Friday, September 23, 2016

గ్రాట్యుటీ,పెన్షన్ అనేవి ఉద్యోగి "ఆస్తి" అని సుప్రీం వ్యాఖ్య

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన  జితేంద్ర కుమార్‌ శ్రీవాత్సవ అనే రిటైర్డు ఉద్యోగి తనకు రావాల్సిన పెన్షన్‌,గ్రాట్యుటీ విషయంపై హైకోర్టుకు వెళ్ళగా ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ జార్ఖండ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ జస్టీస్‌ కె.ఎస్‌.రాధాకృష్ణన్‌మరియు జస్టీస్‌ ఎ.కె. సిక్రీతో కూడిన ధర్మాసనం 20-08-2013 రోజున ఈ విధంగా స్పష్టం చేసింది...

పెన్షన్,గ్రాట్యుటీ అనేవి ఒక ఉద్యోగి శ్రమతో కూడబెట్టుకున్న 'ఆస్తి' లాంటివి...

ఈ'ఆస్తి'హక్కును లాగేసుకోవడం రాజ్యంగంలోని 300(ఎ) అధికరణకు విరుద్ధం...

 "ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే కాగలదని,ఉద్యోగి పెన్షన్‌,గ్రాట్యుటీని నిలిపివేసే హక్కు ప్రభుత్వానికి లేదని ఇవి దాతృత్వంతో ఇచ్చే ప్రయోజనాలు కావని,ఒక ఉద్యోగి అంకిత భావంతో నిరంతరం శ్రమించి కూడ బెట్టుకొన్న ఆస్తి'' అని జస్టీస్‌ కె.ఎస్‌.రాధాకృష్ణన్‌,జస్టీస్‌ ఎ.కె.సిక్రీతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...