Monday, September 7, 2020

పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం

పితృ దోషం

మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ... 

అలాగే... 

తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.

మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.

అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు -

 మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే.

అలాగే మనము మన తాత, ముత్తాతలు, తండ్రి పట్ల చేసిన పాపమూ (తద్దినం  పెట్టకపోవడం లాంటివి) కూడా యీ దోషాలలొకి తీసుకుంటారు. 

అదే "పితృ దోషం "

ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం.

(వాట్సాప్ నుంచి పెట్టినది - ఎవరో మహానుభావుడు షేర్ చేసారు)

పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది. ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు. వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.

పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని:

  • చిన్న వారు అకాలమరణం పొందడం 
  • శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.
  • అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం మన ప్రమేయం లేకుండా
  • ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం
  • మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం

ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం కారణం. దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం.

స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే. అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.

1. కాశీ

2. పాపనాశి  ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)

అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.

విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు .

అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం -

స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే....

పాలు అన్నముతో చేసిన పాయసం,

అన్నము, ముద్దపప్పు, నేయి,

వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ! ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని  స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు . 

స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.

ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును ) 

అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ  స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.

ఈ ఆలయ చేరుకొనే విధానం :

అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం "

ఇంకొక ముఖ్య విషయం : స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశిశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రసిద్ది

శ్రీ గురుభ్యోన్నమః

Sunday, September 6, 2020

సాలగ్రామం

మన పూజా విధానంలో ‘సాలగ్రామ’ విశిష్టత అంతా ఇంతా కాదు. 

సాలగ్రామాన్ని విష్ణుమూర్తికి ప్రతీకగా చెబుతారు. ఎక్కడైతే సాలగ్రామముంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు కొలువుదీరి వుంటాడని చెబుతారు. 

కనుక ‘సాలగ్రామ’ పూజ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు చేసే పూజగా అభివర్ణించవచ్చు. 

సాలగ్రామ శిలయందు చరచరాత్మకాలయిన మూడు లోకాలు ఇమిడి ఉంటాయట. ఆ కారణంగా సాలగ్రామాన్ని భక్తితో పూజిస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం ఫలానికి సమానమవుతుంది. అంతేకాదు కోటి గోవులను దానం చేసినంత పుణ్యం సంప్రాప్తిస్తుంది.

సాలగ్రామ పూజవల్ల శివకేశవులిద్దరినీ పూజించిన ఫలితం లభిస్తుందని చెబుతారు. సాలగ్రామ శిలకు షోడశోపచార విధానాలు అర్జించిన భక్తులకు యావత్ కల్పాంతం వరకూ వైకుంఠాన నివసించే భాగ్యం కలుగుతుంది. 

సాలగ్రామానికి భక్తిశ్రద్ధలతో నమస్కరించి, పూజించినచో మరుజన్మ లేకుండా ముక్తి లభిస్తుందట. సాలగ్రామాన్ని స్మరించిన, దర్శించిన, నమస్కరించిన సర్వపాపాలు ప్రక్షాళనమవుతాయని శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది. సాలగ్రామ శిలయందు వుంచిన అన్ని పదార్థాలు పవిత్రములవుతాయి. దీనిని ముందుంచుకుని పితృదేవతలకు తర్పణాలు ఇచ్చినచో, పితృదేవతలకు పైలోకాలలో శాశ్వత సుఖాలు లభిస్తాయట. సాలగ్రామ తీర్థాన్ని సేవించినచో వెయ్యిసార్లు పంచామృతాన్ని సేవించిన ఫలితంకన్నా, ప్రాయశ్చిత్తములందు ఆచరించే దానాల ఫలితాలకన్నా అధిక ఫలితం కలుగుతుందంటారు. యోగాశాస్త్రం, సాంఖ్యాశాస్త్రాలు తదితర ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియకున్నా, చదవకున్నా, ఒక్కసారి సాలగ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి, అభిషేకిస్తే కోటి లింగాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందట. 

