిణీస్త్రీలకు, బాలింతలకు, క్షయ మరియు రక్తహీనత కలిగిన రోగులు, మధుమేహంతో ఉన్నవారికి ఎక్కువ రోజులు ఉపవాసం చేయకూడదు.*

 ఉపవాసం చేయదగిన వారు:*

స్థూలకాయులు, ఉబ్బసం, సంధివాతం, రక్తపుపోటు, చర్మవ్యాధులు మొదలగు దీర్ఘకాలిక రోగులకు ఉపవాసం చేయుట మంచిది.

**ఉపవాసం ముగించిన వెంటనే ఘనాహారం తీసుకోకూడదు. ఉపవాసం తరువాత ఎక్కువ ఆహారం తీసుకొకూడదు. క్రమేపి ఆహారాన్ని పెంచుకుంటూ రావలెను. కారం, మసాలా పదార్దాలు, పిండివంటలు పచ్చళ్ళు తినకూడదు. అలా తీసుకున్నచో విరేచనాలు, వాంతులు, కడుపులో మంట, నొప్పి కలుగుతాయి

Wednesday, September 22, 2021

గుమ్మానికి మరియు వాహనాలకు నిమ్మకాయలు & మిరపకాయలు ఎందుకు కడతారో తెలుసా?

 భారతదేశం అంటేనే సంప్రదాయాలకు పెట్టింది పేరు. మన భారతదేశంలో మనం ఎన్నో ఆచారాలను పాటిస్తాం. కొన్ని ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయితే, కొన్ని మాత్రం భారతదేశ వ్యాప్తంగా పాటిస్తాం. అయితే అలా ఎక్కువగా పాటించే ఆచారాల్లో గుమ్మానికి నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి వేలాడదీయడం ఒకటి, మరొకటి వాహనాలకు కట్టడం.

ఆధ్యాత్మిక పరంగా, శాస్త్రపరంగా ఇది ఎందుకు అవసరమో రెండూ తెలుసుకుందాం.

నిమ్మక్కాయలు & మిరపకాయలు ఇంటి గుమ్మానికి కట్టడం వలన ఏమవుతుందంటే...

 


సిరిసంపదలకు అధిదేవత లక్ష్మీదేవి. హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది. అయితే లక్ష్మీదేవికి ఓ అక్క కూడా ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటారు. అది ఉండాలి కూడా.  అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం. ఆమె పేరు అలక్ష్మీ. పాల సముద్రాన్ని మథించినప్పుడు కల్పవృక్షం, ఇంద్రుడి వాహనం ఐరావతం, లక్ష్మీదేవి, హలాహలం, చివరిగా అమృత కలశంతో ధన్వంతరి అవతరించారు. పాల సముద్రం నుంచి పుట్టిన లక్ష్మీని తాను వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు. అయితే తన సోదరి వివాహం జరిగిన తర్వాతే వివాహం చేసుకుంటానని లక్ష్మీదేవి తెలిపింది. దీంతో అలక్ష్మీకి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెదికినా ప్రయోజనం ఉండదు. ఆమెను పెళ్లాడటానికి ఎవరూ అంగీకరించరు.


చివరికి ఉద్దాలక మహర్షి ఆమెను వివాహం చేసుకోడానికి ఒప్పకుంటాడు. కల్యాణం తర్వాత ఉద్దాలక మహర్షితో కలిసి అలక్ష్మీ ఆశ్రమానికి చేరుకున్న తర్వాత ఆశ్రమలోపలికి ప్రవేశించడానికి నిరాకరిస్తుంది. దీనికి కారణం ఏంటని ముని అడుగుతాడు. దీనికి అలక్ష్మీ ఇచ్చిన సమాధానం ఏమిటంటే...


లక్ష్మీకి సోదరి అయిన అలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తే...


నిరంతరం కలహాలతో కొట్టుకునే వాళ్లు, పరిశుభ్రత లేనివారు, మతాచారాలకు విరుద్ధంగా ప్రవర్తించేవారి ఇళ్లలో మాత్రమే తాను ప్రవేశిస్తానని తెలిపింది. సూర్యోదయానికి ముందే మేల్కొని, పరిశుభ్రంగా ఉంటూ దైవారాధన చేసేవారి ఇంటిలోకి తనకు ప్రవేశం లేదని అలక్ష్మీ పేర్కొంది. అలాంటి ఇంటిలోనే లక్ష్మీ కొలువుంటుంది.


