Sunday, May 31, 2020

గండకి నది చరిత్ర..

#గండకీ అనే వేశ్య గర్భంలోనే మహావిష్ణువు పుడతాడు, ఆమెతో ఒక్కరాత్రి గడిపితే చాలు అనుకునేవారు..!!

#సాలిగ్రామం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఊరి పేరు కాదు. గ్రామం అస్సలే కాదు. విష్ణువు ఆకారంలో ఉండే చిన్నచిన్న రాళ్లనే సాలి గ్రామం అంటూ ఉంటారు. వాటిపై విష్ణువు రూపం ఉటుంది. అయితే ఇవన్నీ కూడా ఒక్క నదిలోనే ఎక్కువగా దొరుకుతాయి. గండకి నది గర్భంలోనే ఇలాంటి రాళ్లు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని చాలా మంది పూజగదిలో ఉంచుకుని పూజిస్తుంటారు. వీటికి ఎంతో మహిమ ఉంటుందని భక్తుల నమ్మకం

#గండకీ ఒక వేశ్య
#ఇవన్నీ గుండ్రంగా నున్నగా ఉంటాయి. తాబేలు ఆకారంలో నోరు తెరుచుకుని ఉంటాయి. లోపల విష్ణువు కనపడతాడు. ఇంత ప్రత్యేకమైన సాలి గ్రామాలు గండకి నదిలోనే లభించడం వెనుక ఒక కథ ఉంది. పూర్వం గండకీ అనే అమ్మాయి ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే. శ్రావస్తి అనే నగరంలో ఈ గండకీ ఉండేది. గండకీ ఒక వేశ్య.

#ఒక్కరాత్రి గడిపితే చాలు
గండకీతో ఒక్కరాత్రి గడిపితే చాలు వాళ్ల తలరాతలు మారిపోయేవి. వాళ్ల అదృష్టాలు మారిపోయేవి. బాగా సంపన్నులుగా, గొప్పవాళ్లుగా మారిపోయేవారు. దీంతో చాలా మంది డబ్బు ఉన్న వాళ్లు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకీ మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు. చెడ్డ వాళ్లతో అస్సలు గడిపేది కాదు. రోజుకు ఒక్క వ్యక్తితోనే గడిపేది.

#భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది
తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది. ఇక ఆ రోజు మొత్తం అతనే భర్తగా భావించేది. తను ఏది కోరితే అది చేసేది. కేవలం సుఖం అందించడమే కాదు తనను #భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది. తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఏమైనా తట్టుకోలేకపోయేది.

#మారువేషంలో బేరం కుదుర్చుకున్నాడు
గండకి గురించి నారాయణుడికి తెలిసింది. ఆమెను పరీక్షించాలనుకున్నాడు. ఒక రోజు ముందు మారువేషంలో వెళ్లి గండకితో బేరం కుదుర్చుకున్నాడు. గండికి కూడా అతను మంచి వాడిలాగా కనిపించాడు కాబట్టి ఒక రోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది. తనకు ముందుగా భార్యలా స్నానం చేసి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుతాడు నారాయణుడు.

#సరే అని.. గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది. బట్టలు తీసి వేస్తే ఒంటినిండా పుండ్లు కనపడ్డాయి. నారాయణుడు అందవికారంగా కనిపించాడు. అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది. సువాసనలు గుప్పించే సుగంధద్రవ్యాలను గండకి ఆయన్ని పూసింది. కొత్త బట్టలు తొడిగించింది.

#పక్క మీదకు తీసుకెళ్తుంది
తర్వాత తనే వంట చేసి అతనికి వడ్డించింది. అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండడంతో సరిగ్గా తినలేకపోతాడు. దాంతో ఆమెనే తినిపిస్తుంది. తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది. తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకెళ్తుంది. కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. బాగా జ్వరం వస్తుంది. అతనికి ఆ రోజు అంతా సేవ చేస్తుంది గండకి. ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు.

#చితిలోకి దూకుతుంది
తన సొంత భర్త చనిపోయాడన్నట్లుగా బాధపడుతుంది. భర్తతో పాటు తాను కూడా చితిలో #పడుకుని సతీసహగమనం చెయ్యడానికి సిద్ధం అవుతుంది. అందరూ అడ్డుకున్న కూడా వినదు. తన దగ్గరుండే సొమ్మునంతా బీదలకు పంచిపెడుతుంది. #తర్వాత శ్మశానంలో చితిలోకి దూకుతుంది.

