Tuesday, November 3, 2020

మృత్యుంజయాష్టకం

1) మంధరపర్వతసహాయకసమయగృహీతవిషనీలకంఠం

 మాతంగముఖసుబ్రహ్మణ్యేశ్వరబాలాంబికారాధితం 

 మహేంద్రాదిదేవతాగణసమూహసతతసేవితాంఘ్రిం 

 మృత్యుంజయేశం రక్షతోమాం శంభుమనిశం      ||

2) మంజీరాభూషితమృదుపల్లవచరణకమలద్వయం 

    మందస్మితభక్తభయార్తిహరసుందరముఖారవిందం 

    మరుద్గణాదిసంతతసేవితశూలాయుధఢమరుకం 

    మృత్యుంజయేశం రక్షతోమాం శంభుమనిశం     ||

3) మార్కండేయప్రాణసంరక్షకసమవర్తీసంహరం 

  మందారబిల్వతులసీదళార్చితవిజితేంద్రియం 

  మంగళపరంపరాప్రదాయకభవ్యకల్పవృక్షం 

  మృత్యుంజయేశం రక్షతోమాం శంభుమనిశం   ||

4) మాలిన్యాదిరహితభాషాసూత్రప్రదవాఙ్మయకారకం 

   మాయాకల్పితజగన్నిర్మాణకారక మాయాతీతతత్త్వం 

   ముండమాలాలంకృతభస్మత్రిపుండ్రరుద్రాక్షధారిణం 

   మృత్యుంజయేశం రక్షతోమాం శంభుమనిశం ||

5. మృదుమధురమలయసమీరసంగీతామృతాస్వాదనం 

   మహిమాన్వితక్షీరసముద్రప్రదాయకకరుణాంతరంగం

   మణిమాణిక్యరత్నకేయూరాభరణభూషితకామరాజం 

   మృత్యుంజయేశం రక్షతోమాం శంభుమనిశం ||

6. మునిమానసకుహరసంతతప్రజ్జ్వలజాజ్జ్వల్యమానపరంజ్యోతిం   

   మానితభక్తజనావళిమానససరోవరవిహారసుందరరాజహంసం 

   మర్కటేశావతారశతయోజనవిస్తీర్ణసముద్రలాంఘనభవ్యతేజం 

   మృత్యుంజయేశం రక్షతోమాం శంభుమనిశం ||

7.మృత్యుప్రయాణసమయతారకమంత్రోపదేశవారాణసీపురేశం 

  మందాకినీనర్మదపుణ్యజలాభిషిక్తగిరిరాజసుతహృదయాధీశం

  మేధాదక్షిణామూర్తిస్వరూపసకలవిద్యాప్రదాయకజ్ఞానప్రదీపం  

  మృత్యుంజయేశం రక్షతోమాం శంభుమనిశం ||

8. మార్తాండశశాంకవహ్నితేజోమయకాలకాలస్వరూపం 

   మృగయాపాశపారశ్వధవజ్రఖడ్గకరధృతధవళవపుషం   

   మేదినీజలాగ్నివాయురాకాశసంస్థితపంచలింగరూపం  

   మృత్యుంజయేశం రక్షతోమాం శంభుమనిశం ||

 సర్వం శ్రీమృత్యుంజయదివ్యచరణారవిందార్పణమస్తు

"సాలిగ్రామ తీర్థం" (విష్ణు తీర్థం)


తీర్థము ఎలా పుచ్చుకోవాలి? తీర్థం అంటే ఏమిటి? మిగిలిన తీర్థం ఏమి చేయాలి? 

1) తీర్థం అనేది నేల మీద పడకూడదు, అటు లో పడిన ప్రతి చుక్క కోటి బ్రహ్మరాక్షసులు పుట్ట గలరుట, అందుకే కింద పెద్ద పళ్ళెం కింద ఉంచుతారు, గమనించారా?  

2) "కొంతమంది పెద్దలు తలకు రాసుకోకూడదు అని చెబుతారు, ఎందుకంటే ఆ ఎంగిలి తీర్థపు నీళ్లు పక్కనున్న వాళ్ల మీద పడతాయి అని జాగ్రత్త కొరకు మాత్రమే అని గమనించగలరు.  తలకు రాసుకుంటే "బ్రహ్మహత్య" దోషము పోతుంది. (సూక్తిముక్తావళి గ్రంథము).  

