Thursday, April 25, 2019

శ్రీ గురుసూక్తము



శ్రీ గురుగీత, అద్వయ తారకో పనిషత్, యోగశిఖోపనిషత్, గోపాలపూర్వతాపిన్యుపనిషత్, వివేకచూడామణి, మొదలైన గ్రంధములు , వాటిలో గురువులకు సంబంధిచిన స్తోత్రములు, శ్లోకములు. గురుపరంపర ఆశీర్వచనము ఈ "శ్రీ గురుసూక్తము".


"శ్రీ గురు సూక్తము"
((((((((((0))))))))))

ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయా క్లిష్టకారిణే||
 నమోవేదాంతవేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే||


ఓంనమోబ్రహ్మాదిభ్యో, బ్రహ్మవిద్యాసంప్రదాయకర్తృభ్యో||

 వంశఋషిభ్యో మహాద్భ్యో నమో గురుభ్యః||


ఓం నమో ప్రణవార్ధాయ, శుద్ధజ్ఞానైకమూర్తయే||

 నిర్మలాయ ప్రశాన్తాయ దక్షిణామూర్తయే నమః||


ఓం హయాస్యాద్య వతారైస్తు జ్ఞానసిద్ధా మునీశ్వరాః||
 కృతార్ధతాంగతాస్తాంవై నారాయణ ముపాస్మహే||

           
  ఓం వేదతత్త్వైర్మహావాక్యైర్వసిష్ఠాద్యామహార్షయః||

 చతుర్భిశ్చతురాసన్ తంవై పద్మభువం భజే||


ఓం బ్రహ్మర్షిర్బ్రహ్మ విద్వర్యో బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియః||

