Monday, May 21, 2018

శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు…..!!

హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి.

‘ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా’ అని ఆర్ష వాక్యం.

మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది.

ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.

‘శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్’

శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం – రామదూతం నమామ్యహం
శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష – శ్రియం దాపయ మే ప్రభో||

అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి.

”యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు”
అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం, శిర స్స్నానం, నేలపడక, సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.
ఆచరణ :- భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి.

The Six Yoga Systems

The Six Yoga Systems
Hatha, Raja, Bhakti, Jnana, Kriya, Karma

Hatha Yoga

Ha and tha, the sun and moon, refer to the two opposite currents that regulate all processes in our body. There is nothing mysterious about it because anything in our universe exists because of a positive and negative charge. Hatha Yoga, Raja Yoga, and Kriya Yoga are specifically dealing with the intention of gaining control over the flow of these life-currents.

Hatha Yoga is known for the asanas or postures. It is thought that by perfecting the body, creating a healthy physical condition, and raising Kundalini (dormant energy) upwards along the spine, the body becomes better prepared for yogic awakening. The first effects felt are usually improved health and strengthened nervous system. Some Hatha Yogis may even demonstrate control over internal organs, blood flow, and breathing. The ability of some Yogis to even stop the breathing and heart beat completely for a period of time has been demonstrated under laboratory settings.

Traditional Hatha Yoga consists of:

1. Asanas (postures);
2. Shat Karmas (six cleansing techniques, also known as Shat Kriyas);
3. Pranayama (control of breathing with retention);
4. Bandhas (locks) and Mudras (seals) for the regulation of Prana (life-force) and Kundalini; and
5. Samadhi (Union with God, realization of the Self, ecstasy, nirvana).

There are many good books available on this subject and one is wise to have a copy handy that also includes pictures of the various asanas and mudras.


Raja Yoga / Radja Yoga

Raja Yoga means royal and is sometimes called the crown of Hatha Yoga. Raja adds concentration after body and mind are cleaned and trained to stay calm and attentive. The improvement in our power of concentration, as a result of Raja Yoga, moves all of our attention towards the source of our Being in order to become that Being. Raja Yoga is a complete system, also refered to as Ashtanga Yoga because of the eight (ashta) limbs (anga) the system rests on. Sahasra Sai

The Eight Limbs (Ashta-anga) are:

1. Restraints (yamas: harmlessness, truthfulness, non-stealing, control of senses)
2. Disciplines (niyamas: cleanliness, purification of body, mind and nervous system, study of metaphysical principles, contemplation on God)
3. Postures (asanas)
4. Control of breathing and life-currents (pranayama)
5. Turning the attention within (pratyahara)
6. Concentration (dharana)
7. Meditation (dhyana: prolonged periods of perfect concentration and contemplation)
8. Holy Trance (Samadhi)

Bhakti Yoga (Union through Devotion and Love)


Bhakti Yoga is the Yoga of selfless love, compassion, humility, purity and the desire and serious intention to merge with God. It is nothing else than to follow the 'First Commandment': "to love God with all your heart, mind and soul."



Jnana Yoga (The Yoga of Knowledge)

Jnana Yoga is practical Philosophy/Metaphysics. It is both theory and practice. Jnana Yoga uses the intellect as a tool to understand that our true Self is behind and beyond our mind. It is a Quest for the Self by direct inquiry into "who we are." It is, however, a mistake to think that the Source could be found with the intellect alone.

For the purpose of Self-discovery, Jnana Yoga probes the nature of the Self through the question: Who am I? Through persistent probing, fixing our attention on the source of our Being, we regain our real Self. We remember who we are. The inquiry, as the result of practising Jnana Yoga, leads us towards clear Awareness by removing our attention from that which we are not. Along with Bhakti Yoga (Devotion), Jnana is listed among the best approaches for becoming aware of the eternal Self (God).

Shankara and Ramana Maharshi are the classic authorities concerning Jnana Yoga. Like Hatha and Raja Yogis, Jnana Yogis also acknowledge the relationship between breathing and thinking. They found that breathing slows automatically through concentration on the "I-AM."

Kriya Yoga

Kriya Yoga refers to actions designed to rid the body and mind of obstructions. Kriya Yoga is a complete system including mantras, meditation, and other techniques towards controlling the life-force and bringing calmness and control over body and mind. The goal is to unite with pure Awareness (God). Since pure Awareness is our original condition, it is also referred to as Self-awareness.


Karma Yoga (Self-less work for our fellow neighbour)

Karma is the total sum of all our actions (mental and physical), in this life and before. Karma Yoga is the yoga of Service or self-transcending Action, whereby the yogi directs all actions towards God. By serving God and humanity (without selfishness, egoism, and attachment) the heart becomes pure, the ego fades and, over time, or even over many lifetimes, one becomes increasingly in tune and unified with God. Enlightenment (Samadhi, nirvana, union with God) is naturally realized through Karma yoga.

మంత్రశక్తి

   మనసును ప్రక్షాళనం చేసి, నైర్మల్యం కలిగించే ముఖ్య పరికరాలు..మంత్రాలు. జన్మ....గత వాసనలతో, మనలను కట్టి పడవేసి, అచేతన,సుప్తచేతన ఆలోచనల, కోరికలను చేధించడానికి మంత్రం సహాయపడుతుంది.

మంత్రం మన మనసు పొరల్లో దాగియున్న పలురకాలైన ఆలోచనలను దూరం చేస్తుంది. సక్రమంగా, మనస్సాక్షిగా, ధ్యానం చేయబడిన మంత్రాలు సత్ఫలితాలను ఇస్తాయి. మన మనసులోని వ్యతిరేక భావాలను దూరం చేస్తాయి.

ఉదాహరణకు..
‘హుం’ కారం మనలోని భయాన్ని పారద్రోలుతుంది.
‘రాం’ కారం మనకు శాంతిని కలుగచేస్తుంది.

మంత్రంలో ‘మ’కారం అంటే మననం,
మననం అంటే పదేపదే ఉచ్ఛరించడం.
‘త్రం’కారం అంటే త్రాణం,
త్రాణం అంటే రక్షించేదని అర్థం,

కాబట్టి ‘మంత్రం’అంటే ఏకాగ్రచిత్తంతో పదేపదే ఉచ్ఛరించే వానిని రక్షించేదని అర్థం.మననం చేయువానిని రక్షించేది మంత్రమని అర్థం.

మంత్రం అనేది నిర్గుణ బ్రహ్మస్వరూపం. ఒక బీజం (విత్తనం) పెద్దచెట్టు గా వృద్ధిచెందినట్లు, నిర్గుణ బ్రహ్మమే మంత్రంగా సూచించబడింది.

మంత్ర వివరణపై అనేక నిర్వచనాలు కనిపిస్తున్నాయి.