#విష్ణువునే గర్భానా పుట్టాలని కోరుకుంటుంది
అయితే మంటలు ఒక్కసారిగా మల్లె పూల మాదిరిగా మారుతాయి. విష్ణువు ప్రత్యక్షమై నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయడం నాకు నచ్చింది అంటాడు. గండకీ సంబరంగా విష్ణువు వైపే చూస్తుంది. నీకు ఏ వరం కావాలో కోరుకో గండకీ అంటాడు విష్ణు మూర్తి. గండకీ విష్ణువునే తన గర్భానా పుట్టాలని కోరుకుంటుంది. సరే నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది. నీ గర్భంలో ఎప్పుడూ నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు.

#గండకీ మరు జన్మలో నదిగా పుట్టింది. ఆ నది గర్భంలోనే సాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి. ఇది #సాలిగ్రామం, గండకీ కథ.

#తులసి శాపం వలన సాలగ్రామం గా మారిన విష్ణువు గండకీకి ఇచ్చిన వరం వలన గండకి నదిలోకి సాలగ్రామ రూపంలో చేరతాడు.. ఈ గండకి నది నేపాల్ లో ఉంది. ఖాట్మండు వెళ్లే దారిలో కనిపిస్తుంది. ఈనదిలోనే సాలగ్రామలు దొరికేది. మనం పూజించే చిన్ని చిన్ని సాలగ్రామలు ఇక్కడి నుండి వచ్చినవే.

సర్వే జానాః సుఖినో భవంతు

Saturday, May 30, 2020

భోజన నియమాలు

1. భోజనానికి ముందు,తరువాత తప్పక
కాళ్ళు, చేతులు కడుక్కోవాలి.
తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.

2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.)
తినే పళ్ళానికి తాకించరాదు.
అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి.
ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు.
చాలా దోషం.

4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.

5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.

6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు.

7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.
ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.

8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.

9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.

10. ఉపనయనం అయినవారు తప్పక ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.

11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.

12. ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు
ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.

13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు.
(ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)

14. మాడిన అన్నాన్ని నివేదించరాదు.
అతిథులకు పెట్టరాదు.

15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు.
(వెంట్రుకలు కత్తిరించడం)

16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే
మనం తినగా మిగిలినవి పెట్టరాదు.
మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి.

17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు.

18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.

19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది.

20. భగవన్నామము తలుచుకుంటూ లేదా
భగవత్ కథలు వింటూ వంట వండడం,
భోజనం చేయడం చాలా ఉత్తమం.

21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని
ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి ఇబ్బంది అవ్వచ్చు)

22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.

23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు .
ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.

24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.

25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.

26. అరటిఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు
(తిన్న విస్తరిని మడవడం అనాచారం).
తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.

27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం.
(జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.)

28. భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి.
అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి.
నోరు నీటితో పుక్కిలించుకోవాలి.

29. భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.)

30. స్నానం చేసి మాత్రమే వంట వండాలని
కఠోర నియమము.
పెద్దలు,సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం. అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు,
పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం.
అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.

31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు.
ద్విపాక దోషం వస్తుంది.

32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.

బ్రహశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు

Wednesday, May 27, 2020

అసలు మౌఢ్యమి అంటే ఏమిటి?

రేపటి నుండి శుక్రమౌఢ్యమి (శుక్రమూఢమి) ప్రారంభం

ఈ సంవత్సరం 28-5-2020 నుండి శుక్రమూఢమిప్రారంభమై10-6-2020 వరకు శుక్రమూఢమి త్యాగం జరుగును.

అసలు మౌఢ్యమి అంటే ఏమిటి?

గురుగ్రహమే కానీ , శుక్ర గ్రహమేకానీ సూర్యునితో కలసి ఉండే కాలమును మౌఢ్యమి అంటారు. మౌఢ్యకాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్యకాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.

శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము. మౌఢ్యమిని "మూఢమి" గా వాడుకభాషలో పిలుస్తారు. ఈ మూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు. మూఢమి అంటే చీకటి అని అర్ధం. మూఢమి అనేది అన్ని గ్రహాలకు ఉన్న గురు , శుక్ర మౌఢ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది.

శుక్రమౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం ఆటు , పోటులలో మార్పులు వస్తాయి. శుక్ర గ్రహ పాలిత ద్వీపాలకు , ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. శుక్రుడు సంసార జీవితానికి శృంగార జీవితానికి కారకుడు. జాతకములో శుక్రుడు బల హీనముగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు. ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయండి.