 తపస్వీ తత్త్వవిద్యస్తు తం వసిష్ఠం భజేన్వహం||


 ఓంయోగజ్ఞం యోగినావర్యం బ్రహ్మజ్ఞాన విభూషితం||

 శ్రీమద్వశిష్ఠ
తనయం శక్తిం వందే మహామునియే||


ఓం ధర్మజ్ఞంధార్మికం ధీరం ధర్మాత్మా నందయానిధిం||

 ధర్మశాస్త్ర ప్రవక్తారం పరాశర మునింభజే||


 ఓం కృష్ణ ద్వైపాయనం వ్యాసం సర్వలోకహితేరతం||

 వేదాబ్జభాస్కరం వందేశమాదినిలయం మునిం||


ఓం పరాశరపౌత్రం శ్రీవ్యాసపుత్రమకల్మషం||

 నిత్యవైరాగ్య సంపన్నం జీవన్ముక్తమ్ శుకంభజే||


 ఓం మాండూక్య కారికాకర్తా యోభాతి బ్రహ్మవిద్వరః||

 శ్రీగౌడపాదాచార్యం తం ప్రణమామి ముహుర్ముహుః||


ఓం యోగీశ్వరం వేదచూడం వేదాంతార్ధనిధిం||

మునిం గోవింద భగవత్పాదాచార్యవర్య ముపాస్మహే ||


ఓం హరలీలా వతారాయ శంకరాయపరౌజసే||

 కైవల్యకలనా కల్పతరవే గురవేనమః||


ఓం బ్రాహ్మణే మూర్తిమతే శృతానాం శుద్ధిహేతవే||
 నారాయణయతీన్ద్రాయ తస్మై గురవేనమః||   

              సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం||

 అస్మదాచార్య
పర్యంతం వందేగురు పరంపరాం||


ఓం సచ్చిదానంద రూపాయ శివాయపరమాత్మనే||

 నమో వేదాంత వేద్యాయ గురవేబుద్ధిసాక్షిణే||


 ఓం నిత్యానందైక కందాయ నిర్మలాయచిదాత్మనే||

 జ్ఞానోత్తమాయ
గురవే సాక్షిణే బ్రాహ్మణేనమః|| 


 గూఢావిద్యా జగన్మాయా దేహశ్చాజ్ఞాన సంభవః||

 విజ్ఞానం యత్ప్రసాదేన గురుశబ్దేనకథ్యతే||


 స్వదేశికస్వైవచ నామకీర్తనమ్ భవేదంతస్య శివస్యకీర్తనమ్||

 స్వదేశికస్వైవచ నామచింతనం భవేదంతస్య శివస్యచింతనం||


 కాశిక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం||

 గురుర్విశ్వేశ్వరః సాక్షాత్ తారకం బ్రహ్మనిశ్చయః||


 గురుసేవా గయాప్రోక్తా దేహసాక్షా దక్షయోవటః||

 తత్పాదం విష్ణుపాదంస్యాత్ తత్ర దత్తమచస్తతం||


 స్వాశ్రమంచ స్వజాతించ స్వకీర్తిమ్ పుష్ఠివర్ధనం||

 ఏతత్సర్వం పరిత్యజ్య గురురేవ సమాశ్రయేత్||


 గురువక్త్రే  స్థితావిద్యా గురుభక్త్యాచ లభ్యతే||

 త్రైలోక్యేస్ఫుటవక్తారో దేవర్షిపితృమానవాః||


 గుకారశ్చగుణాతీతో రూపాతీతోరుకారకః||

 గుణరూప విహీనత్వాత్ గురురిత్యభిధేయతే||


 గుకారః ప్రధమవర్ణో మాయాదిగుణ భాసకః||

రుకార్యోస్తి పరంబ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం||


              సర్వశృతి శిరోరత్న విరాజిత పదాంబుజం||

 వేదానార్ధ ప్రవక్తారం తస్మాత్ సంపూజయేత్ గురుమ్||


యస్య స్మరణమాత్రేణ జ్ఞానముత్పద్యతేస్వయం||

సః ఏవ సర్వ సమ్పత్తిః తస్మాత్ సంపూజయేత్ గురుమ్||

 సంసారవృక్షమారూఢాః పతన్తినరకార్ణవే||

 యస్తానుద్ధరతే సర్వాన్ తస్మై శ్రీగురవేనమః||


 ఏకఏవ పరోబంధుర్విషయే సముపస్థితే||

 గురుః సకలధర్మాత్మా తస్మై శ్రీగురవేనమః||


 భవారణ్య ప్రవిష్టస్య దిఙ్మోహభ్రాంత
చేతసః||

యేన సందర్శిత పంథాః తస్మై శ్రీగురవేనమః||



 తాపత్రయాగ్ని
తప్తానాం అశాంత ప్రాణినాం భువి||

 గురురేవ పరాగంగా తస్మై శ్రీగురవేనమః||


 శివేరుష్టే గురుత్రాతా గురౌరుష్టే నకశ్చినః||

 లబ్ద్వాకులగురుం సమ్యక్ గురుమేవ సమాశ్రయేత్||


 అత్రినేత్రశివః సాక్షాత్ ద్విబాహుశ్చహరిః||

స్మ్రుతః యో-చతుర్వదనో బ్రహ్మ శ్రీగురుః కధితప్రియే||


 నిత్యంబ్రహ్మ నిరాకారం నిర్గుణం బోధయేత్ పరమ్||

 భాసయన్ బ్రహ్మభావంచ దీపోదీపాన్తరం యథా||

           
గురోర్ ధ్యానే నైవనిత్యం దేహీబ్రహ్మమయో
భవేత్||

 స్థితశ్చ యత్రకుత్రాపి ముక్తాసౌనాత్రిసంశయః||

 జ్ఞానంవైరాగ్యమైశ్వర్యం యశఃశ్రీః సముదాహృతం||

 షడ్గుణైశ్వర్య యుక్తోహి భగవాన్ శ్రీగురుః ప్రియే||


గురుః శివో గురుః దేవో గురుర్బన్ధుః శరీరిణామ్||

 గురురాత్మా గురుర్జీవో గురోరన్యన్నవిద్యతే||


 యతః పరమకైవల్యం గురుమార్గేణ వైభవేత్||

గురుభక్తి రతిః
కార్యాః సర్వదా మోక్షకాంక్షిభిః||


 గురుర్దేవో గురుర్ధర్మో గురౌనిష్టా పరంతపః||

 గురోః పరతరం
నాస్తి త్రివారం కధయామితే||


         నమో నమస్తే గురవే మహాత్మనే విముక్తసఙ్గాయ సదుత్తమాయ||

 నిత్యాద్వయానంద రసస్వరూపిణే భూమ్నే సదా--పార దయామ్బుదామ్నే||


 శిష్యాణామ్ జ్ఞానదానాయ లీలయాదేహధారిణే||

 సదేహోసి విదేహాయ తస్మై శ్రీగురవేనమః||


 రాగద్వేషవినుర్ముక్తః కృపయాచ  సమన్విత||

 సమయానాంచ సర్వేషాం జ్ఞానసార పరిగ్రహీ||


 గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ సదాచ్యుతః||

 న గురోరధికం కశ్చిత్రిషులోకేషు విద్యతే||


 దివ్యజ్ఞానోపదేష్టారం దేశికం పరమేశ్వరం||

 పూజయాత్పరయా భక్త్యా తస్యజ్ఞాన ఫలంభవేత్||

   
  గురురేవపరబ్రహ్మ గురురేవపరాగతిః||

 గురురేవ పరావిద్యా గురురేవ పరాయణం||

 గురురేవ పరాకాష్ఠా గురురేవ పరంధనం||

 యస్మాత్తదుపదేష్టా సౌ తస్మాత్గురు తరోగురుః||


గురుభావపరంతీర్థం మన్యతీర్థం నిరర్థకం||

 సర్వతీర్థమయందేవి శ్రీగురోశ్చరణామ్బుజం||


సప్తసాగరపర్యంతం తీర్థస్నానఫలంతుయాత్||

గురుపాద పయోబంధోః సహస్రాంశేన తత్ఫలం||


శోషణం పాపపంకస్య దీపనమ్ జ్ఞాన తేజసః||

గురోఃపాదోదకం సమ్యక్ సంసారార్ణవ తారకం||

            "అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారకం||

 జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం గురు పాదోదకం పిబేత్"
 
                                      "ఇతి సంకలిత 'శ్రీ గురుసూక్తం' సమాప్తం"
                                                            "ఓం శాంతిః శాంతిః శాంతిః"


"శ్రీ గురుసూక్తం -- తాత్పర్యం"

    ఓం సచ్చిదానందరూపుడు, అక్లిష్టకారి, వేదాంతవేద్యుడు, బుద్ధిసాక్షి, జగద్గురువగు శ్రీకృష్ణునకు నమస్కారము. ప్రణవార్థ స్వరూపుడును, శుద్ధజ్ఞానైకమూర్తియు, నిర్మలుడును, ప్రశాన్తుడును నగు దక్షిణామూర్తికి నమస్కారము. ఎవని హయగీతాద్యవతారములచే మునీశ్వరులు జ్ఞానసిద్ధిని బడసి కృతార్థులైనారో అట్టి శ్రీమన్నారాయణుని మేముపాసించెదము. చతుర్వేదతత్త్వముల చేతను, మహా వాక్యముల చేతను వసిష్ఠాదిమహర్షులు ఎవనివలన విజ్ఞానచాతుర్యము బడసిరో అట్టి పద్మజుడగు బ్రహ్మదేవుని నేను భజించెదను. బ్రహ్మర్షియు, బ్రహ్మ విద్వరుడును, బ్రహ్మణ్యుడును, బ్రహ్మజ్ఞ ప్రియుడును నగు వసిష్ఠమహర్షిని నిరంతరమూ నేను ధ్యానించెదను. యోగజ్ఞుడును, యోగులలో నుత్తముడును బ్రహ్మజ్ఞానవిభూషితుడును, శ్రీవశిష్ఠమునీన్ద్రునికొమరుడునగు శ్రీశక్తి మహామునికి నమస్కారము.  ధర్మజ్ఞుడును, ధార్మికబుద్ధి కలవాడును, ధీరుడును, ధర్మాత్ముడును, దయానిధియు, ధర్మశాస్త్రముల లెస్సగా వచించు వాడునునగు పరాశరుని గొల్చెదను. శ్రీకృష్ణద్వైపాయనుడును, సర్వలోకహితమునుకూర్చి ఆనందించువాడును, వేదపద్మములకు సూర్యునివంటివాడు, శమాదులకు నిలయమైనవాడును, మునియునగు శ్రీవ్యాసమహర్షులకు నమస్క రించు చున్నాను. శ్రీపరాశరుని పౌత్రుడును, శ్రీవ్యాసమహర్షిపుత్రుడును, అకలుషుడును, నిత్యవైరాగ్యసంపన్నుడును, జీవన్ముక్తుడు ను నగు శ్రీశుకమహర్షిని భజించెదను. మాండూక్యకారికల రచించినవాడును, బ్రహ్మవిద్వరుడై భాసిల్లు వాడునునగు శ్రీగౌడపాదాచార్యుని మాటిమాటికిని మ్రొక్కెదను.యోగీశ్వరుడును, వేదవిభూషణుడును, వేదాంతార్థ నిలయుడును, మునీన్ద్రుడును, ఉత్తముడునగు శ్రీ గోవిందభగవత్పాదాచార్యుని ధ్యానించు చున్నాము. పరమేశ్వరుని లీలావతారుడును, మహాశక్తి యుతుడును, మోక్షమొసంగుట యందు కల్పవృక్షము వంటివాడునునగు శ్రీ శంకర భగవత్పాదాచార్య గురువులకు నమస్కారము. మూర్తీ భవించిన బ్రహ్మస్వరూపుడును, శాస్త్రములశుద్ధికి కారణ భూతుడును, యతీన్ద్రుడునునగు శ్రీనారాయణ గురువునకు నమస్కారము. శ్రీదక్షిణామూర్తులైన సదాశివునితో ప్రారంభమై, మధ్యమమున  శ్రీశంకరాచార్య  భగవత్పాదులతో కూడియుండి, మా సద్గురువులవరకు విస్తరించియున్న శ్రీగురు పరంపరకు నమస్కరించు చున్నాము. సచ్చిదానందస్వరూపుడును, శివుడును, పరమాత్మ రూపుడును, వేదాంత వేద్యుడును, బుద్ధిసాక్షియునగు గురుదేవునకు వందనము. నిత్యానందైక స్వరూపుడును, నిర్మలుడును, చిదాత్మ స్వరూపుడును, ఉత్తమజ్ఞానమూర్తియు సాక్షియు, బ్రహ్మ స్వరూపుడును నగు గురువునకు నమస్కారము. 