తటాకాలందు సాలగ్రామాన్ని ఉంచి, ఆ నీటితో స్నానమాచరిస్తే సర్వతీర్థాలందు స్నానమాచరించిన పుణ్యఫలం కలిగి, సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుందంటారు. అలాగే సాలగ్రామాన్ని అభిషేకించిన జలాలను ప్రోక్షించుకుంటే, పవిత్ర గంగాస్నానం చేసినట్లే అవుతుందట. సాలగ్రామ తీర్థం అత్యంత పవిత్రమైనది. విశేషమైన మహత్తు కలది. అలాంటి తీర్థాన్ని సేవించినవారికి పునర్జన్మ ఉండదట. విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని విష్ణ్భుక్తుడైన సత్ బ్రాహ్మణునికి దానమిస్తే వంద యాగాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంతటి విశేషాలున్న ఈ సాలగ్రామ శిలకు ఈ పద్నాలుగు లోకాలలో సరిపడే వేరొక శిల లేదని శాస్త్రాల ద్వారా అవగతమవుతోంది. సాలగ్రామంపై శుద్ధమైన మట్టితోగాని, రంగులతోగాని, కేశవ నామాన్ని రాస్తే, కోటి కల్పాల వరకూ స్వర్ణంలో నివసించే భాగ్యం కలుగుతుందట. పూజాపీఠమందు సాలగ్రామాన్ని అమరిస్తే సమస్తమైల పూజలు సక్రమంగా సాగి పరిపూర్ణమైన ఫలితాలు సొంతమవుతాయి. సాలగ్రామాలను ఆవుపాలతోగాని, పంచామృతంతోగాని శుద్ధి చేయాలి. ‘రుద్రాక్ష ధారణ’ నియమాలనే సాలగ్రామ పూజలందు పాటించాలి. ప్రత్యేక సమయాలందు, సంక్రమణ కాలాలందు, గ్రహణ సమయాలందు ఆయా సాల గ్రామాల ననుసరించి ఆయా దైవ జపాలను 1008 సార్లు చేస్తే లేదా చేయించుకుంటే అలాంటి సాలగ్రామాల శక్తి ద్విగుణీకృతమవుతుందని శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది. సాలగ్రామాలందు ఉన్న చక్రాలననుసరించి వాటిని పిల్వడం జరుగుతోంది. ఏకచక్రముంటే సుదర్శనమని, రెండు చక్రాలుంటే లక్ష్మీ నారాయణమని, మూడు చక్రాలుంటే అచ్యుతుడని, నాలుగు చక్రాలుంటే జనార్థుడని, ఐదు చక్రాలుంటే వాసుదేవుడని, ఆరు చక్రాలుంటే ప్రద్యుమ్నుడని, ఏడు చక్రాలుంటే సంకర్షణుడని, ఎనిమిది చక్రాలుంటే పురుషోత్తముడని, తొమ్మిది చక్రాలుంటే నవ వ్యూహమని, పది చక్రాలుంటే దశావతారమని, పదకొండు చక్రాలుంటే అనిరుద్ధుడని, పనె్నండు చక్రాలుంటే దాదశాత్ముడని, పదమూడు చక్రాలకన్నా ఎక్కువ చక్రాలుంటే ‘అనంతమూర్తి’ అనే పేర్లతో పిల్వడం జరుగుతోంది. సర్వపాపహరమైనది, సర్వచింతనల నుంచి దూరం చేసేది, సర్వదేవతా పూజా ఫలితాలనిచ్చేది, సర్వశ్రేయస్కరమైనదని అయిన సాలగ్రామాన్ని పూజించడం, మానవుల అదృష్ట్భాగ్యంగా శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి సాలగ్రామాన్ని భక్తితో పూజించడం భక్తిముక్తిలకు మార్గం సుగమం చేసుకోవడంగా చెబుతారు.