మౌఢ్యమిలో చేయకూడని కార్యక్రమములు:-

పెళ్ళిచూపులు , వివాహం , ఉపనయనం , గృహారంభం , గృహప్రవేశం , యజ్ఞాలు చేయుట , మంత్రానుష్టానం , విగ్రహా ప్రతిష్టలు , వ్రతాలు, నూతన వధువు ప్రవేశం , నూతన వాహనము కొనుట , బావులు , బోరింగులు , చెరువులు తవ్వటం , పుట్టువెంట్రుకలకు , వేదా"విధ్యా"ఆరంభం , చెవులు కుట్టించుట , నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయరాదు.

మౌఢ్యమిలో చేయదగిన పనులు :-

జాతకర్మ , జాతకం రాయించుకోవడం , నవగ్రహ శాంతులు , జప , హోమాది శాంతులు , గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు , సీమంతం , నామకరణం , అన్నప్రాసనాది కార్యక్రమాలు గురుమౌఢ్యమి వచ్చినా , శుక్రమౌఢ్యమి వచ్చినా చేయవచ్చును. గర్భిణి స్త్రీలు , బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో మూఢాలలో ప్రయాణం చేయాల్సివస్తే శుభ తిధులలో అశ్వని , రేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.

Saturday, May 23, 2020

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం

1) దేవతాగణభయభీతావహతారకాసురప్రాణహరణాయ 
   ద్విషడ్భుజభక్తజనపరిపాలకవిశాలకమలనేత్రాయ 
   శ్రీకైలాసపురివాసగిరిరాజసుతశంకరప్రియాత్మజాయ 
   శ్రీ సుబ్రహ్మణ్యాయ శరవణభవాయ ||

2) దుర్గమక్రౌంచపర్వతఛేదనకారకాయ
  దారుణాతిదారుణరోగనివారణకారణాయ
  గంధర్వయక్షకిన్నరకింపురుషసేవితాయ
  శ్రీ సుబ్రహ్మణ్యాయ శరవణభవాయ ||

3) శ్రీవల్లీదేవసేనాసేవితాంఘ్రియుగాయ
   ప్రణవార్థబోధకపరమహంసరూపాయ
   ఇంద్రాదిసురసేవితదేవసేనాధ్యక్షాయ
   శ్రీ సుబ్రహ్మణ్యాయ శరవణభవాయ ||

4) సంగీతాదిసకలవిద్యాప్రదాయకాయ
   శక్తిహస్తమయూరవాహనారూఢాయ
   అజ్ఞానాంధకారహరజ్యోతిస్వరూపాయ
   శ్రీ సుబ్రహ్మణ్యాయ శరవణభవాయ ||

5) సకలనిగమాగసంస్తుతదివ్యవిగ్రహాయ
   భక్తజనాభీష్టప్రదపావకగంగాత్మజాయ 
   నాగదోషహరసంతానప్రదాయకాయ
   శ్రీ సుబ్రహ్మణ్యాయ శరవణభవాయ ||

6) సకలచోరాగ్నిభయనివారకహస్తాయ 
   కుండలినీస్థిరవాసబ్రహ్మస్వరూపాయ
   భానుశశితేజషోడశకళాప్రపూర్ణాయ
   శ్రీ సుబ్రహ్మణ్యాయ శరవణభవాయ    ||

7) పరమదుష్టశూరపద్మాసురజీవనహరణాయ 
   భస్మత్రిపుండ్రభసితసుందరవదనారవిందాయ
   గౌతమవామదేవాదిమునిగణపూజితచరణాయ
   శ్రీ సుబ్రహ్మణ్యాయ శరవణభవాయ ||

8) బ్రహ్మచారీస్వరూపగురుస్వామినాథాయ
   ప్రణతార్తిభంజనసకలపాపహరణాయ
   వేదవేదాంగసంస్తుతదివ్యప్రభావాయ
   శ్రీ సుబ్రహ్మణ్యాయ శరవణభవాయ   ||

    సర్వం శ్రీ సుబ్రహ్మణ్యదివ్యచరణారవిందార్పణమస్తు

ఎలాంటి వ‌స్ర్రాల‌తో పూజాదికాలు చేయాలి

ధర్మాచరణమందు వస్త్రధారణమునకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నది.
వస్త్రాన్ని ఆవహించుకొని దేవతలు ఉంటారు అన్న విషయం మన ధర్మశాస్త్ర గ్రంధాలలో చెప్పబడియున్నది. అందుకే వస్త్రాన్ని కాలితో ఈడ్చడం గాని, తొక్కడం గాని చేయకూడదనేవారు మన పెద్దలు.

