Saturday, May 23, 2020

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం

1) దేవతాగణభయభీతావహతారకాసురప్రాణహరణాయ 
   ద్విషడ్భుజభక్తజనపరిపాలకవిశాలకమలనేత్రాయ 
   శ్రీకైలాసపురివాసగిరిరాజసుతశంకరప్రియాత్మజాయ 
   శ్రీ సుబ్రహ్మణ్యాయ శరవణభవాయ ||

2) దుర్గమక్రౌంచపర్వతఛేదనకారకాయ
  దారుణాతిదారుణరోగనివారణకారణాయ
  గంధర్వయక్షకిన్నరకింపురుషసేవితాయ
  శ్రీ సుబ్రహ్మణ్యాయ శరవణభవాయ ||

3) శ్రీవల్లీదేవసేనాసేవితాంఘ్రియుగాయ
   ప్రణవార్థబోధకపరమహంసరూపాయ
   ఇంద్రాదిసురసేవితదేవసేనాధ్యక్షాయ
   శ్రీ సుబ్రహ్మణ్యాయ శరవణభవాయ ||

4) సంగీతాదిసకలవిద్యాప్రదాయకాయ
   శక్తిహస్తమయూరవాహనారూఢాయ
   అజ్ఞానాంధకారహరజ్యోతిస్వరూపాయ
   శ్రీ సుబ్రహ్మణ్యాయ శరవణభవాయ ||

5) సకలనిగమాగసంస్తుతదివ్యవిగ్రహాయ
   భక్తజనాభీష్టప్రదపావకగంగాత్మజాయ 
   నాగదోషహరసంతానప్రదాయకాయ
   శ్రీ సుబ్రహ్మణ్యాయ శరవణభవాయ ||

6) సకలచోరాగ్నిభయనివారకహస్తాయ 
   కుండలినీస్థిరవాసబ్రహ్మస్వరూపాయ
   భానుశశితేజషోడశకళాప్రపూర్ణాయ
   శ్రీ సుబ్రహ్మణ్యాయ శరవణభవాయ    ||

7) పరమదుష్టశూరపద్మాసురజీవనహరణాయ 
   భస్మత్రిపుండ్రభసితసుందరవదనారవిందాయ
   గౌతమవామదేవాదిమునిగణపూజితచరణాయ
   శ్రీ సుబ్రహ్మణ్యాయ శరవణభవాయ ||

8) బ్రహ్మచారీస్వరూపగురుస్వామినాథాయ
   ప్రణతార్తిభంజనసకలపాపహరణాయ
   వేదవేదాంగసంస్తుతదివ్యప్రభావాయ
   శ్రీ సుబ్రహ్మణ్యాయ శరవణభవాయ   ||

    సర్వం శ్రీ సుబ్రహ్మణ్యదివ్యచరణారవిందార్పణమస్తు

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...