Saturday, September 5, 2020

పితృఋణం

నేటి సాంకేతిక శాస్త్రం నిరూపించిన విషయం ఒకసారి అవలోకన చేసుకుందాము. మనకు వర్షం ఎలా పడుతుంది అంటే చిన్నపిల్లవాడు కూడా చెబుతాడు, నదుల్లో, తటాకాలలో, సముద్రాలలో ఉన్న నీరు సూర్యుని ప్రతాపానికి ఆవిరిగా మారి సాంద్రతలో తేడా వలన ఆకాశానికి చేరి మేఘంలా మారి అడ్డుగా ఉన్న కొండల వలన, వాతావరణం వలన నేలపై తిరిగి వర్షంగా అదే నీరు వస్తుంది. ఆ నీరు ఎక్కడ గ్రహింపబడినదో అక్కడే కురవాలన్న కట్టుబడి లేదు. మురికి కాలువలో ఉన్న నీరు కూడా ఆవిరిగా మారి వర్షం పడేటప్పుడు తన మురికిని పోగొట్టుకుని మరల మంచి నీటిగా వర్షిస్తుంది. అదే వాతావరణంలో ఆమ్ల సారాలు ఉంటె ఆమ్లవర్షాలు, ఇతర రకాలుగా పడుతుంది.

మన వాంగ్మయం ఇంచు మించు ఇదే రీతిలో మన పునర్జన్మను వివరిస్తుంది. కాలమనే సూర్యుడు కిందనున్న జీవుల ఆత్మలను ఆ శరీరాల నుండి విడి చేసి ఇతర లోకాలకు పయనింపచేస్తుంది. ఈ జీవుడు చేసుకున్న పాప పుణ్యాల ఫలితంగా యాతనా శరీరం ద్వారా స్వర్గ నరకాలలో సుఖ దుఃఖాలు అనుభవించి వారి కర్మఫలా విశేషం వలన చంద్రుని ఆశ్రయించి మొక్కలు ఇతర ఫలపుష్పాల ద్వారా బీజరూపంలో ఆహారంగా మారి, జీవులు తిన్న ఆ తిండి వలన వీర్యంగా మారి ఆయా జీవుల శరీరం నుండి పునః ఉద్భవిస్తాయి.

గరుడపురాణం, విష్ణుపురాణం ఇత్యాది పురాణాలు ఈ విషయం కూలంకషంగా చర్చించాయి. ముందుగా మనం మాట్లాడుకుంటున్నది జీవాత్మ గురించి. జీవుని విగత శరీరం నుండి జీవాత్మ బయటకు వస్తుంది. ఊర్ధ్వ రంధ్రాల నుండి బయల్వడిన జీవాత్మ ఊర్ద్వ లోకాలకు, అధో రంధ్రాల నుండి విడువడిన ఆత్మ ప్రయాణం అధో లోకాలకు. శరీరానికి కర్మ కాండ జరిగిన పద్ధతి ప్రకారం పదకొండో రోజు సపిండీకరణ ద్వారా అతడికి యాతనా శరీరం ఇవ్వబడుతుంది. ఆ యాతనా శరీరంతో ఆ జీవాత్మ తనకు నిర్దేశించబడిన లోకాలకు ప్రయాణం చేస్తుంది.

ప్రతి మాసికంలో ఇచ్చే తిలధాన్యాలతో బలం పుంజుకుని ప్రయాణం సాగిస్తుంది. సంవత్సర కాలంలో యాత్ర పూర్తి చేసుకుంటుంది. ఈ కాలం అంతా కూడా తన వారితో అనుబంధం వదులుకోలేక వారు పెట్టె పిండాలు స్వీకరిస్తూ వెళ్తూవుంటుంది. యమధర్మరాజు వేసే శిక్షలను అనుభవించేది ఈ యాతనా శరీరమే. శరీర భ్రాంతితో వున్నది కనుక జీవాత్మ అది తానే అనుభవిస్తున్నట్టు భావిస్తుంది. అతడి పాప పుణ్యాల ఖాతా ప్రకారం ఆ యాతన శరీరానికి ఆ శిక్షలు లేదా స్వర్గ భోగాలు లభిస్తాయి. ఒక్కసారి స్వర్గానికి కానీ నరకానికి కానీ చేరినాక వారికి ఒక రోజు వ్యవధి మనకు సంవత్సర కాలము. వారు పోయిన తిధి నాడు వారికి తద్దినం పెట్టి తర్పణాలు వదులుతాము. అది వారికి భోజనము.