తన హృదయం నుండి అవగతమయ్యే శక్తే మంత్రమనీ, దేవతాధిష్టితమైన ఒకానొక అక్షర రచనా విశేషమే మంత్రమనీ,
దేవతా స్వరూపమే మంత్రమనీ,
సాధనకు, కార్యసిద్ధికి, ప్రత్యేక ఫలితాలకు ప్రకృతి శాస్త్రాలను అనుసరించి వివిధ ప్రక్రియలలో అభ్యాసమూలమైన సిద్ధిత్వాన్ని కలిగించేదే మంత్రమనీ కొన్ని అక్షరాల ప్రత్యేక ఉచ్ఛారణే మంత్రమనీ,
ఒక శబ్దాన్ని యాంత్రికంగా, పారవశ్యం కలిగేంతవరకు పురశ్చరణ చేయడమే మంత్రమని అంటారు.

ఈ జగత్తు అంతా దెైవానికి ఆధీనమై ఉంది. అటువంటి దెైవం మాత్రం మంత్రానికి ఆధీనమై ఉన్నాడు. కాబట్టి శబ్ధరూపంలో నున్న దెైవశక్తి స్వరూపమే మంత్రం,

మంత్రాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆమంత్రం దేవతామూర్తి యొక్క శక్తి సాధకునిలో అణువణువు వ్యాపించి
ఉంటుంది. అప్పటివరకు నిబిఢీకృతమై ఉన్న దెైవికశక్తులు సాధకునికి ఉపయోగపడి జ్ఞానోదయ మవుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద,
మాత్సర్య, మాలిన్యాలు తొలగి, మనస్సు నిశ్చలమై, సచ్చిదానంద స్థితిని పొందుతాడు.

అత్యంత శక్తివంతమైన బీజాక్షరాలతో ఏర్పడినవే మంత్రాలు. శక్తికి, శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది. శబ్దంలోనిదే స్పందన. సక్రమమయిన రీతిలో జరిగే మంత్రోచ్ఛారణ వలన, మంత్రంలోనున్న బీజాక్షరాలలో స్పందన కలిగి, అత్యద్భుతమైన మహాశక్తి ఉత్పన్నమవుతుంది. యోగసాధన సఫలీకృత మయ్యేందుకు యోగశక్తి ఎలా అవసరమో అదే విధంగా మంత్రసాధన ఫలించేందుకు విశేషమైన మానసిక ఏకాగ్రత అవసరం.

ఈ వాక్ శక్తీకరణ కలిగినప్పుడు, మనం కొన్ని సాధారణ శబ్దాలలో నిగూఢమైన అర్థాలను చూడగలం. అవి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సమస్తవిశ్వంతో సంభాషించే స్థితికి సాధకుని తీసుకెళ్తాయి.

ప్రతి మంత్రానికి మంత్రాధిష్థాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని, సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్రజపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచారరహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం. పండుగ సమయాలో గ్రహణసమయాలలో అమావాస్యలలో మంత్రోచ్ఛారణ అధికంగా చేయాలి.

మంత్రాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి కదా! వాటిని స్థానిక భాషలోకి తర్జుమా చేసుకొని దెైవాన్ని పూజించకూడదా? అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. ఇందుకు సమాధానం ఒక్కటే.మంత్రం శబ్దప్రధానమైనది. ధ్వన్యాత్మక సృష్టిపదార్థం... సృష్టి కంటే ముందే పుట్టింది. ఇతర తత్త్వాలకంటే శబ్దతత్త్వం శక్తివంతమైనది. కాబట్టి మంత్రానికి ఆధారం శబ్దం అయింది.

సంస్కృత భాషలోని అక్షరాలలో శబ్దం, అర్థం రెండూ ఉన్నాయి. ఈ అక్షరాల నిర్మాణం వల్ల అనేక మహిమలు కలుగుతాయి. అందుకే మిగతా భాషల కంటే సంస్కృతం ఉత్కృష్టమైన మంత్ర ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే సంస్కృతం మంత్రంలో నుండి ఉద్భవించింది మరి.

మంత్రాలు రెండు రకాలు.
1. దీర్ఘమంత్రాలు,
2. బీజ మంత్రాలు.
మనకు తెలిసిన వాటిలో ఎక్కువ భాగం ఓంకారం వంటి హ్రస్వబీజాలు (మంత్రాలు) ఈ మంత్రాలు ఓం, హూం, శ్రీం వంటి మూలశబ్దాలను కలిగి ఉంటాయి. ఈ విధమైన మూల శబ్దాల నుంచే సంస్కృత భాష రూపుదిద్దుకుంది.

దీర్ఘమంత్రాలు వేదపాఠాల వలే ...గాన రూపములో ఉంటాయి. వీటిలో గాయత్రీ మంత్రం ముఖ్యమైనది.

గాయత్రీ మంత్రం మూడు పాదములు కలదెై,
ఇరవెై నాలుగు అక్షరాలతో,
ఇరవెైనాలుగు చంధస్సులెై,
ఇరవెై నాలుగు తత్వాలకు సంకేతంగా భాసిస్తోంది.

గాయత్రీ మంత్రంలోని మూడు పాదాలు ఋగ్, యజుర్, సామవేదాల నుంచి గ్రహించబడి,
‘ఓం’కారంలోని అకార, ఉకార, మకారాలకు ప్రతిరూపమై భాసిస్తున్నాయి.

‘గాయత్రీ’ మంత్ర ద్రష్ట అయిన విశ్వామిత్రుడు మంత్రానుష్ఠాన ప్రభావంవల్ల జితేంద్రియుడవడమే కాక, రాజర్షిత్వాన్ని వదలి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అంతేకాక, ప్రతి సృష్టి చేయగల సామర్థ్యాన్ని పొందాడు.

అందుకే చాలా మంది సంధ్యావందనాది సమయాల్లో గాయత్రీ మంత్రమును జపిస్తుంటారు. గాయత్రీ మంత్రాన్నీ ఎవరు క్రమం తప్పకుండా జపిస్తారో, వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తులవుతారన్నది వాస్తవం.
హ్రస్వ బీజమంత్రం మరింత విస్తారమైన అర్థాన్ని కలిగి ఉంటాయి.

దీర్ఘమంత్రాలు, వాటి అర్థాలపట్ల మనకుగల అవగాహనల పై ఆధారపడి ఉంటాయి.

ఈ మంత్ర సృష్టి ఎలా జరిగింది? అన్న ప్రశ్న మనకు కలుగవచ్చు.అందుకు సమాధానం, త్రికాల వేదులెైన ఋషులు, జగత్ కళ్యాణం కోసం అందించిన
సత్యోపదేశాలే ‘మంత్రాలు’.

అదే విధంగా ‘మంత్రసిద్ధి’ ఎన్ని రోజులకు కలుగుతుందన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంటుంది. ఏకాగ్రతతో మంత్రాన్ని సాధన చేస్తే త్వరితంగా ఆయా మంత్రసిద్ధిని పొందవచ్చు. మంత్రానికి బీజాక్షరాలు ప్రాణ ప్రదాలు. వాటి ఉచ్ఛారణతో సంకల్పాలు సిద్ధిస్తాయి అన్నది పెద్దలవాక్కు.