  ఈరోజుల్లో పూజాకార్యక్రమాలలో పాల్గొనేవారిలో కొందరు శాస్త్రవిధి తెలియక కుట్టిన ధోవతిలాంటి వస్త్రాలను కట్టుకొని వైదిక కార్యక్రామలలో పాల్గొన‌డం సామాన్య‌మైపోయింది. ఇటువంటివి ఈమధ్య కాలంలో బట్టల దుకాణాలలో కూడా అమ్ముతున్నారు. ఆశాస్త్రీయ‌మైన అటువంటి వాటిని ప్రోత్స‌హించేక‌న్నా... కొంచెం శ్రద్ధ పెడితే కాసిపోసి కట్టుకోవడం పెద్ధ విషయమేమి కాదు.

మన శాస్త్ర గ్రంధాలు ఈ విషయమై ఏమని చెపున్నాయంటే...

"వికచ్చోనుత్తరీయశ్చ నగ్నశ్చావస్త్ర ఏవచ, శ్రౌతస్మార్థే నైవకుర్యాత్",
1)అనగా కచ్ఛము లేకుండాగానీ గుండారపోసి కట్టడముగానీ(వస్త్రాన్ని మడతపెట్టి రెండు కాళ్ళ మధ్యనుండి వెనుక వైపు దోపకపోవడం),
2)ఉత్తరీయము లేకుండాగానీ,
3)అంచులేని వస్త్రము కట్టినాగానీ, 4)అగ్నిస్పర్శ కలిగిన (కాలిపోయిన వస్త్రము కట్టినాగానీ),
5)ఎలుకలు తదితర జంతువులు కొరికిన వస్త్రము కట్టినాగానీ,
6)ఒకసారి కట్టినవస్త్రం మరల ఉతికి ఆరేయకుండా రెండవమారు కట్టినాగానీ,
7)కుట్టినబట్ట కట్టినాగానీ(పాంటు, షర్టులు మొదలైనవి)
8)రంగుబట్ట కట్టినాగానీ,
9)తడి వస్త్రం కట్టినాగానీ,

 అటువంటి వస్త్రధారణతో వైదిక కర్మలలో పాల్గొనడంగానీ, దేవాలయ, పుణ్యతీర్థ క్షేత్ర సందర్శనం చేయరాదని మన ధర్మశాస్త్ర గ్రంధాలు చెపుతున్నవి.

తెల్లని నూలు వస్త్రాలనుగానీ, లేదా పట్టుబట్టలను, కాశీ పంచలనుగానీ, ధావళినిగానీ ధరించడం మంగళకరం.

 ఇటువంటి విషయాలు తెలుసుకొని మనము ఆచరించాలి, కుటుంబ సభ్యులు, బందువులు, మిత్రులు, శ్రేయోభిలాషులతో పంచుకోవాలి.
.

అధికమాసం అంటే ఏమిటి?

పంచాంగ గణనం ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీO పదకొండుంబావు రోజుల తేడా ఉంది.

చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కంటే, చిన్నది.

ఇదే విధంగా, చాంద్రమాన మాసం సౌరమాన మాసం కంటే చిన్నది.

ఈ కారణంగానే ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో, సౌరమాసం ప్రారంభమవుతూ, ఉంటుంది.

అలాంటి సందర్భాల్లో, సాధారణంగా వచ్చే సూర్యసంక్రమణం, ఉండదు. ఇలా వచ్చే చాంద్రమాసాన్ని, అధికమాసంగా వ్యవహరిస్తారు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే, ఒక్కో రాశిలో, ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు, రెండు నెలలపాటు, ఒకే రాశిలో ఉండటం వల్ల ఏర్పడేదే, అధికమాసం.
ఇందులో మొదటి నెలలో, రవి సంక్రాంతి ఉండదు.
అధిక మాసం ఎప్పుడూ చైత్రమాసం నుంచి ఆశ్వయుజ మాసం మధ్యలోనే వస్తుంది.
అధిక మాసంలో నిత్యం చేసుకునే పనులు తప్ప, మిగతా ఏ శుభకార్యాలూ, చేయకూడదని, శాస్త్రం చెబుతోంది. ఈ మాసాన్ని, పురుషోత్తమ మాసం అని, కూడా అంటారు.
శివకేశవుల ఆరాధనా, జపతపాదులూ, దానాలూ, నదీస్నానాలూ, తీర్థయాత్రలూ ఎక్కువచేస్తే మంచిది.
మరణ సంబంధమైన క్రతువులు, అంటే మాసికం, ఆబ్దికం మొదలైనవి, అధిక, నిజమాసాలు రెండింటిలో చేయాల్సి ఉంటుంది. అధికమాసంలో వచ్చే మహాలయ పక్షాలు పితృకర్మలకు విశిష్టమైనవిగా చెబుతారు.