అలా ఎవరైతే పిత్రు దేవతలను సంతోష పెడతారో వారిని తృప్తిగా ఆశీర్వదిస్తారు. వారు దేవతల కన్నా మనకు కావలసిన వారు. పితృదేవతలను క్షోభ పెట్టిన వారు వారి ఆగ్రహానికి గురయ్యి బాధలు అనుభవిస్తారు. కొన్ని పర్వదినాలలో వారికి తర్పణాలు వదిలే పద్ధతి మన సాంప్రదాయంలో వుంది. అది వారికి తేనీరు లా/ స్నాక్స్ లా అందే అవకాశం అన్నమాట. ఇక్కడ మనం పెట్టె పిండాలు వారికి ఎలా భోజనాలు అవుతాయి అంటే మనం ఇక్కడ ఆన్ లైన్ లో పంపిన డబ్బు వేరొక దేశంలో వారి కరెంసీలో వారికి అందడం లాంటిది. బ్రహ్మ కపాలం దగ్గర పెట్టిన పిండం ఆ తండ్రికి బ్యాంకు లో ఫిక్సెడ్ డిపాజిట్ లాంటిది. దాని మీద వచ్చే వడ్డీ తో ఆ పితరుల జీవనం గడుస్తుంది అన్నమాట. కానీ అక్కడ పిండం పెట్టినా కూడా సంవత్సరీక శ్రాద్ధం తప్పనిసరి. వారిని ఎంత తృప్తి పరచితే మనకు అంత సౌభాగ్యము, రక్షణ.

ఇలా ఊర్ధ్వలోకాలకు చేరిన పితృదేవతలు పిత్రులోకంలో వసురూపంలో మసలుతారు. తమ పితృదేవతలంటే కేవలం గతించిన మన తల్లిదండ్రుల మాత్రమె కాదు. మూడు తరాల వారి రూపం అక్కడ ఉంటారని చెబుతుంది శాస్త్రం. తండ్రి వసు రూపంలో, తాత గారు రుద్ర, ముత్తాత గారు ఆదిత్యరూపంలో ఉంటారని వారి అందరినీ త్రుప్తి పరచవలసిన బాధ్యతనే మనము పితృఋణం అంటాము. అలాగే ఇటువంటి ప్రక్రియ నిత్యం జరిగేట్టు నువ్వు వారసులను కనాలి, అప్పుడే ఇది నిరాటంకంగా సాగుతుంది. వారందరికీ శాంతి కలిగేట్టు మనం చేసే పిండ ప్రదానం వారిని ఆనంద పరచి మనకు తిరిగి ఆశీర్వాద రూపంలో తిరిగి వస్తుంది. వారు అప్పటికే మరొక జన్మ తీసుకున్నట్టు అయితే వారికి ఆ సమయానికి అదృష్టంగా అందుతుంది. ఒకొక్కసారి మనకు ఒక లాటరీ తగలవచ్చు, లేదా పెద్ద కష్టాలలో ఉన్నప్పుడు ఒక మంచి అదృష్టం ఏదో కలిసి రావచ్చును. అంటే మన పూర్వజన్మలో మన వంశం వారు మనలను ఉద్దేశించి శ్రాద్ధ దానాదులు చేసారని అర్ధం. నువ్వు పుచ్చుకోవడమే కాదు నీకు కూడా ఆ బదులు తీర్చుకోవలసిన విధి ఉన్నది. అందుకు నువ్వు కూడా శ్రాద్ధం, తర్పణం తప్పక వదలాలి. ఇది ధర్మశాస్త్రం నీ మంచి కోసం చెబుతున్నది. నమ్మిక ప్రధానం. నమ్మి చేస్తే తప్పక నీకు పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది.

