Friday, August 13, 2021

శబరిమలకు ఇంతటి జనాకర్షణ శక్తి ఎలా సంక్రమించినది ?

భారతావనిలోని ప్రఖ్యాతిగాంచిన యాత్రాస్థలములకన్న మిక్కిలి విశిష్ఠతలు శబరిగిరికి గలదు. సాధారణముగా పుణ్యస్థలమను వానికి కింద సూచించిన ఏడు విశిష్ఠతలలో ఒకటైనను పొంది యుండవలయును.

1) స్వయంభు విగ్రహ భూమి ..... జనులచేత ప్రతిష్ఠింపబడక స్వయముగా ఆవిర్భవించిన మూర్తిమంతము.

2) యజ్ఞ భూమి...... యడతెగని యజ్ఞయాగాదులు జరిగిన - జరుగుచున్న స్థలము.

3) బలి భూమి...... భక్తిమార్గ యుద్ధములు జరిగిన స్థలము.

4) యోగ భూమి...... ఋషులు , రాజులు , యోగ విద్యనభ్యసించిన స్థలం.

5) తపో భూమి..... యోగీశ్వరులు , మునిపుంగవులు తపమొనర్చిన స్థలము.

6) దేవ భూమి...... దేవతలు దిగివచ్చి పూజలు సలిపి వెళ్ళిన స్థలము.

7) సంగమ భూమి...... పుణ్యనదులు సంగమించే స్థలము.


ఈ ఏడింటిలో ఏ ఒకటి యుండినను ఆ స్థలము పుణ్యతీర్థా స్థలముగా లెక్కించ బడును. ఆ స్థలమునకు యాత్ర వెళ్ళుట వలనను , అచ్చటి దేవతామూర్తిని దర్శించుట వలనను జీవుల సర్వపాపములు తొలగి అనంతకోటి పుణ్యము కలుగునని శాస్త్రము నందు చెప్పబడియున్నది.

పై చెప్పబడిన ఏడు అంశములు (విశిష్ఠతలు) శబరిమలకు కలిగి యున్నందున ఇచ్చటికి విచ్చేసి తీర్థస్నానమాడి స్వామి అయ్యప్పను దర్శించుకొనువారి పాపములన్నియు నశించి ఎనలేని పుణ్యము లభించును. పాపములన్నియు నశించుట వలన  మోక్షప్రాప్తియు లభ్యమగును.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...