3) "విష్ణు తీర్థము "కాళ్ళమీద పడరాదు.  

4) ఆలయములో గాని, మీ ఇంటిలో గాని "తీర్థం" మిగిలిపోయిన  తులసి కోట లో కానీ, ఎవరూ తొక్కని ప్రాంతమందు, లేదా ప్రవాహం మందు, విసర్జించవలెను.   

5) దైవ ప్రసాదముగా నివేదించు ట కు ఈ తీర్థమును ప్రోక్షణ చేసి, తులసిదళం వేయవలెను, కొద్దిగా ఆవునెయ్యి ప్రోక్షణ చేయవలెను,  

6) ఒక ఏకాదశి నుండి మరియొక ఏకాదశి వరకు (15 రోజులు) తీర్థమును నిలువ ఉంచవచ్చు.  ఇంటిలో దేవతార్చన చేయువారు లేనప్పుడు,. మాత్రమే,. 

7)"తీర్థమును మూడుసార్లు విడివిడిగా తీసుకోవలెను, ఒకేసారి తీసుకొనరాదు.  

8) తీర్థమును పుచ్చుకునేవారు తమ కుడి చేతి  ని, ఆవు చెవి దొప్పలా, (gokarna కృతి) శబ్దమూ లేకుండా పుచ్చుకో వలెను (తీర్థ గోష్టి గ్రంథము).  

9)"తీర్థము పుచ్చుకున్న తరువాత చెయ్యి ని  కడుక్కో వలసిన పనిలేదు.  తల మీద రాసుకున్న వచ్చు కానీ పక్క వాళ్ళకి ఇబ్బంది కలుగ రాదు.  

10)"శంఖము లోని నీటిని తల మీద ప్రోక్షణ చేసుకోవలెను.  

11) "ఏకాదశి దినము వలననే శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున కూడా తీర్థమును ఒక్కసారి పుచ్చు కొనవలెను. (పంచరాత్ర గ్రంథము).  

12)"ఏకాదశి "నాడు ఒక మారును, "కృష్ణ జయంతి" నాడు మూడు మారులు తీర్థమును గ్రహించవలెను అని తెలుపుచున్నది.(విష్ణు పురాణం) సర్వపాపములు నశించును.   

13)" ఒక్క "ఏకాదశి "దినమున తప్ప మిగతా ఏ ఉపవాసము ఉండి న  రోజు అయియైననూ గంధము కలిపిన తీర్థమును విష్ణు వ్రత అభిమానము వలనగాని, వ్రత బంధము నేమో అను భయము వలన కాని, మూడు మార్లు తీసుకొనడం అతడు నాకు ద్రోహం చేసిన పాతకము నందును, ఎందుకు సందేహము పడనక్కరలేదు. (విష్ణు రహస్యం గ్రంథము నుండి సేకరణ).   

14) మనకు అత్యంత ప్రియమైన దంతా (అనగా మనము సంపదగా భావించే గృహం, ధనం, ధాన్యం, భార్య బిడ్డలు మొదలైనవన్నీ) భగవంతునికి సమర్పించి, మనం వండుకునే భోజన పదార్థములను శ్రీహరి కృపా కటాక్ష లబ్ధ మైనదిగా భావించి, శ్రీహరి రూప, గుణ చింత నా ఆనందమున, కుటుంబ సభ్యులు, అతిథులతో కూడి భుజించుట ఎంత యోగ్యమని శ్రీ ఆచార్యుల వారి సందేశం. (సదాచార స్మృతి 15 శ్లోకం).  

15) " భోజనానంతరం  సాలిగ్రామ తీర్థమును  తప్పక ఒకసారి స్వీకరించవలెను.   తినే ఆహారము సత్వరంగా జీర్ణం అయ్యేందుకు, సాత్విక బుద్ధి ఉద్దీపన మునకు,  కుడి చేతితో కడుపును నిమురుతూ" ఓం నమో నారాయణాయ" అనే మంత్రాన్ని కొద్దిసేపు జపం చేయాలని చెప్పబడింది.

Monday, November 2, 2020

మంత్ర జపం..!!