           జగత్తు గూఢమైన, అవిద్యాత్మకమైన మాయారూపము మరియు శరీరము అజ్ఞానము నుండి ఉత్పన్నమైనది. దీనికి సంబంధించిన జ్ఞానము ఎవరివలన కలుగునో వారిని 'గురు' అను శబ్దముతో వ్యవహరిస్తారు. గురుదేవుని నామకీర్తనమే అనంతస్వరూపుడైన శివభగవానుని కీర్తనము. గురుదేవుని యొక్క నామచిన్తనమే  అనంతస్వరూపుడైన శివభగవానుని యొక్క చింతనము. గురుదేవుని నివాస స్థలమే కాశిక్షేత్రము. గురుదేవుని పాదోదకమే పవిత్రగంగానది. శ్రీగురుదేవుడే విశ్వేశ్వరుడు. మనియు నిశ్చయముగా సాక్షాత్తు తారకబ్రహ్మ గురువే. గురుసేవయే పుణ్యక్షేత్రమైన గయ. గురుదేవుని శరీరమే కోరిన కోరికల నిచ్చే అక్షయవటవృక్షము. గురుపాదము విష్ణుభగవానుని శ్రీచరణము. అందు నిమగ్నమైన మనస్సుకూడా అదేస్థితిని పొందును. బ్రహ్మచర్యగృహస్థాది ఆశ్రమములు, జాతిని, కీర్తిని, పాలన, పోషణ, మొదలగువన్నియు విడచిపెట్టి శ్రీగురుదేవునే ఆశ్రయించ వలయును.


        శ్రీగురుదేవుని యందున్న విద్య గురుభక్తి వలననే లభించును. ఈమాట ముల్లోకములయందును దేవతలచే, ఋషులచే, మానవులచే స్పష్టముగా చెప్పబడుచున్నది. 'గు' కారమునకు గుణముల కతీతుడనియు, 'రు' కారమునకు రూపమున కతీతుడనియు, గుణ రూపములు రెండునూ లేనందున 'గురు' వనియు చెప్పబడుచున్నది. గురుశబ్దములో మొదటిదగు 'గు'కారమునకు

 మాయాది గుణములతో కూడియున్నదనియు, 'రు'కారమునకు మయాభ్రాంతిని తొలగించే పరబ్రహ్మమనియు భావము.

      సర్వశృతిరూపములైన శ్రేష్ఠరత్నములచే విలసిల్లు చరణకమలములు కలవాడును, వేదాంతముల యొక్క అర్థమును చెప్పేవాడు కనుక గురువును పూజింపవలయును. ఎవరిని స్మరించినంత మాత్రముననే తనంతతానుగా జ్ఞానము కలుగుతుందో అతడే సర్వసంపదల స్వరూపము. అందువలన గురుదేవుని బాగుగా పూజింపవలయును. సంసారమనే చెట్టునెక్కి, నరకమనే సముద్రములో పడుచున్నవారినందరినీ ఉద్ధరించునట్టి గురుదేవునకు నమస్కారము.  ఏదైనా విషమపరిస్థితి ఎదురై నప్పుడు గురువు ఒక్కరే పరమబంధువై మనలను కాపాడును. సర్వధర్మముల ఆత్మస్వరూపము గురుదేవుడే. అట్టి గురుదేవునికి నమస్కారము. ఇహలోకమనెడి అరణ్యములో ప్రవేశించి దిక్కు తెలియని చిత్తభ్రమ కలిగినస్థితిలో మనకు దారిచూపించునట్టి గురుదేవునకు నమస్కారము.  ఈభూమి పై తాపత్రయము అను మూడువిధములైన అగ్నులలో కాలుచూ, శాంతి లేని ప్రాణులకు ఉత్తమగంగ వంటి గురుదేవునకు నమస్కారము. ఒకవేళ శివుడు కోపించినచో గురువు రక్షిస్తాడు. గురువే కోపించిన ఇక ఎవ్వరూ రక్షింపలేరు. కావున మంచి గురువును పొంది చక్కగా ఆగురువునే ఆశ్రయింపుము. మూడుకన్నులు లేని సాక్షాత్తు శివుడు, రెండుచేతులు గల విష్ణువు, నాలుగుముఖములు లేని బ్రహ్మ దేవుడు శ్రీగురుదేవుడే అని తెలియవలెను. గురువు అనబడు వారు సదాబ్రహ్మలు, నిరాకారులు, నిర్గుణులు. వారు పరమును బోధించుదురు. బ్రహ్మభావముతో, ఒకదీపముతో వేరొకదీపము వెలిగించు నట్లుగా శిష్యులలో బ్రహ్మభావమును ప్రకటించుచుందురు.


       సదా గురుదేవుని ధ్యానించు జీవుడు బ్రహ్మమయుడు అగుచున్నాడు. అట్టివాడు ఎక్కడ ఉన్ననూ ముక్తుడే అనుటలో సందేహము లేదు. భగవత్స్వరూపుడగు గురుదేవుడు జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, యశము, సంపద, మధురవాణి అను ఆరుగుణములచే కూడి యుండును. శరీరధారులకు గురువే శివుడు. గురువే దేవుడు. గురువే బంధువు. గురువుయందు నిష్ఠతో నుండుటయే పరమ తపస్సు. గురువును మించినదేదియూ లేదు. దీనిని ముమ్మారు చెప్పుచున్నాను. సత్పురుషులలో నుత్తముడును, సర్వదా అంతములేని దయకు సముద్రుడును, సకల బంధములు త్రెంపి అసంగుడు, నిర్లిప్తుడు నైన వాడును, నిత్యుడును, అద్వయుడును, ఆనందరసస్వరూపియునైన వాడును, భూమి పైన పరబ్రహ్మస్వరూపుడైన వాడునునైన మీకు(గురువునకు) నమస్కారము. శిష్యులకు జ్ఞానమొసంగుటకు లీలగా దేహము ధరించిన వాడును, దేహముతో నున్ననూ, విదేహమగు పర బ్రహ్మములో నుండునట్టి గురుదేవునకు నమస్కారము. రాగద్వేషములు లేనివాడుగను, కారణము నుద్దేశించకనే దయాసాగరుండును, సమస్త శాస్త్రములలోని జ్ఞానసారమెరింగిన వాడునునై  శ్రీ గురు దేవుడుండును.
   