అయితే మంత్రానుష్ఠానంలో అశ్రద్ధ లోపాలు చేయకూడదు, ఫలితంగా చెడు ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది.

ప్రతి మంత్రాన్ని ఒక ఋషి, చంధస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం,అంగన్యాస, కరన్యాసాలనే సప్తాంగాలతో క్రమం తప్పకుండా ధ్యానించాలని చెప్పబడింది.

1. ఋషి:

మంత్ర ప్రవర్తకుడు ఋషిని శిరస్సులో లయింపజేసి ధ్యానించాలి. ఏ మంత్రం ఎవరిచేత ఆవిష్కరింపబడిందో, ఎవరిచేత సిద్ధి పొందిందో, అతనినే ఆ మంత్రానికి కర్తగా (ఋషిగా) భావించాలి.

2. ఛందస్సు:

శరీరాన్ని కప్పిన వస్త్రంలా ఆత్మను కప్పు తున్న దానికి ఛందస్సు అని పేరు. ఈ ఛందస్సులు మంత్రాలను రక్షించగలవు. దేవతలు తమను తాము కాపాడు కొనేందుకు గాయత్రీ వంటి మంత్రాలను ఆచ్ఛాదనలుగా చేసుకొన్నారు.

3. దేవత:

ప్రతి మంత్రానికి ఒక అధిష్టాత దేవత ఉంటుంది. ప్రతి మంత్ర ప్రవర్తకుడు మంత్రానికి తగిన అధిష్ఠాన దేవతను హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి.

4. బీజం:

మంత్రానికి ప్రత్యేకశక్తిని కలుగజేసే మంత్రసారమే బీజం అని పేరు. ఈ బీజాన్ని గుహ్యంలో నిలిపి ధ్యానించాలి.

5. శక్తి:

మనం మంత్రశక్తిని వహించినప్పుడే, అందుకు తగిన మంత్రశక్తి కలుగుతుంది. మంత్ర ప్రవర్తకుడు మంత్రశక్తిని పాదాలలో నిలిపి ధ్యానించాలి.

   6. కీలకం:

మంత్రశక్తిని మనలో నిలిపి ఉంచేందుకు సాయపడే బిరడా వంటిది కీలకం. మంత్ర ప్రవర్తకుడు కీలకాన్ని నాభియందు నిలిపి ధ్యానం చేయాలి. అప్పుడు సాధకుడు ఉపాసనామూర్తిని దర్శించి,  సర్వసిద్ధులను పొందుతాడు.

7. అంగన్యాసం:

అంగన్యాస క్రియలు ఆచరించకుండా చేసిన మంత్రాలు నిష్ర్పయోజనమవుతాయి. శరీరశుద్ధికోసం న్యాసాలు తప్పనిసరిగి చేయాలి. సాధకులు న్యాసాలు చేసుకొని మంత్రజపాన్ని చేయాలి. న్యాసములు ఆచరించకుండా సాధకునికి మంత్రాధికారం లేదు.

వినియోగం:

చతుర్దిధ పురుషార్థాలకై లేక ఏదో ఒక సంకల్ప సిద్ధికై మంత్రాన్ని ఉపయోగించడమే వినియోగం అని అంటారు.

ప్రతి మంత్రానికి మంత్రాధిష్థాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని, సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్రజపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచార రహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం.

పండుగ సమయాలలో గ్రహణ సమయాలలో
అమావాస్యలలో మంత్రోచ్ఛారణ అధికంగా చేయాలి.

మంత్రాలు కర్మార్థమై జనించాయి. ఒకే మంత్రాన్ని కొంతకాలం పాటు సక్రమ రీతిలో జపించడం వలన ఆ
మంత్రానికి సంబంధించిన దెైవరూపం మనోనేత్రానికి స్పష్టంగా కనిపిస్తుంది.

మంత్రశక్తి వలన ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు. ఉదాహరణకు..హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఎన్ని హింసలకు గురిచేసినప్పటికీ, నారాయణ’ అనే మంత్ర జపం ఆ బాలుని ఏమీ చేయలేకపోయాయి.

భక్తహనుమ ‘రామ’ నామజపంతో ఉత్తేజితుడెై సముద్రాన్ని దాటి లంకను చేరాడు.
గాయత్రీ మంత్ర జపం వలన విశ్వామిత్రుడు రాజర్షిత్వాన్ని వదలి బ్రహ్మార్షిత్వాన్ని పొందాడు.

మహాత్ములు కొన్ని ప్రాధమిక మంత్రాలను సూచించారు. అవి:..

     🌹ఓం’..🌹

సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది. ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. సమస్త వేదాల సారమైన ‘ఓం’ కారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది.

అకార, ఉకార, మకారాలు అనే మూడు శబ్దాల సమన్వయం 'ఓం’కారం. ఈ మూడు భాగాలు జాగృత, స్వప్న, గాఢ సుషుప్తి స్థితులకు, రజ సత్త్వ, తమో గుణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలెైన బ్రహ్మ, విష్ణు, శివమూర్తులు వీటికి అధినేతలు.

వేదం ఓంకారరూపం, వేదరాశి..
ఋగ్వేదం నుండి ‘అ’ కారం,
యజుర్వేదం నుండి ‘ఉ’ కారం,
సామవేదం నుండి ‘మ’ కారం
పుట్టి, వాటి నుండి ఓంకార రూపం ఉద్భవించింది. ఓం కారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం.

     🔥శ్రీం:🔥

అమ్మ వారికి చెందిన మంత్రం. ఐశ్వర్యాన్ని, సకల అభీష్టసిద్ధిని కలిగిస్తుంది.

     🍁హూం:🍁

సృష్టిలోని వ్యతిరేక శక్తులను నాశనం చేసే దెైవిక క్రోధం యొక్క శబ్దం ‘హూం’.

ఓంకారం ఆత్మను అనంత ఆత్మలో కలిపే శబ్దమైతే, హూంకారం అనంత పరమాత్మ ఏకాత్మలో ప్రకటితమవుతుంది.

     💠రం:💠 
 
ఇది దివ్య తేజోబీజం. శాంతిని కలిగిస్తుంది.

       🌺ఐం:🌺

జ్ఞాన బీజం. ఏకాగ్రత, శక్తులను ప్రసాదిస్తుంది.

     🌴మాం:🌴

మాతృబీజం. అగ్నిబీజాలకు ఆద్యం.

        💧సోహం:💧

ఊపిరి యొక్క స్వాభావిక బీజం.
‘సో’ ఉచ్ఛ్యాసం,
‘హం’ నిశ్శ్వాసం.
సోహం నుండి హల్మ శబ్దాలను వేరు చేస్తే ఓంకారం.
‘సో’ శక్తి ‘హం’ శివుడు.