Friday, May 22, 2020

ప్రవర యొక్క అర్ధం

చతుస్సాగర పర్యంతం
(మానవ పరిభ్రమణానికి నలువైపులా కల మహాసముద్రాల అంచుల వరకూ)...

*గో బ్రాహ్మణేభ్య శుభం భవతు*(సర్వాబీష్ట ప్రదాయిణి అగు..గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ)....

*×××××××. ఋషేయ ప్రవరాన్విత..*
(మా వంశమునకూ..మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ..

*త్యాగే నైకే అమృతత్త్వ మానశుః......*
అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడనై..

*×××××× గోత్రః*
(మా గోత్రమునకూ..)

*ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ.....*
(మా శాఖకూ..అందలి శాస్త్ర మర్మంబులకు..)

*శ్రీ* *** *శర్మ నామధేయస్య*
( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో..వేదాధ్యయనాది వైదిక క్రతువులతో..
1. స్నానము
2. సంధ్య
3. జపము
4. హోమము
5. స్వాధ్యాయము
6. దేవ పూజ
7. ఆతిధ్యము
8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ..త్రివిధాగ్నులు...
1.కామాగ్ని
2.క్రోధాగ్ని
3.క్షుద్రాగ్ని..
అనే త్రివిధాగ్నులను అదుపులో(సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై..పేరుకు ముందు శ్రీ అనబడే..ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన..

*శ్రీ * *శర్మా* అనబడే సుశ్రోత్రియుడనైన నేను..జన్మప్రధాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు..యావత్ ప్రపంచానికే మార్గదర్శకమైన వేదధర్మము ముందు.. నిరాకార నిర్గుణ అవ్యాజ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు..

*అహంభో అభివాదయే..*
( కేవలం నేనూ అన్నదిలేక.. సర్వం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ భాగ్యమేయన్న అహంకారభావ రహితుడనై.. నిగర్వినై..త్రికరణ శుద్ధిగా (మనసా,వాచా,కర్మణా) సాష్టాంగ పూర్వక (మానవశరీరంలోని అత్యంత ప్రాధాన్యమైన ఎనిమిది శరీరాంగములనూ శరణాగత హృదయంచే నేలపై వాల్చి సమర్పిస్తున్న)దండ ప్రణామమిదే..అన్న పరిపూర్ణమైన ఆత్మపూర్వక వేదపూర్వక హృదయపూర్వక నమస్కార భావమే.. సశాస్త్రీయమైన ఈ ప్రవరలోని..అర్ధం అంతరార్ధం పరమార్ధం కూడా..

Friday, May 15, 2020

దశిక రాము

వినాయకుడు.. గణేషుడు.. విఘ్నేశ్వరుడు.. ఏకదంతుడు.. లంబోదరుడు.. ఇలా విఘ్నాలను తొలగించే వినాయకుడికి ఎన్నో పేర్లున్నాయి.

1. #ఏకదంతుడు అంటే ఏక అంటే ఒక్కటి. ఒక్కటే దంతం ఉన్నవాడు అని అర్థం
2. #లంబోదర (కుండలాంటి పొట్ట కలవాడు)
3. #విఘ్ననాశ లేదా విఘ్నేశ్వరుడు (పనుల్లో అవరోధాలు అంటే విఘ్నాలను తొలగించే వాడు లేదా ఆటంకాలు ఏర్పడకుండా చూసేవాడు)
4. #వినాయక (అన్ని నాయకత్వ లక్షణాలున్న నాయకుడు అంటే గణాలకు నాయకత్వం వహించేవాడు)
5. #గణనాథుడు (అన్ని గణాలకు అధిపతి)
6. #గజాననుడు (ఏనుగు లాంటి ముఖం కలవాడు)
7. #ఓంకారుడు (సరైన జీవితాన్ని ఇచ్చేవాడు)
9. #అద్వైత (ఏకైక వ్యక్తిత్వం ఉన్నవాడు)
10. #అవనీషుడు (ప్రపంచాన్ని ఏలే వాడు)

ఇవకాక బొజ్జగణపయ్యకు ఉన్న బోల్డన్ని పేర్లు ఇవే..