అలక్ష్మీకి వేడి, పుల్లని పదార్థాలంటే ప్రీతి. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీస్తారు. ఇలా చేయడం వల్ల అలక్ష్మీ మన ఇంటిలోకి ప్రవేశించాలనుకున్నా తనకు ఇష్టమైన ఆహారాన్ని చూసి ఆగిపోతుంది. అలక్ష్మీ ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మీని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు.


ఇక శాస్త్రపరంగా గమనిస్తే


నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయడానికి వెనకాల ఒక సైన్స్ కి సంబంధించిన కారణం ఉంది.


పూర్వం దాదాపుగా అందరూ మట్టి ఇళ్ళలోనే ఉండేవారు. దాంతో పురుగులు, దోమలు వంటివి ఇళ్లల్లోకి ఎక్కువగా వచ్చేవి. అప్పుడు ఇప్పుడు ఉన్నట్టు మస్కిటో కాయిల్స్ లాంటి కెమికల్ పదార్థాలు లేవు. నిమ్మకాయ, మిరపకాయల్లో విటమిన్ సి ఉంటుంది. మిరపకాయలో అయితే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మనం నిమ్మకాయని దారానికి గుచ్చినప్పుడు ఆ దారానికి అంటుకొని ఆ ప్రదేశం మొత్తం వ్యాపిస్తుంది. దాంతో దోమలు, ఈగలు లేదా ఇతర కీటకాలు అక్కడికి రాకుండా ఉంటాయి. ఈ కారణంగానే పూర్వంలో నిమ్మకాయ, పచ్చి మిరపకాయలు దారానికి కలిపి కట్టేవారు. ఇదే పద్ధతిని మనం తరతరాల నుండి ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్నాం.


ఇక వాహనాల విషయానికి వస్తే జ్యోతిష్య శాస్త్రపరంగా గమనిస్తే విషయ అవగాహనమవుతుంది

 

సాధారణంగా హనుమంతుని ఆలయంలో వాహన పూజలు జరిపిస్తుంటారు. దేవుళ్లకు నివేదించిన నిమ్మకాయలను వాహనాలకు కడుతుంటారు. అంతే కాకుండా దిష్టి తీసి వాహన చక్రాలతో తొక్కిస్తారు. ఇలా చేస్తే మేలు జరుగుతుందని ఆశిస్తారు. పులుపుగా ఉండే నిమ్మకాయ, కారం నిండి ఉండే పచ్చిమిర్చిలను వాహనాలకు, దుకాణాల మధ్య వేలాడదీస్తారు. 

 

గ్రహాలలో ఎర్రని, ఉద్రత్వం కలిగినది కుజగ్రహం. కుజుడు ప్రమాద కారకుడని శాస్త్రం నమ్మకం. కుజునికి ఆదిదేవుడు హనుమంతుడు. అలానే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. కారం విగ్రహానికి సంబంధించినది. అధికారానికి రవి కారకుడు. వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుకుంటూ వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయాలు కడతారు.

Friday, September 17, 2021

చనిపోయిన వ్యక్తికి తద్దినం ఎందుకు?

ఈ విషయం తెలుసుకునే ముందు కాలం గురుంచి తెలుసుకుంటే మనకు చక్కగా అర్థం అవుతుంది, మరి ప్రారంభిద్దామా...


మహాభారతంలో ఒక కధ ఉంది... 

కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి రేవతి అనే అందమైన కూతు రు ఉండేది.  అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.


ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.


దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ...


ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం...


ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రం లో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు. కూతురంటే అతనికి ప్రాణం. 


ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు. తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో.  అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.


అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా.  వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు.   అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం.  నాలుగవ డైమెన్షన్ కాలం.


అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట. అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట.  అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు.  అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.


ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.


ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు.  అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు.  ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో  సమానం.


పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కధగానే తీసుకుంటాం. కాని ఆ కధలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే  "సమయ విస్ఫారణం"(Time dilation), "కృష్ణ బిలం (Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది.