     
       గురువే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమును చేరు త్రోవ గురువే. ఆ చేరుటకు కావలిసిన జ్ఞానము గురువే.  ఆ చేరుట అనే ప్రక్రియ కూడా గురువే.  దానికి కావలసిన సాధనసంపత్తి కూడా గురువే.  చిట్ట చివరికి ఏదైనా మిగిలియుంటుం దంటే అది గురువే.  ఈ విధముగా ఉపదేశికులైన మీరు గురువులలో కెల్ల సద్గురువులు.  గురుభావమే శ్రేష్టమైన పుణ్యక్షేత్రము. ఇతర క్షేత్రములు నిరర్థకములు. శ్రీగురుదేవుని చరణామ్బుజములు సర్వతీర్థమయము. ఏడు సముద్రముల వరకూగల అన్ని పుణ్యతీర్థములందునూ స్నానము చేయుటవలన ఎట్టిఫలము కలుగుచున్నదో, అది గురుపాద జలము లోని ఒక్క బిందువులో వెయ్యవ భాగమునకుసమానము. శ్రీ గురుదేవుల యొక్క పదామృతము పాప పంకిలము తొలగించునది. జ్ఞానతేజమును పెంపొందింపజేయునది మరియు సంసార సాగరమును దాటించునట్టిది.


       అజ్ఞానమును పెకలించివేయునదియును, అనేక జన్మల కర్మను నివారించునదియు అగు గురుపాదోదకమును జ్ఞానవైరాగ్యములు సిద్ధించుట కొరకు పానము చేయవలెను.
                                      "శ్రీ గురుసూక్తము" అను సంకలనము సమాప్తము.

Tuesday, April 23, 2019

పంచపునీతాలు


1) వాక్ శుద్ధి
2) దేహ శుద్ధి
3) భాండ శుద్ధి
4) కర్మ శుద్ధి
5) మనశ్శుద్ధి

1) వాక్ శుద్ధి :

వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు .... కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు .... పగ , కసి , ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు .... మంచిగా , నెమ్మదిగా , ఆదరణతో పలకరించాలి .... అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి ....

2) దేహ శుద్ధి :

మన శరీరం దేవుని ఆలయం వంటిది .... దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , రెండు పూటలా స్నానం చెయ్యాలి .... చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు ....

3) భాండ శుద్ధి :

శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం .... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి .... స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది ....

4) కర్మ శుద్ధి :

అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు .... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు .... తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు ....

5) మనశ్శుద్ధి :

మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి .... మనస్సు చంచలమైనది .... ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది .... దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి .... దీని వల్ల దుఃఖం చేకూరుతుంది .... కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి ...

పతంజలి మహర్షి రచించిన అత్యద్భుత స్తోత్రం

9 శ్లోకాలు లో 108 శివనామాలు కలిగిన పతంజలి మహర్షి రచించిన అత్యద్భుత స్తోత్రం. ఇప్పటికీ చిదంబరంలోని నటరాజ స్వామికి ఈ నామాలతోటి అర్చన జరుగుతుంది.
ప్రతి రోజూ ప్రదోష సమయంలో చదువుకోవాల్సిన స్తోత్రం.


సదంచిత-ముదంచిత నికుంచిత పదం ఝలఝలం-చలిత మంజు కటకం |

పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జనన భంజన కరమ్ |

కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబ కవిడంబక గళమ్

చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ || ౧ ||
హరం త్రిపుర భంజన-మనంతకృతకంకణ-మఖండదయ-మంతరహితం

విరించిసురసంహతిపురంధర విచింతితపదం తరుణచంద్రమకుటమ్ |

పరం పద విఖండితయమం భసిత మండితతనుం మదనవంచన పరం

చిరంతనమముం ప్రణవసంచితనిధిం పర చిదంబర నటం హృది భజ || ౨ ||
అవంతమఖిలం జగదభంగ గుణతుంగమమతం ధృతవిధుం సురసరిత్-

తరంగ నికురుంబ ధృతి లంపట జటం శమనదంభసుహరం భవహరమ్ |

శివం దశదిగంతర విజృంభితకరం కరళసన్మృగశిశుం పశుపతిం

హరం శశిధనంజయపతంగనయనం పర చిదంబర నటం హృది భజ || ౩ ||
అనంతనవరత్నవిలసత్కటకకింకిణిఝలం ఝలఝలం ఝలరవం

ముకుందవిధి హస్తగతమద్దల లయధ్వనిధిమిద్ధిమిత నర్తన పదమ్ |

శకుంతరథ బర్హిరథ నందిముఖ భృంగిరిటిసంఘనికటం భయహరమ్

సనంద సనక ప్రముఖ వందిత పదం పర చిదంబర నటం హృది భజ || ౪ ||
అనంతమహసం త్రిదశవంద్య చరణం ముని హృదంతర వసంతమమలమ్

కబంధ వియదింద్వవని గంధవహ వహ్నిమఖ బంధురవిమంజు వపుషమ్ |

అనంతవిభవం త్రిజగదంతర మణిం త్రినయనం త్రిపుర ఖండన పరమ్

సనంద ముని వందిత పదం సకరుణం పర చిదంబర నటం హృది భజ || ౫ ||
అచింత్యమళివృంద రుచి బంధురగళం కురిత కుంద నికురుంబ ధవళమ్

ముకుంద సుర వృంద బల హంతృ కృత వందన లసంతమహికుండల ధరమ్ |

అకంపమనుకంపిత రతిం సుజన మంగళనిధిం గజహరం పశుపతిమ్

ధనంజయ నుతం ప్రణత రంజనపరం పర చిదంబర నటం హృది భజ || ౬ ||
పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖమముం

మృడం కనక పింగళ జటం సనక పంకజ రవిం సుమనసం హిమరుచిమ్ |

అసంఘమనసం జలధి జన్మకరలం కవలయంత మతులం గుణనిధిమ్

సనంద వరదం శమితమిందు వదనం పర చిదంబర నటం హృది భజ || ౭ ||
అజం క్షితిరథం భుజంగపుంగవగుణం కనక శృంగి ధనుషం కరలసత్