పితృదేవతలను సంతృప్తి పరచే విధానం మనకు శాస్త్రం బోధించి వుంది. తిలలతో వారిని ఆహ్వానించి తిలతర్పణం తిలలతో కలిసిన పిండి కానీ అన్నం గానీ ఉదకంతో వారికి ఇవ్వాలి. తిలలే ఎందుకు అంటే.. వారికి అందే మధ్యస్థం అది. మనం అమెరికాలో ఉన్న ఒక స్నేహితునికి డబ్బు పంపాలంటే ఇక్కడున్న డబ్బుని మారకం ద్వారా ఆన్ లైన్ లో ఎలా పంపితే వారికి చేరుతుందో ఇప్పటి సాంకేతికత చెప్పినట్టు ఇది సనాతన సాంప్రదాయం. తిలలతో స్వధాకారంతో ఇచ్చిన శ్రాద్ధతర్పణాలు వారికి అందుతాయి. ఎలా అయితే స్వాహాకారంతో ఇచ్చిన హవనం అగ్నిదేవుడు ఒక పోస్ట్ మాస్టర్ లా తీసుకువెళ్లి ఆ ఉపాస్య దేవతలకు అందచేస్తాడో, స్వధాకారంతో చేసిన తర్పణం పితృదేవతలకు అందుతుంది.

ఒకసారి శంతన మహారాజుకు భీష్ముడు పిండ ప్రదానం చెయ్యబోతే శంతన మహారాజు స్వయంగా నీటి నుండి చెయ్యు చాపగా పరమధార్మికుడైన భీష్ముడు శాస్త్రం ఈ విధంగా చెప్పలేదని నీటిలోనే వదిలి ఆయనకు అందేలా చేస్తాడు. శాస్త్రం చెప్పిన విధంగా వదిలిన తర్పణాలు, పిండాలు పితృదేవతలు కర్మభూమి అయిన మన దేశంలో మాత్రమె గ్రహింపగలిగే శక్తి పితృదేవతలకు ఇచ్చాడు. భోగభూముల్లో చేసిన తర్పణాధులు వారు స్వీకరించలేరు. ఏమి కర్మ భూమి మాత్రమె ఎందుకు అంటే ఈ లోకానికి ఉదరం లాంటిది ఈ కర్మ భూమి. ఇక్కడ చేసిన కర్మలు మాత్రమె వారికి చేరుతాయి.

ఆపస్థంభ గృహ్యసూత్రములలో ఆచారకాండలో ఐదు రకాల శ్రాద్ధకాండ వున్నవి...

1) సాపిండీ (పిండ ప్రదానం),

2) సంకల్ప (ఇద్దరు బ్రాహ్మణులకు సంకల్ప పూర్వకంగా పెట్టేది),

3) బ్రాహ్మణ భోజనం (ఒక బ్రాహ్మణునికి తర్పణం సకల్ప సహితంగా),

4) ఉపాదాన (స్వయంపాకం),

5) అశ్రుతశ్రాద్దేషు (చెయ్యలేకపోతున్నా తండ్రీ అని అశ్రువులతో చెప్పుకోవడం) "పంచశ్రద్ధా: ప్రకీర్తితా“.