అందుకే స్వామీ వివేకానంద అన్నారు.. "సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.


ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం.  పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం.  కాని, స్వర్గం ఉండేది భూమిపై కాదు.   మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది.  నాక్కుడా వచ్చింది.


పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి.  హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట. అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది.


మన హిందూ సనాతన ధర్మము ప్రకారం, మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు.  ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు.  ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు.


ఎందుకో తెలుసా, చనిపోయిన 11 – 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు.  అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం.  ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరు కోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం.  ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం.  అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజు కొకసారి పెట్టినట్టు.  ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు.  అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం.


ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి.  ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం.


ఇట్లానే.. బ్రహ్మ దేవుఁడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు.


ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు మానవాళికి ఉపయోగపడేవి ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం, మన సంస్కృతిని తక్కువగా అంచనా వేస్తూ పరమత ఆచారాలు, సంస్కృతిని గొప్పగా భావిస్తూ అవే జీవితానికి ఒక అర్థం చూపించగలవని నమ్ముతూ పరిగెడుతున్నారు...మన సంస్కృతి లోతుపాతుల్లోకి వెళితే ఇంక మరి జన్మ అవసరం లేని స్థితికి చేరుకుంటాం...మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఆ భవిష్యత్తు భావితరాలకు ఆదర్శమార్గం అవ్వాలని ఆశిస్తున్నాను మిత్రులారా 


కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి.  కనీసం చదువుకున్న వాళ్లకు అర్థం అవుతుంది.


|| ఓం నమః శివాయ ||

Thursday, September 16, 2021

ప్రమధ గణాలు

 ఆదిదేవుని ప్రమధ గణాలు ఎవరు!!

ప్రమథ గణాలు మొదట శివుని నుండి ఉద్భవించిన వారు. కేవలం శివుని మాత్రమే కొలిచే వారు. తదుపరి ఎంతో మంది శివ భక్తులు ప్రమథులలో చేరారు.

'ప్రమథ' అంటే బాగా మథించ గలిగె వారని అర్థం. వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి గలవారు. దేవతలను కూడా శిక్షించ గలవారు. వీరంటే దేవతలకు భయము, మరియు భక్తి. దేవతలు తప్పు ద్రోవ పడితే వారిని నిగ్రహించే వారు ప్రమథులు. వీరు విశ్వమంతా వ్యాపించే నిగ్రహ శక్తులై సంచరిస్తాడు.

రుద్ర సూక్తం లోని ఏకాదశ అనువాకంలో

సహస్రాణి సహస్రశో యే రుద్రా అది భూమ్యాం ..

అంటే వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు. కోట్లకొలది గణాలు ఉంటారు. మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్ర గణాలుగా ఉండి పోతారని ప్రతీతి.

అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులు:

వీరభద్రుడు: దక్షయజ్ఞంలో శివాపచారం చేసిన దక్షుణ్ణి, విష్ణ్వాది దేవతలను శిక్షించిన శివ జటోధ్భవుడు. తిరుగు లేని పరాక్రమవంతుడు. సాక్షాత్ శివస్వరుపంగా పోగడబడే వాడు. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి.

ఆది వృషభం: ధర్మదేవత. శివున్ని మోయ గలిగె వరం పొంది, అతని సమీపంలో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి. విష్ణు బ్రహ్మాదుల సృష్టికి పూర్వమే శివుడు ద్వితీయ శంభునిగా ధర్మ దేవతను వృషభ రూపంలో సృష్టిస్తాడు.


నందీశ్వరుడు: శిలాదుని పుత్రుడు. అది వృషభం యొక్క అవతారం. శివునికి రక్షగా, ఆంతరంగికునిగా ఉండే గణ మూర్తి. కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితే గానీ శివదర్శనం లభించదు.


భృంగి: శివుని యొక్క పరమ భక్తుడు. భ్రమరము లాగా శివుని చుట్టూ ప్రదక్షణం చేయడం పనిగా ఉన్న వాడు కాబట్టి భృంగి అని పిలవబడ్డాడు. కేవలం శివున్ని ఆరాధిస్తూ పార్వతీ దేవిని విస్మరించి శాపగస్తుడై తల్లి వల్ల వచ్చే రక్త, మాంసములను కోల్పోయి పడిపోతే శివుడు మూడవ కాలు ప్రసాదించాడు. stability కోసం.. tripod లాగా.


