ధర్మాచరణమందు వస్త్రధారణమునకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నది.
వస్త్రాన్ని ఆవహించుకొని దేవతలు ఉంటారు అన్న విషయం మన ధర్మశాస్త్ర గ్రంధాలలో చెప్పబడియున్నది. అందుకే వస్త్రాన్ని కాలితో ఈడ్చడం గాని, తొక్కడం గాని చేయకూడదనేవారు మన పెద్దలు.
ఈరోజుల్లో పూజాకార్యక్రమాలలో పాల్గొనేవారిలో కొందరు శాస్త్రవిధి తెలియక కుట్టిన ధోవతిలాంటి వస్త్రాలను కట్టుకొని వైదిక కార్యక్రామలలో పాల్గొనడం సామాన్యమైపోయింది. ఇటువంటివి ఈమధ్య కాలంలో బట్టల దుకాణాలలో కూడా అమ్ముతున్నారు. ఆశాస్త్రీయమైన అటువంటి వాటిని ప్రోత్సహించేకన్నా... కొంచెం శ్రద్ధ పెడితే కాసిపోసి కట్టుకోవడం పెద్ధ విషయమేమి కాదు.
మన శాస్త్ర గ్రంధాలు ఈ విషయమై ఏమని చెపున్నాయంటే...
"వికచ్చోనుత్తరీయశ్చ నగ్నశ్చావస్త్ర ఏవచ, శ్రౌతస్మార్థే నైవకుర్యాత్",
1)అనగా కచ్ఛము లేకుండాగానీ గుండారపోసి కట్టడముగానీ(వస్త్రాన్ని మడతపెట్టి రెండు కాళ్ళ మధ్యనుండి వెనుక వైపు దోపకపోవడం),
2)ఉత్తరీయము లేకుండాగానీ,
3)అంచులేని వస్త్రము కట్టినాగానీ, 4)అగ్నిస్పర్శ కలిగిన (కాలిపోయిన వస్త్రము కట్టినాగానీ),
5)ఎలుకలు తదితర జంతువులు కొరికిన వస్త్రము కట్టినాగానీ,
6)ఒకసారి కట్టినవస్త్రం మరల ఉతికి ఆరేయకుండా రెండవమారు కట్టినాగానీ,
7)కుట్టినబట్ట కట్టినాగానీ(పాంటు, షర్టులు మొదలైనవి)
8)రంగుబట్ట కట్టినాగానీ,
9)తడి వస్త్రం కట్టినాగానీ,
అటువంటి వస్త్రధారణతో వైదిక కర్మలలో పాల్గొనడంగానీ, దేవాలయ, పుణ్యతీర్థ క్షేత్ర సందర్శనం చేయరాదని మన ధర్మశాస్త్ర గ్రంధాలు చెపుతున్నవి.
తెల్లని నూలు వస్త్రాలనుగానీ, లేదా పట్టుబట్టలను, కాశీ పంచలనుగానీ, ధావళినిగానీ ధరించడం మంగళకరం.
ఇటువంటి విషయాలు తెలుసుకొని మనము ఆచరించాలి, కుటుంబ సభ్యులు, బందువులు, మిత్రులు, శ్రేయోభిలాషులతో పంచుకోవాలి.
.

No comments:
Post a Comment