🌿గాయత్రీ మంత్రం:🌿

ఓం కారం నుండి జనించింది. మన వేదాలలో, ఉపనిషత్తులలో, బ్రహ్మ సూత్రాలలో, పురాణాలలో గాయత్రీ దేవత సగుణ, నిర్గుణ, స్వరూప స్వభావములు సవిస్తరంగా వివరించబడ్డాయి. గాయత్రీ దేవని గాయత్రీ మంత్రాలతో ధ్యానించే వారికి ముక్తి లభిస్తుంది. ఎవరు గాయత్రీని జపిస్తారో వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుండి విముక్తులవుతారు.

ఏకాక్షర మంత్రం – ‘ఓం’.
అన్ని మంత్రాలలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ‘ఓం’. దీనినే ‘ప్రణవం’అని కూడా అంటారు. మంత్రోచ్ఛారణ జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే ఒక సాధన.

ఉదా..బిడ్డ తన తల్లిని ‘అమ్మా’ అని పిలువగానే, ఆ తల్లి ఎన్ని పనులతో సతమతమవుతున్నప్పటికీ ఆప్యాయంగా పరిగెత్తుకొని వచ్చి, ఆ బిడ్డను గుండెకు హత్తుకుంటుంది కదా! అలాగే సకల దేవతా మూర్తులు, మంత్రోచ్ఛారణతో మనం మననం చేయగానే మనపట్ల ప్రసన్నలవుతున్నారు.

మహా శక్తివంతమైన మంత్రాలను మన ఋషులు, అమోఘ తపశ్శక్తితో భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు.‘ఐం,శ్రీం,హ్రీం,క్లీం’ అనే ఏకాక్షర బీజమంత్రాలను ఆయా దేవతల పేర్లతో కలిపి జపించినప్పుడు శక్తివంతమైన మహామంత్రాలవుతాయి.

ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం.
సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది.

సాధారణంగా మంత్రాలు మూడు విధాలు..

1. తామస మంత్రం: క్షుద్రంతో ఉచ్ఛారణ చేసేవి.

2. రాజస మంత్రం: యుద్ధంలో గెలుపు కోసం చేసేవి.

3. సాత్విక మంత్రం: ఆధ్యాత్మిక సాధనకై చేసేవి.

చంధోబద్ధంగా ఉన్న మంత్రాలు ‘ఋక్కులు’ అని గద్యాత్మకంగా ఉన్న మంత్రాలను ‘యజస్సులు’ అని అంటారు. ఓంకారం లేని మంత్రం ఫలవంతం కాదు.
అలాంటి మంత్రం ప్రాణవాయువు లేని నిర్జీవ శరీరం వంటిది.

ఓంకారం ఆ సర్వేశ్వరుని నుంచి ఒక జ్యోతిగా ప్రారంభమై, దాన్నుంచి ఒక నాదం ధ్వనిస్తుంది. ఋగ్వేదం – ‘అ’ కారం, యజుర్వేదం నుండి ‘ఉ’ కారం, సామవేదం
నుండి ‘మ’ కారం కలసి ‘ఓం’ కారం ఏర్పడింది.

సర్వేజనా సుఖినో భవంతు..!!

కురుక్షేత్ర యుద్ధంలో ప్రముఖ వ్యూహాలు


మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ఏడు అక్షౌహిణీలు, కౌరవులు పదకొండు అక్షౌహిణీల సైన్యంతో యుద్ధాన్ని ప్రారంభించారు. రోజుకొక వ్యూహం నిర్మించి ఆ ఆకారంలో తమ సైన్యాలను నిలిపేవారు. అందులో కొన్ని ప్రముఖమైన వ్యూహాలు..

1. క్రౌంచారుణ వ్యూహం : పాండవ సేనాని దృష్టద్యుమ్నుడు క్రౌంచపక్షి ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.

2. గరుడ వ్యూహం : యుద్ధం మొదలైన మూడవ రోజున భీష్ముడు గరుడపక్షి ఆకారంలో ఈ వ్యూహాన్ని నిర్మించాడు. దీనినే సువర్ణ వ్యూహం అని కూడా అంటారు.

3. శకట వ్యూహం : మహాభారత యుద్ధ పదకొండవ రోజున ద్రోణుడు బండి ఆకారంలో ఈ వ్యూహాన్ని నిర్మించి సైన్యాన్ని నిలిపి తాను కేంద్ర స్థానంలో నిలబడ్డాడు.

4. చక్ర వ్యూహం : పదమూడవ రోజు ద్రోణుడు ఈ వ్యూహాన్ని రచించాడు. దీనినే పద్మవ్యూహం అని కూడా అంటారు. చక్రాకారంలో సైన్యాన్ని నిలుపుతారు. దీనిని చేదించడం అందరికీ సాధ్యం కాదు. అభిమన్యుడు ఈ వ్యూహంలో ప్రవేశించినా బయటకు రాలేక కౌరవుల మోసానికి బలయ్యాడు.

5. మకర వ్యూహం : ఐదవ రోజున భీష్ముడు ఈ వ్యూహాన్ని నిర్మించి మకరాకారంలో సైన్యాన్ని నిలిపి యుద్ధరంగంలో చెలరేగిపోయి పాండవులకు చాలా నష్టాన్ని కలిగించాడు.

6. బార్హస్పత్య వ్యూహం : పదిహేడవ రోజున బృహస్పతి సహకారంతో కర్ణుడు ఈ వ్యూహాన్ని పన్నుతాడు.

7. శృంగాటక వ్యూహం: ఎనిమిదవ రోజు భీష్ముని వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని నిర్మించి త్రికోణాకారంలో సైన్యాన్ని నిలుపుతారు.

8. శ్యేన వ్యూహం: ఈ వ్యూహాన్ని కూడా భీష్ముడి మకర వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు డేగ ఆకారంలో నిర్మించాడు. ఐదవరోజు నిర్మించిన ఈ వ్యూహాన్ని డేగ వ్యూహం అని కూడా అంటారు.

9. అర్ధచంద్ర వ్యూహం : మూడవ రోజు భీష్ముడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు అర్ధచంద్ర వ్యూహాన్ని నిలుపుతాడు.

10. మండల వ్యూహం : ఏడవ రోజున భీష్ముడు మండలాకారంలో వ్యూహాన్ని రచించి కౌరవ సైన్యాన్ని నిలుపుతాడు.

11. మండలార్ధ వ్యూహం : పన్నెండవ రోజు ద్రోణుడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా ధర్మరాజు మండలార్ధ వ్యూహాన్ని నిర్మించి పాండవ సేనను నిలుపుతాడు.

12. వజ్ర వ్యూహం : ఏడవ రోజున భీష్ముడు కౌరవ సేనను మండల వ్యూహంలో నిర్మించగా ధర్మరాజు పాండవ సేనను వజ్ర వ్యూహంలో రచిస్తాడు.

13. సూచీ ముఖ వ్యూహం : ఆరవరోజు దృష్టద్యుమ్నుడు పాండవ సేనను మకర వ్యూహంలో నడిపింపగా భీష్ముడు కౌరవసేనను క్రౌంచ వ్యూహంలో నిలుపుతాడు. కాని ఈ రెండు వ్యూహాలు భంగపడదంతో అభిమన్యుడు సూచీ ముఖ వ్యూహాన్ని రచించి సూది ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.

