Friday, September 23, 2016

అమరావతి కుంభకోణం

అమరావతి నిర్మాణంలో ఆధారాలతో సహా బట్టబయలైన భారీ కుంభకోణ................
 — అమరావతి తాత్కాలిక రాజధాని నిర్మాణం .

కుంభకోణం విలువ – కనీసం 550 కోట్లు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలని వెనక్కి నెట్టి కేవలం రెండేళ్లలో అవినీతిలో మన రాష్ట్రం నెంబర వన్ ఎలా అయిందో తెలుసు కోవాలనుందా! అయితే జాగ్రత్తగా ఈ కుంభకోణం గురించి చదవండి.

కట్టేది తాత్కాలిక రాజధాని అయినా, దోపిడీ మాత్రం నిత్య నూతనంగా, బరితెగింపుకి పరాకాష్టగా జరుగుతుంది. తాత్కాలిక రాజధాని నిర్మాణం ఆలోచన వచ్చినప్పటి నుండి, స్థలాలని ఎంపిక వరకు, కాంట్రాక్టర్లని నిర్ణయించటం నుండి నిధుల విడుదల వరకు మొత్తం అవినీతి మయం. సర్వం బినామీ కంపనీలకి దోచి పెడుతున్న వైనం మీరే చూడండి.

ముందుగా ఇప్పుడు ఉన్న ధరల ప్రకారం రాష్ట్రంలో కాని దేశంలో కాని నిర్మాణ ఖర్చులు చూద్దాం. ఈ రోజుకి మార్కెట్ ధరలు ప్రకారం చదరపు అడుగు నిర్మాణానికి 1100 రూపాయల నుండి 1500 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. బాగా క్వాలిటీతో కట్టే అపార్ట్మెంట్లు కూడా 1500 కావటం లేదు (కేవలం నిర్మాణ ఖర్చులు మాత్రమె, స్థలం కాదు). స్థలంతో కలుపుకొంటే రాష్ట్రంలో అత్యధిక డిమాండ్ ఉన్న విజయవాడ, గుంటూరు, ఆఖరికి హైదేరాబద్లో కూడా అపార్ట్మెంట్ ధరలు చరుపు అడుగు (sft ) కి 3500 నుండి 4000 వరకు ఉన్నాయి. అనగా స్థలం 1500 + నిర్మాణం 1500 + లాభం 1000. ఇది 1000 sft ఉన్న single bed room 40 లక్షల లెక్క ప్రకారం వేసుకొంటే. ఇది కూడా మనం అత్యధిక ధర వేసుకొని లాభం తగ్గించుకొంటే (అపార్ట్మెంట్లు కట్టించిన వాళ్లకి, కొన్న వాళ్లకి ఈ లెక్కలు సులభంగా అర్థం అవుతాయి). కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది కట్టేది ఇల్లు కాదు పెద్ద పెద్ద ఆఫీసులు నిర్మాణం, ఇంటికి ఉండాల్సిన హంగులు ఉండవు, చుట్టూ గోడలు పెట్టి వదిలేస్తారు (5 బిల్డింగ్లు 5 అంతస్తులు). ఇంటితో పోల్చుకొంటే ఆఫీస్ నిర్మాణం ఇంకా చాలా తక్కువ కావాలి. దానికి తోడూ నిర్మాణానికి కావాల్సిన ఇసుక ఉచితం, కరెంటు ఉచితం, నీళ్ళు ఉచితం, రోడ్లు, డ్రైనేజీ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొంది, నిర్మాణ సంస్థకి ఎటువంటి సంభంధం లేదు.

మనం రాష్ట్రంలో ఉన్న అత్యధిక ధర ప్రకారమే లెక్క వేసుకొందాము. ఇప్పుడు చదరపు అడుగుకి 1500 నిర్మాణానికి ప్రభుత్వం లెక్క గట్టింది అనుకొందాము. మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం, స్థలం కాంట్రాక్టర్ కి ఉచితంగా ప్రభుత్వం సమకూర్చింది. కాబట్టి కాంట్రాక్టర్ చేయవలసింది కేవలం నిర్మాణం మాత్రమే.

1 చదరపు అడుగు నిర్మాణానికి (sft) = 1500 అనుకొందాము, ఇది కూడా అన్ని ఉచితాలని దృష్టిలో పెట్టుకొని కూడా అత్యధిక ధరలు వేసుకొంటే….

ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే, కాంట్రాక్టర్ కి ఉచితంగా నిర్మాణానికి అవసరం అయ్యే ఇసుక, కరెంటు, నీళ్ళు ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. వాటికి కాంట్రాక్టర్ నయా పైసా చెల్లించాల్సిన పనిలేదు. అంతేకాదు, ఆ భవనాలకి కావాల్సిన డ్రైనేజీ, రోడ్లు మొత్తం కూడా ప్రభుత్వంమే సమకూరుస్తుంది. నిజానికి అపర్ట్మెంట్లు కాని, షాపింగ్ కాంప్లెక్స్ కట్టే బిల్డర్స్ కి అవి అన్ని ఉచితంగా రావు, వారు పైన మనం వేసుకొన్న 1500 ధరలోనే అవి అన్ని కలిసి ఉంటాయి. అవి అన్ని కలిస్తేనే అదీ అన్ని ధరలు ఎక్కువ ఎక్కువ వేసుకొంటేనే 1500 అవుతుంది. అన్ని ఉచితాలని లెక్కలోకి తీసుకొంటే నిర్మాణ వ్యయం 1100 రూపాయలకి మించదు, అయినా కూడా మనం 1500 లెక్క వేసుకొందాం.

