Friday, September 23, 2016

ఎవరి లెక్కలు వారివి ..

ఒక పాఠశాల నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులంతా పాల్గొన్నారు. 'దానికి సంబంధించిన ఫోటోలు  కావాలనుకున్న విద్యార్థులు కాపీకి 10 రూపాయలు చెల్లించి తీసుకోవచ్చు అని నోటీసు పంపండి' అని ప్రిన్సిపాల్ తో చెప్పాడు చైర్మన్. 'అలాగే సర్ !' అనేసి బయటకు వచ్చిన ప్రిన్సిపాల్ నోటీసు తయారుచేయకుండా టీచర్లను పిలచి 'కాపీ ఒక్కింటికి 20 రూపాయలు తెమ్మని చెప్పండి' అని నోటిమాటగా చెప్పాడు. 'ఓకే సర్' అని మూకుమ్మడిగా బయటకు వచ్చిన టీచర్లందరూ క్యాంటీన్లో సమావేశమయ్యారు. అనంతరం కాపీకి 40 రూపాయలు తీసుకురావల్సిందిగా ప్రతి క్లాసులో చెప్పబడింది. 'నాలుగు రూపాయలు చేసే ఫోటో కాపీకి 40 రూపాయలంట. దారుణం కదరా.' 'ప్రిన్సిపాలే నొక్కేస్తున్నాడురా' 'ఆయన మంచోడే. ఇదంతా మన టీచర్ల మూకుమ్మడి దోపిడీ' 'ఎయ్ అందరూ దొంగలే మామా' ... ప్లే గ్రౌండ్లో చాలాసేపు డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత ఎవరిళ్ళకు వారు వెళ్ళిపోయారు.  'మమ్మీ ఒక్కో కాపీకి 100 రూపాయలంట' ఇంట్లో అమ్మకు చెప్పాడు విద్యార్థి. 'ఏవండీ! కాపీకి 200 రూపాయలంట' భర్తతో చెప్పింది భార్య.  (ప్రభుత్వాలు ఏ చిన్న పని చేపట్టినా టెండరు కోట్ల రూపాయల్లో ఎందుకుంటుందో ఇప్పుడు తెలిసింది కదా. ఎవరి లెక్కలు వారివి, ఎవరి నొక్కుడు వారిది. ఎవరికి నేను నాకేది కాస్తే కదా అనుకుంటాడు. అది కాస్తా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగి ప్రజలను పాతాళానికి అణచేస్తోంది.).

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...