14. వ్యాల వ్యూహం : నాలుగవ రోజు భీష్ముడు కౌరవ సేనను చుట్ట చుట్టుకున్న పాములా నిలుపుతాడు. ఇది చాలా కష్టమైన వ్యూహం. ఈ వ్య్హూహం ద్వారా సైన్యాల స్తంభనను అంచనా వెయ్యడం కష్టం.

15. సర్వతోభద్ర వ్యూహం : తొమ్మిదవ రోజు భీష్ముడు సైన్యాన్ని సర్వతోభద్ర వ్యూహంలో నిలిపాడు.

16. మహా వ్యూహం : భీష్ముడు రెండవ రోజు ఈ వ్యూహాన్ని నిర్మించి అజేయుడై శత్రు సైన్యాన్ని హడలగొట్టించాడు.

Thursday, May 17, 2018

హిందువులు ఆచరించే విధానాలను

హిందువులు ఆచరించే విధానాలను #మూఢనమ్మకాలు అనుకుంటారు చాలామంది వాళ్లందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్న అప్పుడు ఉండే పరిస్తులను బట్టి అప్పటి జనాలకు అర్ధం అయ్యేలాగా కొన్ని #ఆచారాలను పెట్టారు ప్రతి ఆచారం వెనుక ఒక #శాస్త్రీయమైన కారణం ఉంది, ఇప్పటివాళ్లకు కొందరికీ అలా చెప్తే అర్ధం కాదు కదా.... అందుకే ఇలా చెప్పండి #హిందూమతం గొప్పతనం తెలియచేయండి.

Science పుట్టినదే హిందూ సంప్రదాయాల నుండి.. వంటల్లో వేసే పసుపు నుండి, వాకిట్లో వేసే ముగ్గు వరకూ అంతు తెలియని విజ్ఞానం హిందూ #ఆచారావ్యవహారాలలో దాగి ఉంది.

*#గెలీలియో 15 వ శతాబ్దంలో కనుగొన్న telescope ద్వారా నవ గ్రహాల విషయం ప్రపంచానికి తెలిసింది.. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు నవ గ్రహాలు ఉన్నాయని చెప్పి, వాటిని పూజించారు,ఇప్పటికీ పూజిస్తున్నారు కూడా

*#గురుత్వాకర్షణ సిద్ధాంతం ( Law of Gravitation) కనుగొన్నది న్యుటనా!? ఇది పూర్తిగా అసత్యం ఎందుకంటే ప్రాచీన భారతీయ గ్రంధాల నిండా #గురుత్వాకర్షణ సిద్దాంతం గురించి ప్రస్తావించబడి వుంది.
విమానం -పుష్పకవిమానం , అశరీరవాణి -రేడియో, మాయాదర్పనం- టెలీవిజన్, దృశ్యదర్శిణి-గూగుల్, టెష్ట్ ట్యూబ్ బేబి-కౌరవులు మయసభ- 3Dహౌస్, చరకుడు శుశ్రుడు లాంటి వైద్యులు చెప్తూపోతే ఇంకా కోకొల్లలు ఎన్నో వున్నాయ్.

*ఇంటి ముందు వేసే చుక్కల ముగ్గులో mathematics లోని n! సూత్రం దాగి ఉంది..వలయాకారపు ముగ్గులో, కేంద్రకం, electrons, neutrons, వాటి కక్ష్యలు ఉంటాయి.

*#పసుపు ఒక్కటి చాలు. ఎన్నో రకాల వ్యాధులు దూరంగా ఉంటాయి,

*#తులసి మొక్క ఉంటే చాలు.. ఇల్లు, ఒళ్ళు అంతా శుభ్రంగా ఉంటాయి.

*ప్రపంచం మొత్తంనికి బట్టలు వేసుకోటం తెలియక ముందే మన భారత దేశం లో గొప్ప సంస్కృతి వెలుగొందింది హిందూ మతం అంటే తర తరాలుగా మన భారతీయుల ఒక్క ఆచారాలు అలవాట్లు మన ఆచారాలను మన సంస్కృతుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ......
హిందుత్వం అంటే ఒక మతం కాదు మన పూర్వికులు మనకు ఇచ్చిన గొప్ప జీవన విధానం .....
ఏ మతంలో నైనా మంచి,చెడు ఉంటుంది కానీ మన మతం లో90% మంచి విషయాలు ఉన్నాయ్ వాటిని సరిచేసుకుంటే హిందుత్వం అంత గొప్ప జీవన విధానం ఉంకోటి ఉండదు.....

ॐ * #ఆచారాలుఅంతరార్థం *ॐ_*
ఆల‌యాల్లో గంట‌లు ఉండ‌డం…
ఆల‌యాల్లో ఉండే గంట‌ను ఏడు సార్లు కొడితే మ‌న శ‌రీరంలో ఉన్న ఏడు చ‌క్రాలు ఉత్తేజం అవుతాయ‌ట‌. అంతేకాదు మెద‌డు కుడి, ఎడ‌మ భాగాలు రెండూ కొంత సేపు ఏక‌మ‌వుతాయ‌ట‌. దీంతోమ‌న మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌లుగుతుంద‌ట‌. ఏకాగ్ర‌త పెరుగుతుంద‌ట‌. గంట‌ను మోగించ‌డం వ‌ల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశ‌న‌మ‌వుతాయ‌ట‌.

🍊 ఆడ‌వారు #గాజులు ధరించ‌డం వెనుక‌…
ఆ గాజుల వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ట‌. గాజులు ఎల్ల‌ప్పుడూ చేతి న‌రాల‌కు తాకుతూ ఉండ‌డం వ‌ల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌.

🍄 పిల్ల‌ల‌కు #చెవులు కుట్టించ‌డం…
చిన్నారుల‌కు చెవులు కుట్టించ‌డం స‌హ‌జ‌మే. ప్ర‌ధానంగా ఆడ‌పిల్ల‌ల‌కు, ఆ మాట‌కొస్తే కొంత మంది మ‌గ పిల్ల‌ల‌కు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి దాంతో వారికి వ‌చ్చే అనారోగ్యాలు పోతాయ‌ట‌. ప్ర‌ధానంగా ఆస్త‌మా వంటి వ్యాధులు రావ‌ట‌.

🍄 #రావి చెట్టును పూజించ‌డం…
హిందువుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజ‌లు చేస్తారు. ఈ చెట్ల‌యితే ఎక్కువ‌గా దేవాల‌యాల్లోనే ఉంటాయి. అయితే సాధార‌ణంగా చెట్ల‌న్నీ ప‌గ‌టి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తుంద‌ట‌. దీంతోనే రావి చెట్టును పూజిస్తారు.