1. బాల గణపతి
2. భక్తి గణపతి
3. ధుంధి గణపతి
4. దుర్గా గణపతి
5. ద్విజ గణపతి
6. ద్విముఖ గణపతి
7. ఏకదంత గణపతి
8. ఏకాక్షర గణపతి
9. హరిద్ర గణపతి
10. హీరాంబ గణపతి
11. క్షిప్ర గణపతి
12. క్షిప్ర ప్రసాద గణపతి
13. లక్ష్మీ గణపతి
14. మహా గణపతి
15. నృత్య గణపతి
16. రుణమోచన గణపతి
17. సంకటహర గణపతి
18. శక్తి గణపతి
19. సిద్ధి గణపతి
20. సింహ గణపతి
21. సృష్టి గణపతి
22. తరుణ గణపతి
23. త్రిముఖ గణపతి
24. త్య్రక్షర గణపతి
25. ఉచ్ఛిష్ట గణపతి
26. ఉద్దండ గణపతి
27. ఊర్ధ గణపతి
28. వరద గణపతి
29. విఘ్న గణపతి
30. విజయ గణపతి
31. వీర గణపతి
32. యోగ గణపతి

వినాయకుణ్ని ఎన్ని పేర్లతో పిలిచినా.. కొలిచినా.. భక్తులు వినతులను మన్నిస్తాడు .

Friday, May 1, 2020

శ్రీ బగళాముఖి జయంతి

వైశాఖ శుక్ల అష్టమిని శ్రీ బగళాముఖి ఈ రోజున జన్మించినట్లు భావిస్తున్నందున శ్రీ బగళాముఖి జయంతిగా జరుపుకుంటారు.

ఈ రోజున ఉపవాసం ఉంటారు,
శ్రీ బగళాముఖిని పూజించడం ...
ఈ రోజు దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు.
ఈ రోజున అనేక యజ్ఞాలు మరియు ఇతర మతపరమైన ఆచారాలు కూడా నిర్వహించబడతాయి.
భక్తులు పగటిపూట ప్రార్థనలు చేస్తారు మరియు రాత్రి భగవతి జాగరణ  చేస్తారు.

శ్రీ బగళాముఖి ఒక వ్యక్తిని తన శత్రువులు మరియు ప్రతికూల శక్తులకు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం పొందుతాడు.
శ్రీ బగళాముఖిని పితాంబర అని కూడా అంటారు, ఆమె పసుపు రంగును ప్రేమిస్తుందని నమ్ముతారు, అందువల్ల, పసుపు రంగులో ఉన్న పదార్థం ఆమె పూజ మొదలైన వాటికి ఉపయోగించబడుతుంది. శ్రీ బగళాముఖి యొక్క రంగు కూడా పసుపు నీడ మరియు శ్రీ బగళాముఖిని పూజించేటప్పుడు ఒక వ్యక్తి పసుపు రంగు దుస్తులను ధరించాలి.

దేవి బగళాముఖి పది మహావిద్యాలలో ఎనిమిదవ మహావిద్యగా పరిగణించబడుతుంది. ఆమె అపారమైన శక్తిని కలిగి ఉంది మరియు శత్రువులు, వాదనలు మొదలైన వాటిపై విజయం సాధించటానికి పూజిస్తారు.  ఆమెను ఆరాధించడం ఒక వ్యక్తిని అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం చేస్తుంది. బగళా అనే పదం సంస్కృత నుండి వచ్చింది. దీని అర్థం సంస్కృతంలో 'వధువు'. శ్రీ బగళాముఖికి ఆమె అందం కారణంగా ఈ పేరు వచ్చింది.

శ్రీ బగళాముఖి ఒక అందమైన రథం నడుపుతూ సింహాసనంపై కూర్చుని చూడవచ్చు. ఈ రెండూ రత్నాలతో నిండి ఉన్నాయి. శ్రీ బగళాముఖి భక్తులు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. పసుపు పువ్వులు మరియు కొబ్బరికాయ ఆమెకు అంకితం చేస్తే ఆమె చాలా ఆకట్టుకుంటుంది. దీపక్స్‌ను పసుపుతో కూడా అంకితం చేయాలి. పసుపు బట్టలు కూడా ఇవ్వవచ్చు. శ్రీ బగళాముఖి మంత్రాలను పఠించడం ఒక వ్యక్తిని అన్ని సమస్యల నుండి ఉపశమనం చేస్తుంది.