మంత్ర జపం యోగజపం కృత్వ పాప నివారణమ్, పరం మోక్ష మవాప్నోతి మానుషో నాత్ర సంశయః!

మానవుడు జ్ఞానమునకు నిధి, మంత్ర జపము వలన పాప నివారణ జరుగును. అటువంటి మంత్ర సాధన మానవ జన్మ వలనే సాధ్యమగును. దాని వలనే తత్వ జ్ఞానము సిధ్దించును. ఇతర జీవులలో జ్ఞాన గుణము లేదు.  కేవలం పుణ్యము చేయుట వలనే మనుష్య జన్మ లభించుచున్నది. అటువంటి మనుష్యుడు సాధన చేతనే దేవతా సమానమగుచున్నాడు. 

దేహము లేనిదే పురుషార్ధము సిధ్ధించదు. కనుక ఈ శరీరమును రక్షించుకొనుచూ జ్ఞాన ప్రాప్తికి సాధన చేయవలెను...

మననం చేయడం వలన కాపాడేది మంత్రం మనస్సుకు చాంచల్య స్వభావం (ఒకచోట ఉండకుండా అనేకరకాలుగా ఏదో ఒకటి చేయాలి చేయాలి అంటూనే వుంటుంది) ఎక్కువ. ఈ చంచల స్వభావం మానసిక వృత్తులను చిందరవందర చేస్తుంది. 

ఈ మానసిక వృత్తులు అన్నీ ఒకచోట చేరినప్పుడే అపారమైన శక్తి ఒకచోట చేరుతుంది. అప్పుడు ఆ శక్తి దైవశక్తి వలె పనిచేయడం ప్రారంభిస్తుంది. మంత్రానికి అంతఃకరణానికి సంబంధం వుంది. 

మంత్రజపం వలన మనస్సుని వశపరచుకోవచ్చు. 

నాడీ శుద్ధి జరుగుతుంది.

కుండలిని శక్తి జాగృతమౌతుంది. 

వ్యాధులు దూరమౌతాయి. 

మంత్ర సాధన వల్ల దేవతలు తమకు తామై దిగివస్తారు. నానావిధ సిద్ధులు సిద్ధిస్తాయి. 

మంత్రజప సాధన వలన సిద్ధులు కలుగుతాయని 

యోగా దర్శనం చెబుతుంది

ఎందరో మునులు, ఋషులు ఈమంత్రజపం వలనే సిద్ధులు సాధించారు. సాధన వలన అధర్మపరుడిని ధర్మపరుడిగా, 

దానవుణ్ణి మానవునిగా, పాషండుని సదాచార పరాయనునిగా, దుఃఖ వంతుడిని, సుఖవంతుడిగా, కోపిని శాంతునిగా, 

ధరిద్రుడిని ధనవంతుడిగా, లోభిని త్యాగిగా, కాముని, జితేంద్రియునిగా, నాస్తికుడిని ఆస్తికుడిగా, తెజోవిహీనుడిని తేజోవంతునిగా, రోగిని ఆరోగ్యవంతునిగా, చేస్తుంది.

అంధకారం నుండి ప్రకాశం వైపు మృత్యువు నుండి అమృతం వైపు, నరకం నుండి స్వర్గం వైపు, హింస నుండి అహింస వైపు, 

దుర్భుద్ధి నుండి సద్బుద్ధి వైపు, తీసుకొనిపోతుంది. మంత్రమే దేవతా రూపాన్ని పొంది అత్మసాక్షాత్కారాన్ని కలిగిస్తుంది.

జపం అనేది మూడు విధాలు

1.బాహ్య జపం 

2.ఉపాంశు జపం 

3.మానసికజపం


1.బాహ్య జపం.

ఒక జపమాల తీసుకుని దానిని ఒక నామాన్నో లేక మంత్రాన్నో ఉచ్ఛరిస్తూ కనుక విధిగా అభ్యాసం చేసినట్లైతే అది బాహ్య జపం !!


2.ఉపాంశు జపం.

ఈ దశలో జపం జరిగే సమయంలో మాల తిరుగుతుంది, పెదవులు కదులుతుంటాయి కాని శబ్దం బయటకు వినపడకుండా సాగుతుంది !!


3.అంతరంగ జపం.