ఒకదాన్ని కంటే ఒకటి ఒకొక్క మెట్టు తక్కువది. మూడులోకాలలో ఎక్కడున్నా చేరేట్టు ఒక పిండం నీటిలో జలచరా రూపంలో స్వీకరించే విధంగా, అగ్ని రూపం లో స్వధాకారం తో, ఆవుకు ఆహారంగా పెట్టి అందేట్టు మనం శ్రాద్ధ పిండాన్ని పెడతాము. అలాగే వసు, రుద్ర, ఆదిత్య రూపాలలో ఆవాహన చేసిన బ్రాహ్మణులను త్రుప్తాస్థ అని వారికి తృప్తి కలిగేలా శ్రద్ధగా భోజనం పెట్టి వారిని సంతోషపెట్టడం ద్వారా మన పితృదేవతలను ఆనందపెట్టినవారం అవుతాము. ఇక్కడ మనం డి డి తీసి చెప్పిన విధానం పాటిస్తే యెక్కడో ఉన్న మనవారికి డబ్బు నగదు చేరినట్టు ఇక్కడ మనం చేసిన శ్రాద్ధం వారికి ఆహారంలా అంది వారు ఆనందపడి మరల నిన్ను దీవించి నీ కోసం దేవతలతో కూడా పోరాడి నీకోసం మంచి చేస్తారు మన పితృదేవతలు. శ్రాద్ధం తర్పణం ఎవరికోసమో కాదు చేసుకునేది, నీ కోసం నువ్వు చేసుకోవడమే.

ఈ ఋణం తప్పక తీర్చుకోవాలి లేదంటే అటువంటి వారి జీవితం వ్యర్ధం...

|| ఓం నమః శివాయ ||

సాంబ్రాణి ధూపం

సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా ఏడు రోజుల్లో  - ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చునని వారు చెప్తున్నారు. 




ఆదివారం.:

ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే.. ఆత్మబలం, సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు, 

ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది.

సోమవారం.:

దేహ, మానసిక ఆరోగ్య వృద్ధి. మానసిక ప్రశాంతత.. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.

మంగళవారం.:

శత్రుభయం, ఈర్ష్య, అసూయ, తొలగిపోతాయి. 

కంటి దృష్టిలోపాలుండవు. 

అప్పుల బాధ తొలగిపోతుంది. 

కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది.

బుధవారం. :

నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం, పెద్దల, మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి వుంటుంది.

గురువారం.:

గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి. 

చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి.

శుక్రవారం.:

లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. 

శుభకార్యాలు చేకూరుతాయి. 

అన్నింటా విజయాలుంటాయి.

శనివారం.:

 సోమరితనం తొలగిపోతుంది. 

ఈతిబాధలుండవు. 

శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహం పొందవచ్చు.