కురంగ పృథు టంక పరశుం రుచిర కుంకుమ రుచిం డమరుకం చ దధతం |

ముకుంద విశిఖం నమదవంధ్య ఫలదం నిగమ వృంద తురగం నిరుపమం

స చండికమముం ఝటితి సంహృతపురం పర చిదంబర నటం హృది భజ || ౮ ||
అనంగపరిపంథినమజం క్షితి ధురంధరమలం కరుణయంతమఖిలం

జ్వలంతమనలం దధతమంతకరిపుం సతతమింద్ర సురవందితపదమ్ |

ఉదంచదరవిందకుల బంధుశత బింబరుచి సంహతి సుగంధి వపుషం

పతంజలి నుతం ప్రణవ పంజర శుకం పర చిదంబర నటం హృది భజ || ౯ ||
ఇతి స్తవమముం భుజగపుంగవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః

సదః ప్రభుపద ద్వితయదర్శనపదం సులలితం చరణ శృంగ రహితమ్ |

సరః ప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరపదం

స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదమ్ || ౧౦ ||

Sunday, April 21, 2019

నవదుర్గలు

వైదిక సంప్రదాయంలో దేవి త్రిమూర్తులశక్తిగా చెప్పబడింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులుగా కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని శత్రునిర్మూలనానికీ, ఐశ్వర్య-సౌభాగ్య సంపదలకు మహాలక్ష్మి, విద్య విజ్ఞానానికి మహా సరస్వతి అధిష్టాన దేవతలుగా రూపొందారు
దుర్గ అమ్మవారు తన ప్రతిరూపాలుగా మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి ని సృష్టించారు. మరల మహాసరస్వతి ,మహాలక్ష్మి, మహాకాళి తిరిగి తమ ప్రతిరూపాలను సృష్టించుకొన్నారు.మొత్తంఈ రూపాలన్ని కల్సి నవదుర్గలుగా మన చేత పూజలు అందుకొంటున్నారు.

నవదుర్గలు : శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట,కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి,మహాగౌరి, సిద్దదాత్రి.

శైలపుత్రి :
శైలుడి {పర్వతరాజు} కుమార్తె. ఆమెకే సతీ భవాని, హిమవంతుడి (హిమాలయాలకు రాజు) కూతురు హిమవతి, పార్వతి అను పేర్లు కూడా ఉన్నాయి. నవదుర్గలలో మొదటి రూపం శైలపుత్రి. ఎడమ చేతిలో కమలము, కుడి చేతిలొ త్రిశూలధారణియై. ఎద్దుని వాహనంగా కలిగిఉంటారు అమ్మవారు.

బ్రహ్మచారిణి
కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలము కలిగిఉంటుంది. ఙ్ఞానం కలిగించే గొప్ప శక్తి కల దివ్య రూపం. తనను ఆరాధించే భక్తుల పైన ప్రేమ తో పాటు వారికి సిరి సంపదలను ప్రసాదిస్తుంది. మోక్షం పొందటానికి బ్రహ్మచారిణి ఆరాధన ప్రధానమైనది.

చంద్రఘంట :
తన సిరస్సు పై అర్ధచంద్రుడిని ఘంటాకారముగా కలిగి ఉండటం వలన ఈమెను చంద్రఘంట అంటారు. పది చేతులతో, పది రకాలైన ఆయుధములతో { జపమాల, ఘంట, బాణం, పద్మం, ఖడ్గం,కమండలం, త్రిశూలం, ధనస్సు, గద, కమలం }, మూడు నేత్రములతో అమ్మవారి రూపం కొలువు తీరి ఉంటుంది. సింవాహినియై తాను దైర్యసాహసాలకు ప్రతీకగా ఉంటుంది.

కూష్మాండ :
సంస్కృతం లో కూష్మాండం అంటే గుమ్మడికాయ అని అర్ధం. ఈ అమ్మవారికి నివేదించే కూరగాయలలో గుమ్మడికాయ ముఖ్యమైనది. అమ్మవారిని శాంతింపచేయడంలో పెట్టే నైవేద్యంలో కూష్మాండం ప్రధానమైనది అందుకే ఈ అమ్మను కూష్మాండదుర్గ అని అంటారు. కు = చిన్నదైన, ఉష్మ = ఉష్ణము, అండ = బ్రహ్మాండము. 8 చేతులతో అష్టభుజిగా ఉండి, కమండలము, ధనస్సు, బాణము, తామర, గడ, చక్రము, మట్టిముంత, 8వ చేతిలో జపమాల ధరించి ఉంటుంది.

స్కందమాత :
దేవ సేనాపతి ఐన సుబ్రహ్మణ్యస్వామి { కార్తికేయుని } తల్లి. ఈమె 4చేతులు, 3కన్నులు కలిగి, సుబ్రహ్మణ్యస్వామిని తన కుడి పైచేయి మీద కూర్చొపెట్టుకొని ఉంటుంది. మరొక చేతిలో కమలమును, ఎడమ చేయి వరములను ప్రసాదించే ముద్రలోను, 4వ చేతితో కమలమును పట్టుకొని ఉంటుంది. మంచి వర్చస్సుతో కూడిన ముఖము కలదై, పద్మాసనిగా కూడ అమ్మవారిని వర్ణిస్తారు.

కాత్యాయని:
కాత్యాయని సాక్షాత్తు గాయత్రీఅమ్మవారి స్వరూపం. ఈమె వింధ్యాచల నివాసిని.కాత్యాయని ఉపసన వలన భయాలు దూరమవుతాయి. తామరపువ్వు, ఖడ్గము, అభయ హస్తములతోటి అమ్మవారు కొలువై వుంటారు.

కాళరాత్రి :
రాత్రి చీకటిలా నల్లటి వర్ణంతో, జలపాతల వంటి కురులు కలిగి ఉంటుంది. ప్రకాశవంతమైన వెలుగు కల మాలతో, నిప్పులు గక్కె త్రినేత్రధారియై, గార్దభ వాహినిగా, చతుర్భుజి గా, కుడి వైపున ఒక చేయి వరప్రసాదినిగా, రెండవ చేయి అభయంగా, ఎడమవైపు పొడవుగా ఉండే పదునైన కత్తితో, మరో చేతిలో కొడవలితో దర్శనం ఇస్తుంది.

మహాగౌరి :
తెల్లటి ఆభరణాలతో, తెల్లటి శరీరఛాయ కలిగి, చతుర్భుజి, వృషభవాహినిగా ఉంటుంది. త్రిశూలము, ఢమరుకము, అభయము, వరప్రసాద హస్తములతో దర్శనం ఇస్తుంది.

సిద్ధదాత్రి :
మార్కండేయ పురానంలో అష్ట సిద్దుల గురించి వివరించారు. అవి అణిమా సిద్ధి, మహిమా, గరిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకమ్య, ఇషిత్వ, వషిత్వ సిద్దులు. ఈ అష్టసిద్దులను ప్రసాదించేది సిద్ధదాత్రి. దేవీభాగవత పురాణంలో చెప్పినట్లు, సిద్ధదాత్రి అనుగ్రహం వలనే పరమశివుడు సిద్ధులను సాధించాడు. ఆమె అనుగ్రహం వలనే అర్ధనారీశ్వర రూపం పొందాడు.