ఇక్కడ ఈ స్థితిలో జపం నిరంతరాయమానముగా కొనసాగుతూనే ఉంటుంది ...జపమాల తిరుగుతూనే ఉంటుంది 

కాని పెదవులు నాలుక కదలవు కేవలం మనసులో మాత్రమే నామస్మరణ (మంత్ర జపం) సాగుతూ ఉంటుంది

జపంతో నిరంతరం భగవన్నామ స్మరణ చేయడం వల్ల, పరిపరి విధాలా పరుగులుదీసే ఇంద్రియాలు స్థిమితపడతాయి. 

మనం ఏ మంత్రాన్నైతే జపిస్తున్నామో అది మన మనసులోకి అంతకంతకూ గాఢంగా చొచ్చుకుపోతుంది. తొలుత బలవంతంగా కనిపించే ఈ ప్రక్రియ ఒక సాధనగా మారిపోతుంది. ఇలా కొన్నాళ్లు సాధన చేసిన పిమ్మట సాధకుడు 'అజపజపం' అనే స్థితిని చేరుకుంటాడు. అంటే జపం చేయకున్నా కూడా మనసులోని ఒక భాగంలో నామస్మరణ నిర్విరామంగా సాగిపోతూనే ఉంటుంది.

మిగతా జీవుల సంగతేమో కానీ మనిషికి శబ్దానికీ మధ్య గాఢమైన సంబంధం ఉంది. మనిషి శబ్దం ద్వారానే తన భావాలను వ్యక్తపరుస్తాడు. శబ్దాన్ని వినడం ద్వారానే ఎదుట ఏం జరుగుతోందో అవగతం చేసుకుంటాడు. మనిషి వినే మాటకి అనుగుణంగా అతనిలోని మనసు ప్రతిస్పందిస్తుంది. ఈ సృష్టి యావత్తూ ఓంకారం అనే శబ్దం నుంచి ఉత్పన్నం అయిందన్న వాదనలు హిందూ ధర్మంలో వినిపిస్తుంటాయి. అలాంటి శబ్దాన్ని ఉపాసించడం ద్వారా మనసుని లయం చేసుకోవడమే జపంలోని అంతరార్ధం.

అది నిర్విరామంగా సాగినా, 

జపమాల సాయంతో సాగినా.... 

మన జీవితాన్ని దైవ చైతన్యంతో అనుసంధానం కావడానికి, తనను తాను తరింప చేసుకోవడానికి ఒక నామాన్ని తలచుకోమని చెప్పడమే జప/మంత్ర సాధనలోని పరమార్థం..!


భగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన కోసం

1. భగవద్గీతను లిఖించినదెవరు?

=విఘ్నేశ్వరుడు.

2. భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?

= భీష్మ పర్వము.

3. గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?

=మార్గశిర మాసము.

4. గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?

=హేమంత ఋతువు.

5. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వసంత ఋతువు.

6. భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?

=శ్రీకృష్ణుడు అర్జునునికి.

7. భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?

=కురుక్షేత్ర సంగ్రామము.

8. భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?

=కౌరవ పాండవులకు.

9. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?

=అర్జునుడు.

10. వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=సామవేదము.

11. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?

=పాంచజన్యము.

12. భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?

=పద్దెనిమిది (18)

13. “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?

= వినోబా భావే.

14. “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

= మహాత్మా గాంధీ.

15. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?

= సంజయుడు.

16. సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కుమారస్వామి.

17. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?

=దేవదత్తము.

18. భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?

= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)

19. భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?

=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.

20. ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= శ్రీరామచంద్రుడు.

21. భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=అచ్యుత, అనంత, జనార్ధన.

22. భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=ధనుంజయ, పార్ధ, కిరీటి.

23. శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?

=గీతా గానం.

24. “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?

=ఎడ్విన్ ఆర్నాల్డ్.

25. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?

=పౌండ్రము.

26. ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=శంకరుడు.

27. “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

=మహాత్మాగాంధీ.

28. భగవద్గీత ఏ వేదములోనిది?

=పంచమ వేదం-మహాభారతం.

29. భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?

=11వ అధ్యాయము

30. ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=విష్ణువు

31. భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?

=అర్జున విషాద యోగము.

32. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?

=పదివేలమంది.

33. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?

=అనంతవిజయము.

34. భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?

= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభమయినది.

35. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?

=సంజయుడు.

36. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?

=దృష్టద్యుమ్నుడు.

37. ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వజ్రాయుధము.

38. మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?

=వజ్ర వ్యూహం.

39. గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?

=భీష్ముడు.

40. సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాసుకి.

41. అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= అనంతుడు.

42. మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?

=సుఘోషము.

43. అర్జునుని ధనస్సు పేరేమిటి?

=గాండీవము.

44. జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)

45. నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గంగానది.

46. ఆత్మ యెట్టిది?

=నాశరహితమైనది.

47. కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?

=నిష్కామ కర్మ.

48. మనుజునకు దేనియందు అధికారము కలదు?

=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)

49. అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?

=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)

50. వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?

= రావిచెట్టు.


విస్సాప్రగడ సత్యహరి

హిందూత్వం - వ్యక్తిత్వం 

http://www.youtube.com/c/SatyahariVissapragada9948256662


51. పంచభూతములచే నాశనము పొందనిది ఏది?

=ఆత్మ.

52. మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?

=మణిపుష్పకము.

53. ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?

=ఆత్మయందు.

54. మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?

=హనుమంతుడు.

55. పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గరుత్మంతుడు.

56. ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?

=తాబేలు.

57. కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?

=చేయుటయే మేలు.

58. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?

=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)

59. వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?

=లోక క్షేమం కొరకు.

60. ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కామధేనువు.

61. స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?

=స్వధర్మము.

62. పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?

=కామము చేత.

63. దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?

= కామము యొక్క ప్రేరణచే.

64. భగవంతుడెపుడు అవతరించును?

=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.

65. అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ప్రహ్లాదుడు.

66. గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= చిత్రరథుడు.

67. హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?

=జ్ఞానతపస్సు.

68. జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?

=పరమశాంతి.

69. ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?

=గాలిలేనిచోట గల దీపంతో.

70. ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?

=అభ్యాసము, వైరాగ్యము.

71. భయంకరమైన మాయను దాటుట ఎట్లు?

=భగవంతుని శరణుపొందుట వలన.

72. భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?

=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)

73. భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?

=అజ్ఞానులు.

74. విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?

=బ్రహ్మవిద్య.

75. మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= భృగు మహర్షి.

76. బ్రహ్మవిద్యకు అర్హత యేమి?

=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.

77. ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?

=పరమాత్మయందు.

78. గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?

=పరమాత్మయందు అనన్యభక్తిచే.

79. ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?

=భగవంతుని భక్తుడు.

80. సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?

=సాక్షాత్తు పరమాత్మయే.

81. ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మనస్సు.

82. పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మేరువు.

83. పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=బృహస్పతి.

84. వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=ఓం కారము.

85. యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?

=జప యజ్ఞము.

86. ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఐరావతము.

87. గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఉచ్ఛైశ్శ్రవసము.

88. శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?

= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)

89. దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= నారదుడు.

90. సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కపిల మునీంద్రుడు.

91. భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?

= మోక్షసన్యాస యోగము.

92. లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కాలము.

93. జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మొసలి.

94. ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?

= సత్త్వ, రజ, తమో గుణములు.

95. వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాయువు.

96. భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 35.

97. విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఆధ్యాత్మ విద్య.

98. రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాదము.

99. అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= "అ"-కారము.

100. భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?

= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)

101. మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మార్గశిరము.

102. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 20 (ఇరువది).

103. శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 26 (ఇరువదియాఱు).

104. శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 6 (ఆఱు).

105. తపస్సులెన్ని రకములు?

= మూడు (శారీరక, వాచిక, మానసిక)

106. పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?

= మూడు (ఓమ్, తత్, సత్).

107. మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?

= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.

108. సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?

వేదవ్యాసుడు.

దామోదరాఅష్టకం !