బగళాముఖి కథ
శ్రీ బగళాముఖి గురించి ఒక పురాణం చాలా ప్రసిద్ది చెందింది. ఈ పురాణం ప్రకారం, సత్యయుగ సమయంలో ఒక విధ్వంసక తుఫాను ఉంది. ఈ తుఫాను ప్రతిదీ నాశనం చేయడం ప్రారంభించింది మరియు ప్రజలు నిస్సహాయంగా మారారు. ప్రపంచాన్ని రక్షించడానికి ఎవరూ లేరు. ఇది చూసిన విష్ణువు కూడా బాధపడ్డాడు.

శక్తి దేవత మాత్రమే ఈ సంక్షోభాన్ని పరిష్కరించగలదని చెప్పిన విష్ణువు శివుడిని ఆరాధించడం ప్రారంభించాడు.  విష్ణువు హర్దిరా సరోవర్ దగ్గర కాఠిన్యం, ప్రార్థనలు చేశాడు. శక్తి దేవత అతని భక్తితో ఆకట్టుకుంది మరియు సౌరాష్ట్ర జిల్లాలోని హరిద్రా సరస్సు సమీపంలో మహాపిత్ దేవి హృదయం ద్వారా అతని ముందు కనిపించింది.

చతుర్దశి రాత్రి, ఆమె శ్రీ బగళాముఖిగా కనిపించి, విష్ణువును వరం తో ఆశీర్వదించారు. అందువల్ల, విధ్వంసక తుఫాను చివరకు ఆగిపోతుంది. శ్రీ బగళాముఖిని బీర్ రతి అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఆమె బ్రహ్మ భగవంతుడి ఆయుధాలతో సమానం. దేవి కూడా సిద్ధ విద్య యొక్క ఒక రూపం.  ఆమెను తాంత్రికులు కూడా పూజిస్తారు.

బగళాముఖి పూజ
బగళాముఖి జయంతి రోజున భక్తులు శ్రీ బగళముఖికి ప్రార్థనలు చేయడానికి ముందుగానే మేల్కొలపాలి. పసుపు రంగు దుస్తులను ధరించేటప్పుడు వారు దీన్ని చేయాలి. ఒక వ్యక్తి ఒంటరిగా లేదా అనుభవజ్ఞుడైన సాధనతో సాధన చేయాలి. శ్రీ బగళాముఖిని ఆరాధించడానికి, ఒక వ్యక్తి పసుపు వస్త్రంతో కప్పబడిన వేదికపై కూర్చోవాలి.  అతను తూర్పు వైపు ఉండాలి, అలాంటి వ్యక్త తన ముందు శ్రీ బగళాముఖి ఫోటో ఉండాలి.

దీని తరువాత, చేతులు కడుక్కోవాలి మరియు దీపాలను వెలిగించాలి. పసుపు బియ్యం, హరిద్రా, పసుపు పువ్వులు, దక్షిణాచీలు నిర్వహించి ప్రార్థనలు చేయాలి. ఈ పూజలో బ్రహ్మచార్య సూత్రాలను పాటించడం అవసరం. మంత్రాలను పఠించడం కోసం, పూజ యంత్రం చిక్‌పీస్ పప్పుతో తయారు చేయబడింది మరియు వెండి పాత్రపై ఉంచాలి.

బగళాముఖి పూజ
శ్రీ బ్రహ్మస్త్రా - విద్యా బగళాముఖ్య నారద రిషాయ నమ: శిర్సీ.
త్రిషుప చాంద్సే నమో ముఖే. మిస్టర్ బాగ్లముఖి దైవతాయై నామో హృదయయ్.
నా స్నేహితుడు బిజయ్ నామో గుహే స్వాహా శక్తియే నామ్: పాడియో :.
ఓం నామ్: సర్వంగం శ్రీ బాగ్లముఖి దేవతా ప్రసాద్ సిద్ధార్త్ న్యాసే కేటాయింపు :.

అప్పుడు ఈ క్రింది వాటిని పఠించాలి:

అప్రమత్తమైన శ్రీ బాగ్లముఖి సర్వదిష్ఠనం ముఖ స్తంభినీ సకల్ మనోహరిని అంబికే ఇహాగచ్ సన్నీధి కురు సర్వార్థ సాధన సాధ స్వా.

ఇప్పుడు, శ్రీ బాగళాముఖిని ఈ క్రింది విధంగా ఆరాధించవచ్చు:

సౌవర్మణన్ సంస్తితం త్రికనాణం పీతాన్షుకొల్లాసినిమ్
హేమవంగ్రుచి శశాంక్ ముకుతాన్ సచంపకశ్రాగుత్యమ్

వ్యాపాతంగి బగళాముఖి త్రిజతం శాస్తభినౌ చింతాయేత్...
శ్రీ బగళాముఖిని ఆరాధించే వ్యక్తికి అపారమైన శక్తి ఉంటుంది. సరైన రీతిలో పఠిస్తే ఈ మంత్రాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
బాగళాముఖి మంత్రాన్ని పఠించే ముందు బగళాముఖి కవాచ్ మార్గం అవసరం. 
శ్రీ బగళాముఖి శత్రువులు మరియు వాదనలపై విజయం సాధించటానికి పూజిస్తారు.