లలిత సహస్రనామం - ప్రతి పద అర్ధం

1- 10:

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః

1. ఓం శ్రీమాత శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్ని కుండసంభూత దేవకార్య సముద్యత

శ్రీమాత : శ్రీదేవి అను ప్రసిద్ధనామముగల జగన్మాత , సమస్త సృష్టికి మూలమైనది.
శ్రీ మహారాజ్ఞీ : మహారాణి, సమస్త లోకములను పరిపాలించుచున్నది.
శ్రీమత్ -సింహసనేశ్వరి : సింహాసనమును అధిష్టించి దుష్ట శిక్షణ చేయునది.

పై మూడు నామముల వలన లలిత దేవి సృష్టి , స్థితి, లయ కారిణి అని తెలియుచున్నది. చిదగ్ని కుండసంభూత : జ్గ్యానము అను అగ్ని కుండమున పుట్టినది.
దేవకార్య సముద్యతా : దేవతల పని చేయుటకు పూనుకొన్నది. ( దేవతల పని అనగా ఆధ్యాత్మిక సాధన)

2 ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత
రాగాస్వరుప పాశాడ్యా క్రోధా కారంకుశోజ్జ్వల

ఉద్యద్భాను సహస్రాభ : ఉదయించిన వేయి సూర్యుల వెలుగు కలిగినది.
చతుర్బాహు సమన్విత : నాలుగు బాహువులు కలిగినది.
రాగాస్వరుప పాశాడ్యా : అనురాగమే పాశముగా కలిగినది.
క్రోధాకారంకుశోజ్జ్వలా : క్రోదమును అంకుశంగా కలిగినది.

3. మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్ర సాయకా
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మండమండల

మనోరూపేక్షు కోదండ : మనసే విల్లుగా కలది పంచతన్మాత్ర సాయక : ముఖ, చంద్ర , అష్టమి , రస, గంధములు అను పంచ తన్మాత్రములను బానములుగా కలది. చంద్ర ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా : తన ఎర్రన్ని కాంతి చే బ్రహ్మాండమంతయు నింపి వేసినది.

4. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ
కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత

చంపకాశోక పున్నాగ : సంపెంగ, అశోక, పున్నాగమొదలగు పుష్పములు
సౌగంధిక : సువాసనగల
లసత్కచ : తలకట్టు
కురవింద మణి : కురవింద అను పేరు గల ఎర్రని మణులు
శ్రేణి : వరుస
కనత్ కోటీర మండితా : ప్రకాశం తో కూడిన కిరీటముధరించినది

5. అష్టమిచంద్ర విభ్రాజ దళికస్తల శోభిత
ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక

అష్టమీ చంద్ర : అష్టమి నాటి చంద్రుడు
విభ్రాజ : ప్రకాశించు
దళికస్థల : నుదిటి భాగం
శోబిత : ప్రకాశం కలిగినది
ముఖ చంద్ర : చంద్రుని ముఖమునందు
కళంకాభ : మచ్చ
మృగనాభి విశేషక : కస్తూరి తిలకం దిద్దిన అందమైనముఖము

6. వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లిక
వక్త్ర లక్ష్మి పరివాహ చలన్మీనాభ లోచన

వదనస్మర మాంగల్య : అందమైన కనుబొమ్మల తో కూడినముఖము
గృహ తోరణ : గృహమునకు అలంకరించిన మంగళతోరణము వలె
చిల్లికా : అందమైన ముఖము కలది
వక్త్ర లక్ష్మీ పరీవాహ : ముఖ సౌందర్యం అనే ప్రవాహమున
చలన్మీనాభలోచన : చేపల వంటి అందమైన కనులు కలది

7. నవచంపక పుష్పాభ నాసదండ విరాజిత
తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసుర

నవచంపక పుష్పాభ : క్రొత్త సంపెంగ మొగ్గలు
నాసదండ విరాజితా : అందమైన నాసిక కలది
తారా కాంతి : నక్షత్రాల వెలుగు
తిరస్కారి : మించిన
నాసాభరణ : ముక్కెర (నాసిక ఆభరణం)భాసుర :ఆభరణం కలిగినది

8.కదంబ మంజరీ క్లుప్త కర్ణపూరమనోహర
తాటంక యుగళీభూత తపనోడుప మండల
కదంబ మంజరీ క్లుప్త : కడిమిపూల గుత్తి చే అలకరించిన
కర్ణపూర మనోహర : అందమైన చెవులు కలది
తాటంక యుగళీభూత తపనోడుప మండల :సూర్యచంద్రులను చెవికమ్మలుగా కలిగినది

9. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ:
నవవిద్రుమ బింబశ్రి న్యక్కారి రదసన్నచ్చద

పద్మరాగశిలాదర్శ : పద్మరాగమణి (కెంపు) తో చేయబడినఅద్దములు
పరిభావి కపోలభూ : కెంపుల ప్రకాశం కంటే ఎక్కువప్రకాశం గల చెక్కిళ్ళు కలది
నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదా : క్రొత్త పగడమును మించిన అందమైన యెర్రని పెదవులు కలది.

10. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వల
కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర

శుద్ధవిద్యాంకురాకార : శ్రీవిద్య అనబడు షోడశీమంత్రములోని పదునారు బీజాక్షరాలు
ద్విజపంక్తి ద్వయోజ్వల : తెల్లని ప్రకాశవంతమైనపలువరుస కలది
కర్పూరవీటికామోద : కర్పూర తాంబూల సువాసనలు
సమాకర్షదిగంతరా : నలుదిక్కులను ఆకర్షించునది.

11 - 20:

11 నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపి
మందస్మిత ప్రభాపుర మజ్జత్కామేశ మానస

నిజసల్లాప మాధుర్య : తన పలుకుల మాధుర్యము చేత
వినిర్భర్త్సిత కచ్ఛపీ : సరస్వతీదేవి వీణా నాదమునుజయించునది
మందస్మిత : చిరునవ్వులు
ప్రభాపూర : కాంతి
మజ్జత్ : వశము చేసుకొను
కామేశ : కామేశ్వరుడు
మానసా : మనసును జయించునది.