ఇప్పుడు అసలు మొత్తం ఎంత స్థలంలో నిర్మాణం చేస్తున్నారు, ఎన్ని బిల్డింగ్లు కడుతున్నారు, ఎంత మొత్తం కేటాయించారో చూద్దాం. ఇక్కడ ఉన్న అంకెలు లెక్కలు అన్నీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలలో ఉన్నవే, ఫోటోలలో చూడండి .

తాత్కాలిక రాజధానికి రెండు విడతలలో రెండు జీవోలు ఇచ్చారు. మొదటి జీవో ప్రకారం నిర్మాణ వ్యయం 180 కోట్లు, నిర్మాణ విస్తీర్ణం 58,655 sqm (స్క్వేర్ మీటర్లు). మొదటిసారి ఇచ్చిన జీవో కి అదనంగా మళ్ళీ రెండో సారీ ఇచ్చిన జీవో ప్రకారం నిర్మాణ వ్యయం 570 కోట్లు, నిర్మాణ విస్తీర్ణం 69,988 sqm. రెండు జీవోలని కలిపి మొత్తం ప్రభుత్వ విడుదల చేసిన నిధులు అక్షరాల 750 కోట్లు.

మొత్తం స్థలం – 58655 + 69988 = 128644 sqm (స్క్వేర్ మీటర్లు)

ఒక sqm (స్క్వేర్ మీటర్) = 10.7 sqf (చదరపు అడుగులు)

అంటే మొత్తం నిర్మాణ స్థలం 128644×10.7 = 1376490 చదరపు అడుగులు.

మొత్తం నిధులు 180 కోట్లు + 570 కోట్లు = 750 కోట్లు.

ఇప్పుడు చదరపు అడుగుకి ఎంత పడిందో చూద్దాం.

750 కోట్లు ÷ 1376490 చదరపు అడుగులు, అనగా

7500000000 ÷ 1376490 = 5448 రూపాయలు.

ఈ లెక్క ప్రకారం ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి ప్రభుత్వం చెల్లించే ధర అక్షరాల 5448 రూపాయలు. ఇది కేవలం నిర్మానానికి మాత్రమే, స్థలం ప్రభుత్వానిదే.

మనం పైన చెప్పుకొన్న మార్కెట్ ధరల ప్రకారం అత్యధికంగా వేసుకొంటేనే చదరపు అడుగు నిర్మాణానికి 1500 అవుతుంది, అదీ బిల్డర్ లాభంతో కలుపుకొని.

దాని ప్రకారం చూసుకొంటే

1376490 × 1500 = 2064735000 అనగా అక్షరాల 206 కోట్లు.

మార్కెట్లో ఇప్పుడున్న అత్యధిక ధరల ప్రకారం చూసుకొన్న ఎట్టి పరిస్థితులలో కూడా లాభాలతో కలుపుకొని కూడా 200 కోట్లకి మించదు. 200 కోట్లు విలువ చేసే పనికి ప్రభుత్వం ఇచ్చినది అక్షరాల 750 కోట్లు. అనగా దోపిడీ 550 కోట్లు.

ఈ కాంట్రాక్టు ఇచ్చింది ఎవరికో కాదు, చంద్రబాబు జేబు సంస్థ అయినా ఎల్ అండ్ టీ మరియు తన బినామీ కంపెనీ అయిన షాపూరజీ కంపెనీకి. గతంలో హైటెక్ సిటీ నిర్మాణం కూడా ఎల్ అండ్ టి కే ఇచ్చాడు, అప్పుడు కూడా ఇలానే అంచనాలు పెంచి ఇచ్చాడు, దానికి ప్రతిఫలంగా హైద్రాబాద్లో 300 కోట్లు విలువ చేసే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉచితంగా ఎల్ అండ్ టీ నిర్మాణం చేసి ఇచ్చింది. అలాంటి క్విడ్ ప్రో కో లో భాగంగానే ఈసారి కూడా అదే పద్దతిలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లు నిర్మాణాలు మొదలు పెట్టబోతున్నారు. దానికోసమే జీవో జారీ చేసి రాజధానిలో 4 ఎకరాలు, ప్రతిజిల్లాకి 2 ఎకరాలు, అనగా మొత్తం 30 ఎకరాలు టీడీపీ కి కేటాయిస్తూ చంద్రబాబు జీవో ఇచ్చాడు. ఇప్పుడు ఒప్పందంలో భాగంగా అన్ని జిల్లాలలో ఎల్ అండ్ టీ వాళ్ళు ఉచితంగా పార్టీ ఆఫీస్లు కట్టి ఇవ్వాలి.

మొత్తం మిగిలిన 550 కోట్లలో 450 కోట్లు చినబాబుకి పోగా, మిగిలిన 100 కోట్లతో పార్టీ ఆఫీసులు నిర్మాణం చేయాలి అదీ చంద్రబాబు స్కెచ్.

పైన చెప్పిన అన్ని లెక్కలకి , అంకెలకి స్వయంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోలే ఆధారం .

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...