లక్ష్మీదేవి కటాక్షం కోసం - శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం కొన్ని మార్గాలను సూచిస్తున్నారు పెద్దలు

శ్రీఫలం:
పేరులోనే ‘శ్రీ’ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయని లఘునారికేళం అని కూడా అంటారు. లక్ష్మీదేవి నీటిలోనూ, ఫలాలలోనూ ఉంటుంది కాబట్టి... ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. పైగా దీన్ని నిరంతరాయంగా పూజగదిలో ఉంచుకునేందుకు కూడా వీలు ఉంటుంది కదా! ఏల్నాటిశనితో బాధపడుతున్న వారూ, వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజగదిలో కానీ, క్యాష్బాక్సులో కానీ ఉంచితే ఎనలేని విజయాలు సొంతమవుతాయంటారు.

శ్రీసూక్తం

అమ్మవారిని స్తుతిస్తూ సాగే శ్రీ సూక్తం ఈనాటిది కాదు. వీటి మూలాలు రుగ్వేదంలోనే ఉన్నాయి. శ్రీసూక్తాన్ని పఠించడం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట. అయితే ఇవి వేదమంత్రాలు కాబట్టి, వీటిని ఎవరి దగ్గరన్నా స్వరసహితంగా నేర్చుకుంటే మంచిది. అలా కుదరని పక్షంలో ఈ సూక్తం ఇంట్లో అప్పుడప్పుడూ మోగుతుండేలా చూసినా శుభప్రదమే!

శ్రీచక్రం

తంత్రవిద్యలో శ్రీచక్రం/ శ్రీయంత్రానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తొమ్మిది త్రిభుజాలతో రూపొందించే ఈ చక్రం శివశక్తుల కలయికకూ, నవనాడులకూ చిహ్నమని చెబుతారు. అంతేకాదు ఈ త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికీ ఒకో మహత్తు ఉందని అంటారు. ఈ శ్రీచక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దానినే ‘మేరు ప్రస్తారం’ అంటారు. ఈ మేరు ప్రస్తారాన్ని కానీ, శ్రీయంత్రాన్ని కానీ పూజగదిలో ఉంచితే అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయని నమ్మకం.

తామరపూలు

లక్ష్మీదేవి సముద్రమధనంలో ఆవిర్భవించిందని కదా పురాణాలు చెబుతున్నాయి! అందుకనే ఆమెను నీటికి సంబంధించిన శంఖం, గవ్వలు, తామరగింజలతో పూజిస్తే మంచిదని అంటారు. ఈ విషయంలో అంతగా స్పష్టత లేకపోయినప్పటికీ, లక్ష్మీదేవిని తామరపూలతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందన్నది పండితుల మాట. తామరపూలను నేతిలో ముంచి హోమంలో వేసినా, లక్ష్మీదేవి విగ్రహాన్ని తామరపూలతో పూజించినా శుభప్రదమే!

నేతిదీపాలు

చీకటిని అజ్ఞానానికీ, దారిద్ర్యానికీ, నిరాశకీ చిహ్నంగా భావిస్తారు. అలాంటి చీకటిని పారద్రోలే సాధనం దీపం. ఇక నేతితో చేసిన దీపం పాడిపంటలు సమృద్ధిగా కావాలన్న కోరికను సూచిస్తాయి. పాల నుంచి వెన్నను చిలికినట్లుగా, జీవితమనే మధనంలో తమకు విజయం చేకూరాలన్న కాంక్షను ప్రతిఫలిస్తాయి.

నమః సర్వ స్వరూపేచ నమః కళ్యాణదాయని
మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
మహా భోగప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి
దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే
శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణి
మహాసత్వ గుణే సంతే ధనదాయై నమోస్తుతే
శివరూపే శోవానందే కారణానంద విగ్రహే
విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతే
పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే
సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే

ధనసంపదనిచ్చే మంత్రం

కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలా స్థితా తాందేవం
తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః
(ఈ మంత్రాన్ని నిష్టగా రోజుకు 108 పర్యాయాల చొప్పున 21రోజులు జపించాలి).

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...