12 అనాకలిత సాదృశ్య చుబుకశ్రి విరాజిత
కామేశ బద్ధమాంగాల్య సూత్ర శోభిత కంధర

అనాకలిత సాదృశ్య : పోల్చుటకు సాద్యముకాని
చుబుక శ్రీ విరాజితా : అందమైన గడ్డము (చుబుకము)కలది
కామేశ బద్ధ : కామేశ్వరుని చే
మాంగల్య సూత్ర : మంగళ సూత్రము
శోభిత : శోభిల్లుచున్న
కంధరా : కంట్టము కలది

13. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత
రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత

కనకాంగద కేయూర : బంగారు బుజ కీర్తులతోను(వంకీలతో) కమనీయ : చూడచక్కని
భుజాన్వితా : భుజములు కలది
రత్న గ్రైవేయ : రత్నములు పొదిగిన
చింతాక : చింతాకు పతకము
లోల ముక్తా ఫలాన్వితా : ముత్యాల జాలర్లు

14. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తని
నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి

కామేశ్వర ప్రేమ : కామేశ్వరుని ప్రేమ కు
రత్న మణి ప్రతిపనస్తనీ : రత్నములు, మణులతో
అలకరించబడిన చనుదోయి కలది
నాభ్యాలవాల : నాభి నుండి మొదలైన
రోమాళిలతా : నూగారు అనే లత (తీగ )
ఫలకుచద్వయి : ఫలములు వంటి చనుదోయి కలిగినది

15. లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ
స్తనభార దలన్మధ్య పట్టబంధవళిత్రయా

లక్ష్యరోమలతాధారతా : నూగారు (రోమాళి) ఉనికి వలన
సమున్నేయ మధ్యమా : పలుచని (సన్నని) నడుము కలది
స్తనభారదళన్మధ్య : స్తన భారము వలన
పట్టబంధవళిత్రయ : మూడు వరుసలు గల పట్ట ( నడుము పై భారము పడకుండా పట్టీ ధరించడం)

16. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కతీతటీ
రత్నకింకిణి కారమ్య రశనా దామ భూషిత

అరుణారుణ కౌసుంభ : ఎర్రని కౌసుంభ పూలు
వస్త్ర : వస్త్రముభాస్వత్ : ప్రకాసించుచున్న
కతీతటీ : కటి భాగం (తుంటి భాగం) కలిగినది.
రత్నకింకిణి కారమ్య : రత్నములతో, చిన్నచిన్న మువ్వలు కల
రసనాదామ భూషితా : వడ్డాణం తో అలకరించిన నడుము

17. కామేశజ్గ్యాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత

కామేశజ్గాత సౌభాగ్య : కామేశ్వరునికి మాత్రమే తెల్సిన
మార్దవోరు ద్వయాన్విత : మృదువైన ఊరువులు కలది
మాణిక్య : మణులు
మకుటాకార : కిరీటములను పోలిన
జానుద్వయ విరాజితా : మోకాళ్ళతో విరాజిల్లుతున్నది

18. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతునాభ జంఘిక
గూఢగుల్ఫా కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత

ఇంద్రగోప పరిక్షిప్త : ఇంద్రగోప (ఎర్రన్ని మణులు) పొదిగిన
స్మరతూనాభ జంఘికా : అమ్ముల పొదల వంటి పిక్కలు కలది
గూఢ గుల్ఫా : కనుపించని చీలమండలు కలది
కూర్మపృష్ట జయిష్ణు : తాబేలు వీపు ను గెలువజాలిన
ప్రపదాన్వితా : మీగాళ్ళు (పాదముల పై భాగము) కలది

19. నఖదీదితి సంచ్చన్న నమజ్జన తమోగుణా
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ

నఖదీధితి సంఛన్న : కాలి గోళ్ళ యొక్క కాంతి చే తొలగించబడిన
సమజ్జన తమోగునా: భక్తుల అజ్గ్యానాంధకారం
పరాకృత : ఓడిపోయిన
సరోరుహా : పద్మములు
పదద్వయ ప్రభాజాల : పాదముల యొక్క కాంతి

20. శింజాన మనిమంజీర మండితశ్రి పదాంబుజ
మరాళి మందగమనా మహాలావణ్య శేవధి:

శింజానమణి మంజీర : మ్రోగుచున్న అందెలు
మండిత శ్రీ పదాంబుజా : అందమైన పాదములు
మరాళి మందగమన : హంస నడక వంటి మందగమనము కల్గినది
మహా లావణ్య శేవధి: : అందమునకు పరమావధి

శివానుగ్రహం

నమక చమకాలను రుద్రాధ్యాయమంటారు.
సమస్త జ్ఞానానికీ మూలమైనవాడు శివుడు. ఆయనే దక్షిణామూర్తి. అమ్మవారితో కలిసి సాంబసదాశివుడు. పదకొండు రుద్రులుగా దేవతలను రక్షించే మహారుద్రుడు. భక్తకింకరుడైన శంకరుడు. దేవతలందరికీ ఆరాధ్యుడైన మహాదేవుడు.

శ్రీమహావిష్ణువు దశావతారాలు ధరిస్తే, పరమశివుడు నూట ఎనిమిది రుద్రావతార లీలల్ని ప్రదర్శించి లోకాలకు శుభాలను ప్రసాదించాడు. జీవుల కర్మదోషాలకు శిక్షలు విధించే నవగ్రహాలకు శివుడే అధిపతి. అందుకే గ్రహబాధల నుంచి రక్షణకు శివారాధన చెయ్యాలంటారు.

పూజ, అర్చన, ఆరాధనలు- వివిధ స్థాయులకు చెందినవి. శివుడికి సంబంధించి అర్చన, ఆరాధన అనే మాటలు ఉపయోగిస్తారు. రుద్రార్చనలో నమక చమక మంత్రాభిషేకం, బిల్వార్చనలు ఉంటాయి. ఆరాధనలో ‘యత్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం’ అనే సంపూర్ణ శరణాగతి ఉంటుంది. ప్రతి చర్యా ఆయన సేవే అనుకోవాలి.
శివశరణం లభించడమంటే రుద్ర కవచం మనకు దక్కినట్లే. త్రిశూలపాణి మనకు అండగా ఉన్నట్లే. అయితే, వీటిని పొందగల అర్హత మనం ఆర్జించుకోవాలి.

అలా ఆర్జించుకోవాలంటే, రుద్ర నమక మంత్రం ‘సౌమనసశ్చమే’ అంటే ఏమిటో మనకు అర్థం కావాలి. రుద్ర మంత్రాల ద్వారా మనం అనేక మహత్తరమైన ఆకాంక్షలను శివుడికి విన్నవించుకుంటాం. వాటిని మనకు అనుగ్రహించమని అర్థిస్తాం. అలాంటిదే ‘సౌమనసశ్చమే’. ‘మంచి మనసును నాకు ప్రసాదించు శివా!’ అనేది ఈ మంత్రార్థం.