🍅 కాలి వేళ్ల‌కు #మెట్టెలు ధ‌రించ‌డం…
హిందూ సాంప్ర‌దాయంలో పెళ్ల‌యిన మ‌హిళ‌లు కాలికి మెట్టెల‌ను ధ‌రిస్తారు. ఇలా ధ‌రించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి వారి గుండె నుంచి గ‌ర్భాశ‌యానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. అయితే వెండి మెట్టెలు ధ‌రిస్తే ప్ర‌కృతిలో ఉన్న పాజిటివ్ ఎన‌ర్జీ వారి శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంద‌ట‌.

🌹 నిద్రించేట‌ప్పుడు త‌ల‌ను #ఉత్త‌రానికి పెట్ట‌క‌పోవ‌డం.
భూమికి అయ‌స్కాంత క్షేత్రం ఉన్న‌ట్టుగానే మ‌న శ‌రీరానికి కూడా అయ‌స్కాంత క్షేత్రం ఉంటుంద‌ట‌. ఒక వేళ మ‌నం ఉత్త‌రం దిశ‌గా త‌ల‌ను పెట్టి ప‌డుకుంటే మ‌న శ‌రీరంలో ఉన్న ఐర‌న్ మెద‌డుకు ప్ర‌వ‌హించి బీపీ, గుండె సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. త‌ల‌నొప్పి, అల్జీమ‌ర్స్‌, పార్కిన్‌స‌న్స్ డిసీజ్ వంటి వ్యాధులు వ‌స్తాయ‌ట‌. కాబ‌ట్టి త‌ల‌ను ఉత్త‌రం దిశ‌కు పెట్టి నిద్రించ‌కూడ‌ద‌ట‌.

🌸 నుదుట‌న కుంకుమ బొట్టు ధ‌రించ‌డం…
నుదుట‌న కుంకుమ బొట్టును ధ‌రిస్తే అక్క‌డి న‌రాలు ఉత్తేజిత‌మై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయ‌ట‌. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ట‌.

💐 ఎదుటి వారికి రెండు చేతులతో #న‌మ‌స్క‌రించ‌డం...
ఎదురుగా ఉన్న వారికి రెండు చేతుల‌తో న‌మ‌స్క‌రిస్తే మ‌నం వారిని ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటామ‌ట‌. ఎలాగంటే రెండు చేతుల‌ను జోడించిన‌ప్పుడు చేతి వేళ్ల‌న్నీ క‌లిసిపోయి ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి మ‌న జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయ‌ట‌. దీంతోపాటు మెద‌డు ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌.

🌺 #నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం…
నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ప‌ద్మాస‌నం భంగిమ వ‌స్తుంది. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రిగి జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయ‌ట‌.
కార‌మైన ఆహారం ముందు, స్వీట్లు త‌రువాత తిన‌డం…
భోజ‌నం చేసిన‌ప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో జీర్ణ‌క్రియ‌కు అవ‌స‌ర‌మైన ఆమ్లాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయ‌ట‌. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రుగుతుంద‌ట‌. అయితే భోజ‌నం మొదట్లోనే స్వీట్లు తింటే అది మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణంచేయ‌నీయ‌ద‌ట‌.

🍀 #న‌దుల్లో నాణేలు వేయ‌డం…
ఒక‌ప్పుడు మ‌న ద‌గ్గ‌ర రాగితో చేసిన నాణేలు చ‌లామ‌ణీలో ఉండేవి. ఈ కార‌ణంగా ఆ నాణేల‌ను న‌దుల్లో వేస్తే ఆ రాగి అంతా ఆ నీటిని శుద్ధి చేసేద‌ట‌. దీంతో ఆ నీటిని తాగేవారికి ఎన్నో అనారోగ్యాలు దూర‌మ‌య్యేవ‌ట‌.
🌻 #ఉప‌వాసం ఉండ‌డం…

హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉప‌వాసం ఉంటారు క‌దా.ఆయుర్వేద ప్ర‌కారం అలా ఉప‌వాసం ఉండ‌డం చాలా మంచిది. ఎందుకంటే ఉప‌వాస స‌మ‌యంలో మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థకు పూర్తిగా విశ్రాంతి ల‌భించి శ‌రీరంలో ఉన్న ప‌లు విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్ట‌ బ‌డ‌తాయ‌ట‌. దీంతోపాటు దేహం త‌న‌కు తాను మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంద‌ట‌. ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌, బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్లు రావ‌ట‌!!!....

అందుకే నా హిందూ బంధు ప్రియమిత్ర ,స్నేహ బాంధవులారా ,మీరెంచుకున్న మార్గం మీకుటుంబపోషణేకే మీ అభివృద్ధి సంక్షేమానికే కావచ్చు ,వీటన్నింటికంటే ముఖ్యం మన ఆచార సంస్కృతీ పద్ధతులను మన ముందుతరాలకు(పిల్లలకు ) కొద్దీ సమయాన్ని కేటాయించి మనలాంటివారు చెప్పటమే మన అసలైన ధర్మం !....

Sunday, May 13, 2018

దశ మహావిద్యలంటే ఏవి?

1. కాళీ
2. తార
3. త్రిపుర సుందరి
4. ధూమావతి
5. భువనేశ్వరి
6. భైరవి
7. ఛిన్నమస్త
8. మాతంగి
9. బగళాముఖి
10. కమలాత్మిక

అనేక దశాబ్దాల పాటు వీటి పేర్లు చెప్పుకోవడం కూడా వాటి ఆవాహనే అని భావించారు. వీటి సౌమ్యతరమైన రూపాలని, అర్ధాలని, అంతరార్ధాలని తెలుగు వారికి అందించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. రమణ మహర్షి వంటి మహానుభావుల సమక్షంలో దశ మహా విద్యల సాధన చేసి అందులో ఉన్న శక్తి కేవలం గ్రంధాలుగా కాక నిజంగా చూపించిన వారు శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని. వారు వ్రాసిన ఉమా సహస్రాన్ని అమ్మ వారికి అంకితం చేసినప్పుడు అన్నారుట, " అమ్మా ! ఈ రచన నీకు నచ్చినట్లయితే నాకు తెలియజెయ్యి. ఏ భాగం నీకు నచ్చక పోతే ఆ భాగాన్ని నేను అగ్నికి ఆహుతి చేస్తాను " అని. అలా ఆయన ఆ మహా గ్రంధాన్ని చదవడం మొదలు పెట్టే సరికి, ఆ అమ్మ వారు కరుణాసముద్రయై ప్రతి పద్యానికో మెరుపు ఆకాశంలో చూపించిదిట. అంతటి దివ్య శక్తిని దర్శనీయంగా చూడడానికి ఎంత తపస్సు చేయాలో అనిపిస్తుంది. మరి ఈ దశ మహావిద్యలు దేన్ని సూచిస్తాయి అని సందేహం వస్తుంది. వీటి చిత్రాలు, విగ్రహాలు కూడా అన్నీ సౌమ్యం గా ఉండవు. ఉదాహరణకి కాళీ విగ్రహం ఎప్పుడూ ముండ మాలతో, ఖడ్గంతో భయంకరంగానే ఉంటుంది. వీటిలో కోమలత్వం ఏది అనిపిస్తుంది. మరి ఈ కాళికే తెనాలి రామలింగడికి విద్యని, ఐశ్వర్యాన్ని ఇచ్చింది. వెర్రి వాడైన కాళి దాసుకి కవిత్వాన్నిచ్చింది. అమ్మ తలుచుకుంటే లోటేముంది. అమ్మ ఒక సారి కోపంగా ఉంటుంది. ఒక సారి సంతోషంగా ఉంటుంది. బాగా అల్లరి చేస్తే ఒకటి పీకుతుంది కూడా. అమ్మ చేతి దెబ్బలు తినకుండా పెరిగిన వారెవ్వరు? ప్రేమ అనేది ఒక అపురూపమైన తత్వం. తిట్టుకున్న, కొట్టుకున్నా ప్రేమతో ఉంటే అవి అద్భుతంగానే ఉంటాయి.

ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి.

కాళీ, ఛిన్నమస్త - కాల పరిణామము
తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తము
త్రిపుర సుందరి, కమల - ఆనందము, సౌందర్యము
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి కాలం మనకి అనిపించేదే కాక అమరత్వాన్ని చూపే అనంత బయొలాజికల్ క్లాక్ లో నడిచే సమయం అన్నమాట. ఇక్కడ కాలభైరవుడు మార్గం చూపగలడు. అంతరాళం కూడా శూన్యమే కాదు, అది అంతులేని ప్రేమ వ్యక్త ప్రపంచంగా ఆవిర్భవించిని శక్తి. ఇది అర్ధం కావాలంటే శ్రీ కృష్ణుడు దారి చూపవలసిందే. వాక్కు అంటే కేవలం మాట కాదు, శూన్యంలో కూడా ప్రయాణించగల మనో తరంగ విశ్వసృష్టి స్పందన. దీన్ని తారా దేవి తెలియజేయ గలదు. ఇలా ప్రతి తత్వం ఆ తత్వపు మూల స్వరూపంలో ఆద్యా శక్తులుగా ఉపాసించడమే దశ మహా విద్యల స్వరూపం. అందుకే వీటిలో ఒక మౌలిక భావ సముదాయం ఉపాసనగా ఉంటుంది. సాధరణంగా వీటిని ఉపాసించే వారు వీటి విసృత పరిధిని జ్ఞాపకంలో పెట్టుకుని ఉంటారు. పట్టు పంచ కట్టుకుంటేనే పవిత్రత, తలస్నానం చేస్తేనే మనిషి అని కాకుండా (అంటే లేకపోతే కాదని కాదు సుమా) ఇంకొంచెం విభిన్నంగా బ్రహ్మత్వాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది అర్ధం కావాలంటే ఇంకో ఉదాహరణ హిమాలయాల్లో ఉండే యోగులని చూస్తే, వాళ్ళు రోజూ ఏ విధంగా పూజ చేస్తూ ఉండి ఉంటారు? మానస సరోవర ప్రాంతాల్లో ఉండే సాధకులు, శంభలగా టిబెట్లో పిలవబడే, షాంగ్రీలా అని చైనాలో కొలవబడే, శంభల గ్రామం అని భవిష్యపురాణంలో చెప్పబడిన ప్రాంతాలలో యోగులు ఎలా ఉంటారు? అక్కడ 'పవిత్రత ' తాలూకు నిర్వచనం ఏమిటి. వాళ్ళ భోజనపు అలవాట్లేమిటి? వస్త్రధారణ ఏమిటి, అసలు దాని ప్రాశస్త్యం వాళ్ళ దృష్టిలో ఏమిటి? నిజంగా శివపార్వతులు మనకి కనిపిస్తే వాళ్ళు ఏ బట్టల్లో ఉండి ఉంటారు? కళాంజలి చీర కట్టుకుని, కుమార్ జ్యూవలర్స్ వారి వడ్ఢాణాలు పెట్టుకుని ఉంటుందా అమ్మవారు ? ఇలాంటి వేల ప్రశ్నల జవాబులు కలిపితే కానీ బ్రహ్మత్వ స్వరూపం తాలూకు స్వరూపం ఆవగింజంత అర్ధం కాదు.

వేల పర్వతాలంతకన్నా ఎక్కువ వేదాలు. అవి అర్ధం కావేమోనని వాటి సారం ఉపనిషత్తులు. వాటి సారం అనుభవేక సారం కావాలని ఉపాసనలు. ఉపాసనా సిద్ధికి ఉపదేశాలు, మంత్రాలు. అప్పటికి అర్ధం కావేమోనని భజనలు, ప్రార్ధనలు. అవీ రావేమో నని పండగలు, పబ్బాలు. ఇంకెంత చెప్తారు ఋషులు?

దృశ్యం సర్వమనాత్మా స్యాద్ దృగేవాత్మా వివేకినః
ఆత్మా నాత్మా వివేకోయం కధితో గ్రంధ కోఠిభిః
(ఆత్మా నాత్మ వివేకము - శ్రీ ఆది శంకరులు)

ఈ విశ్వంలో మనకి కనిపించే ఈ సమస్త పదార్ధాలూ అనాత్మయే! అంటే ఆత్మ కానివే. వీటిని చూసే వాడు మాత్రమే ఆత్మ. అంటే బ్రహ్మ అని అర్ధం. ఆ బ్రహ్మత్వాన్ని నిరాకార రూపంగా సాధన చేయగల వారు యోగ శాస్త్రాన్ని (పతంజలి) అవలంబించి ఆ దివ్యశక్తిని అనుభవేకవేద్యం కావించుకున్నారు. అలా కాక నిరాకారము సర్వాకార స్వరూపం కనుక, ఆ శక్తి యోగులకి, ద్రష్టలకు దేవతామూర్తిగా - గాయత్రి వంటి బ్రహ్మ స్వరూపిణిగా అగుపించినపుడు ఆమె రూపాన్ని, మంత్ర స్వరూపాన్ని వారు మనకి అందించారు. అందుకే మంత్ర జపం చేసే ముందు కొందరు అంగన్యాస కరన్యాసాలు చేస్తారు. అందులో అర్ధం తమలో ఆ మంత్రాన్ని దాన్న తత్వాన్ని విలీనం చేసుకోవడమే! మంత్రంలో ఒకటిగా, ఆ శక్తిలో ఒకటిగా తమ

చేతులలో (కర్మ పరికరములు కరములు కనుక), వేళ్ళలో ఆ శక్తి స్వరూపాలను ఆవాహన చేస్తున్నాము. దాన్ని కరన్యాసము అని అంటున్నాము.

ఓం తత్సవితు బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః
వరేణ్యం విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః
భర్గో దేవశ్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః
ధీయోయోన జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః
ప్రచోదయాత్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః

Saturday, May 12, 2018

కుబేరునిగర్వభంగం ..