Friday, September 4, 2020

శ్రీహృషీకేశాష్టకం

1) నమో భగవతే హృషీకేశాయ

   సహస్రవదనాన్వితసహస్రాక్షాయ 

   యక్షగంధర్వకిన్నరసేవితాయ

   వేదవేదాంగశాస్త్రపురాణసన్నుతాయ ||

2) నమో భగవతే హృషీకేశాయ 

   శౌర్యపరాక్రమభవ్యతేజోమయాయ 

   వశిష్ఠవామదేవాదిమునిగణపూజితాయ 

   కౌంతేయాదిసురక్షకమలహస్తాయ ||

3) నమో భగవతే హృషీకేశాయ 

   సమ్యక్పరిశీలనాశక్తిప్రదాయకాయ 

   భక్తధృవధృవమండలప్రదాయకాయ 

   తులసీబిల్వమాలాధరపన్నగశయనాయ ||

4) నమో భగవతే హృషీకేశాయ 

   భక్తానురక్తశుభప్రదచతుర్భుజాయ  

   ఆద్యంతరహితకాలపురుషాయ  

   సవితృమండలమధ్యస్థాయ ||

5) నమో భగవతే హృషీకేశాయ  

   అజ్ఞానాంధకారహరణగురుస్వరూపాయ 

   సర్వోపద్రవారణనళినేక్షణాయ 

   సత్యాసత్యవివేకవిచక్షణాశీలాయ ||

6) నమో భగవతే హృషీకేశాయ 

   నవనవోన్మేషపరాద్యుతిభాసమానాయ

   ధ్యానమగ్నఅర్ధనిమీలితనేత్రాయ 

   వ్యాసాంబరీషప్రహ్లాదాదిసేవితాయ ||

7) నమో భగవతే హృషీకేశాయ 

   శ్రీఆదిశంకరాచార్యారాధ్యదైవతాయ 

   యోగీశ్వరనిర్మలహృదయస్పందనాయ 

   జీవపరిణామశీలప్రభావవైశ్వానరాయ ||

8) నమో భగవతే హృషీకేశాయ 

   జడాజడవ్యక్తావ్యక్తస్వరూపాయ 

  రత్నప్రవాళముక్తాకేయురహారభూషితాయ 

   సత్సంగవ్యాసంగనామపారాయణాసుప్రీతాయ ||


|| సర్వం శ్రీహృషీకేశదివ్యచరణారవిందార్పణమస్తు || 

Wednesday, September 2, 2020

పంచముఖాల ప్రాశస్త్యం


 తలచుకున్నంత మాత్రాన సకల కష్టాలనూ చిటికెలో రూపుమాపేవాడు ఆంజనీ పుత్రుడు. కొలిచినంత మాత్రాన సకల అభీష్టాలనూ నెరవేర్చేవాడు ఆ హనుమంతుడు. మనుమంతుని పంచముఖుని రూపంలో ఆరాధించడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నదే. కానీ ఇదేమీ కొత్తగా చేరిన ఆచారం కాదు! శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది.

మైరావణ వృత్తాంతం: రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం... తెలిసిందే! సీతను చేజిక్కించుకునేందుకు రామరావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలుపడిపోతాడు. వెంటనే పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా.... అందరి కళ్లూ కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు.

హనుమంతుని పయనం: రామలక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు. అక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు. ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవ్వరో కారనీ... తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఓ జలకన్య గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది. అయినా ఉద్యోగధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు, హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్యా జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది.

మైరావణుని సంహారం: మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది. అందుకోసం తూర్పు, పశ్చిమము, ఉత్తరము, దక్షిణము, ఊర్ధ్వముఖం... ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి, అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి... మైరావణుని అంతం చేస్తాడు. అతనే పంచముఖాంజనేయుడు.

పంచముఖాల ప్రాశస్త్యం: అయిదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ, అయిదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. అలాంటి అయిదు సంఖ్య గురించి చెప్పేదేముంది. స్వామివారి పంచముఖాలలో ఒకో మోముదీ ఒకో రూపం. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహావతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే అ అయిదు ముఖాలు తన భక్తులను అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నారసింహ ముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్షునీ, వరాహము అష్ట ఐశ్వర్యాలనీ, హయగ్రీవుడు జ్ఞానాన్నీ, ఆంజనేయ రూపం అభీష్టసిద్ధినీ కలుగచేస్తాయి. ఇంతటి శక్తిమంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు.  

మహాలయ అమావాస్య పితృదిన పక్షము

వివరములు  మరియు  విశేష  పరిహారము :

ఈ సంవత్సరము సెప్టెంబర్ 2,  2020 బుధవారం, నుండి మహాలయ పక్ష ప్రారంభం అవుతుంది. భాద్రపదమాస శుద్ధ పూర్ణిమ తదుపరి పితృపక్షం jమొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించబడినవి. పితృ దోషం అంటే అది ఒక శాపం అని గమనించాలి. కుటుంబ సభ్యులలో ఎవరైనా ప్రస్తుత జన్మలోనైనా గత జన్మలోనైన వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం, నష్టం కలిగించి వారిని భాద పెట్టి ఉంటే ఈ శాపం వరిస్తుంది. పిత్రుదోషం ఉన్న ఇంట్లో అని అపశ్రుతులు, ఇబ్బందులు, అనేక సమస్యలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులో లేక తాత, ముత్తాతలో తన కుంటుంబంలో ఎవరినో ఇబ్బంది కలిగించిన ఘోష ప్రభావం ఇందుకు కారణమని గ్రహించాలి.

పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు, శాపాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. సరైన వయస్సులో పెళ్ళిళ్ళు కాకపోవడం, సంతానం కాకపోవడం, వారితో సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు కలగడం మొదలగునవి కలుగుతాయి.

కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలో మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు ఉండటం వంటివి. ప్రతి మనిషీ తన జీవితంలో తప్పక పితృఋణం తీర్చు కోవాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం, వంశీయులు పితృ ఋణం తీర్చక పొతే వారికి ముక్తి లభించదు. 

మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చెందిన పితృ దేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి.

ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధకర్మ నిర్వర్తించటం వలన పితరులకు తృప్తి కలుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది. పితరులను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు.

సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనలు ఇవ్వకుండా బాధపడి వెళ్ళిపోతారు, అది మంచిదికాదు. నిజానికి ప్రతి మాసంలోను అమావాస్య పితరుల పుణ్య తిథిగా భావించబడినా, తర్పణవిధి నిర్వర్తించలేక పోయినా, మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షంలో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవరూ శ్రాద్ధ విముఖులు కాకూడదు. శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది.

ఆదర పూర్వకంగా శ్రాద్ధ కర్మతో మరణించిన పెద్దలను (పితృదేవతలు) సంతోషపెడి తే వారు తమ సంతత వారికి ఆయుః, విద్య, ధనం, సంతానం, సమస్తము కలిగి ఉండేటట్లు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధకర్మలో నువ్వులు, బెల్లం కలిపిన అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాల లోనూ, గోదానము,  అన్నదానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే 'మఖ' నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలాన్నిస్తుంది. ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటు వంటి ఫలితం లభిస్తుందని మహాభారతం లో భీష్మపితా మహుడు వివరంగా తెలియ జేసాడు,అలాగేవివిధపురాణాలఆధారంగాతెలుసుకోవచ్చు.

పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది,

ద్వితీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది,

తృతీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు,

చతుర్దినాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుం ది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసి గట్టగలరు,

పంచమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన (సంతానాభి లాష) గలవారికి శీఘ్రఫలం లభిస్తుంది.

షష్ఠి నాడు శ్రాద్ధ కర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది.

సప్తమి శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది.

అష్టమి తిథినాడు శ్రాద్ధ కర్మ వాళ్ళ చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ధి ప్రాప్తిస్తాయి.

నవమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది.

దశమి నాడు శ్రాద్ధకర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది.

ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది, కుటుంబం వృద్ది చెందుతుంది.

ద్వాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే కుటుంబము అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధ కర్తకు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మేధా  బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది.

త్రయోదశినాడు శ్రాద్ధ కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి.

చతుర్దశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది.

అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య దినమైన చేసి తీరాలి.

ఆర్థిక కారణాల వలననో లేకా తిధి గుర్తుకు లేకపోవడమో మొదలగు కారణాల వలన శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే పితృ పక్షంలో కేవలం గోవులకు శాకంతో అర్పించి సేవ చేయవచ్చునని శాస్త్రము.పేదబ్రాహ్మణులకు, ఆకలిగొని ఉన్నవారికి చేస్తే పుణ్య ఫలితం అధికంగా లభిస్తుంది. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు, అదీ చేయగలిగి, వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి, పితృ దేవతలకునమస్కరించవచ్చు . శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకం లో ఉత్తమ గతులు లభిస్తా యని శాస్త్రాల ద్వారా తెలు స్తోంది. 

మహాళయపక్ష విశేషముగా ను, నవగ్రహాదోషనివృత్తికి గాను గోవును, దూడతో సహా దానమునిచ్చుటకునూ, గోగ్రాసము (ప్రతినెలా) ఇ గోగ్రాససేవ, గోదానసేవా సౌకర్యముల వివరములకు :

===================

కామధేను గోశాల, కామధేను సేవా సమితి, ప్రతి గోసేవకు రశీదు పొందవచ్చును. ఇన్కంటాక్స్

వెసులుబాటు గలదు.

Paytm, Googlepay, on-line payment వసతి గలదు. 

SBI, Nacharam Br., A/ c. No.33787339464,IFSC:

SBIN0003098

Hyderabad 500075, TS.