నమామీశ్వరం  సచ్చిదానందరూపం

లసత్కండలం గోకులే భ్రాజమానం

యశోదాభియోలుఖలాద్ధావమానం

పరామృష్టం అత్యంతతో దృత్యగోప్యా ||1||


రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం

కరాంభోజ యుగ్మేన సాతంకనేత్రం

ముహుఃశ్వాస కంప త్రిరేఖాంకకంఠ

స్థితంనౌమి దామోదరం భక్తిబదాం ||2||


ఇతీ దృక్ స్వలీలాభిరానన్దకుండే

స్వఘొషం నిమజ్జంతమాఖ్యాపయంతం

తదీయేసిజ్ఞేషు భక్తైర్జితత్వం

పున:ప్రేమతస్తం శతావృత్తి వందే ||3||


వరందేవ! మోక్షం న మోక్షావధిం వా

న చాన్యం వృనేహం వరేశాదపీహ

ఇదంతే వపుర్నాధ గోపాల బాలం

సదా మే మనస్యావిరాస్తాం కిమన్యైః ||4||


ఇదంతే ముఖాంభోజమత్యంతనీలై

ర్వృతం కుతంలై:స్నిగ్ధరక్తైశ్చ గోప్యా

ముహుశ్చుంబితం బింబరక్తాధరం మే

మనస్యావిటాస్తామలం లక్షలాబై: ||5||


నమోదేవ దమోదరానంత విష్ణో

ప్రసీద ప్రభో దుఃఖ జాలాబ్దిమగ్నం

కృపదృష్టి వృష్ట్యాతి దీనం బతాను

గృహేణేశ మామజ్ఞమేధ్యక్షీదృశ్యః ||6||


కుభేరాత్మజౌ బద్ధమూర్హ్త్యైవ యద్వత్

త్వయామోచితౌ భక్తిభాజౌకృతౌ చ |

తధా ప్రేమభక్తిం స్వకాం మే ప్రయచ్చ

న మోక్షే గ్రహో మేస్తి దమోదరేహ ||7||


నమస్తేస్తు దామ్నే స్పురద్దీప్తిధామ్నే

త్వదీయోదరాయాధ విశ్వస్య ధామ్నే

నమో రాధికాయై త్వదీయప్రియాయ

నమోనంత లీలాయ దేవాయ తుభ్యం ||8||


ఇతి శ్రీ దామోదరాఅష్టకం సంపూర్ణం

శ్రీ సప్తర్షి మండల స్తోత్రం

1) దశరథవాసుదేవావతారమరీచ్యాత్మజం 

   బలిగర్వాపహారవామనప్రియజనకం 

   కశ్యపధర్మసూత్రకశ్యపగీతరచయితం 

   శ్రీ కశ్యపార్షిం శరణం ప్రపద్యే ||

2) బ్రహ్మమానసపుత్రఅనసూయాకళత్రం 

   చంద్రదత్తాత్రేయదుర్వాసజనకం 

   అత్రిసంహితఅత్రిస్మృతిరచయితం 

   శ్రీ అత్ర్యర్షిం శరణం ప్రపద్యే ||

3) దేవగురుబృహస్పత్యాత్మజం 

   గంగానదీతీరఆశ్రమవాసినం 

   భారద్వాజస్మృతిరచయితం 

   శ్రీ భరద్వాజం శరణం ప్రపద్యే ||

 4) మహాతపఃశ్శాలిశ్రీగాధిపుత్రం 

    విచిత్రత్రిశంకుస్వర్గసృష్టికర్తం  

    బలాతిబలవిద్యాఉపదేశకాత్మం  

    శ్రీ విశ్వామిత్రం శరణం ప్రపద్యే ||

  5) శ్రీప్రచేతసమానసపుత్రం 

     గౌతమీగోదావరీఆవిర్భావకారణం 

     ధర్మసూత్రసంహితారచయితం 

     శ్రీ గౌతమర్షిం శరణం ప్రపద్యే ||

   6) పావనసూర్యవంశక్షత్రియగురుమూర్తిం  

      ధనుర్వేదసంహితవశిష్ఠస్మృతిరచయితం 

      పరమపతివ్రతాశిరోమణిఅరుంధతీకళత్రం

      శ్రీ వశిష్ఠర్షిం శరణం ప్రపద్యే ||

   7) శ్రీసత్యవతీఋచీకాత్మజం 

      శ్రీరేణుకాదేవికళత్రం  

      అరివీరభయంకరశ్రీపరశురామజనకం 

      శ్రీ జమదగ్నిం శరణం ప్రపద్యే ||

      సర్వం శ్రీసప్తర్షిమండలదివ్యచరణారవిందార్పణమస్తు

రుద్రరూపా



నాలుగు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు "రుద్రరూపాయై నమః " అని చెప్పాలి. 