హిందూ పురాణాల ప్రకారం సంపదలను రక్షించే కుబేరుడు యక్ష రాజు. కానీ ఆయన గత జన్మలో ఓ దొంగ అనే విషయం ఎవరికీ తెలియదు. శివ పురాణం ప్రకారం గుణనిధి అనే వ్యక్తి తినడానికి తిండిలేక కటిక దరిద్రాన్ని అనుభవించేవాడు. దీంతో ఆకలికి తట్టుకోలేక దొంగతనాలకు పాల్పడేవాడు. అపారమైన సంపదలు కలిగిన శివాలయంలో ఒక రోజు రాత్రి దొంగతానికి చొరబడ్డాడు. ఇంతలో హఠాత్తుగా బలమైన గాలులు వీచి ఆలయంలో వెలుగుతున్న దీపం ఆరిపోయింది. దీపాన్ని వెలిగించడానికి గుణనిధి ప్రయత్నించిన ప్రతిసారీ బలమైన గాలి వీచేది. దీని వల్ల అతడి ప్రయత్నం నెరవేరలేదు. దీంతో తన ఉత్తరీయాన్ని తీసి నిప్పంటించాడు.

అనుకోకుండా తన పట్టుదలతో ఆలయంలో దీపం వెలిగించిన గుణనిధిని శివుడు అనుగ్రహించాడు. వచ్చే జన్మలో సంపదలకు అధినేతగా జన్మిస్తావనే వరాన్ని ప్రసాదించాడు. మహాదేవుడు తన భక్తులను సులభంగా అనుగ్రహిస్తాడనడానికి ఈ కథే నిదర్శనం. కాబట్టి సాయంత్రం పూట శివలింగం ముందు దీపం వెలిగిస్తే ఆర్థిక సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. దీపం వెలిగించి శివ పంచాక్షరీ మంత్రాన్ని (ఓం నమ:శ్శివాయ) ఉచ్ఛరించాలి.

వినాయకుడు అంటేనే జ్ఞానానికి ప్రతిరూపం. సకల సద్గుణాలకూ ప్రతిబింబం. గణేశుడు భక్తసులభుడు.

 ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు. ఆ మాటకు వస్తే అసలు పుష్పాలే లేకున్నా ఫర్వాలేదు. ఒక నాలుగు రెబ్బలు గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసులోని కోరికలను నెరవేరుస్తాడు. గaశుని ముందే అహంకారాన్ని ప్రదర్శిస్తే! తన హోదాను చూపించి చిన్నబుచ్చాలనుకుంటే..
సంపదకు అధిపతి అయిన కుబేరునికి ఓసారి తన వైభోగాన్నంతా దేవతలకు ప్రదర్శించాలన్న కోరిక మొదలైంది. అందుకోసం అంగరంగవైభోగంగా ఒక విందుని ఏర్పాటుచేశాడు. దానికి ముక్కోటి దేవతలనూ పిలవడం మొదలుపెట్టాడు.

 అలా శివుని కూడా తన విందుకి ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ కొలువై ఉన్న శివపార్వతును దర్శించుకుని, వారిని తన విందుకి రమ్మని ఆహ్వానించాడు. కుబేరుని వాలకం, అతని మాటతీరు గమనించిన శివపార్వతులకు అతని ఆహ్వానం వెనుక ఉన్న దర్పం అర్థమైంది.

‘నీ విందుకి రావాలనే ఉంది. కానీ బహుశా వీలుపడకపోవచ్చు. అందుకని, మాకు బదులుగా మా కుమారుడు వినాయకుడిని పంపుతాము,’ అన్నాడు పరమేశ్వరుడు. ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందినా, గణేశుడు కూడా శివుని ప్రతినిధే కాబట్టి, ఆయన ముందు తన అలకాపురి వైభవాన్నంతా ప్రదర్శించాలని అనుకున్నాడు. విందురోజు రానేవచ్చింది. ఒకొక్కరుగా దేవతలంతా కుబేరుని రాజధాని అలకాపురికి చేరుకుంటున్నారు. వారికి తన రాజ్యంలోని సంపదనంతా చూపించి మురిసిపోతున్నాడు కుబేరుడు. ఆ సమయంలో గణేశుడు అలకాపురిలో ప్రవేశించాడు. గణేశుని చూసిన కుబేరుడు ఆయనను సకల మర్యాదలతో ఆహ్వానించి, తానే దగ్గరుండి మరీ తన వైభవాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఇంతలో విందు మొదలైంది....
విందుకోసం తయారుచేసిన వందలాది భక్ష్యలను చూడటంతోటే ఆహ్వానితుల కడుపు నిండిపోతోంది. వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికెలో పూర్తిచేసి పారేశాడు. ఆపై తనకి ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్నీ కళ్లుమూసి తెరిచేంతలో ఆరగించడం మొదలుపెట్టాడు. వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా అటూఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టాడు. వందలాదిమంది కోసం వండిన ఆహారమంతా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోయింది. రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకువచ్చి వడ్డించినా ఉపయోగం లేకుండా పోయింది. ముక్కోటి దేవతల సాక్షిగా, కుబేరుడు వినాయకుని ఆకలిని తీర్చలేక నిస్సహాయంగా నిల్చుండిపోయాడు. ఆకలి తీరని వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దాన్ని గుటుక్కుమనిపించేయడం మొదలుపెట్టాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం, వినాయకుని ఆకలికి ఆజ్యమైపోతుందని అర్థమైపోయింది కుబేరునికి. వెంటనే పరుగులెత్తుకుంటూ కైలాసానికి చేరుకున్నాడు. జరిగినదంతా శివునికి వివరించి శరణువేడుకున్నాడు. ‘నాకు బుద్ధి వచ్చింది. ముల్లోకాలకూ అధిపతివైన నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలనుకున్నాను. ఇప్పుడు నా అస్తిత్వానికే ముప్పు వచ్చింది. దయ ఉంచి నన్ను రక్షించు,’ అంటూ సాగిలపడ్డాడు.

కుబేరుని బేల మాటలు విన్న శివుడు చిరునవ్వుతో, ‘భక్తి, వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేశునికి అర్పించినా అతని ఆకలి తీరుతుంది. దర్పంతో తన కడుపు నింపాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు,’ అంటూ ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేశాడు.

పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులను చేతపట్టుకుని పరుగుపరుగున అలకాపురికి చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురినే భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకునికి చేతులు జోడించి, శివుడు అందించిన గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పించాడు. ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుని ఆకలి తీరిపోయింది. గణేశుని ఆకలితో చిన్నాభిన్నమైపోయిన తన రాజ్యాన్నీ, చిన్నబోయిన తన పరివారాన్నీ చూసుకుని కుబేరుడు స్థాణువై ఉండిపోగా... వినాయకుడు మాత్రం బొజ్జను తడుముకుంటూ, చిరునవ్వుతో కైలాసానికి బయల్దేరాడు.
ఎంతటివారికైనా గర్వం పనికిరాదన్న నీతి ఈ కథలో కనిపిస్తుంది. అంతేకాదు! దర్పంతో కాకుండా భక్తితోనే ఆ గణపతి మనసుని జయించగలమన్న బోధా వినిపిస్తుంది.

🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