స్కందుడు: కుమారస్వామి శివకుమారుడు. దేవసేనాధిపతి. బ్రహ్మజ్ఞాని.


పై ఐదుగురు వీరమహేశ్వర గురువులు. వారి గోత్ర పురుషులు. నేటికీ వీరశైవులు ఈ గోత్రములతో ఉన్నారు.


రేణుక, దారుక, ఘంటకర్ణ, విశ్వకర్ణ, ధేనుకర్ణ: శివుని పంచముఖాల నుండి ఉద్భవించిన గణశ్రేష్ఠులు. భూమిపైకి అయోనిజులై లింగమునుంది వచ్చి పంచ మఠములను స్థాపించి, శివాద్వైతాన్ని బోధించారు. మరల లింగైక్యు లయ్యారు.


కాలాగ్నిరుద్రుడు లేదా కాలభైరవుడు: బ్రహ్మ ఐదవ తలను తీసేసిన రుద్రుడు. కపాల హస్తుడు. కాశీ పురాధీశుడు


రిటి: ఉద్దాలకుని పుత్రుడు. శివకృప చేత పరమ జ్ఞానిగా మారి శివ గణములలో చేరాడు.


బాణుడు: శివుని పరమభక్తుడు. శివునితోనే యుద్ధం కోరాడు. తత్సముడైన వానితో నీ అభీష్టం నెరవేరుతుందని వరం పొందాడు. శ్రీ కృష్ణునితోయుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు. నర్మదా నదిలో బాణలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణ లింగాలని పిలువ బడతాయి.


చండీశుడు: ఒక గోప బాలుడు. శివపూజకు గుడిలో అనుమతించరు అని, గొర్రె పెంటికను శివలింగంగా భావించి గొర్రె పాలతో పూజించాడు. భక్తి తన్మయత్వంలో ఆ పెంటిక శివలింగంపై పడబోతున్న తన తండ్రి కాలినే నరికేసాడు. కైలాసం నుండి శివుడు పరుగున వచ్చి ఆ బాలునికి గణ ఆధిపత్యాన్ని, శివ ఉచ్చిష్టంపై అధికారాన్ని కలిగించాడు. శివ నింద చేసేవారికి అతడు చండశాసనుడు.


ఇలా ఎందరో ప్రమథ నాయకులు.


దదీచి, అగస్త్యుడు, ఉపమన్యుడు, పప్పిలాదుడు, దుర్వాసుడు మొదలైన అనేక మంది ఋషులు కూడా శాంభవ దీక్ష స్వీకరించి గణములలో స్థానం పొందినారు.


అంతే గాక విభూతి, రుద్రాక్షలు, శివలింగాన్ని ధరించి శాంభవ దీక్షలో ఉంటూ సంచరిస్తూ ఉండే ఎంతో మంది శివయోగులు కూడా ప్రమథ కులము వారే. బ్రహ్మ సృష్టి పరంపరలో వచ్చే వర్ణాశ్రమ ధర్మములకు, అగ్నిష్టోమాది క్రతువులకు వీరు అతీతులు. కేవలం శివకర్మ మాత్రమే విధిగా సంచరిస్తారు. అనన్యశివభక్తి ఉన్నవారు అందరూ సమానులని వీరి విశ్వాసము. ఈనాటికీ వీరు వీరమాహేశ్వరులని, జంగమదేవతలని పిలువబడతారు.


ఇక జంగమలు గురుపరంపరలో ఉంటే, శిష్య పరంపర చెందిన శివశరణలు కూడా గణములలో స్థానం పొందారు. ఎంతో మంది స్త్రీలు శరణలయ్యారు. అక్క మహాదేవి, హేమరెడ్డి మల్లమ్మ వంటి వారు. 12వ శతాబ్దానికి చెందిన బసవ, అల్లమ ప్రభు, చెన్నబసవ, సిద్ధరామ ఇత్యాది శరణలెళ్లరు శివగణాల అవతారాలు అని బసవ పురాణం చెబుతుంది.


గణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తుంది. కొందరు శివ సారూప్యం తో ఉంటారు, కొందరు ఇచ్చాధార రూపాలతో ఉంటారు.రకరకాల ముఖాలతో, రక రకాల శరీరాలతో, అవయవాలలో వింతగా ఉంటారు ప్రమథ గణాలు. వీరి శక్తుల, లీలల గురించి తెలుసుకోవాలంటే పాల్కురికి సోమనాథుని బసవ పురాణం చదవాల్సిందే!!

వీరి పేర్లు తలచుకోవడమే మహా ప్రసాదము.

సర్వం శివమయం.. హరహర మహాదేవ శంభోశంకరా...

సోమస్కందమూర్తి

ఈ ఫోటో ఇంట్లో పెట్టి పూజించమని పెద్దలు చెబుతారు.


సంతానం అనుగ్రహించే సోమస్కంద మూర్తులు

సంతానం కలగాలని కోరుకునే దంపతులు 

శ్రీ సోమస్కంద మూర్తి చిత్రపటం గానీ, విగ్రహం కానీ ఇంట్లో పెట్టుకుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వలన,  సుబ్రహ్మణ్యుని వంటి తేజోమూర్తి అయిన సుపుత్రుడు జన్మిస్తాడు అని శాస్త్ర వచనం. అంతే కాదు పిల్లలు ఉన్నవారైనా సరే, ఈ సోమస్కంద మూర్తిని ఆరాధిస్తే, పిల్లలు చక్కని తెలివితేటలు, బుద్ధి కుశలత, చురుకుదనం, తేజస్సు పొందుతారు. అందుకే తమిళనాట సోమస్కంద మూర్తి ఆరాధన విశేషంగా చేస్తుంటారు ...

తమిళనాడులో ఈ మూర్తి ప్రతి శివాలయమున ఉంటారు ...

మన ఆంధ్రరాష్ట్రమున కపిలతీర్థం మరియు శ్రీ కాళహస్తీ దేవాలయాల్లో మాత్రమే మనకు కనిపిస్తారు ...

ఒక్కసారి ఈ సోమస్కంద మూర్తిని గమనించండి ...

పార్వతి పరమేశ్వరుల మధ్యలో చిన్న బాలుడుగా  ఆడుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి వారు ...    

సో- ఉమా- స్కంద మూర్తి ...    

సోముడు అనగా శివుడు , 

ఉమా దేవి అనగా పార్వతి దేవి, 

స్కందుడు అనగా సుబ్రహ్మణ్యస్వామి వారు, వీళ్ళ ముగ్గురూ కలసి ఉన్న మూర్తినే సోమస్కంద మూర్తి అంటారు,చాలా విశేషమైన మూర్తి.

స్మశాన నారాయణుడు

పితృ దోషాలు తొలగించే మహామహిమాన్వితమైన క్షేత్రం స్మశాన నారాయణుని దర్శనం మనకు లభిస్తున్న అద్భుత వరం  అందరూ తెలుసకోవాలి ఈ దివ్యక్షేత్రం గురించి.

పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం..

పితృదోషం మన తాతలు తండ్రులు 

సంపాదించిన ఆస్తిపాస్తులను 

వంశపారంపర్యంగా అనుభవించటానికి 

మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ...

అలాగే... 

తాతలు తండ్రులు చేసిన 

పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.

మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.

అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు..

మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే. అదే పితృదోషం

పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.

ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.

వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.

పితృదోషం వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని...

 చిన్న వారు అకాలమరణం పొందడం, శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం, అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం, మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం, మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం

ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం.

దీని నుండి విముక్తి పొందడానికి ఒక పరిష్కారం ఏమిటంటే, స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే ...

అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.

1. కాశీ

2. పాపనాశి ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)

అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.

విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు .

అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.

స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే....

పాలు అన్నముతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నేయి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ! ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు . 

స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.

ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును ) 

అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.

ఈ ఆలయ ప్రాముఖ్యము తంత్ర గురు "వేణు మాధవ నంబూద్రి " ద్వారా తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !

ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు . అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం..


చేరుకొనే విధానం:

అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం "

ఇంకొక ముఖ్య విషయం : స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి!

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...