"రుద్రరూపా = రుద్రుని యొక్క, రూపా = రూపుదాల్చినది."

రుద్రులు పదకొండు మంది ఉంటారు. వీళ్ళనే ఏకాదశ రుద్రులు అని అంటారు:

1) అజుడు 

2) ఏకపాదుడు

3) అహిర్బుద్యుముడు 

4)త్వష్ట

5) రుద్రుడు 

6)హరుడు 

7)శంభుడు 

8)త్రయంబకుడు

9)అపరాజితుడు

10) ఈశానుడు

11)తిరభువనుడు 

వీళ్ళు రోదసిలోని స్పందనాత్మక (Plane a Vibration) లోకానికి అధిపతులు. ఆకాశం శబ్ద గుణకం కాబట్టి ' నాదము' కూడా వీరికి సంబంధించిన లక్షణమే , సృష్టిని మూలం శబ్దం ఈ శబ్దమే ఓం కారం అన్ని శబ్దాలూ అందులో నుండి వచ్చిన బీజాలు ఒక్కో బీజం ఒక్కో శక్తి ఈ ఓంకార స్వరూపం అమ్మవారు అయితే అందునుండి వచ్చిన శబ్ద బీజాలు ఆమె శక్తిని కలిగి ఉండి సృష్టికి కారణం అవుతుంది, తిరిగి ఓంకార నాదంలోకి లీనమవుతుంది, అలా ఈ రుద్ర స్వరూపానికి  ప్రళయంలో సమస్త వస్తు జీవజాలాన్ని తమ లోనికి లీనం చేసుకునే లక్షణం వీరికుంటుంది. ఈ లక్షణం తోనే అమ్మవారు ఈ రుద్రరూపం దాల్చి లయ కారకత్వాన్ని నిర్వహిస్తుంది. ఒక్కో కార్య నిర్వాహణ కోసం ఒక్కో అవతార రూపంగా తనను తాను విభజించుకుని పాలిస్తున్న అమ్మవారు.

ఆదిశంకరులు సౌందర్యలహరిలో - 'క్వణత్కాంచీదామా.... ఆహోపురుషికా.. అనే శ్లోకంలో అమ్మవారిని పురమధితుః ఆహోపురుషికా' అన్నారు. అంటే, అమ్మవారు.పురరిపుడైన శివుని అహంకారస్వరూపిణీ' అని ఒక అర్థం. శివునికి గర్వకారణమైన రూపం అని ఇంకో అర్థం. శివుని 'స్వ- రూపం' లేదా సాక్షాత్తు తన రూపం' అని మరో అర్థం.

మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది అర్ధాలు చెప్పుకోవచ్చును:

1) రుద్రునిగా రూపు దాల్చినది. 

2) నాదరూపిణి

3) రుద్రుని స్వరూపము."

ఫలస్తుతి:

"ఈ నామ మంత్రం పాప పరిహార మంత్రం తెలిసి తెలియక చేసిన తప్పులు నుండి పరిహారం లభిస్తుంది, సమస్యలతో సతమతమవుతున్న వారు, ఏ జబ్బు లేకున్నా మానసిక ఆందోళన ఉన్నవారు, శత్రు భయం ఉన్నవారు, ఏదైనా చేతబడి జరిగింది అన్న అనుమానంతో మానసిక బాధను అనుభవిస్తున్న వారు..ఈ నామ మంత్రం ధ్యానం చేస్తూ ఉంటే త్వరగా పరిస్కారం లభిస్తుంది.. ఏదైనా మంత్రం త్వరగా సిద్దించాలి అంటే ముందుగా ఈ నామ మంత్రాన్ని లలితా సహస్త్రనామం తో సంపుటితం మండలం రోజులు చేసి శక్తి ఉపాసన చేస్తే  వారికి ఆ మంత్ర సిద్ది త్వరగా లభిస్తుంది."

"ఓం ఐం హ్రీం శ్రీo రుద్రరూపాయై నమః"

"శ్రీ మాత్రే నమః"