మనిషి కష్టాలన్నీ మంచి మనసు లేకపోవటం వల్లనే కలుగుతున్నాయి. స్వార్థం, అసూయ, ద్వేషం లాంటి మహాపాషాణ విషాలు మన మనసులో తిష్ఠవేసుకుని ఉంటాయి. క్షీరసాగర మధన వేళ ఉద్భవించిన లోకభీకరమైన మహా వినాశనకారి అయిన హాలాహలాన్ని స్వీకరించిన పరమశివుడు మన మనసులోని పాషాణ విషాలను సైతం హరించివేయాలని మన ప్రార్థన, అభ్యర్థన. అవి తొలగిపోతే కానీ మనసు అమృతీకరణం చెందదు.
అమృతీకరణం చెందిన మనసు అందరి క్షేమాన్నీ కోరుతుంది. ఉదారంగా, సౌమ్యంగా, సర్వజన ప్రియంగా వ్యవహరిస్తుంది. అప్పుడిక శత్రువులంటూ ఉండరు. శత్రుబాధలు లేనప్పుడు అశాంతి ఉండదు. ఇదే ఆనంద రహస్యం.

భగవంతుడు మనపట్ల ఉదారంగా ఉండాలనుకుంటాం. కానీ మనం ఎవరి పట్లా ఉదారత చూపం. ఆర్తితో అలమటిస్తున్నవారి పట్ల ఉదాసీనంగా ఉంటాం. ఉదారంగా ఉండేందుకు మనస్కరించదు. ఎవరికైనా దానం చేసేటప్పుడు మన దగ్గర ఉన్న అతి చిన్న నాణేన్ని వెతికి వెతికి తీసి మరీ వేస్తాం. అలా ఉంటుంది లోభత్వం.

మూడు రకాల మనుషుల్ని మనం చూస్తుంటాం. శక్తి ఉన్నా పైసా కూడా దానం చెయ్యని పరమ పీనాసులు ఉంటారు. తమ శక్తికి లోబడి సాయం చేసే జాగ్రత్తపరులు కనిపిస్తారు. తమ శక్తికి మించి ఆదుకునే అమృత హృదయులూ ఉంటారు.
భగవంతుడు అలాంటి అమృత హృదయుల్ని అక్కున చేర్చుకుంటాడు. ఎందుకంటే, దయగలవారే దైవ సమానులు. దయామూర్తులే దైవ పరివార సభ్యులు. దీనులకు దైవపరివారమే బంధువులు.
జన్మతః భగవంతుడు అందరికీ మంచి మనసునే ఇస్తాడు. ప్రాపంచిక ప్రలోభాలతో మనసు కలుషితమైపోతుంది. నిత్యం పాత్రలను శుభ్రం చేసుకున్నట్లే మనసునూ శుభ్రం చేసుకోవాలి. అందుకు శివారాధన అత్యుత్తమం.
శివప్రీతికరమైన మాస శివరాత్రులు, సోమవారాలు, కార్తిక మాసంలో ప్రతి రోజును మనం శివారాధనలో సద్వినియోగం చేసుకుంటే, సౌమనస్కులుగా ఉండగలుగుతాం!

యుగానుసారం పాటించవలసిన ధర్మ శాస్త్రాలు

కృతయుగం – మనుస్మృతి
త్రేతాయుగంలో – గౌతమ స్మృతి
ద్వాపరంలో – శంఖు స్మృతి
కలియుగం – పరాశర స్మృతి

ఇవీ యుగానుసారం పాటించవలసిన ధర్మ శాస్త్రాలు ( ధర్మ స్మృతులు )

ఏరోజైతే భగవంతుని గురించిన ఙ్ఞానం తెలుసుకోవాలనే తపన మనలో మొదలైతే ఆ కృష్ణపరమాత్ముడు తప్పకుండా తగు ఏర్పాట్లు చేస్తాడు అది ఏవిధమైన ఏర్పాటైనా కావొచ్చు !! అందుకే అంటారు మనం భగవంతుని వైపు ఒక అడుగు ముందుకేస్తే ఆయన పదడుగులు వేయడానికి ఏమాత్రం సంకోచించడు పైగా ఎంతో ఆదుర్దగా వస్తాడు !! ఉదా: శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్షం

పరాశర స్మృతి

ధర్మశాస్త్రాలు(స్మృతులు) అన్ని యుగాలకి ఒకే స్మృతి నిర్దేశంచబడలేదు.!! ఆ వివరాలు పరాశర మహర్షి విరచిత “పరాశర స్మృతి” లో వివరించారు

సత్య (కృత) యుగం – మనుస్మృతి
త్రేతా యుగం – గౌతమ స్మృతి
ద్వాపర యుగం – శంఖ స్మృతి
కలియుగం – పరాశర స్మృతి
కావున కలియుగానికి అనుసరణీయమైన ధర్మ శాస్త్రం “పరాశర స్మృతి”

ఇంకా పరాశర స్మృతిలో ఏయే యుగంలో ధర్మాచరణ ఏయే విధంగా జరగాలో ఈ కింది విధంగా వివరించబడింది

“తపః పరం కృతయుగే
త్రేతాయాం ఙ్ఞానముచ్యతే
ద్వాపరే యఙ్ఞమిత్యుహ
దానమేకం కలౌ యుగే” అనగా

కృతయుగం – తపస్సు చేయడం
త్రేతాయుగం – ఆధ్యాత్మిక ఙ్ఞానాన్ని పొందడం
ద్వాపరయుగం – యఙ్ఞ, యాగాదులు చేయడం
కలియుగం – భగవత్సంబంధిత కార్యాలకై దాన దర్మాలు చేయడం

ఇంకా దానం కూడా ఏయే యుగాలలో ఏయే విధంగా చేసేవారో కూడా పరాశర స్మృతి వివరిస్తుంది

కృత యుగం – దాత
 దాన గ్రహీత అందుకు అర్హుడేనా అని విచారించి
త్రేతాయుగం – దాత దానగ్గహీతను అభ్యర్థించి
ద్వాపర యుగం – దాన గ్రహీత కోరినది దానం చేయడం
కలియుగం – ప్రత్యక్షంగా సహాయం చేయలేని పక్షంలో బదులుగా ద్రవ్య రూపకంగా

విష్ణు పురాణం

పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి బోధించిన పురాణమే “విష్ణు పురాణం”
వీరు సాక్షాత్తు వేద వ్యాసుల వారికి తండ్రి గారు మరియు శక్తి మహర్షి పుతృడు మరియు వసిష్ఠుల వారి పౌతృడు ( మనుమడు)

హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ
పై శ్లోకము కృష్ణయజుర్వేదాంతర్గత కలిసంతరణ ఉపనిషత్ లోనిది

జగన్నాథ - రథయాత్ర సంపూర్ణ వివరాలు

 1) పూరి మందిరం పేరు ఏమిటి?( శ్రీ మందిరం ) 2) రథయాత్ర  ప్రారంభమయ్యే తొలితిధి ఏది?( ఆషాడ శుద్ధ విదియ ) 3) పూరీ మందిరాన్ని వదిలి ఈ తొమ్మిది రో...