Wednesday, September 22, 2021

గుమ్మానికి మరియు వాహనాలకు నిమ్మకాయలు & మిరపకాయలు ఎందుకు కడతారో తెలుసా?

 భారతదేశం అంటేనే సంప్రదాయాలకు పెట్టింది పేరు. మన భారతదేశంలో మనం ఎన్నో ఆచారాలను పాటిస్తాం. కొన్ని ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయితే, కొన్ని మాత్రం భారతదేశ వ్యాప్తంగా పాటిస్తాం. అయితే అలా ఎక్కువగా పాటించే ఆచారాల్లో గుమ్మానికి నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి వేలాడదీయడం ఒకటి, మరొకటి వాహనాలకు కట్టడం.

ఆధ్యాత్మిక పరంగా, శాస్త్రపరంగా ఇది ఎందుకు అవసరమో రెండూ తెలుసుకుందాం.

నిమ్మక్కాయలు & మిరపకాయలు ఇంటి గుమ్మానికి కట్టడం వలన ఏమవుతుందంటే...

 


సిరిసంపదలకు అధిదేవత లక్ష్మీదేవి. హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది. అయితే లక్ష్మీదేవికి ఓ అక్క కూడా ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటారు. అది ఉండాలి కూడా.  అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం. ఆమె పేరు అలక్ష్మీ. పాల సముద్రాన్ని మథించినప్పుడు కల్పవృక్షం, ఇంద్రుడి వాహనం ఐరావతం, లక్ష్మీదేవి, హలాహలం, చివరిగా అమృత కలశంతో ధన్వంతరి అవతరించారు. పాల సముద్రం నుంచి పుట్టిన లక్ష్మీని తాను వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు. అయితే తన సోదరి వివాహం జరిగిన తర్వాతే వివాహం చేసుకుంటానని లక్ష్మీదేవి తెలిపింది. దీంతో అలక్ష్మీకి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెదికినా ప్రయోజనం ఉండదు. ఆమెను పెళ్లాడటానికి ఎవరూ అంగీకరించరు.


చివరికి ఉద్దాలక మహర్షి ఆమెను వివాహం చేసుకోడానికి ఒప్పకుంటాడు. కల్యాణం తర్వాత ఉద్దాలక మహర్షితో కలిసి అలక్ష్మీ ఆశ్రమానికి చేరుకున్న తర్వాత ఆశ్రమలోపలికి ప్రవేశించడానికి నిరాకరిస్తుంది. దీనికి కారణం ఏంటని ముని అడుగుతాడు. దీనికి అలక్ష్మీ ఇచ్చిన సమాధానం ఏమిటంటే...


లక్ష్మీకి సోదరి అయిన అలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తే...


నిరంతరం కలహాలతో కొట్టుకునే వాళ్లు, పరిశుభ్రత లేనివారు, మతాచారాలకు విరుద్ధంగా ప్రవర్తించేవారి ఇళ్లలో మాత్రమే తాను ప్రవేశిస్తానని తెలిపింది. సూర్యోదయానికి ముందే మేల్కొని, పరిశుభ్రంగా ఉంటూ దైవారాధన చేసేవారి ఇంటిలోకి తనకు ప్రవేశం లేదని అలక్ష్మీ పేర్కొంది. అలాంటి ఇంటిలోనే లక్ష్మీ కొలువుంటుంది.


అలక్ష్మీకి వేడి, పుల్లని పదార్థాలంటే ప్రీతి. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీస్తారు. ఇలా చేయడం వల్ల అలక్ష్మీ మన ఇంటిలోకి ప్రవేశించాలనుకున్నా తనకు ఇష్టమైన ఆహారాన్ని చూసి ఆగిపోతుంది. అలక్ష్మీ ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మీని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు.


ఇక శాస్త్రపరంగా గమనిస్తే


నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయడానికి వెనకాల ఒక సైన్స్ కి సంబంధించిన కారణం ఉంది.


పూర్వం దాదాపుగా అందరూ మట్టి ఇళ్ళలోనే ఉండేవారు. దాంతో పురుగులు, దోమలు వంటివి ఇళ్లల్లోకి ఎక్కువగా వచ్చేవి. అప్పుడు ఇప్పుడు ఉన్నట్టు మస్కిటో కాయిల్స్ లాంటి కెమికల్ పదార్థాలు లేవు. నిమ్మకాయ, మిరపకాయల్లో విటమిన్ సి ఉంటుంది. మిరపకాయలో అయితే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మనం నిమ్మకాయని దారానికి గుచ్చినప్పుడు ఆ దారానికి అంటుకొని ఆ ప్రదేశం మొత్తం వ్యాపిస్తుంది. దాంతో దోమలు, ఈగలు లేదా ఇతర కీటకాలు అక్కడికి రాకుండా ఉంటాయి. ఈ కారణంగానే పూర్వంలో నిమ్మకాయ, పచ్చి మిరపకాయలు దారానికి కలిపి కట్టేవారు. ఇదే పద్ధతిని మనం తరతరాల నుండి ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్నాం.


ఇక వాహనాల విషయానికి వస్తే జ్యోతిష్య శాస్త్రపరంగా గమనిస్తే విషయ అవగాహనమవుతుంది

 

సాధారణంగా హనుమంతుని ఆలయంలో వాహన పూజలు జరిపిస్తుంటారు. దేవుళ్లకు నివేదించిన నిమ్మకాయలను వాహనాలకు కడుతుంటారు. అంతే కాకుండా దిష్టి తీసి వాహన చక్రాలతో తొక్కిస్తారు. ఇలా చేస్తే మేలు జరుగుతుందని ఆశిస్తారు. పులుపుగా ఉండే నిమ్మకాయ, కారం నిండి ఉండే పచ్చిమిర్చిలను వాహనాలకు, దుకాణాల మధ్య వేలాడదీస్తారు. 

 

గ్రహాలలో ఎర్రని, ఉద్రత్వం కలిగినది కుజగ్రహం. కుజుడు ప్రమాద కారకుడని శాస్త్రం నమ్మకం. కుజునికి ఆదిదేవుడు హనుమంతుడు. అలానే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. కారం విగ్రహానికి సంబంధించినది. అధికారానికి రవి కారకుడు. వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుకుంటూ వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయాలు కడతారు.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...